Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Parīkṣit, Struck by a Curse
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
24.
శాపగ్రస్తుడైన
పరీక్షిత్తు
పాండవుల
భక్తి
శ్రద్ధలను,
శ్రీకృష్ణుని
అనుగ్రహ
శక్తులను
వ్యాసుల
ద్వారా
శ్రవణము
చేయు
పరీక్షిత్తునకు
రాత్రి,
పగలు
అనే
భేదము
తెలియక,
ఆనందమున
మునిగి
తేలుచుండ,
ఇంతలో
కిలకిల
పక్షుల
గానము
కొక్కొరొకో
యని
కోడి
కూతలూ
వినిపించెను.
సుప్రభాతము
వినిపించె,
దేవాలయము
లందలి
గంటలు
మ్రోగదొడగెను.
పరీక్షిత్తు
నైరాశ్యముతో
వేటకేగుట
'సరి!
తెల్లవారినద'ని
తలంచి,
వ్యాసులవారు
'నాయనా!
నేనిక
వెళ్ళి
వత్తునని'
పరీక్షిత్తును
ఆశీర్వదించి,
కమండలము
చేతబట్టి
వెడలెను.
వెడలుచున్న
వ్యాసుల
వారిని
చూచి,
పరీక్షితునకు
అర్థము
కాని
ఆవేదన
బయలుదేరెను.
అయ్యో!
అప్పుడే
తెల్లవారెనా!
మా
తాతల
మహత్తరమైన
భక్తి
శక్తులను
పూర్తిగా
విననైతిని
కదా!
అని
నిరాశతో,
విన్న
విషయములను
మననము
చేయుచూ,
ఏమి
చేయుటకు
తోచక,
కాలకృత్యములు
తీర్చుకొని,
రాజ్యపరిపాలన
విషయమున
మనసు
యే
మాత్రమూ
వెడలకుండుటచే,
ఇంటియందుండిన
యేవో
కొన్ని
పరిపాలనా
విషయములు
తలకు
ప్రాకుచుండునని
తలంచి,
యేకాంతముగా
నుండగోరి,
షికారార్థము
అడవికి
వెళ్ళ
నిశ్చయించి,
తమ
పరివారమునకు
కబురంపెను.
ఇంతలో
సర్వము
సిద్ధము
గావించబడినదని
ద్వారపాలకుడు
తెలుప,
భారమైన
మనసుతో
ఉత్సాహములేని
ఊహలతో,
కాయమును
కదిలించి
కడకు
రథమును
చేరెను.
2
▾
Meaning
Keep
సరి!
పరివారము
యథారీతిగా
ముందు,
వెనుక
వేటకు
తగిన
ఆయుధములను
ధరించి
నడువజొచ్చిరి.
ఇంతలో
రాజునకు
ఏమి
తోచినదో
ఏమో!
ఇంతమంది
పరివారము
రానక్కరలేదు,
అని
కొంతమందిని
వెనుకకు
పోవ
ఆజ్ఞాపించెను.
ఏ
కొంతమందినో
వెంటపెట్టుకొని
అడవిలో
ప్రవేశించెను.
ఇంతలో
కొన్ని
అడవి
మృగములు
గుంపులు,
గుంపులు
ఎదురేతెంచెను.
వాటిని
చూడగనే
రాజునకు
ఒక
విధమైన
ఉత్సాహము
చెలరేగే,
రథమును
దిగి,
అంబును
ధరించి
కాలినడకన
వాటిని
వేటాడుటకు
పూనుకొనెను.
యింతలో
ఆ
అడవి
మృగములు
చెల్లాచెదరై
పోయెను.
ఉన్న
కొంతమంది
సిపాయిలూ
వాటిని
తరుముతూ
ఒక్కొక్కరు
ఒక్కొక్క
మార్గము
పట్టిరి.
మహారాజు
కొన్ని
మృగములను
వేటాడి
తానొక
మార్గమున
పట్టిరి.
మహారాజు
కొన్ని
మృగములను
వెంటాడుచూ
తనొక
మార్గమున
వెళ్ళెను.
అడవిలో
ఒకరి
కొకరు
వీడిపోవుటచే
సంబంధము
లేక
నీటికై
వెతుక
జొచ్చెను.
కడ
కెటులనో
ఒక
పర్ణశాల
కనుపించ,
అక్కడికి
కొండంత
ఆశతో
పరుగులిడెను.
అక్కడ
వెళ్ళి
చూడ,
యెవ్వరునూ
మనుష్యులు
కనుపించలేదు.
రాజు
వెలుపలనుండి
యెన్నియో
విధముల
కేకలు
వేసి
పిలిచెను.
ఎవ్వరునూ
జవాబివ్వలేదు.
ఉక్రోషంతో
పరీక్షిత్తు
బుషిపై
మృతసర్పాన్ని
వేయుట
కడకు
లోనికి
మెల్లగ
బయలుదేరి,
'దాహము,
దాహము'
అని
అడిగెను.
అందున
ఎవ్వరూ
పలకరించువారు
లేకపోయిరి.
ఒకమూల
ఒక
ముని
తపస్సు
చేయుచుండినటుల
కనిపించెను.
అతని
దగ్గరికి
వెళ్ళి,
'స్వామీ!
స్వామీ!'
అని
పిలువ,
అతను
తీవ్రధ్యానమందుండుటచే
ఏ
మాత్రమూ
కదలక
మెదలక
వుండెను.
ఇది
చూచిన,
రాజునకు
ఒక
విధమైన
ఆవేదన,
ఆవేశము
బయలుదేరెను.
ఆకలి
బాధతో
విలపించుచూ,
ముని
ఆశ్రమమును
చేరియూ
పలకరించువారు
లేకపోయిరి
కదా!
నేను
చక్రవర్తినను
భావము
కూడనూ
మరచి
ఈ
బుషులు
ఇట్లు
పలకరించక
పోయిరి
కదా!
అని
అజ్ఞానము
ఆవేశించుటచే
క్రోధముచే
3
▾
Meaning
Keep
వెనుకకు
తిరిగి
వచ్చుచుండ,
తన
కాలికి
ఏదియో
ఒక
త్రాడువలె
సోకెను.
అది
యెత్తి
చూడ
మృత
సర్పమని
తెలిసికొని,
విపరీత
బుద్ధిపుట్టి
తపమున
నిమగ్నుడైన
ముని
కంఠమున
విసిరి,
వచ్చిన
దారిని
బయలు
దేరెను.
వెలుపల
రాగానే,
కొందరు
బుషి
కుమారులు
చూచి,
లోన
ఏమి
జరిగినదో
అని
వెళ్ళి
చూడగ,
తపస్సాచరించుచున్న
శమీకమహర్షి
కంఠమున
సర్పము
కనిపించెను.
ఏమి
విచిత్రమని,
శాంతముగా
పరికించగా,
అది
మృత
సర్పమని
తెలుసుకొని,
ఇది
ఎవరి
వలన
జరిగినదని
ఆలోచించుచూ,
బహుశా
ఇపుడు
వెళ్ళిన
వ్యక్తి
పనియే
అయివుండవచ్చునని
తలంచి,
బాలురు
పరుగిడి
పోయి
శమీకమహర్షి
కుమారుడైన
శృంగి
ఆడుకొనుచుండ,
అతనితో
ఈ
వార్త
తెలిపిరి.
బుషి
కుమారుడు
పరీక్షితుని
శపించుట
పాపము!
ఆ
శృంగి
ఇది
ఒట్టి
అసత్యము
అనియూ,
తన
తండ్రికి
ఇట్టి
అవమానము
ఎపుడునూ
చేకూరదనియూ,
ఇది
కేవలము
ఆటలకై
ఆడుమాటలనియూ,
లక్ష్యము
చేయక,
ఆటలలో
నిమగ్నుడై
యుండెను.
తోడి
పిల్లలు
పదేపదే
తెలుపుచూ,
అసత్యము
కాదనియూ,
మేము
సత్యమునే
వచించుచున్నామనియూ,
ఒక
పరి
వచ్చి
చూచిన
నీకే
తెలియుననియూ
చాలా
ఆతురతగా
తెలుపుచుండిన
ఆ
పలుకులు
శృంగికి
కొంత
కలత
కలిగించగా,
పరుగిడి
వచ్చి
చూడగా,
బుషి
కుమారులు
చెప్పిన
వాక్యములు
యథార్థములని
తెలిసికొని,
తన
తండ్రి
కింతటి
అగౌరవము
చేసిన
వారెవ్వరని
అనేక
విధముల
విచారించగ,
ఎవరో
ఒక
రాజ
వేషధారి
ఆశ్రమమునకు
వచ్చి
వెడలు
చుండెననియూ,
బహుశా
అతనే
ఈ
పని
చేసియుండుననియూ,
కొందరు
బుషి
కుమారులు
తెలుప,
పరుగిడి
అన్ని
మార్గములూ
పరికించి
చూచి,
కొంత
దూరములో
తడబడుచూ
నడచు
చుండిన
ఒక
రాజరూపధారిని
చూచి,
క్రోధావేశముతో
తన
తండ్రి
కింతటి
అవమానము
గావించెనని
భరించలేక,
జలము
తీసి,
ఆ
వెడలు
వ్యక్తివైపునకు
చల్లుచు
"మా
తండ్రి
కంఠమున
4
▾
Meaning
Keep
మృతసర్పమును
వేసిన
వ్యక్తి
యేడు
దినములలో
సర్పము
కాటుచే
ప్రాణములు
వీడును
గాక"
అని
శపించెను.
చుట్టునున్న
పిల్లలు
ఎంత
వారించిననూ
వినక
యిట్టి
కఠిన
శాపమునిచ్చి,
ఆశ్రమమున
ఒక
మూల
కూర్చొని
తండ్రికి
జరిగిన
పరాభవమును
స్మరించుచూ,
'కుమారుడనగు
నేను
ప్రాణముతో
నుండగనే
తండ్రికింతటి
అవమానము
జరుగుట,
ఛీ!
నా
జన్మమేమి
ప్రయోజనము!
తండ్రి
గౌరవమును
కాపాడలేని
పుత్రుడుండియూ
లేనటులనే',
అని
తనను
తాను
నిందించుకొంటూ
విలపించుచూ
వుండెను.
క్రుంగి
పొంగకుండుటే
ఆత్మతత్త్వం
తోటి
బుషి
కుమారులు
ఎంతెంతనో
బోధించుచూ,
శాంతపరచుచూ,
వేసిన
వ్యక్తిని
వారు
కూడనూ
దూషించుచూ,
ఒకరికొకరు
సమాధానములు
తెలుపుకొనుచుండగనే,
శమీక
మహర్షి
తన
దీక్షనుండి
జాగ్రత
ప్రపంచమునకు
వచ్చెను,
కదలెను,
కన్నులు
తెరచెను.
కంఠమందున్న
మృతసర్పమును
తీసి
ప్రక్కకు
వేసెను.
చెంతనే
ఒకమూల
దుఃఖించుచున్న
పిల్లలను
చూచి
దగ్గరకు
పిలిచి,
దుఃఖమునకు
కారణమేమని
అడుగగా
జరిగిన
వృత్తాంత
మంతయూ
తెలుపగా,
శమీక
మహర్షి
చిరునవ్వు
నవ్వి
'పాపము!
ఎవరో
తెలియక
చేసిన
ఈ
చిన్న
కార్యమునకే
మీరింత
దుఃఖించుట
అజ్ఞానము.
నాకు
గౌరవ
ప్రతిష్టలతో
పనిలేదు.
ఇట్టి
మానాభిమానములకు
క్రుంగి
పొంగకుండుటే
ఆత్మ
తత్త్వము
యొక్క
సత్యము.
ఎవరో
అమాయకులు
ఈ
కార్యము
చేసి
యుందురు.
మీరు
బాలురగుటచే,
ఈ
చిన్నదానిని
పెద్దదిగ
చేసి
కొండంత
బాధను
అనుభవించుచున్నారు.
లెండు!
ఆడుకొనుడు!'
అని
కుమారుడైన
శృంగిని
దగ్గర
పిలిచి
తొడపై
కూర్చున
బెట్టుకొని
తల
నిమురుచుండ,
రోదించుచూ
శృంగి
'నాన్నా!
అమాయకులు
చేసినపని
కాదిది.
రాజ
వేషధారియైన
ఒక
వ్యక్తి
మదాంధుడై
గావించిన
పరమ
పాపము'
అని
కఠినోక్తు
లాడుచుండెను.
5
▾
Meaning
Keep
శమీక
ముని
'యేమేమీ!
రాజవేషధారియా!
మీరు
చూచితిరా?
రాజులిట్టి
అల్ప
కార్యముల
కొడిగట్టరే?"
అనుచుండగనే
తోడి
బాలురు
'గురువర్యా!
మేము
చూచితిమి.
అతడు
నిజముగా
రాజువలె
నుండెను.
అతనిని
చూచి
మేము
పరుగిడి
పోయి
శృంగిని
తీసుకొని
వచ్చితిమి.
శృంగి
మీ
కంఠమందు
గల
మృత
సర్పమును
చూచి
దిగ్భ్రాంతి
చెంది,
ఎంత
నివారించిననూ
వినక,
గంగా
జలమును
మంత్రించి,
ఆ
వెడలు
వ్యక్తి
వైపునకు
చల్లుచూ,
"నేటికి
ఏడవ
దినమున,
సర్పమును
వేసిన
వ్యక్తి
సర్పకాటుతో
మరణించుగాక!
అని
శపించెను'
అని
బాలురు
తెలిపిరి.
శమీకమహర్షి
కుమారుని
మందలింపు
-
శాంతం
బుషి
స్వభావం
శమీక
మహర్షి
ఆశ్చర్య
చకితుడై
తొడపైనున్న
కుమారుని
ప్రక్కకు
నెట్టి
'ఏమీ!
శపించితివా?
అయ్యో!
గోరంత
తప్పుకు
కొండంత
శాపము
నిచ్చుట
బుషి
కుమారునకు
తీరని
లోటుకదా?
ఇంత
మాత్రపు
తప్పును
సహించలేని
బలహీనుడు
బుషి
కుమారుడన్న
తోటి
బుషి
కుమార
లోకమునకే
అవమానము
కదా!
ఇట్టివాడు
నా
కుమారుడని
చెప్పుకొనుటకు
నాకే
సిగ్గు
చేటుగ
నందునే,
అయ్యో!
బాలురబుద్ధి
గడ్డి
తిని,
ముని
జాతికి
తీరని
అపకీర్తి
తెప్పించెనే,
ఛీ!
ఛీ!
నీ
ముఖము
చూడకూడదు,
ప్రజలను
శిక్షించే
అధికారము
రాజుది
కానీ
మునులది
కాదు.
ప్రజలను
శపించు
ముని,
మునికాదు.
సర్వలోక
రక్షకుడైన
సర్వేశ్వరుని
సాన్నిధ్యమును
చెందగోరి
పొందగోరి
సర్వసంగ
పరిత్యాగులై,
కాననమున
బడి,
కంద
మూలాదులను
భక్షించి,
కాయసుఖముల
విసర్జించి
కాలమును
గడుపుచున్న
మునులకు
ఇట్టి
కఠిన
భావములు
కలుగుట
కలికాల
ప్రవేశము
కాబోలు!
అయ్యో!
యెంతటి
పాపమునకు
ఒడిగట్టుకొంటివి!'
అని
విచారముతో
కుమారుని
మందలించెను.
Previous
←
Kṛṣṇa, Charioteer of Vijaya
Next
The Compassionate Śamīka Muni
→