Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Pāṇḍavas at Fault, Out of Grief
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11.
శోక
తప్పులైన
పాండవులు
ఎంతో
దీర్ఘాలోచనలో
మునిగి
కృష్ణుడు
తమకు
చేసిన
పనులు,
సహాయములు,
చూపిన
దయా
ప్రేమలను
తలంచుచూ,
చింతిల్లుచున్న
ధర్మజుడు
దిగ్గున
తలయెత్తి
"అర్జునా!
యేమంటివి?
దారిలో
నీకు
జరిగిన
ప్రమాదమేమి?
విశదముగా
తెలుపుము,
తమ్ముడూ"
అని
గడ్డము
పట్టుకొని
ఆప్యాయముగా
అడుగుచున్న
ధర్మజుని
చూచి,
అర్జునుడు
"అన్నా!
నా
పురుషార్థమంతయునూ
ఆ
కృష్ణుని
తోడనే
వెళ్ళినది.
నేను
ఇప్పుడు
బలహీనుడను,
అబలకన్ననూ
అబలుడను,
నిర్జీవిని"
అన్నాడు.
"నందనందనుని
ఆజ్ఞను
మీర
కూడదు"
"ఈ
నిర్భాగ్యుడగు
అర్జునుడు
ద్వారకయందుండియును,
భగవానుడు
స్వధామమునకు
పోయెడి
సమయమున
ఆ
వాసుదేవుని
చెంత
ఉండెడి
భాగ్యమునకు
నోచుకోలేక
పోతిని.
ఆ
తండ్రిని
చూడలేక
పోతిని.
కడకు,
కృష్ణ
సారథియగు
దారకుడు
భగవానుని
సందేశమును
అందించెను.
అందులో
ఈ
రీతిగా,
తానే
స్వయముగా
వ్రాసిపంపెను"
అని
తన
ప్రాణముకంటే
భద్రముగా
దాచియుంచిన
కృష్ణహస్తాక్షరముల
లేఖను
మొలనుండి
తీసి
ధర్మజుని
చేతికందించెను.
ధర్మజుడు
అతి
ఆతురతతో
ఆ
లేఖను
రెండు
చేతులతో
అందుకొని,
కన్నుల
కద్దుకొని
బాష్పములను
రాల్పుచు,
నీటితో
నిండిన
2
▾
Meaning
Keep
నేత్రములతో
ఆ
లేఖను
చదువుటకు
ప్రయత్నించెను.
కొంత
సేపటివరకు
దానిని
చదువలేకపోయెను.
ప్రారంభమందే
"బావా!
అర్జునా!
ఇది
నా
ఆజ్ఞ.
మారు
మాటాడక
శిరసావహింపవలెను.
ధైర్యముతో
ఈ
కార్యమును
సాధించవలెను"
అని
భద్రమైనమాటలను
లిఖించి,
తదుపరి
ఈ
క్రింద
రీతిగా
విషయమును
విపులపరచెను.
ఏమన,
"నేను
వచ్చిన
కార్యము
నెరవేర్చితిని.
నేను
ఇక
ఈ
లోకమున
కాయరూపమున
నుండను.
స్వధామమునకు
పోవుచున్నాను.
నేటికి
యేడవ
దినమున
ద్వారకా
పట్టణమంతయూ
సముద్రమున
మునిగి
పోవుచున్నది.
నేను
నివసించుచుండిన
భవనములు
తప్ప
మిగిలిన
భాగమునంతయు
సముద్రుడు
తనలో
కలుపుకొనుచున్నాడు.
కావున
నీవు
రాణులను
మిగిలిన
ద్వారకయందలి
స్త్రీలను,
పిల్లలను,
పాపలను,
వృద్ధులను
మొదలగువారలనందరినీ
తీసుకొని,
ఇంద్రప్రస్థమునకు
పోవలెను.
నేను
సమస్త
యాదవవంశములోని
స్త్రీలయొక్కయు,
పిల్లలయొక్కయు
భారము
నీపైనుంచి
వెళ్ళుచున్నాను.
వీరలను
ప్రాణసమానముగా
కాపాడి
ఇంద్రప్రస్థమున
వీరలకు
తగిన
వసతులు
కలిపించి
కాపాడుము.
ఇట్లు,
స్వధామమునకు
వెళ్ళుచున్న
గోపాలుడు"
అని
చదివి
ధర్మజుడు
కమ్మను
ముగించెను.
పై
విషయములన్నియూ
వినుచున్న
భీమార్జునుల
నకులసహదేవాదులు
కంటిధారలు
కార్చుచూ
కాయములనే
మరచి
బండవలె
నేలకూలిరి.
అంత
అర్జునుడు,
"అన్నా!
ఆ
భగవంతుడులేక
ఒక్క
నిమిషమైననూ
ఈ
లోకమున
నుండనా
కిష్టములేక,
సముద్రమందు
దుమికి
ప్రాణమును
తీసుకొనవలెనని
తలంచితిని;
లేదా
ఈ
గాండీవముతోనైననూ
తల
బద్దలు
కొట్టుకొన
తలంచితిని,
అయితే,
అతనిచ్చిన
ఆజ్ఞ
నన్నారీతిగా
చేసుకొననివ్వకపోయెను.
ఆ
నందనందనుని
ఆజ్ఞను
మీరకూడదను
స్థిర
సంకల్పము
నన్నీ
లోకమున
నిలబెట్టెను.
మిగిలిన
ఆలోచనలకు
చోటిచ్చుటకు
నాకు
తగిన
కాలము
లేనందున,
గతించిన
వారలందరికినీ
శాస్త్రోక్తముగ
పితృకార్యములు,
శ్రాద్ధ
తర్పణాదులు
గావించి
అతి
3
▾
Meaning
Keep
త్వరలో
ద్వారకను
వీడవలెనను
తీవ్రతతో,
ద్వారకలోని
స్త్రీలను,
పిల్లలను,
పనివారలను
ప్రయాణములు
గావించి
బయలుదేరి
ద్వారక
వదలలేక,
వదలలేక
వదిలితిని.
వారందరి
బాధ్యతలు
వీపుపై
వేసుకొని
కృష్ణ
యెడబాటును
భరించుకొని
ఆజ్ఞను
శిరస్సున
ధరించి,
ఎట్లో
పంచనది
(పంజాబు)
సమీపమునకు
ప్రవేశించితిమి.
అప్పటికి
సూర్యుడు
అస్తమించుచుండెను.
ప్రక్కన
ఒక
నది
మహావేగముగ
ప్రవహించు
చుండుటచే,
ఆ
రాత్రికి
ఆ
నదీ
తీరముననే
విశ్రమించదలచి
తెచ్చిన
ధనాభరణములను
ఒకచోట
భద్రపరచి,
రాణులందరినీ
పల్లకీలనుండి
దింపి,
కాలకృత్యములు
తీర్చుకొనుటకు
పనివారలు
ఎక్కడి
వారక్కడికి
వెళ్ళిరి.
నేను
బరువైన
కృష్ణ
వియోగభారంతో
సంధ్యావందనము
నిమిత్తము
నదీజలము
చెంతకు
వెళ్ళితిని.
ఇంతలో
చిమ్మచీకట్లు
క్రమ్మెను.
ఎక్కడినుండియో
భయంకరమైన
కేకలు
వినుపించెను.
తలయెత్తి
చూతును
కదా!
అనేకమంది
ఆటవిక
జాతి
గొల్లలు
తుంట
కఱ్ఱలు,
ఈటెలు,
బాకులు
తీసుకొని
మా
గుంపులపై
బడిరి.
అర్జునుడు
యాదవ
స్త్రీలను
రక్షించలేకపోవుట
ధనరాసులు
దోచుకొనిరి.
స్త్రీలను
బాధించుటకు
మొదలుపెట్టిరి,
ఇంతలో
నేను
"ఓరీ
దుష్టులారా!
పతంగములు
తెలిసి
తెలిసి
అగ్నిలోబడి
ప్రాణములు
వీడునట్లు,
చేప
ఎఱనాశించి
గాలమున
తగులుకొన్నట్లు,
ధనలోభముచే
మీ
ప్రాణము
లేల
పోగొట్టుకొందురు.
అసలు
నా
పేరు
మీరు
వినియే
యుందురు.
మహాభారత
యుద్ధమున
ద్రోణ,
భీష్మ,
కర్ణాది
త్రైలోక్య
విజయులను
జయించిన
పాండునందనుడైన
అర్జునుడను.
ఈ
గాండీవముచే
మిమ్ములను
నిమిషమున
యమలోకమున
కంపెదను.
ఇకనైననూ
వాపసు
వెళ్ళుడు,
లేదా
మీకు
అంత్యకాలము
తప్పదు!"
అని
చెప్పితిని.
అంత
వారిలో
యేమాత్రపు
భయాందోళనలు
కనిపించలేదు.
మరింత
తీవ్రచర్యలకు
పూనుకొని
గుంపును
నానాహింసలు
పెట్టి
కడకు
నా…కూడనూ
4
▾
Meaning
Keep
పడుటకు
సిద్ధమైరి.
అప్పుడు
నేను
దివ్యాస్త్రమునుబట్టి
వారల
జంపదలచితిని,
కానీ
ఏమి
చిత్రమో
ఏమో
కానీ,
ఎంత
ప్రయత్నించిననూ
ఒక్క
మంత్రమైననూ
జ్ఞాపకమునకు
రాలేదు.
సంహార
ఉపసంహారముల
విధినే
మరచితిని.
దొంగలు
నేను
చూచుచుండగనే
కృష్ణ
పత్నులను
దాసీలనూ
పట్టుకొని
పోవు
చుండిరి.
బాధింపబడు
స్త్రీలు
నా
పేరును
చెప్పుచూ,
"మమ్ములను
కాపాడుము,
విడిపించు
కొనుము.
అర్జునా!
అర్జునా!
కడకు
మమ్మిట్లు
దుష్టుల
పాలు
చేయుచున్నావా?
ఇట్లు
చేయుదువని
తెలిసియుండిన
ద్వారకతోపాటు
సముద్రమందైననూ
సంతోషముగా
లీనమై
వుందుము
గదా!"
అనుచు
అరచుచు
తప్పించుకొని
అటు
యిటు
పరిగెత్తు
స్త్రీలను,
బాలురను,
హాహాకారములు
చేయుచున్న
వారలను
చూచుచూ,
వినుచూ
దంతములు,
గోళ్ళు
పెరికి
వేసిన
సింహమువలె
బుసకొట్టుచున్నానే
కాని,
యే
చర్యకూడనూ
తీసికొనలేని
నిశ్శక్తుడనైతిని.
ధనుస్సునకు
నారిని
తగిలించలేక
పోతిని.
తిరిగీ
బాణములు
పట్టి
వారలతో
పోరాడితిని.
ఇంతలో
నా
చెంతనున్న
బాణములన్నియును
సమాప్తి
అయిపోయినవి.
నా
హృదయము
మండిపోవుచుండెను.
'కృష్ణుడు
లేని
లోకం
నరకమే'
నాపై
నాకే
అసహ్యము
పుట్టెను.
నీర్జీవుడనైతిని.
చేసిన
ప్రయత్నములన్నియూ
నిష్ఫలమయి
పోయెను.
నా
అక్షయతూణీరము
వాసుదేవునితోనే
పోయినదని
నాకు
తెలిసెను.
లేకున్న
ఆటవిక
గొల్లలు
అంతఃపుర
స్త్రీలను
ఈడ్చుకొని
పోవుచుండగా
తప్పించలేని
దౌర్భాగ్యుడనైతినన్న,
నా
బలమంతయూ
కృష్ణ
భగవానునితోనే
పోయిన
దనుటకు
వేరు
నిదర్శనమక్కర
లేదు
గదా!
కృష్ణ
వియోగమొకవైపున
మండిపోవుచుండగా
అతని
ఆజ్ఞ
ప్రకారము
స్త్రీలను
ఇంద్రప్రస్థమునకు
చేర్చలేని
బాధ
మరొక
వైపు
అగ్నికి
గాలివలె
తోడయినది,
ఇంతటితో
పోక,
ద్వారకాపురిలో
సువర్ణ
సౌధాంతరములందు
నివసించుచూ,
వివిధ
దివ్యభోగము
లనుభవించుచుండిన
వాసుదేవుని
రాణులు
5
▾
Meaning
Keep
సుకుమారులు.
ఆ
ఆటవిక
గొల్లలచే
ఎన్ని
బాధ
లనుభవించుచున్నారో
అనుసరి
అగ్నిలోని
కఱ్ఱలవలె
నా
హృదయము
మరింత
మండి
భస్మమగుచున్నది.
"అబ్బా
కృష్ణా!
ఈ
రీతిగ
మమ్ములను
బలిచేయుటకన్న
నీతోపాటు
మమ్ములను
కూడను
స్వధామమునకు
గొనిపోకూడదా!
అన్ని
భయంకర
బాధలనుండి
రక్షించి,
కడకిట్టి
కఠినశిక్ష
విధించితివా?"
అని
తల
చేత
కొట్టుకొనుచు
అర్జునుడు
చేయుచున్న
రోదనచే
ఆగది
అంతయు
అదిరి
పడుచుండెను.
రాతిగుండెవంటి
భీముని
గుండె
కూడను
కరగి
ప్రవహించెను.
సలసలకాగు
వేడినీరు
కన్నుల
నుండి
ప్రవాహమువలె
ధారలు
ధారలు
పొగలు
గ్రక్కుచూ
కార
దొడగెను.
అదిచూచి
ధర్మజుడు
భయపడి
యేమగునో
ఏమో
అని
భీముని
చెంతకు
వెళ్ళి
ఓదార్చు
మాటలు
ఉపదేశ
రూపముతో
బోధించెను.
అంత
కొంత
సేపటికి
భీముడు
స్పృహకు
వచ్చి
అన్నకు
నమస్కరించి,
"అన్నా!
నా
కిక
ఈ
బ్రతుకు
అవసరము
లేదు;
అనుజ్ఞ
ఇచ్చిన
అడవికి
వెళ్ళి
చితిని
పేర్చుకొని
కృష్ణ
నామమును
స్మరించుచు,
అందులో
ఈ
కాయమును
భస్మము
చేసి
స్వధామములోనున్న
కృష్ణుని
చేరుకొందును.
సెలవిమ్ము.
కృష్ణుడులేని
ఈ
లోకము
నాకు
నరకముగనే
తోచుచున్నది"
అనుచూ
అంగ
వస్త్రముచే
ఆ
వేడి
కన్నీటిని
తుడుచు
కొనుచుండెను.
ఇంత
కాలము
మౌనము
ధరించి
యుండిన
సహదేవుడు
భీముని
చెంతకు
వచ్చి,
"అన్నా!
తొందరపడకుము,
ఆనాడు
వాసుదేవుడు
ధృతరాష్ట్ర
మహీపతి
చెంతకు
సంధికై
వెడలిన
సమయమున
ధృతరాష్ట్ర
పుత్రుడు
సభలో
అడిగిన
ప్రశ్నకు
వాసుదేవుడేమని
సమాధాన
మిచ్చెనో
మీరు
మరచియుందురు
కాబోలు.
Previous
←
The Sūtradhāri of the Līlā Drama
Next
The Advent of the Kali Age
→