Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Special Greatness of Hearing the Bhāgavata Story
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
30.
భాగవత
కథా
శ్రవణ
విశిష్టత
శుకుడు
ఆసనమును
సవరించుకొని,
"రాజా!
పరమేశ్వరుడు
బ్రహ్మా,
విష్ణు,
పరమేశ్వర
స్వరూపుడై
జగత్తును
సృష్టించి,
అందులో
మోహాభిమానములు
సృష్టించి,
పాలించి,
నశింపజేయుచుండును.
అట్లు
సృష్టించిన
తన
సృష్టియందే
ద్వంద్వ
రూపములుండును.
ఒకదాని
కొకటి
పరస్పర
భేదములు,
ద్వేషములు
కలవు.
అవి
సక్రమమార్గమును
అవలంబించిన
లోకము
సుఖశాంతులతో
నుండును.
అట్లుకాక,
సృష్టియందలి
జీవులు
వక్రమమార్గము
నవలంబించిన
సృష్టి
అశాంతి,
అల్లకల్లోలములతో
అవస్థలపాలు
కాగలదు.
అందుకు
తగిన
రక్షణ,
శిక్షణ,
సృష్టి
నిమిత్తమై
శ్రీహరి
అపుడపుడు
తానే
అనేక
రూపములతో
అవతరించి,
చెడిన
లోకమును
ఉద్ధరించి,
మాలిన్యమును
దూరము
చేసి,
మంచిని
పెంచు
విధానమును
బోధించుచుండును.
భగవంతుడు
సూకరాకారంతో
భూమిని
ఎత్తుట
భగవంతున
కిట్టి
ఆకారమని
నిర్ణయింప
వీలుకాదు.
అనంత
ఆకారములు
ధరించి,
భూమిని
వరించి,
జీవుల
తరింపజేయు
నిమిత్తము
ఆయా
అవసరములనుపట్టి
అవతరించుచుండును.
తన
సృష్టియందు
మొదటి
అవతారము
వరాహరూపము.
హిరణ్యాక్షునిచే
ధరణి
ధర్మ
రహితమై
పరితపించుచుండ,
ధరణిని
ఉద్ధరింప,
నిర్గుణ
నిరాకారుడై
భగవంతుడు
2
▾
Meaning
Keep
సాకారరూపమును
యెత్త
వలసి
వచ్చెను.
భగవత్సంకల్పమునకు
ఆధారములు,
ప్రమాణములు
పనికి
రావు.
అవి
అపారమైనవి.
ఆలోచనలతో
అర్థము
కావు.
అతన్ని
తెలుసుకొన్న
వారికే
అవి
గోచరము
కాగలవు
కానీ,
బుద్ధి,
విద్యలతో
తెలిసికొన
సాధ్యము
కాదు.
అతనికి
అతనే
సాటి.
కారణములు
లేక
కార్యము
జరుగదు.
కారణ
కార్యములు
అవినాభావ
సంబంధములు.
ఒకనాడు
బ్రహ్మా
ఆసనాసీనుడైయుండ
అతని
ముక్కునుండి
అంగుష్ఠాగ్రమంత
సూకరము
క్రింద
పడెను.
లీలామానుష
విగ్రహుడైన
బ్రహ్మా,
తన
కన్నియూ
తెలిసిననూ
తెలియనివానివలె
నటించుచూ,
ఆ
సూకరమును
ఆశ్చర్యముగా
చూచుచుండెను.
ఇంతలోనే
ఆ
సూకరము
కప్ప
అంతై
భూమిని
త్రవ్వ
మొదలిడెను,
ఇంతలో
యేలుకంతాయెను.
ఇట్టే
అంతంతై
పిల్లి
అంతై,
కడకు
సామాన్యపు
సూకర
ఆకారము
ధరించెను.
క్షణములలో
పెరుగుచూ,
పెరుగుచూ
మదగజమంత
ఆకారమును
ధరించెను.
దీనిచేష్టలను
గ్రహించుచున్న
బ్రహ్మా,
తనలోతాను
తన
లీలా
నాటకమునకు
నవ్వుకొంటూ
ఉండెను.
ఇంతలో
సూకరము
భూమ్యాకాశములను
కలిపినటుల
యేకాకారమును
ధరించి
భయంకర
శబ్దము
చేయుచూ
సముద్రములో
జోరబడెను.
జోరబడిన
సూకరము
సముద్రములో
సిగ్గుతో
దాగియున్న
భూదేవిని
తన
కోరలతో
యెత్తి
పట్టుకొని
వెళ్ళు
చుండెను.
ఇంతలో
వెనుక
వైపునుండి
"ఒరే!
సూకరాధమా!
పారిపోయెద
వెక్కడికి?
నిలువుము"
అని
వినిపించెను.
అంత
సూకరము
అలక్ష్యముగా,
ఆ
మాటలు
వినిపించుకొనక
ముందు
బోవుచుండ,
ఒక
భూతము
వలె
హిరణ్యాక్షుడను
దైత్యుడు
యెదురు
నిలిచి
తన
భుజబలమును
చూప
మొదలిడెను.
ఇంతలో
ఇరువురి
ప్రతాపములు
చూచుచున్న
భూదేవి
భయ
భ్రాంతురాలై
దిగులుచే
వణుకుచుండ,
సూకరము
'భూదేవీ!
దిగులొందకుము.
క్షణములో
ఈ
దానవుని
అంత
మొందింతును.
నీకు
శాంతి
చేకూర్తును'
అని
సూకరము
రౌద్రాకారము
దాల్చుచుండ,
భూదేవి,
యేమి
కానున్నదో
అని
తత్తర
3
▾
Meaning
Keep
పడుచుండగనే
హిరణ్యాక్షునిపై
కుపితుడై
విరుచుకుపడుచున్న
సూకరమును
చూచి,
భూదేవి
కన్నులు
మూసుకొనెను.
సూకరమునకును
హిరణ్యాక్షునకునూ
ఘోరమైన
ద్వంద్వ
యుద్ధము
జరిగెను.
కడకు
హిరణ్యాక్షుని
చీల్చి,
భూమిలో
పాతిపెట్టెను.
అవతార
లక్ష్యం
-
సృష్టి,
ధర్మ,
వేద
రక్షణ
ఈ
రీతిగనే
తన
సృష్టియందు
ధర్మమునకు
హాని
కలిగించు
దానవులను
హతమార్చుటకై,
భక్త
సంరక్షణకై
ఆయా
దేశ,
కాలపాత్రల
ననుసరించి
స్వరూపములు
ధరించి
ధర్మరక్షణ,
వేదరక్షణ
సలుపుచుండును.
అట్టి
సృష్టి
సంరక్షణ
నిమిత్తమే
మత్స్య,
కూర్మ,
వరాహ,
నారసింహ,
వామనావతారములు.
అన్నిటి
కంటెను,
ఆనంద
మయమును,
పరమోత్కృష్టమునానగు
అవతారము
ఒక
కృష్ణావతారము
మాత్రమే!
అయినననూ
అన్ని
అవతారముల
ముఖ్యోద్దేశములూ
ధర్మ
రక్షణ
మాత్రమని
తెలిసికొనవలెను.
శ్రోతయొక్క
అధికారమును
తెలిసికొనియే
వక్త
ఉపదేశింపవలయును.
హీనశ్రేణికి
చెందిన
శ్రోతలకు
ఉచ్చశ్రేణికి
చెందిన
జ్ఞానమును
వెంటనే
చెప్పుట
వ్యర్థము.
ఏలనన,
వారు
దానిని
గ్రహింప
జాలరు.
అటులనే
ఉచ్చకోటిలో
చేరిన
శ్రోతలకు
నిమ్న
శ్రేణికి
చెప్పు
విషయమును
జెప్పిన
వారలకు
తృప్తికాదు.
ఇందుల
కొక
ఆధారము
కలదు.
బ్రహ్మకును,
నారదునకును
జరిగిన
వాదమును
తెలుపుదును.
సావధానముగా
వినుము"
అని
శుకుడు
నారద
విషయమును
తెలుప
మొదలిడెను.
బ్రహ్మా,
నారద
సంవాదము
బ్రహ్మా
నారదునితో
"మానస
పుత్రా!
సృష్టి
రచనే
నా
తపస్సు.
సృష్టి
అంతయూ
కేవలము
సంకల్ప
మాత్రమే.
అయితే
ఆయా
జీవరాసులకు
కొన్ని
కొన్ని
నీమముల
నందింతును.
వాటిని
సక్రమ
మార్గమున
వినియోగించుకొన్న
సృష్టి
చక్రము
ధర్మముగా
తిరుగును.
అట్లుకాక,
నీమముల
నుల్లంఘించి,
వక్రమ
4
▾
Meaning
Keep
మార్గమున
వాంఛల
ఫలసిద్ధికై
ప్రాకులాడుటచే
ధర్మము
నశించి,
లోకమున
నానాబాధలు
అనుభవించవలసి
వచ్చును.
రాత్రింబగళ్ళూ
నా
సంకల్ప
మాత్రమే.
ప్రజాపతులందరునూ
ఆ
అంశములే!
ప్రజలలో
ప్రజాభివృద్ధి
భావమున్నంత
వరకూ
అది
నా
భావనే!
అని
తలంచవలెను.
ఒక్కొక్క
సమయమున
సృష్టించిన
జగత్తును
రక్షించుటకై
నేనే
మన్వంతరమున
మను
రూపమును
ధరించి
అవతరింతును,
అందుకు
తగిన
దేవతలను,
బుషులను
పుట్టించి
ప్రజలకు
మార్గదర్శకులగునట్లు
వారి
ప్రవర్తనలను
లోకమునకు
ఆదర్శములుగా
అందించునట్లు
చేతును.
మితిమీరి
పెరుగుచున్న
సృష్టిని
అంత
మొందింతును.
దానికై
రుద్రరూపమును
కూడా
దాల్తును.
మంచిని
పెంపొందించుటకై,
మంచిని
కాపాడు
కొనుటకై
చెడ్డను
కూడా
సృష్టింతును.
మంచికయిననూ,
చెడ్డకయిననూ
కొన్ని
హద్దులు
నియమింతును.
లేకున్న
అవి
పెడ
మార్గముపట్టి
ప్రజలను
బాధపెట్టును.
అందరియందూ
నేను
వ్యాపించి
యుందును.
సర్వవ్యాపియైన,
సర్వ
భూతాంతరాత్మయైన
నన్ను,
ప్రజలు
మరచుటచే
ప్రకృతియే
స్థిరమని
భావించి,
మోహించి
బాధలకు
గురియగుచున్నారు.
అట్లుకాక
నా
పైననే
లక్ష్యముంచి,
అన్నింటికీ
హరియే
కర్త
అనియును,
మిగిలినవన్నియూ
అతని
సంకల్ప
మాత్రమైన
సామగ్రి
అనియూ
భావించిన,
అట్టి
వారిని,
అనుగ్రహించి
వారే
నేను,
నేనే
వారను
సత్యమును
తెలుపుచున్నాను.
దైవానుగ్రహ
పాత్రులైన
భాగవతులు
అట్లు
అనుగ్రహపాత్రులయినవారు
వేలకువేలు
కలరు.
వారే
లోకమున
సాధకులుగను,
మహనీయులుగను,
బుషులుగను,
దైవాంశములుగను
మార్గదర్శకులై
ధర్మమును,
సత్యస్వరూపముగ
సాక్షాత్కరింప
జేసుకొనిరి.
వారలలో
కొందరిని
తెలుపుదును.
సగరుడు,
ఇక్ష్వాకు,
ప్రాచీనబర్హి,
బుభువు,
ధ్రువుడు,
5
▾
Meaning
Keep
రఘుమహారాజు,
యయాతి,
మాంధాత,
అలర్కుడు,
శతధన్వుడు,
దిలీపుడు,
బలి,
భీమ్ముడు,
శిబి,
పిప్పలాదుడు,
సారస్వతుడు,
విభీషణుడు,
హనుమంతుడు,
ముచికుందుడు,
జనకుడు,
శతరూప,
ప్రహ్లాద
మొదలగు
వారందరూ
రాజబుషులు,
బ్రహ్మబుషులు,
రాజపుత్రులు,
కులీనులు.
వారి
నందరినీ
భాగవతులనియే
చెప్పవచ్చును.
వీరు
దీక్షను
సాధించి
భగవత్కథా
శ్రవణములు
గావించిరి.
వారలలో
స్త్రీ,
ద్విజ,
శూద్ర,
చండాలాది
లింగ,
వర్ణ,
ఆశ్రమ
భేదములు
లేక
అనుగ్రహమునకు
పాత్రులయిరి.
నేను
కారణ
కారణుడను.
నిత్యుడను.
సచ్చిదానంద
స్వరూపుడను.
నేనే
హరి,
హర,
బ్రహ్మా
రూపములను.
ఆయా
సమయము,
సందర్భముల
ననుసరించి
మారుచుందును.
ప్రపంచమంతయూ
నా
సంకల్ప
కల్పనయే
కాని,
నా
సాకార
రూపము
కాదు.
వత్సా!
ఈ
విషయము
నీపైగల
ప్రేమచే
నీకు
తెలిపితినే
కానీ,
అన్యులకు
నా
సృష్టిని
తెలుసుకొన
సాధ్యము
కాదు.
ఈ
తెలిపిన
విషయమును
భాగవత
సంక్షేపమని
అందురు.
అవతార
లీలలును,
భక్తులయిన
వారల
నామములను,
భగవంతునకు,
భక్తులకును
గల
సన్నిహిత
సంబంధమును,
ఈ
మూడింటి
యేకత్వమునూ
భాగవతమని
అందురు.
కనబడునదంతయూ
భగవంతున
కన్యమైనది
కాదు.
కనుక,
సంక్షిప్తముగా
తెలుపవలెనన్న
సర్వమూ
భాగవతమే
అని
చెప్పవచ్చును"
అని
ఆనందముతో
బ్రహ్మా
నారదునకు
బోధించుచుండెను.
ఇంతలో
నారదుడు
ఆశ్చర్య
ఆవేదనలతో
"స్వామీ!
నీ
ఆజ్ఞ
ప్రకారము
నేను
నిరంతరము
హరి
నామమును
గానము
చేయుచూ,
లోకమునకు
శ్రవణానందము
నందింతును.
అయితే
యే
రూపేణా
మాయ
వచ్చి
నన్ను
ఆవరించి
భ్రష్టుని
గావించునేమో!
ఈ
నా
పవిత్ర
కర్మకు
అంతరాయము
కలిగించునేమో!
అపుడు
నే
చేయవలసిన
కర్తవ్యమేమిటి?
మాయ
ఆవరించకుండుట
కేదైననూ
మార్గమున్న
దానినికూడనూ
తెలిపి
పుత్రవాత్సల్యమును
పూర్తి
చేసుకొమ్ము"
అని
ప్రార్థించెను.
6
▾
Meaning
Keep
హరి
చరితములు
అతి
లలితములు
బ్రహ్మా
ఫక్కున
నవ్వి
"వత్సా!
నీ
పలుకులు
అమాయకపు
బాలుని
పలుకులుగా
కన్పట్టుచున్నవి.
భాగవతతత్త్వ
వర్ణనము
చేయు
వారియొక్కయు,
నచింత్య
మాయాపతియగు
హరిలీలలను
సమర్థించు
వారియొక్కయు,
శ్రద్ధాభక్తులై
సత్కర్మలు
చేయువారియొక్కయు,
సత్య
ధర్మములకై
పాటుపడు
వారియొక్కయు,
చిత్తములు
మాయా
విమోహితములు
కావు.
కాన,
నీవు
వీణను
చేపట్టి
హరి
నామము
గానము
చేయుచు
ముల్లోకములు
నిరంతరము
తిరుగుచుందుము.
భాగవత
తత్త్వమును
శ్రవణముచేసి
ముల్లోక
వాసులు
భవసాగరమును
తరింతురు.
కర్మలు
బంధ
హేతువులు.
అయితే
హరిచరిత
కర్మలు
అతి
లలితములు.
జగత్తున
విషయములనుండి
మనస్సును
మరల్చి
జగత్పతి
అయిన
హరియందు
లీన
మొనర్చుటకు
హరి
చింతన
తప్ప,
అన్య
మార్గమువేరొండులేదు"
అని
పలికెను.
పరీక్షిత్
మహారాజా!
ఈ
పవిత్ర
దైవ
సృష్టి
బ్రహ్మా
అందరికీ
తెలుపుటకు
వీలుకాదు
కదా!
ఉచ్చశ్రేణికి
చెందిన
శ్రోత
అగుట
వలననే
నారదునకు
ఉత్తమ
జ్ఞానసారమును
త్రాగించెను.
త్రాగిన
నారదుడునూ,
పవిత్ర
రసమును
పెడమార్గమున
దుర్వినియోగ
పరచక,
బ్రహ్మా
ఆజ్ఞానుసారము
త్రిలోకములందూ
గానము
చేయుచూ,
లోకమును
తరింపజేయుచున్నాడు.
నీవునూ
ఇట్టి
ఉచ్చశ్రేణికి
చెందిన
శ్రోతవగుట
చేతనే,
యెవ్వరికీ
లభ్యముకాని
నేను
నీ
చెంతకే
వచ్చి
పవిత్ర
భాగవతమును
శ్రవణము
చేయించ
మొదలిడితిని.
నేను
సామాన్యవక్తను
కాదు.
శ్రోతయొక్క
అధికారమును
తెలిసికొనక
వారి
చెంతనైననూ
చేరను.
నిర్గుణ
రూపుడగు
భగవంతుని
గుణములను
బ్రహ్మా
నారదునకు
చెప్పుటలో
నారదు
దెంతటి
ఉచ్చశ్రేణికి
చెందిన
శ్రోతయో
యోచించుకొమ్ము"
అని
గంభీరముగ
భావపూరితమైన
పలుకులతో
శుకుడు
తెలుపు
చుండగనే,
పరీక్షిత్
"ప్రభూ!
పితామహుడగు
చతుర్ముఖుని
యాజ్ఞననుసరించి
నారదుడు
పవిత్ర
7
▾
Meaning
Keep
భాగవతకథను
ఎవరెవరితో
తెలిపెను?
అట్టి
పవిత్ర
ఉచ్చశ్రేణి
శ్రోతలు,
ఎంత
ధన్యులో
వారిని
గురించి
విస్తారముగా
వినిపింపు"మని
ప్రార్థించెను.
ప్రాణ
త్యాగ
సమయములో
ప్రాణేశుని
చింతించాలి
అంత
శుకుడు
"రాజా!
నీవింత
కంగారు
పడెదవెందులకు?
ఈ
విషయమున
తొందరపాటు
మంచిది
కాదు.
ధైర్యమును
వహించి,
ఆనందచిత్తుడవై
వినుము.
నేను
సర్వమునూ
నీకు
వినిపింతును"
అని
అనగా,
మహారాజు
తిరిగి
చేతులు
జోడించుకొని,
"స్వామీ!
తొందరపాటేమాత్రమూ
కాదు.
అంత్యకాలమున
నా
మనస్సు
ఆ
శ్యామసుందరుని
మందహాసమోమును
చూచుచూ,
పాదపద్మ
మకరందమును
పానము
చేయుచూ,
కాయమును
వీడవలెనను
కాంక్ష
తప్ప
మరి
అన్య
ఆశలు
లేవు.
ఏ
నిమిషమున
అంత్యకాల
మాసన్న
మగునో,
అట్టి
సమయమున
మదన
మోహనుని
మనసు
స్మరించకుండిన,
తిరిగి
యెనుబది
నాలుగు
లక్షల
జీవరాసులలో
యేదో
ఒక
జీవునిగా
జనన
మొందవలసి
వచ్చును
కదా!
అట్లుకాక
ప్రాణమును
వీడు
సమయమున
ప్రాణేశుని
చింత
ఉండుటకై
అతని
లీలా
గుణ
గణములను
వినిపించి
ధన్యుని
గావింపుము"
అని
పరీక్షిత్
కోరెను.
శుకుడు
నవ్వి
"మహారాజా!
చెవులతో
కథను
విన్నంత
మాత్రమున,
మనసు
భగవచ్చరణారవిందములందు
ఎట్లు
నిలుచును?
ఈ
విషయమున
నీ
అభిప్రాయ
మేమైయుండునో,
తెలుపగలవా?"
అని
ప్రశ్నించెను.
రాజామాటలు
విని
"ప్రభూ!
భగవంతునకూ,
భగవన్నామమునకును,
అతని
గుణములకునూ,
భేద
మేమాత్రమూ
లేదుకదా!
కథను
శ్రవణము
చేయుచున్నప్పుడు
కథతో
పాటు
నామగుణ
రూపములు
కర్ణ
రంధ్రములద్వారా
హృదయమున
ప్రవేశించ,
లోనున్న
అజ్ఞానాంధకారము
పటాపంచలమై,
ప్రకాశకాంతులు
ప్రవేశించును
కదా!
అరణ్యమున
సింహము
ప్రవేశించగనే
నక్కలు,
పందులు
ఇత్యాది
పిరికి
పందలగు
జంతువులు
తోక
8
▾
Meaning
Keep
ముడుచుకొని
పారిపోకుండునా?
నిజముగా
శ్రవణము
చేయువాడు
మనసు
చేర్చక
శ్రవణము
చేయడు.
అట్టి
మధుర
మందహాస
సుందరుని
గుణగణములను
మనసారా
శ్రవణము
చేసిన,
మనసు
మాలిన్యమయిన
విషయములందు
తిరుగదు
కదా?
శ్రవణం,
మనసు,
రెండునూ
ఏకమగును.
అపుడే
ఆనందము
లభించును"
అని
మహారాజు
ఉత్సాహపూరితుడై,
వికసిత
వదనుడై
విష్ణుమూర్తిని
గురించి
తెలుపుచుండెను.
శుకుడు
అడ్డు
తగిలి,
"మహారాజా!
చిత్తము
స్వభావము
అటు
ఇటు
తిరుగుటే
కదా?
దాని
స్వభావమును
వదలి
భగవచ్చరణములందు
ఎట్లు
చేరును?
అది
అసాధ్యము
కదా?"
అని
పరీక్షిత్
మనసును
తెలిసికొనగోరి
అడుగగా,
మహారాజు
చిరునవ్వుతో
"ప్రభూ!
తమరు
అంగీకరించి,
అనుయిచ్చిన
దీనిని
నేను
వివరింతును.
భ్రమరము
పుష్పమందలి
మకరందమును
గ్రోలనంతవరకూ,
అటూయిటూ
రోదన
చేయుచూ
తిరుగుచుండును.
ఒకపరి
పుష్పములో
ప్రవేశించెనా
దాని
తిరుగుడు
కానీ,
ముందు
వెనుక
చింతన
కానీ
ఆరాటము
కానీ
చేయక,
ఆనందముగా
పుష్పములో
నిలిచి
పోవును.
పుష్పము
ముకుళించిననూ,
తన
ప్రాణాపాయమునకు
వెరువక
మకరందములో
మత్తురాలయిపోవును.
అటులనే
ఒకపరి
ఆ
సుందరుని
పాదపద్మములందు
మనసు
చేరెనా,
మకరందపు
రుచిని
చూచెనా,
తిరిగి
తాను
అన్యమును
ఆశించదు.
అన్ని
వృత్తులు
మానును"
అని
సమాధానము
చెప్పెను.
Previous
←
The Dialogue of Śuka and Parīkṣit
Next
The Removal of Parīkṣit's Doubts
→