Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Splendour of Dharmaja's Yajña
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వాసుదేవుని
ఆజ్ఞను,
వ్యాసదేవుని
దీవెనలను
అందుకొని
ధర్మజుడు
తన
సోదరులను,
ఇంకనూ
కొంతమంది
సైన్యమును,
విప్రులు
వదలిన
ధనమును
తెచ్చుటకై
ప్రయాణముచేసి
పంపెను.
వారలందరూ
భగవదాజ్ఞ
ప్రకారము
ఈశ్వరపూజ
గావించి
ఆ
ప్రసాదమును
అందుకొని
పయనమై
వెళ్ళిరి.
మరుత్తుడు
దక్షిణరూపమున
విప్రులకు
ఇచ్చిన
ధనమును
మోసుకొని
పోలేక
ఒక్కొక్కరు
ఒక్కొక్క
మార్గమున
వదలిపోయిన
ధనరాసులు
కంటికి
కనిపించెను.
వాటిని
ప్రోగుచేసికొని
ఒంటెలపై,
ఏనుగులపై,
రథములపై,
బండ్లపై
వేసుకొని
అత్యంతానందముతో
కొన్ని
దినముల
తరువాత
పాండునందనులు
హస్తినాపురమున
ప్రవేశించిరి.
పురప్రజలు
ఈ
విజయ
యాత్రకు
అత్యంతాశ్చర్యమును
పొంది,
పాండునందనుల
ప్రతాపములను
కొనియాడిరి.
ధనరాసులతో
ప్రవేశించిన
రాజనందనులకు
సుస్వాగతములు
ఇచ్చుచూ
జేజేలు
చేసిరి.
ఆనందమున
గంతులు
వేసిరి.
జరుగబోవు
యజ్ఞవైభవములను
వారిలో
వారికి
తోచినటుల
చిత్రించుకొని
ఉవ్విళ్ళూరిరి,
ఊహాగానములు
పాడిరి.
ఆనాటినుండియూ
గంగాతీరమున
యజ్ఞనిమిత్తమై
అనేకమైళ్ళు
విస్తీర్ణముగల
భూమిని
శుభ్రపరచిరి.
హెచ్చుపల్లములు
లేక
సమము
గావించిరి.
2
▾
Meaning
Keep
యాగశాల
కట్టించిరి.
శృంగార
మందిరములు
నిర్మించిరి,
అరుగులు
అమర్చిరి,
అలంకారములు
చేకూర్చిరి.
ఉత్తమ
యజ్ఞ
లక్షణములు
నలువైపులనుండి
ప్రజలూ,
విప్రులు,
బుషులు
పుట్టలు
పుట్టలుగా
నెట్టుకొని
వచ్చిరి.
ప్రత్యేకముగా
యేర్పరచిన
వారి
వారి
స్థానములందు
నివాసములు
ఏర్పరచుకొని
వారు
తెల్లవారిననుండి
జరుగబోవు
మహాయజ్ఞమును
ఎప్పుడెప్పుడు
చూచి
అనుభవింతుమా
యని
నిమిషములు
లెక్కించుచూ
కాలము
గడుప,
తెల్లవారెను.
నిర్ణయించిన
సుముహూర్తము
సమీపించగనే,
విప్రులూ,
పెద్దలైన
బుషులూ
దీక్షబూనుటకు
సంసిద్ధులై
సభామంటపమున
లేచి
నిలిచి,
ధర్మరాజును,
వాసుదేవుని
చూచుచు,
"రాజా!
తమరు
మూడు
అశ్వమేధయాగములు
చేయ
సంకల్పించినటుల
వింటిమి.
అది
నిజమేనా?
అటులైన
మూడునూ
విడివిడిగా
చేయ
సంకల్పించితిరా,
లేక
సమస్త
విధులూ
త్రిగుణా
కృతము
గావించి
ఒక్కటిగానే
చేయ
సంకల్పించితిరా?
శెలవిచ్చిన
దానికి
తగినట్లు
మేము
బుత్విక్కులను
నిర్ణయింతుము"
అని
కోరిరి.
అందులకు
ధర్మజుడు,
"విప్రులారా!
మహాబుషులారా!
ఎట్లు
చేసిన
ఉత్తమ
యజ్ఞము
కాగలదో
తమరే
నిర్ణయించిన,
అందులకు
నేనెంతయో
సంతృప్తుడను
కాగలను.
ఇందులకు
వాసుదేవుని
అనుమతి
అందరికీ
ప్రధానము"
అని
కృష్ణుని
వైపునకు
తిరిగిచూచెను.
వాసుదేవుడు
ఈ
బాధ్యతను
విప్రులకే
వదలెను.
అందుకు
విప్రులు
ఒకరినొకరు
విచారించి
కడను
ఈ
రీతిగా
నిర్ణయమునకు
వచ్చిరి.
ఏమన,
ఈ
క్రతువునందే
సమస్త
విధులూ
త్రిగుణావృతము
గావించి,
ప్రతి
మంత్రమునూ
ముమ్మాటు
చెప్పి,
వచ్చిన
బుత్విక్కులకు
దక్షిణ
మూడురెట్లు
అధికముగా
నిచ్చిన,
మూడు
అశ్వమేధయాగములు
చేసిన
ఫలము
లభించగలదనియు,
ఇందులకు
మేమందరము
అంగీకరించితిమనియూ
తెలిపిరి.
3
▾
Meaning
Keep
ధర్మజుని
యజ్ఞమును
కృష్ణుడే
జరిపించుట
ఈ
సలహాను
వినిన
వాసుదేవుడు
చాల
బాగున్నదని
తలవూపగా
ధర్మజుడు,
తన
తృప్తిని
కూడను
వెలువరచి,
యజ్ఞము
ప్రారంభించ
వలసినదిగా
కోరెను.
విప్రులు
వేదమంత్రములచేత
భూమ్యాకాశములు
అదిరి
పడునట్లు
తోచెను.
చేయవలసిన
విధులన్నియూ
చేసి
యజ్ఞాశ్వమును
విడచిరి.
అది
సర్వాలంకార
భూషణములచే
నొసటి
నిబంధనల
పత్రమును
ధరించి
భూమండలమంతయూ
చుట్టి
వచ్చెను.
యజ్ఞస్వరూపుడే
యజ్ఞాధిపత్యము
వహించగా
ఆ
యజ్ఞము
ఎంత
శోభించునో
వేరు
చెప్పనక్కరలేదు.
యజ్ఞమును
పూర్ణాహుతితో
సమాప్తి
గావించిరి.
వచ్చిన
బుత్విక్కులకు,
బుషులకూ,
బ్రాహ్మణులకూ
దక్షిణలు
సన్మానములు
విరివిగా
నొసంగిరి.
దాన
ధర్మములు
లెక్కలేక
జరిపిరి.
గోదాన,
భూదాన,
సువర్ణదానములతో
రాజ్యము
పూర్తి
ఆనందమున
మునిగిపోయెను.
ప్రతివారి
నోటా
యజ్ఞముయొక్క
వైభవములు
వర్ణనాతీతముగా
ముచ్చటించుకొనుచుండిరి.
అన్న
సంతర్పణలకు
విధివిరామము
లేక
అన్ని
వేళలయందూ
వచ్చినవారలకు
లేదనక,
సర్వపాకములతో
సంతృప్తి
పరచిరి.
దీనిని
చూచిన
మహాబుషులు,
అనుభవజ్ఞులైన
విప్రులూ,
ఆనాడు
చేసిన
మరుత్తుని
యజ్ఞమును
మించినదని
వర్ణించిరి.
అన్నిటికంటెను
మించినది,
అధికమైనది,
విచిత్రమూ,
పవిత్రమూ
అయినది
కలదని
ఆనందించిరి.
అది
యేమన,
మరుత్తుని
యజ్ఞమునకు
ఇంద్రుడు
యజమానిగా
నిలచెను,
అది
చాలా
అద్భుతము
ఆశ్చర్యము
అని
తలంచుచుండగా
ఈనాడు
మన
ధర్మజుని
యజ్ఞమునకు
సాక్షాత్
యజ్ఞస్వరూపుడే
అధికార
స్థానమునకు
నిలిచి
జరిపించెను.
ఇంత
కంటెను
వేరు
పవిత్రత
యెందుకలదు.
దీనిని
పట్టి
చూడ,
ఈ
యజ్ఞము
మరుత్తుడు
జరిపిన
యజ్ఞముకంటెనూ
అధికమైనదనియే
చెప్పవచ్చుననిరి.
యజ్ఞసమాప్తి
అయి
ఎవరి
స్థానములకు
వారు
వెళ్ళిరి.
4
▾
Meaning
Keep
వచ్చిన
రాజులు
ధర్మజుని
శెలవు
తీసుకొని
వారివారి
రాజ్యములు
వారు
చేరిరి.
బంధుమిత్రులు
ఇంకనూ
కొన్ని
దినములుండి,
వారివారి
అనుకూలములను
అనుసరించి,
ప్రయాణమయి
పోవుచుండిరి.
అయితే,
శ్యామసుందరుడు
మాత్రము
ఇంకనూ
కొంతకాలము
హస్తినాపురమందే
యుండతలంచెను.
అందుకు
పాండవులు
అత్యంతానందమున
తగిన
ఏర్పాట్లు
కావించి,
నిత్యము
గోపాలుని
సేవలు
చేయుచూ,
అతని
సువాక్యముల
శ్రవణము
గావించుచూ,
కాలమును
పవిత్రముగా
గడుపుచుండిరి.
ఇట్లు
కొంతకాలము
జరిగిన
తరువాత,
గోపాలుడు
ద్వారకకు
వెళ్ళుచూ
అర్జునుని
వెంటబెట్టుకొని
పోయెను.
పరమాత్ముడు
ద్వారక
చేరగనే
ద్వారకా
పురవాసులు
తిరిగి
తమ
స్వామి
వేంచేసెనని
ఉత్సాహపూరితలై
స్వాగతము
ఇచ్చిరి.
కన్నుల
పండువుగా
దర్శించిరి.
తనివితీరా
ఆనందించిరి.
విదురుని
ఆగమనము
ఇట్లు
కాలము
కదలి
పోవుచుండగా,
హస్తినాపురమునకు
సమీప
ప్రాంతములలో
తాపసివేషమున
విదురుడు
తిరుగుచుండినటుల,
వారినోటా
వీరినోటా
వినికిడి
వార్తలు
కడకు
ధర్మజుని
చెవిని
పడగనే,
ఇది
ఆశ్చర్యమును,
ఆనందమును
కలిగించి,
ఈ
వార్త
నిజమా
కాదా,
అని
కొందరు
గూఢచారులను
పంపి
వెతికించెను.
ఇంతలో
విదురుడు
హస్తినాపురమునకే
వేంచేయు
చుండినటుల
గూఢచారులు
వార్తను
తెలిపిరి.
ఆ
వార్తతో
ధర్మజుడు
పట్టరాని
ఆనందమొంది
"ఆహా!
నేనెంత
ధన్యుడను,
తిరిగి
విదురుని
చూతుమో
లేదో
అను
సంశయమున
నిరాశకు
లోనైన
మా
హృదయములను
చిగురు
పుట్టించినది
ఈ
పవిత్రకాలము.
మమ్ములను
సర్వవిధములా
కుక్షి
యందుంచుకొని
రక్షించిన
మా
బాబాయిని
తిరిగీ
సేవించగలిగితిమి"
అని,
ఆనందవార్తను
అంతఃపురమునకును,
సోదరులందరికినీ
తెలిపెను.
ఇంతటితో
ఆగక,
ఆనందము
గట్టులు
తెగి
ప్రవహించగా
తానూరుకొనలేకపోయెను,
తన
పినతండ్రికి
ఘనమైన
స్వాగతమిచ్చుటకు
సర్వ
యేర్పాట్లు
చేయమని
సైన్యమునకును
పురప్రజలకును
కబురంపెను.
5
▾
Meaning
Keep
ఈ
వార్త
విన్న
పురప్రజలు
ఆనందోద్రేకులై
ఊరుముందు
చేరిరి.
రాజు
సర్వాలంకార
భూషితులైన
తన
సోదరులతో
రథమును
యొక్కి
ఊరి
ముందుకు
చేరిరి.
హస్తినాపురమంతయూ
అలంకారములతో
పచ్చని
తోరణములతో
తీర్చిదిద్దిరి.
స్త్రీ
బాల
వృద్ధులకు
తగిన
వసతులు
ఏర్పరిచిరి.
ప్రజలను
ప్రాణసమానముగా
చూచుకొనుచూ
పాండవులను
కండ్లలో
పెట్టుకొని
కాపాడుచు
ధర్మమన్న
ప్రాణసమానముగా
విచారించి
న్యాయమును
చేయుచూ
సాక్షాత్
ధర్మస్వరూపుడుగా
పేరుపొంది
ఎంతోకాలమునుండియూ
హస్తినాపురము
వదలి
ఈనాడు
తిరిగీ
స్వస్థానమునకు
వచ్చుచున్నాడు
విదురుడు
అన్న
వార్త
కలలోని
వార్తగా
తలంచి
తాము
చూచువరకునూ
నమ్మమను
సందేహముతో
ముసలివారు
నడువలేక
పోయిననూ
తగిన
వసతులు
కల్పించుకొని
కఱ్ఱలు
చేతపూని
రెప్పవాల్చక
దారులను
చూచుచూ
నిలుచున్న
వృద్ధుల
దృశ్యములు
మరింత
ఆనందమును
కలిగించెను.
దారి
పొడుగునా
మిద్దెలపై,
చెట్లపై,
క్రిక్కిరిసి
ఎక్కడ
చూచిననూ
జనులు
ఆనంద
కోలాహలములతో
అంతులేని
గంతులు
వేయదొడగిరి.
ఇంతలో
జడలు
ధరించి,
తాపస
వేషముతో
కొంతదూరమున
కాలి
నడకతో
హస్తినాపురమునకు
అరుదెంచు
విదురుని
చూచి
అతనే
విదురుడని
జయ
జయధ్వనులు
మిన్నుముట్టెను.
పాండునందనులు
వారి
వారి
వాహనములు
దిగి,
పినతండ్రికి
స్వాగతమిచ్చుటకు
కాలినడకన
కదలిరి.
ప్రజలు
ఎంతవారించిననూ
నిలువక
పరుగిడి
పాదములపైబడిరి.
పాండునందనులు
పినతండ్రికి
ఆనంద
భాష్పములతో
స్వాగతమునిచ్చిరి.
నోటిమాటలు
రాలేక
పోయెను.
ఒకరి
నొకరు
ఆలింగనములు
చేసికొని
క్షేమసమాచారములు
పలికి,
ప్రజలందరూ
చూచుటకు
అనుకూలముగా
నుండునని
ధర్మజుని
రథముపై
విదురుని
యొక్కించుకొని,
మంగళ
వాయిద్యములతో
మధురమైన
ఆనందములతో
హస్తినాపురములో
రాజ
వీధుల
ద్వారా
రాజభవనము
చేరిరి.
6
▾
Meaning
Keep
కొందరు
విదురుని
చూచి
శిలలవలే
నిలచిపోయిరి.
అతని
రూపు
రేఖలు
పూర్తిగా
మారుటయూ
అతనియందు
ఉద్భవించిన
దైవతేజస్సుచే
సాక్షాత్
ఇంద్రునివలే
కనిపించెను.
ఆ
వర్ణలను
ఎవరికి
తోచినటుల
వారు
ముచ్చటించ
జొచ్చిరి.
కొందరు
ప్రేమాశ్రులు
విడిచిరి.
రాణివాసములోని
రాణులు
ఘోషా
పరదాలనుండి
దర్శించి
ఆనందించిరి.
విదురుడు
రాజభవనము
చేరి
సందర్భానుసారము
ఎవరినెట్లు
కుశల
ప్రశ్నలడుగవలెనో
అట్లు
అందరిని
పలుకరించెను.
Previous
←
A Yajña for the Expiation of the Sin of War
Next
Reflections on Vairāgya
→