Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Schooling of the All-Knowing Lord of All
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
39.
సర్వజ్ఞుడైన
సర్వేశ్వరుని
విద్యాభ్యాసము
"మహానుభావా!
కృష్ణుని
మధురమైన
బాలలీలలు
ఎన్ని
విన్ననూ
తనివితీరుటలేదు.
కండ్లారా
కాంచిన
మా
తాతలింత
ధన్యులో!
సామాన్య
మానవుల
వలె
సంచరించుచూ,
సర్వమూ
తనయందే
ఇముడ్చుకొన్న
దివ్యమూర్తి
కృష్ణమూర్తి.
అబ్బా!
నిజముగా
ఈ
శేషదినములు
ఆ
శేషశయనుని
లీలా
శ్రవణముతో
గడుపుట
యే
జన్మమున
నే
చేసుకొన్న
సుకృతమో!
కాకున్న,
ఆ
మహాబుషి
శాపము
నా
పాపముల
కడిగివేయుచున్నది.
ఇట్టి
సదవకాశమును
కల్గింపజేసిన
ఆ
బుషి
కుమారునకు
మరొకపరి
నా
సహస్ర
ప్రణామము
అర్పింతును.
కాలమాసన్నమగు
కొలదీ,
నా
భావము
కృష్ణ
మధుర
లీలలు
గ్రోలుటలో
లీనమగుచున్నది.
మత్తెక్కి
ఉన్మత్తుని
గావించుచున్నది.
నా
చిత్తమున
కృష్ణుని
రూపము
హత్తుకొని
పోవునట్లు,
ఈ
మిగిలిన
గడియలు
నా
గోపాలుని
లీలా
పానముచే,
తాపమును
చల్లార్చు"
మని
ప్రార్థించెను.
లీలానాటక
సూత్రధారి
శుకుడు
కరుణారస
మొలుకునటుల,
"రాజా!
ఏమి
చెప్పమందువు?
యుగములు
చెప్పిననూ
తీరని
కృష్ణలీలలు,
గడియలలో
ఇమడ్చవలెనన్న
ఎట్టి
వారికీ
సాధ్యము
కాదు"
అని
పలికెను.
అంత
పరీక్షిత్
మహారాజు,
"స్వామీ!
మన
కృష్ణమూర్తి
బలరామ
సహితుడై
సాందీపుడను
భాగ్యశాలి
కడ
విద్య
నేర్చినటుల
వినియుంటిని.
సర్వవిద్యా
2
▾
Meaning
Keep
పారంగతుడగు
సర్వేశ్వరునకు
విద్యనేర్పు
అవిద్యులుందురా?
అన్ని
లీలలు.
ఎవరెవరిని
యేయే
విధముగ
తరింపజేయవలెనో
ఆ
లీలానాటక
సూత్రధారుడైన
గోపాలునకే
తెలియును.
సాందీపనిని
తరింపజేయగోరి
ఈ
నాటకమాడి
యుందును.
సాందీపనిచెంత
ఆడిన
నాటకమును
కొంత
వినిపించిన
విని
తరింతును,
ప్రభూ!"
అని
ప్రార్థించెను.
శుకులు
ఫక్కున
నవ్వి,
"రాజా!
నీవు
చెప్పినది
పరమ
సత్యము;
అంతా
నాటకమే.
కృష్ణ
నాటకమునకు
జగత్తంతయూ
వేదిక!
ఇందులో
ఎన్నియో
తెరలు,
పొరలు,
అరలు
ఇమిడ్చి,
తరింపజేయు
పన్నాగములు
పన్నుచుండును.
సాందీపుని
అదృష్టము
పండుటచే
అతనికట్టి
అవకాశమును
కలిగించెను,
అందించెను.
ఆ
లీలా
నాటకమును
గురించి
తెలుపుదును,
వినుము"
అని
ప్రారంభించెను.
బలరామకృష్ణులు
దినదిన
ప్రవర్ధమానులై
దినకరునివలె
తేజోవంతులగుచూ,
ప్రకాశించుచుండ,
దేవకీ
వసుదేవులు
ఆ
బాలుర
భవిష్యత్తును
యోచించి,
మాయకు
బద్ధులై
విద్యలు
నేర్పవలెనని
సంకల్పించి,
వారల
కులగురువులైన
గర్గుని
రప్పించి
శుభ
ముహూర్తములు
నిర్ణయించి,
అత్యంత
వైభవముగా
ఉపనయన
సంస్కారములు
గావించి,
అనేక
దానధర్మములు
చేసి,
ఒక
ప్రేపల్లెవారలకే
కాక
ఆ
ప్రాంతీయులకందరికీ
ఆనందము
కలుగునట్లు
వినోదములతో
ఉత్సవములు
జరిపి,
పండితులను
పిలిపించి,
గర్గునితో
సంప్రదించి,
తమ
పిల్లలకు
ఉత్తమ
విద్యను
బోధించు
పండితోత్తముడు
కావలెనని
ఆలోచించిరి.
శ్రీకృష్ణ
బలరాముల
అద్భుత
విద్యాభ్యాసం
కులగురువైన
గర్గుడు,
కొంతవిచారించి,
కాశీ
నగరమున
గంగా
తీరమునందున్న,
అవంతీపుర
వాసియైన
సాందీపుడు
అను
పండితోత్తముడు,
పవిత్ర
హృదయుడనియూ,
మన
బలరామకృష్ణులను
అతని
చెంత
వదలుట
మంచిదనియూ
గట్టిగా
చెప్పుటచేత
దేవకి
వసుదేవులు
బాలురను
వదలి
అంత
దూరము
పంపుటలో
కొంత
బాధ
వుండినప్పటికినీ
'గురువు
లేని
విద్య
గుడ్డి
విద్య
3
▾
Meaning
Keep
అను
సత్యమును
గుర్తెరిగిన
వారగుటచే,
ఒప్పుకొని,
తామే
స్వయముగా
తమ
పిల్లలైన
బలరామకృష్ణులను
వెంట
బెట్టుకొని
కాశీనగరమును
చేరి,
సాందీపునకు
ఒప్పజెప్పి,
అందుకు
తగిన
ఏర్పాట్లు
గావించి
వసుదేవుడు
భారమైన
హృదయముతో
ప్రేపల్లె
చేరుకొనెను.
ఆనాటినుండియు
మన
బలరామకృష్ణులు
సాందీపుని
చెంత
భయభక్తులతో
మెలగుచు,
విద్య
నభ్యసించుచుండిరి.
బిడ్డలు
లోకమున
వేలకు,
లక్షలకు,
కోట్లకు
కలరు
కానీ,
గురువునకు
తృప్తి
కలిగించి,
గురువు
చెప్పిన
విద్యలు
సక్రమముగా
నేర్చి
విషయార్థులు
కాక
విద్యార్థులమని
భావించి,
గుర్తించి
వర్తించిన
పిల్లలు
మన
బలరామకృష్ణులు.
గురువునకు
అద్దు
చెప్పుటకానీ,
ఆజ్ఞను
మీరుటకానీ,
అవిధేయత
ప్రవర్తనలు
కానీ,
ఏనాడునూ
ఎరుగరు.
సర్వ
శక్తి
సంపన్నులయ్యూ
స్థానమునకు
తగిన
స్థితిని
వారనుభవించిరి.
అట్టి
శ్రద్ధా
భక్తి
కలిగి,
వినయ
విధేయతలతో,
చెప్పిన
పాఠముల
నప్పచెప్పుటలో
తప్ప
అన్య
చింతలను
తలలోచేర్చక
మెలగుచున్న
ఆ
బాలురను
చూచి
సాందీపుడు
తనలో
తాను
ఆనందముతో
ఉప్పాంగెడివాడు.
అట్టి
బిడ్డలను
చూచి
సాందీపుడు
అమిత
ప్రేమతో
ఇంకనూ
నూతన
తర్క,
వ్యాకరణ,
ధర్మశాస్త్ర,
అర్థశాస్త్రాది
విద్యలన్నింటినీ
చెప్పెను.
మహారాజా!
ఏమని
వర్ణింతును?
నెలకొక
విద్య,
సంవత్సరమునకొక
విద్య,
పంచవర్షములకొక
విద్య
నేర్చుకొను
వారుండురేమో
లోకమున,
కానీ,
మన
బలరామకృష్ణులు
సాందీపుని
యింట
అరువదినాలుగు
దినములే
వుండిననూ
అరువది
నాలుగు
విద్యలు
నేర్చిరి.
ఇదీ
తన
లీలలలో
ఒకటి
కాక
మరేమి!
ఇట్లు
నేర్చుట
అందరికి
సాధ్యమా?
ఈ
పిల్లలయొక్క
వినయ
విధేయతలు
చూచుచూ,
సేవలు
చేయించుకొనుచూ,
వారలతో
సంభాషించుచుండ,
మధ్య
మధ్య
సాందీపుడు
పొంగిపొరలివచ్చు
దుఃఖమును
ఆపుకొనలేక
కంటిధారలు
కార్చుచుండెడివాడు.
అందుకు
కారణమేమియో
అడుగ,
బలరామకృష్ణులు
ముందూ
వెనుకాడెడివారు.
ఎట్టకేల
కొకనాడు,
గోపాలుడు
గురువుగారితో
వినయముగా
4
▾
Meaning
Keep
చేతులు
కట్టుకొని,
"గురూత్తమా!
మాతో
మాటాడునపుడు
అపుడపుడు
తమరు
ఏదో
విషయమును
తలంచుకొని
కంటిధారలు
కార్చుచుందురు.
దీనికి
కారణము
మాకు
తెలియవచ్చునని
మీకు
తోచిన,
తెలుపుడు"
అని
ప్రార్థించ,
ఆ
ప్రార్థనలో
సాందీపుని
కడుపులోని
బాధ
కదిలించి
వైచినది.
పట్టలేని
దుఃఖముతో
గోపాలుని
కౌగిలించుకొని
గోడున
యేడ్వనారంభించెను.
గోపాలునకు
అన్నియూ
తెలిసియూ
తెలియని
వానివలె
నటించుచు,
"గురుజీ!
మీ
దుఃఖమునకు
కారణము
తెలుపుడు.
దానిని
నివారించుటకు
మా
శాయశక్తులా
వినియోగించి
ప్రయత్నింతుము!
గురువును
సంతోషపెట్టుటకంటె
మాకు
వేరొండు
పవిత్రకార్యములేదు.
మీరు
సంశయించక,
మేము
పిల్లలమని
భావించక
సెలవిండు"
అని
గోపాలుడు
సాందీపనిని
అనేక
విధముల
ప్రార్థించెను.
సాందీపుడు
సంతసించి,
బలరామ
కృష్ణులను
ఇరువైపుల
చెంతజేర్చుకొని,
"నాయనలారా!
ఇట్టి
శిష్యులు
చిక్కుట
నా
భాగ్యము.
మీ
మాటలే
నా
కార్యమును
సాధించి
యిచ్చినంతటి
ఆనందము
నందించినవి.
మీరు
సామాన్య
బాలురు
కారని
నా
అంతరాత్మ
నాకు
బోధించుచున్నది.
అందుకనే
ఈ
కార్యమును
మీరు
సాధించగలరను
దృఢ
సంకల్పము
నన్ను
ఒత్తిడి
పెట్టుటచే,
ముందూ
వెనుక
తడబడుచున్నాను.
నా
ప్రాప్తి
యెట్లున్నదో"
అని
తిరిగీ
కంటినీరు
కార్చుకొనుచుండ,
బలరాముడు
తిరిగీ
గురువు
పాదములు
పట్టి,
"గురూ!
పుత్రసమానమైన
మాపై
మీకింత
సంశయమెందుకు?
మీకానందము
కలిగించుటలో
మా
ప్రాణాలైననూ
అర్పింతుము,
తెలుపుడని
ప్రార్థించ,
పిల్లల
సత్యవచనములు
సాందీపునికి
సిగ్గు
కలిగించి,
చెప్పుట
మంచిదని
తలంచెనను.
శ్రీకృష్ణుని
అపూర్వ
గురుదక్షిణ
"కొమారులారా!
లేక
లేక,
నాకొక
కొమరుడు
కలిగియుండెను.
అతనిని
ప్రాణసమానముగా
ప్రేమించి
పెంచుచుంటిమి.
ఒకనాడు
సాగర
సంగమమైన
ప్రభాస
తీర్థమందు
స్నానమాచరించబోయి,
సముద్రమున
మునిగిపోయెను.
మిమ్ములను
చూచునదే
మీ
వినయ
విధేయతలు
అనుభవించునపుడంతయూ
ఆ
5
▾
Meaning
Keep
కుమారుడు
కన్నులకు
కట్టినట్లుండును.
మిమ్ములను
చూచుకొని
ఎంతయో
ఆనందమును
అనుభవించుచుంటిని.
మీరు
నేర్వవలసిన
విద్యలన్నియూ
అతి
శీఘ్రముగనే
నేర్చితిరి.
ఇక
మీరు
కూడనూ
నా
చెంత
ఉండుటకు
వీలుండదు.
నేనిక
ఎవరిని
చూచి
ఆనందింతు"నని
గోడుమని
ఏడ్చెను.
గోపాలుడు
ఉగ్రుడై,
"గురూత్తమా!
అపూర్వమైన
ఇన్ని
విద్యలు
మాకు
నేర్పించినందుకు
మేము
కూడనూ
ఇందుకు
తగిన
కృతజ్ఞత
చూపవలసిన
ధర్మము
లేక
పోలేదు
కదా!
కనుక
మేమిప్పుడే
బయలుదేరి
సముద్రునితో
పోరాడి,
తమ
పుత్ర
రత్నమును
తెచ్చి,
తమ
కర్పించి,
దానినే
గురుదక్షిణగా
భావించి
తమకు
శిష్యులైనందుకు
సార్థకనామము
నందుకొందుము
గాక!
ఆశీర్వదింపుడు,
అనుజ్ఞ
నొసగుడు"
అని
బలరామ
కృష్ణులు
పాదములకు
నమస్కరించి
లేచి
నిలిచిరి.
వీరు
సామాన్య
బాలురు
కాదనియూ
తప్పక
ఈ
కార్యమును
సాధించిపెట్టగలరనియూ
పూర్తి
విశ్వాసము
తనయందుండుటచే,
సాందీపుడు
వీరి
తలలను
ముద్దాడి,
ఆశీర్వదించి
పంపెను.
మహారాజా!
గురువాజ్ఞను
పొంది
బలరామ
కృష్ణులు
సాగర
సంగమునకు
హుటాహుటి
చని
గట్టున
నిలిచి,
గంభీర
స్వరముతో
"సాగరా!
మా
గురువైన
సాందీపుని
పుత్రరత్నమును
మాకిత్తువా,
మా
శిక్షకు
గురి
అగుదువా?"
అని
తెలియజెప్పిన
తోడనే,
సముద్రుడు
అదిరిపడి,
బలరామ
కృష్ణుల
పాదములు
తాకి,
"స్వామీ!
క్షమింపుము.
ఇది
నా
పొరపాటు
కాదు.
కాలవశమున
స్నానము
చేయుచున్న
బాలుడు,
కాలుజారి
కెరటములకు
గురియై
నా
గర్భమునకు
లాగుకొని
రాబడెను.
ఇంతలో
నాలో
ఎంతో
కాలమునుండియో
వాసముచేయుచుండిన
పంచజనుడనే
రాక్షసుడు
ఆ
బాలుని
పొట్టబెట్టుకొనెను.
ఇది
జరిగిన
విషయము;
తదుపరి
మీ
ఇష్టము"
అని
ఉన్న
సత్యమును
సముద్రుడు
విన్నవించగా,
కృష్ణుడు,
"అటులయిన
సరి"
అని
సముద్ర
గర్భమున
ప్రవేశించి,
రాక్షసుడైన
పంచజనుని
పసిగట్టి
వానితో
పోరాడి
క్షణమున
యమున
కప్పజెప్పి
పొట్టను
బ్రద్దలు
చేసి
చూడ,
6
▾
Meaning
Keep
అందులో
గురుపుత్రుడు
కనిపించకుండినందున,
మరింత
క్రోధముతో
ప్రేగులన్నియూ
గాలించగా
అందులో
ఒక
శంఖము
కనిపించెను.
దానిని
చేతబట్టి
గురుపుత్రుని
జాడను
తెలిసికొనవలెనని
నేరుగా
యమపురికి
వెళ్ళి,
సంయమమనే
నగరముచేరి
అచ్చట
పురద్వారమున
నిలిచి
తాను
సముద్రమున
పంచజనుని
పొట్టనుండి
తెచ్చిన
శంఖమును
ఊదగా,
పిడుగువంటి
ఆ
ధ్వని
యముని
కర్ణముల
యినుము
కాచి
పోసినట్లు
బాధించెను.
అది
భరించలేక
ఉగ్రుడై
యముడు
ద్వారము
చేరగా,
అక్కడ
బలరామ
కృష్ణులను
గాంచి
నమస్కరించి
"తమ
రాకకు
కారణమే"మని
ప్రార్థించగా
గురుపుత్రుని
తెచ్చి
యిమ్మని
బలరామకృష్ణులు
ఆజ్ఞ
చేయగా,
వెంటనే
చిత్తమని
చేతులు
జోడించుకొని
తన
పరివారమునకు
ఆజ్ఞాపించి
పవిత్రుడైన
గురుపుత్రుని
తెచ్చి
బలరామకృష్ణులకు
ఒప్ప
చెప్పెను.
వెంటనే
బలరామకృష్ణులు
ఆ
బాలుని
తమతో
తోడ్కొని
వచ్చి
గురువైన
సాందీపునికి
అప్పజెప్పి,
"ఇది
మా
గురుదక్షిణగా
స్వీకరించ"మని
గోపాలుడు
కోరెను.
ఆ
బాలుని
చూచిన
తల్లిదండ్రులైన
సాందీపుని
సతిపతులు
ఎంత
ఆనందించిరో
తెలుప
తరముకాదు.
ఇట్టి
మహత్తరమైన
కార్యము
సాధించి,
గతించిన
గురుపుత్రుని
బ్రతికించి,
గురువునకు
దక్షిణగా
యిచ్చిన
ఆ
గోపాలుని
శక్తి
సామర్థ్యములు
సామాన్యమైనవని
ఎట్టి
మూర్ఖులైననూ
తలంచరు
కదా!
సాందీపుడు,
వీరలు
నిజముగా
నరనారాయణులే
అని
తలంచి,
విశ్వసించి,
ఇట్టి
వారలు
తమకు
శిష్యులయిరి
కదా!
వారలకు
తాను
గురువయితిని
కదా
అని
తనలో
తాను
ఉప్పాంగి
జన్మ
తరించినదని,
మనసున
వారలకు
నమస్కరించి,
ఆనంద
బాష్పములతో
బలరామకృష్ణులను
ఆలింగనము
చేసి
శిరస్సులను
ముద్దాడి,
వీడ్కోలు
జరిపిరి.
అంత
బలరామ
కృష్ణులు
కూడనూ,
గురువు,
గురుపత్ని
వారల
వద్ద
శెలవు
తీసుకొని,
రథమునెక్కి
మధురాపురము
చేరుకొనిరి.
గురువునకు
చేసిన
ఉపకార
మహాత్మ్యమును
విని
మధురాపురవాసులు
కృష్ణుని
కొనియాడి
అత్యంతానందమున
7
▾
Meaning
Keep
పొందిరి.
ఇట్టి
గోపాలుని
విద్యావిధానములోని
నీతులు,
వినయ
విధేయతలు
బాలురకు
ఎంతటి
మార్గదర్శకములూ,
పెద్దలకెంత
ఆనందదాయకములో
యోచించుడు.
రాజా!
గోపాలుడు
ప్రతి
చిన్న
పని
యందునూ
ఒకే
అంతరార్థమును
లోకమునకు
బోధించుచునే
యుండును.
అది
మందమతులైన
మానవులు
తెలిసికొనలేక
పెడర్థములు
కలిగింతురు.
చేపకు
ఈత
నేర్పువారు
లోకమున
నుందురా?
అటులనే
దైవమునకు
విద్య
నేర్పువారుందురా?
లేకపోయిననూ,
దైవమునకు
సర్వ
విద్యలూ
తన
పొట్టలోనివైననూ,
గురువును
పొందవలసిన
విధానమును,
గురు
బుణమును
తీర్చవలసిన
విధానమును,
విద్యయొక్క
వినయ
సంపదను
ఏరీతిగా
అనుభవించవలెనను
పాఠము
ఈనాటి
విద్యార్థులకు
నేర్పుటకే
తాను
విద్యార్థుల
ప్రతినిధిగా
నటించి
ఆచరించి,
ఆదర్శమును
అందించెను.
ఆహా!
దైవరహస్యమెంత
సూక్ష్మమైనది"
అని
శుకుడు
ఆనంద
బాష్పములు
రాల్చెను.
Previous
←
The Subduing of Kāḷiya
Next
"Mṛtyor Mā Amṛtaṃ Gamaya" — "Lead Me from Death to Immortality"
→