Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Sūtradhāri of the Līlā Drama
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10.
లీలా
నాటక
సూత్రధారి
భీముడెటులనో
ధైర్యమును
తెచ్చుకొని
"అన్నా!
మీరు
సెలవిచ్చినచో
ఈ
క్షణముననే
ప్రయాణమునకు
సర్వము
సిద్ధము
చేసుకొని
ద్వారకకు
వెళ్ళి
సమస్త
సమాచారములు
తెలుసుకొని
అనతికాలములోనే
సన్నిధిని
వ్రాలుదును"
అని
భీముడు
ప్రయాణమునకు
అనుజ్ఞ
కోరుచుండగనే
సూర్యుడు
అస్తమించెను.
ఎక్కడ
జ్యోతులక్కడ
భవనమునందు
వెలిగెను.
ఇంతలో
ద్వారము
వద్ద
పారా
కాచు
బంట్రోతు
అతివేగముగా
లోనికి
వచ్చి,
ప్రభువులు
దయచేయు
చున్నారని
తెలిపెను.
పోయిన
ప్రాణములు
వచ్చి
చేరినట్లు
అందరూ
అతి
ఆతురతతో
లేచి,
తమ్మునికి
యెదురేగి
ద్వారక
వార్తలు
వినగోరవలెనని
బయలు
దేరుచుండగనే
అర్జునుడు
అతి
నీరసముతో,
కళాహీనుడై,
ఆనందరహితుడై
లోన
ప్రవేశించి
ముఖమును
చూపక,
ధర్మజుని
పాదములపై
వ్రాలెను.
కృష్ణ
నిర్యాణ
వార్త
అంత
ధర్మజుడు
తన
అనుమానమునకు
తగిన
బలమగు
చిన్నెలను
అర్జునునియందు
చూచి,
విచారముతో,
ఆతురతతో,
ద్వారకయందలి
తన
బంధు
మిత్రుల
క్షేమమును
విచారించెను.
అర్జునుడు
పాదములపై
వ్రాలిన
వాడు
లేవలేక
పోయెను.
కంటిధారలచే
పాదములను
తడుపుచుండుట
చూచి,
మిగిలిన
సోదరుల
గుండెలు
అనుమానముతోనిండి,
నిలువునా
నీరయి
స్తంభించిపోయిరి.
2
▾
Meaning
Keep
ధర్మజుని
మనసు
మాయమాయెను.
అర్జునుని
భుజములు
పట్టుకొని
"తమ్ముడా,
విషయమేమిటి?
మా
హృదయములు
తరుగుకొని
పోవుచున్నవి.
యాదవుల
క్షేమ
సమాచారములు
తెలిపి,
మమ్ము
ఈ
తాపమునుండి
తప్పించుము"
అని
అడుగుచున్ననూ
అర్జునుడు
లేవలేక
పోవుటయే
కాక,
నోటమాటకూడనూ
రాలేకపోయెను.
ఈ
లోపల
ధర్మజుడు
ఏవేవో
ప్రశ్నలు
వర్షమువలే
కురిపించుచున్నాడు.
పేరు
పేరునా
వారి
వారి
క్షేమములను
అడుగుచున్నాడు.
దేనికి
కూడనూ
సమాధానములేదు;
తల
పైకెత్తి
చూచుటలేదు.
"పోనీ
వాసుదేవుడు
ఏమి
చెప్పి
పంపెను?
అతనెట్లున్నాడు?"
అని
ఆతురతతో
ధర్మజుడు
ప్రశ్నించిన,
ప్రశ్నకు
అర్జునుడు
భరించుకోలేక
లోనున్న
దుఃఖము
పొంగిపొరలి
వచ్చుచూ
"అన్నా!
ఇంకా
వాసుదేవుడేనా?
మనమెంత
నిర్భాగ్యులము?
అతనిని
దక్కించుకోలేని
అభాగ్యులమయితిమి
కదా?"
అని
భోరున
యేడ్చెను.
ఇంతలో
సహదేవుడు
విషయమును
అర్థము
చేసికొని
ఆ
గది
ద్వారము
లన్నియు
బిగించి,
దుఃఖమున
కుమిలిపోవుచున్న
అన్న
చెంతకువచ్చి,
ఓదార్చ
మొదలుపెట్టెను.
వాసుదేవుడు
లోకమును
వీడెనను
విషయము
అందరికీ
తెలిసి
అందరూ
ఒకపరి
'హా'!
విధీ!
పాండవుల
నెంత
మోసము
చేసితివి?
లోకమునెంత
చిన్నచూపు
చూచితివి?
ఎన్ని
జన్మల
పాపఫలమో,
పాండవులు
నేటి
కిట్టివార్త
వినవలసి
వచ్చె"
నని
యెవరికి
వారు
విచారమున
కూలిపోయిరి.
"వినాశకాలే
విపరీత
బుద్ధిః"
కొంతసేపు
ఆ
గది
నిశ్శబ్దముతో
నిండిపోయెను.
ఇంతలో
ధర్మజుడు
కంటినీరు
తుడుచుకొనుచు
అర్జునుని
కేసి
చూచి,
"తమ్ముడా!
వసుదేవుడూ,
నందయశోదలూ,
మిగిలిన
యాదవులందరూ
ఇపుడు
యే
స్థితిలోనున్నారు?
వారు
మహా
దుఃఖమున
మునిగియుందురు.
ఒకరేమిటి?
ద్వారక
అంతయు
దుఃఖసముద్రములో
మునిగియుందును.
మన
స్థితియే
ఇట్లుండ,
ఇక
వారిస్థితి
వేరు
చెప్పవలయునా?
కృష్ణుని
వీడి
వారేరీతిగా
నుండగలరో!
పాపము"
అని
3
▾
Meaning
Keep
వుబికి
వచ్చు
దుఃఖమును
ఆపుకొనుచు,
కంటినీరు
కార్చుచు,
తనలో
తానేదియో
నిట్టూర్పులు
విడుచుచుండ
ధర్మజునిచూచి,
అర్జునుడు
"అన్నా!
ద్వారక
వాసులెంతయో
అదృష్టవంతులు!
అన్నింటా
దురదృష్టవంతులము
మనమే!
వాసుదేవుడు
లోకమును
విడిచిన
వార్తను
విని
జీవించగల
మొండి
జీవులు
ఒక్క
పాండవులు
మాత్రమే!
మిగతావారు
అట్టి
అశుభవార్త
వినక
పూర్వమే
లోకమును
వీడిరి"
అని
అర్జునుడు
చెప్పుచుండగనే
"హరి
హరీ!
యేమి
ఈ
ఘోరము?
అసలు
కథ
యేమో
అర్థమగుట
లేదు.
సముద్రము
ఏమైనను
వచ్చి
ద్వారకను
ముంచివేసినదా?
లేక
దుర్మారులగు
మరొక
రాజులేమైననూ
ద్వారకపై
బడి
అందరినీ
హతమార్చిరా?
అర్జునా!
ఏమి
జరిగినదో
విశదముగా
తెలిపి,
మా
దుఃఖమునకు
కొంత
ఉపశాంతి
చేకూర్చుము
నాయనా!"
అని
ధర్మజుడు
అర్జునుని
హస్తములు
పట్టుకొని
తల
నిమురుచూ
అడుగుకొనును.
అంత
అర్జునుడు
"అన్నా!
యే
సముద్రమూ
ఉప్పొంగి
ద్వారకను
ముంచలేదు.
యే
రాజులునూ
ద్వారకపై
యుద్ధమునకు
రాలేదు.
యాదవులలో
వారిలో
వారికి
దుష్టబుద్ధులు
చెలరేగినవి.
వినాశకాలమే
వారికి
విపరీత
బుద్ధులను
పుట్టించినది.
అభిమాన
మమకారములన్నవి
కూడనూ
వారిలో
శూన్యములై
ఒకరినొకరు
చంపుకొనిరి.
యాదవులందరు
హతమారిపోయిరి"
అని
అర్జునుడు
చెప్పగనే
"ఆ
బాల
వృద్ధులను
కూడను
బలి
యిచ్చినట్టి
బుద్ధులు
వారలలో
పుట్టుటకు
ఏదియో
బలవత్తరమైన
శక్తి
దీనికంతనూ
కారణరూపమును
ధరించి
యుండును,
అర్జునా"
అని
ధర్మజుడు
విషయమును
వినగోరి,
దుఃఖమును
మ్రింగి,
జరిగిన
వృత్తాంతమును
విశదముగా
తెలుపమనెను.
అంత
అర్జునుడు
కూడనూ
కొంత
దుఃఖమును
సరుదుకొని
జరిగిన
వృత్తాంతమంతయూ
తెలుప
మొదలుపెట్టెను.
సోదరులు
మువ్వురూ
చింతతో
చెంతచేరి
విషయమును
అతి
శ్రద్ధతో
వినదొడగిరి.
"అన్నా!
వాసుదేవుని
సంకల్పములేక
ఈ
వసుధలో
యే
చిన్న
కార్యము
కూడనూ
జరుగదను
విషయము
నాకు
నేటికి
సంపూర్ణముగా
తెలిసినది.
తానే
సూత్రధారుడై
ప్రేక్షకులతో
కూర్పొని
4
▾
Meaning
Keep
తాను
ఎవ్వరికినీ
తెలియనివానివలె,
దాగియుండును.
యే
పాత్రను
ఏవిధముగా
నటింపవలయునని
నిర్దేశించెనో
ఆ
విధముగ
ఆ
నటుడు
చేయక
తప్పదు
కదా?
ఈ
నాటకమునందలి
చిత్రవిచిత్రములు
ప్రేక్షకుల
హృదయములకు
మాత్రము
మార్పు
కలిగించునే
కానీ,
సూత్రధారునకట్టి
భేదము
లేమాత్రమునూ
కలుగవు
కదా?
ఎప్పుడు,
ఎవరి
చేత,
ఏమి
చేయించ,
చెప్పించ,
తలంచునో
అప్పుడు
వారికట్టి
బుద్ధి
పుట్టించును.
యాదవ
వంశ
నాశనం
దానికి
జన్మాంతర
కర్మకూడనూ
కొంతచేరక
తప్పదు.
కాకున్న
మనవారలైన
యాదవులందరూ
స్వాభావికముగ
దైవబ్రాహ్మణ
భక్తులనునది
మీకు
తెలిసిన
విషయమే,
అయితే
ఏనాడు
యే
మహనీయులయొక్క
శాపమో,
ఏనాడు
యాదవులు
యే
కర్మ
చేసిన
పాపమో
కానీ
ప్రభాసక్షేత్రమున
క్రతువును
చేయపోవుటయు,
ఆనందముగా
ఆ
ఏడు
దినములు
క్రతువు
నిరాటంకముగా
అతి
వైభవముగా
జరుపుటయు,
కడపటి
దినము
పూర్ణాహుతి
కూడనూ
కృష్ణునిసమక్షమున
సమాప్తి
గావించుటయూ,
ఆనాడు
మంగళస్నానములు
చేసి,
బ్రాహ్మణులందరు
యజ్ఞప్రసాదము
స్వీకరించి,
యాదవులందరికీ
పంచి
పెట్టుటయూ,
అన్నియూ
సక్రమముగా,
శాంతముగా,
ఆనందముగా
జరిగినవి.
తదుపరి
మధ్యాహ్నమున
బ్రాహ్మణ
సమారాధన
జరిగిన
తరువాత
ప్రసాదమును
యాదవులందరికీ
బంతులు
కూర్చొనబెట్టి
బ్రాహ్మణులు
వద్దనలు
జరుపుచుండగా,
"వినాశకాలే
విపరీత
బుద్ధిః"
ఈ
లోపల
కొందరు
వారుణిని
ద్రావి
మదోన్మత్తులై
తమ
వారనియు,
పరాయివారనియు
విచారించుకొనుశక్తి
శూన్యమై
పరస్పర
ఆక్షేపణలు
ప్రారంభమయినవి.
కడకు
అవి
బూతులు
తిట్టుకొనువరకూ
పెరిగెను.
పోట్లాట
ముదిరి
కడకు
పరస్పర
దెబ్బలాటలోనికి
దిగిరి.
ఒకరినొకరు
కొట్టుకొనుటకు
అతి
తీవ్రముగా
దిగిరి.
అన్నా!
నిజముగా
ఇది
అంతయూ
భగవత్
సంకల్పమని
చెప్పకతప్పదు.
కాకున్న,
ఎంతటి
5
▾
Meaning
Keep
అజ్ఞానులయిననూ
పొగరుపోతులయిననూ,
దుర్మార్గులయిననూ,
తమ
బిడ్డలను,
తమ
తల్లిదండ్రులను,
తమ
చేతులారా
తాము
వధింతురా!
చిత్రమేమో
కానీ,
తండ్రి
కొడుకును,
కొడుకును
తండ్రి,
అన్నను
తమ్ముడు,
తమ్ముని
అన్న,
అల్లండ్రను
మామలు,
బావలను
బావ
మరదులు
ఈ
రీతిగా
పరస్పరము
కొట్టుకొని
అందరునూ
చచ్చిరి.
అబ్బా!
ఆ
ఘోరము
చెప్పజాలను"
అని
అర్జునుడు
రెండు
చేతులతో
తలను
గట్టిగ
పట్టుకొని
గోడకు
ఒరిగి
కూర్చొనెను.
అంత
వినుచున్న
ధర్మజుడు
ఆవేదన,
ఆశ్చర్యదుఃఖములతో
విషయమును
పూర్తిగా
తెలుసుకొనగోరి
అర్జునుని
భుజములపై
చేతులు
వేసి
"తమ్ముడా!
ఏమి
ఈ
మాటలు!
నమ్ముటకు
వీలుకాని
విషయములుగా
యున్నవే?
ఎట్లు
విశ్వసించుట?
తమ్ముడా!
నీ
నోట
అసత్యమనునది
రాదు
కనుక,
నమ్మవలసి
వచ్చుచున్నది
కానీ,
లేకున్న
ఏమి
ఈ
వింత?
యాదవులయందున్న
పరస్పర
స్నేహము
మరొక
తెగయందు
నేను
చూచి
కానీ,
వినికానీ
యెరుగను.
అంతియే
కాక,
యాదవులు
కృష్ణుని
ఆజ్ఞను
జవదాటువారు
కారు.
ఎట్టి
ఉద్రేక
సమయమునందైననూ
కృష్ణుడు
చెప్పిన,
మారుమాటాడక
వూరుకుండెడివారు.
అట్టివారు
కృష్ణ
సమక్షమున
పరస్పర
తారతమ్యములేక
ఎట్లు
కొట్టుకొని
చచ్చిరో
నిజముగా
నీవు
చెప్పినటుల
ఇట్టి
బుద్ధులు
వినాశమునకే
పుట్టును.
దేవుని
ఆజ్ఞ
లేక
ఏది
జరుగదు
"పోనీ
అర్జునా!
పోట్లాడు
వారిని
వాసుదేవుడు
తగిన
బుద్ధులు
చెప్పి
తప్పించలేక
పోయెనా?
లేక
రాజీనైననూ
చేసి
యెక్కడి
వారల
నక్కడ
పంపలేక
పోయెనా?
అనుగ్రహ,
నిగ్రహములలో
అతడు
మహా
సమర్థుడు
కదా?
ఇది
నాకు
మరింత
ఆశ్చర్యముగ
నున్నది"
అని
ధర్మజుడు
గడ్డము
క్రింద
చేయి
వేసుకొని,
మోకాలిపై
మోచేయి
మోపి
విచారమున
తలవూపుచూ,
కన్నులయందు
నీరు
తిరుగుచుండుట
అర్జునుడుచూచి;
"మహారాజా!
మీకు
సర్వము
తెలిసియూ,
ఇట్లు
ప్రశ్నించిన
నేనేమని
తెలుప
గలవాడను?
మన
విషయమెంతో
యాదవుల
విషయము
కూడనూ
అంతియే!
మనమూ
కౌరవులూ
అన్నదమ్ములమే
కదా?"
6
▾
Meaning
Keep
మనకు
రెండు
వైపులా
అందరునూ
బంధువులే
అయి
వుండియు,
శ్యామ
సుందరుడు
మనకు
మధ్య
వుండియూ,
మహా
భారత
యుద్ధము
జరుగలేదా?
ఇందులో
మనమే
కొంత
యోచించి
చూచిన,
అతనికి
ఇష్టమే
లేకున్న
యుద్ధము
జరిగియుండెడిదా?
నలువది
లక్షల
సైన్యం
నాశనమయి
వుండెడిదా?
మనము
వారలనందరినీ
చంపి
ఈ
రాజ్యము
నేలవలెనని
తలంచితిమా?
"అతని
ఆజ్ఞ
లేక
యే
ఒక్కటియునూ
జరుగదు.
లేక
అతని
ఆజ్ఞను
ఉల్లంఘించి
పోవలెననున్నను,
అది
సాధ్యము
కాదు.
తాను
నేర్పిన
నటనను,
నీమించిన
కాలమును,
ఈ
ప్రకృతి
రంగమున
అతడు
చెప్పినట్లాడక
తప్పదు.
చేయక
తప్పదు.
జరుగక
తప్పదు
కదా?
ఇవి
మన
ఊహాభావములు
కానీ,
అన్నింటికీ
అతని
సంకల్పము
మూల
కారణములై
కార్యమును
జరిపించును"
అని
అర్జునుడు
ముగించగనే
ధర్మజుడు,
"అర్జునా!
భారత
యుద్ధమునకు
కారణము
లనేకములు
కలవు.
రాజ్యము
కొరకును,
మన
మన
అధికార
స్థానముల
కొరకునూ,
న్యాయ
బద్ధమైన
మార్గమున
అనేకవిధముల
రాయబారములు
జరిపితిమి.
ఎన్ని
విధములైన
పరాభవములనో
ఓర్చుకొంటిమి.
అడవుల
పాల్పడితిమి.
హతమార్చచూచిననూ,
అనుగ్రహపాత్రులమై
రక్షింపబడితిమి.
ద్రౌపదిని
అవమాన
పరచిరి.
లక్కగృహమునకు
అగ్గిపెట్టిరి,
విషాహారములు
తినిపించిరి.
ఇన్ని
విధములైన
కారణములతో
మన
హృదయములను
బ్రద్దలు
చేసి
ఉద్రేకవంతులుగా
జేసెను.
"అయితే
పోరాడుటకు
ముఖ్యమైన
కారణములు
కూడనూ
మూడు
మాత్రమే
కలవు.
ధనము,
ధరణి,
ధర్మపత్ని.
అట్టి
కారణములు
యేవియూ
లేకపోయినప్పటికీ
యాదవులు
పరస్పర
పోట్లాటతో
ప్రాణములు
వీడుట
విధివ్రాత
అని
మాత్రమే
చెప్పక
తప్పదు.
యాదవులు
సమృద్ధి
శీలురు.
ధన
ధాన్యములకు
వారికే
కొదువయూ
లేదు.
ఇక
ధర్మపత్నులా
మహా
సాధ్వీమణులు.
పతిఆజ్ఞ
మీరునట్టి
వారు
కారు.
కానీ
పరభావములకు
చోటిచ్చువారు
కానే
కారు.
అట్టియెడ
కొట్టుకొనునంతటి
కలహమేల
కలిగెనో"
అని
ధర్మజుడనెను.
7
▾
Meaning
Keep
అంతా
లీలానాటక
సూత్రధారియొక్క
బొమ్మలాట
అంత
అర్జునుడు:
"అన్నా!
బాహ్య
కారణములనుపట్టి
మనము
భావరాగములు
తీయుట
అదియూ
ఒక
అజ్ఞానమే!
ఇవన్నియూ
నిమిత్త
మాత్రములు.
కాలమాసన్నము
కాగానే
వీటిని
నిమిత్తము
చేసుకొని,
ప్రజలు
పోరాడుకొనుచుందురు,
కాలస్వరూపుడైన
భగవంతుడు
కాలుని
రూపమున
తానే
వచ్చి,
యేదో
ఒక
కారణమును
చూపి,
నాటకమును
సమాప్తి
చేయును.
పుట్టించుటకే
కారణమో!
చంపుటకూ
ఆ
కారణమునే
ఆధారము
చేసికొనును.
పుట్టుటకు
మనము
కారణములను
వెతుకుటలేదు
కదా?
అటులనే
చచ్చుటకు
కూడనూ
కారణము
అనవసరమే.
జీవుల
ద్వారా
జీవులను
పుట్టించుచున్నాడు.
తిరిగి
జీవులద్వారానే
జీవులను
చంపుచున్నాడు.
పుట్టునది
చచ్చునది
కాయములు
మాత్రమేనని
వాసుదేవు
డెన్నియో
పర్యాయములు
మనకు
బోధించలేదా?
మీకు
తెలిసియూ
తిరిగి
ఇట్టి
సందేహములకు
చోటిచ్చుట
చాలా
ఆశ్చర్యము.
పుట్టించిన
వాడే
చంపుట
ధర్మము
కాదని
కూడనూ
మీరు
తలంచవచ్చును.
అయితే
ఈ
రెండింటికీ
మధ్య
పుణ్యపాపఫల
బాధ్యత
కూడను
కొంత
దీనికి
తోడగును.
ఈ
కారణమును
పురస్కరించుకొని
భగవంతుడు
జననమరణములనబడు
బంతులతో
ఆటలాడును.
ఈ
జననమరణములనబడు
రెండు
పర్వతములకూ
మధ్య
జీవితమను
ప్రవాహము
కలదు.
దానిని
దాటుటకు
ఒక
ఆత్మశక్తి
అను
వంతెన
ఒకటి
నిర్మించెను.
దానిని
ఆధారము
చేసుకొని
ప్రయాణము
సలుపువారలకు
ఇట్టి
జీవనప్రవాహముతో
ఎట్టి
బాధ
ఉండదు.
ఆత్మశక్తిని
ఆధారము
చేసుకొని
వారలు
ప్రవాహములోపడి
కొట్టుకొనుచూ,
తట్టుకొనుచూ,
గట్టు
చేరుదురు.
రాజా!
ఇది
అంతయు
ఆ
లీలానాటక
సూత్రధారియైన
అతని
బొమ్మలాటయే,
ఇందులో
యాదవుల
దోషముకానీ,
అనాడు
కౌరవుల
దోషము
కానీ
యే
మాత్రమునూ
లేదు,
కాదు;
ఈ
పంచభౌతిక
పిండము
ఆ
ప్రభువు
ప్రేరణలేక
నేమియు
చేయజాలదు.
ఒకరివలన
ఒకరిని
పుట్టించి,
మరొకరి
ద్వారా
గిట్టించుచుండుట
అతని
వినోదము
కాకున్న,
పాములు
గ్రుడ్లను
పెట్టి,
8
▾
Meaning
Keep
పిల్లలు
చేసి
మరల
తమ
పిల్లలనే
తాము
తినుట
మనము
లోకమున
చూచుటలేదా?
అయితే,
కాలమాసన్నమైన
వాటినే
భక్షించుచున్నది.
కానీ
అన్నిటినీ
భక్షించుట
లేదు.
జలమునందు
సంచరించు
జీవులైన
చేపలు
కూడను
కాల
మాసన్నమైన
జాలరులచేత
పట్టుబడి,
ప్రాణములు
కోల్పోవుట
లేదా?
అంత
యేమిటికి?
చిన్న
చేపలను
పెద్ద
చేపలును,
పెద్ద
చేపలను
అంతకంటె
పెద్ద
చేపలునూ
మ్రింగుట
లేదా?
కప్పను
పాము,
పామును
నెమలియు
తినుట.
లోకమున
సామాన్య
దృష్టాంతములు
ఎన్నియో
కనిపించుచున్నవి.
వీటన్నిటికి
కారణములు
తెలుపుట
యెవరితరము?
నిజమును
విచారించిన
అంతయునూ
భగవంతుడైన
ఆ
గోపాలుని
సంకల్పమే!
అతని
లీలలను
మనము
తెలిసికొనలేకపోతిమి.
నేడు
చింతించి
ప్రయోజనమేమి?
అతను
మాయామానుష
విగ్రహుడై
మనలో
తిరుగుచూ,
కలుయుచూ,
తినుచూ
సామాన్య
బంధువువలె
సంబంధమును
కలిగి,
మనలను
అనేక
ఆవదలనుండి
కాపాడుచూ,
కరుణించుచూ,
కఠినసమస్యలను
అతి
తేలికగా
తీర్చుచున్నంత
కాలము,
అట్టివాని
అందదండలను
పొందియున్నామను
గర్వముతో
మెలగితిమే
కాని,
అతని
అనుగ్రహ
ప్రవాహమున
మునిగి
తేలక
పోతిమి
కదా?
అంత
ప్రేమతో
మనలను
ఆదరించిననూ
మనము
అర్థము
చేసుకొనలేని
వ్యర్థులమై
కేవలము
బాహ్యానుకూలములనే,
భౌతిక
వాంఛలనే
అతనిని
కోరితిమికాని,
నిజముగ
అతని
స్థితిని
విచారించక
పోతిమికదా?
పాండవులన్న
పంచప్రాణములుగా
చూచుచు,
పాండవుల
ప్రతి
చిన్న
కార్యమునకునూ
తానే
ముందునిలిచి,
కార్యదీక్షను
సాధించి
అందించెడివాడు.
అన్నా!
యేమందును?
ఎన్ని
జన్మ
లెత్తిననూ
మనకట్టి
ఆప్తబంధువు
దిక్కడు.
కన్న
తల్లికన్ననూ
లేని
కనికరము
ఆతనిలో
నేనెన్ని
పర్యాయములలో
అనుభవించితిని.
పాండవుల
చింతలను
అతని
చింతలుగా
భావించి,
వాటిని
తీర్చుటకు
తగిన
పన్నాగములను
నిమిషములో
పన్నెడువాడు.
ఈనాటి
వరకు
పాండవులు
ఈ
లోకమున
ఈ
రీతిగా
ఉన్నారన్న,
అతని
కరుణాభిక్షనే
కారణము.
9
▾
Meaning
Keep
వేయేటికి?
ఈ
కాయమునందలి
ప్రతి
రక్తపుబిందువూ
అతని
అనుగ్రహ
బిందువే!
ఈ
కండరములన్నియూ
అతని
ప్రేమ
ముద్దలే.
ఇందలి
యేముకలన్నియు
అతని
అనురాగపు
చెక్కలే!
ఈ
మర్మమును
తెలిసికొనలేక
అభిమాన
మమకార
అహంకార
స్వరూపులమై
నేను
సాధించితిని
అను
గర్వముతో
మెలగితిమి.
తానే
లేకుండిన
మనము
ఒట్టి
తోలు
తిత్తులమే
అనునది,
ఇపుడు
తెలియుచున్నది.
లోకమున
మానవులందరి
గతియూ
ఇంతియే
కాబోలు.
సర్వరక్షకుడైన
సర్వేశ్వరుడు
మనలను
సర్వ
విధములా
ఆడించుచున్నాడన్న
సత్యమును
మరచి,
తానే
అన్నిటికిని
కర్త,
భోక్తనని
తలంచు
నాబోటి
అజ్ఞానులు
ఈ
లోకమున
ఎందరో?
శూరులము,
వీరులము,
ధీరులము
అనుకున్న
మన
స్థితియే
ఇట్లుండ
ఇక
సామాన్యుల
స్థితిని
చెప్పనక్కరలేదు
కదా!
దీనికి
దారిలో
కలిగిన
అనుభూతియే
ప్రత్యక్షసాక్షి"
అని
కృష్ణుని
విరహమును
భరించలేక,
తలంచి,
తలంచి,
స్పృహతప్పిన
వానివలె
ప్రక్కనున్న
ఆసనమునకు
ఒరగి
కూర్చొనెను.
Previous
←
The Conclusion of Śrī Kṛṣṇa's Avatāra
Next
The Pāṇḍavas at Fault, Out of Grief
→