Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · A Curse? Or a Boon of Grace?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శాపమా?
లేక
వరప్రసాదమా?
'మహారాజా!
మా
గురువునకొక
పుత్రుడు
గలదు.
అతను
బాలుడైననూ,
అతని
తేజోశ్శక్తి
మహా
తీక్షణమైనది.
అతను
తండ్రినే
దైవముగా
భావించును.
తండ్రి
యోగక్షేమ
గౌరవములే
అతని
ముఖ్యలక్ష్యము.
అతని
పేరు
శృంగి
అందురు.
మీరు
ఆశ్రమమునకు
వచ్చి
యే
కారణము
చేతనో
మీకట్టి
బుద్ధి
పుట్టి,
శృంగి
తండ్రియైన
శమీక
మహర్షిని
(అనగా
మా
గురువు
గారి)
కంఠమున
మృత
సర్పమును
వైచి
వచ్చితిరి.
దానిని
కొందరు
బుషి
కుమారులు
చూచి
పరువిడి
మిగిలిన
బుషికుమారులతో
ఆడుకొనుచున్న
శృంగికి
తెలుపగా,
అతను
మొదలు
విశ్వసించక,
తన
ఆటలో
నిమగ్నుడగుటచే,
తోడి
బుషికుమారులు
విడువక,
ఇదే
విషయమును
మీద
మీద
తెలుపుచు,
తండ్రి
కింతటి
పరాభవము
జరిగిననూ
నీవ
లెక్కచేయక
అడుకొనుచున్నావని
వారందరూ
హాస్యము
చేయగ,
ఉద్రేకుడై
పరువిడి
వచ్చి
తండ్రిని
చూచి,
బుషి
కుమారులు
చెప్పినది
సత్యమని
తెలిసికొని,
వెనుకకు
తిరిగి
చూడగా
అప్పుడే
మీరు
వెళ్ళుచున్న
దృశ్యమును
దారియందు
గమనించి,
యుక్తా
యుక్త
విచారము
సలుపక,
క్రోధోద్రేకముచే,
బాల్య
చాపల్యుడై
తమను
శపించెను.
అదియే
మా
గురువుగారికి
తీరని
బాధగానున్నది"
అని
తెలుపుచుండగనే
రాజు
ఆతురతతో
"ముని
కుమారా!
శృంగి
నన్ను
యేమని
శపించెను?"
అని
ప్రశ్నించెను.
2
▾
Meaning
Keep
"ప్రభూ!
నేనేమని
తెలుపుటకు
పాలుపోకున్నది.
నోరాడకున్నది.
గురువాజ్ఞ
అగుటచే
తెలుపవలసి
వచ్చినది.
మా
గురు
కుమారుడు
తక్షణము
కౌశికీ
జలమును
స్పృర్శించి,
నేటికి
యేడవదినమున,
నీవు
తక్షక
సర్పదష్టుడవు
కాగలవు"
అని
భయంకర
శాపము
నొసంగెను.
అని
ముని
శిష్యుడు
కంటి
నీరు
కార్చెను.
పరీక్షిత్తు
తీవ్ర
వైరాగ్యమును
పొందుట
రాజు
చిరునవ్వు
నవ్వి
"ముని
శిష్యా!
విచారించకుము.
ఇదియా
శాపము?
తక్షకుడు
కాటు
వేయుట?
అదియూ,
యేడు
దినములకు!
ఇది
మహా
వర
ప్రసాదమే
కాని,
శాపము
కాదు.
ముని
కుమారుని
అనుగ్రహము.
ఎట్లన
నేను
నిరంతరం
రాజ్యకార్య
నిమగ్నుడనై
జీవిత
లక్ష్యమైన
దైవకార్యములందు
తామసమొందితిని.
అందునిమిత్తమై
ఆ
హరి,
ఆ
బుషి
కుమారుని
నోటచేరి
ఈ
రీతిగా
పలికించెను,
అందునా
యేడు
దినముల
కాలము
గడుపగ
అనుగ్రహించెను.
దీనిని
పట్టిచూడ
ఈ
యేడు
దినములు
నిమిషము
వృథాపరుపక,
శ్రీహరి
చింతన
చేయుమనియే
భగవ
దుద్దేశమయివుండును.
కాబోలు!
ధన్యుడను!
ఇప్పటి
నుండియే
ఆ
శ్రీహరి
చింతనతో
కాలమును,
కాయమును,
అతని
చరణాంబుజముల
నాశ్రయించి
అర్పితమొనర్తును.
ముని
శిష్యా!
తమ
గురువుగారు
ఇంకనూ
ఏమని
సెలవిచ్చిరో
తెలుపుము.
వినకుతూహలముగ
నున్నది"
అని
ప్రార్థించెను.
అందులకు
ముని
శిష్యుడు,
"ప్రభూ!
తమరు
ధర్మాత్ములనియూ,
హరి
భక్తులనియూ,
అట్టి
పవిత్రులగు
మిమ్ములను,
తన
కుమారుడిట్టి
కఠిన
మాటలతో
శపించెననియూ,
ఇది
రాజ
ద్రోహముగా
భావించి,
తమరిట్టి
శాపమునకు
గురికాక
చూచుకొనవలెనని,
తాను
అనేక
విధముల
యోగ
దృష్టితో
విచారణ
సలుపగ,
మీ
భవిష్యత్తులో
సర్పముకాటుతో
కాయమును
వీడుదురనియూ,
అయిననూ,
మీరు
భగవానుని
పరమధామమును
పొందుదురనియూ,
ఇది
ఉత్తమ
సార్థకమనియూ
తెలిసికొని,
ఇట్టి
ప్రాప్తికి
అడ్డు
తగులుట
పాపమని
తలంచి,
మీకు
3
▾
Meaning
Keep
భగవత్సాన్నిధ్యము
ప్రాప్తించుగాక!
అని
ఆశీర్వదించి,
ఈ
విషయమును
తమకు
తెలిపి
రమ్మని
నన్ను
పంపిరి.
శెలవిచ్చిన
నా
పని
పూర్తి
అయినది.
నేనిక
వెళ్ళి
వత్తును"
అని
ముని
శిష్యుడు
తెలిపెను.
మహారాజు
మునిశిష్యునకు
నమస్కరించి
తాను
ధన్యుడననియూ,
నాకిట్టి
పవిత్ర
ప్రాప్తి
చేకూర్చినందులకు
ముని
కుమారునకు,
ముని
శ్రేష్ఠుడగు
శమీక
మహా
బుషికినీ
నా
ధన్యవాదములు
అర్పించినటుల
తెలుపుమని
ప్రార్థించెను.
అంత
శమీక
శిష్యుడు
ఆశ్రమమునకు
తిరిగి
వెళ్ళి
జరిగిన
సమాచారమును
మునికి
యెరిగించెను.
ఇది
యిట్లుండ,
మహారాజు
పరమోల్లాసముతో
అంతఃపురము
ద్వారమునకు
ఈవలి
వైపున
నిలిచి,
తన
కుమారుడగు
జనమేజయుని
తోడ్కొని
రమ్మని
కబురంపగా
జనమేజయుడు
ఎందులకో
ఏమోనని,
ఎక్కడున్నవాడు
అక్కడనుండియే
పరుగిడి
వచ్చెను.
అంత
ఒక
వృద్ధ
బ్రాహ్మణుని
పిలిపించి,
తన
గదియందు
పరుపుపై
వుంచిన
కిరీటమును
తెమ్మని
చెప్పి,
ఆ
కిరీటమును
ఆ
క్షణమందే
జనమేజయుని
శిరస్సునముంచి,
ఆ
బాలుని
వృద్ధ
బ్రాహ్మణున
కప్పజెప్పి,
కట్టుగుద్దలతో
కాలినడకతో
గంగానదివైపు
వెళ్ళెను.
ఇది
క్షణములో
అంతఃపురములోను,
పట్టణములోని,
సర్వమూలలా
ప్రాకి
గుంపులు
గుంపులు
ప్రజలు,
బ్రాహ్మణులు,
స్త్రీలు,
రాజులు,
మంత్రులు
చేరి
ఎంత
ప్రార్థించి
నివారించుటకు
ప్రయత్నించిననూ
సాధ్యము
కాకపోయెను.
పరిపరి
విధముల
రోదనలు
చేసిరి.
కాళ్ళపై
పడిరి.
బజార్లలో
దొర్లిరి.
ఏమి
జరుగుచున్ననూ
రాజు
కన్నెత్తి
చూడక,
హరినామమును
స్మరించుచూ,
లక్ష్యమును
వీడక
ఎవరేమడిగిననూ
జవాబు
చెప్పక
భాగీరథీ
తీరమునకు
వెళ్ళెను.
అతని
వెంట
గజ,
తురగ,
రథములు,
పాలకీలు
పరువులిడెను.
కాని,
దేనినీ
గమనించలేదు
మహారాజు.
అసలు
ఆహార
పానీయములు
కూడనూ
కుడువక
నిరాహార
దీక్షతో
నిమిషము
తెరపిలేక,
శ్రీహరి
స్మరణచేయుచుండుట
చూచిన
ప్రతి
మానవుని
హృదయమూ
పరమాశ్చర్యమొందుచూ,
ఇట్టి
తీవ్ర
వైరాగ్యమున
4
▾
Meaning
Keep
కేమి
కారణమో
తెలియక,
యెవరిలో
వారు
పరి
పరి
విధముల
అపోహలకు
గురియై
గుస
గుసలు
బయలుదేరెను.
ఇంతలో
దీనికి
ముందు
ఏమి
జరిగినదో
చక్కగా
విచారించగా
ముని
శిష్యుడు
వచ్చుట,
అతడు
జరిగిన
విషయమును
తెలుపుట,
ఈ
రీతిగా
సత్యమును
తెలిసికొని,
తమ
మహారాజు
ఇక
ఏడు
దినములు
మాత్రమే
జీవించగలడని
తలంచి,
ప్రజలందరికీ
తెలిపి,
ముందుకు
జరుపవలసిన
ఏర్పాట్లకు
అన్నియునూ
సిద్ధము
గావించి,
ప్రజలందరూ
ఆ
నదీ
తీరమునందే
చింతాక్రాంతులై
రాజుతో
పాటు
తాము
కూడనూ
తమ
రాజును
రక్షింపుమని
ప్రార్థనలు
సలువ
మొదలిడిరి.
ఇంతలో
ఈ
వార్త
అడవులకు
కూడనూ
ప్రాకెను.
అక్కడినుండి
వేలాది
బుషులు
దండకమండలములతో
బారులు
తీరి
భాగీరథీ
తీరమునకు
వచ్చిరి.
భాగీరథీ
తీరమంతయూ
ఒక
తిరునాలవలె
కిటకిటలాడదొడగెను.
ఎక్కడ
చూచిననూ
ఓంకారములు,
నామస్మరణలు,
వేదఘోష
మిన్ను
ముట్టుచుండెను.
కొందరు
శాపమిచ్చిన
బుషి
కుమారుని
నిందించుచుండిరి.
ఈ
రీతిగా
భాగీరథీ
తీరము
యిసుక,
నీరూ
కనిపించక
మనుజులతో
కప్పినటుల
కనిపించెను.
పరీక్షిత్తు
తన
శాప
వృత్తాంతమును
చెప్పుట
ఇంతలో
మహారాజుపై
ఎంతయో
దయాభిమానములు
గల
ఒక
వృద్ధబుషి
మహారాజు
చెంతకువచ్చి,
ప్రేమమయత్రువులు
రాల్చుచు
'మహారాజా!
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధముగా
చెప్పుకొనుచుండ
గాలి
వార్తలు
విని
సత్యమును
తెలిసికొనుటకై
నడువలేని
నేను
నీపైగల
దయచే
పరుగిడి
వస్తిని.
అసలు
కథ
యేమిటో,
తమరింతటి
తీవ్ర
వైరాగ్యము
పూనుటకు
కారణమేదియో,
తమబోటి
ధర్మాత్మునకు
మునికుమారుడు
శాపమిచ్చుటలో
గల
అంతరార్థమేమిటో,
తెలిపి,
మమ్ము
తృప్తి
పరుపుము.
రాజ్యములోని
ప్రజలు
పడుచున్న
బాధను
చూడలేకున్నాను.
తండ్రి
సమానమైన
ప్రభువు
ఈ
రీతిగా
సర్వసంగ
పరిత్యాగియై
ప్రజల
మొరలను
ఏమాత్రము
లక్ష్యము
చేయక,
వారలకు
కనీసము
శాంతి
5
▾
Meaning
Keep
వచనములైననూ
తెలుపక,
ఇట్లు
మౌనవ్రతుడై
నదీ
తీరమున,
తిండి
తీర్థాదులు
మాని,
తీవ్ర
తపస్సాచరించుచుండుటచే,
అంతఃపుర
స్త్రీలు,
రాణులు,
మంత్రులు,
నీటినుండి
వేరైన
చేపలవలె
తపించు
చున్నారు.
రాజ్యమున
ఇట్టి
ఘోర
అశాంతి
చేకూర్చిన
ఆ
ముని
కుమారుడు
నిజముగా
మునికుమారుడా?
మా
కేమియూ
బోధపడకున్నది"
అని
వృద్ధముని
ఎంతో
ప్రేమ
శాంత
వచనములతో
ప్రశ్నించిన,
ప్రశ్నకు,
మహారాజు
కన్నులు
విప్పి,
మునికి
నమస్కరించి,
"మహాత్మా!
మీ
బోటి
మహర్షుల
చెంత
దాచునదేమున్నది?
దాచిననూ
దాగునట్టిది
కాదు.
వేటకై
అడవికి
వెళ్ళితిని.
అచ్చట
అనేక
మృగములు
కనుపించి
చెల్లాచెదరైనవి.
నా
వెంట,
కొద్దిమంది
పరిచారకులు
మాత్రమే
వచ్చియుండుటచేత
ఒక్కొక్క
రొక్కక్క
దిశకు
ఆ
మృగములను
తరుముకొని
వెళ్ళిరి.
నేను
కూడనూ
ఒక
మృగమును
వెంటాడుతూ
వెళ్ళితిని.
కడకు
మృగము
దొరకక
పోవుటయే
కాక,
ఆకలి
దప్పులు
నన్ను
చాలా
బాధించెను.
అట్టి
బాధతో,
తీక్షణమైన
వేడి
వాతావరణములో,
ఎటులనో,
ఒక
ఆశ్రమము
చేరుకొంటిని.
అది
శమీక
మహర్షి
ఆశ్రమమని
అక్కడకు
వెళ్ళిన
తరువాత
తెలిసినది.
సరి!
లోనికి
వెళ్ళి
ఆకలి
దప్పులచే
బాధపడుచున్న
నేను
అనేక
పర్యాయములు,
ఎవరైనా
లోనున్నవారు
వత్తురేమో
అని
కేకలు
వేసి
పిలిచితిని.
ఎంత
సేపటికీ
జవాబు
కానీ,
మనిషి
కానీ,
కనిపించలేదు,
వినిపించలేదు.
లోపల
ప్రవేశించిచూడ,
ఎవ్వరునూ
లేరు.
ఒక
మహర్షి
తపస్సున
మైమరచి
యుండుట
చూచి
తిరిగి
వాపసు
వచ్చుచుండ
నా
కాలి
కేదియో
మెత్తగ
సోకెను.
అంత
త్రాడని
తలంచి
కాలితో
పైకెత్తి
చూడ,
అది
మృత
సర్పముగా
కాన్పించెను.
దానిని
చూచిన
తక్షణమే
నా
బుద్ధి
భ్రష్టమయి,
ఆ
చచ్చిన
సర్పమును
తపస్సాచరించుచున్న
ఆ
తేజస్వి
మెడన
వైచి
తిరిగి
రాజధాని
మార్గము
పట్టితిని.
అది
యెట్లో
ఆ
మునికుమారునకు
తెలిసి,
అతను
సహింపలేక
తన
తండ్రి
మెడ
నున్న
పామే
తక్షకుడై
నేటి
కేడవ
దినమున,
ఈ
వేసిన
వ్యక్తిని
కరచి
ప్రాణమును
తీయునుగాక!
అని
శపించెనట.
తదుపరి
ఆ
ఆశ్రమమునుండి
నాకీవార్త
6
▾
Meaning
Keep
పంపగనే,
నేను
చేసిన
అపరాధము
ఎట్టిదో
నేను
తెలుసుకొని,
ఇట్టి
అధర్మరాజునకు,
ఈ
రాజ్యమున
స్థానము
లేదని
తలచి,
సర్వసంగ
పరిత్యాగినై,
ఈ
ఏడు
దినములు
శ్రీహరి
చింతయందైననూ
కాలము
గడుపుట
మహాభాగ్యమని
విశ్వసించి
ఇచట
చేరితిని"
అని
జరిగినదంతయునూ
మహారాజు
తెలుపుచుండ,
చేరిన
వేలాది
ప్రజలు,
మునులు,
బుషులు,
రాజులు,
మంత్రులు
విని
సత్యమును
తెలిసుకొన్నవారై,
పరిపరి
విధముల
అపోహలకు
గురియైన
వారల
భావములను
మార్చుకొని,
మహారాజునకు
ఆ
శాపమేమియూ
కీడు
జరుపకుండును
గాక
అని
అందరునూ
ప్రార్థనలు
చేయమొదలుపెట్టిరి.
Previous
←
The Compassionate Śamīka Muni
Next
The Arrival of Śuka Maharṣi
→