Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Nectar of the Story of Śrī Kṛṣṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శ్రీకృష్ణ
కథామృతము
మహారాజా!
భాగవతము
మహా
వృక్షము.
అది
భవ్యమైనది.
సమస్త
శుభములు,
సుఖములూ
దానిలో
ఇమిడియున్నవి.
ఈ
పవిత్ర
వృక్షమునకు
శ్రీమన్నారాయణుడే
బీజము;
బ్రహ్మనే
అంకురము.
నారదుడు
బోదె.
వ్యాసుడు
శాఖ.
అందులోని
మధురఫలమే
కృష్ణ
కథామృతము.
ఈ
అమృతమునకై
అఱ్ఱులు
చాచి,
కాయబాధలను
లక్ష్యము
చేయక,
కాలమును
లెక్కచేయక,
కాచుకొని
భుజించువారే
పవిత్ర
మునులు,
యోగులు.
ఓ
మునులారా!
ఈనాడు
నేనా
కమనీయ
కృష్ణ
కథను,
భాగవతశాస్త్రమును
మీ
అందరి
ముందూ
వినిపింతును,
వచింతును,
స్మరించి
తరింతును.
మీరు
సమస్త
శాస్త్రములూ
శ్రవణము
చేసియుందురు.
మీరు
సర్వ
సాధన
సంపన్నులు.
అన్నింటికంటెనూ
శ్రేష్ఠమయినదేదియో
మీకు
తెలియనిది
కాదు.
ఏ
వస్తువు
అధిక
రుచికరముగ
తోచుచున్నదో,
దేనిని
వినినంతనే
హృదయము
హర్షము
చెందుచున్నదో,
దేనిని
స్మరించినంతనే
మనసులోని
ప్రేమతరంగములు
పైకి
లేచుచున్నవో,
అట్టి
పవిత్ర
కృష్ణనామమును
దాని
మాధుర్యమును
మీకందింతును.
ఆ
పవిత్ర
కృష్ణభక్తికి
సహాయమైనదీ
భాగవతము.
"అజుడు,
అవ్యక్తుడు,
అనంతుడునై
పరమాత్మ,
నగుణ
సాకారమును
ధరించి,
అనేక
అవతారము
లెత్తి,
అంతులేని
లీలలను
విస్తరింప
జేసెను.
అతని
నామ,
రూప,
గుణధామములు
జగత్తులోని
జీవములను
తరింపజేయును.
ఇట్టి
2
▾
Meaning
Keep
దానిని
యెవడు
గానము
చేయుచున్నాడో,
శ్రవణము
చేయుచున్నాడో,
సేవించుచున్నాడో,
అట్టి
వానినే
భక్తుడని
పిలువబడును,
వాడే
భాగవతుడు.
భగవదవతారములు
భక్తుల
కొరకే!
అనగా
భక్తునకు
భగవంతునితో
సంబంధము
కలదే
భాగవతము.
అవతార
కథలలో
కేవలము
భక్త,
భగవంతుల
సంబంధమే
యుండును.
భగవదవతారములు
దుష్ట
సంహారము
కొరకే
కాదు.
అది
ఒక
నిమిత్తమాత్రమే!
నిజమునకు
భగవదవతారము
భక్తుల
కొరకే.
గోవు
తన
పాలను
తన
దూడ
కొరకే
ఇచ్చును.
వాటిని
ప్రజలు
యెట్లు
ఉపయోగించుకొందురో,
అట్లే
భగవంతుడు
భక్తుని
కొరకవతరించిన,
ఆ
భక్తులు
కూడనూ
దానిని
వేరు
మార్గమున
అందుకొని
ఉపయోగించుకొందురు.
భక్తునకునూ,
భగవంతునకూ
మధ్య
యొందరివో
దుష్ట
వ్యక్తుల
చరిత్రలూ
చేరుచుందును.
అంత
మాత్రము
చేతనే
భాగవతము
పవిత్రము
కాకపోదు.
తీయని
రసముతో
చేరిన
చెఱకు,
రసమును
తీసిన
తదుపరి
పిప్పిని
పారవేసినటుల,
భక్త,
భగవంతుని
సంబంధమైన
మధుర
సారమును
తీసిన
తదుపరి,
దుష్ట
వ్యక్తులను
పిప్పిని
దూరము
చేయవచ్చును.
పిప్పి
లేక
రసము
చిక్కదు
కదా,
అటులనే
అభక్తులు
లేక
భక్తులగుటకు
వీలుండదు.
అవతారముల
కథా
శ్రవణమే
భాగవతము
భగవంతుడు
దేశ,
కాల,
బంధములనుండి
విముక్తి
జెందినవాడు.
అతనికి
జీవులందరూ
సమానమే!
అతను
చరాచరములకు
స్వామి.
బ్రహ్మా
రూపమును
ధరించి
ప్రళయములందు
లీనమైన
ప్రజలను
సృజించును.
అతనే
విష్ణు
రూపమును
ధరించి
సర్వులయందూ
తన
శక్తిని
ప్రసాదించి
నానా
అవతారములు
ధరించి,
ఈ
చరాచర
ప్రపంచమును
పాలించును.
చివర
కాతడే
సాక్షాత్
శివరూపమును
ధరించి,
సమస్తమునూ
సంహారము
చేయును.
అతని
శక్తికి
అంత్యము
లేదు,
హద్దులు
రావు.
అతని
పురుషార్థమునకు
పరిధి
ఉండదు.
అవతారములా
లెక్కలేదు.
సర్వ
కళావతారుడు
అతడే,
అంశావతారుడూ
అతడే,
3
▾
Meaning
Keep
ఆవేశావతారుడూ
అతడే,
యుగావతారుడూ
అతడే.
అట్టి
అవతారముల
కథా
శ్రవణములే
భాగవతము.
ఒకే
భగవంతుడు
సృష్టి
తంత్రమును
నడుపుటకు
వీలగునట్లు
తన
శక్తిని
బ్రహ్మా,
విష్ణు,
మహేశ్వరులను
మూడు
రూపములుగ
విభజించెను.
తత్త్వతః
వీనిలో
యే
భేదమూలేదు.
ఆ
ప్రభువే
సృష్టిచేయునపుడు
బ్రహ్మా
అనియు,
పాలన
చేయునపుడు
విష్ణువనియు,
సంహార
సమయమున
శివుడనియు,
తన
కార్యముల
కొరకే
దేవుడే
విశేషావసరములందు
విశిష్టరూపమునందున్నపుడు
అవతారమని
పిలువబడును.
నిజముగా
యోచించిన,
మన్వాది
ప్రజాపతులు,
సృష్టిని
వృద్ధి
చేయుటకై
వచ్చిన
బ్రహ్మా
అవతారములనే
చెప్పవచ్చును.
భగవానుని
సంకల్పము
చేతనే
సృష్టి
జరిగెను
కనుక
సృష్టిలోని
మునులు,
బుషులు,
మనుజులు,
దానవులు
వీరందరూ
విష్ణుని
అవతారములని
చెప్పుటలో
తప్పేమియూ
లేదు.
జీవులెట్లు
అనంతములో,
అట్లే
అవతారములు
కూడనూ
అనంతములు.
అయితే,
యుగావతారములయొక్క
కథలే
పవిత్ర
చరిత్రలు.
మిగిలినవన్నియునూ
జంజాటములే!
సమస్త
అవతారములకూ
కారణము
ధర్మస్థాపనమే!
భగవత్సంకల్పమే
ఈ
ధరణి
నిర్మాణం
ప్రజాపతియగు
మనువును,
బ్రహ్మదేవుడు
భూమికి
వెళ్ళి,
సృష్టి
చేయవలసినదని
ఆజ్ఞాపించగా,
మనువు
ధ్యానపూర్వకముగా
జూచునప్పటికి
సృష్టికి
అధిష్ఠాత్రియగు
భూదేవిని
అసురులు
పాతాళమునకు
గొనిపోయినట్లు
తెలుసుకొనెను.
సృష్టి
మాత్రమే
తన
కర్తవ్యమని
బ్రహ్మా
తలంచుటచే,
రక్షింపబడుటకు
అతడు
విష్ణువును
కోరవలెను.
కావున
భూమిని
రక్షించుటకాతడు
మనస్సులో
శ్రీహరిని
కోరెను.
వెంటనే
పృథివిని
రక్షించుటకు
భగవంతుడు
సూకర
రూపమును
ధరించి,
పాతాళమునుండి
భూమినుద్ధరించి,
దానిని
జలమునందు
స్థాపించెను.
వేనుని
అధర్మాచరణములకు
విసుగు
చెంది,
పృథివి
సమస్త
బీజములను
తనలో
దాచుకొనెను.
ప్రపంచమంతయూ
ఆకలిచే
దుఃఖించుచుండెను.
ఇది
సృష్టి
4
▾
Meaning
Keep
ఆరంభము.
యెట్టిరూపములూ
లేవు.
పృథ్వి
మెరక
పల్లములుగా
నుండెను.
పరమాత్మ
పృథురూపమును
ధరించి
పృథివిని
తన
శక్తిచే
సమము
చేసెను.
దానియందు
అన్నౌషధములను
పిండి
ప్రజాపాలనము
గావించెను.
పృథ్వి
సారవంతమైన
దాయెను.
పృథు
మహారాజు
పుత్రిక
అగుట
చేతనే
ఈ
ధరణికి
పృథివి
అను
పేరు
వచ్చినది.
ఇతడే
భూమి
మీద
నగరములను
కల్పించెను.
అనగా
భగవత్సంకల్పమే
ఈ
ధరణి
నిర్మాణము.
దానిని
పాలించుటకై
వేదములను
సృష్టించి,
దానియందు
మానవులకు
అనగా,
జీవులకు
కావలసిన
నీమములను,
నిర్మాణములను
ఇమిడ్చెను.
పృథివికి
ఆధారమైన
ఆ
వేదములను
అసురులు
హరించి
జలమును
చేరగా,
జలచర
రూపమును
ధరించి,
శ్రీహరి
సప్త
మహాబుషులను,
మనువును
ప్రళయమునుండి
రక్షించెను.
అట్టి
రూపమును
ధరించుట
చేతనే
మత్స్యావతారమను
పేర
ప్రసిద్ధి
అయ్యెను.
శత
రూప,
మనువులే
సృష్టికి
ఆదికర్తలు
మునులారా!
పరీక్షిత్
మహారాజా!
భగవదవతారములు,
సృష్టి
ఆది
చరిత్రలు,
మీకు
కొంత
సంశయము
కలిగించవచ్చును.
భగవల్లీలలు
మహాద్భుతములు.
అవి
సామాన్య
ప్రపంచ
భావములకు
అందుబాటులో
నుండవు.
ఒక్కొక్కపరి
మరింత
ఆధారములేని
వాటివలె
అనిపించును,
కనుపించును.
అయితే
కారణములేని
కార్యమును
ఆ
పరమాత్మ
సంకల్పించడు.
కాన,
సంకల్పమునకు
ఆధారయొక్కటుండ
నక్కరలేదు.
సర్వమునకూ
తన
సంకల్పమే.
సృష్టియందు
ప్రవృత్తులగునట్టి
మోహవస్తువు
ఏదైన
ఒకటి
వుండవలెను.
అందులకై
బ్రహ్మా
తన
సంకల్పమాత్రముననే
రెండు
భాగములయ్యెను.
ఇంతవరకాతడు
సంకల్పముచేతనే
ద్వైతసృష్టియందు
ప్రవృత్తుడయ్యెను.
ఇప్పుడాతడు
స్వతః
కర్మచేతను,
శరీరము
చేతను
రెండుగనయ్యెను.
ఇద్దరు
ఒక్కటిగనే
యుండిరి.
ఒక
శరీరము
రెండంగములుగ
మారెను.
అందువలన,
రెండు
సంకల్పములు
బయలుదేరెను.
ఒకటి
వై
5
▾
Meaning
Keep
గావించుట,
రెండు
సృష్టి
వృద్ధి
పొందించుట.
ఈ
కారణముల
చేత
రెండూ
రెండు
వేరు
వేరు
లింగములు.
ఒకటి
పుంలింగము,
రెండవది
స్త్రీలింగము.
ఒకే
అంగమునుండి
యిద్దరు
ఒకటిగా
పుట్టిరి.
అందులో
ఒకదాని
స్వరూపముచే
మరొక
స్వరూపము,
శత
శత
రూపములచే
ఆకర్షింపబడుచుండుటచేత
దానికి
ఆ
రూపమును
శతరూపుడని
బ్రహ్మచే
పిలువబడెను.
రెండవ
రూపమునకు
మనువు
అని
పేరు
పెట్టెను.
సృష్ట్యాదియందు
ఈ
రెండు
రూపములే
విఖ్యాతిని
గాంచెను.
శతరూపుడు,
మనువులే
సృష్టికి
ఆదికర్తలు."
Previous
←
The Arrival of Śuka Maharṣi
Next
The Dialogue of Śuka and Parīkṣit
→