Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Burning of the Khāṇḍava Forest
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
దహనం
ఈ
కథనంతయు
యేకాగ్రచిత్తుడై
వినుచున్న
పరీక్షిత్తు
గద్గదకంఠముతో
"స్వామీ!
ఖాండవవనము
కాల్చుటకుగల
కారణమేదియో
నాకు
బోధపడకున్నది.
అందులో
మా
తాతకు
శ్రీకృష్ణుడు
ఎట్లు
తోడ్పడెనో
తెలిపి
నన్నానందింప
జేయుము"
అని
నమస్కరించి
అడుగగా,
వ్యాసులవారు
"చక్కని
విషయము
నడిగితివి.
తెలిపెద,
వినుము!
ఒకానొక
సమయమున
కృష్ణార్జునులు
ఇరువురే
యమునానది
సైకతాలపై
విహరించుచూ
ఆనందముతో
లోకమునే
మరచి
సంచరించుచుండ,
ఒక
వృద్ధ
బ్రాహ్మణుడు
అచటికి
వచ్చి
"నాయనా!
నాకు
ఆకలగుచున్నది.
నా
ఆకలి
తీర్ప
యేదైననూ
ఒకింత
ఆహారమిడి
నా
ప్రాణముల
కాపాడుడు"
అని
అడుగగా
ఆ
పదములు
విని
ఉలిక్కిపడి
లేచిన
వారివలె
ప్రకృతి
దృష్టిలోనికి
వచ్చిచూడ,
ఆ
ముదుసలి
వ్యక్తి
సామాన్యవ్యక్తివలె
లేక
అతని
యందు
ఏదో
దివ్యకళ
వుట్టిపడుచుండినటుల
కనిపించెను.
అగ్నిహోత్రుడు
కృష్ణుని
శరణు
జొచ్చుట
ఇంతలో
కృష్ణుడు
ముందువచ్చి
"విప్రోత్తమా!
మీరు
చూడ
సామాన్య
బ్రాహ్మణులవలె
కనిపించకున్నారు.
కాన,
మీకు
సామాన్య
భోజనము
తృప్తి
కలిగించలేదు
కాబోలు.
నీకెట్టి
భోజనము
కావలయునో
కోరుకొనుము.
తప్పక
మీ
ఆకలి
తీర్చి
ఆనందమిత్తుము."
2
▾
Meaning
Keep
ఈ
మాటలు
వింటావుండిన
అర్జునుడు
ఆశ్చర్యముతో
చూచుచూ
నిలుచుండెను.
కారణమేమన,
అఖిల
దేశములకూ
ఆహారమునిచ్చి,
ఆనందముతో
ఆకలి
తీర్చు,
కృష్ణునకే
ఈ
ఒక్క
బ్రాహ్మణుని
ఆకలి
తీర్చుటకు
సందేహము
కలిగి
యెట్టి
ఆహారము
కావలయునో
అడుగమని
తెలుపుచూ
ఆ
బ్రాహ్మణుని
చెంత
వినయమున
మాటలాడుచున్నాడని
మీ
తాతకు
ఆశ్చర్య
మొకవంక,
సందేహ
మొకవంక
కలిగెను.
ఇంతలో
ఆ
వచ్చిన
బ్రాహ్మణుడు
ఫక్కుననవ్వి
ఇట్లనెను.
"దేవా!
నేనెవరో
నీకు
తెలియదా?
ఈ
లోకముననే
గాక,
పదునాల్గు
లోకము
లందును
నీకు
తెలియని
విషయము
ఒక్కటియునూ
లేదు.
నేను
తమ
సృష్టియందలి
ఒక్కప్రాణమును,
నా
పేరు
అగ్నిహోత్రుడు.
నాకు
కూడనూ
రోగము
ప్రవేశించి
పీడించుచున్నది.
నా
అజీర్ణ
రోగమునకు
తగినమందు
ఖాండవ
వనమునందలి
వృక్ష
సారమే
కాన,
ఆ
అడవిని
కాల్చిన
కానీ,
నా
రోగము
తీరదు.
కాన
తమరు
ఆజ్ఞ
యిచ్చిన
ఈ
వనమునందలి
యక్ష,
రాక్షస,
అసుర,
సర్పాదుల
మాంసములను
తగులబెట్టిన
నాకు
ఆకలి
తీరి,
ఆనందము,ఆరోగ్యము
చేకూరును"
అని
అడిగెను.
అందులకు
కృష్ణుడు
"సరి!
నీ
యిష్టము,
తగులబెట్టుము.
ఇందుకు
మా
ఆజ్ఞ
యెందులకు?
ఇది
మాకు
మరింత
విచిత్రముగ
కనిపించుచున్నది.
సమస్త
బ్రహ్మాండములు
భస్మముచేయు
శక్తిగల
నీకు
మరొకరి
సాయమెందుకు?"
అని
కృష్ణ
పరమాత్మ
యేమియూ
తెలియని
మానవునివలె
తెలుపగా,
అగ్ని
వినయ
విధేయతతో
"స్వామీ!
తమకు
తెలియనిది
కాదు.
ఈ
ఖాండవవనమున
తక్షకుడు
తన
పరివారముతో
నివసించుచున్నాడు
కదా!
అతనికి
ఇంద్రుడు
ప్రాణ
స్నేహితుడు.
ఈ
అడవిని
రక్షించు
బాధ్యత
ఇంద్రుని
తలపై
పెట్టుకొన్నాడు.
అంతేగాక
తక్షకునకు
రక్షింతునని
మాట
ఇచ్చెను.
కాన,
నేను
తగులపెట్టుటకు
ప్రారంభించిన
ఇంద్రుడు
తక్షణము
తన
పరివారమును
పంపి,
వర్షమును
కురిపించవచ్చును.
నన్ను
ఆర్పవచ్చును.
ఈ
సందేహము
నన్ను
పీడించి,
నా
వ్యాధి
3
▾
Meaning
Keep
తీరుటకు
మార్గము
లేక
పరితపించుచూ,
మిమ్ము
శరణు
జొచ్చితి"
అని
అగ్ని
తెలుపగ,
నందనందనుడు
నవ్వి
"అటులయిన
మేము
నీకు
యే
రీతిగా
సహాయము
చేయవలయునో
తెలుపు,
తప్పక
చేతుము"
అని
చెప్పగనే
అగ్నిదేవుడు
"ధన్యుడను,
ధన్యుడను
మీరు
తలంచిన
ఇంద్రుని
వర్షమును
మీ
అస్త్రములచే
నాపివేయగలరు.
అప్పుడే
నా
మనోరథము
ఈడేరగలదు"
అని
నమస్కరించగా;
గోపాలుడు
అభయ
మిచ్చెను.
అంత
మీ
తాత
గారు
"అగ్ని
దేవా!
నీవు
నిశ్శంకుడవై
ఖాండవ
వనమును
దహింపుము.
ఒక
ఇంద్రుడుకాదు,
కోటి
ఇంద్రులు
వచ్చిననూ
కూల్చివేతును,
అట్టి
బాహుబలము
కలదు.
కానీ,
నా
బలమునకు
తగిన
అస్త్ర
శస్త్రములు
కానీ,
వాటిని
మోయురథము
కానీ
నా
చెంత
లేక
యున్నది.
కాన
నా
వేగమును
సహించు
దివ్య
రథమును
నీవొసంగితివేని,
నేను
కృష్ణుని
ఆజ్ఞగైకొని
తప్పక
నీ
మనోభీష్టమును
నెరవేర్తునని"
తెలిపిరి.
అంత
అగ్నిదేవుడు
ప్రసన్నుడై
అక్షయ
తూణీరమును,
మారుతీ
ధ్వజముగల
రథమును
ఇచ్చెను.
అంతియే
కాక,
ఆగ్నేయాస్త్రమును
కూడనూ
తీసి
కృష్ణ
హస్తమందుంచి,
అగ్ని
సెలవు
తీసికొనెను.
నాయనా!
పరీక్షిత్!
అగ్నిదేవుని
సంతోష
పరచుటకై
కృష్ణుడు
ఆగ్నేయాస్త్రము
అందుకొనెను
గాని,
కృష్ణుని
సంకల్పమునకు
మించిన
అస్త్రములు
వేరొకటి
లేవు.
అతడు
సంకల్పించిన
క్షణమున
మిన్నూ
మన్నూ
యేకము
చేయగలడు.
లోక
నిమిత్తమై
ఆడెడి
ఆటలో
అంతరార్థమును
గ్రహించలేక
లోకులు
అపోహలకు
చోటిత్తురు.
అది
మానవులకు
కప్పుబడిన
మాయా
ప్రతాపము.
అగ్ని
ఖాండవవన
దహనము
చేయుట
ఈ
రీతిగా
కృష్ణుని
సెలవు
తీసికొని
అగ్నిదేవుడు
ఖాండవ
వనమును
తినుటకు
ప్రారంభించెను.
ఇంతలో
అనుకొన్నటులనే
ఇంద్రుడు
తన
పరివారమును
పంపి
ఖాండవ
వనమును
రక్షింపమని
తెలిపెను.
అయితే
వచ్చిన
పరివారము
ఏమి
ప్రయత్నించిననూ
వారికి
సాధ్యము
కాకపోవుటచేత,
వారు
వెనుకకు
వెళ్ళి
జరిగిన
4
▾
Meaning
Keep
పరాభవమును
ఇంద్రునకు
తెలుప,
ఇంద్రుడు
రౌద్రుడై
తన
బలవైన
పరివారమును
వెంటపెట్టుకొని
ఖాండవ
వనమును
రక్షించుటకు
వచ్చెను.
వచ్చీ
రాకమునుపే,
మీ
తాతయైన
అర్జునుని
యెదుర్కొనెను.
అంత
అర్జునుడు
గాండీవమును
పట్టి
దేవేంద్రునిపై
బాణముల
వర్షము
కురిపించెను.
ఈ
రీతిగా
ఇరుపక్షముల
వారు
బలములు
పూర్తిగా
ప్రయోగించిరి.
కొన్ని
నిమిషములలోనే,
అర్జునుని
అంబుల(బాణముల)
ధాటికి
తాళలేక
ఇంద్ర
పరివారము
పారిపోయిరి.
అంతలో
ఇంద్రుడు
ఒక్కడూ
యేమీ
చేయజాలక,
పరాభవముతో
యుద్ధము
చేయువాడు
తన
కొమారుడయిన
అర్జునుడని
భావించి,
మరింత
సిగ్గుతో
నా
వరప్రసాదమునే
నేను
జయించలేకపోతిని
కదాయని
చింతించి
వెడలిపోయెను.
తక్షకుడు
తప్పించుకొని
పారిపోవుట
అంత
అగ్నిదేవుడు
ఖాండవ
వనమును
నిర్దయముగా
నాలుకల
రాచుచూ,
మ్రింగుచూ,
భస్మమొనరించుచూ
పోవుట
చూసి
ఆ
తాపమునకు
తాళలేక
అనేక
మృగములు,
పక్షులు,
సర్పములు
పారిపోవ
వీలులేక
అందులోనే
పడి
భస్మమయిపోవుచుండెను.
ఇది
యిట్లుండ,
ఆ
వనమునందలి
మృగములను
కానీ,
సర్పములనుకానీ
యెటూ
వెలుపల
పోనీయక
కృష్ణుడు
తన
రథములో
వనము
చుట్టూ
తిరుగుచుండెను.
ఇట్లుండ,
ఇంద్రుని
మిత్రుడైన
తక్షకుడు
తప్పించుకొని
పారిపోవ
చూచెను.
అది
కనిపెట్టి
కృష్ణుడు
అర్జునుని
పిలుచులోపల
తప్పించుకొని
కురుక్షేత్రమునకు
పారిపోయెను.
అగ్ని,
వాయు
సహాయముచే,
తక్షకుని
భక్షింప
చూచెను.
కానీ,
అతను
దైవ
దానవ
సుప్రసిద్ధ
శిల్పి
యగు
మయుని
దగ్గరచేరెను.
మయుడు
కూడనూ
కురుక్షేత్రమునకు
పారిపోవుచుండ,
కృష్ణుడు
వెంబడింప
మయుడు
అర్జునుని
శరణుజొచ్చెను.
5
▾
Meaning
Keep
"అందులకు
మీ
తాతయగు
అర్జునుడు
అభయమిచ్చి
రక్షించెను.
ఈ
అభయమును
పొందిన
మయుడు
ప్రసన్నుడై,
అర్జునునికి
నమస్కరించి
"పాండవనందనా!
నీమేలు
మరువను.
నీకేమి
కావలయునో
నావలన
చేతనయిన
పని
నేను
నీకు
చేతును"
అని
ప్రార్థించగా
మీ
తాతయగు
అర్జునుడు
చక్కగా
యోచించి
"మయా!
నీవు
నాకు
సంతృప్తి
చేయతలంచితివి.
కాన
నా
అన్నయగు
ధర్మజునికి
ఈ
ప్రపంచమున
సాటిలేని
ఒక
భవనమును
(సభను)
నిర్మింపుము.
దైవ
దానవ
గంధర్వులు
సహితము
నిర్మింప
చేతగానిదై
యుండవలెను.
దానిని
చూచు
వారెల్లరికీ
ఆశ్చర్యమును
కలిగించునదై
యుండవలెను.
ఇంతకంటే
నాకు
ఈ
ప్రపంచమున
ప్రియమైన
దేదియునూ
లేదు"
అని
తెలుపగ
కృష్ణుడు
అంతటితో
పూరుకొనక,
"సభ
నిర్మించిన
ప్రయోజనమేమి?
ధర్మజుడు
కూర్చొనుటకు
ఆ
వింత
భవనమునకు
తగినట్టిదైన
వింత
సింహాసనము
ఒకదానిని
అమర్చుము;
అపుడే
ఆ
భవనమునకొక
శోభ"
యని
పలికెను.
కృష్ణ
పాండవులపై
కౌరవుల
ద్వేషము
"చూచితివా
పరీక్షిత్!
మీ
తాతలన్న
కృష్ణుని
కెంత
ప్రేమనో!
భక్తవత్సలత
అన్న
ఇంత
కంటే
వేరు
తార్కాణమెందులకు?
ఆ
వింత
సభను
చూచియే
కదా!
దుర్మార్గుడగు
దుర్యోధనునికి
వళ్ళుమండెను.
జలమున్న
చోట
జలము
లేనటులను,
ద్వారములున్న
చోట
ద్వారములు
లేనటులను
అమర్పబడిన
ఆ
భవనములో
దుర్యోధన,
దుశ్శాసనాదులు
యెన్ని
పరాభవముల
పాలయిరో
చెప్ప
సాధ్యము
కాదు.
వళ్ళంతయు
గాయము,
ఈ
అవమానమును
సహించలేకనే
పాండవులపై
వారికి
అంత
ద్వేషము
పెరిగెను.
"కౌరవులు
నిరంతరము
పాండవుల
కీడునే
కోరుచున్నను
వారు
కృష్ణుని
ప్రేమానురాగములచే
వాటి
సన్నింటినీ
అవలీలగా
తప్పించుకొని,
దినదినాభివృద్ధి
గాంచి,
చిత్ర
విచిత్రమైన
వైభవములు
పొందుచున్నారు.
దీనికంతయూ
ఆ
యాదవ
బాలుడే
కారణమని
కృష్ణునిపై
కూడనూ
కౌరవులకు
ద్వేషము
యేర్పడెను.
6
▾
Meaning
Keep
అయితే
ఆ
పరమాత్మ్యుని
యెవరేమి
చేయగలరు?
అది
వారి
వారి
అజ్ఞానము
కాని
వేరుకాదు!"
అని
వ్యాసుల
వారు
తక్షకుని
కథ
చెప్పుచుండగనే
యెంతయో
శ్రద్ధగా
వినుచున్న
పరీక్షిత్
మహారాజు
వెంటనే
ఆశ్చర్యముతో,
"స్వామీ!
అట్టి
దుర్మార్గులైన
కౌరవులు
మా
అప్పగారైన
ద్రౌపదిని
అన్ని
విధముల
పరాభవముచేయుటకు
గల
కారణమేమి?
నిజముగా
మా
తాతలు
అవ్వగారి
పరాభవమును
ఎట్లు
సైరించిరి?
మహా
పరాక్రమశాలురను
పేరును
పొంది,
ద్రౌపదిని
నిండు
సభలో
అంతటి
ఘోర
కృత్యము
సలుపుచుండ
అదే
సభయందు
మా
తాతలు
ఐదుమందీ
ఉండియూ
ఎందులకు
ఆమెను
రక్షించలేకపోయిరి?
ఈ
విషయము
నాకేమియు
అర్థము
కాకున్నది.
అసలు
విషయ
మేమియో
తెలిపి
నా
అనుమానము
తీర్చి
ఆనందపెట్టుము"
అని
దీనతతో
కంటిధారలు
కార్చుచూ
పరీక్షిత్
ప్రార్థించెను.
Previous
←
Remembrances of the Līlās of Śrī Kṛṣṇa
Next
The Pāṇḍavas, Ideal Dharmātmas
→