Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Remembrances of the Līlās of Śrī Kṛṣṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
లీలాస్మృతులు
ఈ
విధముగా
పరీక్షిత్
మహారాజు
యావద్భారత
దేశము
యాత్ర
సల్పుచూ,
వారి
తాతలైన
పాండవుల
పరిపాలన
గూర్చియూ,
వారు
శ్రీకృష్ణపరమాత్మతో
ఎట్లు
మెలగుచుండెడి
వారనియూ,
అనేకమంది
అనుభవ
పండితులచే
వినుచూ,
ఆనందించుచుండెడివాడు.
ఒక్కొక్కప్పుడు
"నాకట్టి
ప్రాప్తిలేకపోయెనే!
మా
తాతలెంత
అదృష్టవంతులో"
యని
ఆనందవిచారములతో
కృంగిపొంగెడివాడు.
ఇట్లు
తన
పూర్వీకుల
చరిత్రలను,
పురుషోత్తముని
ఉత్తమ
పనులనూ
స్మరించుచుంద,
తలవని
తలంపుగ,
వ్యాసులవారు
యేతెంచుటచే
అతనిని
తగురీతుల
సత్కరించి,
వారికి
ఉన్నతాసన
మొసంగి,
పరిపాలనా
విషయములను
ప్రశంసించుచూ,
మధ్య
మధ్య
పాండవుల
పరిపాలనను
వ్యాసులవారు
జ్ఞాపకము
చేయుచుంద
పరీక్షితుడు
భక్తి
శ్రద్ధలతో
వినుచుండెను.
పరీక్షిత్తుని
నామకరణము
చేసినది
వాసుదేవుడే!
ఇంతలో
వ్యాసులవారు,
నాయనా!
నేనిక
వెళ్ళివత్తునని
తెలుపగా,
ఆకొన్న
వానికి
పంచభక్ష్యపాయసాదుల
చేకూర్చిన
తట్టముందుపెట్టి
వెనుకకులాగిన
ఎంత
నిరాశారాటముల
జెందునో
అటులనే,
తాతల
విషయములను,
వాసుదేవుని
లీలలను
వినగోరిన
పరీక్షిత్తునకు
వ్యాసులవారు
వెళ్ళుదుననగనే
యేదో
పెన్నిధిని
వదలినవాడు
పరితపించినటుల
విచారముతో,
"స్వామి!
తామువచ్చిన
2
▾
Meaning
Keep
పనియేమి?
మరికొంతకాలము
ఇచటుండి
నా
ఆకలిని
తీర్చురని
ప్రార్థింతును.
అదృష్టశాలులైన
నా
తాతలు
ఆ
వాసుదేవునితో
కాలమునెంత
హాయిగా
గడిపిరో
అట్టి
పవిత్ర
సన్నిధిని
అనుభవించ
నాకంతటి
ప్రాప్తి
లేకపోయిననూ
వినియైననూ
తరింతును.
నా
కోర్కె
ఫలింపజేతురని
తమరి
పాదములంటి
ప్రార్థింతును"
అని
వినయ
విధేయతలతో
ప్రార్థించెడు
పరీక్షితుని
చూచి
వ్యాసులవారు,
"నాయనా!
నీవు
మాత్రమేమి
సామాన్యుడవని
తలంతువా?
నీ
అదృష్టము
మరెవ్వరికీ
పట్టలేదు.
పుట్టుకతోనే
పరమాత్ముని
పట్టిలాగినవాడవు
నీవు!
నీ
ప్రాణమును
ప్రసాదించి
నిన్ను
తన
హస్తములందుకొని,
ఎంతయో
ఆడుకొనెడువాడు
వాసుదేవుడు.
నీవు
కూడనూ
అతనిని
వదలివచ్చెడివాడవుకాదు.
కడకు
నీ
చిన్నతాతయైన
సహదేవుడు
బలవంతముగా
కృష్ణుని
చేతులనుండి
లాగుకొని
అంతఃపురమునకు
తీసుకొని
పోయెడివాడు.
నీకు
నామకరణము
చేసినది
కూడనూ
వాసుదేవుడే!
ఆనాడు
మాకందరికినీ
విచిత్రమును
కలిగింపజేసితివి.
కృష్ణుడు
యెటు
పోయిన
అటు
పోవుటకు
చూచెడివాడవు.
దానిని
కనిపెట్టి
పరీక్షింపజూచి,
కృష్ణుడెంతో
నేర్పుతో
దాగుకొనుటకు
పోయెడివాడు,దానిని
నీవు,
లక్ష్యమును
వీడక,
అతని
తెలివి
తేటలకు
కూడనూ
మించిన
తెలివితేటలుగ
ప్రవర్తించెడి
వాడవు.
ఆ
దృశ్యములు
చూచిన
సభికులందరికినీ
ఆశ్చర్యమును
కలిగించెను.
వచ్చిన
ప్రతి
ఒక్కరిని
నీవు
యేమో
వారియందు
పరీక్షించుచున్నట్లు
తోచెడిది.
పండితుని
మొదలు
పామరునివరకునూ
రైతు
మొదలు
రాజువరకునూ,
నిన్ను
ఒక
విచిత్ర
బాలునిగా
తలంచెడివారు.
అందువలననే
కృష్ణమూర్తి
నీకు
తగిన
నామకరణము
చేయవలెనని
మీ
తాతయైన
ధర్మజుడు
ప్రార్థించగా,
గోపాలునకు
యే
పేరు
పెట్టుటకు
పాలుపోక
నీ
చేష్టలను
కనిపెట్టి
నీకు
పరీక్షితుడను
పేరు
సార్థకమగునని
నిర్ణయించెను.
ఈ
పేరును
సభామందిరమున
వాసుదేవుడు
మీ
పెదతాతయైన
ధర్మజునితో
3
▾
Meaning
Keep
తెలుపగనే
చేరిన
ఋషులు,
పండితులు,
పురోహితులు,
రాజులు,
యావన్మందీ
భేష్,
భేష్
తగిన
పేరని
కరతాళములు
వాయించిరి.
"అట్టి
అదృష్టశాలివైన
నీవు
దురదృష్ట
వంతుడనని
తలంచుటలో
అర్థము
లేదు.
పరమాత్మచేత
ఎత్తి
ముద్దాడి,
అతని
వడియందుంచుకొని,
అతని
చేతనే
నామకరణమును
చేయించుకొనునట్టి
అదృష్టము
యెవరి
కబ్బును?
ఇది
సామాన్యమని
తలంచితివి,
కాబోలు!"
ఆ
మాటలు
వింటూ
ఆనందభాష్పములు
కారుచుండ,
పరీక్షితుడు
యేదో
ప్రశ్నింపజూచి,
నోట
మాట
రాకుండుట
వ్యాసులు
కనిపెట్టి
"నాయనా!
పరీక్షిత్!
యేదియో
అడుగ
సంకల్పించు
చున్నట్లున్నది.
అధైర్య
పడక
అడుగుము,
భయపడకుము"
అని
వీపు
నిమురును.
తెలిసి
అనుభవించు
ఆనందమే
పరమానందం
అపుడు
పరీక్షిత్
ధైర్యమును
వహించి
"స్వామీ!
ఆనందము
కానీ,
దుఃఖము
కానీ
అనుభవమునకు
తెలియనంత
కాలము
వాటి
విలువలు
మానవులకు
తెలియవు
కదా?
నేను
తెలిసికొనలేని
కాలమున
యెట్టి
ప్రాప్తి
చేజిక్కిననూ
దాని
ఆనందము
నిష్ప్రయోజనమే
కదా,
పదార్థపు
విలువ
తెలిసిన
తదుపరి,
ఆ
పదార్థము
ప్రాప్తించిన
అది
నిజమైన
ఆనందము.
అట్లుకాక
విలువను
తెలియని
పిల్లవానిచేత
కోటి
రూప్యముల
వెలగల
వజ్రమిచ్చిననూ,
అది
యేదో
గాజు
ముక్కవలె
విరగగొట్టును.
అటులనే
పరమాత్మ
విషయము
తెలియని
సమయమున
నేనతనితో
ఎంతో
ప్రాప్తిని
అనుభవించితినన్న,
అది
యేదో
తెలియని
ఒక
జన్మలో
అనుభవించినట్టిదే
అగునుకానీ,
నిజానందమునకు
వీలుండదు
కదా!
తెలిసి
అనుభవించు
ఆనందమే
పరమానందము.
తెలియక
అనుభవించునది
పరోక్షానందము.
అది
అనుమానప్రమాణము.
పోనీ!
ప్రత్యక్ష
ప్రమాణమునకు
నోచుకొనలేని
నాబోటివానికి
శబ్దప్రమాణమే
ప్రధాన
ఆధారముకాన,
తమరు
త్రికాలవేత్తలు
కనుక
వాసుదేవుని
లీల
లొకింత
తెలిపి,
నా
కర్ణములను
పవిత్ర
మొనర్చుము"
అని
ప్రార్థించగ.
వ్యాసమహర్షి
ప్రసన్న
హృదయుడై
"నాయనా!
పరీక్షిత్!
వాసుదేవుని
లీలలు
ఒక్కటే!
రెండు
కలవని
తలంచితివా?
లెక్కకతీతమైన
4
▾
Meaning
Keep
అతని
లీలలను
ఏమని
తెలుపగలను?
ఫలానా
సమయమున
ఫలానావారితో
జరిగిన
లీలలు
తెలుపమని
కోరిన,
దానికి
సంబంధించిన
విషయమును
చక్కగా
ముచ్చటింతును"
అని
మహాఋషులు
తెలుపగనే
పరీక్షిత్
శ్రద్ధాళుడై
చేతులు
జోడించుకొని
"స్వామీ!
మొదలు
మా
తాతలకు,
కృష్ణ
పరమాత్మకు
ఎట్లు
స్నేహము
కుదిరెనో
ఆ
విషయమును
గురించి
తెలుప"
మని
కోరెను.
అంత
వ్యాసులవారు
ఫక్కున
నవ్వి
"నాయనా!
నీ
శ్రద్ధ
నాకెంతయో
ఆశ్చర్యమును
కలిగించుచున్నది.
ఇట్టి
శ్రద్ధగలవారికే
జ్ఞానము
సిద్ధించును.
కాన
శ్రద్ధాళుని
చూచిన,
వారికి
ఆనందమును,
తృప్తిని
అందించుటే
నా
ఆనందము.
కాన
తెలిపెదను.
వినుము"
అని
ఆసనముపై
స్థిరముగా
సుఖాసనము
వైచి
కూర్చునెను.
పరీక్షితుడు
కూడనూ
తన
హృదయమును
వికసింపజేసుకొని
చెవులను
చాటలువలె
నిక్కపరచుకొని
వినుటకు
సిద్ధమాయెను.
ద్రౌపదీ
స్వయంవర
వృత్తాంతము
"నాయనా!
ద్రుపద
మహారాజు
తన
యేకైక
పుత్రికయైన
ద్రౌపదికి
పెండ్లిచేయ
తలంచి,
ఎన్నియో
సంబంధములు
విచారించెను.
అయితే
తన
కుమార్తెకు
తగిన
వరుడు
చిక్కకుండుటచే
తాను
స్వయంవరమను
ఒకదానిని
యేర్పరచెను.
అందులో
అనేకమంది
బలవంతులగు
రాజులు,
సౌందర్య
వంతులైన
విద్యావంతులు
పాల్గొని,
యెవరికివారు
ఆ
త్రైలోక్య
సుందరిని
పెండ్లాడవలెనని
వారి
వారి
ధన,
దేహబలములను
ప్రదర్శించుకొనుచూ
సభలో
చేరుచుండిరి.
ఆ
సభలో
పై
భాగమున
ఒక
యంత్రమున
గట్టుబడి
యుండును.
ఆ
యంత్రమున
కట్టుబడిన
మత్స్యమును
లక్ష్యము
తప్పక
యెవరు
ఛేదింతురో
వారలకు
ద్రౌపదినిచ్చి
వివాహమొనరింతునని
ద్రుపద
మహారాజు
సంకల్పము.
ఇట్టి
మహారాజుగారి
నిబంధననుసరించి
భేదించి,
ద్రౌపదిని
వివాహమాడవలెనని
రాజ్యమున
ఎటుచూచిననూ
పరరాజులు
క్రిక్కిరిసి
తిరుగాడుచుండిరి.
ఈ
వింత
విషయము
బ్రాహ్మణుల
వేషమున
నున్న
మీ
తాతలకు
తెలిసియూ,
వారికి
తగిన
సమయము
రానందున
ప్రయత్నించలేక
పోయిరి.
కానీ
5
▾
Meaning
Keep
ఇట్టి
వీర
పోరాటము
జరుగుచుండ
చూచుచూ
ఊరకుండుట
క్షత్రియ
లక్షణము
కానందున
అర్జునుడు,
అనగా
మీ
తాతగారు,
అన్నగారితో
సంప్రదించి,
స్వయంవరమునకు
వెళ్ళుటకు
సంసిద్ధులై
బ్రాహ్మణవేషములతోనే
సభామధ్యమున
ఐదుగురు
సింహములవలె
వారి
తేజస్సు
కాంతి
గ్రమ్ముచుండ,
సభలో
చేరినవారి
దృష్టి
అంతయూ
వీరలపై
పడి
కొందరు
వారి
తేజస్సును
చూచి
మహావీరులనియూ,
వారి
వేషములను
చూచి
యెవరో
వంట
బ్రాహ్మణులవలె
వున్నారనియూ
ఈ
రీతిగా
పరిపరి
విధముల
సంభాషణలు,
గుసగుసలు
మొదలుపెట్టిరి.
ఆ
సమావేశమునకు
కృష్ణబలరాములు
కూడనూ
వచ్చియుండిరి.
అయితే
ఆ
సభలో
ఉన్నంత
కాలము
కృష్ణుని
దృష్టి
అర్జునునిపై
పడుట
బలరాముడు
గ్రహించి,
వారిలో
వారు
బలరామ
కృష్ణులు
ఏదో
చెవులలో
చెప్పుకొనుచుండెడివారు.
కడకు
స్వయంవర
వ్రతము
ప్రారంభమాయెను.
ఒక్కొక్కరూ
ఛాయదగ్గరకు
వెళ్ళి
వారి
శక్తిసామర్థ్యములను
ప్రవేశపెట్టి
విఫలులై
తెల్లముఖములతో,
అవమానముతో,
నిరాశతో
వెనుకకు
తిరిగివచ్చి,
వారివారి
స్థానమున
తలలు
వంచి,
విచారగ్రస్తులై
కూర్చొనుచుండెడివారు.
అయితే
కృష్ణుడు
స్వయంవరమునకు
వచ్చెను.
కానీ
యంత్రమును
కొట్టుటకు
పూనుకోలేదు.
అతనే
సంకల్పించియుండిన
అవలీలగా
ఛేదించియుండెడివాడు.
కానీ
అతని
సంకల్పము
యేమో
యెవరు
చెప్పగలరు?
అంతలో
మీ
తాతగారైన
అర్జునుడు
లేచి
యంత్రమునకు
సమీపమున
వచ్చుచుండ,
సభ
అంతయు
ఏదో
ఒక
మెరుపు
మెరిసినట్లు
తేజస్సు
ప్రకాశించెను.
ద్రౌపది
తలయెత్తి
చూసెను.
ఆమె
మనసు
ఆ
ప్రకాశమున
లీనమాయెను.
క్షణకాలములో
ద్రౌపది
పూలమాలాలంకృతురాలై
మీ
తాతమెడలో
మాలను
వేసి
చేయిపట్టెను.
అందరి
రాజుల
మధ్య
బ్రాహ్మణవేషమున
వున్న
అర్జునుడు
ద్రౌపది
చేయిబట్టి
సభామంటపమున
వచ్చిన
తక్షణమే
పరాజయులైన
రాజులు
ఓర్వలేక
ఇది
న్యాయమైన
స్వయంవరము
కాదనియునూ,
ఈ
బక్క
బ్రాహ్మణుడు
ఈ
6
▾
Meaning
Keep
స్వయంవరమున
ప్రవేశింప
వీలులేదనియునూ
సాకులు
కల్పించుకొని
రాజులందరూ
యేకమై
మీ
తాతయైన
అర్జునునిపై
పడిరి.
ఇంతలో
భీముడు
ఒక
పెద్ద
వృక్షమునులాగి,
చేరిన
రాజులందరిని
బాద
ప్రారంభించెను.
కృష్ణార్జునుల
అన్యోన్య
ప్రేమ
కానీ,
మీ
తాత
ద్రౌపదిని
తీసుకొని
తమ
వసతి
గృహమైన
కుమ్మరి
వారింటికి
చేరగనే
అన్నయైన
ధర్మజుడు
జరిగిన
విజయమునకు
సంతసించుచూ,
ఆనందముగా
ఒకరికొకరు
ముచ్చటించుచుండగ,
పీతాంబరధారులై
బలరామ
కృష్ణులు
ఆ
కుమ్మరి
గృహమును
ప్రవేశించి
వృద్ధురాలైన
మీ
తాతల
తల్లి
కుంతికి
నమస్కరించి
"అత్తా!
మేము
మీ
అల్లుళ్ళము.
కృష్ణ
బలరాములము.
దేవకివసుదేవుల
పుత్రులము"
అని
వారికి
వారే
తెలుపుకొనుచు
తరువాత
ధర్మజునకు
నమస్కరించిరి.
చిన్న
బాలునివలె
అమాయకునివలె
అర్జునుని
చెంతకు
వచ్చి,
శ్రీకృష్ణుడు
"బావా!
నేను
నిన్ను
ఎరుగుదును,
కానీ,
నన్ను
నీవెరుగవు.
ఇదే
నిన్ను
చూచుట
మొదలు.
నేను
వసుదేవుని
కుమారుడను.
నా
పేరు
శ్రీకృష్ణుడు.
మీకంటే
నేను
చిన్నవాడనే,
అయినా
మీరు
ఈనాడు
దిగ్విజయమును
గాంచుటచూచి
వీరు
నిజముగా
పాండవులే
అయివుందురనియూ
మీరు
లక్క
గృహమునుండి
తప్పించుకొని
క్షేమముగా
యున్నారనియూ
తలంచితిని.
మిమ్ములను
ఆ
సభలో
చూచినది
మొదలు
నా
కెందులకో
మీరు
అర్జునుడే
అయి
వుందురన్న
నిశ్చయము
నన్ను
ఆనందపరచి
అన్నతో
అనగా,
బలరాములతో
తెలుపుచుంటిని.
కడకు
మిమ్ములను
కలిసికొనగలిగితిని,
చాల
ఆనందము.
అమ్మాయి
చక్కని
గుణవంతురాలేకాక
మహాతెలివితేటలు
గలది"
అని
పలుకరించి,
మీ
తాతయైన
అర్జునుని
మాత్రమే
ఒక
ప్రక్కకు
పిలిచి,
మెల్లగ
చెవిలో
ఈ
రీతిగా
తెలిపెను
"బావా!
మీరిప్పుడే
ప్రకటమగుట
మంచిదికాదు.
ఇంకనూ
కొంతకాలము
అందందు
నివసింపుడు"
అని
ప్రేమతో
తెలిపి
సెలవు
తీసుకొని
బలరామ
కృష్ణులు
బయలుదేరిరి.
7
▾
Meaning
Keep
ఆనాటితో
కృష్ణార్జునుల
ప్రేమ
పెరిగి
పెరిగి
అది
వృక్షమై,
కాయలై
ఫలములై
మధురమైన
రసమును
ఆరగించి
ఆనందించి,
అందులో
లీనమయిరి;
వింటివా?
మొదలు
కృష్ణుడు
మీ
తాతను
చూచుట
ద్రౌపదీ
స్వయంవర
మంటపమందే,
చూచితివా?
వారిచేరిక
కల్యాణమంటపమున
కనుకనే,
అర్జునిచే
జీవితమంతయూ
నిత్య
భగవత్
సన్నిధియను
కల్యాణమున
పారమార్థప్రాప్తిని
అనుభవించెను.
అంతియేకాక
అతని
నిమిత్త
మాత్రునిగా
నిలబెట్టి
లోకమునకే
జ్ఞానమును
బోధించెను.
వింటివా?
కొంటె
కృష్ణుడు
మీ
తాతలతో
ఎంత
ఆప్యాయముగ
నుండెడివాడో!"
అని
బయలుదేరుటకు
సరుదుకొను
చుండినటుల
కనిపించెను.
వ్యాసులవారిని
చూడగనే
పరీక్షిత్
తన
కన్నులవెంట
కారుచుండిన
నీరును
అంగవస్త్రముతో
తుడుచుకొనుచు,
"స్వామీ!
మీరు
కృష్ణ
పరమాత్ముని
చరిత్రను
చెప్పి
భావజగత్తులో
అతనిని
సాక్షాత్కరింప
చేయుచున్నారు.
మీరు
ఊరకుండుటచే
నాకు
చాలా
బాధ
కలుగుచున్నది.
ఆ
లీలా
మానుష
విగ్రహుడైన
శ్రీకృష్ణుడు
మా
తాతలతో
ఇంకా
యేయే
సమయములందు
యేయే
రీతిగా
కలసిమెలసి
కాపాడుచుండెనో
తెలిపి,
నన్ను
కృతార్థుని
జేయుము.
నా
నిద్ర
నేత్రములను
విడిచి,
భగవంతుని
వెతుక
బోయినట్లున్నది.
ఈ
రాత్రి
పూర్తిగా
తమరు
అతని
స్మృతి
కలుగజేయుడు;
నా
పై
కొంత
అనుగ్రహము
చూపుము"
అని
ప్రార్థించు
పరీక్షిత్తుని
శ్రద్ధాభక్తిని
చూచి,
వ్యాసులవారు
మనసును
మార్చుకొని,
"నాయనా!
కృష్ణుని
అమానుష
లీలలు
ఒకటి
రెండైన
చెప్పవచ్చును.
ఒక్కొక్క
రోమ
రోమమునకు
కోటి
కోటి
జిహ్వలుండి
కల్పాంతము
వరకు
వర్ణించిననూ
అతని
లీలలు
తరుగవు.
సర్వదేవతలు
అతనిచెంత
చేతులు
జోడించి
నిలుచుండెడివారు.
అతడు
ఒకతూరి
తమ
భక్తులను
ఆకాశముపై
కెక్కించెడివాడు.
అంతలోనే
క్రిందికి
పెట్టెడివాడు.
లోకమునే
ఒక
బొమ్మలాటగ
ఆడించెడివాడు.
అతను
ఎట్టి
సమయమందైననూ
చిరునవ్వులు
చిందులు
గొలుపువాడే
కానీ,
విచారములుకానీ,
సంతాపములుకానీ
అతడు
యెరుగడు.
ఒకప్పుడు
సామాన్య
మానవునివలె,
8
▾
Meaning
Keep
అమాయకునివలె,
బంధువునివలె,
మిత్రునివలె,
రాజువలె,
గొల్లబాలునివలె
ఒకటేమి,
అన్నింటియందూ
అన్ని
విధముల
మెలగగల
శక్తి
యుక్తులు
గల
పామరుని
వలె
వ్యవహరించెడివాడు.
మీ
తాతయగు
అర్జునుడన్న
అతనికి
మహా
ప్రేమ
నాయనా!
ఎట్టి
స్థానమునైననూ
సరియే,
అర్జునుని
వెంట
తీసికొనక
వెళ్ళెడివాడు
కాదు.
అసలు
అంతఃపురమందు
కూడనూ
అర్జునునికి
స్వేచ్ఛను
ఇచ్చెను.
మీ
తాతలతో
యమునా
నదికి
వెళ్ళి
జలక్రీడలాడుచు,
పందెములు
వేయుచు
ఒక
చోట
మునిగి
మరో
చోట
తేలుచూ
గుర్తింప
సాధ్యము
కానంతటి
ఆటలు
ఆడెడివాడు.
ఉన్నట్లుండి
మీ
తాతను
ఎవ్వరికీ
తెలియక
ఏకాంతమునకు
తీసికొనిపోయి
ఏవేవో
మాటాడుకొనువారు.
…
పాన్పులున్ననూ
వాటన్నిటినీ
విడచి
యిసుకపై
పరుండి
అర్జునుని
తొడపై
తలయుంచి
హాయిగా
నిద్రించెడివాడు.
మీ
తాత
కూడా
కృష్ణుని
అదే
రీతిగా
ప్రేమించెడి
వాడు.
వారిరువురు
ఒక్కొక్క
సమయమున
కొంత
కోపముగా
మాట్లాడుకున్ననూ
మరు
నిమిషమందే
కలిసిమెలిసి
యుండెడివారు.
వారిరువురు
నరనారాయణులనియే
చెప్పవచ్చు.
నాయనా!
దేహము
లేని
ప్రాణము,
ప్రాణములేని
దేహము
ఎట్లు
నిష్ప్రయోజనమో
అటులనే
అర్జునుడు
లేని
కృష్ణుడు,
కృష్ణుడు
లేని
అర్జునుడూ
యేనాడునూ
చూడలేదు.
ఎట్టి
రహస్యములైననూ
కృష్ణుడు
మీ
తాత
చెంతకాని,
మీ
తాత
కృష్ణుని
చెంతకాని
మరుగుపెట్టినది
లేదు.
ఈ
రీతిగా
కలిసిమెలిసి
యుండెడివారు.
వారిరువురి
విషయములో
ఏదని
తెలుపుదును?
నీకు
తెలిసికొనవలెనని
ఇచ్ఛవుండిన
ఫలానా
విషయమని
అడిగిన,
తప్పక
నే
చెప్పుటకు
సిద్ధముగా
నుందును"
అని
వ్యాసులవారు
కొంత
అవకాశమిచ్చిరి.
Previous
←
Parīkṣit's Boundless Kṛṣṇa-Bhakti
Next
The Burning of the Khāṇḍava Forest
→