Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Coronation of Parīkṣit
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పరీక్షిత్తునకు
పట్టాభిషేకము
కుంతీదేవి
కూడనూ
శ్యామసుందరుని
పథము
ననుగమించెను.
ఇక
అక్కడ
మిగిలినది
కుంతీదేవి
నిర్జీవశరీరము!
తల్లి
ప్రాణము
వీడుట,
చెంతనున్న
అర్జునుడు
కనిపెట్టి
"అన్నా!
ఏమి
ఈ
చిత్రము?
మాతృదేవిని
కూడనూ
కోల్పోతిమే?"
అని
భోరున
ఏడ్వసాగెను.
నిలుచున్న
ధర్మజుడు
ఉలిక్కిపడినట్లు,
"ఏమీ?"
అని
దగ్గఱకు
వచ్చి
తల్లి
మోమునుచూచి
స్తంభించిపోయెను.
అర్జునుని
మాటలు
బైటద్వారములదగ్గర
వేచియుండిన
దాసీలు
విని,
ఒకపరి
లోనికి
తొంగిచూసిరి.
కుంతీదేవి
దేహము
నేల
కూలినది.
అర్జునుడు
తల్లి
తలను
ఒడిలో
పెట్టుకొని,
ముఖమును
మూసికొని
దుఃఖించుచున్నాడు.
ఆ
దృశ్యమును
చూచిన
దాసీలు
ఒకరికొకరు
ఆతురతతో
తెలుపుకొని,
లోనికి
వచ్చి
చూడ,
తమ
మహారాణి
తమను
శాశ్వతముగా
వీడినదని
తెలుసుకొని,
గొల్లున
అందరూ
ఏడ్వసాగిరి.
ఇంతలో
ఒకరికొకరు
పరువులు
దీసి
అంతఃపురము
నందలి
రాణులకు
తెలిపిరి.
నిమిషములో
కుంతీదేవి
మరణవార్త
హస్తినాపురమంతయూ
ప్రాకెను.
అంతఃపురమునుండి
రాణులు
ఱొమ్ముఱొమ్ము
బాదుకొనుచు,
తలలు
కొట్టుకొనుచు,
వివిధ
రీతులు
విలాపములు
చేయుచు
పుట్టలలోని
చీమలవలె,
ఒక్కొక్క
వైపు
నుండీ
రాణులు,
దాసీలు
గుంపులు,
గుంపులుగా
పరిగెత్తుచూ
2
▾
Meaning
Keep
వచ్చుచుండుట
చూచి
భీమ
నకుల
సహదేవాదులు,
మంత్రులూ
మిగిలిన
వారందరూ
నిమిషములలో
వ్రాలిరి.
అప్పటి
దృశ్యము
వర్ణనాతీతము!
నిమిషమునకు
పూర్వము
నిండు
ఆనందముతో
అర్జునుని
రాకకై,
ద్వారకవార్తలు
వినుటకై,
నిండు
ప్రాణములతో
కాచియుండిన
కుంతీదేవి
నిర్జీవదేహమును
చూచిన
వారందరూ
నమ్మలేకపోయిరి.
వచ్చిచూచిన
వారందరూ
బొమ్మలవలె
కదలక
మెదలక
నిల్చిపోయిరి.
ఒక
వైపున
దాసీల
రోదన,
రాణుల
అరుపులు,
రాతిగుండెలనైననూ
కరిగించునట్లు
వినిపించుచుండెను.
ధర్మజుని
తీవ్ర
వైరాగ్యము
ఇంతలో
ధర్మజుడు
అందరినీ
ఓదార్చి
ధైర్యముతో
సోదరులకు
దుఃఖించవలదని
సమాధానము
చెప్పుచూ,
కంటినీరు
విడువక
అటూ
ఇటూ
తిరుగుచుండుట,
చూచువారలకు
ఆశ్చర్యము
కలిగించెను.
ఇంతలో
మంత్రులు
వచ్చి
"రాజా!
తమధైర్యము
మాకెంతయో
ఆశ్చర్యమును
కలిగించుచున్నది.
మాతృదేవి
అన్న
ప్రాణ
సమానముగా
భావించి,
సేవించుచున్న
మీ
హృదయము
నేడు
స్తంభించుటకు
కారణమేమి?"
అని
దుఃఖముతో
ప్రశ్నించగా
ధర్మజుడు
చిరునవ్వు
నవ్వుచు,
"మంత్రులారా!
మాతృదేవి
యొక్క
మరణము
నాకు
ఈర్ష్య
పుట్టించుచున్నది
తప్ప,
దుఃఖము
రాకున్నది.
ఆమె
మహా
అదృష్టవంతురాలు!
భగవంతుడు
స్వధామమునకు
పోయిన
వార్త
వినగానే
లోకమామెకు
దూరమైనది.
వియోగబాధను
అనుభవింప
ఇష్టములేక
తానుకూడనూ
శ్యామసుందరుని
చెంతకు
వెళ్ళెను.
అన్ని
విధములా
దురదృష్టవంతులు
ఈ
శిలాహృదయులైన
పాండవులే!
భగవంతునికి
సన్నిహితులమై
యుండియు,
అతనిలో
అన్ని
విధములైన
ఆనందములను
అందుకొనియూ,
అతని
వియోగమును
వినియూ
బ్రద్దలుకాని
మా
హృదయాలు
బండలతో
సమానము.
నిజముగా
మాలో
అంతటి
భక్తియే
3
▾
Meaning
Keep
యుండి
యుండిన
తల్లివలె
మేమెందులకు
కాయములు
వీడలేక
పోతిమి?
ఛీ!
మా
బ్రతుకులు
భూమికి
భారముతప్ప,
వేరు
ప్రయోజనము
లేదు."
కృష్ణవియోగమును
భరించలేక
కుంతీదేవి
ప్రాణము
విడిచినదన్న
విషయము
అందరికీ
తెలియగనే
కుంతీదుఃఖమువీడి,
శ్యామసుందరుని
ఎడబాటునకు
మరింత
ఘోరముగా
విలపించ
దొడగిరి.
కొందరు
కృష్ణుడు
స్వధామమునకు
వెళ్ళినాడని,
ధర్మజుని
నోటి
ద్వారా
విని
స్పృహ
తప్పి
నిలువునా
కూలిపోయిరి.
కొందరు
పిచ్చివారలవలె
కేకలు
వేసిరి.
మరికొందరు
తలలు
గోడలకు
కొట్టుకొనిరి.
ఈ
రీతిగా
మండు
కొరివి
కట్టలపై
సీమనూనె
పోసినట్లు,
రెండు
దుఃఖములూ
ఏకమై
ఒకరిమాట
ఒకరికి
వినిపించక
కల్లోలముగా
నున్న
సమయమున,
ధర్మజుడు
మధ్యచేరి
రాణులకు
ధైర్యము
చెప్పి
ఎవరికి
తగినట్లు
వారలను
ఓదార్చి,
తల్లి
మరణమునకు
కానీ,
శ్యామసుందరుని
వియోగమునకు
కానీ
విలపించ
నవసరము
లేదనియు,
"వారి
వారి
సంకల్పానుసారము
జరుపుకొన్నారు..
ఇక
మన
సంకల్పములు
మనము
పూర్తి
చేసికొనుటకు
తగిన
ప్రయత్నములు
గావింపవలెను"
అని
అనుచూ
ధర్మజుడు
తమ్మునిచెంతవచ్చి,
"అర్జునా!
లెమ్ము!
ఇక
ఆలస్యము
చేయ
పనిలేదు.
అమ్మకు
ఇప్పుడే
దహన
సంస్కారము
లొనర్చవలెను.
రేపే
పరీక్షితునకు
రాజ్యాభిషేక
మొనర్చవలయును;
నేటి
రాత్రికే
మనము
హస్తినాపురము
వీడవలెను.
ఒక
క్షణమైనను
భారముగా
తోచుచున్నది"
అని
తీవ్ర
వైరాగ్యమును
తెలుపగనే,
అంతకంటే
తీవ్రవైరాగ్యముగల
అర్జునుడు
తల్లి
శిరస్సును
తన
తొడపైనుండి
తీసి
క్రిందపెట్టి,
పరీక్షిత్తు
పట్టాభిషేక
నిమిత్తమై
తగిన
ప్రయత్నములు
జరుపమని
నకుల
సహదేవులకు
ఆజ్ఞ
ఇచ్చి,
తాను
కూడనూ
ఎవరికి
తగిన
పనులు
వారు
చేయుటకు
తగినట్లు
చెప్పుచూ,
అటూ
ఇటూ
తిరుగాడ
జొచ్చెను.
భీముడు
తల్లి
దహన
కార్యనిమిత్తమై
ప్రయత్నములు
చేయించుచుండెను.
4
▾
Meaning
Keep
ఈ
విచిత్ర
ప్రయత్నములను
చూచుచూ,
వినుచుండిన,
మంత్రులకూ,
పౌరులకూ,
పురోహితులకూ,
గురువులకూ
ఆశ్చర్యమునూ,
ఆవేశమునూ,
ఆరాటమునూ,
కలిగి
లోలోన
కుమిలిపోవదొడగిరి.
వారలలో
వారికి
కూడనూ
తీవ్రవైరాగ్యములు
మొలకెత్తెను.
రాజభవనములో
జరుగుచున్న
విపరీతపు
సంఘటనలు
ఎట్టివారలైననూ
ఆశ్చర్యమున
ముంచి
తేల్చకపోదు.
"ఆహా!
పెదతండ్రి,
పెదతల్లి
ఎడబాటుతో
మూల్గుతూ,
కుములుతూ
ఉండిన
ధర్మజునకు
వెంటనే
కృష్ణుడు
స్వధామమునకు
వెళ్ళిన
పిడుగువంటి
వార్త
గుండెను
బ్రద్దలు
చేసెను.
ఇంతలో
మాతృదేవి
వియోగము.
ఆమె
శరీరము
నింకనూ
తీయలేదు.
వేరొక
ప్రక్క,
రాజ్యాభిషేక
ప్రయత్నము.
ఇట్టి
స్థితిలో
చక్రవర్తి
సర్వస్వమును
వీడి,
సోదరులతో
అడవులకు
బయలుదేరుట!
ఇంతటి
ధైర్య
సాహసములు
ఒక్క
పాండవులకు
తప్ప
అన్యులకు
అలవి
కాదు.
కాకున్న
గంటలలో
తల్లి
మృతదేహమునకు
శాస్త్రోక్త
దహన
సంస్కారములు
గావించి,
బ్రాహ్మణులను
పిలిపించి,
పరీక్షిన్మహారాజునకు
రాజ్యాభిషేక
ప్రయత్నము
సాధారణ
విధుల
చేతనే
చేయించ
పూనుకొనెను.
సామంత
రాజులకు
కానీ,
తదితర
ఇంద్రప్రస్థమందుండిన
బంధు
మిత్రులకు
కానీ
ఈ
వార్త
యేమాత్రమూ
తెలుపలేదు.
శోకభాష్పములతో
జరిగిన
రాజ్యాభిషేకము
రాజ్యాభిషేకమన్న
భరతవంశ
సింహాసన
చక్రవర్తులు
ఎంత
వైభవోపేతముగనో,
కొన్ని
నెలలకు
పూర్వమే
నిశ్చయించి,
బ్రహ్మాండమైన
ఏర్పాట్లతో
జరుపుట
పరిపాటి.
కానీ,
నేడు
నిమిషాలలో
అన్ని
ప్రయత్నములు,
ఉన్న
వాటితోనే
పూర్తిచేయ
తలంచుచున్నారు.
నిమిషములలో
అభ్యంగ
స్నానాదులు
సలిపి,
బ్రాహ్మణులను,
పురోహితులను
పిలిపించి
మంత్రులను
వెంటబెట్టుకొని,
బాలుని,
సర్వాభరణాలంకారుని
గావించి,
అతనిని
సింహాసనముపై
కూర్చుండబెట్టి
ధర్మజుడు
తనచేతితో
సువర్ణరత్నమండితమగు
తన
దివ్యమకుటమును
పిల్లవాని
శిరస్సున
పెట్టుచుండగా,
కంటి
ధారలు
కార్చని
వారు
లేరు.
ఆనంద
భాష్పములతో,
ఆశీర్వాద
అక్షతలతో
ధరించవలసిన
రాజ్య
భారమును,
అందరి
శోకబాష్పములతో
ధరించవలసి
వచ్చెను
పరీక్షిన్మహారాజు.
5
▾
Meaning
Keep
అంతేల,
ధర్మజుడు
సహితమయ
ఎంత
అరికట్టినను,
సాధ్యముకాక
భోరున
ఏడ్వ
సాగెను.
అది
చూచినవారి
హృదయములు
తరిగిపోయెను.
విధి
బలము
నెవరు
తగ్గించగలరు?
ఏ
యే
సమయమున
ఏమేమి
యెట్లు
చేయవలెనో
అట్లు
ప్రారబ్ధమే
చేయించును;
విధియే
నడిపించును;
మానవ
మాత్రులు
నిమిత్త
మాత్రులు.
ఈ
దృశ్యములన్నియూ
చూచుచున్న
మహాగుణవంతుడైన
పరీక్షిన్మహారాజు
బాలుడైననూ
పెద్దలమాట
ధిక్కరింపలేక,
సింహాసనముపైనుండి
ధర్మజుని
పాదములపై
వ్రాలి,
కూలి,
భోరున
యేడ్చుచూ,
"ప్రభూ!
మీరేమి
చేసినను
సరియే,
మీ
ఆజ్ఞను
శిరసావహింతును;
మీరు
మాత్రము
నన్ను
వీడి
పోకూడదు"
అని
కాళ్ళుపట్టి
ప్రార్థించుచూ
దుఃఖించుచున్న
బాలుని
చూచిన
యేలాటి
వజ్ర
హృదయములకైననూ
కంటిధారలు
కారక
తప్పదు.
ఆ
దృశ్యమంత
ఘోరముగా
నుండెను.
ఆ
బాలుడు
తాతయైన
అర్జునుని
పాదములు
పట్టుకొని,
"తాతా!
ఇంత
పెద్ద
రాజ్యమును
నా
తలపై
పెట్టి
నన్ను
యేకాకిగాచేసి
వెళ్ళుటకు
మీకు
కాళ్ళెట్లాడును?
నేనేమీ
తెలియని
పసిపాపను,
అజ్ఞానిని,
అమాయకుడను,
యోగ్యతలేని
అసమర్థుడను.
మహా
మహా
మేధావులు,
శక్తి
సంపన్నులు,
బలాఢ్యులు,
ధీరులు,
వీరులు,
శూరులు
ఏలిన
ఈ
పవిత్ర
రాజ్యమును
ఈ
అసమర్థుని
తలకు
కట్టి
అడవులకు
వెళ్ళుట
మీకు
న్యాయముకాదు.
ఇంకెవరైనను
దీని
భారము
మోపుకొని
నన్ను
అడవులకు
పంపుడు"
అని
విలపించెను.
Previous
←
The Advent of the Kali Age
Next
The Mahāprasthāna of the Pāṇḍavas
→