Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Pārtha's Battle with Paśupati
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఇంతలో
వ్యాసులవారు,
'పరీక్షిత్
మహారాజా!
మీ
తాతలు
భక్తి
ప్రవత్తులయందు
పరమాత్మకు
ఎట్టి
త్యాగముచేయుటకైననూ
పూనుకొందురు;
అవసరమొచ్చినపుడు
పరమాత్మునితోనే
యుద్ధము
చేతురు!
అది
క్షాత్రధర్మము.
ఒకనొక
సమయమున
పశుపతితో
యుద్ధముచేసి
అస్త్రములు
సంపాదించెను.
బహుశా!
నీవు
ఈ
గాథ
విని
యుండవచ్చును'
అని
మాట
ముగించగా
శ్రద్ధాళుడైయున్న
పరీక్షిత్
దిగ్గన
మోమునెత్తి
'స్వామీ!
యేమంటిరి?
మా
తాతలు
పశుపతితో
యుద్ధము
జరిపిరా?
ఈ
విషయము
నేనెపుడునూ
విని
యెరుగను.
అది
యెట్టిదో
సెలవిచ్చిన
గ్రోలి
ఆనందింతును'
అని
నమస్కరించెను.
వ్యాసుల
వారు
గొంతు
సవరించుకొని,
'నాయనా!
అట్టి
గాథలు
యెన్నని
తెలువగలను?
నెలలు,
సంవత్సరములు
తెలిపిననూ
తీరని
పాండవ,
గోపాలురయొక్క
విచిత్రవిషయములు
కొన్ని
గంటలలో
తెలుప
వీలగునా?
అయిననూ
నీవు
కోరుచుంటివి
కనుక,
కాలమున్నంతవరకూ
అవకాశము
చిక్కినంతవరకూ
వినిపింతును,
వినుము.
అస్త్రసంపాదన
కొరకు
అర్జునుడు
తపస్సు
చేయుట
రాజా!
మీ
తాతలు
అరణ్యమున
కాలము
గడుపుచున్న
సమయమున,
ఒకనాడు
మీ
పెదతాతగారైన
ధర్మజునకు
తీరని
ఆలోచన
ఒకటి
మనసున
చేరినది.
అది
యేమన,
ఎన్ని
సంవత్సరములు
అరణ్యవాసముచేసి
తిరిగ
2
▾
Meaning
Keep
హస్తినాపురము
చేరిననూ,
దుష్టులైన
దుర్యోధనాదులు
తమ
రాజ్యమును
తమకు
ఇవ్వరనియునూ,
కడకు
యుద్ధము
జరుగవచ్చుననియూ,
ధర్మజునిలో
తీవ్రమైన
సంశయము
చెలరేగి,
పోనీ
యుద్ధమునకు
సిద్ధమయిననూ
ధనుర్విద్యాచరణముల
నెరిగిన
భీష్మ,
ద్రోణ,
కర్ణ,
అశ్వత్థామాదులు
కౌరవ
పక్షముననే
చేరుదురు.
కనుక
వారలను
ఎదిరించునట్టి
శక్తి
పాండవులలో
లేక
పోవచ్చుననియూ,
కడకుయుద్ధముచేసియూ
ఫలముండదనియూ
ఈ
కారణములచేత
యావజ్జీవితమూ
అరణ్యమందే
జరుపవలసి
వచ్చుననియూ,
తనలో
తాను
చింతించుచుండుట
మీ
తాతగారైన
అర్జునుడు
కనిపెట్టి
ధర్మజుని
దగ్గరకు
వెళ్ళి
నమస్కరించి,
'దివ్యాస్త్రములను
సంపాదించుకొని
వచ్చుటకు
అనుజ్ఞ
యిమ్మని'
కోరెను.
అందులకు
ధర్మజుడు
అత్యంత
విచారహృదయుడై,
'అరణ్యమునకేగి
దీక్షపూని,
భగవంతుని
అనుగ్రహాస్త్రములను
సంపాదించుకొని
రమ్మ'ని
ఆజ్ఞాపించెను.
అంత
అర్జునుడు
అన్నకు
నమస్కరించి
అగమ్య
నిర్జనమై
సిద్ధులు
కూడనూ
వెళ్ళలేనంతటి
గంధమాదన
ప్రాంతమునకు
వెళ్ళి
అనువైన
ఒక
స్థానమును
ఎన్నుకొని
దేవేంద్రుని
గూర్చి
తపస్సు
మొదలు
పెట్టెను.
ఆ
తపస్సు
దేవలోకముకే
ఆశ్చర్యము
కలిగించెను.
తక్షణము
దేవేంద్రుడు
ప్రత్యక్షమై,
'నాయనా!
నీ
తపస్సునకు
సంతసించితిని,
అయితే
నీ
సంకల్పము
నెరవేరవలెనన్న
శూలపాణిని
ప్రసన్నుని
గావించుకొనుము.
అనంతరము,
నేను
నిన్ను
తీసుకొని
స్వర్గమునకు
వెళ్ళి
అస్త్రశస్త్రముల
నువదేశింతును'
అని
అంతర్ధానమాయెను.
శివుని
పరీక్ష
దేవేంద్రుని
ఉపదేశముననుసరించి
మీ
తాతగారగు
అర్జునుడు
శూలపాణి
గురించి
ధ్యానించెను.
ఇంతలో
ఈశ్వర
లీలానాటకమొకటి
ప్రారంభమాయెను.
3
▾
Meaning
Keep
అదియేమన,
వరాహారూపమొకటి
గర్జించుచూ,
అర్జునుడు
తపస్సాచరించుచున్న
దిశకు
అతివేగముగా,
క్రోధముగా
వచ్చుచుండుట
అర్జునుడు
గమనించి,
తపస్సాచరించుచూ
దీక్షను
పూనిన
సమయమున
జీవహింస
చేయరాదని
యెంత
ధృడము
చేసుకొన్ననూ,
ఆ
వరాహము
ఉగ్రుడై
ఉచ్ఛాతలుగుచూ
మీద
పడుటకై
సమీపించెను.
'చేయునది
లేక,
ప్రాణసంరక్షణకై
మీ
తాత
విల్లును
ధరించెను.
ఇంతలో
ఒక
భిల్లుడు
ధనుర్బాణములు
ధరించి,
భార్యాసమేతుడై
మీ
తాతగారైన
అర్జునుడున్న
వైపునకు
వచ్చుచుండుటగాంచి,
ఈ
నిర్జనారణ్యమున
స్త్రీలతో
సంచరించు
వారుందురా?
అని
కొంత
శంకించి
నిదానముతో
చూడ,
అతని
వెంట
అనేక
మంది
కిరాతస్త్రీలు,
పురుషులు
భయంకర
ఉగ్రులై
వికారశబ్దములు
గావించుకొనుచూ
వచ్చుచుండుట
చూచి
అర్జునుడు
మరింత
కంగారు
పడెను.
దానితోబాటు
ఆశ్చర్యమూ
కలిగెను.'
ఎల్లని
కన్నులతో
భయంకరాకారుడై
విల్లును
ధరించి
వచ్చుచున్న
మొదటి
వ్యక్తి
గంభీరస్వరుడై
అర్జునుని
చూచి
"ఓరీ!
నీ
వెవ్వడవు?
ఇక్కడెందులకు
వచ్చితివి?
పొరబాటునైననూ
ఆ
వరాహముపై
బాణము
విడచిన,
ప్రాణములు
దక్కవు
జాగ్రత్త.
నే
తరుముకొని
వచ్చిన
ఈ
వరాహమును
నీవు
కొట్టుటకు
చూచుచున్నావా?"
అని
గర్జించెను.
ఈ
మాటలు
అంబుపోటువలె
హృదయమున
నాటుకొని
పోయెను.
'సామాన్యపు
వేటగాడు
వన్నింతటి
కరినోక్తులాడుటయు,
నా
పేరు
కానీ,
నా
ప్రతాపము
కానీ
యెరుగడు
కాబోలు!'
అని
అర్జునుడు
ఉగ్రుడై
విల్లును
ఎక్కుపెట్టి
ఆ
వరాహరూపముపై
విడిచెను.
అదే
సమయమున
వచ్చిన
కిరాతకుడు
కూడనూ
విల్లును
ఎక్కుపెట్టి
ఆ
వరాహమును
కొట్టెను.
ఇంచుమించు
రెండు
బాణములు
ఒకపరే
ఆ
వరాహముపై
పడగ,
తక్షణమూ
వరాహము
నేలకూలి,
ప్రాణములు
విడచెను.
4
▾
Meaning
Keep
ఇంతలో
కిరాతుడు
కోపోద్రేక్కుడై
అర్జునునిపై
విరుచుకువడి,
'ఓరీ!
దురాత్ముడా!
నే
కొట్టి
తరుముకొని
వచ్చిన
మృగముపై
నీవు
చేయి
చేసికొనుట
చూడ
అస్త్ర
విద్యా
విధానము
తెలియని
మూర్ఖుని
వలే
కనిపించుచున్నావు'
అని
అనేక
కరినోక్తులాడుచున్న
కిరాతుని
నిప్పులు
గ్రక్కు
గృద్ధతో
చూచుచూ
అర్జునుడు,
'భీ!
నోరుమూతువా!
నిన్నెమపురికంపమందువా?
అతిగా
వాగక
నీ
ప్రాణములు
నీవు
రక్షించుకొనుము.
పొమ్ము
వచ్చిన
దారి'
అని
అలక్ష్యముగా
పలుక,
ఆ
మాటల
కేమాత్రము
జంకక
భిల్లుడు
నిర్భయుడై,
'సరే!
నీవెవరైననేమి?
నీకు
ముక్కోటి
దేవతలు
సాయమొచ్చిననూ,
నే
వెరచువాడను
కాను!
జాగ్రత్త!
మా
అరణ్యమునకు
నీవెవరి
ఆజ్ఞ
బడసి
వచ్చితివి?
నన్ను
వెళ్ళమనుటకు
నీ
వెవడవు?
ఈ
అరణ్యము
మాది.
అక్రమమున
ప్రవేశించి,
వక్రపు
మాట
లాడుచున్నావు.
టక్కరిమూకవు!'
అని
భిల్లుడు
మరింత
తీవ్రమైన
మాటలాడెను.
అందులకు
అర్జునుడు
కొంత
శాంతించి
వీడెవడో
సామాన్యుడు
కాదని
యెరింగి,
'అయ్యా!
అరణ్యమందరి
సొత్తు.
నీవు
వేటాడుటకు
వచ్చిన,
నేను
శివుని
గూర్చి
తపస్సు
చేయుటకై
వచ్చితి.
ఆత్మ
రక్షణార్థమై
నేనా
మృగమును
కొట్టవలసి
వచ్చెను"
అని
శాంత
వచనములు
పలుక,
అందుకు
భిల్లుడు
ఏమాత్రమునూ
తనఉద్రేకములో
మార్పు
తెచ్చుకొనక,
"నీవు
యెవరినారాధించిన
నాకేమి?
నే
కొట్టవలసిన
మృగమును
నీవెందులకు
కొట్టితివి?
ఆ
విషయమున
నాకు
తగు
జవాబిచ్చి,
నీ
తప్పును
నీవు
వాపసు
తీసుకొనుము"
అని
చెప్పెను.
కిరాతార్జున
యుద్ధము
ఆ
మాటలతో
అర్జునుని
ఓర్పు
పూర్తిగాపోయి,
వెగటు
నవ్వు
నవ్వి,
వాడు
మంచిమాటలకు
లొంగునట్టి
గొడ్డు
కాకున్నది,
వీని
ఆయువు
కూడనూ
ఈ
మృగమువలె
ముగిసినట్లున్నది
అని,
ఒక
తీక్షణమైన
బాణమును
తీసి
ఆ
భిల్లునిపై
విడచెను.
ఆ
వదిలిన
తీక్షణ
బాణము
రాతికి
తగిలిన
ముల్లువలె
ఆ
భిల్లుని
యేమాత్రము
సోకక
వంగి
నేలపడెను.
అపుడు
మీ
తాత
ఆశ్చర్యపడి,
5
▾
Meaning
Keep
అర్ధచంద్రాకారమైన
బాణమును
వదిలి
వాని
శిరస్సు
దుంచ
చూచెను.
దానిని
ఆ
కిరాతుడు
నవ్వుచూ
యెదమ
చేతితో
పట్టి
వినరికొట్టెను.
కడకు
అర్జునుడు
అక్షయతూణీరములోని
బాణములన్నింటినీ
భిల్లునిపై
వినియోగించెను.
ఫలమావంతయునూ
లేకపోవుటయే
కాక,
కొల్లగొట్టిన
వాని
వలె
ఒక్క
బాణముకూడనూ
లేని
అసహాయుడై
పోయెను.
రెక్కలులేని
పక్షివలే,
కోరలు
తీసిన
పులివలే,
తెడ్డు,
చుక్కాని
లేని
పడవవలే
అయిపోయెను.
అర్జునుడు
ఇకయేమియూ
చేయజాలక
ధనుస్సు
ఎదకు
పెట్టి
నెట్ట
చూచెను.
ఆ
ధనుస్సు
ముక్కలా
ముక్కలుగా
విరచి
పారవేసిన
భిల్లుని
చూచి,
అస్త్రములతో
ప్రయోజనము
లేదని
తలంచి,
నడుము
కట్టి
అతనితో
ద్వంద్వ
యుద్ధమునకు
సిద్ధమాయెను.
దానికి
కూడనూ
ఆ
భిల్లుడు
నవ్వుచూ
సిద్ధమయి
అర్జునుని
పిలిచెను.
సరి!
రెండు
పర్వతములు
ఢీ
కొన్నట్లు
వారిరువురూ
ఒకరి
నొకరు
గ్రుద్దు
కొనుచుండ
అడవి
యందలి
పక్షులు
రెక్కలు
కొట్టుకొనుచు
ప్రళయ
శబ్దమేమోయని
భయపడి
యెగిరి
పోవుచున్నవి
మృగములు
బెదురుకొని
దిక్కులు
చూచుచూ
భయపడుచున్నవి.
అరణ్యమంతయూ
వారిద్దరి
యుద్ధముచే
భూకంపమువలె
అదురుచున్నది.
అయినను
ఆ
భిల్లుడు
నవ్వుచూ
అలసట
అనునది
లేక
అతి
చురుకుగా
ఉల్లాసముగా
ఉండుట
చూచి
అర్జునుడు
చెమటలు
కార్చుతూ,
బస
కొట్టుతూ,
ఒక్కొక్క
గ్రుద్దు
బలము
కొలదీ
వేసినను
అర్జునుని
చేయి
బ్రద్దలయి
రక్తము
కారుచున్నదే
కానీ,
భిల్లుని
దేహ
మేమాత్రమునూ
గాయపడుటలేదు.
అంతియే
కాదు;
ఒకపరి
భిల్లుడు
తన
బాహువులచే
అర్జునుని
బిగించగ
అర్జునుడు
నోటినుండి
రక్తము
గ్రక్కెను.
అంత
ఆ
భిల్లుడు
నవ్వుచూ
తన
సతిచెంత
చేరి,
"చూచితివా!"
అని
తన
ప్రతాపమును
తెలుపుచుండ
అర్జునుడు
కొంత
తెప్పరిల్లి
తన
నోటినుండి
ఈ
రీతిగా
పలికెను.
6
▾
Meaning
Keep
శివుడు
అర్జునునికి
పాశుపతాస్త్రము
ప్రసాదించుట
"కృష్ణా!
నన్నెందుల
కీనాడు
ఇంత
పరాభవము
గావించితివి?
అందునా
ఒక
భిల్లుని
చేతనా?
ఆహా!
ఇది
నీ
లీలానాటకము!
నిజముగా
ఈ
భిల్లుడు
సామాన్యుని
వలె
లేడు.
బహుశా,
నీవే
ఈ
రూపమున
నన్ను
పరీక్షించుచున్నావా?"
అని
ప్రార్థించగనే
యెదురుగా
నిల్చియుండిన
భిల్లుడు,
తన
ధర్మపత్ని
శివగౌరీరూపధారులై
చిరునవ్వులు
నవ్వుచూ
అభయహస్తములు
చూపుచూ
కనిపించిరి.
అంత
అర్జునుడు,
"శంకరా!
తల్లీ
గౌరీ
మాతా!"
అనుచు
పరుగిడిపోయి,
పాదములపై
వ్రాలెను.
క్షమించమని
అనేక
విధముల
ప్రార్థించెను.
ఆ
కృపాళుడైన
గౌరీ
శంకరులు
అర్జునుని
తల
నిమురుతూ
"నాయనా!
పురుషార్థమును
సార్థకము
చేసికొంటివి.
నీ
కర్తవ్యమును
నీవు
నెరవేర్చితివి.
తప్పులేదు.
ఇదిగో
తీసికొమ్ము!
నా
అనుగ్రహప్రసాదమని"
పాశుపతాస్త్రమును
ప్రసాదించెను.
మహారాజా!
శూలపాణితో
పోరాడిన
మీ
తాతల
ప్రతిభా
విశేషములను
ఏమని
కొనియాడుదును.
దీనికంతయూ
ఆ
గోపాలుని
కృపాకటాక్షమే
మూల
కారణము.
అతని
అనుజ్ఞలేక
మీ
తాతలు
ఎట్టి
చిన్న
కార్యమునైననూ
సంకల్పించువారు
కారు.
నిజముగా
ఆ
మహా
భారత
యుద్ధమున
కృష్ణ
కృప
అడుగడుగునా
తెలియబరచెను.
అనుభవించిన
పాండవులకు
తప్ప
అన్యులకు
అర్థముకాదు"
అని
వ్యాసులు
తన
కంటినుండి
కారు
ఆనంద
భాష్పములను
అంగవస్త్రముతో
తుడుచుకొనుచుండ,
పరీక్షిత్
మహారాజు
భరించలేని
ఆనందముతో
పెదవులు
అదురుచుండ,
కంటిధారలు
కారుచుండ,
గద్గద
కంఠముతో
"మహానుభావా!
నేనెంత
అదృష్టవంతుడను!
అట్టి
మహావీర,
సాహస,
పరాక్రమ,
పరమభక్తులైన
ధర్మమూర్తుల
వంశమున
జన్మించితిని.
ఊరక
జన్మించుటయే
కాదు,
సాక్షాత్తు
దైవాంశసంభూతులైన
మీ
వాక్రసము
ద్వారా
ఆ
పవిత్ర
జీవుల
అనుభూతులను
7
▾
Meaning
Keep
కర్ణ
రంధ్రముల
ద్వారా
గ్రోలుచున్నాను.
ఆహా!
నా
జన్మ
ధన్యమయినది.
ప్రభూ!
మా
తాతల
యొక్కయూ,
కృష్ణపరమాత్మ
యొక్కయూ
చర్యలు
వినుచుండ,
యెంత
వినిననూ
తనివి
తీరకున్నది,
తృప్తి
కాక
యున్నది.
యుద్ధమందు
కృష్ణ
పరమాత్మ
మా
తాతల
నెట్లు
రక్షించెనో
వినిపించి
నా
ఆరాటమును
చల్లార్చుము"
అని
ప్రార్థించెను.
Previous
←
The Episode of Durvāsa
Next
Kṛṣṇa, Charioteer of Vijaya
→