Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Reflections on Vairāgya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
కుంతీ
దేవి
వచ్చి
"మమ్ములను,
మా
బిడ్డలను
కంటిలో
పెట్టుకొని
కాపాడిన
నీ
ప్రేమ
మమ్ములను
ఇంతకాలము
మరచి,
ఎట్లుండెను?
నా
కుమారులు
నేడు
ఈ
రాజ్యమును
పాలించుచున్నారన్న
ఇది
అంతయూ
నీ
ప్రసాదమే!
ఆనాడు
నీవే
లేకున్న
నేటికి
నా
కుమారులేమయి
వుండెడివారో
మరదీ!
మేము
అనేక
ఇడుములకు
గురియైతిమి
కానీ
అన్నింటికన్ననూ
నీవు
మావెంటలేని
కష్టము
మమ్ములను
మరింత
బాధ
పెట్టుచుండెను.
కడకు
తిరిగీ
నిన్ను
చూతుమను
ఆశయే
మాలో
అడుగంటి
పోయెను.
ఈనాడు
మా
అందరి
ఆనందము
పూర్ణరూపము
ధరించెను.
ఈనాడెంత
సుదినము
నాయనా!
అదృష్టము
కానీ,
ఆనందము
కానీ
చెప్పిరాదు
కదా?"
అని
కంటనీరు
తుడుచుకొనుచున్న
కుంతిచేతులు
పట్టుకొని
విదురుడు
కూడను
తన
కంటినీరును
తుడుచుకొనుచూ
గడచిన
వాటిని
మననము
చేసుకొనుచూ
"
అమ్మా!
కుంతీ
దేవీ!
విధిని
దాట
నెవరితరము?
ఎట్లు
జరుగవలెనో
అట్లు
జరుగక
పోదు.
ఎవరు
చేసిన
పాపపుణ్యమువారికి
కారణములుగా
నిలుచును
కాని,
అన్యులు
కారు.
ప్రారబ్ధ
సూత్రమున
బంధింపబడిన
మానవుడు
స్వతంత్రుడు
కాజాలడు
కదా!
ఆ
సూత్రమెట్లు
ఆడించిన
అట్లు
ఆడకతప్పదు.
ఎక్కడికి
లాగిన
అక్కడికి
పోకతప్పదు,
మన
యిష్టాయిష్టములు
ఇందులో
యేమియునూ
చేయజాలవు.
అంతయు
అతని
ఇచ్చకదా?"
అని
అనేకవిధముల
వేదాంతగోష్ఠి
జరుపుచుండగా
ధర్మజ
భీమ
నకులసహదేవులు
తలలు
వంచుకొని
అతి
శ్రద్ధతో
వినుచుండురు.
2
▾
Meaning
Keep
విధిని
దాట
నెవరి
తరము
కుంతి
తిరిగీ
తల
నిమురుచూ
"నాయనా!
నీ
చల్లని
చూపుతో
యుద్ధమును
జయించితి.
కాని
ద్రౌపదీ
పుత్రులను,
సుభద్ర
పుత్రుని
కాపాడుకొనలేక
దురదృష్టులమైతిమి.
వారు
నీ
చూపునకు
దూరమైరి.
ఆ
జ్వాలలే
అనవరతము
మా
హృదయములను
మండించుచున్నవి.
నీవు
చెప్పినటుల
విధిదాట
నెవరితరము?
ఏదో
గడచినది
గడచి
పోయినది.
చింతించియూ
ఫలములేవి
వాటికై
ప్రాకులాడుట
వ్యర్థము.
ఈ
తాపములో
నిన్ను
చూచుట
దాహము
తీరినట్లయినది.
మరదీ!
ఇంతకాలము
నీవు
ఎక్కడుంటివి
నాయనా!"
అని
కుంతీదేవి
ఎంతో
ఆనందమున
ప్రశ్నించెను.
అందులకు
విదురుడు
"అనేక
తీర్థయాత్రలు
చేయుచూ
ఒకచో
స్థిరములేక
తిరుగుచుంటి"
నని
తెలిపెను.
అంత
పాండవులు
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధముగ
పవిత్రయాత్రలను
గురించి
ప్రశ్నించుచూ
ఆయా
యాత్ర
స్థానములయొక్క
అనుభవములను
విదురులు
వినిపించుచుండ
ధర్మజుడు
మధ్య
మధ్య
మాకట్టి
భాగ్యము
ఎన్నడు
కలుగునో
అని,
ఒక్కొక్క
క్షేత్రము
పేరు
చెప్పినపుడంతయు
కన్నులు
మూసికొని
హస్తములు
జోడించి
నమస్కరించుచుండెడివాడు.
ఇంతలో
భీముడు
"బాబాయి!
మీరు
ద్వారకను
కూడను
దర్శించితిరా?
అక్కడి
విశేషములు
తెలుప
ప్రార్థింతు"
ననెను.
అంతలో
ధర్మజుడు
"అచట
నందనందనుని
చూచివచ్చితిరి
కదా?
విశేషమేమి
వివరింపుము"
అని
ఆతురతతో
అడుగగా,
కుంతి
దేవి
"నాయనా!
మన
అబ్బాయి
అర్జునుడు
కూడను
అక్కడే
వుండెను.
బహుశా
అక్కడికి
వెళ్ళియుండిన
చూచియే
వుందువు.
యాదవులందరూ
క్షేమమే
కదా?
వృద్ధులైన
నందయశోదలు,
దేవకీ
వసుదేవు
లెటులున్నారు?"
అని
ఒకరికి
మించి
ఒకరు
ద్వారక
సమాచారములగూర్చి
ప్రశ్నల
వర్షము
కురిపించిరి.
అన్నియు
వినుచున్న
విదురుడు
దేనికినీ
సమాధానము
చెప్పక
ఆ
ప్రశ్నలను
మరపించు
విషయములు
ముచ్చటించుచూ
వెళ్ళెను.
3
▾
Meaning
Keep
కారణమేమన
యదువంశము
నాశనమైన
విషయమూ
మార్గమధ్యమున
ఉద్ధవునివలన
వినియుండెను.
కనుక,
ఇంతకాలమునకు
అపురూపముగా
చిక్కిన
ఆనందములో
మునిగియున్న
పాండవులకు
వెంటనే
ఈ
దుఃఖమును
అందించ
ఇష్టములేక
తన
రాకతో
కలిగిన
ఆనందమును
తానే
దుఃఖముగా
మార్చురాదను
ఉద్దేశ్యముతో
రేపో
మాపో
యెట్లయినను
అర్జునుడు
వచ్చి
తెలుపగలడు
కదా?
నాద్వారా
ఈ
వార్త
తెలియకూడదని
లోలోన
మ్రింగి,
కేవలము
కృష్ణుని
గుణగణములను
మాత్రము
వర్ణించుచూ
ఆ
లీలను
తెలుపుచు
మాటలను
మార్పు
చేయుచూ
"అమ్మా!
నా
ఈ
తాపసవేషముతో
బంధువుల
దగ్గరి
కెక్కడికీ
వెళ్ళ
ఇష్టము
లేక
పోయెను.
అందువలన
నందయశోదలను
కానీ,
ఇతర
యాదవ
శ్రేష్ఠుల
నెవ్వరినీ
చూడలేదని"
ఒక
మాటతో
ద్వారక
సంభాషణలు
అంతటితో
నిలిపెను.
"ఏదో
చిన్నప్పటినుండియూ
పెంచి
పెద్దచేసిన
పిల్లలగు
పాండవులు
యుద్ధమున
విజయమును
సాధించి
రాజ్యమును
పాలించుచున్నారను
వార్త
విని
సాకిన
చాపల్యముచే
ఇచ్చటికి
మాత్రమే
వస్తినిగానీ
మిగిలిన
మన
వారల
యింద్లకెక్కడికినీ
వెళ్ళ
సంకల్పించలేదు.
పాత
అభిమానము
నన్ను
ఇక్కడికి
ఈడ్చుకొని
వచ్చినది"
అని
యేదేదో
వేదాంతవిషయములను
బోధించెను.
ఈ
రీతిగా
మాటలను
ముగించిన
పిమ్మట
ధర్మజుడు
విదురునకై
ప్రత్యేకముగా
సర్వసౌకర్యములతో
ఏర్పరచిన
వసతి
గృహమునకు
దయచేయమని
బాబాయిని
ప్రార్థించి
తోడ్కొనిపోయెను.
అచట,
పినతండ్రి
సేవలు
చేయుటకు
పరివారమును
నియమించి
"ఇందులో
తమరు
కొంత
విశ్రమించ"
మని
ధర్మజుడు
ప్రార్థించగా,
సర్వసదుపాయములతో
నిండిన
ఆ
భవనమున
నివసించుటకు
విదురునకు
ఇష్టము
లేకపోయినప్పటికినీ,
ధర్మజుని
సంతృప్తికై
కాదనలేక
అందులో
ప్రవేశించెను.
కొంత
విశ్రాంతి
తీసుకొని
శయ్యపై
పరుండియే
గడచిన
కాలమును
స్మరించుచూ
తన
అన్న
అయిన
ధృతరాష్ట్రుడు
పన్నిన
పన్నాగములకు
తనవంశమే
నాశనము
చేసుకొనెననియూ,
ఇన్ని
విధముల
పాండవులను
బాధించిననూ
4
▾
Meaning
Keep
నేటికినీ
ధర్మజుడు
ధృతరాష్ట్రుని
ఎంతో
భక్తిశ్రద్ధలతో
పూజించుచూ
గౌరవించుచూ,
సర్వవిధముల
వారలను
సుఖపరచుచున్నాడని
తెలిసికొని
పాండవుల
ఉదార
స్వభావములకు
ఆనందించి
ధృతరాష్ట్రుని
బుద్ధులకు
అనుకొనుచు,
ఈ
వృద్ధునకు
ఇంకనూ
వైరాగ్యమురాక
రాజభవనమునందు
సర్వసుఖముల
ననుభవించుచూ,
పుణ్యమును,
పురుషార్థమునూ
యోచించక
జీవితము
వ్యర్థము
చేసుకొనుచున్నాడను
తీవ్ర
ఆవేదన,
విదురునిలో
చెలరేగెను.
కాలమే
అందరిని
మ్రింగుచున్నది
ఒకవైపున
యోగదృష్టితో
పాండవుల
ఆసన్నకాలమును
చూచి,
రెండింటినీ
మనసున
అణగత్రొక్కి,
పాండవులను
నాటినుండియూ
కాపాడు
భగవంతుడే
నేడునూ
చూచుకొనగలడను
ధైర్యమును
తెచ్చుకొని
పాండవులు
పోయిన
తరువాత
ఈ
గ్రుడ్డి
రాజు
మరింత
బాధలకు
గురికావలసి
వచ్చునని
తనలో
తాను
యోచించి,
ఇకనైననూ
అతనిని
గృహమునుండియూ
బైటపడ
తీర్థయాత్రలు
జేయించి
కాలమును
సార్థకము
చేయించవలెనని
తలచి,
నిదానము
చేయక
ఇప్పుడే
వెళ్ళి
అతనికి
హితమును
తెలుపవలెనని
లేచి
చీకటిలో
ఎవరికినీ
తెలుపక
ధృతరాష్ట్రుని
వసతి
గృహమునకు
నడచిపోయెను.
అప్పుడే
విశ్రమించుటకు
సిద్ధముగా
ఉన్న
ధృతరాష్ట్రగాంధారులు
విదురుని
రాక
తెలిసి
యెదురుచూచుచూ,
తన
పాపఫలమును
చెప్పుకొనుచు
అనేక
విధముల
దుఃఖించుచుండ,
విదురుడు
ఓదార్చుచూ,
మధ్య
వేదాంతసారము
నందించుచూ,
అనేక
విషయములతో
వారలనిరువురినీ
చలార్చి,
చల్లని
మాటలతో
ఈ
కరుడుకట్టిన
హృదయము
కరుగదనియూ
మొద్దుబారిన
బుద్ధి
కుదరదనియూ
విదురుడు
తలంచి,
సమయమును
చూచుకొని,
కఠినమాటలను
కంఠస్వరమునూ
మార్చ
మొదలిడెను.
దీని
కనిపెట్టిన
ధృతరాష్ట్రుడు
"తమ్ముడా!
నూర్గురు
పుత్రులను
కోల్పోయి
చింతాక్రాంతుడ
పరితపించుచున్న
మమ్ములను
చల్లని
మాటలతో
శాంతపరచక,
పుండ్ల
సూదులు
గ్రుచ్చినటుల
మమ్ములనిట్టి
కఠినవాక్కులతో
గాయ
పరచుట
5
▾
Meaning
Keep
న్యాయమా?
ఎంతో
కాలమునకు
చూడగల్గితిమి
కదా
అను
ఆనందమును
అనుభవించక
మునుపే
మమ్ముల
మరింత
ఆశాంతిలో
త్రోయుట
నీకు
ధర్మమా?"
"అయ్యో!
మా
విధి
వ్రాత
యిట్లుండ
యెవరినని
ఏమి
ప్రయోజనము.
అని
నెత్తిని
చేతులు
పెట్టుకొని
చింతించుచుండ,
వైరాగ్యమునకు
ఇది
చక్కని
సమయమని
విదురుడు
తలంచి,
ఎటులయిననూ
వీరిని
క్షేత్రయాత్రల
కంపెవలెనను
సదుద్దేశములతో,
వారల
హృదయములు
మార్పితలంచి
మరింత
కఠినమాటలను
మొదలుపెట్టెను.
ధృతరాష్ట్రగాంధారుల
దుఃఖము
ఒకవైపున
అయ్యో,
అనిపించుచున్ననూ,
మరొక
వైపు
రాబోవు
కఠినకాలమును
స్మరించుచూ,
వీరి
నెటులయిననూ
ధన్యులు
గావించవలెనని
తలంచి
"రాజా!
ఇంకను
భోగవాంఛ
తీరలేదా?
చచ్చుదాకా
సంసారకూపమున
మునిగి
తేలిన
వచ్చు
లాభమేమి?
కాలమను
సర్పము,
కబళించను
దేహమను
పొదలో
పొంచియుండగా,
నీవు
కన్నులు
మూసుకొని
కాలమును
మ్రింగ
తలంచుచున్నావు.
కాలమును
మ్రింగినవారు
ఈ
లోకమున
ఎవ్వరూ
లేరు.
కాలమే
అందరిని
మ్రింగుచున్నది.
అది
తెలుసుకొనలేక
అజ్ఞానమున
మునిగి
అర్థకామములతో
అలమటించుచున్నావు.
పశుజీవితమును
గడుపుచున్నావు.
మానవ
జీవితమును
వ్యర్థము
చేయుచున్నావు.
సార్థకము
చేసికొనుటకు
ప్రయత్నించు
కాలము
మించలేదు.
ఇకనైననూ
ఇల్లు
విడిచి,
ఇహమును
మరచి,
పరమును
స్మరించు,
తరించు.
పరుల
పంచలపడి
ప్రాణమును
విడువక
పరమాత్మ
చింతనతో
కారడవుల
ప్రాణమును
విడుచుట
పరమ
పవిత్రము.
గృహమును
వీడి
తపమునకు
వెళ్ళుము".
Previous
←
The Splendour of Dharmaja's Yajña
Next
Vidura's Teaching on Right Conduct
→