Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Slaying of the Rākṣasas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
37.
రాక్షస
సంహారము
బాల
లీలలను
స్మరించుట,
వినిపించుట
శుకుల
వారికి
కూడనూ
అమిత
ప్రీతి
యగుటచే,
అడిగినదే
తడవుగ,
శుకుడు,
"మహారాజా!
మిగిలిన
ఈ
శేష
కాలమును
భగవత్సేవా
కార్యములతో
పవిత్ర
పరచుట
కంటే
మించినది
వేరొకటి
లేదుకదా?
భగవత్
లీలలు
అన్నీ
అమృత
బిందువులే!
అన్నీ
ఆనందములే.
నీవు
దేనిని
వినగోరుదువో
తెలుపుము.
అందును
గురించి
ఉన్న
సత్యమును,
కన్న
మహాత్మ్యమును
విన్నవింతును"
అని
శుకులు
అడుగగా
పరీక్షిత్
మహారాజు,
"స్వామీ!
గోపాలుడు
గోపాలురతో
ఇంకనూ
ఏయే
వినోదములను
జరుపుచుండెడివాడో
వినుపించిన
తరింతును"
అని
చెప్పెను.
శ్రీకృష్ణుని
వేణుగాన
వైశిష్ట్యము
"మహారాజా!
గోపాలుడు
బ్రహ్మ
ముహూర్తమునందే
మేల్కొని,
కాల
కృత్యములు
తీర్చుకొని,
పశువుల
శాలకు
వెళ్ళి,
ఆ
నాడు
ఏ
యే
పశువులను
మేతకై
తీసుకొని
పోవలెనో,
వాటికి
నీరు
పెట్టి,
మిగిలియుండు
వాటికి
కసవు
వేసి,
పలుపులు
విప్పి,
బయట
తోలి
ఉంచెడివాడు.
తానుకూడనూ
లోనికివెళ్ళి
చలిది
మూటకట్టి,
అందులో
మారుగాయలు
పెట్టి,
అన్నను
హెచ్చరించి,
వీధిలోనికి
వెళ్ళి,
తోడి
గొల్ల
పిల్లలకు
తాను
సిద్ధముగా
ఉండినటుల
గుర్తుచేయుటకు
బూరకొమ్ములను
ఊదెడివాడు.
2
▾
Meaning
Keep
ఆ
నాదం
వినగానే
గొల్లపిల్లలు
ఉలిక్కిపడినట్లు
యెవరి
పనులు
వారు
పూర్తి
చేసుకొని,
చలిది
మూటలు
మూపున
ధరించి,
యశోదమ్మ
యింటి
ముందు
సిద్ధమయ్యెడివారు.
అందరు
చేరి,
వేణువు
ఊదుకొంటూ,
పాటలు
పాడుకుంటూ
కొంతమంది
బాలురు
కోకిల
కూసిన
తోడనే
మారుకూతలు
కూయుచూ,
ఆకాశమున
పక్షులు
సంచరించుచుండ
వాటి
నీడలు
భూమిపై
పడుచుండుటచే
ఆ
నీడలను
అనుసరించుచూ
పరుగిడుచుందురు.
కొందరు
పశువుల
వీపులపై
పందుకొని,
కూని
రాగాలు
తీయుచూ,
మధ్య
మధ్య
గోపాలుడు
ఏమి
చేయుచున్నాడో,
యెక్కడున్నాడో
అని
చూచుచూ
అరణ్యము
చేరుచుండెడివారు.
కృష్ణుడు
తన
మురళిని
మొలలో
చెక్కి,
కొరడాను
చేత
బట్టి,
యెడమ
చేతితో
చలిది
ముద్ద
పట్టుకొని,
చక్కని
కంఠమెత్తి
గానము
చేయుచూ
నడచుచుండెడివాడు.
గోపాలుని
గానమునకు
తాళము
అన్నట్లు
గోవులు
నెమ్మదిగా
ఆ
పాటలు
వింటున్నవా
అన్నట్లు
చెవులు
నిక్క
పొడచి,
మెడలు
పై
కెత్తి
నడచుచూ
కొలను
చెంత
చేరెడివి.
అక్కడకు
వెళ్ళునప్పటికి
చలిది
నారగించ
తగిన
సమయమగుటచే,
అందరూ
ఆ
కొలను
ఒద్దన
కూర్చుని
వారి
మూటలు
విప్పి
పెరుగూ,
మీగడా,
పాలూ
కలిపిన
రకరకములైన
వారి
వారి
మూటలు
వారు
ఆరగించుటకు
మొదలు
పెట్టునంతవరకూ
వేచియుండెడివారు.
గోపాలుడు
ముద్దను
నోట
బెట్టగనే,
అందరూ
తిన
మొదలుపెట్టెడివారు.
ఒక్కొక్కపరి
గోపాలుడు
తన
పెరుగు
అన్నమును
ముద్దలు
ముద్దలుగా
జేసి,
అందరికీ
పంచి,
అందరూ
తెచ్చిన
వారి
వారి
అన్నమును
తాను
అడిగి
అడిగి,
ఒక్కొక్క
ముద్ద
పెట్టించుకొనెడి
వాడు.
గోపాలా!
ఇది
మా
యెంగిలి
కదా!
మేమెట్లు
పెట్ట
గలము?
అపరాధము
కదా?
అని
జంకుచూ,
వెనక
వెనుకకు
వెళ్ళుచుందురు.
అట్టి
సమయమున
3
▾
Meaning
Keep
గోపాలుడు
'అందరియందూ
వున్నవాడు
ఒక్కడే
అయినపుడు
భేద
మెందుకు?
యెంగిలి
యెట్లగును?'
అని
వారు
కొరికి
ప్రక్కన
పెట్టుకున్న
నల్లికాయి
ఊరగాయను
తాను
తీసుకొని
చప్పరించెడివాడు.
ఆనాడు
శబరి
యెంగిలి
ఆరగించిన
స్వామికి
ఈనాడు
గోపకుల
యెంగిలి
వేరెట్లగును?
బాలకృష్ణుడు
కంసుని
దూతలను
సంహరించుట
ఈ
విధముగా
ఒకనాడు
కొండనీడలో
బండమీద
కూర్చుని
చలిది
నారగించి,
కొలనులో
చేతులు
కడుగుకొని
అతి
వేగముగా
పశువుల
వైపునకు
పరుగెత్తుచున్న
గోపాలుని
చూచి,
తోటి
గోపాలురు
యేమిటా!
అని
ఆశ్చర్యమున
చూచుచుండ,
మందలో
చేరిన
అందమైన
కోడె
క్రొత్తదిగా
ఒకటి
కనిపించెను.
నేరుగా
గోపాలుడు
ఆ
కోడె
దగ్గరకు
వెళ్ళి
దాని
వెనుక
కాళ్ళు
రెండూ
చేతపట్టి
గిర్రున
త్రిప్పి
ఒక
బండ
కేసి
కొట్టగా,
వికార
స్వరముతో
వింత
శబ్దము
చేయుచూ,
రాక్షస
రూపము
ధరించి
నోట
రక్తము
క్రక్కుచూ
ప్రాణము
వీడెను.
గోపాలురు
దానిని
చూచి
ఆశ్చర్య
పరవశులై
చెంతకు
పరుగిడి
వచ్చి,
ఈ
వింత
యేమని
అడుగగా,
గోపాలుడు
చిరునవ్వు
చిందులు
త్రొక్కుచూ,
'ఒక
రాక్షసుడు,
ఈ
రూపము
ధరించి
కంసదూతగా
వచ్చి
మన
గోవులలో
చేరి
ఈ
నాటక
మాడుచుండుటచే
నేను
వానికి
తగిన
శాస్తి
చేసితిని'
అని
చెప్పగా,
పిల్లలందరూ
గోపాలుని
పొగడుచూ,
'మంచి
పని
చేసితివి
గోపాలా'
అంటూ
గంతులు
వేయుచూ
ఇంకా
ఆ
మందలో
నూతనమైన
పశువు
లేమైనా
వున్నవేమో
అనియూ,
తమ
పశువులను
ఏమైనా
మ్రింగిన
వేమో
అనియూ
వారి
వారి
పశువులను
వారు
సరిగా
వెతుకుచూ
కనిపెట్టుచూ
పోవుచుండెడి
వారు.
ఈ
రీతిగా
మధ్యాహ్న
మగుసరికి
ఒక
కొండను
చేరుకొనిరి.
అచట
యెండ
వేడిమి
అధికమగుటచే
పశువులను
కొండనీడలకు
మళ్ళించి,
వారు
కూడనూ
కొండనీడలో
విశ్రాంతిగా
పరుండియుండిరి.
4
▾
Meaning
Keep
ఇంతలో
ప్రొద్దు
తిరిగెను.
పశువులను
మళ్ళింతమని
ఒక
బాలుడు
లేచి
వెళ్ళి
చూడగా,
యేదో
ఒక
పెద్ద
కొంగాకారముతో
ఉండి
పశువులను
తన
పొట్టన
పెట్టుకొనుచుండగ
గమనించి,
'కృష్ణా!
గోపాలా!'
అని
కేకలు
వేయగనే,
గోపాలుడు
క్షణములో
వెళ్ళి,
ఆ
కొంగ
ఆకారములో
ఉన్న
బకాసురుని
ముక్కు
పట్టి
తోక
వరకూ
చీల్చి
పారవేసి
పొట్టలో
చేరిన
గోవులను
రక్షించెను.
ఇట్లు
నిత్యమొక
వింతగా,
కంసుడు
పంపిన
రాక్షస
దూతలను
వధించుచుండుట
గోపబాలురకు
ఒక
ఆటగా
మారెను.
ఆశ్చర్యము
యే
మాత్రమూ
కనిపించక,
గోపాలుని
శక్తి
సామర్థ్యములు
అతీతమైనవని,
వారి
హృదయములలో
నాటుకొని
పోయెను.
అందుచే
గోపాలు
రెట్టి
భయములూ
లేక,
యెక్కడి
కంటే
అక్కడకు,
ఎప్పుడంటే
అప్పుడు
గోపాలునితో
వెళ్ళుటకు
సిద్ధముగా
ఉండెడి
వారు.
ముందు
దినము
బకాసురుడను
రాక్షసుడు
కొంగ
రూపమున
వచ్చి
గోపాలుని
చేతిలో
ప్రాణాలు
వీడుటచేత,
సోదరుని
మరణవార్త
విని
ఉగ్రుడై
బకాసురుని
తమ్ముడగు
రాక్షసుడు
కొండచిలువయై
వచ్చి
గోవులను,
గోపాలురను,
కడకు
రామ
కృష్ణాదులను
సహితము
విడువక
మ్రింగ
నోరు
తెరచుకొని
దారి
కడ్డముగా
వారి
రాక
కెదురుగా
పరుండియుండెను.
గోపాలుడు
తెలియక
గోవులను
తోలుకొని
నేరుగా
పోయి
గోవులూ,
గోపాలురూ,
అందరూ
కొండ
గుహ
వంటి
దాని
నోటిలో
చేరి
పొట్టలోనికి
దిగిరి.
ఇది
చూచి
గోపాలుడు
ఇదియునూ
రాక్షసుడే
అని
కనిపెట్టి
కొండ
చిలువ
రెండు
దవడలను
పట్టి
తోకవరకూ
చీల్చి,
పొట్టలో
నున్న
గోవులను,
గోపాలురను
రక్షించి
జరిగిన
కథ
నెరిగించి
గోపాలుర
భయములను
బాపెను.
అప్పటి
నుండి
గోపాలురకు
అంతో
యింతో
ఉన్న
భయములు,
భ్రాంతులు
కూడనూ
వీడి,
అన్నింటికి
సర్వశక్తిమయుడగు
మన
గోపాలుడు
కలడని
నిర్భయులై,
దేనినీ
లెక్క
చేయక,
పక్కన
చూడక,
కృష్ణుని
దిక్కునకే
నడచుచుండెడి
5
▾
Meaning
Keep
వారు.
మహారాజా!
గోపాలుని
ఇట్టి
బాలలీలలు
నిమిష
నిమిషమునకూ,
వింతలే
వినోదములే,
విచిత్రములే.
నే
నేమి
తెలుపుదును?
అమానుషమైన
ఈ
వింతలు
సామాన్యులకు
సాధ్యమా?
భగవంతుని
శక్తులను
జూచియు
విస్మరించుట
శాపమే!
ఇట్టివి
చూచియూ
నమ్మనటువంటి
కొందరి
జన్మలు
భూభారములే,
బూరగ
కాయలే
అని
శుకుడు
మందస్మిత
వదనుడై
కన్నులు
తెరచి
చిన్మయ
మూర్తి
రూపమును
దర్శించు
చుండునటుల
ఒక
వైపునకు
తదేక
దృష్టితో
నిలచి
యుండుట
చూచి
పరీక్షిత్
మహారాజు,
"స్వామీ!
దానవులు
సహితము
దైవమును
నమ్మి
ఆ
ఆరాధనలు
జరుపుచుండ,
మానవులై
కూడనూ
దైవమును
విస్మరించుటకు
తగిన
కారణమేమి?
చూచిన
నేత్రములనైననూ
నమ్మరు
కాని,
విన్న
కర్ణములను
విశ్వసింతురు.
ఇది
కేవలము
పాప
ఫలమనే
నా
భావము,
లేదా,
శాపమైననూ
అయివుండ
వచ్చును"
అని
పలికెను.
శుకుడు
"మహారాజా!
నీ
మాటలు
పరమ
సత్యము.
కంస,
జరాసంధుడు,
శిశుపాలుడు,
సాల్వుడు
మొదలైన
రాక్షసులు
కృష్ణుని
శక్తి
సామర్థ్యము
లెన్నియో
కన్నులారా
గాంచియు,
గొల్ల
పిల్లడను
భావము
వారల
కర్ణములందు
మెలగుచుండుటచే
దృష్టిని
విస్మరించి
ఆకాశవాణి
పలుకులను
మననము
చేయుటచే
కదా,
ప్రాణములను
కోల్పోయిరి.
సాక్షాత్
భగవానుని
అమానుష
చర్యలు,
అత్యద్భుత
శక్తులూ
నిత్యము
తాము
పంపిన
దూతలచే
బోధింపబడుచుండియూ,
వాటిని
అలక్ష్యము
చేసి,
భగవంతుడను
లక్ష్యమును
మరచుట,
శాపము
కాక
మరేమి?
అదియూ
చేసిన
పాప
ఫలమే!
గోపాలుడు
లోక
పాలకుడే
కానీ,
గొల్ల
పిల్లడు
కాదు.
రూపమునకు
మానావాకారమైన
పిల్లవాడే
కానీ,
శక్తి
యుక్తులతో
ముక్తిని
హస్తమందుంచుకొని
బంధవిముక్తిని
చేసే
భద్రమూర్తి.
అతనే
నారాయణ
మూర్తి"
అను
శుకుల
మాటలకు
మహరాజు
సంతసించి,
"మా
తాతలు
ఆ
గోపాలునితో
కూడి
ఆడి
ఆనందించిన
భాగ్యములో
అణుమాత్రమైననూ,
విని
ఆనందించునట్టి
భాగ్యము
6
▾
Meaning
Keep
నాకు
గలుగుట
ఇదియూ
నా
భాగ్యమే!
వారి
పుణ్యఫలము
వలననే
నే
నిట్టి
మహాబుషి
వాక్యములతో
మాధవ
స్వరూపుని
లీలలు
వినగలిగితిని.
కాకున్న
ఇది
సామాన్యుల
కబ్బునా?"
అని
ఆనంద
బాష్పములు
విడుచుచూ,
హస్తములు
జోడించి,
శుక
మహర్షి
ఆనంద
వదనమును
చూచుచూ,
"స్వామీ!
గోపాలుడు
కాళియ
మర్దనము
గావించెనని
వింటిని.
దాని
అంతరార్థ
మేమియో,
ఆ
విధముగా
గావించుటచే
ప్రజలకు
కల్గిన
ఆశ్చర్య
మేమియో,
అందులో
గల
మహత్తరమైన
విషయమేమిటో
తెలిపి,
నా
సంశయమును
రూపుమాపుడు"
అని
ప్రార్థించెను.
Previous
←
Śrī Kṛṣṇa's Childhood Play
Next
The Subduing of Kāḷiya
→