Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Dialogue of Śuka and Parīkṣit
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
29.
శుక,
పరీక్షిత్తుల
సంవాదము
శతరూపమనువు
లిరువురూచేరి
మా
కర్తవ్యమేమని
సృష్టికర్తను
ప్రార్థించగా
బ్రహ్మా
చిరునవ్వుతో
'మీరిరువురూ
సతిపతుల
సంబంధముతో
సృష్టిని
పెంపొందించు'దని
ఆజ్ఞాపించెను.
అంత
వారు
యిరువురూ
బ్రహ్మా
ఆజ్ఞ
బడసి,
భూలోకమున
అధికారమును
వహించి,
సృష్టిని
వృద్ధి
చేయ
దొడగిరి'
అని
శుకుడు
తెలిపెను.
సమస్త
దుఃఖములకు
మోహమే
కారణం
అంత
"స్వామీ!
ఈ
లోకమునగల
సమస్త
బాధలకు
మోహమే
కారణమని
నేను
స్వానుభవముచే
తెలిసికొంటిని,
తిరిగి
దానిని
గురించి
మీరు
చెప్పనక్కరలేదు.
దానినుండి
విముక్తిగాంచు
మార్గమును
తెలుపుదు.
ఈ
అంత్య
సమయమున
మానవుడు
చేయవలసినదేదియో,
తిరిగి
జనన
మరణములు
లేక,
రాకుండుటకు
స్మరించవలసిన
నామమేదియో,
దానిని
తమరు
తెలుపుదు"
అని
పరీక్షిత్
మహారాజు
ఆతురతతో,
ఆవేదనతో
ప్రార్థించగా
శుకుడామాటలకు
సంతసించి,
"రాజా!
నీవు
మహా
ధర్మాత్ముడవు.
సాధు
సేవకుడవు.
నీ
పుణ్యప్రభావము
వలననే
యిచ్చోట
యిందరు
బుషులు,
మునులు
చేరిరి.
లేకున్న
ఈ
మహనీయులు
సామాన్యముగా
ఒక
చోట
చేరరు"
అని
పలుకుచుండగనే,
పరీక్షిత్తు
"ప్రభూ!
నేను
మహాపాపిని,
ధర్మ
శూన్యుడను,
నిజముగా
నేనే
అట్టి
ధర్మాత్ముడను,
సాధు
సేవకుడనూ
అయివుండిన,
నాకిట్టి
విప్ర
శాపము
2
▾
Meaning
Keep
వచ్చియుండెడిది
కాదు
కదా!
నా
బుద్ధి
అధర్మ
కార్యములో
ప్రవృత్త
మగుటచే
కదా,
ఇట్టి
శాపమునకు
గురి
అయితిని.
ఈ
మహా
బుషుల
సందర్శనం,
తమ
పాద
సేవాభాగ్యం,
నా
పూర్వీకులు
చేసిన
పుణ్య
ప్రభావముచే
లభించెను
కానీ,
నా
పురుషార్థముతో
కాదని
నాకు
బాగుగా
తెలియును.
నా
పితామహాలపై
శ్యామసుందరునకు
ఉండిన
అనుగ్రహ
ప్రభావమే
నా
ఈ
పవిత్రతకు
కారణము.
కాకున్న
యెల్లప్పుడు
అడవులలో
తిరుగుచూ,
మానవమాత్రులకు
గోచరము
కాక
సంచరించు
తమను
సాక్షాత్కరింపజేసుకొనుచు
సామాన్య
మానవులవలె
సంసారకూపమునబడి
విషయానందములలో
మునిగి
నిత్య
సత్య
నిర్మలముల
విచారణమే
తలంచక
చరించు
నా
బోటివానికి
ఇది
సాధ్యము
కానిది.
మరణమాసన్నమయిన
సమయంలో
చేయవలసినదేది?
ఇన్నింటికీ
నా
పితామహాల
ఆశీర్వాద
బలము,
శ్యామసుందరుని
అనుగ్రహ
బలమే
కానీ
వేరు
కాదు.
ఇది
నా
దృఢ
నిశ్చయము.
తాము
నా
విషయమున
నిందు
వాత్సల్యముతో
ఇట్లు
పలుకుచున్నారే
కానీ,
నా
మంచి
చెడ్డలు
నాకు
తెలియక
జరుగవు.
కాన,
ఇదే
వాత్సల్యముతో
నా
సంశయమును
తీర్చి,
ఈ
మరణాసన్నమయిన
సమయమున
ముఖ్యముగ,
వదలవలసినవేవి,
చేయవలసినదేది
అనునది
మాత్రము
తెలిపి
నన్ను
ధన్యుని
గావింపుడు.
నా
యీ
సంశయములు
తీర్చు
సమర్థులు
తమరు
తప్ప
అన్యులకిది
అసాధ్యము.
తమరు
వినిపింతుమనిన
భాగవత
మేదియో
వినిపించుడు.
అదియే
సర్వమునకూ
ఆధారమని
తెలిపితిరి
కదా;
సర్వ
పాపనిర్మూలము,
సర్వ
శుభప్రదము
చేకూర్చు
ఆ
దివ్య
కృష్ణనామామృతమును
నాకు
త్రాపి
నా
తాపమును
చల్లార్చుడు"
అని
వినయముతో
ప్రార్థించు
మహారాజును
చూచి,
శుకుడు
చిరునవ్వుతో,
"భాగవతశాస్త్రము
వేదమువలె
మాననీయమైనది.
నారదరమణీయమైనది.
ద్వాపరాంతమున,
నేను,
నా
తండ్రియైన
వ్యాసుని
ఆశ్రమమున,
3
▾
Meaning
Keep
అనగా
గంధమాదన
పర్వతముపై
నా
తండ్రి
ద్వారానే
వినియుంటిని.
దానినే
మీకు
తెలుప
పూనుకొందును,
వినుము"
అని
మొదలిడగనే,
మహారాజు
తిరిగి
చేతులు
జోడించుకొని
"స్వామీ!
మీరు
పుట్టుకతోడనే
త్యాగులై,
విరాగులై
జాతకర్మ,
నామకర్మ
ఉపనయనాది
సంస్కారములు
జరుపుకొనకనే
సర్వసంగ
పరిత్యాగులై
అడవుల
సంచరించితిరని
వినియుంటిని.
అట్టి
మీరు
ఈ
భక్తి
గ్రంథమైన
భాగవత
శాస్త్రమును
శ్రవణము
చేయుట
మహాశ్చర్యముగ
నున్నది.
ఇట్టి
ప్రవృత్తి
యందు
మీకాసక్తి
కలుగుటకు
కారణమేదియో
వివరింతురా?"
అని
ప్రశ్నించెను.
అద్వైతానంద
ప్రాప్తికి
భాగవత
శ్రవణమే!
శుకుడు
శాంతవదనుడై
"మహారాజా!
నేను
విధినిషేధములకు
అతీతుడను.
నేను
నిరంతర
నిర్గుణ
బ్రహ్మలో
విలీనుడనై
యుందుననుట
పరమ
సత్యము.
కానీ
వివశుడనై
భగవల్లీలా
గుణగణముల
యందాకర్షింప
బడుటకు
వానిలో
నంతటి
మాధుర్యము
కలదు.
ఇంతియే
కాదు.
మహారాజా!
మా
తండ్రియగు
వ్యాసమహర్షియొక్క
శిష్యుల
ముఖతః
భగవంతుని
సౌందర్య
మాధుర్యమును
కూడనూ
వినియుంటిని.
అందుచే
అతని
మహిమను
శ్రవణము,
పరనము
గావింప
నా
మనస్సాకర్షింప
బడెను.
శ్రవణము
చేయకుండ
లేకపోతిని.
శ్రవణముచేసి,
పరించి,
ఆనందసాగరమున
ఉన్మత్తుడనై
అటు,
ఇటు
తిరుగుచుందును.
అతని
మధుర
లీలలు
నన్నింత
ఉన్మత్తచిత్తునిగా
చేసెను.
నేడు
అట్టి
మధురామృతమును
పదిమందికి
తెలుప
సుసమయము
సంప్రాప్తించుటచే,
అందుకు
తగిన
అర్హులు
లభించుటచే
అవసరమును
గ్రహించి
ఇటువచ్చితిని.
కాన,
స్వతః
అనుభవమైన
ఆ
పవిత్ర
భాగవతమును,
నేడు
నీకునూ,
నీ
మూలమున
ఈ
మహనీయులకును
వినిపింతును.
దానిని
శ్రవణము
చేయు
సామర్థ్యత
నీకున్నది.
నీవు
పరమ
పరుషార్థ
దీక్షను
వహించియున్నావు.
యెవరు
ఈ
కథను
శ్రద్ధాభక్తితో
వినెదరో,
వినుటయే
కాక
హృదయపూర్వకమైన
విశ్వాసముతో
4
▾
Meaning
Keep
మననము
సలుపుదురో,
అట్టివారు
అతి
శీఘ్రకాలముననే
వాసుదేవుని
ఆనందస్వరూపమున
ఐక్యమగుదురు.
వారి
హృదయము
మదనమోహనుని
మాధుర్య
రసమున
మునిగి
అద్వైతానందమును
అనుభవించును.
భగవత్కథను
శ్రవణముచేయుటయు,
సదా
మనోవాక్కాయములతో
నామ
సంకీర్తన
గావించుటయు,
ఈ
రెంటికి
మించిన
శ్రేష్ఠమైన
కార్యము,
ఉత్తమోత్తమ
సాధనము
ఎందునూ
లేదు.
మహారాజా!
కాలము
అల్పమని
కంగారు
చెందబోకుము.
కటాక్షమునకు
అధిక
కాలమక్కరలేదు.
కనువిప్పుపాటు
మాత్రాన
ఆ
కరుణానిధియైన
శ్యామసుందరుని
అనుగ్రహ
కిరణము
నీపై
ప్రసరింప
గలదు;
ఈ
యేడు
దినములలో
నిమిషము
వృథాకాకుండా,
అనేక
అనుభవజ్ఞుల
చరిత్రలను,
వారలపై
వాసుదేవుడు
యే
విధముగ
అనుగ్రహమును
ప్రసాదించెననునదియును
కథా
శ్రవణములచే,
లీలాగానములచే,
పరమభక్తులు
భవసాగరమును
ఎట్లు
దాటగల్గిరనునది
వినిపింతును.
"మనసును
మాధవుని
యందు
లీనము
చేయుము"
నీ
కింకనూ
ఆయుఃప్రమాణము
ఏడు
దినములున్నది
కనుక,
అంత్యకాల
మాసన్నమయినదని
తెలిసికొన్న
నీవు,
నేటినుండియే
దేహ
గేహములందు
మమత్వమును
వీడి,
మనసును
మాధవకథల
యందు
లీనము
చేసి,
నే
చెప్పబోవ
ఆ
మధుర
కథలను
పానము
చేయుము.
కథలు
చెప్పుట,
వేలాది
ప్రజలు
వినుట
లోక
సామాన్యము,
కానీ
విన్నదానిపై
సంపూర్ణ
విశ్వాసముంచిననే
జ్ఞానము
సిద్ధించును
గానీ,
చిత్తశుద్ధి
లేక
జ్ఞాన
సిద్ధి
లభించదు.
మహారాజా!
మరొక
విషయం.
లోకమున
కేవలము
సాధనలు
చేయక,
స్వానుభవము
లేక,
కేవలము
పరనద్వారా
పరులకు
ఉపదేశించుటకు
పూనుకొనువారు
లెక్కకు
మిక్కుటము.
తాము
తమ
సాధనలయందును,
ఆ
పవిత్ర
పరమాత్మ
లీలాగుణగణములయందును
విశ్వాసముంచక,
ఆచరణలందు
దానిని
5
▾
Meaning
Keep
ప్రవేశింపచేయక,
ఇతరులకు
మాత్రము
దీనిని
ఆచరించమని
చెప్పువారల
ఉపదేశములు
బూడిదలో
చేసిన
హోమము
కాగలదు;
వాటి
వలన
ఎట్టి
ప్రయోజనమూ
కలుగదు.
మనసు
శుద్ధి
కుదరదు.
కేవలము
అరణ్య
రోదనే
కాగలదు.
ప్రభావ
హీనమైపోవును.
అయితే
నా
విషయమున
అట్టిదానికి
స్థానము
లేదు.
నిరంతరం
ఆ
నీలమేఘశ్యాముని
నిండు
ప్రేమలో
మునిగి
తేలుచున్న
నా
హృదయము
నిరంతరానందముతో,
సంపూర్ణ
విశ్వాసముతో,
ఉత్సాహ
పూరితమైన,
హృదయావేదనతో
ఉబికి
వచ్చు
ఈ
శ్రవణమును
గ్రోలు
వారికి
తప్పక
సాక్షాత్కార
ప్రాప్తి
లభించును.
ఇందు
సందియము
లేదు.
మహారాజా!
నీబోటి
ఉత్తమాధికారికి
తగిన
పవిత్ర
అనుభవాకారుడే
లభించెను.
నీ
భాగ్యమే
భాగ్యము"
అని
శిరస్సున
హస్తముంచి
కురులు
నిమురుతూ
ఆశీర్వదించెను.
బ్రతుకునందు
లేదు
బండారము.
భావములందే
వున్నది
భాగ్య
రాశి
మహారాజు
ముకుళిత
హస్తుడై
"స్వామీ!
కాలవ్యవధి
చాల
తక్కువగానున్న
సంగతి
మీకు
తెలియును.
కాన
సర్వోత్తమమైన
ఉపదేశమును
గావింపుడు.
దానిని
ఈ
యేడు
దినములు
విడువక
జపింతును,
స్మరింతును,
తరింతును"
అని
ప్రార్థించగా,
శుకుడు
నవ్వి,
"పరీక్షిత్!
ప్రపంచమున
విషయాసక్తులగు
వారు
చిరకాలము
జీవించుచుందురు.
రోజులు
విచారములతో,
ఏడ్పులతో,
కంగారు
కల్లోలములతో,
కలతలు,
వ్యథలతో
కాలము
గడుపు
చుందురు.
పశుపక్షిమృగాదులవలె
సంతానములు
పొంది,
పవిత్ర
పదార్థములను
తిని,
మలమూత్రరూపమున
విసర్జించు
మానవుల
జీవితములు
జీవితములా?
వారి
బ్రతుకులు
బ్రతుకులా?
లోకమున
ఎన్ని
జీవరాసులు
బ్రతుకుట
లేదు?
బ్రతుకునందు
లేదు
బండారము,
భావములందే
వున్నది
భాగ్యరాశి.
భగవద్భావములు
కలిగినా
అట్టివాడు
చచ్చిననూ
బ్రతికినవాడే!
అట్లుగాక
విషయాసక్తుడై
నిరంతరం
పవిత్ర
కాయమును
అపవిత్ర
కర్మల
యందు
6
▾
Meaning
Keep
అంకితము
చేసి
క్షణకాల
సుఖమునకై
సర్వజ్ఞత్వమును,
సర్వశక్తిత్వము
నొసగు
సర్వేశ్వరుని
మరచుట
మానవత్వమునకే
అపకారము
కాగలదు.
అట్లుకాక,
శ్రీహరి
చరణారవిందములందు
చిత్తమును
లగ్నము
గావించిన
వాని
జీవితము
ఒక్క
ముహూర్తమైననూ
చాలును.
ఆ
కొలది
కాలములోనే
వారు
తమ
జీవితమును
కల్యాణమయమును
గావించుకొన
గల్గుదురు.
మహారాజా!
నీ
సందేహము
నిర్మూలము
గావించుటకై
నేనొక
సుందరమైన
రాజర్షి
కథను
వినిపింతును,
వినుము"
అని
ప్రారంభించెను.
ఖట్వాంగుడు
త్రుటిలో
విషయ
భోగాలను
త్యజించెను
సూర్యవంశమున
మహా
ప్రతాపవంతుడును,
శూరుడును,
వీరుడును,
దాతయును,
ధర్మపరాయణుడును
అగు
ఒక
అవనీపతి
యుండెను.
అతని
పేరు
ఖట్వాంగుడు
అని
అందురు.
అతనితో
సమానుడగు
వాడెవ్వడునూ
లేకుండెను.
ఇట్లుండ
ఒకనాడు
దైత్యదానవులు
దేవతలపై
దండెత్తి
వచ్చుటచే
దేవతల
పక్షమున
సరియైన
బలము
లేకపోవుటచే
దేవతలు
నిర్బలులై
చింతించుచూ,
మర్త్యలోకమునకు
వచ్చి
తమ
బలహీనతను
తెలుపుకొని
ఖట్వాంగ
మహారాజును
తమకు
సహాయము
గావించమని
కోరిరి.
రాజుకూడనూ
యుద్ధమందాసక్తి
కలవాడగుటచే,
మారు
మాటాడక
ధనుర్బాణములు
ధరించి,
రథారూఢుడై
దేవతలతో
కూడి
సమరస్థలమునకు
వెళ్ళెను.
అక్కడికెళ్ళి
దైత్యుల
గుండెలు
అదురునట్లు
ఘోరయుద్ధము
గావించెను.
ఆ
భయంకరమైన
ఖట్వాంగుని
పోరాటమునకు
తాళలేక
దానవులందరు
అక్కడినుండి
పారిపోయిరి.
అట్లు
పారిపోవు
వారిని
వెంటాడుట
ధర్మవిరుద్ధమని
తెలిసిన
మహారాజు
అంతటితో
యుద్ధము
నుపేక్షించెను.
అంత
దేవతలకు
విజయము
లభించెనని
ఆనందముతో
ఖట్వాంగుని
యందు
ప్రసన్న
హృదయులై
అతనిని
ప్రశంసించుచూ,
"రాజా!
నీకు
సాటియగు
శూరుడీ
లోకమున
లేదు.
ఈ
ఘోర
సంగ్రామమున
మాకు
తోడ్పడి
విజయమును
చేకూర్చితివి.
కాన
మా
వలన
నీకు
కావలసిన
సహాయము
పొందవచ్చు"నని
కోరిరి.
అంత
ఖట్వాంగుడు,
"దేవతలారా!
యజ్ఞయాగాది
సర్వ
7
▾
Meaning
Keep
శుభకర్మలూ
మీ
ప్రసన్నత
కొరకే
గదా
చేయుదురు.
కాన
మిమ్ములను
ప్రసన్నులుగా
చేసుకొన్న
ఈ
యుద్ధము
కూడనూ
ఒక
మహా
యజ్ఞముగానే
భావింతును.
నాయందు
మీరు
ప్రసన్నులైతిరి.
కనుక
ఇంతకంటే
నాకు
వేరు
కావలసిన
వర
మేమున్నది?
ఇదియే
మహాభాగ్యమని
వారలకు
నమస్కరించెను.
అంతటితో
దేవతలు
తృప్తిచెందక
మహారాజును
ఏదైనా
వరమును
కోరమని
బలవంత
పెట్టుటచే,
మహారాజు
ఎట్టి
వరమూ
కోరుటకు
ఇష్టము
లేక
వారల
ప్రత్యుపకారమును
అందుకొన
ఇచ్ఛలేక
వారు
నిర్బంధ
పెట్టుటచే
చక్కగా
ఆలోచించి
యేదియో
ఒకటి
కోరక
తప్పదని
నిర్ణయించుకొని
కడకు
'దేవతలారా!
నా
ఆయువింకనూ
ఎంతవరకు
కలదో
తెలుపుడు.
ఆయుశ్శేషమును
తెలిసికొనిన
తరువాతనే
నేను
మిమ్ముల
వరమడుగుదు'నని
ప్రార్థించెను.
అంత
పురందరుడు
సర్వజ్ఞుడగుటచే
ఆలస్యము
చేయక,
మరుక్షణమే
రాజా!
నీ
ఆయువు
సమాప్తి
కానున్నది.
ఇంకొక
ముహూర్త
కాలమే
యున్నదని
పలికెను.
అంత
ఖట్వాంగుడు
సావధానచిత్తుడై
'నేనిప్పుడడుగ
వలసినదేదియునూ
లేదు.
నేను
ఇహపరములందలి
భోగములన్నింటినీ
తుచ్చముగా
తలపోయుచున్నాను.
ఇంద్రియ
సుఖములను
బురదలో
నేనిక
దిగను.
తిరిగి
రానట్టిదియునూ
జన్మ
సార్థకము
పడయునట్టిదియునూనగు
భగవంతుని
పరమధామమును
పొంద
కోరుచున్నాను.
అని
కన్నులు
మూసుకొని
భగవన్నామమును
స్మరించుచుండగనే
ముహూర్తకాలములో
మరణ
మాసన్నమై
శ్రీహరి
పదవిని
పొందెను.
ఒక్క
ముహూర్తములోనే
సమస్త
విషయ
భోగాభిలాషను
మానసికముగా
త్యజించె.
శ్రీహరియొక్క
నిర్భయ
పదమును
ఖట్వాంగుడు
పొందగా,
నీ
కింక
యేడు
దినముల
అవధి
కలదు.
నీ
వుద్ధరింప
యేడు
దినములుండ
యోచించుటెందులకు?
ఈ
లోగా
పరమ
పదవికి
తగిన
ఉత్తమ
శ్రవణములు
చేసి
చిత్తమును
శుద్ధిగావించుకొమ్ము"
అని
శుకుడు
తెలుపగా,
పవిత్ర
మహనీయుని
చరిత్ర
విన్న
పరీక్షిత్తు
ఆనంద
బాష్పములు
రాల్చుచూ
"ప్రభూ
నేనిపుడేమి
జేయవలెనో
తెల్పుడు.
నా
నోట
మాట
రాకున్నది.
హృదయ
మానందమున
మునిగి
యున్నది"
అని
మారు
మాటాడక
స్తంభించి
నిలచెను.
8
▾
Meaning
Keep
నిర్గుణ
పరమాత్మ
సగుణు
డెట్లాయెను?
అంత
శుకుడు,
"రాజా!
వైరాగ్యమను
ఖడ్గమును
సంపాదించుకో
మోహమను,
దేహభ్రాంతిని
ముక్కలు
ముక్కలుగా
త్రుంచి,
సంబంధుల
మమకారమును
త్యజించి,
ఈ
పవిత్ర
నదీ
తీరమున
ఆసనమును
స్థిరముచేసి
హరి
చింతన
చేయుము"
అని
కథను
ప్రారంభింప
బోవుచుండ,
పరీక్షిన్నరేంద్రుడు
ఏదియో
అడుగ
తలంచి
నోరు
విప్పెను.
అంత
శుకుడు,
"రాజా!
నీవేదియో
అడుగ
బోవుచున్నట్లున్నది;
తప్పక
నీ
సంశయము
తీర్చుకొమ్ము"
అని
శెలవిచ్చిన
క్షణమే;
మహారాజు,
"స్వామీ!
మీరు
కృపాసాగరులు;
ఆకలి
గొన్నవానికి
అత్యంత
రుచికరమైన
పదార్థములు
లభించిన
యెంత
ఆనందించునో,
అట్లే
మీరు
పలుకు
ఒక్కొక్క
పలుకు
నా
హృదయారాటమును
చల్లపరచుచున్నది;
ప్రభూ
ఈ
సృష్ట్యుత్పత్తిని
గూర్చి
దీనికి
పూర్వము
కొంత
తెలిపితిరి.
అది
నాకంత
అర్థమగుట
లేదు.
నిర్గుణ
పరమాత్మ
సగుణు
డెట్లాయెనో
దానికి
కారణమేమో
తెలుపుడు"
అని
వికసితవదనుడై,
ఉత్సాహపూరితుడై
వినయమున
ప్రార్థించెను.
Previous
←
The Nectar of the Story of Śrī Kṛṣṇa
Next
The Special Greatness of Hearing the Bhāgavata Story
→