Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Avatāra of Śrī Kṛṣṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శుకుడు
నవ్వుచూ
"మహారాజా!
ఆ
గోపాలబాలుని
లీలలు
నిజముగా
నీవు
తెలిపినటుల
మహాద్భుతములు,
మాధుర్యములు,
భావగంభీరములతో
చేరినవే
కానీ,
బాహ్యాడంబరములతో
కూడినవి
కావు.
లోకులు
బాహ్యమునే
చూతురు;
అందువలన
కృష్ణునియొక్క
చేష్టలు
సర్వసామాన్యముగనూ,
కొన్ని
అసభ్యములుగనూ
భావింతురు.
అవతారముల
అంతరార్థములు
అందరికీ
అంత
సులభముగా
అర్థము
కావు.
అర్థములేని
కార్యమును
వారు
చేయరు.
లోకోద్ధార
నిమిత్తము,
వేదోద్ధరణ
నిమిత్తము,
పూర్వజన్మ
పుణ్య
పరిపాకములను
పురస్కరించుకొని,
వరములను
ఆధారము
చేసుకొని,
ఆయా
కాల,
దేశ
పాత్రల
ననుసరించి
అనుగ్రహింపగోరి,
ఆచరించు
లీలా
విశేషములకు
సరియైన
అర్థమెవరు
ఊహించగలరు?
శ్రీకృష్ణుని
లీలలు
అగోచరము
"హరి
విచిత్రలీల
హరికే
తెలియున్"
అన్నట్లు
అతనిది
అతనికే
కానీ,
అమూల
కర్మము
కావు.
ఒకటి
మాత్రము
నిజము.
అవతార
పురుషులు
తమ
అభీష్టములపై
కానీ,
తమ
కొరకని
కానీ,
ఎట్టి
చిన్న
కార్యమునూ
చేయుటకు
పూనుకోరు!
సమస్త
కర్మలూ
లోక
నిమిత్తమై
సంకల్పింతురు!
తమకూ
లోకమునకూ
ఎట్టి
సంబంధమూ
లేనటుల
ప్రవర్తింతురు.
తాము
లేకున్న
లోకమే
లేదు.
సర్వ
సామాన్యముగ
వారు
చేయు
సామాన్య
పనులయందు
కూడనూ
2
▾
Meaning
Keep
స్వార్థరహితమైన
సారమును
తెలుసుకొనవచ్చును.
లోకమే
వారి
హస్తమందుంచుకొన్న
మహానుభావులకు
లోకములో
తమకు
కావలసిన
పని
యేమున్నది?
మూర్ఖులు,
విశ్వాసహీనులు,
నాస్తికులు,
అజ్ఞానులు,
తెలుసుకోలేని
అమాయకులు
వాటిని
స్వార్థ
కర్మలుగనూ,
వ్యామోహ
కృత్యములుగనూ
తలంతురు
కానీ,
సత్యభక్తులు
వాటిని
లీలగా
భావింతురు.
అపారుని
పారమును
వారెట్లు
తెలుసుకొనగలరు?
మహారాజా!
కోసలేంద్రుని
లీలలకునూ,
కృష్ణుని
చర్యలకునూ
పూర్తి
విరుద్ధము.
దైత్య
దానవులచే
లోకము
పీడింపబడు
సమయమున,
దాని
భారమును
బాపుటకు,
కేశములలో
నలుపు
తెలుపు
ఉండినటుల,
కృష్ణ
బలరాములు
నలుపు,
తెలుపు
రూపములు
ధరించి,
మన
బుద్ధుల
కతీతమగు
కర్మల
నొనర్చిరి.
కృష్ణుని
లీలలు
ఎవ్వరునూ
తెలిసికొనలేరు.
అతని
చలనము,
నడక,
నవ్వు,
సైగ,
మాట,
పాట
అన్నియూ
విచిత్ర
గుణములతో
చేరియుండును;
కృత్రిమముగా
కనుపించును.
పోకిరిగా
ప్రవర్తించును.
తూర్పు
దిశకు
నడుచుచూ,
పశ్చిమ
దిశకు
చూచుచుండును.
కన్నులతోనే
కలిసి
మాట్లాడును;
కను
సైగల
తోడనే
సంభాషించును.
సిగ్గూ
బిడియము
చూడడు.
క్రొత్త,
పాత
అసలే
ఉండదు.
వావివరుసలు
విచారించడు.
ఎక్కడకు
వెళ్ళిననూ,
ఎదియో
ఒక
విచిత్రమైన
గోల
పుట్టించును.
సముద్రమునకు
ఆటు,
పోటు
నన్నట్లు,
ఇతను
వెళ్ళిన
చోటులందు
కలహములు,
కల్లోలములు,
కంటినీరులు
ఒక
తుఫానుగా
పుట్టించును.
శ్రీకృష్ణుని
స్వతంత్ర
ప్రవృత్తి
యే
ఇంటికి
వెళ్ళిననూ
ఆ
యింటివారు
అతనిని
పీటవేసి
పిలువ
నక్కరలేదు.
తన
యిల్లుగా
భావించి
ఉట్టి
మీదనో,
చట్టి
లోపలో
దాచిననూ
సరే!
స్వయముగా
వెళ్ళి,
నిర్భయముగా
తీసుకొని
తిని
వెళ్ళుచుండును.
3
▾
Meaning
Keep
అందరికీ
పాత
బంధువే!
అంతటితో
పోక,
తన
సొత్తువలే
బైటనుండి
వచ్చిన
బాలురకు
పంచిపెట్టును;
ఇంటివారు
గోలచేయుచున్ననూ
వినిపించుకొనక,
తన
స్వంత
పదార్థములవలె
దానధర్మాలు
చేయును.
అతని
ఆటలకూ,
మాటలకూ
అడ్డులేదు.
ఎవరైనా
అతనిని
ధైర్యముచేసి
మందలించిరా,
ఇక
వారిని
పెట్టు
హింసలు
వర్ణనాతీతము!
అయితే
అతడు
చేయు
ప్రతి
చిన్నపనియందు
అతి
మాధుర్యము
ఇమిడి
యుండును.
శిక్షలందు
కూడనూ
తీయదనమునుండును.
ఎవ్వరికీ
కోపమనునది
రాదు.
ఇంకనూ
అతనితో
ఆడవలెననియే,
మాటాడవలెననియే,
ఉండవలెననియే
అనిపించును.
కానీ,
అతడెన్ని
బాధలు,
హాస్యములూ
చేసిననూ
అతనిపై
విసుగెత్తదు.
శ్రీకృష్ణుని
మధుర
ప్రేమతత్త్వము
అది
అతనిలో
వుండిన
ప్రేమతత్త్వము.
ఎంతో
కోపముతో
కొట్టబోయిన
గోపికలు
కూడనూ
అతనిని
చూచిన
తక్షణమే
ప్రేమ
హృదయులై
అతనిని
ప్రార్థించుచూ
వెళ్ళుచుందురు.
అతడు
ఏమి
చేసినా
లీలలుగానే
వుండును.
ఇక
పలుకులు
చూతుమా!
అన్నీ
టక్కరే!
అందరి
యెదుటా
మన్ను
తిని
అమ్మతో
నే
తినలేదని
నోరు
చూపును.
అందరి
మాటలూ
అసత్యములు
చేసి,
తన
అసత్యమును
కూడా
సత్యముగా
చూపును.
ప్రతిదినమూ
వృషభాపురమునకు
(అనగా
రాధ
ఉండు
గ్రామమునకు)
వెళ్ళుచుండును.
దారిలో
ఎందరో
చూచుచుందురు.
తిరిగి
తల్లి
పిలిచి,
ఎందుకురా,
ఇంత
దూరము
దినమూ
వెళ్ళుట?
ఆడుకొనవలెనన్న
ఇచట
బాలురు
లేరా?
అని
దండించగా,
ఆ
గ్రామము,
దారియు
తెలియదని
చెప్పును.
అందరి
ఇండ్లయందూ
అల్లర్లు
జరిపి,
అత్తకోడండ్లకు
పోట్లాటలు
పెట్టి,
మధ్యలో
నవ్వుచుండును.
తెల్లవారినది
మొదలు
రాత్రి
పరుండు
వరకూ,
నిమిషము
కూడా
రెండు
కాళ్ళూ
ఒకచోట
వుంచడు.
నిరంతరం
ఇల్లు
యిల్లు
చుట్టుటే
ఈ
కృష్ణుని
కృత్యము.
4
▾
Meaning
Keep
ఇంత
చేసినా
ఒక
నిముషము
గ్రామమువారు
కృష్ణుని
చూడకున్న
వుండలేరు.
ఒకనాడేమైనా
వారల
ఇండ్లవైపునకు
వెళ్ళకున్న
ఆనాడంతా
ఆ
గోపికలు
దారులు
చూచుచూ
కిటికీలనుండీ,
మిద్దెలమీదనుండీ
ఎదురు
చూచుచుందురు.
ఇదే
భగవంతునిలోని
మధుర
ప్రేమయొక్క
మచ్చుముక్క,
అతని
చేష్టలు
అతి
మధురమైనవి.
అంతరార్థముతో
నిండినవి.
నిజ
కపటము
లెరిగిన
నీలవర్ణుడు
కృష్ణుడు.
పైపై
మాటలకూ,
ఆటలకూ
లొంగడు.
పొంగడు.
కాకున్న
పాలిచ్చెదనని
తల్లి
రూపముతో
వచ్చిన
పూతనను,
కొడుకువలె
నటించి,
రక్తమును
పీల్చి
నేలకూల్చెను.
అసురులు
అనేక
రూపములు
ధరించి,
గోపికా
గోపాల
రూపములతో
వచ్చిననూ,
వారల
నిజ
తత్త్వమును
గుర్తించి,
క్షణములో
యమపురి
కంపుచుండెను.
ఒక
అసురుడు
వత్సయై
తన
వత్సములతో
తిరుగుచుండ
ఆ
ముక్కుపచ్చలారని
మూడు
సంవత్సరముల
బాలుడు
ఆ
వత్సమును
తోకపట్టి
గిర్రునత్రిప్పి
ఒక్క
యేటుతో
చంపివేసెను.
శ్రీకృష్ణుని
అద్భుత
అమానుష
కృత్యములు
ఈ
శక్తి
సామర్థ్యములు
ఆ
బాలుని
రూపమున
కెంత
విరుద్ధములు?
ఇట్టి
అమానుష
కృత్యములు
కోట్లకు
నిరూపించుచూ
వచ్చుచుండెను.
కపట
హృదయులైనవారు,
స్త్రీ,
బాల,
వృద్ధులైననూ,
కడకు
తనవారైననూ
లెక్కచేయక
చక్కని
బుద్ధులు
నేర్పుచూ,
చిక్కులకు
గురిచేయుచూ,
డొక్కలు
చించుచూ,
ప్రక్కలు
పొడుచుచూ
తన
మేనమామ
అయిన
కంసుడు
మహా
పరాక్రమ
శక్తి
సంపన్నుడైననూ
క్షణములో
జుట్టునుపట్టి
క్రిందికిలాగి,
ప్రాణము
తీసి,
యమునాతీరము
వరకూ
బజారులందు
ఈడ్చుకొని
పోయెను.
మధురాపుర
వాసులకు
ఈ
బాలకుని
చర్యలు
ఆశ్చర్య,
అద్భుత,
మధుర,
సుందర,
సులలితముగా
నుండెడివి.
బాల్యముననే
పూతనను,
తృణావర్తుని,
శకటాసురుని
హతమొందించెను.
వెన్న
దొంగిలించెను.
కోపముతో
తల్లి
రోటికి
కట్టి
వేయగా
యములార్జున
5
▾
Meaning
Keep
వృక్షముల
మధ్యగా
బోవుచు
వాటిని
పెల్లగించెను.
యమునా
నదినంతను
విషమయముగా
జేసిన
కాళింగుని
మదమణచెను.
గోపికలను
రక్షించెను.
తల్లి
నడుమునకు
త్రాడుకట్టగా
తన
బ్రహ్మాండాకారమును
చూపి
తల్లిదండ్రులకూ
గోకుల
వాసులకు
పరమాశ్చర్యము
కలిగించెను.
ఆవలింపులో
అండాండ,
పిండాండ,
బ్రహ్మాండములు
చూపెను.
తన
ప్రియ
గోపాల
గోపికలకు
తన
దివ్య
గోలోక
వైకుంఠమును
చూపించెను.
నందునిచే
గిరిపూజ
చేయించి,
ఇంద్ర
పూజ
మాన్పించి,
ఇంద్రునకు
కోపమొచ్చునటుల
చేసి,
క్రోధముచే
ఇంద్రుడు
కురిపించిన
రాళ్ళవర్షము
నుండి
గోకులవాసులను
రక్షించుటకు
చిటికిన
వ్రేలితో
పర్వతమును
యెత్తి,
వాన
బారినుండి
గోకులవాసులనూ,
గోవులనూ
రక్షించెను.
రాసక్రీడలు
గోపికలను
తరింపజేయు
కార్యములు
గోపిక
గోపాలురతో
వివిధములైన
ఆటలు
ఆడి,
పాటలు
పాడుచూ,
వారలను
ప్రేమోన్మత్తులను
గావించుచుండెను.
వీటన్నింటినీ
నీచవృత్తులుగా
తీసికొనుట
బుద్ధిహీనతే
కదా!
గోపికలతో
రాసక్రీడల
నాడగా,
అది
జారత్వమని
తలంచుటకు
ఆధారమే
లేదు.
అయిదు,
ఆరు
సంవత్సరముల
ప్రాయముగల
బాలుడు
గోపికలతో
యెట్టి
ఆటలాడినా,
అవి
లోక
విరుద్ధమని
తలంచుటే
అర్థములేని
ఊహ!
గుణాతీతుడగు
గోపాలునికి
గుణమున్న
కదా
ఈ
కృత్యముల
యొక్క
అనుభవముల
ననుభవించుట?
గుణమే
లేని
అనంత
స్వరూపునికి
అణుమాత్రమైన
ఈ
లీలలు
గోప
గోపికలను
తరింపజేయు
సాధన
కృత్యములనియే
తలంచవచ్చును.
వారి
జన్మాంతర
పుణ్యఫలముచే,
వర
ప్రసాదములచే,
వారి
వాంఛలను
తీర్చుచుండునే
కానీ,
వేరు
కాదు.
మాయా
మానుషరూపుడైన
ఆ
గోపాలుడు
మానవ
మాత్రుడని
తలచిన
కదా!
ఇందులోని
చర్యలు
జారత్వ,
చోరత్వమని
చెప్పుటకు?
పోనీ,
మానవుడే
అని
తలంచిన
సామాన్యమానవులు
ఈ
అమానుష
చర్యలు
చేయగలరా?
6
▾
Meaning
Keep
శ్రీకృష్ణుని
రాక్షస
సంహారం
లోక
రక్షకం
ఇంతటితో
పోక,
ప్రలంబ,
ధేనుక,
బక,
కేశి,
చాణూర,
అరిష్ట,
ముష్టిక,
కువలయాపీడ,
కంస,
నరక,
పౌండ్రక,
ద్వివిధ,
జరాసంధ,
దంతవక్ర,
శంబర,
కాంభోజ,
కురు,
మత్స్య,
కైకయ
యిత్యాది
మహా
పరాక్రమ
శక్తి
సంపన్నులను
క్షణములో
ప్రాణములు
తీసి,
లోకమును
రక్షించెను.
ఇవి
మానవ
కృత్యములనుటకు
వీలున్నదా?
ఈ
విలక్షణావతారములో
లీలలన్నియూ
మహాద్భుతములు.
క్రోధములో
సహితము
అతని
ప్రేమే
ప్రకటితమగుచుండెను.
శృంగారములో
అతడు
కరుణాప్రవంతిని
ప్రవహింప
జేసెను.
అతని
దర్శన,
స్పర్శన,
సంభాషణములతోడనే
సంసార
బంధమునుండి
విముక్తి
గావించెను.
అతని
నామమును
స్మరించువారలకు
అమరత్వము
ననుగ్రహించెను.
పైకి
గోచరించే
విచిత్ర
చర్యలయందు
దివ్యరసము
నాస్వాదింపచేసెను.
అవతార
కథలన్నియు
భాగవతమే!
మహారాజా!
భాగవతమున
కేవలము
మధుర,
బృందావన,
వ్రేపల్లె,
యమునాతీరము,
యశోదా,
నంద,
దేవకీ,
వసుదేవుల
కథలతోచేరినదే
కాదు.
అవతారముల
కథల
నన్నింటినీ
భాగవత
కథ
అనియే
చెప్పబడును.
అనగా
భగవంతుడు
భక్తులు
చేరిన
తత్త్వమన్నింటికీ
భాగవత
కథ
అనియే
పేరు.
అన్ని
అవతారములు
గోలోకవాసియైన
గోపాలుని
నుండియే
వచ్చినవి.
అన్నింటి
అవతారముల
ఏకమాత్రావతారము
వాసుదేవుడైన
శ్రీకృష్ణుడే.
అన్ని
అవతారముల
కథలూ,
వాసుదేవునియందే
పుట్టి,
వాసుదేవునియందే
లయమగుచున్నవి.
సమస్త
అవతారములకేకాక,
సమస్త
జీవరాసులకు,
ఆ
దివ్య
శక్తియే
ఆధారము.
దశావతారములు
మహారాజా!
భగవంతుడు
సర్వసమర్థుడు.
అతనికి
సంభవ
అసంభవములు
లేవు.
అతని
మాయ,
క్రీడ,
లీల,
వినోదములను
మాటలతో
తెలుపుటకసాధ్యము.
7
▾
Meaning
Keep
అతడపురూపుడయ్యా
విరాడ్రూపమును
ధరింపగలడు.
అతనొక్కడయ్యా
అనేక
రూపములలో
విభక్తుడు
కాగలడు.
రాజా!
మత్స్య,
కూర్మ,
వరాహ,
నారసింహ,
వామన,
పరశురామ,
రామ,
కృష్ణ,
బుద్ధ,
కల్కి
అవతారములే
తన
దివ్యావతారములుగా
లోకులు
భావింతురు.
అది
అంత
విశాలము
కానేరదు.
సమస్త
ఆకారములు
అతనివే!
సర్వజీవులయందలి
చైతన్యమూ
అతని
శ్వాసయే.
వేయేటికి?
గోచరమగుచున్న
సమస్త
ప్రపంచము
అతని
సంకల్పమాత్రమే,
అతడు
కానిదొక్కటియునూ
లేదు.
అయితే
లోక
సంరక్షణార్థం,
ధర్మస్థాపనార్థం,
భక్తుల
అభీష్టార్థం
తానే
స్వయముగా
సంకల్పించి,
ఒక
ప్రత్యేక
ఆకారమును
ధరించి,
లోకమున
సంచరించి,
దివ్యవిభూతులను
ప్రదర్శించి,
భక్తులకు
దివ్యానుభూతుల
ననుగ్రహించి
తరింపచేసిన
స్వరూపములు
పై
తెలిపిన
దివ్య
స్వరూపములగుటచేత,
లోకులు
ఈ
స్వరూపములు
మాత్రమే
అవతార
స్వరూపములని
విశ్వసించి,
పూజించి,
తరించుచున్నారు.
శ్రీకృష్ణుని
అంశావతారములు
"కొన్ని
కొన్ని
సమయములందు,
కొన్ని
అత్యవసర
కార్యముల
నిమిత్తమై
అవతరించి,
లోకపాలన
నిమిత్తము
దివ్యశక్తులను
వహించి,
అంశరూపములందు
కూడనూ
అవతరించిన
వెన్నియోకలవు"
అని
శుకమహర్షి
తెలుపుచుండగనే,
పరీక్షిత్
మహారాజు
ఆనందవదనమును
పైకెత్తి,
"ఆహా!
ఆ
సుందరమూర్తి
అంశమూర్తులను
వేరే
ధరించెనా?
ఆ
లీలావతారుడు
లోకపాలనమొనర్చ
యేయే
రూపధారి
అయ్యెనో
వచించి,
నన్నానందింపజేతురని
ప్రార్థింతును"
అనుచూ
శుకులవారికి
నమస్కరించెను.
అంత
శుకులవారు,
"రాజా!
వినుము,
కపిల,
దత్తాత్రేయ,
సనక,
సనంద,
సనత్కుమార,
సనత్సుజాతాది
మునుల
రూపమును,
నరనారాయణులు,
బుషభ,
విష్ణు,
ధ్రువ,
హయగ్రీవ,
పృథు,
కచ్ఛప,
ధన్వంతరీ,
హంసకుడు,
బలరామ,
వ్యాస
మొదలగు
రూపనామములతో
భక్తాభీష్టములనొసగి,
లోకపాలన
జరిపి,
8
▾
Meaning
Keep
ధర్మకర్మల
స్థాపించెను,
పునరుద్ధరించెను;
ఇంకనూ
అనేక
అంశావతారములు
కలవు.
కానీ,
వాటన్నింటినీ
గురించి
చెప్పుటకు
కాలవ్యవధి
అతి
స్వల్పమే
మిగిలియున్నందుననూ,
అవి
అంత
ప్రధానమయిన
అంశములు
కానందుననూ,
వాటిని
తెలుపుటకు
సమ్మతించనైతిని"
అని
చెప్పిరి.
అంత
పరీక్షిత్
మహారాజు,
"స్వామీ!
కపిల,
ధ్రువ,
దత్తాత్రేయ,
హయగ్రీవ,
ధన్వంతరి
మొదలగు
అవతారముల
కారణము
వాటి
ప్రధాన
తత్త్వములు,
సూత్ర
ప్రాయముగానైననూ
తెలిపి
పునీతుని
గావించుడు"
అని
ప్రార్థించగా,
శుకుడు
"రాజా!
కర్దమప్రజాపతి
భార్యయగు
దేవహూతికి
తొమ్మండుగురు
పుత్రికలు
కలిగిన
తరువాత,
పదియవ
గర్భమున
కపిల
రూపమున
అవతరించి
తల్లికే
తాను
గురువై,
తల్లిని
శిష్యురాలుగా
తీసుకొని
మోక్ష
ప్రదముగు
తత్త్వమును
గూర్చి
బోధించి,
ఆత్మ
జ్ఞానమును
అనుగ్రహించెను.
ఇక
అత్రిపత్ని
అయిన
అనసూయ,
భగవంతుడు
తన
గర్భమున
పుత్రరూపుడై
పుట్టవలెనని
కోరగా
అనుగ్రహించి,
దత్త
అనగా
(ఇచ్చితిని)
అని
మాటిచ్చుటయు,
తదుపరి
భగవంతుడు
అత్రి
అనసూయలకు
పుత్రుడయి
ఆనందమందించుటయు
జరిగెను.
భగవంతుడు
మొదట
అనుగ్రహపదము
'దత్త'
అని
పలుకుటచేత
తండ్రి
పేరును
చేర్చి
దత్తాత్రేయ
అను
నామముచే
పిలువబడెను.
కార్తవీర్యార్జునుడును,
యదువును,
రాజ్యసుఖాదుల
ననుభవించుచుండిననూ,
వారలకు
ఇతను
సమస్త
యోగ
సంపత్తి
నొసగెను.
ఈ
రూపుడైన
పరమాత్ముడు
కల్పాదియందు
సనక,
సనందన,
సనత్కుమార,
సనత్సుజాతులను
పేర
దిగంబర
రూపధారులై
సంచరించెను.
వారు
ఎల్లప్పుడు,
అనగా,
ఎపుడు
చూచినను
ఐదు
సంవత్సరముల
వయసుగల
కాయులై
కనిపించుచుండిరి.
ఇక
ధర్మపత్నియగు
మూర్తిదేవియందు
నరనారాయణ
రూపమున
పుట్టి
పెరిగి,
బదరీవనమున
నివసించుచు,
బాలకుడైన
ధ్రువుని
తపస్సునకు
మెచ్చి,
అతనికి
దర్శనమిచ్చి,
ధ్రువుని
తల్లి
దండ్రులను
పునీతులను
గావించెను.
ధ్రువుని
9
▾
Meaning
Keep
ధ్రువలోకాధిపతిగ
చేసెను.
ఉత్పథగామియగు
వేనుని
మునులు
అనేక
విధముల
శపించి
చంపగా,
అతని
శరీర
మంధనమున
పృథ్వీశ్వరుని
రూపమున
పృథు
చక్రవర్తి
ఉత్పన్నమై
నరకమున
పడి
పరితపించుచున్న
తన
తండ్రిని
ఉద్ధరించెను.
అంతటితో
ఆగక,
సమస్త
ఉర్వినీ
సముద్ధరించెను.
భూమియందు
నగరములు,
పట్టణములు,
గ్రామములు
నిర్మించి,
తమతమ
కార్యములు
సక్రమముగా
నిర్వర్తించుకొనునట్లు
శాసించెను.
నాభి,
సుదేవి
అనుదంపతులకు
పరమహంస
రూపుడై
పుట్టి
త్యాగమును
బోధించి,
త్యాగమహిమను
ప్రకటించెను.
తదుపరి
బ్రహ్మయజ్ఞమునందు
యజ్ఞరూపమున
అవతరించెను;
అతని
గ్రీవోపరిభాగమున
గుర్రమాకారముండుటచే
హయగ్రీవుడని
పిలువబడెను.
అతడు
శ్వాసించుచుండిన
నాసికాపుటముల
ద్వారా
వేద
వాక్యములు
ప్రకటమగుచుండెను.
ఇది
యిట్లుండ,
బయలుదేరిన
వేదములను
సోమకాసురుడను
రాక్షసవీరుడు
అపహరించి,
ప్రళయసాగరమున
దాగుటచే,
వేదసంరక్షణ
నిమిత్తమై
భగవంతుడు
మత్స్యరూపమును
ధరించి,
సాగరమును
శోధించి,
రాక్షసుని
హతమార్చి,
వేదములను
తెచ్చి
బ్రహ్మ
కిచ్చి,
లోకమున
వేదవిహిత
ధర్మ
కర్మలను
ఉద్ధరించెను.
హరియొక్క
చిత్రలీలలు
హరికే
తెలియును
మహారాజా!
ఇట్టి
సమయోచిత
అవతారములు
లెక్కలేనన్ని
ధరించి,
భూమిని
వరించి,
బాధలహరించి,
భక్తులననుగ్రహించిన
గాథలెన్నియో
గలవు.
సర్వమూ
అతని
సంకల్పమేకాని,
కారణములు
విచారించుట
కేవలము
అజ్ఞానమే!
భగవంతుని
సంకల్పములకు
కారణములు
విచారించువారూ
లేక
అతని
శక్తి
యుక్తులకు
హద్దులు
నీమించువారు,
దైవము
ఈ
రీతిగనే
మెలగవలెనని
శాసించువారూ,
ఇట్టిదే
దైవతత్త్వము,
ఇట్టిదికాదు
అని
నిర్ణయించువారు
కేవలము
మూర్ఖులనియే
చెప్పవచ్చును.
అతని
ఇచ్చకు
అడ్డు
వుండదు.
అతని
శక్తికి
మితి
లేదు.
సంకల్పించిన
యేమైననూ
చేయగలడు.
ఏ
రూపమునయిననూ
ఎత్తగలడు.
అతనికి
అతనే
సాటి.
అతనికి
అతనే
సాక్షి.
10
▾
Meaning
Keep
ఒకానొక
సమయమున
నారదుని
భక్తి
భావములకు
మెచ్చి
హరి,
హంసరూపమున
అవతరించి,
భక్తులు
భవసాగరమును
తరింప
భాగవత
తత్త్వోపదేశముగావించి,
మన్వంతరాంతము
వరకు
సుదర్శనమును
ధరించి,
నిష్కంటక
శాసనము
గావించెను.
తన
కమనీయ
కీర్తిచే
సప్తలోకములు
పరిశుద్ధము
గావించెను.
సముద్ర
మంధన
సమయమున
కూర్మావతారమును
ధరించెను
కదా!
అదే
సమయమున
అమృతభాండమును
ధరించి,
భగవానుడు
ధన్వంతరిగా
అవతరించి,
రోగ
నివారణోపాయములను
ప్రజలకు
నేర్పి,
మానవులను
చికిత్సకులుగా
చేసెను.
వారే
వైద్యులనియు,
భిషగ్వరులనియు,
చికిత్సకులనియు,
లోకమున
ప్రసిద్ధికాంచునట్లు
చేసెను.
రాజా!
ఇంతే
కాదు,
వైద్యులకు
పూర్వము
యజ్ఞ
భాగములు
లేకుండెడివి.
తదుపరి
ఇతనే
వారలకు
యజ్ఞభాగము
లిప్పించెను,
చూచితివా!
దైవ
లీలలు.
హరి
యొక్క
చిత్రలీలలు
హరికే
తెలియును.
అన్యులకు
అర్థము
కావు.
ఊహించుటకు
కూడనూ
వీలు
కాదు.
మానవులు
అజ్ఞాన
వశులగుటచే,
వారి
వారి
బుద్ధి,
శక్తి
సామర్థ్యములను
పురస్కరించుకొని
వాగ్వాదములు
జరిపి,
లేని
పాపములకు
గురియగుదురు.
దైవ
కార్యములను
సంశయించక,
మానవులు
వారివారి
ఊహలకు
తగినట్లుగా
వాటిని
మార్చుకొనక,
తమ
భావములనే
ఆ
దైవ
కార్యములకు
తగినట్లు
మార్చుకొన్న,
అట్టి
మానవులు
దైవానుగ్రహమును
పొందగలరు.
కానీ
అట్లు
చేయరేని
అనుగ్రహపాత్రులు
కానేరరు.
ఆనందమును
అందుకోలేరు.
శ్రీకృష్ణావతారము
చిత్తాకర్షణము
ఇక
మధురమూర్తియైన
కృష్ణావతార
తత్త్వము
చిత్తాకర్షణము.
ఆ
సౌందర్య,
మాధుర్య,
ప్రేమ
ఘనీభూతమగు
ఆ
విగ్రహము,
ఆనందరాశి,
గుణసాగరము.
ఆహ!
అతని
అమాయకత్వ
మెంతటిది!
అతని
అమానుష్యము
మరింత
గొప్పది.
అతనిని
చూచిన
చాలును,
అతని
వాక్కులు
వినిన
చాలును,
అతనిని
తాకిన
చాలును,
జన్మము
తరించును.
యజ్ఞయాగాది
క్రతువులు
ఈ
11
▾
Meaning
Keep
దర్శన,
స్పర్శన,
సంభాషణముల
ప్రాప్తి
అని
చెప్పవచ్చును.
ఈ
పవిత్ర
దర్శన,
స్పర్శన,
సంభాషణలలో
వున్న
ఫలము
యజ్ఞయాగాది
క్రతువులలో
లేదు,
లేదు.
ముమ్మాటికిని
లేదు.
ఆహా!
మధుర
మూర్తీ!"
అనుచు
శుకుడు
కంటిధారలు
కార్చుచు
తన్మయాత్ముడై
కృష్ణరూపమున
ఉన్మత్తచిత్తుడై
లీనమాయెను.
ఆ
దృశ్యమును
చూచుచుండిన
మునులు,
పరీక్షిత్
మహారాజు
పరమాశ్చర్యమొంది.
శుకుల
వారి
ఆ
భావసమాధికాంతులు
భ్రాంతి
కలిగించెను.
అందరూ
స్తంభించి
పోయిరి.
ఈ
రీతిగా
కొంత
గడచిన
తరువాత
శుకుడు
కన్నులు
తెరచి,
"రాజా!
ఆనాటి
గోప,
గోపిక
ఎట్టి
అదృష్టవంతులో
కదా?
అతనితో
కూడి,
ఆడి,
పాడి,
ఆనందించిన
వారి
కాయములెంత
కాంతివంతములో!
దేవతలకు
సహితము
లభ్యము
కాని
అతని
సన్నిధి
ఆ
వెర్రిగొల్లలకు
లభించెనన,
యిదివారల
జన్మాంతర
సుకృతమనే
చెప్పవచ్చును.
గోప,
గోపికలేమి
సామాన్యులు
కారు.
చూపరులకు
వెర్రివారలవలే
కనిపింతురు.
వారిలోని
జ్ఞానభండారము
ఆ
కృష్ణునికి
తప్ప
అన్యులకగోచరము.
కాకున్న
కృష్ణ
స్పర్శ
రుక్మిణీ,
సత్య
భామలకే
అంత
సులభముగా
లభించలేదు.
అట్టిది
గోపగోపాలురు
వారలకంటే
మహా
భాగ్యశాలురనే
చెప్పవచ్చును.
ఇది
మూడు
జన్మల
తపః
ఫలము"
అని
కన్నులు
మూసుకొని
చిరునవ్వులు
పెదవులపై
చిందులాడ,
శుకుడు
తిరిగి
సమాధిలో
మునిగెను.
ఈ
రీతిగా
ఆ
కృష్ణ
రూపమును
వర్ణించు
సమయములందు
శుకుడు
సమాధి
స్థితిని
పొందుట
పరీక్షిత్
మహారాజునకు
పరమాశ్చర్యము
కలుగుచూ,
తాను
కూడనూ
ఎంతో
ఉత్సాహముతో
కృష్ణ
చర్యలను
వినగోరి
ఉవ్విళ్ళూరుచుండెడివాడు.
Previous
←
The Avatāra of Śrī Rāma
Next
Gopāla — the Gopas and the Gopikās
→