Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Parīkṣit's Boundless Kṛṣṇa-Bhakti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పరీక్షిత్తుని
అపార
కృష్ణ
భక్తి
పరీక్షిత్
మహారాజు
ఏ
దేశమునకు
వెళ్ళినను,
ఆయాదేశపు
రాజులును,
మహారాజులును
అతనిని
హృదయ
పూర్వకముగా
తమ
తమ
హోదాలకు
తగినట్లు
సైనిక
వందనములను
సహితము
అర్పించి,
తమ
తమ
సహాయము
ఏ
రీతిగా
కావలెనన్నను
సర్వ
వేళలందూ
సంసిద్ధులమని
రాజునకు
విన్నవించెడివారు.
రాజుకూడనూ
తమ
సహాయమే
మాత్రము
తనకు
అవసరము
లేదనియును,
తమ
తమ
రాజ్యములలో
ప్రజలకు
సుఖశాంతులను
అందించి,
వేద,
గోబ్రాహ్మణ,
స్త్రీ
రక్షణను
ప్రధాన
లక్ష్యముగా
భావించి,
దైవారాధనలు
సలుపవలెనని
మాత్రము
ఆదేశమందించెడివాడు.
అదే
తనకు
చేయు
అమోఘమైన
సహాయమని,
సంతసించెడివాడు.
కొన్ని
కొన్ని
ప్రధాన
రాజ్యములందు
పరీక్షిత్
మహారాజు
యొక్క
పూర్వజుల
కీర్తిని
గానములు
గావించెడివారు.
పాండవులకు
సంబంధించిన
కథలను
చెప్పుచుండెడివారు.
కృష్ణుడు
పాండవులను
ఎట్టి
కృపతో
చూచెడివాడో
పాండవులు
కృష్ణుని
యెంత
భక్తి
విశ్వాసములతో
కొలిచెడివారో,
తలచెడివారో
అని
మరింత
భావోద్రేకులై
చెప్పుకొనుచుండెడివారు.
కృష్ణార్జునుల
వేషములు
వేసియూ
మధ్య
కృష్ణపరమాత్మ
చేయు
నటన
కళాపములను
నాటకరీతుల
ప్రదర్శించెడివారు.
ఇవన్నియూ
చూచుచున్న
పరీక్షితుడు
తనకు
తెలియకనే
అశ్రువులు
రాల్చెడివాడు.
సూత,
మాగధ,
వందీ
జనములును,
కథకులును,
మహారాజుకు
కృష్ణ
2
▾
Meaning
Keep
పాండవుల
కథలు
శ్రవణము
చేయుట
మిక్కిలి
ఇష్టమని
తలంచి,
కనిపెట్టి
మిగతా
కథలకు
స్వస్తిచెప్పి,
ఎక్కడకు
వెళ్ళిననూ
ఈ
విధమైన
కథాకాలక్షేపములే
జరుపజొచ్చిరి.
మహారాజు
కేవలము
విని
అంతమాత్రముతో
ఆనందించుటే
కాక,
అవి
సంపూర్ణ
సత్యములని
మంత్రులతో,
గురువులతో
విని
మరింత
గాఢమైన
విశ్వాసముతో
శ్రవణము
చేయుచూ,
గానము
సల్పువారలను
ఎంతో
స్నేహ
భావముతో
చూచుచూ,
తగిన
బహుమానములను
అందించి
వెళ్ళుచుండెడివాడు.
ఈ
విధముగా
పరీక్షిత్
మహారాజుకు
కృష్ణ
గానామృతమన్న
ప్రాణముగా
గ్రోలెడి
వాడని
దేశమంతయూ
వ్యాపించి,
కృష్ణపరమాత్మను,
పాండవులను
స్వయముగా
చూచి
కలసి
మెలసిన
వారలు
పరీక్షిత్తును
చూడ
ఉవ్విళ్ళూరుచు
దారులందు
కాచుకొని
యుండెడివారు.
ఒక
దినము
మధురనుండి
తిరిగి
వచ్చుచుండగ,
దారిలో
మహారాజు
సందర్శనమునకై
ఒక
ముసలి
బ్రాహ్మణుడు
కాచుకొని
యుండెను.
మహారాజు
ఆ
బ్రాహ్మణుని
చూచి,
యోగక్షేమములు
ముచ్చటించుచుండగా,
ఆ
ముసలి
బ్రాహ్మణుడు,
"మహారాజా!
మునుపు
మేము
మీ
తాతలైన
ధర్మజుడు
కృష్ణపరమాత్మ
సమక్షమున
గావించిన
అశ్వమేధ
యాగమునకు
బుత్విక్కులుగా
వెళ్ళిన
సమయమున
ఆ
మహానుభావుడైన
కృష్ణ
పరమాత్మ
ఇదేరీతిగా
యోగక్షేమములను
పరామర్శచేసెను.
నేడు
మీ
సంభాషణ
ఆనాటి
కృష్ణపరమాత్మ
సంభాషణను
దృష్టికి
తెప్పించుచున్నది"
అని
కంటి
ధారలు
కార్చెను.
అది
విని
"ఆహా!
మీరెంత
ధన్యాత్ములు!
స్వామీ!
యజ్ఞశాలలో
పరమాత్ముడైన
కృష్ణునితో
సంభాషణలు
సలుపుట!"
అని
తన
భుజమునగల
అంగవస్త్రమును
తీసి
క్రింద
పరచి,
తమరు
కూర్చుని,
పరమాత్ముని
సమాచారములేవైననూ
మీరు
స్వయముగా
అనుభవించినవి
తెలుపమని
కోరెను.
అంత
ఆ
వృద్ధ
బ్రాహ్మణుడు
"మహారాజా!
ఆనాడు
తెలియక
చేసిన
పొరపాటును
ఎంత
మరుతమన్ననూ
సాధ్యముకాక,
నా
గుండెలను
చీల్చుచున్నది"
అని
కంటినీరు
తుడుచుకొనెను.
అంత
మహారాజు,
"స్వామీ!
యే
పొరపాటు
జరిగినది,
నేను
వినతగినదే
అయిన
సెలవిచ్చి
నన్ను
సంతృప్తి
చేయుడు"
అని
రెండు
చేతులు
పట్టుకొని
మరింత
దీనతతో
అడుగుకొనెను.
3
▾
Meaning
Keep
కృష్ణుడు
ఋత్విక్కుల
పాదముల
కడుగుట
అందులకు
బ్రాహ్మణుడు,
"మహారాజా!
ఆనాడు
యజ్ఞదీక్ష
ఋత్విక్కులమైన
మేమందరము
దీక్షావస్త్రములు
ధరించి
యజ్ఞశాలకు
ప్రవేశించుచుండగా
యజ్ఞశాల
ముఖద్వారమున
కృష్ణ
పరమాత్మ
బంగరు
పీటపై
బంగారు
పళ్ళెముంచి,
తన
చేతులతో
బంగరు
బిందెలో
నీరు
పట్టుకొని-
అబ్బా!
నే
చెప్పలేను.
నోట
మాట
రాకున్నది"
అని
వెక్కి
వెక్కి
వచ్చు
దుఃఖమును
ఆపుకొనుచూ
మాటలను
నిలుపును.
బ్రాహ్మణుడు
మంచి
సమయమున
మాటలు
నిలుపుట
చూచి
పరీక్షిత్
మహారాజు
మరింత
ఆతురతతో,
"ఏమి
జరిగినది
స్వామీ!
దయచేసి
తెలుపుడు"
అని
ప్రార్థించుటచూచి,
"రాజా!
యేమని
చెప్పుదును?
మా
ఋత్విక్కుల
పాదములను
ఆ
బంగరు
పళ్ళెమునందు
వుంచమని
ప్రతి
యొక్కరి
పాదములు
కడిగి,
తన
భుజముపై
ధరించిన
అంగవస్త్రముతో
తుడిచి
మా
పాదతీర్థమును,
శిరస్సున
చల్లుకొనెను.
నేను
ప్రధాన
ఋత్విక్కునిగా
నుండుటచే
అన్ని
వివరములు
నన్నే
అడిగి
తెలుసుకొనెడివాడు;
కడకు
పూర్ణాహుతి
దినమున
శంఖ,
చక్ర,
గదాధారిగా
మా
కందరికీ
కనిపించి,
మమ్ము
తరింప
చేసిన
ఆ
పరమాత్ముని
విడిచి
ఈ
పండు
కాయముతో
ఈ
లోకములో
వుండినందుకు
కుమిలి,
కుమిలి
నీరవుచున్న
నా
హృదయమునకు
మీ
దర్శనము
ఎదారిలో
సంచరించువానికి
చలివిందులు
లభించినట్లు
నాకు
లభించి
తాపము
చల్లారినది"
అని
పరీక్షిత్
మహారాజు
యొక్క
రెండు
చేతులు
పట్టుకొని
అంగ
వస్త్రములో
చుట్టుకొని
వచ్చిన
అక్షతలను
శిరస్సుపై
వేయ
బోయెను.
అపుడు
పరీక్షిత్
మహారాజు
"స్వామీ!
ధన్యుడను!
కృష్ణ
పరమాత్మను
చూడలేక
పోయిననూ,
అతనిచే
పూజింపబడిన
పాదములు
నాకు
ప్రాప్తించెను"
అని
బ్రాహ్మణుని
పాదములపై
బడి
సాష్టాంగనమస్కారము
సలిపి
మంత్రులను
పిలిచి
ఆ
బ్రాహ్మణుని
పల్లకీపై
యెక్కించి,
తగినంత
ధనమిచ్చి
అతనిని
తన
స్వస్థానమైన
గ్రామమున
తన
గృహమున
దింపి
రమ్మని
ఆజ్ఞాపించెను.
Previous
←
Parīkṣit's Righteous Rule
Next
Remembrances of the Līlās of Śrī Kṛṣṇa
→