Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Conclusion of Śrī Kṛṣṇa's Avatāra
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9.
శ్రీకృష్ణుని
అవతార
పరిసమాప్తి
గోరుచుట్టుపై
రోకలి
పోటన్నట్లు
పెదతల్లీ
పెదతండ్రులయిన
గాంధారీ
ధృతరాష్ట్రుల
వియోగముతో
కుములుచున్న
ధర్మజునకు
రాజ్యమున
ఎందుచూచిననూ
అశుభమైనవార్తలే
వినబడదొడగెను.
ఏది
చూచిననూ
అపశకునములే;
ఏమి
చేసిననూ
ధర్మవిరుద్ధములే
అడ్డుతగులుచూ
వచ్చెను.
వీటి
మూలమున,
యేదో
తెలియని
ఆవేదన
మరొకటి
నూతనముగ
ధర్మజుని
హృదయమున
రగుల్కొనుచూ
వచ్చెను.
ధర్మజుని
మోము
కళాహీనమై,
విచారముతాండవమాడుట
సోదరులు
గమనించి,
ఒక
దినము
భీమ
నకులసహదేవులు
ధర్మజుని
చెంతచేరి,
ధర్మజుని
విచారమునకు
కారణము
తెలుసుకొనకోరి
చేతులు
జోడించి
"రాజా!
దిన
దినమునకు
మీ
తేజస్సు
సన్నగిల్లుచున్నది.
నిరంతరము
మీరేదియో
విచారమున
మునిగి
కృశించుచున్నట్లు
కనిపించుచున్నది.
దయచేసి
మావలన
నేమైనను
పొరపాట్లు
జరిగియుండిన,
తెలిపినచో
తిరిగి
అట్టి
పొరపాట్లు
రానీయక,
జరుగనీయక
చూచుకొందుము.
లేక,
మరోవిధమైన
కారణము
అయివుండిన
తప్పక
మా
ప్రాణములైననూ
ఒడ్డి
తమ
సంతోషమునకు
తోడ్పడగలము.
తమ
ఆజ్ఞకు
బద్ధులై
సిద్ధముగా
శిరస్సాంచు
ఇట్టి
వీరాధివీరులైన
సోదరులను
కలిగియుండియూ
తమరింత
విచారించుట
తగదు.
కారణమును
తెలిపి,
కర్తవ్యమునకు
ఆనుజ్ఞ
దయచేయుడని"
ప్రార్థించిరి.
2
▾
Meaning
Keep
ధర్మజునకు
అశుభములు
కనిపించుట
అందులకు
ధర్మజుడు,
"సోదరులారా!
నేనేమని
వచింతు?
నాకు
ఎటు
చూచిననూ
అశుభములే
కనిపించుచున్నవి.
గృహములు
మొదలుకొని
మహనీయుల,
బుషుల
ఆశ్రమములవరకూ
ప్రతి
దృశ్యమూ
శ్రీహీనమై
ఆనందరహితములై
కనిపించుచున్నవి.
ఇవి
నాలోని
మనోవికల్పములే
యెంతయో
ధైర్యముతో
వాటిని
నిగ్రహించిననూ,
అవి
పట్టుబడక
ప్రయత్నమునకు
చిక్కక
నన్ను
మరింత
కట్టివేయుచున్నవి.
"వాటికి
తగినట్లు
కొన్ని
ధర్మవిరుద్ధమైన
దృశ్యములు
కూడనూ
చూచితిని.
చూచుటయేకాక,
మన
న్యాయస్థానమునకు
కూడను
ఏన్నియో
వినరాని,
కనరాని
అన్యాయ,
అక్రమ,
అనాచారపు
తగాదాలు
విచారణకు
వచ్చినట్లు
కూడను
వింటిని.
"కొన్ని
మరింత
విచిత్రపు
దృశ్యములను
చూచితిని.
నిన్నటి
సాయంత్రము
విహారార్థమై
వెళ్ళివచ్చుచుండగా,
ఒక
ఆవు
ఈనిన
దృశ్యమును
చూచితిని.
అది
నన్ను
మరింత
కలతపెట్టినది.
ఈనిన
కొంత
సేపటికి
దూడ
ఆవు
పాలు
త్రాగుట
సహజము.
కాని,
అట్లు
జరగక
ఆవే
దూడ
పాలు
త్రాగుట
చూచితి.
తిరిగి
మన
రాజ
వీధిని
వచ్చుచుండగా
కొందరు
స్త్రీలు
విచ్చలవిడిగా
బజారున
తిరుగుచుండుట
చూచితిని.
పోనీ,
నన్ను
చూచియైనను
లోనికి
వెళ్ళుదురేమో
యని
తలంచితిని;
కాని
అట్లు
కూడను
జరుగలేదు.
నా
భయము
కూడనూ
వారికి
లేక,
దారితప్పక,
మగవారలంతో
స్వేచ్ఛగా
మాట్లాడుట
కన్నులారా
చూచితిని.
అటులనే
మరికొంతదూరము
నా
నడక
సాగించితిని.
"మన
రాజభవనమునకు
అతి
సమీపముననే
ఒక
బ్రాహ్మణుడు
పాలూ,
పెరుగు
విక్రయించుట
చూచితిని.
కొన్ని
ఇండ్లకు
ద్వారములు
చేర్చి
యేదో
విచిత్రమైన
ఒక
ఇనుపముద్దను
భద్రమునకు
తగిలించినటుల
చూచితిని.
(అనగా
3
▾
Meaning
Keep
ఇంటికి
తాళములు
వేయుట.)
ఇవన్నియూ
నా
మనసున
చేరి,
అనేక
విధముల
కలత
పెట్టుచుండగా
వాటి
చింతను
దూరము
చేయ
తలంచి,
సాయంత్రము
సంధ్యావందన
సమయమున
అగ్నికార్య
నిమిత్తమై
సమిధలు
ఎన్నివేసి
గాలించిననూ
అగ్ని
రగుల్కొన
లేదు.
"ఇట్టి
విపరీత
దృశ్యములు
ఎదో
వినాశమునకే
అను
సంశయము
నాలో
నిమిష
నిమిషమునకు
బలపడుటచే,
నా
విచారము
కూడనూ
అధికమగుచున్నది.
ఎంత
ప్రయత్నించిననూ
అరికట్టలేక
పోవుచున్నాను.
కలి
ప్రవేశించినదో,
లేక
ప్రవేశింపబోవుచున్నదో
అన్నట్లున్నది
ఈ
దృశ్యములను
చూడ.
కాకున్న,
ధర్మ
రాజ్యమున
భర్తతో
భార్య
పోట్లాడి,
అతనిని
విడిచి
పుట్టినింటికి
పోదునని,
న్యాయ
స్థానమున
నొక
స్త్రీ
వాదించుట
ఎంత
విచిత్రము!
నిన్నటి
దినము
ఇట్టి
తగాదా
ఒకటి
న్యాయ
స్థానమునకు
వచ్చినది
వింటిని.
"వినరాని
ఇట్టి
విషయములు
వినియూ
చింతింపకుండా
ఉండుటకు
సాధ్యముకాని
పని.
వేయేటికి?
నిన్నటి
దినము
అశ్వశాలలో
అశ్వములన్నియు
కంటనీరు
పెట్టుచుండెనట!
ఆ
దృశ్యమును
చూచిన
పనివారలు
అత్యంత
ఆశ్చర్యముతో
సహదేవునికి
విన్నవించగ,
తమ్ముడు
వెళ్ళి
ఎన్ని
విధముల
విచారించిననూ
వాటి
దుఃఖమునకు
కారణము
తెలియకపోవుట,
తదుపరి
సహదేవుడు
కూడనూ
ఆశ్చర్యపడుట
జరిగినది.
ఇవన్నియూ
వినాశకాలపు
చిన్నెలు
తప్ప
మనోవికల్పములు
కావని
దృఢమగుచున్నది"
అని
ధర్మజుడు
విచారముతో
గడ్డముక్రింద
చేయిపెట్టుకొని
ఆలోచనలో
మునిగినట్లు
కూర్చుండుట
భీముడు
చూచి
ఒక
వెగటునవ్వు
నవ్వి,
"రాజా?
మీరు
చెప్పు
అశుభములు,
అక్రమములు,
అనాచార,
అధర్మములు
నిజమే
కావచ్చును?
కాని
మనకు
వచ్చు
కీడేమిటి?
పరిపాలనలో
కొన్ని
కట్టుదిట్టములను
భద్రమైనవిగా
నీమించిన
వీటిని
అరికట్టవచ్చును.
4
▾
Meaning
Keep
"అంత
మాత్రమునకే
మీరింత
విచారించుట
ఆశ్చర్యముగా
నున్నది.
పోనీ,
తిరిగీ
యేమైనను
మహా
యుద్ధములు
జరిగి
రాజ్యమును
తుడిచి
వేయునేమో
అను
అనుమానమునకు
యే
మాత్రము
స్థానము
లేదు.
ఎందుకన
మనకున్న
శత్రువులు,
చుట్టములు
హతమారిరి.
ఇక
శత్రులైననూ,
మిత్రులైననూ,
సోదరులైననూ
మనము
ఐదుగురము
మాత్రమే!
పోనీ!
మనలో
మనకేమైననూ
కలహములు
బయలు
దేరునా
అన్న,
అది
కలలో
సహితము
జరుగదు,
కలగదు.
ఇక
మీరు
విచారించుటకు
ఏకారణము,
ఆధారమో
బోధపడకున్నది.
ఇట్టి
అల్పదృశ్యములకు
మీరింత
ఆలోచనలో
మునుగుట
హాస్యాస్పదమునకు
గురియగును,
అని
ఒకచేతిలో
గద
మరొకచేతిలోనికి
మార్చుకొంటూ
వెగటుగా
మాటలు
ముగించెను.
పాండవులకు
పంచప్రాణములు
కృష్ణుడే!
అంత
ధర్మజుడు
"తమ్ముడా!
నీకున్నంత
వివేక
విచారణ
శక్తులు
నాకు
లేక
పోలేదు.
నీవు
చెప్పినటుల
నాకు
శత్రుభయ
మేమాత్రములేదు,
రాదు.
ఒక
అస్త్రముతో
ముల్లోకములు
భస్మము
చేయునట్టి
శక్తి
సామర్థ్యములు
కలిగియుండిన
భీష్మ
ద్రోణాదులనే
జయించిన
మనకు
వేరు
శత్రువులు
ఏమి
చేయ
గలరు?
శత్రు
భయమునకు
చోటేలేదు.
ఇక
సహించరాని
పరాభవముల
సమయమునందే
మనసులు
చలించని
మనకు
శత్రుత్వము
కాని,
అభిప్రాయ
భేదములు
కాని,
ఎట్లు
కలుగును?
ఒక
వేళ
నాకేమైనను
అనిష్టము
కలుగునేమో?
అని
చింతించుచున్నానని
తలంచితివేమో,
ఛీ!
అట్టి
తుచ్ఛ
భ్రాంతి
ఏనాడునూ
లేదు.
పాంచభౌతికమైన
ఈ
నీటిబుడగవంటి
దేహము
ఓనాటికైనను
వూడిపోవునదే,
రాలిపోవునదే,
కూలిపోవునదే,
కాలిపోవునదే.
దీని
చింత
నేను
చేయను.
ఉన్న
చింతయంతయూ
నాకు
ఒక్కటి
మాత్రమే!
దానిని
కూడనూ
దాచుకొనక
చెప్పెద
వినుడు.
అది
ఏమన,
తమ్ముడైన
అర్జునుడు
ద్వారకకు
వెళ్ళి
ఇంచుమించు
ఇప్పటికి
ఏడు
నెలలు
కావచ్చుచున్నది.
ద్వారకయందలి
వాసుదేవుని
యోగక్షేమములు
ఈనాటి
వరకు
ఏమియూ
తెలియలేదు.
తానైననూ
ద్వారకకు
చేరినట్లు
దూతతో
వార్తయిననూ
పంపలేదు.
దీని
చింత
కూడనూ
5
▾
Meaning
Keep
నన్నంత
బాధించుటలేదు.
ఎందుకన,
అర్జునుని
ఎదిరించు
వారు
వేరొకరులేరని
నాకు
తెలియును.
అట్లుగాక
అర్జునుని
కేమైనను
అననుకూలములో
లేక
అశుభములో
కలిగియుండిన,
వాసుదేవుడు
తెలిపియుండెడివాడు.
కాన,
అర్జునునకెట్టి
ఆపదలు
కలుగలేదని
నాకు
ధైర్యము.
కానీ,
వాసుదేవుని
యోగక్షేమములయందు
మాత్రము
నాకు
నిమిష
నిమిషమునందూ
అనుమానము
అధికమగుచున్నది.
హృదయము
భరించలేని
ఆవేదనతో
కుములుచున్నది.
ఇక
దాచుటెందులకు?
వాసుదేవుడు
ఈ
లోకమునే
వీడెనేమో
అను
అనుమానము
నిస్సందేహముగా
నన్నావరించినది.
ఇంతకంటే
వేరు
చింతన
మరొకటి
ఉన్నదా?
అటులేమైననూ
జరిగియుండిన
త్రిలోకనాథుని
కోల్పోయిన,
ఈ
విధవ
దేశమున
నేనొక
నిమిషమైననూ
నిలువలేను.
ఈ
వైధవ్యమును
ధరించిన
లోకమును
నేచూడలేను.
ఈ
పాండవులకు
పంచ
ప్రాణములు
ఆ
వాసుదేవుడే!
అతను
లేని
దేహములు
శవస్వరూపములే.
వాసుదేవుడు
లోకమును
వీడకున్న
ఈ
అశుభములు
ఇంత
స్వేచ్ఛగా
సంచరించవు.
ఈ
అన్యాయ,
అక్రమ,
అనాచార,
అధర్మములకు
ఇంత
స్వాతంత్ర్యము
లోకమున
లభించవలెనన్న
అతను
యీ
లోకమును
వీడి
వుండవలెను.
ఇది
నిస్సందేహము.
నా
హృదయమే
ఇందుకు
సాక్షి"
అని
ధర్మజుడు
తన
దృఢ
అభిప్రాయమును
సోదరులకు
గట్టిగ
తెలుపగనే
అందరి
మోములు
కొంత
వాడెను.
ధైర్యము
కూలెను.
భీముడు
ఈ
మాటలు
విని
ఒకవైపున
తనను
కూడనూ
విచారము
బాధించుచున్ననూ,
మరొకవైపున
ధైర్యము
తెచ్చుకొని
"అన్నా!
అర్జునుడు
రానంత
మాత్రమున,
క్షేమవార్త
తెలియనంత
మాత్రమున,
తమరింతటి
అపోహలకు
చోటిచ్చి,
విచారించుట
భావ్యముకాదు.
ఏ
కారణముచేతనో
మనకు
వార్త
తెలియకుండవచ్చును.
నిదానముచే
సత్యమును
తెలుసుకొని
విచారమునకు
చోటివ్వవలెను
కాని,
నీలో
నీవు
భ్రమించి
అదే
నిజమయివుండునని
తలంచుట,
అంత
మంచిది
కాదేమో
అను
ధైర్యము
నన్ను
ఈ
రీతిగా
పలికించుచున్నది"
అని
చెప్పెను.
6
▾
Meaning
Keep
పురుషులకు
వామభాగము,
స్త్రీలకు
కుడిభాగము
అదురుట
అశుభం
అందులకు
ధర్మజుడు
తిరిగి
"భీమా!
నీవేమి
చెప్పిననూ,
ఎన్ని
చేసిననూ
నా
భావమే
సత్యమయివుండును.
లేకున్న
నాకిట్టి
తలంపు
రాదు!
నా
వామాంగము
అదురు
చున్నది.
పురుషులకు
వామభాగము,
స్త్రీలకు
కుడిభాగము
అదురుట
అశుభలక్షణము.
నా
దేహముతో
పాటు
బుద్ధి,
మనసు,
సర్వేంద్రియములు
కూడనూ
అదురుచున్నవి.
కన్నులు
మబ్బు
గ్రమ్ముచున్నవి.
లోకము
నాధుని
బాసినట్లు
కనిపించుచున్నది.
శ్రోత్రములు
వినిపించుటలేదు.
కాళ్ళు
వణుకు
చున్నవి;
వేయేటి?
యేయే
అంగములు
యేయే
పని
చేయవలనో
అట్లు
ఆయా
అంగములు
చేయుక
స్తంభించినవి.
ఇంత
కంటే
వేరు
నిదర్శన
మెందులకు?
నీవు
నా
మాటలు
నమ్మిననూ,
నమ్మకున్ననూ
సత్యము
మారదు.
భూమి
మాటి
మాటికీ
కంపించుచున్నది.
లోనుండి
యేదియో
విచిత్రమైన
భయంకర
శబ్దములు
వినిపించుచున్నవి.
నక్షత్రములు
రాలుచున్నవి.
సరోవరము
నందలి
నీరు
సముద్రపు
అలలవలె
అల్లకల్లోలముగా
నున్నది.
ప్రకృతినందలి
పంచభూతములు
నాధుని
కోల్పోయిన
రోదనలో
మునిగి
పోయినట్లు
కనిపించు
చున్నవి.
ఇంక
ఎన్ని
నిదర్శనములు
కావలెను.
ఇంతకు
పూర్వమే
దేశములో
కొన్ని
ప్రదేశములందు
రక్తపు
బిందువుల
వర్షము
కురిసినట్లు
దూతలచే
వార్తలందినవి"
అని
ధర్మజుడు
దృఢనిశ్చయుడై
తెలుపుచుండ,
నకులసహదేవ
భీముల
నేత్రములనుండి
వారికి
తెలియకనే
నీరు
కారదొడగెను.
గుండె
ఝుల్లుమనెను.
కాళ్ళు
అదురదొడగెను.
Previous
←
The Transformation That Arose in Dhṛtarāṣṭra
Next
The Sūtradhāri of the Līlā Drama
→