Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Episode of Durvāsa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
దుర్వాసుడు
అందులకంగీకరించి,
"సరి!
అటులనే
చేతును"
అని
బయలుదేరెను.
దుర్యోధనుడు
ఇట్లు
కోరుటలో
ఒక
విధమైన
అంతరార్థము
లేకపోలేదు.
అది
యేమన,
ఒకనాటి
తెల్లవారి
పాండవుల
ప్రార్థనలకు
ప్రసన్నుడై
సూర్యుడు
ఒక
అక్షయ
పాత్రను
అనుగ్రహించెను.
పాండవులు
భుజించిన
తరువాతనే
ద్రౌపది
భుజించుట
ఆ
మహాసాధ్వీమణికి
అలవాటు,
ఆమె
భుజించునంతవరకూ
ఆ
పాత్ర
యెంత
తీసిననూ
తరుగకుండునటుల
సూర్యదత్తము.
"అంతియేకాక,
దినమున
కొక్కపరి
తప్ప
రెండు
మూడు
పర్యాయములు
అందులోని
పదార్థము
పంచుటకు
వీలుకాదు.
ఒకపరి
ద్రౌపది
భుజించక
పూర్వము
యెన్ని
లక్షలు,
కోట్లకు
దినమంతయూ
పెట్టిననూ
తరుగదు.
అనగా
ఆ
పాత్రలో
యే
కించిత్
అయిననూ
పూర్వపు
పదార్థము
వుండిన
దానిద్వారా
కావలసినంత
పదార్థము
అభివృద్ధి
కాగలదు,
అది
ఆ
పాత్ర
యొక్క
శక్తి.
అకాలంలో
దుర్వాసుని
ఆగమనం
"దీనిని
గమనించియే
దుర్యోధనుడు
అట్లు
కోరియుండెను.
ద్రౌపది
తినిన
తరువాత,
ఆమే,
ఆ
పాత్రమ
శుభ్రముగా
తోమి
పెట్టగలదు;
అందులో
యేమాత్రము
శేషమందదు.
అట్టి
సమయమున
మహాబుషి
భోజనమును
ఆశించిన,
మహాబుషిని
సంతృప్తిపరచలేరు.
అప్పుడు
మహాబుషికి
ఆగ్రహము
2
▾
Meaning
Keep
తప్పక
వచ్చును.
పాండవులను
శపించును,
పాండవుల
పీడ
తీరి
పోవును;
ఇకపై
శాంతిగా
జీవించవచ్చునని
ఆ
దుర్యోధనుని
చెడుతలంపు.
"కానీ
పాండవులు
పరులను
ఆశ్రయించినవారు
కారు
కదా!
పరమాత్మ
నాశ్రయించినవారు.
అట్టివారికి
యెట్టి
మహాబుషుల
శాపములనూ
యేమియూ
చేయలేవు.
సర్వరక్షకుడైన
సర్వేశ్వరుడే
పాండవ
పక్షముండ,
దుష్టబుద్ధుల
…
వారల
హస్తమున
అణగిమణగి
పోకవుండునా?
తానొకటి
తలచిన
దైవమొకటి
తలచునను
సత్యమును
ఆ
ధూర్తులు
తెలుసుకొనలేదు.
యెట్లయిన
నేమి?
దుర్యోధనుని
వాంఛ
ననుసరించే
దుర్వాసుడు
ద్రౌపది
భోజనముచేసి,
పాత్రను
శుభ్రపఱచి,
తాంబూలములు
వేసుకొనుచూ
పర్ణశాల
ముందు
పాండవులతో
కూర్చొను
సమయమున
పదివేల
శిష్యబృందముతో
దుర్వాసుడు
ప్రవేశించెను.
మహాబుషి
రాకను
గమనించి
ధర్మజుడు
దిగ్గనలేచి,
పాదములు
కడిగి,
పూజించి,
నమస్కరించి
"ధన్యుడనైతిని.
ఈనాడు
మహాసుదినం.
మహాబుషుల
దర్శనం"
అని
ఆనంద
భాష్పములు
రాల్చుచూ,
హస్తములు
జోడించుకొని
నిల్చెను,
ప్రక్కనే
సోదరులు,
ద్రౌపది
నమస్కరించుచూ
తలలు
వంచుకొని
వినయ
విధేయులైయుండ,
దుర్వాసుడు,
మార్గాయాస
బడలికచే
కొంత
అలసినట్టు
విసుగుతో,
"ధర్మజా!
మేము
స్నాన
సంధ్యాదులాచరించుకొని
వత్తుము.
పదివేల
శిష్యులతోపాటు
నాకు
భోజనము
సిద్ధపరచుము"
అని
నేరుగా
నదీ
స్నానమునకు
బయలుదేరిరి.
ఆ
మాటలు
వినగనే
ధర్మజుడు
క్రుంగిపోయెను.
గుండెలు
ఝల్లుమనెను.
లోనికి
వెళ్ళి,
ద్రౌపదితో
యోచించి,
పాత్ర
శుభ్రముగా
కడిగి
పెట్టిన
విషయమును
తెలుసుకొని,
ఇక
గతియేమని
పరి
పరి
విధముల
ఆలోచనలో
మునిగిరి,
అందునా
పదివేల
మందికి!
"అయ్యో
దైవమా!
ఈనాడు
యేమి
కానున్నదో!"
అని
యెక్కడి
వారక్కడ
దిగులుగా
కూలబడిరి.
ద్రౌపది
గృహలక్ష్మి
అగుటచే
వచ్చిన
అతిథులకు
అన్నమిడుట
ఆమెకు
ఆనందము.
అయితే
ఇది
అకాలము.
అడవిలో
తక్షణము
ఆహారము
చిక్కదు
కదా!
3
▾
Meaning
Keep
అందువలన
ఆమె
మరింత
యోచనలో
మునిగి
"వచ్చిన
వారా?
సామాన్యులుకారు.
దుర్వాస
మహర్షి!
అతని
శక్తి
సామర్థ్యములు
లోకమునకే
విదితము;
అతడు
తలంచిన
నిమిషములో
భస్మము
చేయగలడు!
ఈనాడు
పతులకు
యేమి
కీడు
జరుగునో?"
యని
ఆ
యిల్లాలు
లో
లోన
క్రుంగి
కుమిలి
పోయెను.
ద్రౌపది
ఆర్తనాదము,
కృష్ణుని
మనస్సుని
కరిగించెను
యేమియును
తోచక
కడకు
ఆపత్
కాలమున
భగవంతుడు
తప్ప
రక్షించు
వారెవ్వరు?
అని
ఆలోచించి,
కృష్ణుని
స్మరించుచూ,
'గోపాలా!
ఈనాడు
నా
పతులను
రక్షించి
ఈ
వచ్చిన
ఆపదను
తీర్చి,
బుషులను
సంతృప్తి
పరచుటకు
నీకున్నా
దిక్కు
వేరొక్కరు
లేరు'
అని
కంటినీరు
కాలువలై
పార
ఆర్తితో
హరిని
పిలువ
జొచ్చెను.
శ్యామసుందరుని
పరి
పరి
విధముల
ప్రార్థించెను.
కడకు
తన
కెట్టి
ఆపద,
అవమానము
కలిగిననూ
సహింతును
కానీ,
పతులను
రక్షించి,
నా
మాంగల్యమును
నిలబెట్టుమని
ఘోర
దుఃఖముతో
బోరున
యేడ్చెను.
బైటనున్న
పాండవులు
ఆ
రోదనను
విని
మరింత
బాధకు
గురియై
కుమిలి
పోవుచు
వారు
కూడనూ
కృష్ణుని
తలంచుచూ,
'నందనందనా!
ఇన్ని
ఆపదలను
తప్పించితివి.
ఇంతకాలము
కంటిరెప్పవలే
కారడవులందు
కూడనూ
కరుణ
వీడక
కాపాడితివి.
ఈనాడు
మాత్రము
మమ్ముల
నిట్టి
యిక్కట్టుకు
గురిచేతువా?
మా
పాపములెన్ని
యున్ననూ
మమ్ముల
క్షమించి,
మహా
బుషికి
వారి
శిష్యబృందమునకు
సంతుష్టి
కలిగించుము'
అని
ప్రార్థించిరి.
పాండవుల
ప్రార్థన,
ద్రౌపది
ఆర్తనాదము,
మధురలోని
కృష్ణుని
మనసును
కరిగించెను.
అక్కడినుండి
గోపాలుని
కదిలించెను.
ఇంతలో
యేదో
నడక
శబ్దము
వినుపించెను.
స్నానాదులు
పూర్తిచేసుకొని
దుర్వాస
శిష్యబృందము
వచ్చెనేమోయని
పాండవులు
నిలువునా
నీరయి
తలలు
పైకెత్తి
చూడగ
శ్యామసుందరుడు
చిరునవ్వు
లొలుకుచూ,
పీతాంబరమును
నేల
ఈడ్చుచూ,
మందహాసముతో
పర్ణశాల
ప్రవేశించుచుండ,
పాండవులు
చూచి
"కృష్ణా!
కృష్ణా!"
అని
అరచిరి.
4
▾
Meaning
Keep
ఆ
శబ్దమును
వినిన
ద్రౌపది,
విషయము
తెలియక
కంగారుతో
వెలుపల
వచ్చి
చూడగా
గోపాలుడు
కనిపించెను.
ఆమెకు
ఆశ్చర్యముతో,
ఆనందమును
ఒక
నిమిషము
యేమి
తెలియక
మైమరచి,
కడకు
ఇది
గోపాలుని
భక్త
రక్షణ
బాధ్యత
అని
తలంచి,
పరుగిడిపోయి,
పాదములపై
బడి,
కంటినీరు
కాలువలై
పార
పాదములను
కడిగి,
'మాంగల్యమును
నిలబెట్టి
మహా
బుషులను
సంతృప్తి
పరచు"మని
ప్రార్థించెను.
ఆమె
మాటలు
యేమాత్రము
వినిపించుకొనక
నటన
సూత్రధారి
ఆకలి
వేయువానివలె
నటించుచు,
"చెల్లీ!
ద్రౌపది!
యేమిటి
ఈ
యేడ్పు?
మొదట
నా
ఆకలి
తీర్చిన
తరువాత
నీ
యిష్టమేమియో
కోరుకొనుము?
తక్షణము
నాకింత
అన్నము
పెట్టుము"
అని
దోసిలి
చాచిన
కృష్ణుని
జూచి,
ద్రౌపది
'కృష్ణా!
యిదియా
పరీక్షా
సమయము!
ఆలసించక
రక్షించుము',
అని
పైటతో
కన్నీరు
తుడుచుకొనుచూ
తన
కొంగును
చాచి
పతిభిక్ష
పెట్టుమని
ప్రార్థించెను.
అందులకు
కృష్ణుడు
ద్రౌపది
తల
నిమురుచూ,
'చెల్లీ!
ప్రతి
చిన్న
విషయమునకు
ఆడువారు
కంటినీరు
పెట్టుట
పరిపాటి;
కంటినీరన్న
ఆడవారికి
అతి
ప్రీతి.
కంటినీటితో
కడుపు
నిండదు.
కార్యము
జరుగదు.
అయిననూ
ఈనాడు
నీ
యేడ్పుకు
కారణమేమియో
తెలుపుము.
విని
ఆనందింతును.'
అని
వెగటుగా
మాట్లాడిన
కృష్ణుని
చూచి,
ద్రౌపది,
'గోపాలా!
నీవు
నేడు
రెండవ
భిక్షకుడవు!
నీకు
భోజనమిడకున్ననూ
నీవు
ఆగ్రహించి
శపించవు.
కాని
మరొక
భిక్షకుడు
పదివేల
మంది
శిష్యబృందముతో
వచ్చి
ఆకలి,
ఆకలి
అని
మమ్ముల
నారగించ
చూచుచున్నాడు.
అతని
క్రోధాగ్నికి
భస్మముకాక
చూడుము.
ఈ
అరణ్యమున
నాకు
ఒక్క
ధాన్యపు
గింజ
కూడనూ
చిక్కదు.
అట్టి
నేను
వేళగాని
వేళలో
ఇంత
మంది
అతిథులకు
ఎట్లు
ఆకలి
తీర్తును'
అని
విషయము
విపులముగా
తెలిపెను.
అంత
గోపాలుడు
ఫక్కుననవ్వి,
"ద్రౌపదీ!
యేరీ?
పదివేల
మంది
అతిథులంటివి
కదా!
ఒక్కరైననూ
నాకంటికి
కనుపించుట
లేదే;
నీ
మాటలు
చూడ
నాకు
నవ్వు
వచ్చుచున్నది.
చంకలోని
బిడ్డను
వదలి,
చావిడిలోని
వారికి
సతమత
మగుచున్నావే?
ముందు
నాకు
ఆకలి
తీర్చు;
తరువాత
యెక్కడో
వున్నవారి
సంగతి
5
▾
Meaning
Keep
చూచుకొనవచ్చు"
నని
పట్టుబట్టి
నిజముగా
ఆకలివలే
నటించెను.
ద్రౌపది
గ్రహించి,
"స్వామీ!
వండిన
పదార్థము
అందరికీ
వడ్డించి
నేనుకూడనూ
ఆరగించి,
సూర్య
దత్తమైన
పాత్రను
పరిశుద్ధముగా
కడిగి
పెట్టితిని.
నేనిక
నీ
ఆకలి
యెట్లు
తీర్తును?
ఎవరిని
ఆశ్రయింతును?
నీవు
తప్ప
ఈ
పాంచాలికి
కానీ,
పాండవులకు
కానీ
వేరు
దిక్కులేరు
కదా!
ఇన్ని
తెలిసిన
నీవే
మమ్ములనిట్లు
యేడ్పించిన
పరుల
సంగతి
చెప్పతరమా"
అని
మరీ
కంటిధారలు
కార్చెను.
గోపాలుడు
పరీక్ష
మాని
'ద్రౌపదీ!
యేదీ
నీవు
ప్రొద్దున
వండిన
పాత్ర
ఇటు
తెమ్ము;
అందులో
ఏకొంత
పదార్థముచిక్కిననూ
నే
తృప్తి
పడుదును"
అని
కోరెను.
అంత
ద్రౌపది
లోనికి
వెళ్ళి
శుభ్రముగా
కడిగిపెట్టిన
పాత్రను
తెచ్చి
గోపాలుని
చేతిలో
పెట్టెను.
గోపాలుడు
ఆ
పాత్రను
బాగుగా
పరీక్షించి,
చూచి
పాత్ర
కంఠమున,
ఆకు,
చిన్నముక్క
కరచుకొని
యుండుటచూచి,
"ద్రౌపదీ!
నీవీ
నాడు
ఆకుకూర
చేసితివా
యేమి?"
అని
ప్రశ్నించెను.
కృష్ణప్రభావముతో
దుర్వాసుని
ఆకలి
తీరెను
ఇంతలో
ద్రౌపది,
"యేమీ!
నేను
తోమిన
పాత్రలో
ఆకు
కనిపించెనా?
ఇది
నీ
మాయతప్ప
వేరుకాదు;
నేనేపని
చేసిననూ,
పరిశుద్ధముగా
జేతును"
అని
నవ్వుచూ
ద్రౌపది
రాగా
"చూడు!
ఈ
పాత్రలో
ఆకు
ఒకటి
చిక్కినది!
ఇది
నా
ఆకలే
కాక
చరాచర
ప్రపంచమును
తృప్తి
పెట్టగలదు"
అని
పలుకుచూ
ఆ
ఆకును
తన
వ్రేలితో
దీసి
నాలుకపై
నిడుకొని
"ఆహా!
ఆకలి
తీరినది"
అని
త్రేపెను.
ఇంతలో,
నదిలో
స్నానము
చేయుచున్న
దుర్వాసునకును,
అతని
పదివేల
మంది
శిష్యులకును
పొట్టలునిండి,
కదలలేని
స్థితి
యేర్పడి,
దీనికి
పూర్వమే
ఆకలిచే
తపించుచున్న
బాధతీరి,
తృప్తి,
ఆనందము
కలుగగా,
వారిలో
వారు
ఒకరినొకరు
సైగలు
చేసికొని,
'అబ్బా!
మన
పొట్టలు
నిండినవి.
ఒక
మెతుకు
పోవుటకు
కూడ
స్థలము
లేదు.
ఈ
సమయమున
ధర్మజునికడకు
వెళ్ళిన,
అతను
అన్ని
రకముల
పదార్థములు
సిద్ధపరచియుందును.
తినకున్న
ధర్మజుడు
ఒప్పుకోదు.
అతని
తృప్తి
కొరకై
తినుటకు
పొట్టలో
స్థలములేదు;
యేమి
6
▾
Meaning
Keep
చేయుట?'
అని
యోచించుకొనుచు
కడకు
అంబరీషుని
శాపము
వారలకు
జ్ఞాపకము
వచ్చి
దుర్వాసుని
హెచ్చరించిరి.
అందులకు
దుర్వాసుడు
కూడనూ
వారి
సలహాలను
అనుసరించి
ధర్మజుని
అక్కడినుండియే
ఆశీర్వదించి,
యెవరికీ
చెప్పక,
కాలికి
బుద్ధి
చెప్పి,
అరణ్యమున
మరొక
మార్గము
పట్టి
పోవుచుండిరి.
యింతలో
గోపాలుడు
భీముని
పిలిచి,
స్నానమునకు
పోయిన
దుర్వాసుని,
వారి
శిష్యులను
భోజనమునకు
తోడ్కొని
రమ్మని
చెప్పెను.
అంత
భీముడు
ఒక్క
అడుగున
నదీతీరమునకు
వెళ్ళగా,
అతనిని
చూచి
శిష్యులు
పారిపోవ
జాచిరి.
వారిని
వెంటాడుచు
దుర్వాసుని
చెంతకు
భీముడు
వెళ్ళి
'స్వామీ!
తమ
కొరకు
భోజనము
సిద్ధముగా
నున్నది.
తప్పక
రావలెను,
అన్నగారి
ఆజ్ఞ"
అని
ప్రార్థించెను.
అందులకు
దుర్వాసుడు,
'భీమా!
మా
చేత
కాదు.
మేము
ఒక
మెతుకు
కూడనూ
తినలేని
స్థితిలో
వున్నాము;
మమ్ములను
వదలుము.
మీకు
సర్వ
శుభములూ
కలుగును.
మీరు
సమస్త
భూమండలమును
యేకచ్ఛత్రాధిపతులుగా
యేలుచుండ
నేనొకపరి
వచ్చి,
మీ
ఆతిథ్యము
ఆరగింతును.
మీ
నాశనమును
ఆశించి
యెవరు
పాపబుద్ధితో
నన్ను
మీ
కడకంపిరో
వారు
సర్వనాశనమూ
కాగలరు'
అని
ఆశీర్వదించి
ప్రసన్నవదనులై
వెళ్ళిపోయిరి.
"చూచితివా!
పరీక్షిత్!
మీ
తాతల
యొక్క
భక్తి
ప్రపత్తులు,
కృష్ణుని
అనుగ్రహా
ప్రభావములూ
వారికి
వారే
సాటి
కానీ
మరొకరు
దీటురారు.
అట్టివారు
లోకమున
లేరు"
అని
పాండవుల
శక్తిసామర్థ్యములను,
కృష్ణపరమాత్మ
అనుగ్రహా
ప్రసాదములను,
వ్యాసుడు
అత్యంతానందముతో
పరీక్షితునకు
దెలుపుచుండ
పరీక్షిత్
కూడనూ
మైమరచి
ఆలకించుచూ,
ఒక్కొక్క
సమయమున
ఆశ్చర్య
ఆవేదనలో
మునుగుచూ,
తన
తాతల
బాధలను
స్మరించునపుడెల్లా
ఒళ్ళు
గగుర్పాటు
కలిగి
విచారించుచూ,
కంటిధారలు
కార్చుచుండెను.
Previous
←
The Special Graces of Kṛṣṇa upon Draupadī
Next
Pārtha's Battle with Paśupati
→