Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Mahāprasthāna of the Pāṇḍavas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పాండవుల
మహా
ప్రస్థానము
"ఆనందముగా
కందమూలాదులు
భక్షించి
నా
కాలమును
పవిత్ర
కర్మలతో
ధన్యముచేసుకొందును.
లేదా
గుణ
శీలురైన
మంత్రులకప్పగించి,
నన్ను
మీ
వెంట
తీసికొని
వెళ్ళుడు.
అడవులలో
తాతలసేవలు
చేయుచు
ధన్యుడనగుదును"
అని
పెదతాతను,
చినతాతలను
ఒక్కొక్కరి
చెంతకు
పోయి
పాదములు
పట్టి
మొరపెట్టుకొనుచుండిన
పరీక్షిత్తుని
యెవ్వరూ
చూడలేకపోయినారు.
ఆ
మాటలను
వినలేక
పోయినారు.
రాళ్ళను
కూడనూ
కరిగించునట్టి
ఆ
బాలుని
స్థితిని
అనుభవించలేక
పోయినారు.
ఎట్లో
ధర్మజుడు
ధైర్యము
తెచ్చుకొని,
పొంగివచ్చు
దుఃఖమును
మ్రింగి,
పరీక్షిత్తును
చేతులుపట్టి
తొడపై
కూర్చొనబెట్టుకొని
"నాయనా!
ఇంత
బలహీనుడవు
కారాదు.
నీవు
భరతవంశమున
పుట్టిన
భాగ్యశాలివి.
సింహము
కడుపున
మేక
పుట్టదుకదా!
నీ
తండ్రీ,
నీ
తల్లీ,
తాతలూ
మహావీరులు,
సత్యశీలురు,
సార్థక
నాములు.
కాన,
నీవు
ఇట్టి
బేలవై
విలపించుట
తగదు.
తల్లియైననూ,
తండ్రులైననూ,
తాతలైననూ
అన్నియూ
నీకీ
బ్రాహ్మణులే;
వారల
సలహాల
ననుసరించి,
రాజ్యము
పాలించుము.
సార్థకనామము
సాధించుము.
మా
కొరకై
విలపించకుము"
అని
ఓదార్చజొచ్చెను.
కానీ
ధర్మజుడు
ఎన్నిచెప్పిన,
పరీక్షిత్తు
మిక్కిలి
ప్రేమ
పూర్వకమైన
హఠమును
విడువక
"తాతా!
నేను
మీకు
చెప్పనంతటి
వాడనుకాను.
నేను
పుట్టక
2
▾
Meaning
Keep
మునుపే
తండ్రిని
దూరముచేసుకొంటిని.
తండ్రి
ప్రేమలోటులేక
మీరు
నన్ను
అన్ని
విధములా
పెంచితిరి.
ఇపుడు
ఆటపాటలతో
ఆడుకొను
బాలునికి
అంత
పెద్ద
రాజ్యభారమును
తలకు
కట్టట
మీకు
న్యాయమా?
ఇట్టి
దుఃఖమున
నన్ను
ముంచి
పోవుటకంటే,
కత్తితో
నా
కంఠమును
త్రెంచి
పోలేక
పోతిరా?
హా
విధీ!
నేను
నీకు
యేమి
అపకారము
చేసితిని;
అట్లు
చేసియుండిన,
తండ్రి
పోయిన
తక్షణమే
నన్ను
గర్భమందే
నిర్జీవుని
చేసితివే?
అటులనే
ఈకాయమును
ఎందుకు
హతమార్చక
పోతివి?
తిరిగీ
నాకు
ప్రాణమిచ్చి
పోషించినది
ఈ
ఘోరమును
అనుభవించుటకేనా?"
ఇంకనూ
యేమేమో
తనను
తాను
నిందించుకొనుచుండెను.
పిరికితనము
క్షత్రియులకు
కళంకము
అంతలో
అర్జునుడు
వచ్చి
నోరుమూసి,
తలను
ముద్దిడి
"నాయనా!
నీవిట్లు
పిరికివానివలె
వదరుట
మా
క్షత్రియులకు
కళంకము.
మేము
నీకన్ననూ
చిన్న
వయసుననే,
తండ్రిని
దూరము
చేసుకొంటిమి.
తాపసుల
రక్షణలో
పెరిగి
పెద్దయితిమి.
కడకు
పెద
తండ్రి
ప్రేమకు
పాత్రులమై
అనేక
ఇక్కట్లుపడి,
రాజ్యము
నేలితిమి.
మాకు
ఆ
వయసున
ఏ
రక్షకుడు
పెంచిపెద్దచేసి
ఇంతకాలము
మా
జీవితములను
నడిపించెనో,
ఆ
రక్షకుడే
నిన్ను
కూడనూ
కాపాడును.
కరుణించును.
నీవు
అధైర్యపడక
కొంతకాలము
ఈ
మంత్రుల
సలహాలను,
బ్రాహ్మణులు
సలహాలను
అనుసరింపుము.
తదుపరి
నీకే
కొన్ని
తెలియవచ్చును"
అని
యెన్నియో
విధముల
ఓదార్చుచున్న
తాతయగు
అర్జునుని
చూచి,
"తాతా!
నన్ను
అనాధను
చేసి,
అసహాయునిచేసి,
రాజ్యమను
సింహమునకు
మేకవలె
నన్ను
అందించిపోవుచున్నారా?
పోనీ,
కొంత
కాలమైననూ
మీరుండి,
నాకు
కొన్ని
విధివిధానములు
నేర్పి
వెళ్ళుడు.
తండ్రి
లేకున్ననూ
తాతలు
కలరు
కదా!
అని
విచ్చలవిడిగా
నిశ్చింతగా
వున్న
నన్ను
తాతలుకూడనూ
వీడిన
నా
గతియేమి?
సర్వ
ఆశలూ
మీపై
పెట్టుకొనియున్న
నన్ను
ఇంత
శీఘ్రములోనే
నిరాశలో
ముంచి
వెళ్ళుచున్నారు"
అని
గోడున
ఏడ్చుచూ
తాత
పాదములపై
పడి
పొర్లుచుండెను.
అర్జునుడు
రెండుచేతులతో
పరీక్షిత్తును
ఎత్తి,
చంకన
పెట్టుకొని
పరీక్షిత్తుని
3
▾
Meaning
Keep
రెండుకమల
నేత్రములనుండి
ముత్యములవలె
అలలు
అలలుగా
వచ్చుచున్న
అశ్రువులను
తుడుచుచు,
తన
కన్నులనుండీ
నీరు
కార్చుచు,
ఎదురుగ
నిల్చిన
బ్రాహ్మణులతో
"మీరిట్లేల
నిల్చుకొని
దుఃఖించుట?
మీరుకూడనూ
ఈ
బాలునికి
తగిన
బోధచేసి
నచ్చెప్పుకున్నారెందులకు?"
అని
అర్జునుడు
ఆడిన
మాటలకు
బ్రాహ్మణులు,
మంత్రులు
దుఃఖమును
ఆపుకోలేక
"రాజా!
ఆ
కసిగందు
మాటలు
ఒక్కొక్కటి
మా
హృదయములను
సూటిగా
పొడుచుచున్నవి.
అతని
దుఃఖము
మమ్ములను
శిలలుగా
చేయుచున్నది.
ఏమి
చెప్పగలము?
మేమేమి
చేయగలము?"
అని
వారును
దుఃఖింప
మొదలిడిరి.
పాండవులు
రాజ్యమును
పరిత్యజించుట
ఎట్లో
ధైర్యము
తెచ్చుకొని
కులగురువైన
కృపాచార్యుల
వారు
ముందుకు
వచ్చి
పొరలివచ్చు
దుఃఖమును
ఆపుకొని,
అంగవస్త్రముతో
అశ్రుధారులు
తుడుచుకొంటూ,
"ఏమి
చెప్పమందువు,
మహారాజా!
మాకేమియూ
తోచుటలేదు.
ఏరాజ్యమునకు
ఇంత
పోరాటము
జరిగినదో,
యే
రాజ్యము
కొరకు
లక్షలు,
కోట్లకొలదీ
ప్రాణములు
బలియిచ్చిరో,
ఏ
రాజ్యము
కొరకు
రక్తపాతము
జరిగెనో
అట్టి
రాజ్యమునే
మీరు
నేడు
తృణ
ప్రాయముగ
పరిత్యజించుచున్నారు.
వేల
సంవత్సరములు
కాదు,
నూరు,
రెండు
నూర్ల
సంవత్సరములు
కాదు,
కడకు
యేబది
సంవత్సరములైననూ
ఏలలేదు;
వీటిని
చూడ,
మా
బుద్ధులు
జడమై
పోవుచున్నవి.
కాలగతి
యెట్లుండునో
యెవరు
చెప్పగలరు?
మహాపురుషుల
చేష్టలకు
అంతరార్థములుండకపోవ.
మేము
యేమియు
చెప్పలేకున్నాము.
ప్రభువులు
క్షమియింతురు
గాక!"
అని
తలవంచి
దుఃఖముతో
నిలిచెను.
సర్వం
కృష్ణార్పణం
అంత
ధర్మజుడు
ముందుకు
వచ్చి
"ఆచార్యా!
నేను
చేసిన
సర్వ
కర్మలు
కృష్ణుని
ఆజ్ఞననుసరించియే,
సర్వమూ
అతని
ప్రీతికై
అర్పితము
చేసితిని.
అతనెట్లాడించిన
అట్లాడితిని.
నాకు
కానీ,
నా
సోదరులకు
కానీ,
ప్రత్యేక
వ్యక్తిత్వము
యేమియునూ
లేదు.
సర్వ
ధర్మము
భగవానునితో
పోయినది.
4
▾
Meaning
Keep
ధర్మజుడు
మాత్రముండి
యేమి
ప్రయోజనము?
కలి
ప్రవేశించిన
ఈ
రాజ్యములో,
ఈ
లోకములో
ఒక
నిముషమైననూ
నే
నిలువజాలను.
మీరందరూ
ఈ
బాలుని
రక్షించి,
రాజ్యభ్రష్టుని
కాకుండునట్లుగా
ఉచిత
శిక్షణ,
దీక్షను
నొసంగుచుండ
వలెను.
ధర్మాచరణయందు
కానీ,
వంశపారంపర్యమర్యాదలను
కానీ
మార్చక
నిలుపునట్లు,
కులకళంకము
కాకుండునట్లు
చూచుకొనుడు.
నేటి
నుండియు,
మీ
బిడ్డ"
అని
ఆ
బాలుని
కృపాచారిచేతి
కందించు
సమయమున
అక్కడ
చేరినవారూ,
తాతలూ
ధర్మజునితో
సహా
గొల్లుమన
ప్రళయశబ్దమువలె
దుఃఖము
మిన్నుముట్టెను.
కొంత
తడవయిన
వెంటనే
వజ్రుని
రప్పించి.
"నాయనా!
నేటి
నుండియు
ఈ
భరత
రాజ్యమునకు
పరీక్షిత్తు
చక్రవర్తి"
అని
తెలిపెను.
వజ్రుడు
చక్రవర్తికి
చేయవలసిన
రీతుల
పరీక్షిత్తునకు
వందనము
చేసెను.
ఆ
సమయమున
అక్కడున్న
మంత్రులు,
బ్రాహ్మణులు
పరీక్షిత్తునకు
చక్రవర్తికి
తగిన
గౌరవ
వందనములను
అర్పించిరి.
తదుపరి
పరీక్షిత్తుని
చేయిపట్టుకొని,
వజ్రుని
చేయితీసుకొని
"ఇతను
యదువంశాధారుడగు
వజ్రుడు.
ఇతనిని
మధుర
శూరసేన
దేశములకు
రాజుగా
చేసితిని"
అని
ధర్మజుడు
పలికి
అతని
శిరస్సున
సువర్ణవజ్రఖచితమగు
కిరీటమును
పెట్టెను.
ఇద్దరినీ
చేర్చి,
మీరిరువురు
రాజులు
ఒకరినొకరు
పరస్పర
సద్భావములతో,
సోదరుల
వలే
మెలగవలెనని
తెలిపెను.
వజ్రుని
పిలిచి
"నాయనా!
పరీక్షిత్
నీకు
బాబాయివలె
చూచుకో
అనియు,
పరీక్షిత్తును
పిలిచి
నాయనా!
వజ్రుని
నీవు
అనిరుద్ధుని
వలె
చూచుకొనవలెను"
అనియు,
ఇరువురునూ
ధర్మమును
వీడక,
ప్రజాక్షేమమే
తమ
ప్రాణములుగా
భావించి,
పరిపాలన
జరుపవలెనని
తెలుపుచూ
పాండవులందరు
అక్షతలు
వేసిరి.
వచ్చిన
బ్రాహ్మణులు
మంత్రములు
చదివిరి.
మంగళ
వాయిద్యములు
వాయించిరి.
కంటిధారలు
తుడుచుకొనుచు
వజ్రుడు,
పరీక్షిత్తు
ధర్మజునకు
5
▾
Meaning
Keep
మిగిలిన
పాండవులకు,
గురువులకు
నమస్కరించిరి.
తాతలు
నలుగురునూ
ఆ
ముద్దు
బిడ్డల
మోములను
చూడలేకపోయిరి.
దుఃఖము
ఉబికి
వచ్చుచుండెను.
ఆ
బాలుర
శిరస్సులను
ముద్దుపెట్టి,
ఒకతూరి
వారలను
చంకపెట్టి
ధైర్యపు
మాటలు
చెప్పి,
కట్టు
గుడ్డలతో
కానలకు
బయలు
దేరిరి.
ఈ
స్థితిని
గాంచి
పురజనులు,
బంధుబాంధవులు,
అంతఃపుర
రాణులు,
దాసీలు
పెద్ద
పెట్టున
ఏడ్వసాగిరి.
ప్రజలు
మహారాజులకు
అడ్డువెళ్ళి
పాదములపైబడి
ప్రార్థించిరి.
మేముకూడ
మీవెంట
వత్తుమని
బ్రతిమిలాడిరి.
కొందరు
ఎంత
చెప్పిననూ
వినక,
వారివెంటనే
పరువులిడిరి.
పాండవులు
ఎవ్వరినీ
చూచుటలేదు.
ఎవ్వరి
మాటలు
వినుటలేదు.
లక్ష్యము
కృష్ణునిపై
పెట్టి,
దారి
డొంకా
తెలియుచూడక
వెనుకకు
తిరగక,
ప్రత్యుత్తరము
లివ్వక
గ్రుడ్డివారివలే
ఉన్మత్తులవలే
పోసాగిరి.
వెనుకవైపు
దాసీలతో
ద్రౌపది
పతులను
పేరు
పేరునా
పిలుచుచూ
కాలినడకన
పరుగులు
తీయుచున్నది.
పరీక్షిన్మహారాజు
ఎందరు
పట్టుకున్ననూ
నిలువక,
రోదనచేయుచూ
వీధులవెంట
పరుగిడుచూ,
పేరు
పేరునా
తాతలను
పిలుచుచూ
వెళ్ళుచుండగా,
మంత్రులు
నిలిపి
ఓదార్చుచూ
వారు
ఏడ్చుచూ
అతనిని
ఎత్తుకొని
పోవుచున్నారు.
ఈ
రీతిగా
వెంటబడిన
వారలను
వద్దనికానీ,
వచ్చుచున్నవారిని
చూచి
నిలువమని
కానీ,
యేమియూ
పలుకుటలేదు.
కొన్ని
నూర్ల
స్త్రీపురుషులు
వారివెంటనే
వెళ్ళుచూ
అలసిపోయిన
స్థానములనుండి
వాపసువచ్చుచూ,
మరికొందరు
వారిని
అనుసరించుచూ
వెళ్ళిరి.
అంతఃపుర
స్త్రీలలో
కొందరు
ఎండ
కన్నెరుగని
సుకుమారులు
తాళజాలక
అలసి
చెట్లనీడన
స్పృహతప్పి
పడిపోయిరి.
దాసీలు
తగిన
దాహాదులు
తెచ్చి
సేదదీర్చుచూ
ఎడబాటుకు
ఏడ్చుచూ
మహాఘోరారణ్యములో
ఘోరబాధ
ననుభవించుచూ,
తిరిగి
వాపసు
వచ్చుచుండిరి.
ఆ
దారి
యంతయూ
దుమ్ముతో
నిండి
మేఘములవలె
ధూళి
6
▾
Meaning
Keep
ఎగుర
జొచ్చెను.
కొందరు
అది
ధర్మజుని
పాద
ధూళి
అని
శిరస్సున
దాల్చుకొని,
అక్కడి
వారక్కడే
నిలిచిరి.
ఈ
రీతిగా
చెట్లు,
గుట్టలుదాటి
చూపునకు
మరుగు
పడుటచే
ఎక్కడి
వారక్కడ
నిల్చి
నిట్టూర్పులు
విడచుచూ
నిండుదుఃఖములతో
కుములుచు
హస్తినాపురము
చేరిరి.
పాండవులు
మహా
ప్రస్థానమును
నీమించిరి.
అనగా
ఏమియూ
తినక,
త్రాగక,
విశ్రాంతి
గొనక
ఉత్తర
దిక్కునకు
వెడలుట.
దీనినే
మహా
ప్రస్థానమని
అందురు.
Previous
←
The Coronation of Parīkṣit
Next
Parīkṣit's Righteous Rule
→