Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Avatāra of Śrī Rāma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సరయూనదీ
తీరమున
అయోధ్యానగరమున
కౌసల్యాదశరథులకు
అవతరించిన
ఆ
రామచంద్రుడు
మిథిలా
పురాధిపతియగు
జనకమహారాజు
పుత్రికయగు
సీతను
పెండ్లాడి,
కడకు
పిత్రాజ్ఞచే
తమ్ముడగు
లక్ష్మణుని
తోడను
ప్రాణప్రియయగు
సీతతోడను
వనమునకేగెను.
అక్కడ
దశముఖుడగు
రావణుడు
సీతను
అపహరించడము,
తదుపరి
సీతాన్వేషణ
సలుపుచు
వానరాధిపతియైన
సుగ్రీవుని,
హనుమంతుని
సాయములతో
వాలిని
హతమార్చి,
సీతజాడలు
తెలిసికొని,
రావణుని
హతమొందించి
సీతను
అయోధ్యకు
చేర్చుట.
ఈ
కార్యములలో
ప్రధానమైన
ఘట్టముల
కొన్నింటిని
వివరముగా
తెలుపుదును
వినుము."
శ్రీరాముడు
సౌమ్యశీలుడు
శ్రీరామచంద్రుని
'సౌమ్య'మును
కొంత
వివరింతును.
రాజా!
ఇతను
ఆకుపచ్చ
దుస్తులను
ధరించి,
పసుపువచ్చని
పట్టుపీతాంబరము
కట్టి,
స్వర్ణమండిత
కిరీటము
పెట్టి,
సిగ్గుతో
నేలను
చూచుచు
నడుచుచుండ,
హృదయము
ద్రవించును.
రాజా!
శ్రీరామచంద్రుడు
తలయెత్తి
ఇతరులను
చూచిన
సమయమును
ఎవ్వరును
కనిపెట్టలేదు!
అతను
ఎల్లప్పుడు
లో
దృష్టే
కాని
వెలిదృష్టి
చూడలేదు.
శ్రీరామచంద్రునకి
ఎవరైనా
ఏమైననూ
నమర్పించిన,
వాటిని
పూర్తీ
అందుకొనక,
వారల
తృప్తికై
కొంతభాగము
మాత్రము
త్రుంచుకుని,
లేదా
2
▾
Meaning
Keep
తన
కరములతో
తాకి,
తిరిగి
వారలకే
వెనుకకు
అందించువాడు.
అత్తమామల
దగ్గర
సహితము
అల్లునివలె
మెలగక
పుత్రునివలె
ప్రవర్తించెడివాడు.
ఇతర
మరదండ్ర
చెంతకాని,
దాసీల
చెంతకాని
నోరు
తెరచి
మాటాడి
యెరుగడు,
కన్నెత్తి
కాంచలేదు.
తన
కంటే
పెద్ద
వారలనందరిని
కౌసల్యతో
సమానముగా
తల్లులుగా
భావించి,
చిన్నవారలను
చెల్లిండ్రుగా
తలంచి,
సమ
వయస్కులను
పిన
తల్లులుగా
తలంచెడివాడు.
అతడు
సత్యవాక్యపరిపాలకుడు,
తన
తండ్రి
ఆడినమాట
తప్పిన,
వంశమునకే
అపకీర్తి
రాగలదని
తండ్రి
గౌరవమును,
తండ్రి
మాటను
నిలబెట్టుటకై
దశరథుడు
అరణ్యమునకు
వెళ్ళమని
చెప్పకపోయినను
తన
పినతల్లియగు
కైకద్వారా
విషయములు
తెలిసికొని,
మారుమాటాడక
అధికారస్థానమైన
రాజ్యమును
సహితము
త్యాగము
చేసి,
అరణ్యములకు
బయలుదేరెను.
నోటి
మాటకు,
చేయువనులకు
ఎట్టి
వ్యత్యాసమును
లేక
సంచరించెడివాడు
శ్రీరామచంద్రుడు.
శ్రీరాముడు
శరణాగతవత్సలుడు
శ్రీరామచంద్రుడు
దయార్ద్రహృదయుడు.
శరణాగతవత్సలుడు.
రామ
రావణయుద్ధ
సమయమున
వానరులు,
రాక్షసులు
యుద్ధం
చేయుచున్నప్పుడు
వానరుల
బారికి
తాళలేక
రావణుని
దూతలు
కోతులై
వానరగుంపులతో
చేరగా
వానరులు
కనిపెట్టి,
వారలను
అనేక
విధముల
హింసించుచు
రాముని
దగ్గరకు
తీసికొని
వెళ్ళగా
వారలను
దగ్గరచేర్చి
"వానరులారా!
వీరలను
హింసించకుడు.
ఎట్టి
కపటవేషములు
ధరించియైనను,
నన్ను
శరణు
జొచ్చుటకు
వచ్చిరి.
కనుక
ఎట్టి
వారినయిననూ
శరణు
జొచ్చినవారల
రక్షించుటే
నా
దీక్ష.
వారలను
వదలిపెట్టుడు.
నన్ను
శరణుజొచ్చిన
మీరెంత
ధన్యులో,
వారును
అంత
ధన్యులు.
మీరు
నాకెంత
ప్రియులో
వారును
నాకంతటి
ప్రియులు"
అని
తన
శత్రువగు
రావణుని
స్వంత
సోదరుడైన
విభీషణుని
సహితము
తన
తమ్ముడగు
లక్ష్మణునివలె
3
▾
Meaning
Keep
చెంతజేర్చి
అతనిని
ఆదరించెను.
"నీ
వాడనని
ఒకసారి
అనిన
ఏనాడైనా
సరే
'యేలుదు
వానిన్'"
అన్నాడు
రాముడు.
శ్రీరాముడు
పుణ్యపురుషుడు
శ్రీరామచంద్రుడు
ధర్మమును
ఆచరించి,
బోధించెను,
స్థాపించెను.
సాధుసంరక్షణ
సలిపెను.
భక్తుల
బాధలను
తీర్చి,
దరిజేర్చి,
ధన్యుల
గావించెను.
శ్రీరామచంద్రునికి
ఉచ్చ,
నీచ
భేదములు
లేవు.
అతడు
సర్వ
శాస్త్ర
విశారదుడు,
వేద
శాస్త్ర
పారంగతుడు.
అనేక
కర్మకాండలను
జరిపించి,
లోకమును
ధర్మభూమిగా
మార్చిన
పుణ్యపురుషుడు
శ్రీరామచంద్రుడు.
అశ్వమేధయాగము
నౌనర్చి,
సమస్త
బుషులచేత
సన్మానింపబడినవాడు.
అతని
దయా,
ప్రేమలు
వర్ణనాతీతము.
గ్రద్ధ
జాతికి
సంబంధించిన
ఒక
నీచ
పక్షియగు
జటాయువును
ఒడిలో
నుంచుకొని,
తన
కేశములతో
దానిపై
కప్పుకొన
బడిన
ధూళిని
తుడిచి
(తనయుడు
తండ్రికి
తర్పణములు
విడిచినటుల)
ఆ
పక్షి
మరణించిన
తరువాత
క్రియాకర్మలొనర్చెను.
శ్రీరాముడు
ధర్మదేవావతారము
రామరూపమునందే
ఆ
కోమలత్వము,
సుశీలత,
సౌందర్యం,
ప్రేమలు
ఉట్టిపడుచుండును.
తన
తమ్ములగు
భరత
లక్ష్మణాదులను
ఎట్టి
ప్రేమతో
చెంతచేర్చి
ఆదరించునో,
అటులనే
వానరులను
కూడనూ
సమాన
ప్రేమతో
ఆదరించెను.
రాముడు
సాక్షాత్తు
ధర్మదేవతావతారము.
ధర్మమే
ఆ
రూపమును
ధరించినదని
మునులు
కూడ
వర్ణించిరి.
వేయేటికి?
లోకములో
సామాన్య
గృహస్థులయిన
వారల
కందరికీ
శ్రీరామచంద్రుని
కుటుంబము
ఒక
మార్గదర్శకమని
చెప్పవచ్చును.
లోకోద్ధరణకవతరించిన
ఆ
రామచంద్రుడు,
తమ్ములతో
ఎంత
అన్యోన్యతగా
మెలగిడివారో!
పట్టాభిషేకమునకు
సిద్ధముగావున్న
శ్రీరామచంద్రుని
అరణ్యమునకంపు
సమయమున
అయోధ్యా
వాసులందరూ
4
▾
Meaning
Keep
యెంతో
విలపించిరి.
కానీ
పట్టాభిషేకమునకెట్టి
ఆనందముతో
సిద్ధముగా
బయలుదేరెనో,
అదే
ఆనందముతో
అరణ్యమునకు
వెళ్ళుటకూ
సిద్ధమాయెను.
స్థితప్రజ్ఞ
లక్షణమునకు
ఇంతకంటే
వేరు
ఆధారమేమి
కావలెను?
శ్రీరాముడు
పితృవాక్యపరిపాలకుడు
ప్రాణమునకంటే
మాట
ప్రధానమని
భావించి,
తండ్రి
మాటను
నిలబెట్టుటకై
యెన్ని
బాధలనైననూ
లెక్కచేయక,
సాధించెను.
రాముని
పితృవాక్య
పరిపాలన,
లోకమునందలి
బిడ్డలకు
బుద్ధిని
నేర్పుచున్నది.
అది
కర్తవ్యమని
బోధించుచున్నది.
భర్త
తోడిదే
జీవితమని
భావించి,
ఎండ
కన్నెరుగని
ఆ
భూజాత
భయంకరారణ్యమున
భర్తతో
కాలము
గడిపినది.
భారతనారీమణులకు
యెంతటి
భావశుద్ధిని
కలిగించెను?
తోబుట్టు
ప్రధానము
కానీ,
మధ్యవచ్చిన
ఇల్లాలు
అంతముఖ్యము
కాదని
తలంచి,
లక్ష్మణుడు
ఊర్మిళను
సహితము
విడిచి,
శ్రీరామచంద్రునితో
అరణ్యమునకేగెను.
అన్నమాటను
మీరలేక
భరతుడు
భారమైన
హృదయముతో
అయోధ్యకు
వచ్చి
పరోక్ష
అరణ్యవాసమును
అనుభవించెను.
దశరథుడు
దేహభ్రాంతి,
రాముడు
ఆత్మభ్రాంతి
ఇక
దశరథుడైన
తండ్రికినీ,
కొమారుడైన
శ్రీరామచంద్రునకునూ
గల
వ్యత్యాసము
భూమి
ఆకాశమునకున్నంత
సంబంధము!
దశరథుడు
భార్యను
సంతోషపరచు
నిమిత్తము
తృప్తి
పరుపనెంచి,
యెన్ని
బాధలనైననూ
ఎదుర్కొనుటకు
సిద్ధమాయెను.
కడకు
కన్న
కుమారుడగు
రాముని
సహితము
కారడవుల
కంపెను.
ఇక
రామచంద్రుని
విషయమా?
సామాన్యుడగు
చాకలివాని
మాటలకు
ప్రాధాన్యత
యిచ్చి
సీతను
కారడవుల
కంపెను!
ఇది
ప్రజా
ధర్మములో,
5
▾
Meaning
Keep
తండ్రి
బిడ్డలకెంత
వ్యత్యాసము
కలదో
యోచించుము.
రాజా!
దశరథుడు
దేహభ్రాంతి.
రాముడు
ఆత్మ
భ్రాంతి!
అబ్బా!
శ్రీరామచంద్రుని
గుణములు
వర్ణింప
సాధ్యముకాదు.
మహారాజా!
అట్టి
పరమపురుషుని
చింతనకంటే
మించిన
పురుషార్థము
వేరొకటుండునా?
తరించుటకు
అవతార
పురుషుల
లీలలు
శ్రవణము
చేయుచుండిన
చాలును.
సర్వపాపములూ
సమసిపోవును"
అని
శుకుడు
ఆనంద
బాష్పములు
తుడుచుకొనుచుండెను.
పరీక్షిత్
మహారాజు
ఇంతలో
వికసితవదనుడై
"స్వామీ!
సర్వ
ధర్మస్వరూపుడగు
రామచంద్రుని
గుణములే
యింత
ఆనందమును
కలిగించుచుండ,
పూర్తి
లీలామానుష
విగ్రహుడగు
ఆ
శ్యామసుందరుని
చిలిపి
చేష్టలతో
చేరిన,
అంతరార్థముతో
కూడిన
ఆ
ఆట,
పాట,
మాటలెంత
మాధుర్యముగా
నుండునో!
ఆ
గోపాలుని
లీలా
గుణగణములను
వినిపించి
నా
ఈ
శేషకాలమును
ఆ
శ్యామలాంగునిలో
లయము
గావింపుము.
జన్మ
తరింప
చేయుము"
అని
ప్రార్థించెను.
Previous
←
The Purāṇas and the Avatāras
Next
The Avatāra of Śrī Kṛṣṇa
→