Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Vidura's Teaching on Right Conduct
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7.
విదురుని
నీతి
బోధ
"ఇంతవయసు
వచ్చియూ,
సిగ్గూ
యెగ్గూలేక
కుక్క
జీవితమును
గడుపుటనాకే
అవమానముగ
నున్నది.
ఛీ
ఛీ
నీ
జీవితముకంటె
కాకి
జీవితము
మేలు"
అని
అతికఠినముగా
మాటాలాడ
దొడగెను.
అంత,
ధృతరాష్ట్రుడు
"అబ్బా
చాలు!
చాలు!
మా
ప్రాణములు
తీయుచున్నావు!
తమ్ముడాడు
మాటలు
కావివి.
నిజముగా
నీవు
విదురుడవో,
కాదో,
అను
సంశయము
నాలో
బలపడుచున్నది.
కాకున్న
ధర్మజుడు
పరాయివాడా?
నేను
పరుల
పంచపడిన
వాడనా?
ఏమి
ఈ
విచిత్రపు
మాటలు?
పొట్టన
పుట్టిన
బిడ్డలకంటెను
అధికప్రేమతో
చూచుకొను
ధర్మజుని
పరాయివానిగా
భావించుటకంటే
వేరు
పాపమున్నదా?
ఇది
నా
తలవ్రాత!"
అని
తల
వూపుచు
యోచనలో
మునిగెను.
ఇంతలో
విదురుడు
వెగటుగా
నవ్వి
"రాజా!
ఈ
మాటలాడుటకు
నీకు
కొంత
సిగ్గయినను
కలుగలేదా?
ధర్మజుడు
మిమ్ములను
తండ్రికంటెను
అధికప్రేమతో
చూడవచ్చును.
కన్న
కొడుకుల
కంటే,
ఎక్కువ
సేవలు
చేయవచ్చును.
ఇవి
అతనిలోని
సద్గుణముల
ప్రతిబింబము.
అతని
సార్థక
నామమునకు
శోభ,
కానీ,
నీ
సంగతి
నీవాలోచించుకొన
నవసరములేదా?
కాటికి
కాళ్ళుచాచుకొనియూ
కాయమే
ప్రధాన
మని
కన్నులు
మూసుకొని
బుట్టను
నింపుకొనునట్లు
పొట్టను
నింపుకొనుచున్నావు.
దీనికి
పూర్వము
నీవు
దుర్మార్గులైన
నీ
కుమారుల
మాటలను
విని
పాండవులను
ఎట్లు
చూచితివో,
వారలతో
నెట్లు
మెలగితివో,
ఒకపరి
2
▾
Meaning
Keep
యోచించుకోలేక
పోయితివి
వారలను
లక్క
గృహమున
పెట్టి
కాల్చ
ప్రయత్నించితిరి.
విషము
పెట్టి
చంప
చూచితిరి.
నిందు
సభలో
పాంచాలిని
పరాభవము
గావించితిరి.
ధర్మ
మూర్తులయిన
పాండవులను,
నీవును,
నీ
కుమారులును
ధూర్తులై
నానా
కష్టముల
పాలుచేసితిరి.
ఆనాడు
నీవు
ముసలి
ఏనుగువలె
సింహాసనముపై
మెసలుచు
'ఇప్పుడేమి
జరుగుచున్నది?
ఇప్పుడేమి
జరుగుచున్నది?'
అని
ప్రక్క
వారిని
అడుగుచుండుట
జ్ఞాపకము
చేసికొనిన,
నీవు
వారి
యింట
నిమిషము
వుండగలవా?
ఆనాడు
ఈ
పాండవులు
నీవారు
కాకపోయిరా?
ఆనాడు
లేని
బంధుత్వ
సంబంధము
నేడు
నీకు
క్రొత్తగా
వుట్టిపడినదేమో?
సిగ్గయిననూ
లేక
చెప్పుచున్నావు.
ఇంతయేల?
ఆనాడు
జూదము
నీ
సమ్మతి
పైననే
కదా
జరిగినది.
అదియునూ
కాదందువా?
దానికి
నేనే
ప్రత్యక్ష
సాక్షి.
నేనెంత
చెప్పితిని?
కొంచమైననూ
తలలో
చేర్చుకొంటివా?
ఆనాడు
ఈ
నీతులు,
ప్రేమలు
యేమైపోయి
వుండెను?
ఈనాడు
పాండవులు
పెట్టు
కూటిని
కుక్కవలె
గతుకుచూ,
నీచపు
బ్రతుకు
బ్రతుకుచు,
పాండవులు
పరాయివారా?
అని
ఇంకను
చెప్పుకొనుచున్నావు.
అని
మహాకఠిన
వాక్కులతో
కత్తిపోటు,
సుత్తియేటులవలె
విరక్తిని
తెప్పించుటకు
విదురుడు
పూనుకొనెను.
ఈ
మాటలతో
ధృతరాష్ట్రుడు
నిజముగా
మనసును
మార్చుకొని,
ఉన్న
సత్యము
చెప్పుచున్నాడని
తలంచి,
చింతించి
"తమ్ముడా!
నీవు
చెప్పునవన్నియూ
నిజమే
కాని,
నన్నేమి
చేయుమందువు?
పోనీ,
నే
వంటరిగా
ఎవ్వరికీ
చెప్పక
అడవులకు
పోవుదమన్న,
కన్నులు
లేక
పోయెను.
ఎవరైనను
తోడు
కావలెను
ఉన్నంతవరకు
ఈ
దేహమును
కొంత
చూచుకొనవలెను
కదా?
ఆహార
సదుపాయములకు
అనానుకూలములు
కలుగునేమో;
అందునా
గాంధారి
నన్ను
విడిచి
అరనిమిషముండలేదను
విషయము
నీకు
తెలియును
నన్నేమి
చేయమందువో
నీవే
తెలుపుము"
అని
కొంత
శాంతవచనములతో
దారికి
వచ్చునటుల
విదురుడు
గమనిం
3
▾
Meaning
Keep
దేహ
భ్రాంతి
మూర్ఖుల
లక్షణము
"ధృతరాష్ట్రా!
ఈ
దేహమను
గృహముపైగల
అభిమానమే
నిన్ను
గుడ్డివానిగా
చేయుచున్నది.
ఎంత
కాలమున్ననూ
ఈ
దేహమును
వీడక
తప్పదు.
ఇది
స్థిరము
కాదు.
మలమూత్ర,
దుర్గంధ
మాంస,
రక్తములతో
…
నిమిషమునకు
నీచులూరు
ఈ
దేహము
నీవు
కాదు.
దేహమే
నేనను
భ్రాంతి
…
మూర్ఖుల
లక్షణము.
అట్టివాడు
జడుడు.
దీనిలో
నసంఖ్యాకములగు
రోగముల
సైన్యముతో
మృత్యువను
శత్రువు
దండెత్తి
వచ్చుచుండగా,
దిక్కుమొక్కు
తలంచక
తిక్కపట్టినవానివలె
మక్కువులు
తీర్చుకొనుచున్నావు.
ఏనాటికి
ఇవి
నిత్యములు
కావు.
వీడక
తప్పదు.
కనుక
పవిత్ర
క్షేత్రము
నేదైనను
నొకదానిని
చేరి
పరచింతనతో,
పరమాత్మ
స్మరణతో,
పరలోక
ప్రాప్తి
కొరకు
ప్రాకులాడు.
క్షేత్రమునందే
దేహమును
వీడిన
ధన్యము
కాని,
నక్కవలె,
కుక్కవలె
దిక్కులేని
చావును
అనుభవించకుము.
లెమ్ము!
వైరాగ్యము
పూనుము
గృహమును
వీడుము.
భ్రాంతి
బాయుము"
అని
అప్పటికప్పుడే
అన్నియు
సిద్ధపరచినటుల
ధృతరాష్ట్రుని
హృదయమున
వైరాగ్యమును
పుట్టింప
జేసెను.
అంత
ధృతరాష్ట్రుడు
కొంత
దీర్ఘాలోచన
సలిపి
కంటిధారలు
కార్చుచూ,
పెదవులు
అదురుచుండగా,
చేతులతో
తారాడుచూ,
"విదురా!
ఇంత
పవిత్రమైన
హితమును
బోధించిన
నిన్ను
ఎమని
పలుకుదును.
కాయమునకు
చిన్నవాడవైననూ
జ్ఞానమందు
మా
కందరికీ
గురువు
వంటి
వాడవు.
నీకెట్లు
ఇష్టమో
అట్లు
చేయుము.
నన్ను
వేరుగా
భావించక
మా
మాటలు
కొంత
శాంత
మనస్కుడ…
ఆలకింపుము.
తదుపరి
నీ
యిష్టానుసారము
నడుతుము"
అని
తన
పరిస్థితిని
ఈ
రీతిగా
వెలిబుచ్చుకొనెను.
"భ్రాంతులను
మూటలు
కట్టి
నీటన
త్రోయుము..."
"విదురా!
కన్న
కుమారుల
కంటెను
అధిక
ప్రేమతో
మమ్ములను
కాపాడ
ధర్మజునకు
చెప్పక
కదలుట
అంత
భావ్యము
కాదు.
అట్లు
తెలిసిన
మమ్ములను
4
▾
Meaning
Keep
అడవులకు
పంపదు.
కాదని
మేము
పట్టు
పట్టితిమా
మాతోపాటు
తాను
కూడను
బయలుదేరునట్టి
స్వభావము,
ఆ
ధర్మజునిది.
ఇట్టి
ధర్మసంకటమున
చిక్కిన
నాస్థితిని
నీవే
తప్పించి
నాకు
తపస్సునకు
తగిన
స్థానమును
అందించుము"
అని
అతి
దీనతతో
ప్రార్థించగా
విదురుడు
చిరునవ్వు
నవ్వుచూ
"రాజా!
నీ
మాటలు
చాల
విచిత్రముగ
నున్నవి,
నీవు
వినోదములకూ,
విందులారగించుటకూ,
వనముల
విహరించుటకూ
బయలుదేరలేదు
కదా?
సర్వసంగపరిత్యాగులై
తపమాచరించుటకు
వెళ్ళుచూ,
మమకార
అభిమానములకు
తావిచ్చి
ఆజ్ఞలను
తీసుకొన
సంకల్పించుట
విచిత్రముకాక
మరేమి?
దేహమునే
త్యాగము
చేయ
బూనిన
నీకు
ఇట్టి
తలంపులు
పుట్టరానివి.
ఇవి
బంధహేతువులే
కాని,
మోక్ష
సాధనలు
కానేరవు.
ఇట్టి
భ్రాంతులను
మూటలు
కట్టి
నీటన
త్రోయుము.
కట్టుగుడ్డలతో
కాయమును
కదిలింపుము.
కాలహరణము
చేయకుము"
అని
దయా
దాక్షిణ్యమును
చూడక,
మాటధోరణిని
మార్పక,
మహాత్యాగ
వాక్యములను
కురుపించెను.
వింటూ
పడకపై
కూర్చొనియున్న
ధృతరాష్ట్రుడు
తిరిగి
ఆతురతతో
"విదురా!
నీవు
చెప్పు
వాక్యములు
అతి
సత్యములు.
కానీ,
నా
స్థితి
నేను
ప్రత్యేకముగా
నీకు
చెప్పనక్కరలేదు.
కాయమా
పండు,
కన్నులా
కాయలు.
నాకు
దారి
చూపుటకైనను
ఒకరు
సహాయముండవలెను
కదా?
పోనీ,
నీ
వదినె
అగు
గాంధారి
నా
వలన
కండ్లుండియు
గ్రుడ్డిదైనది.
ఇట్టి
మాబోటి
అంధులము
తోడులేక
అరణ్యము
ఎట్లుచేరుదుము?
మా
బ్రతుకు
పరాధీనముల
పాలైనది.
విధిని
దాట
నెవరితరము?"
అని
కంట
నీరు
తుడుచుకొనుచున్న
ధృతరాష్ట్రుని
చూచి
విదురుడు
మనసున
జాలిపడినను
పైన
వాటిని
చూపక
అతి
ఉత్సాహముతో
"రాజా!
నీవు
కోరవలెను
కానీ,
నేను
అన్నింటికి
సిద్ధముగ
నున్నవాడను.
నిన్ను
తపస్సునకు
పంపుటకంటే
నాకు
వేరు
ఆనందమేమున్నది?
బయలుదేరుము,
నేను
గొనిపోదును"
అని
విదురుడు
లేచి
నిలుచుకొనెను.
ధృతరాష్ట్రుడు
కూడను
మంచమునుండి
క్రిందకు
దిగి
నిలుచుకొనెను.
ఇంతలో
గాంధారి
కూడ
అతని
భుజములు
పట్టుకొని
క్రిందికి
దిగి
"నాథా!
5
▾
Meaning
Keep
నేనుకూడనూ
సర్వసిద్ధముగా
వచ్చుచున్నానని"
ప్రార్థించెను.
అందులకు
ధృతరాష్ట్రుడు
ఆడవారిని
అరణ్యముల
కాపాడుకొనుట
చాల
కష్టము
అంతియేకాక,
క్రూరమృగములు,
భయంకర
శబ్దములు
అనేక
కష్టములకు
గురికావలసి
వచ్చునని
యొన్నెన్నో
బోధించెను.
అన్నింటినీ
వినియూ
వినని
అట్లు
తలూపుచూ
గాంధారి
తన
నాధుని
వదలి
నిలువననియూ
నాధునికి
లేనిబాధలు
నాకు
మాత్రమే
కలుగవనియూ
"ఇంత
కాలము
పతి
ననుసరించి
ఎట్లు
మెలగితినో
అటులనే
ఈ
విషయమునందు
కూడనూ
అనుసరించుట
కర్తవ్యము.
భారత
నారీమణుల
సహజ
ధర్మము.
మీరెన్ని
చెప్పిననూ
నేను
మిమ్ములను
విడిచి
వుండను.
మీరునూ
ఇట్లు
చెప్పుట
ధర్మము
కాదు.
మీరు
లేని
అంతఃపుర
సుఃఖము
కంటే
మీతోనున్న
అరణ్యబాధయే
నాకు
సర్వసుఖము.
నాయెడ
నెనరుంచి
అనుజ్ఞ
దయచేయుడు"
అని
తడుముచూ
పాదములపై
వ్రాలెను.
తిరిగి
ధృతరాష్ట్రుడేదియో
చెప్పుచుండ
విదురుడు
అడ్డుతగిలి
"రాజా!
ఇది
తర్కించుటకు
కానీ,
ధర్మాధర్మములు
విచారణచేయుటకు
కానీ,
తగిన
సమయము
కాదు.
ఇంతకాలము
నిమిషమైననూ
మిమ్ము
విడనాడక
వెంటాడిన
సాధ్వీమణి
ఈనాడు
మాత్రము
మిమ్ములను
విడచి
నిలువగలదా?
ఇది
న్యాయము
కాదు.
ఆమెను
కూడను
వెంట
గొనిపోవుట
మంచిది."
గాంధారీ
ధృతరాష్ట్రులు
వనమున
కేగుట
"తపస్సునకు
వెళ్ళువారలకు
భయభ్రాంతులు
కానీ,
కష్టనష్టములు
కానీ,
ఆహారదప్పులు
కానీ
అడ్డురావు,
రాకూడదు.
ఇట్టి
వాటికి
పట్టుబడుట
తపస్సు
కానేరదు.
కాయమునే
త్యాగము
చేయు
స్థితిలో
కష్టనష్టములను
మాత్రమే
విచారింతురా?
రండి!
నిదానమునకు
తరుణముకాదు"
అని
ధృతరాష్ట్రుని
చేయిపట్టుకొని
విదురుడు
ముందు
నడచెను,
ధృతరాష్ట్రుడు
విదురుని
అనుసరించుచుండ,
గాంధారి
పతిభుజములపై
చేయివేసి,
ఆమె
ధృతరాష్ట్రుని
అనుసరించెను.
పరమ
భక్తుడు,
ప్రజ్ఞావంతుడు
అయిన
విదురుడు
అతి
జాగరూకతతో
కావలివారికి
కానీ,
పురజనులకు
కానీ,
వీరిజాడలు
తెలియకుండగ
6
▾
Meaning
Keep
ప్రధాన
వీధులలో
వెళ్ళక
చిన్న
చిన్న
సందుల
ద్వారా
పురము
దాటించెను.
తెల్లవారక
పూర్వమే
అరణ్యములో
చేరవలెనని
తానెంతో
త్వరపడెను.
అయితే
గంగానది
అడ్డుతగులుటచే,
వేళకాని
వేళలో
నావను
నడుపువారుండనందున
తెల్లవారువరకు
నదీతీరమున
నిలువవలసి
వచ్చెను.
అప్పుడు
ధృతరాష్ట్రగాంధారులను
పొదల
చాటున
విశ్రమింపచేసి
తాను
పడవకొరకు
పరికించుచు
చిమ్మచీకటి
తీరకమునుపే
గంగానదిని
దాటిరి.
Previous
←
Reflections on Vairāgya
Next
The Transformation That Arose in Dhṛtarāṣṭra
→