Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Transformation That Arose in Dhṛtarāṣṭra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
8.
ధృతరాష్ట్రునిలో
కలిగిన
పరివర్తన
విదురుడు,
ధృతరాష్ట్ర
గాంధారులు
వనమున
జేరిరి.
తపమునకు
తగిన
ఉత్తమ
స్థానమును
నిర్ణయించు
నిమిత్తము
విదురుడు
శ్రద్ధాసక్తుడై
వెదుకుచు,
ధృతరాష్ట్ర
గాంధారులకు
తగిన
సాధనమార్గమును
బోధించుచూ,
కాలమును
పవిత్ర
విషయచింతనలతో
గడుపుచుండ,
ఇక
హస్తినాపురమున
తెల్లవారగనే
ధర్మజుడు
లేచి
స్నానసంధ్యాది
కర్మలను
సక్రమముగా
ఆచరించి,
అగ్ని
హోత్రాదులను
పూర్తి
చేసుకొని,
నిత్యాచరణలైన
దాన
ధర్మాదులు
గావించి,
వాడుక
ప్రకారము
తన
పెదతండ్రి
అయిన
ధృతరాష్ట్రుని
దర్శించుటకై
కాలినడకనే
బయలుదేరి
ధృతరాష్ట్ర
గాంధారులు
నివసించుచున్న
భవనమున
చేరెను.
పడకగదిలో
పెదతల్లి,
పెదతండ్రి
అయిన
ధృతరాష్ట్రగాంధారులు
కనిపించనందున
బహుశ
కాలకృత్యములు
తీర్చుకొనుటకు
వెళ్లియుందురని
తలంచి,
కొంత
సేపు
అటూ
ఇటూ
తిరుగుచూ,
అన్ని
వైపుల
పరికించుచుండగా
ఆ
గదియందు
సామానులు
ఎక్కడి
వక్కడ
పడి,
పడక
చెదరక,
దిండు
అణగక
ఉండుటచూచి,
పడకనెవరైననూ
సర్దియుందురేమోయని
తలంచెను.
కానీ,
అతనిలో
ఏదో
తెలియని
అనుమానముచేరి
బాధపెట్ట
దొడగెను.
అంతలో
ఒకపరి
విదురుడు
వున్న
గృహమును
చూతమని
అక్కడికి
వెళ్లెను.
అక్కడ
కూడనూ
విదురుడు
కనిపించలేదు.
పడక
అసలే
ముట్టనట్లు
కనిపించెను,
అక్కడి
పరిచారకులను
అడుగగా,
రాత్రి
ధృతరాష్ట్ర
మహరాజుగారి
వసతికి
వెళ్లిన
2
▾
Meaning
Keep
మహాఋషి
తిరిగి
రాలేదని
తెలిపిరి.
ఇది
వినినంతనే
ధర్మజుని
గుండెలు
ఝుల్లుమనెను.
తిరిగి
అతి
వేగముగ
ధృతరాష్ట్ర
మహారాజు
భవనమునకు
వెళ్ళి
గది
గదీ
పరికించగా,
అందులో
ఎవ్వరునూ
లేరని
తెలుసుకొని,
తన
అనుమానము
మరింత
ముదిరి
దుఃఖమునకు
దారితీసెను.
కాళ్ళుచేతులు
తడపడెను;
కంఠము
ఎండిపోయెను;
మాటలు
నిలిచిపోయెను.
వేయేటికి?
ధర్మజుడు
నిర్జీవియై
కూలబడెను;
విధిలేక
పిచ్చికేకలు
వేసెను.
విదురుని
పిలిచెను.
ఆ
స్వరము
విన్న
పనివారలు,
దగ్గరున్న
అధికారులు,
అదరిపడిరి.
ఏమి
ప్రమాదమో
అనునట్లు
అందరు
"ఏమీ?
ఏమీ?"
అని
మహాప్రభువు
చెంత
చేతులు
కట్టి
ఆతురతతో
ఆజ్ఞకు
కాచుకొనిరి.
ఇంతలో
సంజయుడు
ఆతురతతో
వచ్చెను.
ధర్మజుడు
సంజయుని
చేతులు
రెండునూ
గట్టిగ
పట్టుకొని
విచారమును
వెలిబుచ్చుచు,
"నా
తల్లిదండ్రులెందు
బోయిరి?
వారి
శయ్యామందిరము
శూన్యముగ
చూడవలసి
వచ్చెనే,
దీనికి
కారణమేమి?
నీతో
నేమైననూ
చెప్పిరా?
వారిజాడ
తెలిసిన
నేను
వెళ్లి,
వారి
పాదములుపట్టి
ప్రార్థించి
తిరిగి
తెచ్చుకొందును.
నా
అపరాధములేమైననూ
ఉండిన
క్షమించమని
కోరుకుందును.
శీఘ్రముగ
చెప్పుము
సంజయా!"
అని
ఆతురతతో,
ఆవేశముతో
భాష్పములు
రాల్చుచు
విలపించుచున్న
ధర్మజునిచూచి,
సంజయుడు
దిగ్భ్రాంతిజెంది,
ఆలోచనలో
మునిగెను.
ధృతరాష్ట్రుని
జాడ
తెలియక
పాండవులు
రోదించుట
అతనికేమియూ
తెలియదు.
కేవలము
ఇది
విదురుడుచేసిన
పని
అనిమాత్రము
తలంచి,
తాను
కూడనూ
కంటిధారలు
కార్చుచు,
గద్గదమగు
కంఠముతో
ధర్మజుని
చేతులు
పట్టుకొని,
"ప్రభూ!
మీరు
నా
మాటలను
నమ్ముదురని
ప్రార్థింతును,
యథార్థమును
చెప్పుచున్నాను.
యే
చిన్న
విషయమందైననూ,
"సంజయా
ఏమి
చేయమందువు?"
అని
నన్ను
సలహాలు
తీసుకొను
చుండిన
మహారాజు,
ఈ
విషయమున
నాతో
కించిత్
ఆలోచనైననూ
చేయక,
నాతో
యే
ఉద్దేశమునూ
తెలుపక
ఇట్లు
చేయుటలో
నాకే
3
▾
Meaning
Keep
పరమాశ్చర్యముగ
నున్నది.
నేనేమని
తెలుపుదును?
అతని
దగ్గరనే
నున్నప్పటికిని
నాకు
ఆ
పోకడ
యేమాత్రమూ
తెలుపక,
ఇంతటి
పనికి
పూనుటలో
నేనేపాపమును
యెరుగను.
మహారాజు
నన్నింత
మోసము
చేయునని
కలనైననూ
తలంచలేదు.
కొండంత
విశ్వాస,
ప్రేమలను
నాపై
చూపి,
కడకు
నన్నింత
వంచించుట
నా
పాపఫలము"
అని
పిల్లవానివలె
యేడ్చుచున్న
సంజయుని
చూచి
ధర్మరాజు
"సంజయా!
ఇది
నిజముగా
మా
పాపఫలము
కాని
వేరు
గాదు."
మేమెంత
దౌర్భాగ్యులమో
ఇందుమూలమున
తెలియుచున్నది,
మా
తండ్రి
మమ్ములను
అతిబాల్యమునందే
విడిచి
పరలోకప్రాప్తిని
అందుకొనెను.
అట్టి
ముక్కుపచ్చలారని
మమ్ము
పెంచి
పెద్ద
జేసిరి,
మా
పెదతండ్రిగారు.
తండ్రి
అయిననూ
పెదతండ్రి
అయినను,
అతనే
అని
హృదయ
పూర్వకముగా
విశ్వసించి
సేవించుచుంటిమి.
అతని
సేవలో
నేమేమి
అపరాధము
చేసితినో
కదా?
తెలిసి
బుద్ధి
పూర్వకముగా
నేను
వారికెట్టి
అపరాధమును
తలంచలేదు.
నూర్గురు
పుత్రులను
పోగొట్టుకొని
శోకాగ్నిలో
పరితపించుచున్న
నా
పెదతండ్రి
పెదతల్లులకు
కొంత
వరకైననూ
శాంతి
చేకూర్చవలెనని,
పుత్రశోకమును
మరిపించవలెనని,
నేను,
నా
తమ్ములు
యేకోన్ముఖులై
సేవ
చేయుచు
వారలకే
కొరతయూలేక
రాక
చూచుకొనుచుంటిమే
కాని,
వారలను
మేము
ఎట్టి
విషయములందైననూ
అలక్ష్యము
చేయలేదు,
చూపలేదు,
తలంచలేదు.
అట్టి
మాపై
కినుక
పూని
ఈ
రీతిగా
ఒక
మాటైననూ
తెలుపక
గృహమును
వీడివెళ్ళుట
మా
పాపఫలము.
మా
పెదతల్లీ
తండ్రులు
వృద్ధులు;
అంతియేకాక
గ్రుడ్డివారు.
యే
రీతిగా
గృహమును
వీడిరో
తోచకున్నది.
ఎన్ని
బాధలు
పడుచున్నారో?
ఒక
పనివాడైననూ
వారిని
అనుసరించలేదు.
ఎందరుండి
యేమి
ప్రయోజనము?
దారిగానక
గంగలో
నేమైనను
పడిపోయిరేమో!
అయ్యో!
ఎంతటి
దురదృష్ట
వంతుడను.
ఇంత
కాలము
కంటికి
రెప్పవలె
కాపాడి
కడకు
వృద్ధాప్యమున
ఇట్టి
కఠినస్థితికి
గురిచేసితిని"
అని
రొమ్ములపై
గ్రుద్దుకొనుచూ
విలపించిన
రోదన
తమ్ములకు
వినిపించెను.
4
▾
Meaning
Keep
ఏమి
ప్రమాదమో
అని
యెక్కడివారు
అక్కడనుండి
పక్షులవలె
ఎగిరి
దుమికిరి.
కుంతీదేవికూడనూ
కారణము
తెలియక
కంగారుతో,
"ఏమి
నాయనా?
యేమి
జరిగినది?"
అని
చెంతకు
చేర్చుకొని
వోదార్చదొడగెను.
అంతలో
అటూ
ఇటూ
గదులలో
చూచెను.
బావయు
తన
తోడికోడలైన
గాంధారియూ
కనిపించకుండినందున
వారెక్కడని
సంజయుని
ప్రశ్నించెను.
అతను
కూడను
యే
జవాబునూ
చెప్పలేక
గట్టిగా
ఏడ్వసాగెను.
కారణమిదియే
అయివుండవచ్చునని,
అయ్యో!
ఈ
వయస్సులో
వారెక్కడ
వెళ్ళిరి;
ఏమి
కారణము,
అని
ఆతురతతో
అనేక
ప్రశ్నలు
వేయుచు
పనివారలనూ,
అందరినీ
విచారించ
ప్రయత్నించెను.
ఎవ్వరూ
ఏమియూ
తెలియదని
యేడువసాగిరి.
ఇంతలో
ధర్మజుడు
తమ్ములను
పిలిచి,
నోటమాటరాక
అనేక
విధముల
సైగలు
చేసెను.
అది
తమ్ములకేమియూ
అర్థము
కాలేదు.
అంత
ధర్మజుడు
ధైర్యము
తెచ్చుకొని
కంటినీరు
తుడుచుకొని
జరిగిన
సమాచారము
తెలిపి
బహుశా
వారలు
గ్రుడ్డివారు
కనుక
ఎంత
దూరమో
పోయి
వుండరు.
దారి
తప్పి
అక్కడక్కడ
తారాడుచుందురు,
కాన
శీఘ్రమే
పరివారమును
పంపి
నలుమూలలా
వెతికించుమని
ధర్మజుడు
భీమునకు
ఆజ్ఞచేసెను.
అంత
భీమ,
నకుల,
సహదేవులు
అన్న
ఆజ్ఞప్రకారము
నలుమూలలా
కావలసినంత
మంది
సైన్యములు
పంపిరి.
పల్లములు,
మిట్టలు,
బావులు,
చెరువులు,
నదులు,
గొందెలు
అన్నింటినీ
అడుగడుగునూ
గాలించిరి;
జాడ
తెలియలేదు.
కడకు
గంగానదే
వారి
శాశ్వత
నివాసమయి
యుండునని
అన్ని
ఒడ్డులను
వెతికించి,
ఎక్కడైననూ
తేలియుందు
రేమోనని
నీటిలో
మునిగి
పరీక్షించు
ప్రవీణులను
పిలిపించి,
వెతికించిరి.
ఫలితము
విఫలమాయెను.
ధృతరాష్ట్రగాంధారుల
జాడలు
తెలియలేదు.
కడకు
పాండవులు
నిరాశజెంది,
వారలను
ఈరీతిగా
కాపాడుకోలేక
పోతిమికదాయని
పరితపించుచు
కాలమును
గడుపుచుండిరి.
5
▾
Meaning
Keep
ఇది
యిట్లుండ,
ధృతరాష్ట్రగాంధారులు
తపోవనమున
సుఖాసనాసీనులై
తపము
నాచరించుచూ,
నిరంతరము
పరమాత్మ
చింతనతో
హృదయమును
ఆనందమున
ముంచి
తన్మయులైయుండ,
కాననమున
పుట్టిన
దావాగ్ని
దాని
కదియే
వచ్చి
వారల
కాయములను
భస్మముచేయును.
విదురునికి
ప్రభాస
క్షేత్రమున
దేహత్యాగము
చేయవలెనను
కోరిక
ఉండుటచే
విదురుడు
దావాగ్నికి
గురికాక,
ధృతరాష్ట్రగాంధారుల
సద్గతికి
సంతసించి,
అక్కడినుండియూ
తీర్థయాత్రలకు
బయలుదేరి
ప్రభాస
క్షేత్రమును
చేరి,
అచట
నశ్వరమగు
తన
భౌతిక
దేహమును
వదలెను.
Previous
←
Vidura's Teaching on Right Conduct
Next
The Conclusion of Śrī Kṛṣṇa's Avatāra
→