Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · "Mṛtyor Mā Amṛtaṃ Gamaya" — "Lead Me from Death to Immortality"
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
40.
"మృత్యోర్మా
అమృతంగమయ"
కృష్ణుని
గురుభక్తిని
వింటున్న
పరీక్షిత్
మహారాజు,
గగుర్పాటున
కన్నులు
తెరచి,
మహాబుషిని
చూచి,
"స్వామీ!
గోపాలుని
లీలలు
ఒకదానికి
మించి
మరొకటి
వింతలు!
మహాద్భుతములు!
లోకమును
తీర్చి
దిద్దుటకై
దైవమెంతటి
శ్రమనైననూ
వోర్చి,
తన
సత్య
శక్తిని
నిరూపించును.
అయితే,
కరుడు
కట్టిన
మాయ
మానవుని
కన్నులను
కప్పి,
దైవత్వమును
విశ్వసింపక
చేయుటలో
వున్న
అంతరార్థము
నా
కర్థమగుటలేదు"
అని
పరీక్షిత్
మహారాజు
సంశయమును
వెలిబుచ్చెను.
దైవ
విశ్వాసము
జన్మాంతర
పుణ్యమే!
శుకుడు
వెంటనే
అందుకొని
"మహారాజా!
అదే
జన్మాంతర
పాపపుణ్యముల
ఫలము.
జన్మాంతరమున
చేసిన
పుణ్యఫలము
ప్రోగయి
చేరుటచే,
పాపము
నశించి,
దైవత్వమును
విశ్వసించి,
దైవశక్తిని
ఆశ్రయించి,
దానినే
ఆధారము
చేసుకొని
జీవింతురు.
అట్లుగాక
జన్మాంతరమున
ఘోర
కృత్యము
లోనర్చిన
వారలకు
పాపఫలము;
కన్నులకు
కప్పి,
దైవమునే
స్ఫురించక,
మంచిని
ఆశించక,
మాయకు
బానిసలై,
దానవత్వమును
వారి
వ్యక్తిత్వముగా
భావించి,
క్రూర
కృత్యములు
చేతురు.
దైవ
విశ్వాసము
ఒక
జన్మాంతర
పుణ్యమనే
చెప్పవలెను,
కాకున్న
అప్పటికప్పుడు
ఉట్టిపడునది
కాదు"
అని
శుకులవారు
సమాధానము
తెలుపగనే,
మహారాజునకు
పుణ్య
పాపముల
ఫలములు
2
▾
Meaning
Keep
తెలుసుకొనవలెనను
కాంక్షచే,
కృష్ణుని
లీలలతో
చేరిన
మరొక
శాపవిమోచన
కథను
తెలుపుమని
కోరెను.
అంత
శుకుడు
నవ్వుతూ,
"మహారాజా!
గోపాలుడు
విమోచన
చేసిన
శాపము
లెన్నియో
కలవు!
ఇంతవరకు
చెప్పిన
బాలలీలలన్నియు
ఆయా
రాక్షసుల
శాప
విమోచనలే
కదా!
అని
నుడువగ,
మహారాజు
అందుకొని,
"మద్దులను
గూల్చుట
మహా
విచిత్రముగా
వినియుంటిని!
దానిని
గురించి
విపులముగా
శెలవిచ్చిన
విని
ఆనందింతును"
అని
ప్రార్థించెను.
అన్నింటికిని
సిద్ధముగావున్న
శుకులు
చెప్ప
ప్రారంభించెను.
"రాజా!
యశోదమ్మ
యింటిలో
పరిచారకలు
కావలసినంతమంది
వుండిననూ,
ఇంటి
సాంప్రదాయము
ననుసరించి,
ఇల్లాలే
పాడిపంటల
విషయమున
స్వయముగా
శ్రద్ధ
వహించెడిది.
పాలు
తోడంటు
వేయుట,
చిలుకుట,
వెన్న
తీయుట,
వాటిని
భద్రము
చేయుట
ఇత్యాది
పనులు
చేయుచుండెడిది.
యశోద
ఆవేదన
-
ఉలూఖ
బంధనము
ఒకనాడు
బ్రహ్మ
ముహూర్తమున
లేచి,
కాల
కృత్యములు
తీర్చుకొని
స్నాన
పానాదులు
సలిపి,
ఉట్టిమీదగల
పెరుగు
చట్టిని
తీసి,
కుదుటిలో
పెట్టి,
ఏదో
దైవమునకు
సంబంధించిన
పాటలు
పాడుతూ
కవ్వమును
చేతపట్టి
పెరుగు
చిలుకుచుండెను.
ఇంతలో
గోపాలుడు
గంతులు
వేయుచూ
అమ్మ
పెరుగు
చిలుకుచున్న
స్థానమునకు
వచ్చి
అమ్మ
పైటపట్టిలాగెను.
యశోద
దిగ్గున
వెనుకకు
తిరిగి
చూడ,
గోపాలుడు!
పెరుగు
చిలుకుట
మాని,
"నాయనా!
ఇంకను
తెల్లవారలేదుకదా!
కొంతసేపు
నిద్రించు
పో"
అని
చెప్పెను.
గోపాలుడు
అల్లిబిల్లి
పలుకులతో
"ఆకలిగా
యున్నది"
అని
నంగి
యేడ్పులు
మొదలు
పెట్ట,
యశోదమ్మ
మనసు
కరగి
కవ్వము
నావల
పెట్టి,
పెరుగు
కుండపై
మూత
పెట్టి,
అక్కడే
కూర్చుని
గోపాలునకు
పాలిచ్చుచూ,
తల
నిమురుతూ
3
▾
Meaning
Keep
వుండగా,
ఇంతలో
లోన
పాలకుండలు
శబ్దము
వినిపించగనే,
పిల్లి
కుండలు
దొర్లించెనేమో
అని
బాలుని
వడినుండి
తీసి
క్రిందకు
దింపి,
లోనికి
పరుగెత్తుకొని
పోయిన
అమ్మను
చూచుచూ,
తనను
ఒడినుండి
దింపివేసెను
కదా
అను
కోపముచే,
కడుపునిండా
పాలివ్వక
పోయెనను
నిరాశచే,
చిలుకుచూ
విడిచిన
కుండను
బ్రద్దలు
కొట్టెను.
పైన
తేలిన
వెన్నను
బాగా
తిని
బైట
పరిగెత్తెను.
ఇంతలో
యశోదమ్మ
లోనికివచ్చి
చూడ,
పెరుగు
కుండ
బ్రద్దలైనది.
అందులోని
మీగడ
ఆవగింజంతైనా
కనిపించలేదు.
అక్కడ
కృష్ణుడు
అసలు
లేడు.
ఇదంతా
గోపాలుని
పనియే
అని
గుర్తించి
అటూ
ఇటూ
వెతికెను.
ఎక్కడనూ
కనిపించలేదు!
బైటవచ్చి,
ప్రక్కింటి
వారలను
విచారించెను.
ఎవరూ
మాకు
తెలియదు,
మేము
చూడలేదని
తెలుప,
యశోదమ్మకు
భయమేర్పడి,
చిన్నబిడ్డ
ఈ
చీకటిలో
కుండను
బ్రద్దలు
చేసిన
భయముతో
అమ్మ
కొట్టుననని
ఎక్కడికైననూ
వెళ్ళెనేమో
అని
కంగారుతో
ఇల్లిల్లు
వెతుకుతూ
పోగా,
ఒక
ఇంటిలో
రోలును
ఎక్కి
ఉట్టిమీదగల
వెన్నచట్టిని
అందుకొనుచుండు
గోపాలుని
గాంచెను.
"ఒరే
దొంగా!
అందరి
ఇండ్లయందూ
నీవీ
విధముగ
చేయుచుంటివా?
గోపికలు
ఎంత
చెప్పిననూ
నేను
వారి
మాటలను
నమ్మక,
వారలనే
మందలించి
పంపుచుంటిని;
నేడు
కండ్లార
చూచిన
నా
కన్నులనే
నేను
నమ్మలేకున్నాను.
ఇంత
కాల
మెంత
పోరబడితిని.
ఇక
నిన్ను
ఊరక
విడువరాదు.
పిల్లడు
కదా!
అని
గారాలు
చేసిన,
కడకు
ప్రమాదకరమగు
కర్మలకు
గురి
అగుదురు.
ఇక
నిన్ను
బాగ
శిక్షించవలెనే
కాని,
క్షమించరాదు.
పెద్దింటి
బిడ్డ
ఈ
విధముగా
దొంగగా
మారినాడన్న,
కన్న
తల్లిదండ్రులకే
కాక,
వంశమునకే
చెడు
కీర్తి
వ్యాపించును.
మన
ఇంటికంతకు
కళంక
మేర్పడును"
అని
ఆమె
ఏనాడూ
పడనంతటి
ఆవేదన,
క్రోధమూ
చేరిపోవుటచే,
ఒక
త్రాటిని
చేతపట్టి
రోలు
దగ్గరకు
పరువెత్తిపోయెను.
4
▾
Meaning
Keep
ఇంతలో
గోపాలుడు
ఆమెకు
చిక్కక
అక్కడ
దూరి,
యిక్కడ
దూరి,
ఊరంతా
తల్లిని
త్రిప్పుచుండెను.
ఇంతలో
యశోదమ్మ
స్థూలదేహము
కలదగుటచే,
ఏనాడూ
అట్లు
పరుగిడు
అలవాటు
లేకపోవుటచే,
అలసిపోయి,
బుసలుకొట్టుచూ
నిదానముగా
నడుచుచున్న
దృశ్యమును
చూచి
ఊరివారలందరూ,
పిల్లలు,
పెద్దలు,
స్త్రీలు
ఒకే
నవ్వులు.
గోపాలుని
ఈ
చిలిపి
చేష్టలు
వారలకు
మరింత
ఆనందమును
కలిగించుచుండెను.
కృష్ణుడు
కుబేర
తనయుల
శాపవిమోచనము
చేయుట
జగ
మెరిగిన
గోపాలుడు
కనుక,
తల్లి
అలసిపోయినదని
గమనించి
తానై
తాను
అమ్మ
చేతికి
చిక్కెను.
అపుడు
యశోద
కుమారుని
కొట్టుటకు
చేతులాడక,
గట్టిగా
చేయి
పట్టుకొని,
"బజారులో
కొట్టిన
బాగుండదు,
దొంగా!
ఇంటికి
రా!
నీ
ఆట
పట్టింతునని"
ఇంటికి
తీసుకొనిపోయి
ఒక
పెద్ద
త్రాడును
తీసి,
రాతిరోటికి
కట్టివేయుటకు
ప్రయత్నించెను,
త్రాడు
చాలనందున,
మరీ
లోనకెళ్ళి
ఇంకొక
త్రాడును
తెచ్చి
అతికించెను.
ఈ
విధముగా
అనేక
పర్యాయములు
త్రాళ్ళను
తెచ్చి
కట్టిననూ
కొంత
చాలకుండుటచూచి
ఇది
వీని
మాయయని
తలంచక,
మాయకు
వశమై
ఎట్లో
ఒకకట్టు
కట్టివేసి
లోనికి
వెళ్ళి
ఇంటిపనులు
చూచుకొనుచుండెను.
ఇంతలో
కృష్ణుడు
ఆ
రోటిని
దొర్లించుకొనిపోయి,
దొడ్డిలోగల
రెండు
కొమ్ములు
గల
పెద్ద
మద్దిచెట్ల
మధ్యలో
ఇరికించెను.
ఆ
రోటిని
గోపాలుడు
లాగెనో
లేదో,
ఆ
వూపుతో
పెళ్ళుమను
శబ్దముతో
మద్దిచెట్టు
వేర్లతో
కుప్ప
కూలినటుల
నేల
కూలెను.
ఆ
శబ్దము
ప్రేపల్లె
వాసులందరూ
విని,
యశోదమ్మ
ఇంటిలో
వర్షము,
గాలి
లేకపోయిననూ
చెట్టు
కూలినదని
అందరూ
పరుగెత్తుకొని
వచ్చి
చూచిరి.
అంతలో
యశోదమ్మ
వచ్చి
చూడగా,
గుండెలు
ఝల్లుమనెను.
ఆ
చెట్టు
కొమ్మల
మధ్య
చిన్న
గోపాలుడు
కనిపించుచున్నాడు.
కెవ్వున
అరచి
యశోదమ్మ
పరుగిడి
పోయి
కట్టు
విప్పి
చంకనబెట్టి,
గొప్ప
గండము
తప్పినది
నా
5
▾
Meaning
Keep
గోపాలునకని,
"గోపాలా!
భయపడితివా?
అయ్యో!
నేనెంత
దుర్మార్గురాల"నని
ఏడ్చుచుండెను.
ఆ
చెట్టునుండి
ఇద్దరు
దివ్యపురుషులు
బయలుదేరి
గోపాలునికి
నమస్కరించి,
"స్వామీ!
మేము
కుబేరుని
తనయులైన,
నలకూబరుడు,
మణిగ్రీవుడు
అను
పేర్లు
గల
వారలము.
నారద
శాపముచేత
మేమీ
వృక్షరూపమున
నివసించుచుంటిమి.
ఈ
నాటితో
మా
శాపవిమోచనమాయె.
శెలవైన,
మేమిక
స్వస్థానమునకు
వెడలిపోదుము"
అని
ప్రార్థించి
అంతర్ధానమయిరి.
ఈ
విచిత్ర
రూపధారులను
చూచి,
గోకులవాసులు
దిగ్భ్రాంతిజెంది
ఆశ్చర్యానందమొందిరి.
గోపాలుని
దైవత్వమును
ఆ
దివ్యపురుషులవలన
వినియూ
నివురు
గప్పిన
నిప్పువలె
మాయకు
బద్ధులై,
తిరిగి
గోపాలుడు
మన
నంద
యశోదమ్మల
కొమారుడు,
మన
గొల్ల
పిల్లవాడు,
మన
మిత్రుడు
అను
భ్రాంతికిలోనై
మనలు
చుండిరి"
అని
శుకులవారు
శెలవియ్యగా
పరీక్షిత్
అందుకొని
"స్వామీ!
మాయకంతటి
మహత్తరమైన
శక్తి
ఎట్లు
కలిగినది?
మాధవునే
మరిపించునట్టి
గుణము
మాయకు
ఎవరిచ్చిరి?
అసలు
దాని
స్వరూపమేమి?"
అని
ప్రార్థించెను.
భగవంతుడు
మాయోపాధి
శుకమహర్షి,
"రాజా!
మాయకొక
రూపమంటూ
లేదు.
భగవంతుడు
మాయోపాధి,
అనగా
మాయనే
ఉపాధిగా
ధరించినవాడు,
భగవంతుడు.
దీని
అంతరార్థము
భగవంతుని
కప్పిపుచ్చునదే
మాయ
యని
తేలుచున్నది.
దాని
గుణమే
అది.
దానిని
ఎవరు
తీసి
వేతురో,
తొలగింతురో,
భేదింతురో,
వారే
దైవమును
దర్శింతురు.
దైవమును
పొందుదురు.
లేని
దానిని
కలదని
భ్రమించుటే
మాయ.
ఎండమావులను
చూచి
నీరని
భ్రమించునట్లు,
సంకల్పములను
చూచి,
సాక్షాత్
అని,
భ్రమించుచున్నారు.
అసలు
సంకల్పములే
లేక
చూచుకొన్న
భ్రాంతికి
చోటుండదు
కదా!
6
▾
Meaning
Keep
కాకున్న,
యశోదమ్మ
యెన్నియో
పర్యాయములు
గోపాలుని
దివ్యశక్తులు
కళ్ళారా
చూచి
దిగ్భ్రాంతిచెంది,
తిరిగి
బాలకుడను
భ్రాంతికి
తావిచ్చుట,
నా
కుమారుడను
సంకల్పమే
దీనికి
మూలకారణము.
దేహము,
మాతృదేహమునకు
కొమారుడు
కావచ్చునే
కానీ,
దేహికి
దేహి
యొట్టి
సంబంధుడూ
కాదు.
ఏకస్వరూపుడే.
అట్టి
సత్యమును
విచారణతో
తెలిసికొన్న,
విషయములపై
భ్రాంతి
ఎందుకుండును?
విచారణ
చేయక,
విషయమును
తెలిసికొనకపోవుటచేతనే,
భ్రాంతి
మరింత
పెరిగి
పెరిగి,
మానవుని
బుద్ధిని
తరిగివేయుచున్నది,
అని
బోధించెను.
ఉపాధుల
భ్రాంతిని
వీడి
ఉపాసన
చేయుడు!
"ఆహా!
దైవోపాధి
యెంతపని
చేయుచున్నది?
ఉపాధుల
భ్రాంతిని
వీడి,
ఉపాసన
చేయుడని
బోధించిన
వేదాంత
తత్త్వముల
అంతరార్థము
ఇదియే
కాబోలు.
ఉపాధి
భ్రాంతి
అన్న,
మాయాభీష్టమన్నమాట!
ఉపాధిని,
అనగా
దేహ
భ్రాంతి
కలవారు,
మాయామోహితులనే
తేలుచున్నది.
దేహమునే
లక్ష్యమందుంచుకొన్నవారికి
దేహి
కనిపించడు
కదా!
నివురుకప్పినచోటు
నిప్పు
కనిపించనటుల,
కన్నులకు
పారవచ్చినప్పుడు
దృష్టి
పోయినటుల,
దేహభ్రాంతి
అను
మాయ
కప్పినప్పుడు
దేహి
కనిపించడనుటలో
ఎట్టి
సంశయమునూ
లేదు.
స్వామీ!
ఈనాడు
నిజముగా
నా
పారలు
వీడినవి.
నివురు,
తమ
బోధామృతమును
గాలికి
ఎగిరిపోయినది.
ఈ
పాంచభౌతికమైన
దేహభ్రాంతి
పటాపంచలైనది.
ధన్యుడ!
ధన్యుడ"నని
పరీక్షిత్
మహారాజు
శుకుని
పాదములపై
బడి
నమస్కరించెను.
ఇంతలో
అక్కడ
చేరిన
బుషులలో,
ప్రజలలో,
గుసగుసలు
బయలుదేరెను.
కాలము
సమీపించుకొలదీ
కాయము
నెట్లయిననూ
వీడవలెను
కదా,
ప్రాణవాయువు
కాయమును
వీడును
గానీ,
మనస్సు
వీడదు.
అందువలననే
కాబోలు,
మనస్సంకల్పము
మటుమాయము
కానంతవరకూ,
మరుజన్మల
7
▾
Meaning
Keep
నొందుచుందురు
సామాన్య
మానవులు.
ఈనాడు
మన
మహారాజు
కాయమునుండి
మనస్సును
వేరుచేసెను.
ఇక
ప్రాణముండియూ
ప్రయోజనముండదు.
మనస్సును
సదా
మాధవునిలో
లీనము
చేసిన,
మానవత్వము
గుర్తునకే
రాదు.
ఈనాడు
శుకమహర్షి
చెప్పిన
సుబోధలు
ఒక
పరీక్షిత్తునకే
కాక,
దేహభ్రాంతిగల
ప్రతి
మానవునకూ
అన్వయించుచున్నవి.
దేహభ్రాంతి
బంధ
కారణము,
ఆత్మభ్రాంతి
మోక్షకారణము
అని
వేదశాస్త్రములు
తెలిపినటుల,
మనసే,
ఈ
రెండింటికీ
మూలకారణముగ
స్పష్టమగుచున్నది.
"మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః"
అన్న
శ్రుతివాక్యము
సత్యము
అని
అందరూ
కన్నులు
మూసుకొని
కొంతసేపు
దైవప్రార్థనలు
సలిపిరి.
సూర్యాస్తమయ
మగుటచేత,
గంగా
తీరమునకు
సంధ్యా
వందనములకై
కొందరు
దండకమండలములు
ధరించి
కదలిపోయిరి.
Previous
←
The Schooling of the All-Knowing Lord of All
Next
The Account of Śrī Kṛṣṇa's Birth
→