Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Gopāla — the Gopas and the Gopikās
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
35.
గోపాలుడు
-
గోప,
గోపికలు
మధ్య
మధ్య
పరీక్షిత్
మహారాజు
కృష్ణలీలలయందు
పరవశుడగుచూ
కొన్నింటిని
నమ్మలేక
పోయెడివాడు.
అట్టి
సంశయములు
హృదయమున
చేరినంతనే,
భరించలేని
బాధతో
నిర్ణయించలేని
స్థితిలో
శుకుల
వారిని
అడిగి
అందుకు
తగిన
సమాధానమును
అందుకొని
వూరడిల్లెడివాడు.
ఈ
రీతిగ
జరుగుచుండ
ఒకపరి,
గోపికా
భక్తిపై
కొంత
తీవ్రమైన
సంశయము
చెలరేగి,
తనలో
తాను
ఎన్ని
విధముల
సమాధానములు
తెలుపుకొన్ననూ
తృప్తి
కలుగక,
శుక
మహర్షుల
ప్రశ్నించను
ధైర్యము
చాలక,
లోలోన
కుములుచున్న
స్థితిని
శుకుల
వారు
గమనించి,
చిరునవ్వుతో
"మహారాజా!
నీ
చిత్తమున
ఏదియో
ఉన్మత్తము
చెలరేగినటుల
కనిపించుచున్నది.
ఈ
సమయమున
ఈ
విధముగా
బాధ
పడుట
ఏ
మాత్రమూ
శుభము
గాదు.
నీకు
తెలియని
విషయమేదైననూ
ఉండినచో,
నన్నడుగు.
తప్పక
నీ
సంశయముల
తీర్చి
సంతస
మందింతును"
అని
పరీక్షిత్తునకు
ధైర్యము
కలుగజేసెను.
రాసక్రీడలలోని
అంతరార్థం
పరీక్షిత్
మహారాజు,
"స్వామీ!
తాము
త్రికాలజ్ఞానులు.
నా
అంతర
సందేహమును
తీర్చు
సర్వ
సమర్థులు.
కనుక,
నన్ను
వేరుగా
భావించక
తగిన
సమాధానమిచ్చి
నా
తాపమును
చల్లార్తురు
గాక!"
అని
నమస్కరించి,
"స్వామీ!
గోపికా
కృష్ణుల
రాస
క్రీడలు,
బృందావన
లీలలు
అనేక
విధముల
వినియుంటిని.
2
▾
Meaning
Keep
అవి
సామాన్య
మానవుల
విషయానంద
క్రీడలుగ
తోచుచున్నవి,
ఇవి
నిజముగా
జరిగియే
యుండిన
ఇట్టివి
దైవలీలలని
ఎట్లు
చెప్ప
సాధ్యమగును?
ఇట్టి
చర్యలు
లోకవిరుద్ధము
కదా!
అందునా
బృందావనమునందునూ,
యమునా
తీరమందునూ
స్వేచ్ఛగా
విహరించిన
విషయ
సంబంధమైన,
మోహ
సంబంధమైన,
కామ
సంబంధమైన
ఈ
చర్యలతో
కృష్ణుని
భగవత్తత్త్వములకు
కొంత
కళంకము
కాదా?
గుణాతీతులకే
మోక్షప్రాప్తి
కలుగునని
తెలుపుచూ
గుణములతో
ఇంద్రియానందమును
అందుకొన్న
గోపికలకు
మోక్షము
లభించెననుట
ఆశ్చర్యమేకాక,
హాస్యముగా
కూడనూ
తోచుచున్నది,
ఇట్టి
ధర్మ
విరుద్ధమైన
చర్యలలోని
అంతరార్థ
మేదైనా
ఉండిన
తెలిపి
నన్నానందింప
జేయుడు"
అని
ప్రార్థించెను.
శుక
మహాబుషి
పక్కున
నవ్వి,
"మహారాజా!
యిది
నీకు
కలిగిన
సందేహము
కాదు,
కృష్ణుడు
సాక్షాత్
భగవంతుడని
తెలిసికొన్నవారలకు
ఇట్టి
సందేహములు
కలుగుటకు
వీలులేదు.
కేవలము
ఇది
ద్వాపర
యుగాంతము.
కలి
ప్రారంభము.
కనుక,
కలి
నీలో
చేరి
యిట్టి
సంశయముల
చెలరేగించినదని
తోచుచున్నది.
కాకున్న,
కృష్ణుడు
సాక్షాత్తు
సర్వేశ్వరుడన్న
విశ్వాసము
నీకు
సంపూర్ణముగా
కలదు.
అతని
ప్రతి
చర్యయు
నీ
చిత్తమున
దివ్యకాంతులతో
ప్రకాశించుచున్నది.
అతని
నామము
స్మరించినంతనే
తన్మయుడగుచున్నావు.
ఇట్టి
నీకు
పుట్టవలసిన
సంశయములు
కావివి.
దేహాత్మ
భావం
ప్రవృత్తి,
దైవాత్మ
భావం
నివృత్తి
ఈ
విషయ
మటుంచుము.
నే
నెట్టివాడనునది
నీకు
తెలియునా?
గుణ
సంబంధమైన,
విషయానందములకు
నా
హృదయమున
స్థానము
లేదనుట
నీకు
తెలియును.
అట్టి
నేనే
కృష్ణ
గోపికల
లీలలను
స్మరించుచూ,
అట్టి
ఆనందములో
లీనమగుచూ,
ఆ
గోపికల
అదృష్టమును
కొనియాడుచున్నానన్న,
అవి
సామాన్యమైన
కాముకుని
చర్యలో
లేక
దైవోన్మత్తమో,
కొంత
యోచించుము!
విషయానందపు
చర్యలు,
విశ్వేశ్వరానందపు
చర్యలూ
చూచువారలకు
బాహ్య
3
▾
Meaning
Keep
రూపమున
ఒక్కటిగనే
కనిపించును.
కానీ,
తనను
మరచిన
ఇంద్రియములతో,
జీవేశ్వర
ఏకత్వముతో
దేహాత్మ
భావమునే
మరచిన
వారి
చర్యలు
గుణకారణములని
తలంచుట
అజ్ఞానము
యొక్క
గుణము.
హంతకుని
హస్తమందుగల
కత్తి
అందరికీ
ప్రమాదమే!
కానీ,
వైద్యుని
హస్తమందుగల
కత్తి
దుఃఖ
నివృత్తి
చేయును.
అటులనే
దేహాత్మ
భావము
గల
చర్యలు
ప్రవృత్తి
చర్యలు.
దైవాత్మ
భావము
గల
చర్యలు
నివృత్తి
చర్యలు.
మహారాజా!
మూర్తిమంతమగు
మాధుర్య
స్వరూపుడైన
ఆ
కృష్ణుని
లోకోత్తర
లావణ్యము
యెవరు
చెప్పగలరు?
ఎట్లు
చెప్పగలరు?
నీవు
కృష్ణ
వార్తలను
చెప్పమనుచున్నావు;
అవి
వాగాతీతమైనవి.
తాను
అనేక
అవతారములు
ధరించి,
అనేక
లోకోత్తర
చమత్కారములు
గావించెను.
కానీ,
ఈ
అవతారమునందు
ఒక
విలక్షణమగు
స్వారస్యమును
ప్రదర్శించెను.
ముత్యములవలె
నున్న
అతని
పలువరుసలు
బయటపడునట్లు
చిరునవ్వు
నవ్వెనా?
ప్రేమవతులును,
మహా
భాగవతులును
వేయేటికి?
జితేంద్రియులైనవారు
సహితము
వారల
హృదయములందొక
విధమగు
వికలత
కలుగుచుండెడిది.
అతని
కోమల
కరములతో
ఒకపరి
వారలను
తాకెనా?
వారలు
కాయములే
మరచి,
ఆనందమున
తన్మయులై,
అతని
చిత్తముతో
కూడెడివారు.
ఒక్కొక్కపరి
వినోద
మొనర్చుచు,
హాస్య,
పరిహాసములైన
కథలు
చెప్పెడివాడు.
అట్టి
సమయమున
మా
కంటే
భాగ్యవంతులు,
మా
కంటే
శ్రేష్ఠులు
ఈ
లోకమున
ఎవ్వరూ
లేరనుకొనుచుండెడివారు.
గోపికల
భక్తి
-
ఉద్ధవ
పశ్చాత్తాపం
గోప
గోపాలురు,
వ్రజవనితలు,
యే
పనులు
చేసికొనుచుండిననూ
సరే,
ఒకపరి
కృష్ణుని
చూచిరా,
చిత్ర
ప్రతిమలవలే
నిశ్చేష్టులగుచుండెడివారు.
ప్రేమమయుడును,
సహృదయుడును
అగు
శ్రీకృష్ణునియందు
తమ
మనోః
ప్రాణముల
నర్పించిన
వ్రజాంగనల
విషయములో
ఎట్టి
పాండిత్యమును
గడించిన
వాడైననూ
4
▾
Meaning
Keep
తెలుప
భాష
చేతకాకపోయెడిది.
అసలు
భాషే
లేదు.
భావ
గంభీరమైన
గోపిక,
గోపాలుర
భక్తి
ప్రపత్తులకు
హద్దులే
లేవు.
ఉద్ధవు
దంతటివాడు
బృందావన
గోపికలను
చూచి,
"అయ్యో!
ఇంత
కాలము
నా
జీవితమును
వృథా
గడిపితిని
కదా?
కృష్ణచంద్రుని
చెంత
యుండియూ,
అతని
శక్తి
శాలలో
ప్రవేశించ
నైతిని
కదా?
గోపికల
భక్తి
ప్రేమలలో
అణుమాత్రమైననూ
నా
హృదయాంతరాళమున
మెరయలేదు
కదా!
పుట్టిన,
గోపికా,
గోపాలురై
పుట్టవలెను!
లేకున్న
ఎందుకీ
నిరర్థక
జీవనము?
అట్టి
ప్రాప్తికి
నోచుకోలేని
సమయమున,
బృందావనమందలి
ఒక
పొదరిల్లుగ
నైననూ,
లేదా
ఒక
జాజి
మల్లిగ
నైననూ,
అదీ
లభ్యముకాని
పక్షమున
గోపీ,
గోపాల
కృష్ణులు
సంచరించు
స్థానములందు
వారి
పాదముల
క్రింద
గరికపోచగ
నైననూ
మొలవ
వలెనని"
యెన్నో
విధముల
వాపోయెను,
తపించెను.
అదే
చింతనలో
తరించెను.
అట్టి
కృష్ణ,
గోపికల
సంబంధం
ఒట్టిచెత్త
అనుకోవటం
గిట్టని
బుద్ధుల
బద్ధకపు
మాటలు
కానీ,
భద్రమైన
మాటలు
కావు.
మహారాజా!
చిత్తశుద్ధి
గలవారికే
కృష్ణలీలలు
అర్థమగును."
గోవగోపికల
కృష్ణవియోగం
అంత
పరీక్షిత్
చిరునవ్వుతో,
"స్వామీ!
ఉద్ధవుడు
బృందావనమునకు
ఎపుడు
వెళ్ళెనో,
యే
నిమిత్తమై
వెళ్ళెనో,
కృష్ణదేవుని
విడిచిపోవుటకు
గల
కారణమేమో
వివరింతురా?"
అని
ప్రశ్నించ,
శుకుడు
వివరములు
చెప్ప
ప్రారంభించెను.
"రాజా!
ఉద్ధవుడు
శ్రీకృష్ణుని
విడిచి
నిమిషమైననూ
నిలువజాలడు,
విడువలేదు
కానీ,
కృష్ణుడే
తన
సందేశమును
బృందావన
గోపికల
కందివ్వమని
పంపుటచే,
విధిలేక,
పోవలసివచ్చెను.
అందునా
ఒక
దినము
మాత్రమే
గడువిచ్చెను.
అంతకంటే
అధిక
కాలము
అక్కడుండ
వీలులేదని
కృష్ణుడు
ఆదేశించెను.
ఆ
సమయమున
ఉద్ధవునకు
ఆ
ఒక
దినమే
ఒక
యుగముగా
తోచెను.
కానీ
బృందావనము
వెళ్ళిన
తరువాత,
'అయ్యో!
దినము
గడచుచున్నదే!
వీరలను
5
▾
Meaning
Keep
విడిచి
వెళ్ళ
వలసి
వచ్చెనే!
నా
జీవితమంతయా
గోపికలతోనే
యుండిన
ఎంత
బాగుండెడిది?
అట్టి
ప్రాప్తికి
నోచుకోలేక
పోతివి
కదా?'
అని
చింతించెను.
గోపికల
తీవ్రభక్తి
మహారాజా!
చూచితిరా!
భక్తులకు,
భగవంతునకు
భేదము
లేదు.
కృష్ణుని
చెంత
యెంత
ఆనందమో,
కృష్ణ
వియోగమెంత
బాధకలిగించెనో,
కృష్ణ
భక్తులైన
గోపికల
వియోగము
కూడనూ
అంతకు
రెండింతల
బాధ
కలిగించుచుండును.
గోపిక,
గోపాలురకు
భేదములు
లేవు.
గోపికల
హృదయములు
గోపాలుని
ఆటస్థలాలుగా,
మారెను.
అధిష్ఠాన
పీఠములుగా
నిలిచెను.
వారి
భావములు,
కృష్ణ
రసామృత
పానము
చేసెను.
గోపికలు
కృష్ణ
వియోగమునకు
ఎంత
తపించుచుండిరో,
కృష్ణుని
యెడ
వారల
కంతటి
ప్రేమయో,
ఎంతటి
స్నేహమో,
యెంతటి
ఆసక్తియో,
యేమి
అనురక్తియో
ఉద్ధవుడు
గ్రహించ
గలిగెను.
గోపికా,
గోపాలురు
నిరంతరం
కృష్ణుని
కథలు,
కృష్ణుని
చర్యలు,
కృష్ణుని
వర్ణనలు
తప్ప
మరొక
చింత
వారలలో
చేరనివ్వరు.
కృష్ణ
మాధుర్య
ప్రభా
వ్యాప్తిచే
వ్రజములోని
సజీవులు
నిర్జీవులుగనూ,
నిర్జీవులు
సజీవులుగనూ
కనిపించెను.
గోవర్ధన
శిలలు
కరగి
పోవుచుండుట
ఉద్ధవుడు
కండ్లారా
చూచెను.
రాళ్ళు
కరగుట,
గోపికలు
శిలా
స్వరూపులగుట,
ఉద్ధవు
డెంతనో
విచిత్ర
మహాద్భుతములుగా
తలంచెను."
ఇట్లే
గోపికల
భక్తిని
వర్ణించుచూ,
శుకుడు
మధ్య
మధ్య
సమాధి
స్థితిని
పొందుచూ,
సన్నని
బిందువులతో
నేత్రములు
చెమ్మగిల్లుట
చూచుచున్న
బుషులు,
తన్మయత్వమును
పొందుచుండిరి.
కొందరు
ఆ
ఆనంద
శ్రవణముతో
కృష్ణచంద్రుని
చూడగోరుచుండిరి.
ఇంతలో
శుకుడు
కన్నులు
తెరిచి,
"రాజా!
ఉద్ధవు
డెంతటి
అదృష్టవంతుడో!
గోపికలు
కృష్ణునితో
ఆడుకున్న
స్థానములను
చూపు
నిమిత్తమే,
ఉద్ధవుని
గోవర్ధనగిరి
చెంతకు
తీసుకొని
వెళ్లిరి.
అక్కడికి
వెళ్లి
చూడగా
ఉద్ధవునకు
మరింత
6
▾
Meaning
Keep
ఆశ్చర్యమాయెను.
ఏమన,
ఆనాడు
శ్రీకృష్ణుడు
గోప,
గోపీ
జనములు
తిరుగాడిన
పాదముద్రలు
నాటికిని
చెక్కు
చెదరక
శిలలపై
మెరయుచుండెను.
గోవర్ధన
గిరి
చెంత
వెళ్లగనే
గోప,
గోపికలు
కృష్ణ
వియోగమును
స్మరించి
బోరున
యేడ్వసాగిరి.
ఇంతలో
తన్మయాత్ములైరి,
అందరూ
ఒకపరి
కృష్ణా!
అని
కేకలు
వేయగనే
చుట్టు
ఉన్న
వృక్షములు
కూడనూ
రోమాంచములయ్యెను.
బ్రుమన
వీచెను,
రోదన
చేసెను.
కృష్ణ
వియోగము
బృందావన
గోప,
గోపాలురకే
కాక,
పర్వత
వృక్షములు
కూడనూ
అనుభవించుచున్నట్లు
ఉద్ధవుడు
కండ్లార
చూచెను.
రాజా!
యేమని
తెలుపుదును?
నమ్ముటకు
సాధ్యము
కానట్టి
దృశ్యములు
కూడనూ
ఉద్ధవుడు
చూచి
ఆశ్చర్యముతోపాటు
సిగ్గు
కూడనూ
పడుచుండెను"
అని
తెలిపెను.
అంత
మహారాజు
ఆతురతతో,
"స్వామీ!
అది
యెట్టిది?
అభ్యంతరము
లేకున్న
ఈ
జీవునకు
కూడనూ
తెలిపి
ధన్యుని
గావింపుము"
అని
ప్రార్థించెను.
సర్వం
సజీవం
"రాజా!
గోపికల
చిత్తములు
కృష్ణ
హృదయమునకు
హత్తుకొని
పోవుటచే,
మత్తులో
ఉన్మత్తులవలే
సంచరించుచూ,
కనిపించు
శిలలను,
మ్రానులను,
"కృష్ణా,
కృష్ణా
!"
అని
పట్టుకొనెడివారు.
అట్టి
సమయమున
వృక్షములు,
శిలలు
కూడనూ
వియోగముతో
విలపించు
చున్నట్లు,
వృక్షముల
ఆకుల
కొనలనుండి
నీరు
కారెడివి.
శిలలు
నీటి
చెమ్మలతో
ముద్దయ్యెడివి!
ఈ
దృశ్యములు
యెంత
విచిత్రములో
చూడుము.
'సర్వం
సజీవం'
అను
సూక్తి
ఈ
స్థితిలో
నిదర్శనము.
చైతన్యము
లేని
పదార్థము
సృష్టిలో
లేదని
బృందావన
శిలలు,
వృక్షములు
ఉద్ధవునికి
బోధించెను."
రాళ్ళను
సహితము
కరిగింప
జేయు,
వృక్షములను
విలపింపజేయు,
ఆ
గోపికల
భక్తిని,
లోకులు
అర్థము
చేసుకొనక
విమర్శించుటకు
పూనుకొందురన్న,
అట్టివారు
జడముగా
కనిపించు
గుండు,
బండకంటే
మరింత
జడబుద్ధులని
7
▾
Meaning
Keep
తలంచవచ్చును.
జగదీశుడు,
జగన్మోహనుడు
అయిన
కృష్ణచంద్రుని
తెలిసికొనుట
జడ
బుద్ధులైన
వారికి
సాధ్యము
కాదు.
నిజ
బుద్ధులకే
అది
విదితము.
కృష్ణ
తన్మయత్వంలో
గోపిక
వ్రేళ్ళు
కాలుట
ఇదే
విధముగ,
ఆనాటి
సాయంకాలము,
వ్రజములో
ఒకరు
చూతన
పద్ధతిని
అద్భుతమును
ఉద్ధవుడు
దర్శించెను.
సాయం
సమయమున,
బ్రాహ్మణ
ద్విజులు
అనుష్ఠానమునకై
అగ్ని
కార్యములు
సలుపు
నటుల,
గోపికలు
వారి
వారి
ఇండ్లలో
పొయ్యిలయందు
నిప్పును
వెలిగించెడివారు.
ఒక
రింటినుండి
మరొక
ఇంటివారు
నిప్పును
గరిటెలయందో,
లేక
మట్టి
మూకటుల
యందో
తీసికొనిపోయి,
తమ
తమ
ఇండ్లలో
వెలిగించుకొనెడివారు.
అటులనే,
మొదలు
ఇంటి
దీపము
నందుని
యింట
వెలిగించగనే,
అందరూ
ఆ
ఇంటికి
తమ
తమ
ప్రమిదలు
తెచ్చి
నందునింటి
దీపమును
తమ
ఇంటికి
వెలిగించుకొని
పోయెడివారు.
ఈరీతిగా
జరుగుచుండ
ముందు,
గ్రామ
వేదికపై
కూర్చొని
తిలకించు
చుండెను,
ఉద్ధవుడు."
ఇంతలో
ఒక
గోపిక
యెంత
సేపైననూ
దీపము
చెంతనే
నిలిచి,
వచ్చిన
వారలకు
చోటు
నివ్వక
కన్నులు
మూసుకొని
నిలచి
యుండుట
చూచెను.
యశోద
లోనుండి
వచ్చి,
'అయ్యో!
యేమిటీ
సాహసం'
అని
ఆ
గోపిక
వీపును
తట్టి
మేల్కొలుపగా
ఆమె
కన్నులు
తెరవలేదు.
చుట్టూ
చేరినవారు
ఆమెను
దీపమునుండి
వేరు
చేసి
విశ్రమింప
జేసిరి.
ఈ
లోపల
వ్రేళ్ళు
పూర్తిగా
కాలి
బొగ్గులయినవి.
కొంత
సేపటికి
అనేక
ప్రయత్నములతో
ఆ
గోపిక
కన్నులు
తెరిచెను.
విషయమును
విచారించగా,
దీపమునందు
కృష్ణుని
చూచుచుండుట
చేత
ఆమెకు
మంటలు
కనిపించలేదనియూ,
కాలిన
బాధలు
ఆమెకు
తెలియలేదనియూ,
విషయమును
తెలిసిన
తరువాత
ఉద్ధవునకు
ఈ
అనుభూతి
మరింత
విచిత్రముగా
తోచెను.
Previous
←
The Avatāra of Śrī Kṛṣṇa
Next
Śrī Kṛṣṇa's Childhood Play
→