Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Kṛṣṇa, Charioteer of Vijaya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
23.
విజయ
సారథి
కృష్ణుడు
అంత
వ్యాసులవారు,
'రాజా!
పండ్రెండు
సంవత్సరములు
అరణ్యవాసమును,
ఒక
సంవత్సరము
అజ్ఞాతవాసమును
చేసి
పాండవులు
గోధన
హరణ
సమయమున
బైట
కనిపించగనే,
పాతక
హృదయుడైన
దుర్యోధనుడు
చూచి,
అజ్ఞాతవాసము
పూర్తికాక
పూర్వమే
పాండవులు
కంటబడిరి
కనుక,
తిరిగి
పండ్రెండు
సంవత్సరములు
అరణ్యవాసమును,
ఒక
సంవత్సరము
అజ్ఞాత
వాసమునూ
చేయవలెనని
పట్టుపట్టెను.
అంత,
ద్రోణ,
భీష్మాదులు
లెక్కవేసి
పాండవులు
నిబంధన
ప్రకారమే
బయటపడిరి
కానీ
ముందుగనే
బైటరాలేదనియూ,
అరణ్యవాసము,
అజ్ఞాత
వాసము
అనుకున్న
రీతిగనే
సాధించినారనియు
ఎంత
నచ్చజెప్పిననూ
ఒప్పుకొనక
యుద్ధమునకు
నిశ్చితాభిప్రాయమును
వెల్లడిచేసెను.
కురుపాండవ
సంగ్రామము
"ఎవరేమి
చేతురు?
రాజాజ్ఞ!
సరి!
ఇరు
పక్షములవారూ
యుద్ధ
సన్నాహములు
ప్రారంభించిరి.
అధికారారూఢుడు
దుర్యోధనుడు,
రాజ్యభ్రష్టులు
పాండవులు!
అయితే
సత్య,
ధర్మములు
పాండవులను
వరించినవి
కనుక,
ధర్మాత్ములగు
రాజులు
కొందరు
పాండవుల
వైపున
చేరిరి.
మిగిలిన
బలవంతులు,
వీరులు,
సార్వభౌములూ
కౌరవ
పక్షమునకు
వెళ్ళిరి,
ఇట్లు
కౌరవ
పక్షమున
2
▾
Meaning
Keep
పదునొకండు
అక్షౌహిణీల
సేనయు,
మీ
తాతలైన
పాండవ
పక్షమున
ఏడు
అక్షౌహిణీల
సేనయు
సిద్ధమాయెను.
అయితే
అర్జునుని
రథమునకు
సారథ్యము
గోపీ
వల్లభుడే
వహించెను.
ఒక
రథమునకేమి?
పాండవుల
జీవితమునకే
నాయకుడాయెను.
ఇక
పాండవులకు
కొదువేమి?
అయితే
నటన
సూత్రధారి
నాటక
రంగమున
అర్జునుని
పాత్ర
విచిత్రమైన
మార్గమున
ఎదురు
తిరిగెను.
అర్జున
విషాదము
రెండు
సేనల
మధ్య
రథమునాపి
మొదట
నాయకులను
పరికించమని
పరమాత్ముడు
ఆజ్ఞాపించగనే,
అర్జునుడు
ఒకపరి
కౌరవ
వీరులను
చూచి,
కంటి
ధారలు
కార్చుచు,
నిరుత్సాహముతో
కూలబడెను.
ఆ
దృశ్యము
చూచు
వారలకే
సిగ్గుగ
తోచెను.
కాని,
మీ
తాత
భయముచేత
కానీ,
పిరికితనము
చేత
కానీ,
అట్లు
నిరుత్సాహపడలేదు.
పుత్రులవలె
ఒడిలో
పెట్టుకొని
సాకి,
సంరక్షించిన
పితామహుడు
భీష్ముడూ,
సర్వ
శస్త్రాస్త్ర
విద్యలూ
నేర్పిన
పూజనీయుడగు
గురువు
ద్రోణాచార్యుడు,
కంటికి
కనిపించగనే
"అయ్యో!
వీరలతో
యుద్ధము
చేయవలసి
వచ్చెనా?
పూవులతో
పూజించవలసిన
వారలపై
అస్త్రములు
వేయవలెనా?
పాదములపైబడి
నమస్కరించవలసిన
వారల
కంఠములపై
కరిన
అంబులు
గుచ్చవలసి
వచ్చెనా?"
అనే
పూజ్యభావమే
అతనిని
అంత
నిర్వీర్యుని
గావించెను;
కానీ,
వేరు
కారణములు
కావు.
శ్రీకృష్ణుని
దివ్య
బోధ
-
దివ్య
రక్షణ
అంతలో
అభిమాన
మమకారములు
తీవ్రముగా
అల్లుకొని
వాసుదేవుని,
వైపుచూచి
'కృష్ణా!
రథమును
హస్తినాపురమునకు
గొనిపొమ్మ'ని
కోరగ,
కృష్ణుడు
వెగటు
నవ్వు
నవ్వి,
'బావా!
నీవు
భయపడినట్లు
కనిపించుచున్నదే?
నిన్ను
హస్తినాపురమున
దింపి,
ద్రౌపదిని
యుద్ధమునకు
తోడ్కొని
వత్తును.
రమ్ము!
వెనుకకు
వెళ్ళుదము.
ఇంత
పిరికి
పందవని
తెలియక,
నేను
నీ
రథమునకు
సారథ్యము
3
▾
Meaning
Keep
వహించుట,
నా
పొరపాటు'
అని
ఇంకనూ
అనేక
కఠినోక్తులాడుచుండ,
అర్జునుడు
ఎదురుతిరిగి,
'కృష్ణా!
శివునితో
యుద్ధము
చేసి
పాశుపతమును
పొందిన
నేను
ఈ
సామాన్య
మానవులకు
వెరతునా?
దయచే
బంధువులను
చంపలేక
పోవుచున్నాను,
భయముచేత
కాదు'
అని
అనేక
మమకారపు
రాగములు
ఎన్ని
తీసినను
కృష్ణుడు
ఒప్పుకొనక,
సర్వకర్మ
ధర్మ
మర్మముల
బోధించి
కడకు
యుద్ధము
చేయించి
క్షత్రియ
కర్తవ్యమున
నడిపించెను.
యుద్ధ
మధ్యమున
కౌరవ
యోధులందరూ
నొకపట్టయి,
అర్జునునిపై
బాణవర్షములు
కురిపించుచుండ,
ఆనాడు
ఇంద్రుడు
రాళ్ళ
వర్షము
కురిపించగా,
గోవర్ధన
పర్వతము
నెత్తి
వ్రేపల్లె
వారలనూ,
గోవులనూ
కాపాడినటుల,
కృష్ణ
పరమాత్మ
నొగలిపై
కూర్చుని,
వచ్చు
బాణముల
నన్నింటిని
తప్పించుచు,
వెనుక
కూర్చుని
యున్న
అర్జునుని
కంటి
రెప్పవలే
కాపాడుచు,
సర్వాస్త్రములు
తనపై
వేయించుకొని,
తన
దేహమునుండి
రక్తము
కాలువలై
ప్రవహించుచుండ,
లెక్కచేయక
అర్జునుని
ప్రాణమున
కెట్టి
అపాయమునూ
కలుగనీక
కాపాడుచూ,
ఎదుటి
వారి
శక్తిని,
తేజస్సునూ
హరించుచూ,
అర్జునునికి
ప్రత్యేక
ఉత్సాహ
తేజస్సుల
నందించుచూ,
తానొక
ఆయుధమునైననూ
చేపట్టక,
శత్రు
సంహారము
గావించి
పాండవుల
ధర్మప్రతిభను
లోకమునకు
చూపెను.
ఒక్కొక్క
సమయమున
సారథ్యము
చేయుచున్న
గోపాలుని
చూచి
మీ
తాత
యగు
అర్జునుడు,
"అయ్యో!
హృదయకమలమున
భద్రము
చేసికొనవలసిన
నిన్ను,
ఈ
రథ
నొగల
యందుంచుకొని,
నిన్నొక
పనివాని
వలె
ఉపయోగించు
కొనుచున్నాను!
ఛా!
ఇట్టి
తుచ్చమైన
రాజ్యమునకు
పరమాత్ముని,
చులకనైన
మార్గమున
ప్రవేశపెట్టుటయా?"
అని
తనలో
తాను
ఎంతనో
విలపించెడివాడు.
రథికునిగా
శ్రీకృష్ణుని
సేవలు
అన్నిటికంటెను
మరొక
విధిలేని
కార్యము
చేయవలసి
వచ్చెను.
ఆ
సమయమున
మీ
తాత,
'అబ్బా!
చెప్పలేను,
ఎంత
విలపించెడివాడో!
పాపము.'
4
▾
Meaning
Keep
అని
వ్యాసుడు
తల
వూపుచుండ,
పరీక్షిత్
మహారాజు
'స్వామీ!
ఏమిటి
ఆ
విధిలేని
కర్మ!'
అని
అడుగగా....
"రాజా!
యుద్ధ
కోలాహలములో
రథికుడు
సారథికి
'ఇటుపో,'
'అటుపో,'
'నిలువు'
అని
నోటితో
తెలుపుట
వీలుకాదు.
అట్లు
చెప్పుటకు
కూడనూ
ఆ
సమయమున
వీలుకాదు.
శత్రు
సంహారమందే
రథికుని
ధ్యానము
ఇమిడియుండును.
అన్య
చింతలు
వారిలో
చేరవు.
అందువలన,
సారథియొక్క
రెండు
కణతలకు
రథికుని
కాలి
బొటనవ్రేళ్ళు
రెండును
తాకునట్లు
వుంచుకొనవలసివచ్చెను.
ఎటుదిక్కు
వెళ్ళవలెనన్న
అటువైపున
కాలి
వ్రేలు
ఆ
కణతను
నొక్కవలెను.
సూటిగా
పోవలసి
వచ్చిన,
రెండునూ
సమానముగా
కణతలు
బొటన
వ్రేళ్ళతో
నొక్కవలసివచ్చెడిది.
ఆ
సమయమున
అర్జునుడు
ఎంతగానో
బాధపడెడివాడు.
తిరిగి
ఇంటికి
వచ్చిచూడగా
బలమైన
పాదరక్షలు
వేసికొనియుండుటచే
నొక్కబడిన
కణతలు
గుంతలుపడి
యుండుట
చూచి
రెండవ
దినమున
యుద్ధమే
వద్దని
ప్రార్థించెడివాడు
అర్జునుడు.
ఋషులు,
మునులు,
జ్ఞానులు
పూజించెడి
ఆ
శిరస్సును
నేను
పాదములచే
నొక్కవలసివచ్చెకదా,
అని
సృక్కిపోయెడివాడు.
కమలపు
రేకుల
వంటి
కృష్ణుని
కర
కమలములు
గుఱ్ఱములను
లాగి
పట్టుటతో
బొబ్బ
చిటికి
రక్తము
కారెడిది.
వేళకు
నిద్రగానీ,
తిండిగానీ
లేక,
సమయ
సందర్భములనక,
ఈపని,
ఆపని
అని
తార
తమ్యమును
పాటించక,
సర్వ
కర్మలూ
సమకూర్చి
పెట్టెడివాడు,
గోపాలుడు.
గుఱ్ఱములను
కట్టుట
మొదలుకొని,
వాటిని
నదులకు
తీసుకొని
వెళ్ళి,
కారిన
రక్తమును
బాగుగా
కడిగి
మందులు
వేసి,
అబ్బా!
ఒకటేమి?
అతను
మీ
తాతలకు
ఒక
పనివానివలె
మెలగెను
కానీ,
పరమాత్ముని
వలె
తిరగలేదు.
అదియే
భక్త
వత్సలత!'
అని
వ్యాసుల
వారు
తెలిపిరి.
Previous
←
Pārtha's Battle with Paśupati
Next
Parīkṣit, Struck by a Curse
→