Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Śrī Kṛṣṇa's Childhood Play
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
36.
శ్రీకృష్ణ
బాల్యక్రీడలు
"స్వామీ!
మధురలోని
కారాగారవాసమునుండి
వ్రేపల్లెకు
చేరినది
మొదలు,
పదునొకండు
సంవత్సరములు
గోపాలుడు
అడవి
గొల్లలతో
గూడి
వ్రజమండల
మందలి
వనోపవనములందు
తాను
యెట్టి
బాల
లీలలను
చూపునో
విన
కుతూహలముగా
నున్నది"
అని
పరీక్షితుడు
శుకుని
ప్రార్థించెను.
శుకుడు
చిరునవ్వుతో,
"మహారాజా!
ఆ
ప్రాకృతిక
దివ్య
బాలకుడైన
ఆ
గోపాలునియొక్క
మనోహరమును,
చిత్తాకర్షకమునగు
లీలలన్నియు
చెప్పుటకు
సాధ్యము
కాదు.
అనుభవించిన
వ్రజ
గోపబాలురెంతో
ధన్యులు.
భగవంతుడు
నామ,
జాతి,
కుల,
కర్మ,
భావ
సంబంధాదులను
చూడడు.
యే
భావముతో
తనను
చేరిననూ
ఆదరించి,
అండజేర్చి,
అశాంతిని
దీర్చి,
ఆనంద
మందించే
ఆ
గోపాలుని,
వసుదేవుడు
నంద
భవనమున
విడిచి
వచ్చినది
మొదలు,
నిత్యము
అమందానంద
ప్రదాతయగు
కృష్ణునకు
జయ
జయ
శబ్దములు
మారుమ్రోగెను.
దినదినమునకు
పెరుగుచూ,
అల్లారు
ముద్దుగ
అమ్మతో
ఆడుచూ,
దోగాడుచూ,
గడప
దాటుచూ,
కడకు
అమ్మానాన్నల
చేతివ్రేళ్లు
పట్టుకొని
తప్పటడుగులు
వేయదొడగెను.
తల్లిదండ్రులు,
కంసుడు
పంపు
దూతల
బారినుండి
తప్పించుటకు
గోపాలుని
యెన్నెన్ని
విధముల
దాచిననూ,
దాగువాడుకాడు.
వచ్చిన
వారలతో
2
▾
Meaning
Keep
తానే
ముందుపోయి
పరిచయము
చేసుకొనుచుండెను.
లోకాలకే
శ్రీ
కారుడైన
ఆ
గోపాలుని
దాచువారెవ్వరు?
దోచుకొని
పోవువా
రెవ్వరు?
అంతా
ఒక
లీల!
రాజా!
ఈ
రీతిగా
పెరుగుతూ,
పెరుగుతూ,
తల్లి
దండ్రులెంత
అరికట్టినా
ఆగక,
గొల్లపిల్లలతో
యమునా
తరంగిణీ
పుణ్య
పులినములందు
ఆడుకొనుటకు
వెళ్ళెడివాడు.
గోవులను
మళ్ళించుకొంటూ
పోయెడివాడు.
స్వచ్ఛమైన
శోభాయుక్తమైన
ఆ
ఆవు
దూడల
మధ్య
ఆడుకొంటూ
మనోహరముగా
నుండు
వేళ
చూచిన
కన్నులు
కన్నులు!
శ్రీకృష్ణుని
గో-గోప
ప్రియత్వం
ఆవు
దూడలు
తెలుపు!
గోపాలుడు
నలుపు!
ఎంత
అందముగా
ఉండునో,
యోచించుకో!
అవి
కృష్ణుని
విడిచి
వెళ్ళెడివి
కావు.
తానూ
వాటిని
సోదరులవలే,
బిడ్డలవలే,
ప్రేమించుచుండెను.
గోపాలుని
హస్తము
దూడల
మీద
పడిన
అవి
పైమరచి
నోరులు
తెరచి,
తోకలెత్తి,
నాలుకలు
చాచి,
కృష్ణుని
ముఖమును,
చేతులను
నాకెడివి.
గోపాలుడు
ఒక్కొక్కపరి
ఆ
గో
దూడల
మెడను
గట్టిగా
కౌగలించుకొని,
కన్నులు
మూసుకొని,
మందహాసముతో
తూగినట్లు
కనిపించుచుండెడివాడు.
దూడలు
తమ
బుల్లి
కొమ్ములతో
ప్రేమతో
గోపాలుని
క్రమ్ముచూ,
నిత్య
వసంత
విహారమగు
బృందావనమున
యమునాతీర
సైకతాల
పైనా,
గో
వత్సములతో,
గోపాలురతో,
పగలు,
రాత్రి
అనక,
విహరించుచుండెను.
కడకు,
నందయశోదలు
పరిచారకులను
పంపి
బలవంతముగా
యింటికి
తెప్పించుకొనెడి
వారు.
ఈ
రీతిగా
యింటినీ,
ఒంటినీ
మరచి
గొల్ల
పిల్లలతో
కూడి
పెరుగుతూ
మరింత
పెద్దవాడాయెను.
తల్లి
దండ్రులు
చెప్పకపోయినప్పటికినీ
ఆవులను,
కోడె
దూడలనూ
పలుపులు
విప్పి,
వూరి
పశువులు
పోవు
మార్గములకు
తన
పశువులనూ
మళ్ళించి,
గోప
బాలురతో
తాను
కూడనూ
కోల
భుజమున
3
▾
Meaning
Keep
వేసుకొని,
ఒక
తుండు
తలకు
కట్టుకొని,
వారి
మధ్య
నడుచుచుంటే
రాజ
బాల
సింహమువలే
కనిపించెడివాడు.
పిల్లలతో
వినోదముగా
ఆడుచూ,
తన
ఎడమ
చేయి
చెవులపై
ఉంచుకొని
యుచ్చైస్వరమున
రాగములు
తీయుచూ,
ప్రేమ
గీతములు
పాడు
చుండెడివాడు.
అట్టి
సమయములందు
ఎంతో
ప్రీతితో
గడ్డిని
తినుచుండిన
గోవులు
తినుట
మాని,
మెడలు
చాచి,
స్తంభించినట్లు
నిలిచి,
చెవులు
నిక్కబొడిచి,
పిలుపునకై
సిద్ధముగా
ఉండినటుల,
లేదా
ధ్యానావస్థయందు
ఉండినటుల
కనుపించెడివి.
పాలు
త్రాగుటకై
అమ్మల
పొదుగులలో
తలలు
పెట్టిన
దూడలు,
పాలు
త్రాగక
కన్నులుమూసుకొని
కృష్ణ
గానమునే
గ్రహించుచున్నట్లు
కనిపించుచూ,
చూపరులకు
మహాదాశ్చర్యమును
కలిగించుచుండెను.
శ్రీకృష్ణలీలలు
అద్భుతం,
ఆనందమయం
రాజా!
గోపాలుని
లీల
లెన్నని,
యేమని,
తెలుపుదును?
అన్నీ
అద్భుతములే!
సర్వమూ
ఆనంద
మయములే!
ఒక్కొక్క
పరి,
పిల్లలతో
పేచీ
పడి
కర్ర
త్రిప్పుట
చూచిన,
చేతిలోని
కర్ర
కంటికి
కనిపించునది
కాదు.
అంత
వేగముగా
త్రిప్పెడివాడు.
ఆ
కర్ర
త్రిప్పుట
మాకునూ
నేర్పుమని
తోడి
బాలరు
ప్రార్థించెడి
వారు.
లోకమునే
హస్తమందుంచుకొని
చెండువలె
త్రిప్పు
గోపాలునకు
కర్రయేపాటిది?
ఇది
నేర్చిన
వచ్చు
విద్య
కాదని
గోపాలురకు
తెలియదు
పాపము.
ఒక్కొక్క
పరి
చెట్లపై
ఆడుకొనెడి
వారు.
దొంగ
తనను
పట్టుటకై
వచ్చిన,
ఉడుత
నడచినా
ఊగునట్టి
బలహీనమైన,
చిట్టచివరి
కొమ్మలో
పోయి
వుండెడి
వాడు.
అతనిని
పట్టుట
వీలయ్యెడిది
కాదు.
అవును
మరి,
అది
సామాన్యులకు
అసాధ్యము.
సత్
హృదయులకే
సాధ్యము.
అడవులలో
గొల్లపిల్లలతో
ఉండినటులే
యుండును.
వారి
భుజములపై
చేతులు
వేసి
వేళాకోళము
చేయుచూ,
ఆడుచూ
ఉండిన
గోపాలుడు,
క్షణములో
4
▾
Meaning
Keep
కనిపించక
పోవును.
ఇంతలో
ఏదో
ఒక
మారు
వేషముతో
ఎదురుగా
నడచుకొని
వచ్చుచుండును.
గోపాలురు
అతడెవ్వడో
కొత్తవానిగా
భావించి
పలుకరించక
పోవుచుందురు.
ఇంతలో
ఫక్కున
నవ్వుచూ,
"నేనే
నేనే,
మీరు
తెలుసుకొనలేక
పోతిరి?"
అని
కేకలు
వేసిన,
గొల్లపిల్లలు
ఆశ్చర్యపడుచూ
ఒక్కొక్క
సమయమున
భయ
భ్రాంతులకు
లోనయ్యెడివారు.
పగలంతయా
ఈ
రీతిగా
గడపి,
సాయంకాల
సమయానికి
యేమీ
యెరుగని
బాలునివలే,
గోవులతో,
పిల్లలతో,
పల్లె
చేరుచుండెను.
ఒక్కొక్క
దినమున
తల్లి
గొడవ
చేసి
అడవికి
పోనీక,
ఇంటియందే
ఉంచుకొనుచుండెను.
అట్టి
సమయమున
అడవిలోని
గొల్ల
పిల్లలూ,
గోవులు,
ఆనాడెంతో
విచారముగా
డొక్కలు
లోనికిపోయి
గోవులు
ఒకదానిపై
ఒకటి
తల
పెట్టి
చెట్టు
నీడల
పండుకొని
ఆహారదప్పులు
లేక,
ఆనంద
కృష్ణుని
రాకకై
వేచి
యుండినటుల,
విచారించు
చున్నటుల
కనిపించెడివి.
ఒక్కొక్క
దినము,
మామ
అయిన
కంసుడు
కొందరిని
రాక్షసులను
వివిధ
వేషములు
ధరిపించి,
ఆట
బొమ్మలతో,
తినుబండారములతో,
వ్రేపల్లెకు
పంపుచుండెడివాడు.
ఆ
బొమ్మల
చుట్టూ
గ్రామ
పిల్లలు
చేరి,
వెలలు
అడుగుచూ,
ఇమ్మని
కోరుచూ,
వచ్చుచుందురు.
కానీ,
కృష్ణుడు
వచ్చునేమో
అని
ఆ
మారు
వేషధారుడైన
కంసదూత
తదేక
దృష్టితో
చూచుచుండ,
కృష్ణుడు
ఆ
బొమ్మలను
కన్నెత్తి
చూచువాడు
కాదు.
కడకు
సాయంకాలము
వరకు
చూచి,
కృష్ణుని
యెత్తుకొనిపోవ
పాంచి
చూచిన,
ఆ
దుర్మార్గుని
గమనించి,
వాని
చేతికి
చిక్కి
నటులనే
చిక్కి
డొక్క
చించి,
డోలు
వాయించి,
పగుల
గొట్టి,
పారవేసెడివాడు.
అది
వ్రేపల్లె
వారలకు
వింతగనూ,
భయముగనూ
ఆశ్చర్య
ఆనందముగనూ
వుండెడిది.
ఒకనాడు
మామిడి
పండ్ల
బండ్లు
గ్రామమంతా
నిండిపోయెను..
ఇది
రాక్షస
కృత్యమని
గమనించి,
ముందుగనే
పోయి
పండ్లను
మాత్రము
తీసుకొని
అమ్మువానిని
యమపురి
కంపెను.
మామ
పంపిన
వస్తువులన్నియూ
వెనుక…
5
▾
Meaning
Keep
పంపుట
శిష్టాచార
విరుద్ధమని
తలంచి,
అన్నీ
అందుకొనుచూ,
తెచ్చిన
వారలను
మాత్రము
తిరిగి
పంపక
వార్త
నందనీయక
చేయుచుండెను.
మహారాజా!
భగవంతుడు
వ్రజములో
చేరినది
మొదలు
వ్రజ
మండల
మంతయా
లక్ష్మికి
క్రీడా
స్థలమైనది.
నిజముగా
లక్ష్మీదేవి
వ్రజమండలములో
బహిరంగముగా
ఆడుకొను
చున్నదా
అన్నట్లుండును.
వేలకు
వేలు
గోవులు.
దధి
క్షీరములకు
కొదువలేదు.
దాచుటకు
కానీ,
తినుటకు
కానీ
వీలు
కానన్ని
పాలు,
పెరుగు,
వెన్నలను
ఏమి
చేయుట
అని
గొల్లలు
విచారించు
చుండుటచూచి
గోపాలుడు
తమ
ప్రియతములైన
గోవుల
సారమును
పారవేయ
అంగీకరించక,
తమ
బొజ్జ
యందే
చేర్చుకొనుటకు
ప్రయత్నించెను.
అదే
పాలు,
పెరుగు
దొంగ
అను
పేరునకు
తగిన
ఆధారము.
ఈ
భోగములను
గమనించి,
కృష్ణుడు
పరమాత్ముడని
లోకానికి
ఎరిగింప
నెంచి,
ఇంద్రుడు
ఒక
యుక్తిని
పన్ని
అతనికి
కోపము
వచ్చుటకు
ఏదో
కారణము
కల్పించ
యత్నించి,
ఇంద్రపూజ
మాన్పించినట్లునూ,
ఇంద్రుడు
రాళ్ళ
వర్షము
కురిపించి
నట్లును,
దాని
బారినుండి
రక్షించుటకై
కృష్ణుడు
గోవర్ధనగిరి
నెత్తినట్లునూ
నాటకమాడెను.
నిజముగా
ఇంద్రునకు
కోపము
లేదు.
కృష్ణుడు
పూజలను
మాన్పించడు,
సామాన్య
మానవులకు
దైవ
తత్త్వము
అర్థమగుట
కష్టము
కనుక,
ఇట్టి
అమానుష
చర్యలతో
దైవత్వమును
గుర్తించుటకై,
ఈ
లీలలు
సంకల్పించెను.
కారణము
లేని
కార్యము
ఉండదనుటకు
ఇట్టివి
ఒకింత
ఆధారములు"
అని
వివరించెను.
ఇంతలో
పరీక్షిత్
మహారాజు,
అద్భుతగిలి,
"ఆహా!
ఏమి,
గోపాలుని
లీలలు
యెంత
మధురమైనవి!
వినగ
వినగ
వీనులారు
చున్నవి.
స్వామీ!
ఇంకనూ
కొన్ని
బాల
లీలలను
వినిపించి
తరింపజేయుము"
అని
ప్రార్థించెను.
Previous
←
Gopāla — the Gopas and the Gopikās
Next
The Slaying of the Rākṣasas
→