Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Compassionate Śamīka Muni
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
దయామయుడైన
శమీక
మహాముని
నిర్దాక్షిణ్యముగా
మాటాడుచున్న
తండ్రి
మాటలు
కుమారుడైన
శృంగి
హృదయమునకు
కత్తిపోటువలె,
సుత్తి
వేటువలె
తగులుటచే
దుఃఖము
భరించుకొనలేక,
తండ్రి
పాదములపైబడి
'తండ్రీ,
క్షమించుము.
రాజే
ఇంతటి
అవిశ్వాస
అవినయముగా
ప్రవర్తించుట
నా
కెంతయో
విచారము
కలిగి
కుపితుడనైతిని.
మీకు
చేసిన
పరాభవమును
సహింపలేకపోతిని.
బుషి
ఆశ్రమమునకు
వచ్చి
ఇట్లు
అనుచిత
వ్యవహారమును
గావించుట
ప్రభువుకు
న్యాయము
కాదు
కదా!
అని
రోదించుచుండెను.
శమీక
మహాముని
పుత్రుని
చేరదీసి,
"బిడ్డా!
కాలము
బలవత్తరమైనది.
మానవునకు
వివేకము
నశించు
పరిస్థితి
అపుడపుడు
ఏర్పడుచుండును.
వినాశకాలము
విపరీత
రూపమును
ధరించి
కాలముచే
ఈరీతిగా
చేయించుచుండును.
రాజు
మహా
భక్తుడు,
తేజస్వి,
ధర్మాత్ముడు,
సమస్త
భూమండలములకు
చక్రవర్తి.
అతని
కీర్తి
త్రిభువనములకు
వ్యాప్తమై
అతడు
యెల్లప్పుడూ
వేలకొలది
దాసదాసీలతో
సేవించబడు
చుండెడివాడు.
అతను
భవనమును
వదలి
వెలుపల
వెళ్ళిన,
చుట్టూ
అనేక
రక్షక
భటులు
అతని
ఆజ్ఞలకై
చేతులు
కట్టుకొని,
దృష్టిని
మరల్చక
వెంట
పాదచారులై
తిరుగు
చుండెడివారు.
అతను
ఏరాజ్యమున
ప్రవేశించిననూ
ఆయా
దేశపు
రాజులు
అతనికి
స్వాగతములిచ్చి,
అతనిని
అనేక
రీతుల
గౌరవించి
భృత్యులై
కొలిచెడివారు.
2
▾
Meaning
Keep
తాపసులకు
కోపము
తగదు
ఇట్టి
భోగములతో
అలవాటు
పడిన
మహారాజునకు
ఇక్కడ
యెట్టి
స్వాగతమూ,
గౌరవమూ
జరుగకుండుటే
గాక,
చారెడు
నీరునైననూ
ఇచ్చి
తాపము
చల్లార్చలేక
పోయిన
పరిస్థితి
ఏర్పడుటచే
ఆకలి
బాధ,
ఒకవైపునా,
పిలిచిననూ
ఎవరూ
పలుకక
అతను
ఆశించిన
గౌరవము
అందుకోలేక
పోవుట,
నిరాశ,
తాపములు
మరొకవైపుననూ
ఆవరించుటచే
భరించలేక
ఈ
విధమైన
అనుచిత
కార్యమును
చేయుటలో
కొంత
పొరపడి
యుండును.
అంతమాత్రముననే,
నీవు
కుపితుడవై
బుషి
కుమారులకు
విరోధమైన
ఇట్టి
కార్యమునకు
పూనుకొనుట
తాపస
లోకమునకే
తీరని
పాపమును
చేకూర్చితివి,
ఛీ
ఛీ
ఎట్టి
ద్రోహము
నొనర్చితివి?
అని
మందలించుచూ,
కన్నులు
మూసుకొని
ఈ
అపరాధమును
తప్పించు
ఉపాయమేదైననూ
కలదా
అని
విచారించి
ఎట్టి
ఉపాయము
లేదని
గ్రహించి,
అన్నింటికీ
ఆ
పరమేశ్వరుడే
సర్వసమర్థుడు
అని
తలంచి
భగవంతుని
ఈ
రీతిగా
ప్రార్థించెను.
'సర్వలోక
శరణ్యా!
అపక్వ
బుద్ధిగల
బాలుడు,
కర్తవ్యా
కర్తవ్యతా
జ్ఞానము
లేక,
అజ్ఞాన
ప్రోద్బలముచే
రాజునకిట్టి
అపరాధము
గావించెను.
కాన
బాలుని
క్షమించి
యైననూ,
లేక
శిక్షించి
యైననూ
రాజునకు
కల్యాణము
కలుగజేయుము'
అని
ప్రార్థించెను.
ఇంతలో
కన్నులు
తెరచి,
గుమిగూడిన
బుషులనూ,
బుషికుమారులను
చూచి
విచారముతో,
'చూచితిరా!
నా
కుమారు
డౌనర్చిన
అపరాధము.
లోకపాలకుడైన
రాజును
ఈ
రీతిగా
పరాభవము
చేయుట
బుషులకు
పాడికాదుకదా!
కాన
మీరందరూ
భగవంతుని
ప్రార్థించి,
ఆ
రాజునకెట్టి
కీడునూ
వాటిల్లక
శుభము
లందుకొనునట్లు
చేయుడు'
అని
శమీక
మహాముని
తెలిపెను.
అందులో
ఒక
వృద్ధ
బుషి,
శాంతమూర్తుడై
లేచి
"మహాత్మా!
తమకే
ఇంతటి
అనుగ్రహము
రాజుపై
వుండిన
శాపమిచ్చినది
తమ
పుత్రుడే
కదా!
తమ
శక్తి
పుత్రుని
కంటెనూ
అధికమైనది
కదా!
తమరు
సర్వ
సమర్థులు
కదా!
అట్టి
తమరు
ఈ
3
▾
Meaning
Keep
బాలుడిచ్చిన
శాపమును
జరుగకుండునటుల
చేయవచ్చును
కదా?
తమరింత
విచారించనేల?"
అని
ప్రార్థించగనే
మిగిలిన
కొందరు
బుషులు,
బుషి
కుమారులు
"సత్యము,
సత్యము
మా
ప్రార్థన
లాలకించి,
కుమారుని
క్షమించి
చక్రవర్తికి
కల్యాణము
కలుగజేయుడు"
అని
అందరూ
ఏక
కంఠముతో
అడుగు
కొనిరి.
విధివిధానము
తప్పినది
కాదు
అంత
శమీక
మహాముని
చిరునవ్వు
నవ్వి,
కన్నులు
మూసుకొని,
మహారాజు
యొక్క
భూత,
భవిష్యత్తును
యోగ
దృష్టితో
పరికించి
వర్తమానమున
కేమైననూ
ఆధారములు
కలవా?
లేక
అవాంతర
ఫలమా?
అని
విచారించగా,
రాజు
తక్షక
విషానలమున
జెందవలెననియూ,
ఇది
తప్పునది
కాదనియూ,
ఇట్టి
విధివిధానమును
తప్పించుటకు
ప్రయత్నించుట
భగవంతుని
ఆజ్ఞకు
విరుద్ధ
ప్రవర్తన
సలుపుటే
అనియూ,
అట్టి
జన్మాంతర
కర్మచే
ఈ
పిల్లవానికిట్టి
సంకల్పమును
రాజునకిట్టి
దుర్గుణమును
కలిగించినదనియూ,
తెలుసుకొని,
సర్వ
సంకల్ప
సిద్ధుడైన
సర్వేశ్వరుడే
దీనిని
సమర్థింప
గలడు
కానీ
అన్యులకిది
సాధ్యము
కాదనియూ,
అట్లు
ప్రయత్నించుట
అహంకార
ప్రభావమే
అనియూ,
తెలిసికొనెను.
అహంకారము
బుషులకు
మహా
శత్రువగుటచే
దానిని
ప్రవేశింపజేయకుండుటకై
తన
కెంత
శక్తి
యున్ననూ
దానిని
శమింపచేయుటకు
శమీక
మహర్షి
పూనుకొనక
తనకు
తగిన
సహాయము
కొంతవరకైననూ
చేయ
సంకల్పించి
కన్నులు
తెరచి
నలువైపులా
పరికించి,
సమర్థుడైన
ఒక
శిష్యరత్నమును
చేరబిలిచి,
"నీవిప్పుడే
హస్తినాపురమునకు
వెళ్ళిరావలెను.
సిద్ధము
కమ్మని!"
అని
ఆజ్ఞాపించెను.
అంత
ఆ
శిష్యుడు
'సిద్ధ
మగుటకు
బుషి
శిష్యులకు
వేరేమున్నది?
తమ
ఆజ్ఞయే
మా
సర్వ
సిద్ధము.
ఈ
నిమిషముకు
ఇచ్చట
నుండియే
బయలుదేరుదును.
ఆజ్ఞాపింపుడని
నమస్కరించెను.
అంత
శమీక
మహర్షి
ఆసనమునుండి
లేచి
ఆ
శిష్యుని
లోనికి
తీసికొని
పోయి,
ఆ
రాజుకు
తెలుప
4
▾
Meaning
Keep
వలసిన
విషయములన్నియూ
సక్రమముగా
తెలిపెను.
అంత
శిష్యుడు
శమీక
మహామునికి
నమస్కరించి
బయలుదేరెను.
శమీకుడు
శిష్యుని
పరీక్షిత్తు
దగ్గరకు
పంపుట
ఇది
ఇట్లుండ,
మహారాజగు
పరీక్షిత్తు
హస్తినాపురము
చేరి,
కొంత
శ్రమ
తీర్చుకొని
లేచిన
తక్షణమే,
తాను
ఆశ్రమములో
చేసి
వచ్చిన
మహాపరాధమునకు
విచారించుచూ,
'అయ్యో!
నా
బుద్ధి
ఎంత
భ్రష్టయ్యెను?
నిష్ఠుడగు
మహా
తపస్విని
చక్రవర్తియగు
నేను
ఈ
రీతిగా
అవమానపరచుట
పరమపాపము'
అని
విచారించుచూ,
దానికి
తగిన
పరిహారమేమి?
లేక
మరొకపరి
ఆశ్రమమునకు
స్వయముగా
వెళ్ళి
క్షమాపణ
కోరుటయా?
లేక
వారి
శిక్షను
శిరస్సొప్పించుటయా?
కర్తవ్యమేమి?
అని
పరితపించుచున్న
సమయమున
ఒక
సేవకుడు
వచ్చి,
ద్వారము
చెంత
చేతులు
కట్టి
నిలుచుకొనెను.
మహారాజు
ఆ
దాసుని
జూచి
కారణమేమని
ప్రశ్నించగా
'ఎవరో
ఒక
బుషి
కుమారుడు
తమ
దర్శనమునకై
శమీక
మహర్షి
పంపగా
వచ్చినాడనియూ,
అతను
తమకు
మహాబుషి
పంపిన
వార్తలను
అతి
త్వరగా
అందించవలెననియూ
చాలా
ఆతురతపడుచున్నాడు.
ఇందుకు
ప్రభువులవారి
ఆజ్ఞ',
అని
తెలిపెను.
ఆ
మాట
వినగనే,
తాను
పరుండిన
మల్లెలపాన్పు
సర్పమువలె,
నిప్పులవలె
కాల్చుచూ
బుసకొట్టుచున్నట్లు
తోచెను.
తక్షణమే
లేచి,
ద్వారపాలుని
దగ్గరకు
పిల్చి
"బుషి
కుమారుడేమనె?
అతని
ముఖ
వర్చస్సు
విచారముతో
నున్నదా?
క్రోధముతో
నున్నదా?
లేక
ఆనంద
శాంతము
లొలుకుచున్నవా?"
అని
మీద
మీద
ప్రశ్నలు
వేయదొడగెను.
అంత
ద్వారపాలుడు
వినయముతో
తలవంచి,
'మహారాజా!
ఆ
ముని
కుమారుడు
పరమ
శాంతుడు.
ఎల్లప్పుడు
మహారాజునకు
జయ
జయశబ్దములు
పలుకుచున్నాడు.
ఉద్రేకము
అతని
మోము
నందేమాత్రమూ
కనుపించకున్నది'
అని
జవాబుచెప్పెను.
అంత
మహారాజు
కొంత
సర్దుకొని
ఆ
మహాబుషి
కుమారుడు
అడిగిన
ప్రశ్నకు
నీవేమి
జవాబిచ్చి
వచ్చితివని
ద్వారపాలకుని
ప్రశ్నించగా
5
▾
Meaning
Keep
"విప్రోత్తమా!
మహారాజు
గారు
వనమునకు
వెళ్ళి
అలసి
వచ్చిరి.
విశ్రాంతి
నుండి
లేవగనే
మీ
వార్త
వారికందింతునని
తెలిపితిని"
అని
ద్వారపాలకుడు
సమాధానము
తెలిపెను.
ఇంతలో
మహారాజు
ఆతురతతో,
'నీ
ఈ
సమాధానమునకు
ఆ
ముని
కుమారుడేమనెను?'
అని
మరొక
ప్రశ్న
వేసెను.
'ప్రభూ!
ఆ
వచ్చిన
మునికుమారుడు
తమను
దర్శించుటకు
ఆతురత
పడుచున్నట్లు,
చాలా
అవసరమైన
వార్త
అనియూ,
వారి
గురువుగారు
తనకొరకు
నిమిషములు
లెక్కించుచుండుననియూ
ఎంత
త్వరలో
దర్శించిన
అంత
మంచిదని
నిమిష
నిమిషమునకు
రాజునకు
శుభము
కలుగుగాక!
రాజునకు
శుభము
కలుగుగాక!'
అని
వల్లించుచున్నాడు.
వారికొక
ఉన్నతాసనమిచ్చి
కూర్చోమన్ననూ
వారు
దానికి
అంగీకరించక
ద్వారము
దగ్గర
నిల్చి
నిమిషములను
లెక్కించుచున్నారని
తెలిపెను.
అంత
రాజు
ఆనంద
భాష్పములు
తుడుచుకొనుచు,
కిరీటమునైననూ
ధరించక,
పాదరక్షలనైననూ
వేసుకొనక,
అంగవస్త్రమును
అలంకరించక
అతివేగముగ
నడచుకొని
ద్వారము
దగ్గరకు
వచ్చెను.
అంత
ముని
కుమారుని
చూచి,
సాష్టాంగ
నమస్కారము
చేసి,
వారి
చేతులు
రెండునూ
పట్టుకొని
లోనికి
తోడ్కొని
పోయి,
బుషికుమారుని
ఉన్నతాసనముపై
కూర్చుండ
బెట్టి,
తాను
క్రింద
కూర్చుని
తమ
రాకకు
కారణమేమని
ప్రార్థించిన
మహారాజును
చూచుచూ,
ముని
కుమారుడు,
'రాజా!
మా
గురువుగారు
శమీక
మహాముని
తమకు
ప్రత్యేక
ఆశీర్వాదములు
అంపుతూ
కొన్ని
ముఖ్య
విషయములు
తమకు
తెలుపమని
శలవిచ్చి'రని
తెలుపుతు
కంటిధారలు
తుడుచుకొనుచుండెను.
అజ్ఞానంచే
జరిగిన
మహాపరాధం
మహారాజు
ఆతురతతో,
"ముని
కుమారా!
ఆ
విషయమేమియో
త్వరగా
తెలుపుము.
నానుండి
కావలసిన
పని
యేమైననూ
వుండిన
నా
ప్రాణములైననూ
ఒడ్డుటకు
సిద్ధముగానున్నాను.
లేక
నా
రాజ్యమునకేమైననూ
కీడు
వాటిల్ల
6
▾
Meaning
Keep
దినములు
రానున్నవా?
దానికి
తగిన
పరిహారము
లేవియో
తెలిపిన
తప్పక
శిరసావహింతును"
అని
ప్రార్థించెను.
'మహారాజా!
రాజ్యమునకు
కానీ,
మహర్షులకు
కానీ
యెట్టి
ప్రమాదములూ
లేవు,
రావు.
కానీ
తమకే
కొన్ని
అశుభములు
ఆవరింప
సమీపించుచున్నవి'
అని
మునికుమారుడు
సూక్ష్మముగా
తెలుప,
మహారాజు
'ధన్యుడను!
మహాబుషులూ,
రాజ్య
ప్రజలూ
శుభముగా
వుండిన
నాకెన్ని
అశుభములు
సంభవించిననూ
పరవాలేదు,
వారల
సుఖశాంతులే
నా
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు'
అని
కొంత
శాంతుడై
తమ
గురువుగారు
ఏమి
సెలవిచ్చిరో
తెలుపమని
మునికుమారుని
ప్రార్థించెను.
"మహారాజా!
తెలియక
అజ్ఞానముచే
జరిగిన
ఒక
మహాపరాధమునకు
మహాముని
చాల
విచారించుచున్నారు.
ఆ
విషయమును
మీకు
తెలుపుటకే
నన్నిచటకు
పంపుటకు
మూలకారణము"
అని
ముని
శిష్యుడు
చెప్పుచుండగనే
మహారాజు
ఆత్రుతతో,
"అది
యెట్టి
అపరాధమో,
ఎవరు
గావించినదో
దయచేసి
విపులముగా
తెలుపు"
మని
కోరెను.
Previous
←
Parīkṣit, Struck by a Curse
Next
A Curse? Or a Boon of Grace?
→