Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Removal of Parīkṣit's Doubts
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
31.
పరీక్షిత్తుని
సంశయ
నివృత్తి
ఈ
సమాధానము
వినగానే,
"రాజా!
నీ
హృదయము
ఆ
శ్యామసుందరుని
యందు
లీనమయినది
కనుక,
ఇక
నీవే
యే
ప్రశ్నలు
అడగ
తలంచితివో
సూక్ష్మరూపముగ
తెలుపుము.
వాటి
కన్నింటికినీ
తగిన
సమాధానము
నిత్తును.
నిన్ను
శ్యామసుందరుని
చింతనలో
ఉన్మత్తుని
గావింతును"
అని
పలికెను.
పరీక్షిత్తు
ప్రశ్నల
పరంపర
ఆ
మాటలు
విన్నంత
పరీక్షిత్
ఆనందవదనుడై,
"స్వామీ!
ప్రశ్నించునంతటి
అర్హత
నాకెక్కడిది?
నాకు
ఈ
సమయమున
ఏది
హితమో,
యేది
యోగ్యమో,
యేది
ప్రధానమో,
దానిని
తమంతట
తామే
తెలుపుడు.
ఏదో
మాయా
మోహితుల
మగుటచే
అపుడపుడు
సంశయములు
కలుగుచుండును.
అట్టితరి,
నేను
నా
సంశయములు
తెలుపుకొని,
దానికి
తగిన
సమాధానమును
అందుకొన
ప్రార్థింతును.
దానిని
మీరు
వేరుగా
భావించక,
నా
యోగ్యతా
అయోగ్యతలను
యోచించక,
పుత్ర
భావముచే
నన్ను
శాంతచిత్తునిగ
మార్చుడు.
ఒక
సంశయము
నాలో
చాల
కాలమునుండి
పీడించుచున్నది.
అది
యేమన,
జీవుడు
ఈ
దేహమును
స్వభావవశమున
బొందుచున్నాడా?
లేక,
కర్మాధీనుడై
పొందుచున్నాడా?
అనునది
ప్రధాన
సంశయము.
ఇక
రెండవది,
పురాణ
పురుషుని
నాభినుండి
ఒక
కమల
ముత్పన్నమైనదనియును,
దాని
2
▾
Meaning
Keep
నుండియే
సృష్టియైనదనియును
తెలిపితిరి.
పరమాత్మ
జీవునివలె
పరిమితావయవములచే
పరిచ్ఛిన్నుడా?
లేక,
జీవ,
బ్రహ్మల
కేమైనా
భేదమున్నదా?
మూడవది,
ఇది
భూత
కాలమనియూ,
ఇది
వర్తమానమనియు,
ఇది
భవిష్యత్తు
అనియు,
దేని
ఆధారమున
తెలిసికొనబడుచున్నది?
నాలుగు,
జీవులు
ఏయే
కర్మలోనర్చిన
ఏయే
గతి
ప్రాప్తించును?
ఐదు,
మహా
పురుషుల
ఆచరణ
ఎట్లుండును,
వారల
గుణముల
విస్తరింపుము.
ఆరు,
పరమాత్ముని
పరమాశ్చర్యమయ,
సులలిత,
కమనీయ
అవతార
కథలను
గూర్చి
చెప్పుము.
ఏడవది,
కృత,
త్రేత,
ద్వాపర,
కలియుగముల
భేదముల
గూర్చి
తెలుపుము.
ఇపుడు
ఫలాని
యుగమని
తెలిసికొనుటెట్లు?
ఎనిమిది,
రాజబుషి
ధర్మములను
గూర్చి
చెప్పుము?
తొమ్మిది,
అధ్యాత్మ
యోగవిధిని
గూర్చి
తెలుపుము.
పది,
వేద
స్వరూపమేది?
ఉప
వేదములని
వేటినందురు?
యే
వేదమున
కేవి
ఉప
వేదములో
శెలవివ్వవలెను?
ఈ
నా
ప్రశ్నలకు
ప్రత్యుత్తరమును,
ఇంకనూ,
నేను
వినదగినవి
యన్నియూ,
మిక్కిలి
త్వరగా
వినగోరుచున్నాను.
"స్వామీ!
నేను
తమను
శరణు
జొచ్చితిని.
ఈ
సందేహములు
తమరు
తప్ప
తీర్పువారు
లోకములోనెందునూ
కానరారు,
వీటిని
తీర్పు
సమర్థులు,
సర్వ
శక్తి
సంపన్నులు
తమరే
కాన,
నన్ను
అనుగ్రహించి,
నా
జన్మము
కడతేర్చుమని"
పాదములపైబడి
ప్రార్థించెను.
శుకుడు
వాత్సల్య
భావముతో,
"రాజా!
లెమ్ము!
ఇన్ని
ప్రశ్నలు
ఒక్కసారిగా
వేసిన
ఎట్లు
తెలుసుకొనగలవు?
అందునా,
నీవు
ఇంకనూ
ఏమియూ
తినలేదు!
త్రాగలేదు!
కొంత
ఫలహారమైననూ,
పాలైననూ
తీసికొమ్ము.
ఆహార
పానీయములు
కాయ
ధర్మములు.
అవి
లేకున్న,
ముందు
కర్తవ్యము
సాగుటెట్లు?
కృశించి
మధ్యలో
దేహమేమైన
అయిపోయిన,
ఇక
శంకతోనే
నీవు
నిలిచి
పోవలసి
వచ్చును.
కాన
ఆహారమేమైన
తీసికొమ్ము"
అని
ఆజ్ఞ
ఇచ్చెను.
3
▾
Meaning
Keep
అందులకు
మహారాజు.
"స్వామీ!
అమృతపానమును
వదలి
అనృత
పానము
చేయుట,
అంత్యకాల
మాసన్నమయినవారలకు
ధర్మము
కాదు
కదా!
అది
చేయరాని
పనియనియే
తలంతును.
నా
కర్ణ
రంధ్రముల
ద్వారా
సుధారసమును
పానము
చేయించుచున్నారు.
మృత
సంజీవనీ
సుధను,
శరీర
మంతటనూ
చిలుకుచున్నారు.
మధ్యలో
నేనెట్లు
చావగలను?
అది
జరుగదు.
కుపితుడై
శృంగిమహర్షి
నా
మృత్యు
కాలమును
నిర్దేశింపకుండిననూ,
తక్షకునిచే
యేడు
దినములలో
చావకుండిననూ,
నేను
నిరంతరం
కథను
వినుచు
చావనే
చావను.
నిరంతరం
ఈ
విధముగనే
నిరాహార
దీక్షితుడనై
కథా
శ్రవణము
చేయుచుందును.
నా
కాహార
పానీయములు
శ్యామసుందరుని
కథామృతమే!
కాన
నా
ఆహారపానీయముల
చింతనువీడి
పరమ
పదమునకు
అధికారిగా
నొనర్చుము.
నన్ను
దుర్గతి
నుండి
రక్షింపుము.
మిమ్ములనే
శరణు
జొచ్చుచున్నవాడను"
అని
కంటి
ధారలు
కార్చుచూ
దీనుడై
ప్రార్థించెను.
సాత్త్విక
తపమే
ఆత్మ
సాక్షాత్కార
హేతువు
అంత
శుకుడు
తల
నిమురుచూ,
"రాజా!
శుభమార్గమును
గూర్చి
చెప్పెదను,
మొదట
దానిని
వినుము.
మాయా
జగమునకు
బ్రహ్మా
ప్రకాశమును
చూపించెను.
బ్రహ్మా
సృష్టిచేయ
తలంపగా,
ఆకాశము
నుండి,
'తపమే
అన్నింటికీ
సారమైనది'
అను
శబ్దము
వినిపించెను.
కావున
తపమును
చేయుము.
తపము
వలన
భ్రమ
తొలగి
పోవును"
అని
శుకుడు
తెలుపుచుండగనే...
పరీక్షిత్
"స్వామీ!
తపమనగాయేమి?
శెలవిం"డని
కోరెను.
అంత
శుక
మహర్షి
"వత్సా!
తప
మనగా
సాధనము.
తపము
చేతనే
సృష్టి,
స్థితి,
లయములు
జరుగుచున్నవి.
తపస్సే
ఆత్మ
సాక్షాత్కారమునకు
హేతువు.
మనోబుద్ధీంద్రియములను
తపింప
జేసిన,
తప్పక,
పై
సాక్షాత్కారము
లభించును.
తపింప
జేయడమనగా
చెప్పెదను
వినుము!
ఈ
మనోబుద్ధీంద్రియములు
ఎల్లప్పుడూ
స్థూల
వస్తువుల
ద్వారా
బాహ్య
సుఖములను
పొందుటకు
బహిర్గతమగుచుందును.
ఏదైనా
శబ్దమొచ్చినచో
వెంటనే
శ్రోత్రేంద్రియము
4
▾
Meaning
Keep
వినును.
శ్రోత్రము
వినిన
వెంటనే,
నేత్రము
చూచుటకు
ప్రయత్నించును.
నేత్రము
చూచినదా!
ఆ
వస్తువు
కావలెనని
మనస్సు
ఆశించును.
బుద్ధి
వెంటనే
'సరే
మంచిదని'
దానిని
పొందుటకు
తగిన
ప్రయత్నములు
తీవ్రముగా
విచారించును.
ఈ
సర్వేంద్రియములు,
ఒకదాని
తరువాత
ఒకటి,
బాహ్యావస్తువుల
సంబంధము
పెట్టుకొని,
ఎల్లప్పుడూ
తిరిగి
తిరిగి,
శాంతి
సౌఖ్యములు
కానక
విచ్చలవిడిగా,
వీధిలోని
కుక్కలవలె
తిరుగాడుచుందును.
ఎవరేమనుకొందురో
అను
సిగ్గూ
ఎగ్గూ
లేక
తిరుగుచుందును.
అట్లు
స్వేచ్ఛగా
తిరుగుచున్న
మనో
బుద్ధీంద్రియ
ప్రవర్తనలను
జీవుడు
నెమ్మదిగా
బోధించి
ప్రవర్తనలను
భగవత్గుణగానములందు
లీనమొనర్చుటకు
పూనుకొనును.
లేక
ఒక
విధమైన
నిష్ఠయందు
నీమించును.
ఒక
విధమైన
ఉత్తమ
మార్గమున
ప్రవేశింపజేయును.
ఈ
రీతిగా
స్వేచ్ఛను
అణగద్రొక్కి,
ఇంద్రియములను
పవిత్ర
పరమాత్మ
విషయములందు
అంకితము
చేసి,
జపమో,
ధ్యానమో,
సత్కర్మనో,
లేక
యింకే
విధమైన
పవిత్ర
కార్యములందో-ఒకేమాట,
ఒకేభావము,
ఒకేచేతతో
మనోబుద్ధీంద్రియములను
తపింపచేయుటనే,
తపస్సని
అందురు;
దాని
ద్వారా
సర్వ
పాపములు
నశించును.
అంతఃకరణము
శుద్ధి
యగును,
అపుడు
భగవంతుడు
అందే
నివసించును.
తపస్సు
ద్వారా
సర్వ
మంగళములూ
సమకూరును.
కడకు
సర్వేశ్వరుడే
సాక్షాత్కరించును.
ఇంతకంటే
మించిన
దేమున్నది?
రాజా!
బుషీశ్వరులు,
మహాత్ములు
ఈ
తపస్సు
ద్వారానే
కదా
అఖండమైన,
అపూర్వమైన
తేజస్సును
సంపాదించి,
ఎన్నో
ఘన
కార్యములోనర్చిరి.
రావణుడు,
హిరణ్యకశిపుడు,
మొదలగు
రాక్షసులు
సహితము
రాజసిక
భావముచే
తపస్సు
ఆచరించి,
భౌతికమైన
శక్తి
సామర్ధ్యముల
నందుకొనిరి.
వారి
బలశౌర్యములు
తపఃప్రభావములే.
అయితే,
అదే
తపస్సును
సాత్త్వికమున
ప్రవేశింపచేసిన
పరాత్పరుని
పొందునట్టి
ప్రాప్తి
లభించును.
5
▾
Meaning
Keep
మనస్సును
ఆత్మయందు
మరల్చుటే
మోక్షం
తపస్సులు
భావములను
పట్టి,
రాజసిక,
తామసిక,
సాత్త్వికమని
మూడు
విధములు
కలవు.
అయితే
దైవ
ప్రాప్తికి
సాత్త్వికమే
ప్రధానము.
వసిష్ఠ,
విశ్వామిత్రాది
మహర్షులు,
సాత్త్విక
మార్గమున
అద్భుత
శక్తిని
సాధించిరి.
కడకు
బ్రహ్మర్షి
స్థాయికి
చెందిరి.
వాటిలో
మరి
మూడు
విధములు
కలవు.
మానసిక,
కాయిక,
వాచికములను
తపస్సులు.
ఈ
మూడింటియందూ
ఏది
ప్రధానమని
నీవు
సంశయించవచ్చును.
మూడూ
ప్రధానములే!
అయిననూ,
మానసిక
తపస్సును
ఆధారము
చేసుకొన్న,
మిగిలిన
కాయిక,
వాచికములు
అందులోనే
యిమిడిపోవును.
విషయాధీనుడగువాడు
తన
కోరికను
నెరవేర్చుకొనుటకు
అనేక
విధముల
ప్రయత్నించును.
కనుక,
అట్లు
పెడమార్గము
పట్టనీయక,
సమస్తేంద్రియములను
విషయములనుండి
విరమింపజేసి,
మనస్సును
తపస్సునందు
లగ్నము
గావించినచో,
నాతడు
స్వరాజ్యమున
కధికారి
కాగలడు.
అపుడు
అతడు
సర్వమును
నిర్వహింపగలడు.
విషయములలో
మనస్సును
చేర్చుటే
బంధనమనియును,
మనస్సును
బంధనలనుండి
తొలగించి
తపస్సునందు
లగ్నము
చేయుటే
(అనగా
ఆత్మవైపు
మరల్చుటే)
మోక్షమనియూ
చెప్పనగును.
స్వప్న
ద్రష్ట,
స్వప్న
పదార్థముల
సంబంధం
"మహారాజా!
కనిపించు
పదార్థము
లన్నియూ
అనిత్యములు.
హరి
ఒక్కడే
సత్యము.
వస్తువుల
సంబంధము
పరిణామమున
దుఃఖదాయకములు,
భగవంతుడు
సర్వదా
సుఖస్వరూపుడు.
రాజా!
ఈ
సంసారిక
పదార్థములతో,
ఆ
విశుద్ధ
జ్ఞానస్వరూపున
కేమియూ
సంబంధములేదు.
ఒకవేళ
అది
సంబంధ
మున్నదని
తలంచిన,
అది
స్వప్నములో
చూచిన
పదార్థములకును,
స్వప్నమున
కన్నవానికినీ
యెంతటి
సంబంధమో,
అంతటి
సంబంధమే
ప్రపంచమందలి
పదార్థములకును,
పరమాత్మకును
వుండు
సంబంధము"
అని
తెలిపెను.
6
▾
Meaning
Keep
అంత
మహారాజు,
యిట్లడుగ
మొదలిడెను,
"ప్రభూ!
ఈ
విషయమున
నాకొక
సంశయము
కలుగుచున్నది.
ఏమన,
ప్రత్యక్షముగా,
పూర్వము
చూచిన
సత్య
వస్తువులే
కలలో
చూతుము.
కనుక
మొట్టమొదట
నేదియో
సత్య
పదార్థ
మొకటి
యుండవలెను
కదా?
స్వప్నద్రష్ట,
స్వప్నములోని
పదార్థము
లన్నింటినీ
సత్యముగనే
యెంచును.
నిద్రనుండి
లేచిన
తరువాత
అవన్నియునూ
బుద్ధి
భ్రమయని
తలంచును,
గ్రహించును,
అయితే
ఇది
మానవుల
స్థితి.
కానీ
భగవంతునకు
ఎక్కడైనా
భ్రమ
వుండునా?
పదార్థము
ఒక్కటిగా
వున్నా
యిది
మాయచే
గోచరించుచున్న
దనవచ్చును.
నానా
రూపములు
నానా
కృతులగు
పదార్థములు
కలవు.
అవన్నియూ
సత్యములుగనే
తోయును.
అట్టివాటిని
స్వప్నముతో
నేల
పోల్చుచున్నారు?"
అని
అడిగినారు.
మాయయే
సృష్టి
-
సృష్టికర్తే
మాయాపతి
అప్పుడు
శుకుడు
ఫక్కున
నవ్వి,
"మహారాజా!
ఈ
మాయనే
నానా
రూపములుగ
యేర్పరిచినది.
ఇది
కేవలము
పగటివేషగాని
వంటిది.
అనేక
రూపములు
ధరించును.
ప్రకృతి
మాయవలన
అవిద్యాకారణమున
కాలము
సమీపింపగ,
గుణక్షోభము
కలుగగా,
ఈ
ప్రపంచ
మంతయూ
నిర్మాణమగును.
కానీ,
మాయాపతి
యెవడో,
కాల
నియంత
యెవడో,
స్వభావముగా
ప్రవర్తకుడెవడో,
అట్టి
వానిని,
జీవుడు
శరణు
జొచ్చినప్పుడు,
సమస్త
ప్రపంచ
జననియగు
మోహక
మాయకు
శాసనకర్తయని
గ్రహించి,
తన
మహిమను
గుర్తెరిగి,
అక్షర
బ్రహ్మయందు
రమించుచూ,
అజ్ఞాన
రహితుడై,
ఈ
మాయిక
పదార్థములను
వీడి
ఉదాసీనుడు
కాగలడు"
అని
బోధించెను.
అంత
మహారాజు
ఆశ్చర్యచకితుడై
"ప్రభూ!
ఈ
సృష్టి
పూర్వమెట్లు
జరిగెను?
ఈ
మాయా
పదార్థములకు
మూల
కారణమేది?"
అనెను.
శుకుడు
తిరిగి
ఈ
విషయమును
తెలుపుటకై
"మహారాజా!
సృష్టి
అనాది
కాలమునుండి
జరుగుచున్నది.
సృష్ట్యాదియందు
నారాయణుని
నాభినుండి
ఒక
కమల
7
▾
Meaning
Keep
ముద్భవించెను.
ఆ
కమలమందే
నారాయణుడు
బ్రహ్మ
రూపమున
పుట్టెను.
పుట్టిన
బ్రహ్మా
నలుదిక్కులా
ఒకపరి
చూడవలెనని
సంకల్పించెను.
అంత
నలుదిక్కులా
నాలుగు
ముఖములుగా
రూపొందెను,
అంతటితో
సంకల్పము
ఆగక
యెనిమిది
దిక్కులా
చూడవలెనని
సంకల్పించ
చతురాననుడాయెను.
దిశలు
పది
అగుటచే
అయిదు
ముఖములుండెను.
ఆ
అయిదవ
ముఖము
శివరూపుడై
ఉత్తరించెను.
తపము
లేక
యే
పనియూ
సాగదని
పద్మాసనాసీనులై,
హృత్పద్మమందు
సమస్త
సృష్టిని
స్మరించి
తలంచెను.
సృష్టి
రహస్యము
అంత
సులభముగా
అర్థము
చేసికొనలేరు.
భగవత్సంకల్పములకు
కారణ,
కార్యములుండవు.
సర్వ
సమర్థుడు,
సర్వజ్ఞుడు,
అగు
సర్వేశ్వరుని
సృష్టిని
లౌకికఊహలతో
పరిశోధించుటకు,
విచారించుటకు,
పూనుకొనుట
యెట్టి
వారికీ
సాధ్యము
కాదు,
రాజా!
నీ
విదివరకడిగిన
ప్రశ్నలకు
కూడనూ
నేను
ప్రత్యుత్తరమిచ్చుటకు
ఉపక్రమించుచుండగనే
నీవు
మరొక
ప్రశ్నను
అడుగ
పూనుకొనుచుంటివి.
పురాణముల
దశలక్షణములు
అంత
మాత్రమున
నీవడిగిన
ప్రశ్నలకు
నేను
సమాధాన
మిచ్చుటకు
మరచితినని
తలంతువేమో!
రాబోవు
భాగవత
కథా
శ్రవణమునందు
వాటన్నింటికీ
తగిన
సమాధానములు
అందుకో
గలవు.
నీ
ప్రశ్నలన్నియూ
పురాణ
సమ్మతములు.
కనుక
పురాణముల
ద్వారా
వినగలవు"
అని,
శాంత
వచనములు
పలికెను.
పరీక్షిత్
తిరిగి
ప్రశ్నించుటకు
పూనుకొనెను.
ఏమన,
"స్వామీ!
పురాణములు
అననేమి?
వాటి
లక్షణములెట్టివి?
అవి
యెన్ని
యుండవచ్చును?"
అని
కోరెను.
అందులకు
శుకుడు,
"నాయనా!
వేదములలోని
సంక్షిప్త
వచనములకు
వ్యాఖ్యానము
చేయబడిన
వాటిని
పురాణములని
అందురు.
పురాణము
లసంఖ్యాకములు.
కానీ,
ఈ
సమయమున
పదునెనిమిది
పురాణములు,
పదునెనిమిది
ఉపపురాణములు,
పదునెనిమిది
ఉపో
8
▾
Meaning
Keep
పురాణములు
మాత్రము
ప్రసిద్ధము
లగుచున్నవి.
వీటన్నింటినీ
నా
తండ్రియగు
వ్యాసులవారే
సంగ్రహించిరి.
ఈ
పురాణములకు
దశ
లక్షణములుండును.
ఉప
పురాణములకు
పంచ
లక్షణములుండును.
ఆ
దశ
లక్షణము
లేవని
తిరిగి
నీవు
ప్రశ్నించవచ్చును.
దీనికి
పూర్వమే
నేనే
తెలుపుదును.
వినుము.
సర్గము,
విసర్గము,
స్థానము,
పోషణము,
ఊతి,
మన్వంతరము,
ఈశాను
చరితము,
నిరోధము,
ముక్తి,
ఆశ్రమము
అని
ఈ
పదియందూ
ఆశ్రమము
ప్రధానము.
Previous
←
The Special Greatness of Hearing the Bhāgavata Story
Next
The Purāṇas and the Avatāras
→