Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Advent of the Kali Age
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
12.
కలియుగావతరణ
"మాలో
మాకు
చెలరేగిన
ఈ
కుటుంబ
కలహములలో
నీవేల
ప్రవేశింతువు
కృష్ణా?
పాండవులు
నీకెంత
బంధువులో
కౌరవులు
కూడను
అంతియే
కదా?
ఇపుడు
పాండవ
పక్షమున
నీవీ
అధికారపట్టము
గట్టుకొని
తిరుగుటకు
ప్రత్యేక
కారణమేమని"
ధృతరాష్ట్ర
సభలో
దుర్యోధన,
దుశ్శాసనాదులు
ప్రశ్నించగా,
ఆనాడు
కృష్ణుడేమనెనో
ఒకపరి
జ్ఞాపకము
చేసికొనుడు"
అన్నాడు
సహదేవుడు.
సింహము
పిల్లవలే
చిటపటనడచుచూ
"దుర్యోధనా!
ఏమంటివి?
పాండవులంతటివారా
కౌరవులు?
ఏనాటికి
కూడనూ
కారు!
వారికినీ
నాకు
గల
సంబంధము
చెప్పెదను,
వినుము.
ఈ
దేహమునకు
ప్రధానమైన
శిరస్సువంటి
వాడు
ధర్మజుడు;
భుజమువంటివాడు
అర్జునుడు;
ఉదరమువంటివాడు
భీముడు;
రెండు
పాదములవంటివారు
నకులసహదేవులు,
ఇట్టి
దేహములోని
హృదయమే
ఈ
కృష్ణుడు!
తెలిసినదా?
"హృదయము
లేకున్న
అంగములు
నిర్జీవములు"
హృదయమునుపట్టి
అంగములు
వాటివాటి
పనిచేయునే
కానీ
హృదయము
లేకున్న
అంగములు
నిర్జీవములు"
అని
పరమాత్ముడు
గర్జించెను.
దానిని
స్మరించిన,
హృదయము
పోయినది
కనుక
ఇంక
కొంతసేపటిలో
ఈ
అంగములైన
పాండవులు
కూడనూ
నిర్జీవులై
శిథిలము
కాగలరు.
కాన
మన
2
▾
Meaning
Keep
అందరికినీ
అంత్యకాలము
సమీపించుచున్నది.
కాలస్వరూపుడు
భగవంతుడు,
మనలను
కూడనూ
తనలో
లీనము
చేసికొనుటకు
ఉత్సహించుచున్నాడు.
మనము
సర్వసిద్ధమయి
అతని
పిలుపునకు
ఎదురు
నిలిచియుండక
తప్పదు.
కలి
ప్రవేశించిన
దనుటకు
ఇంతకంటెను
వేరు
నిదర్శనమక్కరలేదు.
కృష్ణుడేనాడు
లోకమును
వీడెనో,
ఆనాటితో
ద్వాపర
ద్వారములు
మూయబడినవి,
కలి
ద్వారములు
తెరువబడినవి.
లేకున్న
ఈ
దుష్టశక్తులు,
దుష్ట
బుద్ధులు
విచ్చలవిడిగా
సంచరించగలవా?
అతి
తీవ్రముగా
పోరాటము
జరుగ
సమయమందు
సహజముగా
మంత్రమును
మరువలేని
అర్జునుడు,
ఆపత్కాలములలో,
అతిముఖ్యమైన
మంత్రము
మరుపునకు
వచ్చుట
మహామాయయైన
కలిమహాత్మ్యమే!
ఇంతలో
నకులుడు
చేరి
"అన్నలారా!
వేకువ
జాము
కావచ్చుచున్నది.
వేగముగ
ఈ
వార్త
అంతఃపుర
రాణులకును,
పూజ్యురాలైన
మాతృదేవికినీ
తెలిపి,
ముందు
మనము
చేయవలసిన
ప్రయత్నములకు
సరియైన
మార్గమును
నిర్ణయింతము.
ప్రాణము
పోయిన
వెంటనే
దేహము
శిథిలము
కాదుగదా!
అటులనే
మా
ప్రాణసమానమైన
కృష్ణుడు
స్వధామమునకు
వెళ్ళినతక్షణమే
దేహాంగములైన
పాండు
నందనులు
నిర్జీవులయిరి.
అవి
శిథిలమగుటకు
స్వల్ప
కాలమవసరము.
మనము
కూడనూ
ఆ
వాసుదేవుని
సన్నిధికి
నేడో,
రేపో
వెళ్ళువారలమే.
కనుక,
పూరికే
చింతించక,
మన
మార్గమునకు
తగిన
భద్రతను
చూచుకొందుము,
లెండు"
అని
తీవ్రవైరాగ్యముతో
నకులుడు
తెలిపిన
సలహాలకు
అందరు
ఏకీభవించిరి.
ఈ
వార్త
అంతఃపురమున
తెలిపిన
ద్రౌపది,
సుభద్ర,
వృద్ధురాలైన
మాతృదేవి
ఏమి
కాగలరో
అని
ఒకింత
యోచించిరి.
ఏమైననూ
సరియే
కృష్ణుడే
పోయినపుడు
వీరు
మాత్రముండి
ప్రయోజనమేమి?
అని
అందరు
స్థిరము
చేసుకొని,
తల్లి
దగ్గరికి
పెద్దకుమారుడగు
ధర్మజుడు
వెళ్ళి
చెప్పుట
మంచిదని
నిర్ణయించు
కొనిరి.
3
▾
Meaning
Keep
సుఖసమయము
నిమిషములో
గడచిపోవును.
అయితే;
దుఃఖసమయము
ఎంతకును
గడువదు.
ఇది
పర్వతములవలే
అగమ్యముగను,
ప్రళయముగను
అతిశయించును.
ధర్మజుని
రాజధాని
ఇంద్రప్రస్థమే
అయిననూ,
మహాభారత
యుద్ధమున
పెద్దలందరూ
పోవుటచే
సింహాసనమును
హస్తినాపురమందే
నిలిపెను.
కొన్ని
దినములు
ఇంద్రప్రస్థమందును,
మరికొన్ని
దినములు
హస్తినాపురమందును,
ఈ
రీతిగా
ధర్మజుడు
కాలమును
గడుపుచుండెడివాడు.
ఈ
విషయము
తెలియని
అర్జునుడు
మిగిలిన
ద్వారక
స్త్రీలను
తీసికొని
ఇంద్రప్రస్థమునకు
వచ్చి
అక్కడ
ధర్మజుడు
లేడని
తెలిసికొని,
తెచ్చిన
పనివారలను,
మిగిలిన
యదువంశ
స్త్రీలను
ఇంద్రప్రస్థమందే
దింపి,
తానొక్కడు
మాత్రము
హస్తినాపురమునకు
వచ్చెను.
అయితే
యాదవులలో
మిగిలిన
పురుషుడు
ఏకైక
కృష్ణ
పౌత్రుడైన
వజ్రుడు,
అతనిని
అర్జునుడు
వెంట
బెట్టుకొని
వచ్చెను.
వజ్రుని
స్థితి
యెటులున్నదన
ఆటవిక
గొల్లలను
ఓడించలేక
అబలలను
రక్షించుకో
లేక
పోతిమికదా
అని
చింతయు
జరిగిన
సంఘటనల
బాధయు
అతనికి
మానసిక
గ్లాని
సంభవించి
ఎవ్వరికినీ
తన
ముఖమును
చూపుటకు
ఇష్టము
లేక
చీకటి
గదులయందు
నివసించ
జొచ్చెను.
కృష్ణ
నిర్యాణ
వార్తతో
కుంతి
అసువులు
బాసెను
కుంతీదేవి,
ఆ
రాత్రియే
అర్జునుడు
ద్వారకనుండియు
హస్తినాపురము
వచ్చెనని,
ఒక
దాసీ
ద్వారా
విని,
యే
నిమిషమున
తన
కొమారుడైన
అర్జునుడు
వచ్చి,
ద్వారక
వార్తలు
తెలిపి
తన్నానందపరచునో
అను
ఉద్దేశముతో
దీపములు
ఆర్పక,
నిద్రపోక,
యే
చిన్న
శబ్దమైననూ
అర్జునుడు
వచ్చెనేమో
అను
భ్రాంతితో,
"నాయనా!
అర్జునా!"
అని
పిలిచెడిది.
ఎవ్వరూ
సమాధానమియ్యకున్న
తన
దాసిపేరు
పెట్టి
పిలిచుచు,
"ఏదే!
అర్జునుడు
ద్వారకనుండి
వచ్చెనని
తెలిపితివి
కదా!
ఇంతసేపయిననూ
ఇంకనూ
నన్ను
చూచుటకు
రాలేదే?
ఎవరినైనను
చూచి
నీవు
అర్జునుడని
తలంచితివి
కాబోలు.
నిజముగా
అర్జునుడే
వచ్చియుండిన
4
▾
Meaning
Keep
ఇంతసేపు
నా
చెంతకు
రాకుండునా?
అని
ఈ
విధమైన
ఆతురతతో
ఆనాటి
ర…
అంతయూ
కుంతీదేవి
కూడనూ
జాగరణ
చేసినది.
తెల్లవారుచున్నది.
ఎక్కడివారక్కడ
వారివారి
పనులలో
పాల్గొనుచున్నా…
ఇంతలో
కుంతీదేవి
మనసు
మార్పు
కలిగినది.
రాత్రి
అర్జునుడు
వచ్చిన
నిజమైయుండిన
నా
దగ్గరికి
రాకపోవుటకు
కారణమేమై
యుండును?
లే…
పరిపాలనలో
అవసరమైన
విషయము
లేవైననూ
వుండిన
సోదరులందరుచే
మాట్లాడుచూ
కాలము
అధికమగుటచే
ప్రయాణపు
బడలికతో
పరుండి
తెల్లవారి
తల్లిని
చూడవచ్చునని
తలంచెనా?
లేక
ద్వారకలో
యేమైననూ
ప్రమాదము
జరిగియుండి
దానికై
వాసుదేవుడు
అవసర
కార్యముల
నిమిత్తమై
అన్నతో
మాట్లాడ
రమ్మని
పంపినందున
ఆ
పనియందు
మరచెనా?
అని
అనేక
విధముల
ఊహలలో
మునిగి,
ఒకవేళ
తెల్లవారగనే
రావచ్చునని
తలంచి,
చీకటి
తీరక
మునుపే
లేచి
స్నానాదికర్మలను
పూర్తి
చేసుకొని,
అర్జునుని
రాకకై
నిరీక్షించుచుండెను.
ఇంతలో
మరొక
తలంపు
నూతనముగా
ఆ
కుంతీకి
సోకెను.
ఏమన,
రాత్రులందు
పరుండుటకు
వెళ్ళు
సమయమున
తన
కొమారులందరునూ
ఒకరి
తరువాత
ఒకరు
వచ్చి
తల్లి
పాదములకు
నమస్కరించి,
ఆజ్ఞ
తీసికొని
పరుండుటకు
వెళ్ళెడివారు.
ఆనాడు
ఐదు
మందిలో
ఒకరైననూ
రాలేదే
అని
మరింత
కలత
అధికమాయెను.
తదుపరి
ద్రౌపదీ
బసకు,
సుభద్ర
బసకూ
దాసీలతో
చెప్పి
పంపగా,
అన్నదమ్ములలో
ఎవ్వరునూ
రాత్రి
భోజనమునకు
కూడనూ
రాలేదని
వర్తమానము
వచ్చెను.
కుంతీదేవి
హృదయము
మరింత
కృంగెను.
ఈ
విధమైన
తలంపులతో
యోచించుచుండగా,
అర్జున
సమేతుడై
ధర్మజుడు
వేంచేయుచున్నాడని
ఒక
వృద్ధదాసి
వచ్చి
కుంతీదేవికి
తెలిపెను.
కుంతీదేవి
యే
వార్త
తెలుపుదురో
ఏమో
అను
భయము
ఒక
ప్రక్కను,
ఎంత
కాలమునకు
నా
కొమారుని
చూచుచున్నానను
ఆనందము
మరొక
ప్రక్కను,
అన్నియూ
ఏకమై
ఏదో
ఒక
భయాందోళనతో
కంపించునటుల
కనిపించుచుండెను.
5
▾
Meaning
Keep
ఇంతలో
ధర్మజుడు
వచ్చి
తల్లికి
నమస్కరించి
నిలుచొనెను.
అర్జునుడు
తల్లి
పాదములపైబడి
కొంతసేపటి
వరకూ
లేవకుండుటచూచి
కుంతి
"నాయనా!
ఇంతకాలము
నన్ను
వదలి
యెట్లుంటివిరా?"
అనుచూ
అర్జునుని
శిరస్సును
ముద్దాడి
ఆశీర్వాదమైననూ
తెలుపక
పూర్వమే,
కుశల
ప్రశ్నలు
వేయక
పూర్వమే,
"నాయనా!
నీవు
నిన్న
రాత్రియే
వచ్చితివని
వింటిని.
ఇది
నిజమేనా?
నిజమే
అయివుండిన
రాత్రియే
నా
వద్దకేల
రాలేదు?
కుమారుడు
దీర్ఘకాలమునకు
వచ్చెనని
తెలిసిన
తల్లి
చూడక
ఎట్లుండగలదు?
పోనీ
ఇప్పుడైనను
పెందలాడే
వచ్చితివి.
చాలా
సంతోషము.
ద్వారకయందు
మీ
అత్తలూ,
మామలు,
తాతలు
అందరూ
క్షేమమే
కదా?
మా
అన్న
వసుదేవుడు
చాల
వృద్ధుడయి
వుండును.
తిరుగాడు
చున్నాడా?
లేక
నావలె
మంచముపైననే
అన్ని
పనులునూ
చేయించుకొనుచున్నాడా?"
అని
అర్జునుని
చేతులు
పట్టుకొని,
మోమును
చూచుచు
"ఇదేమి
నాయనా!
ఇంత
నల్లబడినావేమిటి?
కన్నులు
ఉబ్బినవెందుకు?
ద్వారక
ఏమి
దగ్గరనా?
దారులు
దుమ్ముదారులు,
అడవి
దారులు.
ప్రయాణపు
బడలిక
అధికముగా
నుందును.
పోనీ!
కానీ
మన
శ్యామసుందరుడు
నాకేమి
చెప్పి
పంపెను?
ఎప్పుడొస్తాడట?
నన్ను
చూడవలెనని
ఆశ
లేదటనా?
అతనికేమి?
వాసుదేవుడు!
అక్కడి
నుండియే
అందరిని
చూడగలడు.
చూడవలెనను
ఆశా
పాశములు
మనబోటి
వారికే
కదా!
నేను
తిరిగీ
ఎపుడు
చూతునో!
అతను
వచ్చునంత
వరకు
ఈ
పండు
దేహము
ఉందునో!
ఊడునో!"
అని
ప్రశ్నలు,
జవాబులు
అన్నియు
తానే
చెప్పుకొనుచూ,
అర్జునుడు
కానీ,
ధర్మజుడు
కానీ
మాట్లాడుటకు
వ్యవధి
ఇవ్వక
మాట్లాడు
చుండును.
అర్జునుని
నేత్రములనుండి
నీరు
అప్రయత్నముగా,
అడ్డులేక
ప్రవహించుచుండెను.
ఈ
విచిత్రమును
చూచిన
కుంతీదేవి
మరింత
దగ్గరకు
తీసికొని,
తన
భుజముపై
అర్జునుని
శిరస్సును
వుంచుకొని,
"నాయనా!
ఏమి
జరిగినది
తండ్రీ!
నీవు
కంటినీరు
నింపుట
నేనేనాడునూ
చూచి
ఎరుగనే!
అబ్బా!
నీవు
కంటినీరు
పెట్టునంతటి
ఘోరము
ఏమి
జరిగినదో
తెలుపుము.
గోపాలుడేమైననూ
6
▾
Meaning
Keep
మందలించి
నా
దగ్గర
వుండుటకు
వీలు
లేదని
పొమ్మన్నాడా?
లేక
మరేమైన
ఆపదలు
జరిగెనా?
అని
ఆమె
విషయ
విచారణలో
మునిగి
ఓదార్చుచుండగా,
ధర్మజుడు
రెండు
చేతులు
మొఖమునకు
అద్దము
పెట్టుకొని,
"అమ్మా!
ఇంకా
మన
వాసుదేవుడేనా?
మనలను
ఎడబాసి
నేటికి
పది
దినములు
కావచ్చుచున్నది.
స్వధామమునకు
వెళ్ళెనట!
యాదవులందరు
మరణించిరట!"
అనుచుండగనే
కుంతీదేవి
కన్నులు
విడచి
ఏమీ?
నా
గోపాలుడు...
నా
నందనందనుడు
...
నా
హృదయ
ధనము
ఈ
లోకమును
విధవగా
చేసినాడా?
హా!
కృష్ణా!
అనుచు
అతను
ఎక్కడ
పోయెనో
వెతుకుకొని
వత్తునన్నట్లు
ఆ
క్షణములో
కుంతీ
అసువులు
బాసెను.
Previous
←
The Pāṇḍavas at Fault, Out of Grief
Next
The Coronation of Parīkṣit
→