Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Purāṇas and the Avatāras
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
32.
పురాణములు
-
అవతారములు
ఈ
పది
లక్షణములు
సంక్షిప్తముగా
తెలుపవలెనన్న,
పాలు
పితుకుట
మొదులుకొని,
వెన్న
ముద్ద
చేయువరకు,
చేయవలసిన
పనులన్నియు
అవసరమే.
ఆయా
పనుల
స్థితికి
తగిన
గతికే
ఈ
నామములు
కానీ,
అన్నింటిలో
ప్రధానము
వెన్నముద్దయే!
దానికొరకే
ఈ
పై
పది
విధముల
లక్షణములూ
చేయవలసి
వచ్చును.
అటులనే
ఆశ్రమ
తత్త్వసిద్ధి
కొరకే
సర్గ,
విసర్గాది
వర్ణనము.
దీనినే
శ్రుతి
ఒక్కొక్కచోట
ఒక్కొక్క
వాక్యము
చేతను,
తాత్పర్యము
చేతను,
సాక్షాద్రూపమును
వర్ణించినది"
అని
శుకుడు
తెలిపెను.
భాగవత
పురాణమును
మించిన
పురాణము
లేదు
పరీక్షిత్
మహారాజు
తిరిగి
మరొక
ప్రశ్న
నడుగ
తలంచి,
"ప్రభూ!
నా
ప్రశ్నలు
పురాణ
సంబంధము
లైనవని
శెలవిచ్చితిరి.
అటులైన,
తమరు
నాకు
యే
పురాణమును
తెలుపగోరుచున్నారు?
ఆ
పురాణములో
నుండవలసిన
దశ
లక్షణములనూ
తెలిపి
నన్నానందపరచు"మని
ప్రార్థింప,
శుకుడు
తిరిగి
వివరించుటకు
ఉద్యుక్తుడై
"మహారాజా!
వినుము.
నేను
నీకు
శ్రీమద్భాగవత
పురాణమును
చెప్ప
తలంచితిని.
అందులో
నీవు
అడిగిన
సమస్త
ప్రశ్నలకు
సమాధానములు
ఉన్నవి.
దీనికి
మించిన
పురాణము
వేరొకటి
లేదు.
అందుగల
దశ
లక్షణములలో,
మొదటిదయిన
సర్గమునకు
సరియైన
అర్థమును
తెలుపుదును.
సావధాన
మనస్సుడవై
వినుము.
2
▾
Meaning
Keep
సర్గవిసర్గాది
పురాణలక్షణ
వివరణ
సత్త్వరజస్తమోగుణములు
సమానముగనున్న,
దానిని
ప్రకృతి
యందు
మూల
ప్రకృతి
వలన
పృథివి,
జలము,
తేజస్సు,
వాయు,
ఆకాశము
పంచభూతములును,
శబ్ద,
స్పర్శ,
రూప
రస
గంధాదులును,
పంచతన్మాత్రలు
వాక్,
పాణి,
పాద,
పాయు,
ఉపస్థలను
పంచ
కర్మేంద్రియములును,
చెవులు,
చర్మము,
కన్నులు,
నాలుక,
ముక్కులను
పంచజ్ఞానేంద్రియములునూ,
మనస,
మహదహంకారములు
రెండును,
మూడు
తత్త్వము
లెప్పుడుద్భవించునో,
అపుడు
దానిని
సర్గమని
అందురు.
ఇక
రెండవ
దయిన
విసర్గమనగా,
విశేష
రూపమగు
సర్గమునకే
విసర్గ
అందురు.
చిత్ర
విచిత్ర
కర్మలోనర్చు
అసంఖ్యాకజీవుల
నుత్పత్తి
చేయుటే
విసర్గ
అందురు.
ఇది
విరాట్పురుషసంబంధము.
స్థానమనగా,
లోకమున
యే
వస్తువు
పుట్టినను,
వాటికి
కొన్ని
హద్దులు
ఏర్పరచకున్న,
ఆ
వస్తువులు
వృథా
అయిపోవును.
అందుకై
ఉత్పన్నమైన
వస్తువులకు
హద్దులు
ఏర్పరచి,
ఆ
వస్తువులు
ఆయా
హద్దులు
మీరకుండునటుల
చేయుటకే
స్థానమని
అందురు.
ఉదాహరణమున
కొకటి
తీసుకొందము.
యంత్రము
కలదు.
దానికి
తాళము
త్రిప్పిన
నడువగలదు.
కాని
దానిని
హద్దు
నడిపిననే
అది
అదుపులో
నడువగలదు.
లేకున్న
యిష్టమొచ్చినట్లు
పోయి
ప్రమాదమునకు
గురియగును.
ఇట్టి
అదుపునే
స్థానమని
అందురు.
పోషణమనగా
సులభముగా
తెలుపవలెనన్న
దైవానుగ్రహమునే
పోషణమనవచ్చును.
సృష్టి
కార్యములన్నియు
పోషణ
చేతనే
జరుగుచున్నవి.
చెట్టు
నాటి,
దానికి
తగిన
పోషణ
జరుపకున్న
అది
వృద్ధి
కాదుకదా!
తదుపరి
మన్వంతరమనగా,
యెనిమిది
జాములు
గల
రాత్రింబగలును
దినమని
పేరు.
ముప్పది
దినము
లోక
మాసము.
పండ్రెండు
నెలలు
లోక
సంవత్సరము.
ఈ
లోక
సంవత్సరము
దేవతల
కొక
దినము.
ఇట్టి
దిన
3
▾
Meaning
Keep
మూడు
వందల
అరువది
దినములైన
దేవతల
కొక
సంవత్సరము.
ఇట్టివి
వేయి
దివ్య
సంవత్సరములు
కలియుగము.
రెండు
వేలయిన
ద్వాపరయుగము,
మూడు
వేలయిన
త్రేతాయుగము,
నాలుగు
వేలయిన
కృతయుగము.
ఈ
యుగములకు
రెండు
వందలు
సంధి,
సంధ్యాంశలుగ
నుందును.
ఇట్టి
పండ్రెండు
వేల
దివ్య
వర్షములు
ఒక
మహాయుగ
మనబడును.
అట్టి
మహాయుగములు
వేయి
గడచిన
బ్రహ్మా
కొక
దినము.
బ్రహ్మా
దినములో
పదునలుగురు
మనువులు
మారుదురు.
ఒక్కొక్క
మనువు
డెబ్బది
మహాయుగములకంటే
అధికముగానే
యుండును.
ఇట్టి
దానినే
మన్వంతరమని
అందురు.
ఊతి
అనగా
కర్మ
వాసననే
ఊతి
అని
అందురు.
అనగా
పూర్వకర్మ
వాసనల
ననుసరించి
ఆయా
జన్మములు
ఎత్తవలసి
యుండును.
అంతేకాని,
భగవంతుడు
ఈ
జన్మమెత్తు,
ఆ
జన్మమెత్తు
యని
ఆజ్ఞాపించడు.
అతనికి
అందరూ
సమానులే!
భేదము
లన్నియు
వారి
వారి
కర్మలననుసరించి
కలుగుచుండును.
దీనినే
ఊతి
అని
అందురు.
ఈశానుకథ
అనగా
ఈశ్వరుని
గుణలీలలను
అతని
భక్తులైనవారలయొక్క
అనుభవకథలను
ఈశానుకథ
అని
అందురు.
తదుపరి
నిరోధ
లక్షణమన,
భగవంతుడు
తన
సమస్త
శక్తులను
ఉపసంహరించుకొని,
తనలో
లీనము
చేసుకొన్నప్పుడు
అతడు
యోగ
నిద్రను
గ్రహించును.
దానినే
నిరోధమని
అందురు.
ముక్తి
యనగా
అజ్ఞానముచే
బంధింపబడిన
జీవుని
బంధ
విమోచనము
గావించుటే
ముక్తి
అని
అందురు.
అనగా
అనాత్మ
భావమును
వీడి
ఆత్మ
భావమునందు
నిలుచుటే
ముక్తి.
ఆశ్రమమన,
ముక్తి
కూడా
ఒకానొకని
ఆశ్రయించి
యుండవలెను
కదా!
ఆశ్రయములేక
యేదియూ
నిలువజాలదు.
విశ్వమున
కంతటికినీ
పరమాత్మయే
ఆశ్రయము.
చరాచర
ప్రపంచ
మెవరి
వలన
పుట్టి
పెరిగి
నశించుచున్నదో,
అట్టి
4
▾
Meaning
Keep
పరమాత్మయే
ముక్తికి
ఆశ్రయము
కాన,
ఆశ్రయమన
పరమాత్మయే.
ఆధిభౌతిక,
ఆధిదైవిక,
ఆధ్యాత్మికముల
నెవడు
తెలుసుకొనుచున్నాడో
అట్టి
ఆత్మను
సమస్తమునకు
ఆశ్రయమని
తెలియవలెను.
అన్నింటికి
పరమాత్ముడే
సాక్షీభూతుడు
ఈ
విషయము
వినగనే
పరీక్షిత్
మహారాజు,
"ప్రభూ!
ఆధ్యాత్మిక,
అధిదైవిక,
అధిభౌతికములననేమో
తెలియజెప్పుము,"
పరీక్షిత్
మహారాజు
అడిగిన
ఈ
ప్రశ్నకు
శుకుడు
ఆనందముతో
తిరిగి
వాటిని
గురించి
చెప్పుటకు
సిద్ధమై,
"మహారాజా!
నేను
ఒక
పదార్థము
చూచుచున్నాను.
ఆ
పదార్థము
అధిభూతము.
అయితే
చూచునదేదని
నీవు
తలంచుచున్నావు?
కన్నులని
నీవు
భావించవచ్చును.
అయిన
కన్నులకు
చూచు
శక్తి
ఎచటనుండి
వచ్చినది?
చక్షువులకు
అధిష్ఠానదేవతయగు
సూర్యునినుండి;
కన్నులు
సూర్యుడు
లేక
చూడజాలవు
కదా!
చీకటిలో
సూర్య
ప్రకాశము
ఉండదు
కనుక
కన్నులు
చూడజాలవు.
కావున,
కన్నులకు
అధిదేవత
సూర్యుడు.
చక్షురాది
యింద్రియములకు
సాక్షియగు
జీవుడే
ఆధ్యాత్మ
పురుషుడు,
ఆధ్యాత్మ
పురుషుడగు
జీవుడును.
ఇంద్రియాధిష్ఠాతృదేవుడగు
సూర్యాది
దేవతలును,
ఈ
సమస్తమును
ఆధిభౌతిక
దృశ్యపదార్థములు.
ఇందులో
యే
ఒక్క
పదార్థము
లేకున్నను
మరొక
వస్తువును
తెలిసికొనజాలవు.
వస్తువును
చూచునది
కన్నులు,
జీవాత్ముని
ద్వారా.
వస్తువులు
లేకున్న
నేత్రాధిదేవతయు,
జీవుడు
ఉండియూ
చూడజాలవు.
ఈ
మూడింటికీ
పరస్పర
సంబంధము,
అన్యోన్యత
కలదు.
ఈ
మూడింటికీ
ఎవడు
సాక్షిగా
యున్నాడో
వాడే,
ఆత్మ;
ఇవే
భాగవతాది
పురాణములయందుండు
దశలక్షణములు.
ఇంకేమి
నీవు
తెలిసికొన
గోరుచున్నావో
తెలుపుము?
తప్పక
నీ
ఆనందమును
కోరి
తెలుపుటకు
సిద్ధముగానున్నాను"
అని
తెలిపెను.
అంత
పరీక్షిత్
"ప్రభూ!
పురాణము
దశలక్షణములను
అర్థము
చేసికొన
గలిగితిని,
అన్నింటికీ
ఆత్మ
స్వరూపుడగ
పరమాత్ముడు
సాక్షీభూతుడని
కూడనూ
తెలిసికొనగలిగితిని.
ఆ
సాక్షీభూతుడైన
పరమాత్ముడు
అనేక
అవతారము
లెత్తి
5
▾
Meaning
Keep
లోకమున
చరించి,
ధర్మమును
బోధించి,
తన
జన్మ,
కర్మ,
మర్మములను
తెలుపు
ఆ
లీలా
మానుష
విగ్రహుడైన
రామకృష్ణాది
అవతార
రహస్యమును
వినగోరుచున్నాను.
కాలము
తక్కువకదాయని
తలంచక,
ఉన్న
కాలమును
కథాశ్రవణముచే
పవిత్రము
చేయునటుల
ఆ
దివ్యావతార
లక్షణములను
వినిపించి
నా
తృష్ణను
తీర్చి,
తృప్తిని
కలిగించుము"
అని
ప్రార్థించెను.
అవతారముల
అంతర్
తత్త్వం
ఏకత్వమే!
శుకుడు,
"మహారాజా!
నేనును
ఆ
దివ్యావతారముల
గురించియే
చెప్ప
తలచితిని.
వినుము.
రాజా!
భగదవతారము
అన్నియు
శ్రేష్ఠమైనవే,
అన్నియూ
పవిత్రమైన
చరిత్రలే,
పూర్ణమైనవే
ఇవి
వినుటకు
ఒక
దానికంటే
ఒకటి
అధిక
రస
వాహినీలవలె,
పవిత్రములవలె
కనిపించును.
వినిపించును,
ఆనందమును
కనిపించును.
కాని,
అంతర్
తత్త్వము
ఏకత్వమే!
భిన్నత్వముకాదు.
అయితే
ఆయా
సమయ
సందర్భానుసారము,
ఆయా
కార్యకర్మల
నిమిత్తమునకు
తగిన
కాయములు
ధరించి
అవతరించును.
అయితే
మానవులకు
అందుబాటులో
ఆచరణయోగ్యమైన
అలవాట్లను
అందించి,
ఆనందమును
చేకూర్చి,
ఆత్మ
తత్త్వమును
తెలిపించు
నిమిత్తమై
వచ్చిన
రామ,
కృష్ణ
అవతారములు
మాత్రము
మానవలోకమునకు
మకుటాయమానమైనవని
చెప్పక
తప్పదు.
ఆ
రెండు
అవతారములే
నేడు
లోకమున
ఆరాధన
రూపమున
స్థానమును
పొందగల్గినవి.
మిగిలినవి
ఆయా
కార్య
నిమిత్తము
వచ్చి
అప్పటికప్పుడు
విరమించుకొన్నవి.
ఈ
రెండు
అవతారములు,
అతి
సుందర
రూపములు.
పురుషులను
సహితము
మోహింపజేయగల
దివ్యకాంతులు
ఈ
రూపమునందు
చిందులు
త్రొక్కుచుందును.
ఎట్టి
శిలా
హృదయుడైనను
ఆ
రూపములను
చూచి
మోహితులుగాక
మానరు.
బుషులు,
రాక్షసులు
సహితము,
సర్వేంద్రియముల
నిగ్రహించి,
సర్వసంగ
పరిత్యాగులై
తమ
కాయములే
తాము
మరచిన
వార
6
▾
Meaning
Keep
సహితము,
ఈ
శ్యామలవర్ణులను
చూచి
మనసుల
నిలుపుకొన
లేకపోయిరి.
అట్టి
దివ్యావతారుల
చరిత్రలు
మరెంత
దివ్యముగా,
మధురముగా
నుండునో
నే
వర్ణింపజాలను"
అని
శుకుడు
ఆనందభాష్పములు
రాల్చుచూ
కొంతసేపు
కన్నులు
మూసుకొని
ఆ
దివ్యరూపములను
స్మరించుచూ
"రాజా!
వినుము.
రామ
చరితము
వివరములు
తెలుపుచు
వెళ్ళిన,
ఇక
కృష్ణ
చరితమునకు
కాలము
చాలదు.
కాన
సంక్షిప్తముగా
నెంచిన,
ప్రధాన
విషయములనే
నీకు
అందింప
సంకల్పించితిని.
Previous
←
The Removal of Parīkṣit's Doubts
Next
The Avatāra of Śrī Rāma
→