Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Subduing of Kāḷiya
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
38.
కాళీయ
మర్దనము
శుకమహర్షి
శ్రీకృష్ణుని
బాల్యలీలలను
వర్ణించుచూ
"లీలా
మానుష
విగ్రహుడైన
ఆ
బాలగోపాలుడు
క్రమంగా
పెరుగుతూ
అయిదేండ్ల
వాడాయెను.
ఒకనాడు,
ఏమి
తలంచెనో
ఏమో!
తన
లీలలు
తనకే
తప్ప
యెవరికినీ,
ముందు
కానీ,
వెనుకగానీ
తెలిపెడివాడు
కాడు.
జరుగు
చర్యలను
గుర్తించి,
వర్తించ
వలసినదే
కానీ,
ఇట్టివని
ఊహింప
ఎట్టి
వారల
కైననూ
సాధ్యమయ్యెడివి
కావు.
నిత్యమూ
అన్నను
తోడ్కొని
పోయెడి
వాడు.
ఆనాడు
అన్నకు
గానీ,
అమ్మా
నాన్నలైన
యశోదా,
నందులకు
కానీ
తెలుపక
అతి
రహస్యముగా
గోవులను
తోడ్కొని
గొల్ల
పిల్లలతో,
యమునా
నదిలో
ఉన్న
ఒక
మడుగు
చెంతకు
వెళ్ళెను.
విషమయమైన
విచిత్రమడుగు
ఆ
మడుగు
చరిత్ర
చాల
విచిత్రముగా
నుండును.
సామాన్యముగ
మడుగులలోని
నీరు
కొంత
మలినమై
యుండుట
సహజము.
కానీ,
ఈ
మడుగులోని
నీరు
నీలవర్ణమై
బొబ్బలు
పోవునంతటి
వేడెక్కి
మర్లుచుండును.
బుడగలు
బుడగలు
పొంగుతూ,
ఆ
మడుగుపైనుండి
వేడి
ఆవిరి
ఆకాశము
పైకి
చుట్టు
ముట్టు
చుండును.
ఆ
గాలి
సోకిన
జీవులు
మరుక్షణమందే
ప్రాణములు
వీడుచుండుట
అందరికీ
ఆశ్చర్య
మేయుచుండెను.
ఆ
మడుగు
పై
భాగమున
సంచరించు
పక్షులు
సహితము
ఆ
గాలి
సోకినదే
తడవుగా
రెప
రెప
రెక్కలు
కొట్టుకొని,
చచ్చి,
ఆ
మడుగులో
కూలి,
ఉడికి
పోయెడివి.
2
▾
Meaning
Keep
ఈ
వింత
ప్రేపల్లె
వారలకు
అందరికీ
బాగుగా
తెలిసియుండుటచేత,
యెవ్వరూ
ఆ
మడుగు
చుట్టుపట్ల
వెళ్ళుట
కానీ,
తమ
పిల్లలను
లేక
పశువులను
పంపుట
కానీ
చేయక
అతి
జాగ్రత్తతో
మసలుచుండిరి.
ఆనాడు
గోపబాలురు
ఆ
మార్గము
వద్దని
ఎంత
బ్రతిమిలాడిననూ
వినక,
గోపాలుడు,
నేనక్కడికే
వెళ్ళవలెనని
గట్టి
పట్టుబట్టి
రివ్వున
పోజొచ్చెను.
మిగిలిన
గోపాలురు
సర్వవిధములా
ప్రయత్నించిననూ
వదలించుకొని
కొలనుచెంతకు
పోయి
గుడ్డలు
విడచి
ఇందులో
నేను
ఈత
ఆడవలెనని
చెప్పెను.
పిల్లలు
'అయ్యో!
దీనిగాలే
యింత
విషమయమై
యుంద
అదెంత
ఘూటైన
విషమో'
అని
గట్టిగ
చెప్పుటకు
ధైర్యము
చాలక,
మెల్లగ
చెప్పిన
వినకుండగా,
మొండిపట్టు
పట్టి
ప్రక్కనున్న
ఒక
చెట్టు
నెక్కి
అందులో
దుమికెను.
దుమికిన
గోపాలుడు,
పైన
ఎంత
సేపు
చూచిననూ
తేలకుండుటచే,
కృష్ణుడే
తమ
ప్రాణముగా
భావించి
కాలము
గడుపుచున్న
గోపబాలురకు
అది
చాలా
భయంకరమైన
స్థితిగా
యేర్పడి
అందరూ
కొలనుచుట్టూ
చేరి
పరి
పరి
విధముల
పిలుచుచూ
రోదనలు
చేయ
మొదలుపెట్టిరి.
బాలకృష్ణుడు
సర్పముతో
తలపడుట
ఇంతలో
గోపాలుడు
పైన
తేలి,
మడుగునంతయూ
భూకంపము
వలే
చిందర
వందర
చేయుచూ
ఈత
ఆడుచుండ
అతనిని
పట్టుకొనుటకు
ఒక
గొప్ప
సర్పము
విషము
గ్రక్కుచూ,
అగ్నివలే
తన
కన్నులు
మెరయుచుండ,
గోపాలుని
తరుముచుండు
దృశ్యమును
చూచి,
బాలురు
ధరించలేనంత
దుఃఖముతో
'కృష్ణా!
కృష్ణా!
గట్టుకురా!
ఇటురా!
ఇటురా!'
అని
ఒకే
గోల
చేయుచుండిరి.
గోపాలుడు
అసలు
వారి
మాటలను
విననట్లు
నటించుచూ,
తన
ఉల్లాసమును
మరింత
విచిత్రముగ
చూపుచు,
కడకు,
సర్పము
తోక
పట్టుకొని,
తాను
ముందూ,
పాము
వెనుక,
మహారోషముతో
ఆ
కొలనంతయూ
సముద్రపు
3
▾
Meaning
Keep
అలలవలె
పైకెగురుచూ
కడకు,
పాము
గోపాలుని
పూర్తిగా
చుట్టుకొని
బాధించుచుండుట
చూచి,
కొందరు
పిల్లలు
గోకులమునకు
పరుగెత్తుకొనిపోయి
ఈ
విషయమునంతయూ
నందయశోదల
కెరిగించి
చాలా
దుఃఖముతో
విలపించిరి.
ఆ
వార్త
వినగానే
నందయశోదలు,
గోకులములోని
గోపగోపీలు,
గోపాలునకెమో
కీడు
చేకూరినదని
రోదనలు
చేయుచూ
ఊరందరూ
ఆ
మడుగు
చెంతకు
పరువులెత్తిరి.
వారలతోనే
బలరాముడు
కూడనూ
ఉండుటచే,
గోపాలుని
శక్తి
సామర్థ్యములు
తెలిసినవాడగుటచే,
నంద
యశోదలను
ఓదార్చుచూ,
గోపాలునకెట్టి
కీడునూ
రాదనియూ,
కంగారుపడ
నక్కరలేదనియూ
ఎన్నో
విధముల
వారించుచూ
వెళ్ళుచుండెను.
గోపాలాదుల
పరితాపము
ఆ
నది
పూర్తిగా
జనమయమాయెను.
ఎక్కడ
చూచినా,
'కృష్ణా!
కృష్ణా!'
అని
కేకలు
వేయుచూ,
రోదనచేయుచూ,
ప్రలాపములు
ప్రతిధ్వనిగా
నుండెను.
అట్టి
కేకలకందరూ
కొలను
సమీపించి
చూతురు
కదా!
అబ్బా!
ఆ
దృశ్యము
వారలకు
స్పృహ
తప్పునట్లు
చేసెను.
తప్పుటేమిటి!
ఆ
మడుగులో
ఘోర
సర్పముచేత
బంధించబడిన
కృష్ణుని,
ఆ
సర్పము
గ్రక్కుచున్న
ఆ
విష
అగ్నిబిందువులను
చూచి,
కొలనంతయూ
రక్తమయమై,
ఇరువురూ
క్రిందా
మీదా
పొర్లుచున్న
ఆ
దృశ్యమును
చూచి,
యశోద,
కొందరు
గోపికలు,
స్పృహతప్పి
పడిపోయిరి.
వారలను
కొందరు
కనిపెట్టుకొని
ఓదార్చుచూ
ఎట్లో
తిరిగి
స్పృహలు
వచ్చి
చూచుచూ
శోక
గద్గద
స్వరములతో
'కృష్ణా!
కృష్ణా!
ఈ
పాదు
పాము
మాకెక్కడ
దాపురించె
తండ్రీ!'
అని
యశోద
విలపించుచుండ,
కొందరు
గోపాలురు
ఆ
పాము
మమ్ములనైననూ
కరచి
మా
గోపాలుని
విడువకూడదా!
అని
ఏడ్చుచుండ,
మరికొందరు
గోపికలు
4
▾
Meaning
Keep
గోపాలుని
రక్షించుటకు
మా
ప్రాణములైననూ
ఇత్తుమని
వారు
ఆ
కొలనులో
దుమికిన
ఆ
పాము
గోపాలుని
వదలి
మమ్ము
పట్టుకొన
వచ్చునేమో
సిద్ధమగుచుండ,
బలరాముడు
అట్టివారలను
వారించి,
గోపాలునకు
ఎట్టి
కీడును
రాదని
ధైర్యము
చెప్పుచూ,
కృష్ణుని
త్వరలో
విడిపించుకొని
రమ్మని
కేకలు
పెట్టుచుండెను.
కొందరు
గోపికలు
ప్రార్థనలు
సల్పుచూ,
'గోపాలుడు
క్షేమముగా
ఉండినచో
కదా,
లోకాలు
క్షేమముగా
యుండగలవు.
లోకాల
నేలే
ఏకైక
రాజు
మన
గోపాలుడే
కాన,
ఆ
గోపాలుడు
త్వరలో
ఆ
విష
సర్పమునుండి
విడువబడునుగాక!'
అని
గోపాలునే
ప్రార్థించుచూ
మధ్య
మధ్య
కన్నులు
తెరచి,
వీడెనా
అని
చూచుచూ
ఈ
రీతిగా
ఆ
కొలను
చుట్టూ
ఏ
నిమిషంలో
ఏమగునో
అని
భయ
భ్రాంతులతో
రెప్పవాల్చక
గోపాలునివైపు
చూచుచుండిరి.
"ఆహా!
గోపాలుని
చిత్రమేమని
చెప్పుదు
రాజా!"
అని
ఉబికి
వచ్చు
ఆనంద
దుఃఖ,
వింత,
విచిత్ర
ఉద్రేకమును
ఆపుకొనలేక,
శుకుడు
రెండు
చేతుల
మొఖమున
కడ్డు
పెట్టుకొని
వ్రేళ్ళ
సందునుండి
కారుచున్న
కంటినీటిని
చూచి
పరీక్షిత్
మహారాజు
భయపడి
"స్వామీ!
స్వామీ!
ఏమి
ఈ
వింత?
తదుపరి
ఏమి
జరిగినది?
తమరింత
విచారించునంతటి
ప్రమాదమేమి
జరిగినది
గోపాలునకు
త్వరగా
చెప్పి
నా
భయమును
తీర్చుము"
అని
పరిపరి
విధముల
ప్రార్థించెను.
శ్రీకృష్ణుని
కాళింగ
నర్తన
శుకుడు
అంగవస్త్రమైన
కాషాయ
వస్త్రముతో
కంటినీరు
తుడుచుకొని
"మహారాజా!
ప్రమాదమేమియూ
జరగలేదు
కానీ,
కృష్ణుని
దేహము
నిమిష
నిమిషమునకూ
పెద్దదగుచూ
వచ్చుచుండుటచే,
ఆ
సర్పము
ఒక్కొక్క
చుట్టు
వీడిపోతూ
వచ్చెను!
చిన్న
పిల్లవాడయిన
ఆ
గోపాలుడు
ఘన
స్వరూపుడగుట
చూచిన
గోప
గోపికలకు
ఆశ్చర్యముతో
పాటు
ఆనందము
కూడనూ
అందించెను.
కడకు,
కృష్ణుని
వీడి,
తనకు
దక్కక
పోయెనే
అను
క్రోధముతో
విషము
గ్రక్కుచూ
అలసిపోయి,
సారె
సారెకూ
తలలు
పైకెత్తి
కృష్ణుని
అందుకొనుటకు
చూచుచుండె
5
▾
Meaning
Keep
సర్పమును
కృష్ణుడు
తోకపట్టి
గిర
గిర
త్రిప్పి
నీటిపై
కొట్టగా
ముదుచుకొని
తన
శిరస్సులన్నింటినీ
యెత్తి
నీటిపై
నిలువజొచ్చిన,
సర్పము
శిరస్సు
పై
గోపాలుడు
ఎగిరి
నిలిచి,
తోకను
చేతియందుంచుకొని
నాట్యమాడ
జొచ్చెను.
ఈ
హింసకు
తాళజాలక
ముక్కుల
వెంటా,
నోటి
వెంటా
రక్తము
కార్చుచూ
ఒక
విధమైన
రోదనచేయుచూ
సర్పము
ప్రాణములు
వీడుటకు
సిద్ధముగా
వుండుట
జూచి,
చుట్టూవున్న
ప్రజలు
కొంత
ధైర్యము
పూని
'కృష్ణా!
ఇక
గట్టుకు
రా
తండ్రీ!
మమ్ముల
రక్షించితివి,
ఈ
నాటితో
నీ
గండము
తీరినది.
ప్రేపల్లె
పుణ్యము
పండినది,'
అని
అనేక
రకముల
పలుకుచుండిరి.
కాళీయున
కభయము
ఆ
సమయములో,
లోనుండి
ఆ
సర్పమునకు
భార్యలైన
నాగకాంతలు
గోడు
గోడుమని
ఏడ్చుచూ,
కృష్ణుని
పాదాల
మీద
పడి,
దుష్ట
శిక్షణకై
అవతరించిన
నీవు
క్రూర
సర్పమును
దండించి,
ఖండించుట
అన్యాయ
మేమియూ
కాదు.
నీ
కర్తవ్యమును
నీవు
నిర్వర్తించితివి.
తండ్రీ!
మా
భర్త
ఎట్టి
క్రూరుడైననూ,
కడకు
అతని
శిరస్సుపై
మీ
పాదము
పెట్టితిరి
కనుక,
అతని
పాపములు
రూపుమాసినవి.
మన్నించి
మాకు
పతిభిక్ష
పెట్టి,
అతని
కింక
అట్టి
క్రూర
బుద్ధులనివ్వక
కాపాడుమని
ప్రార్థించిరి.
వారి
ప్రార్థనను
శ్రీకృష్ణుడు
మన్నించి,
కాళీయుని
విడిచి,
"ఇకపై
నీవు
సాత్వికుడవై
ఎట్టి
వారికినీ
నిష్కారణముగా
హింసచేయక,
ఇతరుల
చేత
నీకు
హింస
జరుగక
ఉందువుగాక,
నీ
శిరస్సుపై
నా
పాదముద్రలుండుటచే
గరుడుడు
కూడా
నిన్నేమియూ
చేయకుండుగాక"
అని
ఆశీర్వదించి
దిగెను.
Previous
←
The Slaying of the Rākṣasas
Next
The Schooling of the All-Knowing Lord of All
→