Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · A Yajña for the Expiation of the Sin of War
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పరీక్షిత్
మహారాజు
నామకరణము
పురప్రజలకును,
అంతఃపుర
వాసులకును
అమితానందమును
చేకూర్చెను.
యుధిష్ఠిరుడు
అంతటితో
తృప్తిపడక
ఆనాటి
సాయంత్రము
ఆనందసభ
నొకటి
యేర్పరిచి
రాజులను,
పెద్దలను,
పండితులను,
శాస్త్రజ్ఞులను
ఆ
సభలో
పాల్గొనునటుల
ఆహ్వానించి
సభకు
కృష్ణ
పరమాత్మను
అధ్యక్ష
స్థానమును
అలంకరింప
గోరెను.
వ్యాస,
కృపాచార్యాది
మునులుకూడనూ
అరుదెంచిరి.
అపుడు
ధర్మజుడు
సభా
మధ్యమున
నిలిచి
వాసుదేవునకు,
వ్యాసునకు
నమస్కరించి
రాజులను,
ప్రజలను,
పండితులను
తిలకించి
"మీ
అందరి
ఆశీర్వాదములచేతను,
దైవజ్ఞుల
కృపచేతను,
వాసుదేవుని
అనుగ్రహముచేతను
శత్రువులను
హతమార్చ
గల్గితిమి.
పోయిన
రాజ్యమును
మరలా
సంపాదించ
గల్గితిమి.
మా
వంశము
ఇంతటితో
నిర్మూలమాయెనని
నిరాశ,
నిస్పృహలతో
నిండియుండిన
పాండవుల
హృదయములలో
ఆశాజ్యోతులు
వెలిగినవి.
పాండవాంకురము
కలిగినది.
ఇవి
అన్నియును
ఒకవైపున
నన్ను
ఆనంద
పరచుచున్ననూ
మరొక
వైపున
కుల
సంహారము
గావించిన
ద్రోహమును,
బంధుమిత్రాదులను
చంపిన
పాపమును
నన్ను
అమితముగా
బాధించుచున్నది.
దీనికేదేనియు
ప్రాయశ్చిత్తము
జరుగువరకు,
నాకు
కానీ,
నా
రాజ్యమునకు
కానీ,
నా
వంశమునకు
కానీ,
శాంతి
చేకూరదు.
కాన,
చేరిన
పెద్దలు
కానీ,
అనుభవజ్ఞులు
కానీ,
వాసుదేవ,
2
▾
Meaning
Keep
వ్యాసదేవులు
కానీ,
ఈ
జాతిద్రోహ
పాపమునకు
ప్రాయశ్చిత్తమేదియో
శెలవిచ్చిన,
దానిని
శిరసావహించి,
మహా
ప్రసాదముగా
భావించి
ఆచరింతును.
అనుగ్రహింపుడు"
అని
ధర్మజుడు
వినయవిధేయుడై
అడిగెను.
ధర్మ
రక్షణే
క్షత్రియ
లక్ష్యము
వాసుదేవుడు
చిరునవ్వులతో,
"ధర్మరాజా!
సర్వధర్మములూ,
సర్వనీతులు
తెలిసిన
నీవే
ఇందులకు
విచారించుట
విచిత్రముగనున్నది.
యుద్ధ
సంసిద్ధులై
వచ్చిన
శత్రువులను
జంపుటలో
క్షత్రియునకెట్టి
పాపమునూ
అంటదని
యెరుగవా?
శస్త్రములు
పట్టి
ఎదురు
పక్షమున
నిలిచిన
వారితో
పోరాడుటలో
ఏమి
జరిగిననూ,
పాపము
కానేరదు.
స్వార్థ
రహితమైన
దేశ
క్షేమమునకు
కంకణము
కట్టి,
కత్తిపట్టి
పోరాడుట
క్షత్రియునికి
సహజ
ధర్మము.
నీవు,
నీ
ధర్మము
నెరవేర్చితివి.
ధర్మ
కర్మలయందు
పాపమెట్లు
ప్రవేశించును?
నీవింత
విచారించుటలో
యే
మాత్రమును
న్యాయము
లేదు.
నీకెట్టి
పాపములును
పట్టవు,
చుట్టవు,
బాధ
పెట్టవు.
పుట్టిన
మనుమనికి
నామకరణము
చేసి
ఎంతో
ఆనందముగ
కాలము
గడుపవలసిన
నీవు
నేడు
అట్టి
విచారమునకు
తావిచ్చుట
ఎట్టి
న్యాయమునూ
కాదు;
వూరడిల్లుము"
అని
కృష్ణుడు
ఓదార్చెను.
ఇంతలో
వ్యాసులవారు
లేచి
"ధర్మజా!
యుద్ధరంగమున
అనేక
పాతకములు,
ఉపపాతకములు
లభించుచుండుట
సహజము.
అట్టి
వాటిని
ప్రధానలక్ష్యముగా
భావించరాదు.
ధర్మరక్షణే
క్షత్రియలక్ష్యము.
చీము
రక్తములతో
నిండిన
వ్రణమును
శస్త్రవైద్యుడు
కత్తితో
కోసి,
బాధనివారణ
చేయును.
అపుడు
కత్తితో
కోయుట
పాపమా?
కోయక,
బాధను
నివారణ
చేయుట
తెలిసియూ
వైద్యుడు
వూరకుండుట
పాపమా?
అటులనే,
అనేక
అన్యాయ,
అక్రమ,
అనాచారములను
చీమురక్తములతో,
చేరిన
దుర్మార్గము,
అధర్మమనబడు
కురుపులను,
క్షత్రియుడను
వైద్యుడు,
శస్త్రమును
పట్టి
ఆ
కురుపులను
కోసి,
కుళ్ళును
తీసివేయుట
పాపమెట్లగును?
నీవు
భ్రమించుచున్నావు.
ధర్మజా!
ఇట్టి
సందేహము
యెట్టివారికో
వచ్చిన
రావచ్చును.
కానీ,
నీకు
రాకూడదు.
3
▾
Meaning
Keep
ఒకవేళ
మా
మాటలతో
నీకు
తృప్తి
కలుగకున్న
మరొక
మార్గము
కలదు.
అందులో
యే
దోషమునుండదు.
అది
యేదన
యుద్ధములు
సమసిన
అయిన
తరువాత
కొంతమంది
రాజులు
పాపపరిహారార్థము
అశ్వమేధయాగము
చేయుట
కద్దు;
నీవు
అభిలషింతువేని,
నీవును
ఇది
ఒక
శాంతి
యజ్ఞముగా
భావించి
చేయుటలో
ఎట్టి
అభ్యంతరమూ
ఉండదు.
ధర్మజా!
నీవిట్టి
యజ్ఞము
చేయకున్ననూ
నిర్దోషివే,
కానీ,
నీకట్టి
విశ్వాసము
దృఢముగా
లేకుండుటచే,
తృప్తికై
ఇట్టి
మార్గమును
తెలుపుచున్నాను.
ఆపై
నీ
యిష్టము"
అని
వ్యాసులవారు
కూర్చొనిరి.
బంధు,
గురు,
రాజవధలకు
ప్రాయశ్చిత్తం
అంతలో
సభామధ్యము
నుండి
బుషులు,
పండితులు,
శాస్త్రజ్ఞులు,
అనుభవజ్ఞులు
లేచి,
"అమూల్యమైన
సలహా
నందించిరి;
వ్యాస
భగవాను"ని
కరతాళధ్వనులు
సలిపిరి.
"శుభము;
శుభము"
అని
జేజేలు
పెట్టిరి.
సభాసభ్యులందరూ
ఇందులకు
ఆనందచిహ్నముగా,
"ధర్మజునకు
మంగళములు
గలుగుగాక"
అని
నుడివిరి.
అంత
ధర్మజుడు
విధేయుడై
ఆనందమును
వెలిబుచ్చు
విచారముతో
చేతులు
జోడించి
కంటతడి
పెట్టుచు,
"మహనీయులారా!
మీరెంత
చెప్పిననూ
నాకు
తృప్తి
కలుగుట
లేదు;
మనసొప్పుటలేదు.
"యుద్ధములు
చేసిన
సామాన్య
రాజులు
అట్లు
యజ్ఞము
చేసిన
అది
వారి
పాపపరిహారము
గావించగల్గునేమో
కానీ,
నా
పాపము
అట్టిది
కాదు,
యే
రాజులునూ
చేయనట్టి
పాపమును
నేను
చేసితిననునది
నాకు
బాగుగా
తెలియును.
ఇందు
ఏ
మాత్రము
సందియము
లేదు.
పరరాజులు
చేసిన
పాపముకంటే
నా
పాపము
మూడింతలు
అధికమైనది.
ఎట్లన
(ఒకటి)
కులగోత్రీయులను
చంపుట
(రెండవది)
భీష్మద్రోణాదులగు
మహాపూజ్యులను
బలియిచ్చుట
(మూడవది)
ధర్మాత్ములగు
అనేకవేల
రాజులను
వధించుట.
బంధువధ,
గురువధ,
రాజవధ.
అబ్బా!
ఎంత
పాపిని!
ఈ
మూడును
మహాపాపములు
నా
మూలముననే
కదా,
జరుగుట?
4
▾
Meaning
Keep
ఇట్టి
పాపములు
యే
రాజులునూ
చేసియుండరని
తలంతును.
దీనికి
మూడు
అశ్వమేధ
యాగములైననూ
చేయవలెను
కానీ,
లేకున్న
నాకు
శాంతి
లభించదు.
వంశము
క్షేమముగ
నుండదు.
పాలన
సక్రమముగ
కొనసాగదు.
కాన;
వాసుదేవుడు,
వ్యాస
భగవానుడు,
పండితులు,
పెద్దలందరూ
అంగీకరించవలెను"
అని
చేతులు
జోడించి
కన్నులు
మూసి
కంటిధారలు
కారుచుండ,
పెదవులు
అదరుచుండ
ఆ
దృశ్యము
ప్రజల
హృదయములను,
బుషుల
హృదయములను
కదిలించినది.
వాసుదేవ,
వ్యాసదేవుల
మనసులను
కరిగించినది.
అనేకమంది
పండితులకు
వారలకు
తెలియకుండగనే
కంటిధారలు
కారినవి,
సభ
స్తంభించినది,
ధర్మజుని
హృదయమెంత
మృదు
భవనమనునది
అందరికి
అర్థమాయెను.
సోదరులైన
భీమార్జున
నకుల
సహదేవాదులు
అన్నతోపాటు
వారును
చేతులు
జోడించి
తలలు
వంచి
సభాధ్యక్షుని
వైపు
తిరిగి
ఆజ్ఞను
కోరిరి.
అంత
సభ్యులు,
పండితులు
ఒక్కపరి
వారివారి
స్థానములనుండి
లేచి,
"ధర్మావతారా!
మీ
అభీష్టమును
మేము
కాదనువారము
కాము,
శిరసావహించితిమి.
ఉత్తమ
పద్ధతిని
యజ్ఞము
సంపూర్తి
చేయుదుము.
మీ
శాంతియే
మా
సౌఖ్యము.
మీ
ఆనందమునకు
మేము
యేమైననూ
చేయుటకు
సిద్ధముగనున్నా"మని
అందరి
అంగీకారమును
ఏకకంఠమున
సభనుండి
వినుపించెను.
అది
వినగానే
ధర్మజుడు
"ధన్యుడను,
ధన్యుడను"
అని
తన
కృతజ్ఞతను
వందనములతో
తెలిపి,
కృష్ణుడు,
వ్యాసుడూ,
ఆసీనులైవున్న
స్థానమునకు
మెల్లగ
వెళ్ళి
పాదములుపట్టి,
"మధుసూదనా!
వింటివి
కదా
నా
మొర,
కంటివి
కదా
నా
బాధ?
జరుగబోవు
యజ్ఞమునకు
తమరే
అధిపతిగా
నిలిచి,
నా
వాంఛను
తీర్చి,
పాపపరిహారము
గావించుము.
నన్ను
ధన్యుని
చేయుము;
తమకు
తప్పినది
కాదు"
అని
పాదములపై
శిరస్సు
నుంచి,
నమస్కరించెను.
5
▾
Meaning
Keep
పరధనంతో
యజ్ఞం
చేయకూడదు
గోపాలుడు
మందస్మిత
వదనారవిందుడై
ధర్మజుని
భుజములు
పట్టి
పైకి
లేపుచు
"బావా!
నీ
అభీష్టము
తప్పక
నెరవేర్తును.
కానీ,
నీవు
ముందూ
వెనుక
యోచించక,
పర్వతమువంటి
మహత్తర
కార్యమును
తలపెడితివి.
యజ్ఞమన్న
సామాన్యము
కాదు.
అందునా
అశ్వమేధయాగము
చేయుటా,
ధర్మరాజా!
ఇందుకు
తగిన
ధనము
నీ
చెంత
లేదనియును
నాకు
బాగుగా
తెలియును.
అట్లు
కాకున్న
రాజులకు
ధనము
లభించుట
ప్రజలనుండి
మాత్రము
తప్ప
వేరు
మార్గముండదు.
ప్రజలను
వత్తిడి
చేసి
పోగుచేసిన
ధనముతో
యజ్ఞము
చేయుట
మంచిది
కాదు.
పోనీ!
ఇతర
రాజులనుండి
ఏమైననూ
లభించునా?
అని
విచారించిన,
గడచిన
యుద్ధములో
తీవ్రనష్టములకు
గురియైరి.
ఎవరి
చెంతనూ
ధనము
లేదు.
అదియునూ
స్పష్టముగ
తెలిసిన
విషయమే;
ఇక
కౌరవులేమైననూ
కూడపెట్టి
పోయిరా,
అని
చూచిన,
యుద్ధమున
సర్వనాశనమునూ
చేసి
తమకు
తామే
నాశనమైపోయిరి.
ఇవి
అన్నియునూ
నీకు
తెలిసియూ,
తెలియనివానివలె
ఇంత
అమాయకమున
మునిగి
ఇంత
పెద్ద
యాగమును
చేయుటకు
సిద్ధమయితివి;
యే
ఆధారమును
చూచుకొని
నీవింత
ధైర్యముగ
వచించితివో
నాకు
తెలియకున్నది.
ఇందరి
పెద్దల
నడుమ,
పండితుల
మధ్య
వెల్లడి
చేసితివి.
పోనీ
నీ
తలంపు
ఏకాంతముననైనను
నాతో
మొదలే
తెలిపియుండిన
ఎంత
బాగుండెడిది.
ఇప్పుడైననూ
మించిపోలేదు,
విచారించి
జవాబు
చెప్పుము.
అట్లుకాకున్న
కాలమునైననూ
పొడిగించి
తగిన
ప్రయత్నములు
చేయవచ్చును,"
అని
కృష్ణుడు
ఆతురతతో
మందలించెను.
కృష్ణా!
మా
సర్వస్వము
నీవే!
ధర్మజుడు
ఒక
నవ్వు
నవ్వి
"కృష్ణా!
ఆధారము
చూడక,
విచారమును
చేయక
నేను
తొందరపాటున
ఎట్టి
కార్యమును
చేయననియూ,
తలంచననియూ
నీకు
తెలిసియూ
నన్నిట్లు
బాధ
పెట్టుట
నీకు
మొదటినుండియూ
ఒక
నాటకము.
ధన
చింతన
నాకేనాడునూ
లేదు.
రాదు.
కొండవంటి
దేవుడు
నీవుండగా
ఇట్టి
6
▾
Meaning
Keep
స్వల్ప
విషయములకు
నే
జంకువాడను
కాను.
కల్పవృక్షమును
పెరటియందు
ఉంచుకొని,
కందమూలములకై
కఠిన
బాధలు
పడినట్టి
అవివేకిని
కాదు.
సర్వశక్తిమయుడవై
ఇంతకాలము
కంటికి
రెప్పవలె
కాపాడి,
నేటికి
మమ్ముల
నీ
స్థితి
యందుంచిన
నీకు
కాని
దొక్కటున్నదా?
"పెనుగొండలు
పిండిగావించువానికి,
గులకరాళ్ళు
కఠినములగునా?
నేనంతటి
వెట్టివాడను
కాను,
కృష్ణా!
మా
సర్వమూ
నీవే.
మా
పంచప్రాణములూ
నీవే
ఏమి
చెప్పిననూ
నేను
అధైర్యపడను;
నా
భారము,
రాజ్యభారము,
యజ్ఞభారములన్నియూ
మీ
పాదములపై
నుంచితిని,
తమరేమైనను
చేయవచ్చును.
నా
మాటను
నిలబెట్టుటయు
లేక
ఆవలనెట్టుటయు,
నీ
యిష్టముపై
నుంచితిని.
ఎట్లు
చేసిననూ
ఆనందమే,
అంతయూ
నీ
ప్రసాదమే!"
అని
మరొకపరి
సాష్టాంగ
నమస్కారములు
గావించెను.
హృదయమును
పరికించిన
ప్రభువునకు
వేరు
నివేదన
అక్కరలేదు
కదా!
పరమాత్ముని
హృదయము
కరిగినది.
ధర్మజుని
లేవనెత్తి
"నీ
హృదయమును
పరీక్షించగోరి
ఇన్ని
విధముల
ప్రశ్నించితినే
కానీ,
వేరుకాదు.
అంతియేకాక
నాపైగల
విశ్వాసము
నీదెట్టిదనునది
ప్రజలకు
తెలుపగోరి
ఇట్టి
నాటక
మాడవలసివచ్చెను.
నీవు
దేనిగురించియూ
యోచించనక్కరలేదు.
నీ
మనోరథము
పూర్తిచేతును,
అయితే
నేను
చెప్పినటుల
చేతువేని
నీ
యజ్ఞమునకు
కావలసిన
ధనము
నీకు
సునాయాసముగ
లభించగలదు.
ఇందులో
ప్రజలను
పీడించక,
రాజులను
హింసించక
ధనము
చేకూరును"
అని
పరమాత్ముడు
వచింపగనే,
ధర్మజుడు
తలవంచి,
"ప్రభూ!
తమ
ఆజ్ఞ
శిరసావహింతును"
అని
అంగీకారమును
తెలిపెను.
బుద్ధి
పూర్వకంగా
విడిచిపెట్టబడిన
ధనం
గ్రాహ్యమే
"ధర్మజా!
అటులయిన
వినుము.
పూర్వము
మరుత్తుడను
మహారాజు
మహత్తరమైన
యజ్ఞమొక
దానిని
చేసెను.
అట్టి
యజ్ఞము
ఇంత
వరకూ
మరొకరెవరునూ
చేయలేదనియే
చెప్పవచ్చును.
ఆ
యజ్ఞ
భవనముతోపాటు
యజ్ఞ
7
▾
Meaning
Keep
సామగ్రిలు
కూడనూ
సువర్ణములే,
వేయేటికి
దక్షిణలు
కూడనూ
బంగారు
ఇటుకలనే
ఇచ్చెను.
బంగారు
భూమి,
బంగారు
గోవులను
దానము
చేసెను.
అందువలన
బుత్విక్కులకు
దక్షిణరూపమున
అందించిన
సువర్ణమును
బ్రాహ్మణులు
మోయలేక
వారు
మోయతగినంత
ధనమును
వివిధరీతుల
గృహములకు
చేర్చి
అక్కరలేని
బంగారును
అందందే
పారవేసి
వెళ్ళిరి.
అట్లు
బుద్ధిపూర్వకముగ
విడిచి
వెళ్ళిన
ధనము.
అనగా,
సువర్ణము
నేటికినీ
అందే
పడియున్నది.
కాన,
నీవు
దానిని
తెప్పించుటకు
తగిన
వారిని
పంపిన
అది
మనకు
లభించి
నీవు
అనుకున్న
యజ్ఞమును
ఆనందముగ
పూర్తి
చేయగలవు"
అని
కృష్ణుడు
సలహా
యివ్వగనే,
ధర్మజుడు
"స్వామీ!
అది
పరుల
ధనము
కదా!
దానిపై
మనకు
అధికారమేమున్నది;
బ్రాహ్మణుల
అనుమతి
అవసరము
లేదా?"
అని
అన్నాడు.
కృష్ణుడు
వెంటనే
అందుకొని
"విడచిన
బ్రాహ్మణులు
బుద్ధిపూర్వకముగ
వదలిరి,
నేడు
లేరు,
మిగిలిన
వారి
సంతతికి
ఈ
విషయం
తెలియదు;
అది
భూమి
ఆధీనములో
నున్నది.
"యెవరి
స్వాధీనముననూ
లేని
భూమియందున్న
ధనము
ఆ
దేశప్రభువునకు
చెందుటలో
యెట్టి
అభ్యంతరమూ
ఉండదు.
దాని
నిమిత్తము
మరొకరి
అనుజ్ఞ
అవసరమెందుకు?
నీ
రాజ్యమున
భూమియందున్న
ధనము
నీకు
చెందవలెను
కాన,
త్వరగా
తెప్పించి
యజ్ఞ
కార్యక్రమములు
ప్రారంభించ"మన్నారు.
Previous
←
The Voice of the Future
Next
The Splendour of Dharmaja's Yajña
→