Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Pāṇḍavas, Ideal Dharmātmas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
19.
పాండవులు
ఆదర్శ
ధర్మాత్ములు
పరీక్షిత్
ప్రార్థనలను
మన్నించి
వ్యాసుడు
"నాయనా!
పాండవులు
మహా
ధర్మాత్ములు.
ఆడిన
మాట
తప్పరు.
అపజయమగుటచే
పాండవులు
కౌరవులకు
బానిసలైతిమనియూ,
వారిని
ధిక్కరించునట్టి
అధికారము
పాండవులకు
లేదనియును
ధర్మజుని
ధర్మసూక్తులను
అనుసరించుటచే,
మీ
తాతకానీ
చినతాతలు
కానీ
యేమియూ
చేయలేకపోయిరి.
లేకున్న,
కౌరవుల
రక్తమును
త్రాగి
వారి
దేహములను
కాకులు,
గ్రద్దలకు
ముక్కలు
చేసి
చల్లియుండెడివారు.
అక్కడికినీ
ధర్మజుడు
ఎంత
అరికట్టిననూ
మధ్య
మధ్య
మీ
తాతయైన
భీముడు
పగ్గములు
త్రెంపుకున్న
సింహమువలే
కౌరవులపై
పడుచుండెడివాడు.
మీ
పెదతాతయగు
ధర్మజుని
ధర్మసూక్తులను
పరిహసించుచుండెడివాడు.
ఏమిచేతురు?
అన్నయగు
ధర్మజుని
ఆజ్ఞకు
కట్టుబడుటచే
ఆ
రీతిగ
చచ్చు
వారివలె
వుండవలసి
వచ్చెను,
అని
వ్యాసులు
తెలుపగా
పరీక్షిత్,
"ఇంతకూ
మా
తాతలు
కౌరవులకు
బానిసలగుటకు
కారణమేమి?"
అని
అడుగగనే
మహా
బుషులైన
వ్యాసులవారు
చిరునవ్వు
నవ్వుచూ,
"నాయనా!
చెప్పెదను
వినుము.
కౌరవుల
మాయాజూదము
మయుడు
నిర్మించిన
సభలో
రాజసూయయాగమును
అతి
వైభవముగా
మీ
పెదతాత
జరుపుచు,
కౌరవులను
ఆహ్వానించెను.
వచ్చి
చూచిన
కౌరవులకు
ఆ
వైభవములు
చూచి
ఈర్ష్యకలిగి
ఆనాటి
నుండియూ
పగపట్టిరి.
యెటులయిననూ
2
▾
Meaning
Keep
పాండవులను
ఈ
వైభవములనుండి
తొలగించి,
వారలను
కదగండ్ర
పాలుజేయవలెనని
దురాలోచనలు
సలిపి,
దానికి
తగిన
మార్గమేదియో
అని
కొందరు
దుష్టులను
ప్రోగుచేసి
ఒక
పన్నాగమును
పన్నిరి.
అదియే
ద్యూత
సభ.
వెన్న
పూసిన
కత్తి
వలె,
లోలోన
కౌరవులకు
దుష్టబుద్ధులు
ఘాటుగ
పెరుగుచున్ననూ,
పైపైన
పాండవులన్న
యెంతయో
ప్రేమ
ప్రదర్శనలు
సలుపుచూ
విదురుని
ద్వారా
మీ
పెదతాతకు
కబురంపి
ధృతరాష్ట్రుడు,
"నాయనా!
మీరు
మీ
సోదరులు
కొంత
కాలమందరూ
ఒక
చోటచేరి
ఆనందముగా
జూదమాడి
తమాషాగా
కాలము
గడుపుడు"
అని
తెలుపగా,
నిష్కపట
చిత్తుడైన
మీ
తాత
ధర్మజుడు
ఈ
దుష్టులతలంపులను
యోచింపక,
సోదరులు
కదా,
అను
భావముతో
జూదమాడి
వారు
పన్నిన
మోసములకు
కట్టుబడి
అన్నింటినీ
ఓడి
తన
సోదరులను
కూడను
ఒక్కొక్కరిని
ఒడ్డి
వారినీ
ఓడి
కడకు
తనను
తానే
ఒడ్డుకొని
అదియునూ
ఓడి,
కడపట
ద్రౌపదిని
ఒడ్డి,
ఆమెను
సహితము
ఓడిపోయెను.
ఇది
మాయాజూదమని
తెలిసికొనక,
తన
పెదతండ్రి
కొమారులు
ఇట్లు
చేతురని
యోచింపక,
శకుని
మాయలను
స్మరించక,
జూదమున
నియమానుసారముగ
గెలిచిన
వారికి
ద్రౌపది
దాసి
అగుటచే
కడుపులోని
కుళ్ళు
క్రక్కుటకై
కౌరవులు
వేరుమార్గములేక
ద్రౌపదిని
అవమానము
చేయవలెనని
హేయబుద్ధిచే
హేయకార్యము
జేయ
ప్రారంభించిరి."
పరమపాపులే
పరస్త్రీలను
పరాభవింతురు
ఆ
మాట
వినగానే
పరీక్షిత్
మహారాజు
కంటిధారలు
కాలువలై
ప్రవహించుచూ
హీనస్వరముతో
"స్వామీ!
రాజులై
తన
అన్న
భార్య
అంతే
గాదు
చక్రవర్తిని,
చక్రవర్తియగు
గుడ్డిరాజు
భార్యతో
కూర్చుని
కోడలికి
యిన్ని
విధముల
పరాభవము
జరుగుచుండ
ఆ
ధృతరాష్ట్రుడు
ఎట్లు
వూరకుండెను?
చూచుటకు
కన్నులు
లేకపోయిన,
వినుటకు
చెవులు
కలవు,
కదా?
మా
అవ్వగారైన
ద్రౌపది
అన్నివిధముల
ప్రార్థించుచూ
రోదన
జరుపుచుండ
చెవులకు
ప్రత్తి
పెట్టెనా?
ఎట్టి
స్త్రీ
నైననూ
ఆపదలో
రక్షింపవలెనేకాని,
పరాభవము
చేయరాదని
శాస్త్రము
3
▾
Meaning
Keep
శాసించుచుండ,
ఈ
దుర్మార్గులు
చక్రవర్తులై
ప్రజలకు
మార్గదర్శకులై
తామే
ఇట్లు
శాస్త్రవిరుద్ధముగా
ప్రవర్తించిన,
ఇట్టివారు
చక్రవర్తులెట్లగుదురు?
పరమ
నీచులు
కదా
పరమ
పాపులే
పరస్త్రీలను
పరాభవింప
జాతురు.
ఇట్టి
కిరాతకువకు
పట్టము
గట్టుట
చేతనే
రాజ్యమన్నివిధముల
ఛిన్నాభిన్నమై,
కడకు
ఆ
చీడ
పురుగునకు
సర్వనాశనమూ
కలిగెను.
దైవము
గ్రుడ్డి
కాదు
కదా!"
అని
విలపించుచున్న
పరీక్షిత్ను
వ్యాసులవారు
ఓదార్చుచుండెను.
"దైత్య,
దానవులు
కూడనూ
తమ
కుల
స్త్రీలను
ఆదరింతురు;
వారి
కులములందు
ఇట్టి
పరాభవము
కులమువారందరికీ
పరాభవముగనే
తలంతురు.
అట్టిది
ఇందరు
కుల
పెద్దలు,
చక్రవర్తులు,
గురువులు,
మహా
మహా
మేధావులు
ఉన్నసభలో
ఇట్టి
ఘోరకార్యము
జరుగుచుండిన
చూచువారల
బుద్ధులు
కూడనూ
మొద్దులు
పారెనా?
లేక
వారల
కన్నులకు
పొరలు
కప్పెనా?
వారల
తెలివి
తేటలు
గడ్డి
తినెనా?
కులఘాతక
కృత్యమును
చూచుచూ
ఊరకుండుటకు
వారలకేమైననూ
కులతత్త్వమే
తెలియక
పోయెనా?
ఇక
ఈ
పెద్దల
బుద్ధులు
ఏమి
బుద్ధులు?
వారల
గొప్పతనములు
ఏడ్చినటులనే
వున్నవి"
అని
పెద్దల
చేష్టలను
పరీక్షిత్
తూలనాడుచుండగా,
వ్యాసులు
అడ్డుతిరిగి
"నాయనా!
పరీక్షిత్!
తొందర
పడకుము.
చేరిన
పెద్దలకెవ్వరికినీ,
ఈ
దుష్టులైన
దుర్యోధన
దుశ్శాసనాదులు
చేయు
చర్యలు
ఇష్టము
లేకపోయిననూ,
మంచిది
కాదని
మందలించిననూ
వినక,
పాపకృత్యములకు
పూనుకొన్న
కౌరవులను
ఎవరేమి
చేతురు?
ద్రౌపదిని
కురులు
పట్టి
దుశ్శాసనుడు
నిండు
సభకు
ఈడ్చుకొని
వచ్చుచుండగ,
విదుర,
భీష్మ,
ద్రోణాచార్యులు
ఎంత
బాధపడిరో
తెలుపజాల;
వారల
కంటినీరు
కాలువలై
ప్రవహించి,
కన్నెత్తైననూ
చూడలేకపోయిరి.
"అంతేకాదు,
పరమ
పవిత్రురాలగు
ద్రౌపది
కండ్లనుండియూ
అగ్నికణములు
రాలుచుండెను.
నిజముగా
ఆ
కణములతో
చేరిన
దృష్టి
ఆ
సభమధ్యమందున్న
వారలపై
ఎవరిపై
పడియుండిననూ,
తక్షణము
భస్మమయి
వుండెడివారు."
4
▾
Meaning
Keep
ధర్మజాదుల
శాంత
శీలము
అయితే
ఆమె
గుణశీలుడైన
మీ
తాత
ధర్మజుని
మాత్రమే
చూచుచూ,
అతని
శాంత
స్వభావమును
స్మరించు
చుండుటచే,
సభ
కొంత
రక్షింపబడెను.
లేకున్న
దుర్యోధన,
దుశ్శాసనాదులు
నిమిషములో
భస్మమయి
వుండెడివారు.
మీ
చినతాతలయిన
అర్జున,
భీమ,
నకుల,
సహదేవాదులు
సహితము
ద్రౌపది
పలుకులు
ములుకులవలె
కర్ణముల
ద్వారా
లోనికి
గ్రోలుచుండిననూ,
వారల
దృష్టి
ధర్మజుని
ముఖకమలముపై
బడియుండుటచే
వారు
కూడనూ
చల్లని
హృదయములై
శాంతముగా
కూర్చొన
గలిగిరి.
అనగా,
ఆనాడు
ధర్మజుని
శాంతశీలమే
అందరినీ
కాపాడ
గలిగినదే
కానీ,
లేకున్న
భారతయుద్ధము
చేయునట్టి
అవకాశమే
లేక
ఆ
సభయందే
అందరూ
భస్మమయి
వుండెడివారు.
దేనికైననూ
దైవేచ్ఛ
ఒకటి
ఆధారమైయుండును
కదా?
కృష్ణ
పరమాత్మ
సంకల్పము.
ఎవరెట్లు
మీరగలరు?
"ఇంత
వరకును
పతుల
పరాక్రమములను
వర్ణించుచూ,
ఒక్కరైననూ
తనను
కాపాడకున్నారే"
అని
విలపించుచున్న
ద్రౌపదికి
మెరుపువలె
కృష్ణచింత
ఆమె
తలయందుచేరి
హృదయమున
నిండి,
కడకు,
"శ్యామసుందరా!
ఈ
పరాభవము
నాదికాదు.
పాండవులది
కాదు.
నీదే!
మా
సర్వస్వము
నీవైయుండియూ
ఇట్టి
కఠిన
శిక్షను
విధించచూచుట
నీకు
న్యాయముకాదు.
ఇంతకాలము
మా
హృదయముల
అర్పితము
చేసితిమి.
అంతటితో
నీకు
తృప్తి
కాలేదు
కాబోలు!
ఇదిగో,
నేడు
దేహములు
కూడను
అర్పితము
చేయుచున్నాము.
నీ
యిష్టము"
అని
సంపూర్ణ
శరణాగతురాలయ్యెను.
ద్రౌపది
భక్తి
-
కృష్ణుని
శక్తి
"ఇకచూడు!
భక్త
రక్షకుడు,
ఆర్తత్రాణ
పరాయణుడు,
అనాథ
రక్షకుడు,
శరణాగత
త్రాణుడు,
సర్వబాధ్యతలు
వహించి,
నిర్గుణ,
నిరాకారరూపుడై
ద్రౌపదియందుచేరి,
యెన్ని
వలువలు
తీసిననూ
తరుగక
అక్షయములుగా
జేసెను.
5
▾
Meaning
Keep
"అక్కడ
చేరిన
వారలందరికినీ
ద్రౌపది
భక్తి,
కృష్ణుని
శక్తి
ఆశ్చర్యమును
కలిగించి,
సత్యమునకును,
ధర్మమునకునూ
విజయము
తప్పదను
తలంపులు
అందరి
నేత్రములనుండి
వ్రాలుకన్నీటి
ధారలే
బుజువు
చూపెను.
కడకు
దుశ్శాసనుడు
అలసి
క్రిందకూలెను.
కాని,
ద్రౌపది
కెట్టి
పరాభవమునూ
కలగలేదు.
అయిన
పరాభవమంతయు
కౌరవులకే
కాని,
పాండవులకు
కాదు.
ధర్మమూర్తులైన
పాండవులను
పరాభవింప
జూచిన,
దైవము
సహించునా?
ఒకరికి
చేయనెంచిన
పరాభవము
వారలకే
ఎదురు
తిరిగి
శిక్షించెను.
ఇది
అంతయూ
మీ
తాతలకు,
అవ్వకు
కృష్ణునిపై
గల
భక్తి
శ్రద్ధలనూ,
కృష్ణునకు
మీ
తాతలపై
గల
అనుగ్రహా
దయనే
కారణము.
పాండవుల
భగవత్
విశ్వాసమును
ప్రకృతికి
చాటతలంచి
రాబోవు
కలియుగమునకు
ఆదర్శప్రాయులు
చేయ
తలంచి,
పరమాత్ముడాడిన
లీలానాటకమే
కాని
వేరు
కాదు.
ఎన్ని
బాధలు,
నిందలు,
నిష్ఠూరములు
సంప్రాప్తమయిననూ
దైవార్పిత
బుద్ధితో
వాటికి
స్వాగతము
చెప్పిన,
వీటి
మంచి
చెడ్డలు
భగవంతుడే
చూచుకొనగలడను
దృఢత్వమునూ,
భక్తులైన
వారలకు
ఎన్ని
ఇక్కట్లు
గలిగిననూ,
ఓపికతో
నెదుర్కొన
వలెననియునూ
మంచి
వారలకే
అనగా
దైవ
భక్తులకే
కష్టములు
అధికముగా
కలుగునను
అంశములనూ,
తెలుప
తలంచి,
పాండవులను
నిమిత్త
మాత్రులుగా
పెట్టుకొని,
కృష్ణుడు
ఆడిన
ఆటనే
ఈ
ఆట,
అంతయూ
ఆతని
లీల"
అని
వ్యాసుల
వారు
తెలిపిరి.
Previous
←
The Burning of the Khāṇḍava Forest
Next
The Special Graces of Kṛṣṇa upon Draupadī
→