Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Special Graces of Kṛṣṇa upon Draupadī
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
20.
ద్రౌపదిపై
కృష్ణ
కృపా
విశేషములు
"అక్షయ
వలు
వలు
ఇచ్చుచున్న
ఆ
కృష్ణ
కృపా
విశేషములను
స్మరించుచూ,
ద్రౌపది
స్తంభించిపోయి,
కంటిధారలు
కాలువలై
పార,
"కృష్ణా!
కృష్ణా!"
అని
ఉన్మత్తురాలివలే
కేకలు
వేయుట
సభా
మధ్యమందున్న
వారలకు
భయాందోళన
కలిగి,
సాక్షాత్తు
శక్తియే
ఈ
రూపమున
అవతరించెనా?
అన్నట్లు
ఆమె
దివ్యతేజస్సును
చూడలేక
పోయిరి.
ద్రౌపది
తన
కురులను
విరియబోసుకొనుట
"అంతలో
మీ
అవ్వగారైన
ద్రౌపదికి
కృష్ణ
పరమాత్మ
ప్రత్యక్షమయి,
"చెల్లీ!
నేనుండ
భయమెందులకు?
ఈ
మదాంధుల
రూపుమాపుటకే
నే
జన్మించితిని.
పాండవుల
ఖ్యాతిజ్యోతిని
వెలిగింతును.
వూరడిల్లుము"
అని
శాంతి
వాక్యములు
పలుకగనే,
ఆమె
కాటుక
కంటిధారలచే
కృష్ణపాదపద్మములను
కడిగి,
పాదములపై
విరియబడిన
ఆమె
కేశపాశములచే
పాదములను
నింపి
తన్మయత్వరాలై
నేల
కూలెను.
ఆమె
ఆనందోద్రేకము
సభవారికందరికిని
మహాశ్చర్యము
కలిగించెను.
అంత
గోపాలుడు
ఆమె
తలపై
తన
దివ్యమంగళ
హస్తము
నుంచి
దీవించి
"లెమ్ము!
విరియబడిన
నీ
కురులు
సరిదిద్దుకొమ్ము!
ముందు
జరుగబోవు
దానిని
యోచించుము.
నీ
పతులను
చేరుము"
అని
కృష్ణపరమాత్మ
తెలుపు
పలుకులు
వినుచున్న
ద్రౌపది,
పడగ
విప్పిన
పామువలె,
ఆ
విరియబడిన
తన
కురులు
2
▾
Meaning
Keep
ముఖముపై
వ్రాల,
ఆమె
కాంతి
కన్నులు
మెరుపు
తీగవలె
మెరియ,
దిగ్గున
సభామధ్యమున
నిలిచి,
"కృష్ణా!
చిరిగిన
వస్త్రమును
కుట్టవచ్చును
కాని,
అతికించవీలుకాదు.
కులీన
కన్యకు
ఒకపరి
కన్యాదానము
కానీ,
మాటిమాటికి
జరుగదు.
విరిగిన
పాలు
యేమి
చేసిననూ,
మంచి
పాలు
కానేరవు.
వెలుపలవచ్చిన
యేనుగు
దంతములు
తిరిగి
లోన
వెళ్ళవు.
అటులనే
ఈ
ద్రౌపది
కేశములు
వీడినవేవో
వీడినవి.
ఈ
దుష్టుల
కలుషితమగు
కరములచే
స్పర్శింపబడిన
ఈ
కేశపాశములు
వెనుకటివలే,
సౌభాగ్య
వేడీబంధనము
కానేరవు"
అని
పలికెను.
ద్రౌపది
శపథము
సభవారందరూ
అవమానపరులై
సిగ్గుచే
తలలు
క్రింద
వంచుకొనిరి.
అంత
కృష్ణపరమాత్మ
వూరుకొనక
"చెల్లీ!
అటులయిన
నీ
కురులు
వెనుకటివలె
మరల
యెపుడు
ముడిచెదవు?
ఈ
విధముగా
విరియబోసుకొన్న
కురులు
చూచుట
కెంతయో
ఘోరముగ
నుండును
కదా!"
అని
అడిగెను.
అంత
వీరసతియైన
ద్రౌపది
సింహనాదమువలె
శృతిని
మార్చి,
"శ్యామసుందరా!
యే
దుర్మార్గుడు,
వాని
పాపపు
చేతులచే
నా
కేశములను
స్పర్శించి
ఈడ్చుకొని
వచ్చెనో,
వాని
తలముక్కలై
కుక్కలు
పెరుక
వాని
ఇల్లాలు
విధవయ్యె,
తల
వెంట్రుకలు
విరియబోసుకొని
యేనాడు
విలపించునో,
ఆనాడే
నా
కేశములకు
తిరిగి
సంస్కారము
జరుగును.
అంతవరకు
ఈ
కేశములు
ఇటులే
వుండవలెనని
శపథము
చేయగనే
సభయందు
చేరిన
పెద్దలు,
ధర్మదూతలు,
చెవులు
మూసుకొని
"శాంతించుగాక!
శాంతించుగాక!
మహా
సాధ్వీమణియగు
ద్రౌపది
క్షమించుగాక!
అని
నినాదములు
చేసిరి.
ధర్మమెక్కడో
దేవుడక్కడ
ధృతరాష్ట్రుని
గుండెలు
జారిపోయెను.
కౌరవులు
పైపైన
మహావీరులవలె
కనిపించుచున్ననూ,
లోలోపల
వారికిని
భయభ్రాంతుల
తుఫానులు
వీచెను.
ఈ
3
▾
Meaning
Keep
మాట
నెరవేరక
తప్పదని
అందరియందూ
ఒక
విధమయిన
భయము
చెలరేగెను,
దీనికి
తగినట్లు
శ్యామసుందరుడు,
ఆమెను
ఓదార్చుచు,
"ద్రుపదకుమారీ!
అట్లే
జరుగుగాక;
నీ
పతుల
హృదయములను
పరితపింపజేసిన
దుర్మార్గులను
తుద
ముట్టింప
జేసెద.
పుట్టినప్పటినుండియూ
పరిహాసమునకైనను
అసత్యమాడి
యెరుగని
నీ
జిహ్వ
ఈనాడు
మాత్రము
నీవాడిన
మాట
ఫలించకపోదు.
నీది
సత్యవాక్కు,
సత్యమునకు
జయము
తప్పదు"
అని
కృష్ణపరమాత్మ
మీ
అవ్వగారైన
ద్రౌపదికి
అభయమిచ్చి,
కడకు
కౌరవులను
సర్వనాశముచేసి,
పాండవుల
ధర్మమును
లోకమునకు
చాటించి
"ధర్మమెక్కడో
దేవుడక్కడ.
దేవుడెక్కడో
విజయమక్కడే"
అను
పవిత్ర
సూక్తిని
లోకమునకు
బోధించెను.
చూచితివా?
నీ
తాత
లెంతగొప్పవారో;
భగవంతుడైన
కృష్ణపరమాత్మ
అనుగ్రహపాత్రులగుటకు,
వారి
ధర్మప్రవర్తనలే,
సత్యవాక్కులే
మూలకారణము.
కనుక,
లోకమున
ఎట్టి
యజ్ఞయాగాది
క్రతువులు
సలుపకుండిననూ,
సత్యధర్మములే
జీవులకు
సంసార
సాగరమును
దాటించు
చక్కని
తెప్పవలె
నిలువగలవు.
గట్టు
అను
ముక్తిని
చేర్పగలవు.
కాకున్న
మహా
తపశ్శక్తి
సంపన్నుడైన
ఆ
దూర్వాస
మహా
ముని
కౌరవుల
ప్రోద్బలములతో
అరణ్యవాసము
చేయుచున్న
మీ
తాతల
చెంతకు
వెళ్ళి,
మీ
తాతలనెట్లయిననూ
భస్మమొనరించవలెనను
సంకల్పముతో
అనేక
పన్నాగములు
పన్నిననూ
సాధ్యము
కాక,
తపశ్శక్తికంటెనూ
భగవత్
ప్రార్థనమైన
భక్తి
శక్తియే
గొప్పదని
తెలిసికొని
పాండవులను
కొనియాడెను"
అని
వ్యాసులవారు
పాండవుల
భక్తి
ప్రపత్తులను
సగర్వముగా
వర్ణించుచుండ,
అతి
ఆశ్చర్యముతో
పరీక్షిత్
మహారాజు
తలపైకెత్తి
"యేమీ?
యేమీ?
దుర్వాసుడు
మా
తాతలను
వంచించబోయి,
పరాభవము
నొందెనా?
ఆహా!
మహా
బుషుల
కంటెను
మహాశక్తి
సంపన్నులా
నా
తాతలు?
అట్టివారల
వంశమున
పుట్టిన
నేనెంత
అదృష్టవంతుడనో
కదా!"
అని
"స్వామీ!
దుర్వాసుడు
మా
తాతల
నెట్లు
వంచించ
బోయెనో
తెలుపుడు"ని
ప్రార్థించెను.
"మహారాజా!
గోపాలుని
కృపా
పాలనముచే
మీ
తాతలైన
పాండవులు
వనమునందు
సర్వసంతోష
సదుపాయములతో
చక్కని
పేరు
ప్రతిష్ఠలను
4
▾
Meaning
Keep
ఆర్జించుచుండిరి.
హస్తినాపురముకంటే
అరణ్యమే
పాండవులకు
హాయనిపించినది.
"చక్కని
పరిమళముగల
పుష్పము
కుడిచేతియందుంచుకొన్ననూ,
ఎడమ
చేతియందుంచుకొన్ననూ
దాని
సువాసన
యెట్లు
మారక
యేకస్థితిగా
నుండునో,
అటులనే
మంచి
వారి
హృదయములు
అడవులయందున్న,
ఆకసముననున్న,
పల్లెనున్న,
పట్టణముననున్న,
గుట్టమీదనున్న,
నట్టేటయున్నా
పట్టువిడువని
పవిత్రత
చిట్టచివరి
వరకూ
మారదు.
దానికి
మీ
తాతలే
ప్రత్యక్ష
సాక్షులు.
సన్మార్గులయొక్క
సంతోష
శాంతులు
దుర్మార్గులకు
దుఃఖదాయకము.
కోకిలగానములు
కాకులకు
కర్ణకఠోరమగునట్లు,
వనమునందలి
మీ
తాతల
వైభవములు
దుర్మార్గులైన
దుర్యోధన,
దుశ్శాసనులకు
వ్యాకులత
కలిగించుచుండెను.
కాని
యేమి
చేయగలరు?
చేయవలసిన
వన్నియూ
చేసిరి.
పెట్టవలసిన
బాధలన్నియూ
పెట్టిరి.
తిట్టవలసిన
తిట్లన్నియూ
తిట్టిరి.
కడకు
రాజ్యమునుండి
తరుమగొట్టి
ఒట్టి
తిత్తులతో
వనమునకు
పంపిరి.
వారి
దృష్టిలో
పాండవదేహములు
ఒట్టి
తిత్తులని
తలంచిరేమో
కానీ,
నిజముగా
అవి
గట్టి
తిత్తులు.
బ్రహ్మాండనాయకుడైన
గోపాలుడు
నిండిన
దేహములు
మీ
తాతల
కాయములు.
"అట్టి
కాయములతో
పోరాడుటకు
యెట్టివారికినీ
సాధ్యము
కాదు.
అందువలననే
ఆ
కాయముల
జోలికిపోక,
కేవలము
భౌతిక
పదార్థములను
మాత్రము
మోసకృత్యములతో
వశము
చేసుకొనగల్గిరి.
ఇక
జూదమాడుటకా?
మీ
తాతలకు
మిగిలిన
ఆస్తిపాస్తు
లేమియూ
లేవాయెను.
పోనీ!
మీ
తాతలలో
ఒకరి
కొకరికి
కలహములు
కలిగించి
విడగొట్ట
సంకల్పించి
యెన్నియో
అసభ్యభావములు
సృష్టించిరి.
కానీ,
సత్యమెరిగిన
సోదరులు
కనుక,
మీ
తాతలలో
అట్టి
దుర్బుద్ధులకు
చోటులేనందున
అదియునూ
వృథా
ఆయెను.
కౌరవులు
దుర్వాసుని
పాండవులపై
పురిగొల్పుట
ఏమి
చేసిననూ,
పాండవులకు
నాశము
రాలేదని
బాధ
కౌరవులలో
కారు
చిచ్చయి
మండుచుండెను.
ఏమీ
పాలుపోక
పరితపించుచున్న
సమయమున
5
▾
Meaning
Keep
పదివేలమంది
శిష్య
బృందముతో
సాక్షాత్
కోపమే
ఆకారమును
ధరించిన
దుర్వాస
మహాముని
చాతుర్మాసదీక్ష
పూనుటకై
హస్తినాపురమును
ప్రవేశించెను.
దుర్వాసుని
శక్తిసామర్థ్యములు,
అతని
స్వభావ
ప్రవర్తనలూ
కౌరవులు
చక్కగా
యెరిగిన
వారగుట
చేతను,
అతనిని
ప్రసన్నుని
గావించుకొని
మీ
తాతలైన
పాండవులను
హత
మార్పించవలె
ననియూ
లోలోన
సంకల్పములు
గాఢముగా
పెంచుకొనుచు
మహాముని
యేమి
కోరిననూ,
యెట్లు
చెప్పిననూ
అట్లు
చేయుచు
చేయించుచూ,
దుర్వాసునకు
కానీ,
అతని
శిష్యబృందమునకు
కానీ,
యెట్టి
లోపమునూ,
నిరాశయునూ,
ఆగ్రహమునూ
రానీయక,
కావలసినవి
యెంత
ధనమైనను
వ్యయముచేసి
మృష్టాన్నముతో
నాలుగు
మాసములు
సేవలు
చేసిరి.
మహాబుషి
యెట్టి
కఠినోక్తులాడిననూ
ఓర్పుతో
చేతులుకట్టి
ప్రతి
దానిని
అంగీకరించుచూ,
యెటులనో
మహామునిని
సంతుష్టుని
గావించిరి.
ఒకనాడు
దుర్వాసుడు
మృష్టాన్నము
నారగించి
సంతుష్టుడై
ఆసనమున
కూర్చొని
ప్రసన్న
వదనముతో
"రాజా!
నీ
సేవలు
నన్నెంతయో
తృప్తి
పరచినవి.
నీకేమి
కావలెయునో
యెట్టి
కఠిన
వరమునైననూ
సరియే,
కోరుకొనుము
అనుగ్రహింతు"నని
ప్రోత్సహించెను.
అంత
దుర్యోధనుడు
తన
వాంఛ
ఫలించునట్టి
సమయము
ఆసన్నమైనదని
సంతసించి,
అతి
వినయ
విధేయతలను
ప్రదర్శించుచూ,
"స్వామీ!
తాము
ప్రసన్నులగుటయే
నాకు
కోటి
వరదానములతో
సమానము.
అంతియే
చాలును.
నాకు
ధనైశ్వర్యములకెట్టి
లోటునూ
లేదు.
నాకిపుడు
త్రైలోక్యాధిపట్టము
కట్టిననూ
శాంతి
సంతసములు
వుండవు.
ఇట్టి
మహా
పురుషులను
ఆశ్రయించి,
వారల
కాతిధ్యము
నిచ్చునట్టి
ఈ
సమయమున
మా
సోదరులైన
పాండవులు
ఇంటలేక
పోయిరి
కదా
అను
కొరత
ఒక్కటి
తప్ప
మరే
కోరికయునూ
లేదు.
వారికి
కూడనూ
ఇట్టి
మహద్భాగ్యమునిచ్చి
కడతేర్తురు
గాక!
నా
యాతిధ్యమున
కెట్లువచ్చితిరో,
అటులనే
మా
అన్న
అగు
ధర్మజుని
కడకు
మీ
శిష్య
కోటితోవెళ్ళి,
వారికి
కూడనూ
ఇట్టి
ఆతిధ్య
సదవకాశమును
అందించిన
అదియే
6
▾
Meaning
Keep
చాలును.
మా
వంశమునకు
జ్యేష్ఠుడగు,
ధర్మజుడు
ధర్మపాశబద్ధుడై,
వలదన్ననూ
వినక
వనమునకేగెను.
అక్కడ
సహితము
నిత్యము
లక్షలాది
అతిథి
అభ్యాగతులకు
ఆతిథ్య
మిచ్చుచున్నాడని,
సంతర్పణలు
సలుపుచున్నారనియూ
వింటిని.
ఇక్కడ
కన్ననూ
వేయిరెట్లు
అధికమైన
ఆహారపదార్థములతో
మిమ్ము
సేవించగలడు.
కాన
తమరు
నన్ను
అనుగ్రహింప
జాతురేని,
నా
ఈ
ఒక్క
కోరిక
తీర్చి
ధన్యుని
గావించుము"
అని
పాదములపై
బడెను.
అందులకు
దుర్వాసుడు
ఫక్కుననవ్వి,
"దుర్యోధనా!
నీ
అభీష్టమునననుసరించి
నేనిప్పుడే
నా
పదివేలమంది
శిష్యబృందముతో
బయలుదేరి
మీ
సోదరుడైన
ధర్మజుని
ఆతిధ్యము
నందుకొందును"
అని
తన
శిష్యబృందమునకు
సర్వసిద్ధము
కండని
ఆజ్ఞాపించి,
ముని
అరణ్యమునకు
బయలుదేరెను.
ఇంతలో
దుర్యోధనుడు
అతి
వినయవిధేయతను
ప్రదర్శించుచు,
చేతులు
కట్టుకొని
దుర్వాస
మహాబుషి
పాదముల
చెంత
మోకరిల్లి
మరొక
ప్రార్థన
మన్నించవలెనని
కోరెను.
మహాబుషి
మందహాసవదనుడై
"నాయనా!
అది
యేదియో
కోరుమ"ని
సెలవిచ్చెను.
అందులకు
దుర్యోధనుడు
దురాలోచనను
దుష్టబుద్ధిని
లోలోన
పెంచుకొని
పాండవులను
హతమార్చవలెనను
సంకల్పముతో
"స్వామీ!
తమరు
ధర్మజుని
ఆతిధ్యమును
అందుకొనుటకు
వెళ్ళుచున్నారు.
అయితే
నాకోరిక
మన్నించి
ద్రౌపది
భోజనము
చేసిన
తరువాత
మీరు
అచ్చటికి
చేరిన
వారి
మహత్తరమైన
భక్తి,
శక్తిని
మీరు
తిలకించగలరు.
కాన
మీరు
కొంత
తడవుగా
వెళ్ళి,
వారందరూ
భోజనాదులు
ముగించుకొని
విశ్రాంతిగా
యుండు
సమయమున,
తమకూ
తమ
శిష్యబృందమునకూ
భోజనమిదమని
ధర్మజుని
కోరిన,
నాకు
మహదానందమును
అందించిన
వారగుదురు.
నన్ను
ధన్యునొనర్చిన
వారగుదురు"
అని
నమస్కరించినాడు.
Previous
←
The Pāṇḍavas, Ideal Dharmātmas
Next
The Episode of Durvāsa
→