Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · The Destruction of the Manas Is the Goal of Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
3.
మనోనాశనమే
ధ్యాన
లక్ష్యము
హితాహితములకు
మానసిక
స్థితియే
కారణము
లోకమున
మానవుని
స్థితి
గతులు
రెండు
విధములుగా
నున్నవి.
అవియే
హితము,
అహితము.
ఇట్లు
వారి
వారి
పరిస్థితి
హితముగానో,
అహితముగానో
నుండుట
వారి
వారి
హృదయాంతర్గత
దృష్టిని
బట్టి
యుండును.
చూడు!
మానవునికి
ఒక
వస్తువు
ఒకప్పుడు
హితముగాను,
మరొకప్పుడు
అదే
వస్తువు
అహితముగాను
తోచును.
ఒక
సమయమున
యెంతో
ప్రీతిని
కలిగించునదే
మరొక
సమయమున
నప్రీతియయి
దానిని
చూచుటకు
కూడను
ఇచ్ఛ
రాకుండును.
ఈ
రీతిగా
దోచుటకు
తలంచుటకు
ఆయా
సమయములందుండు,
మనస్సు
యొక్క
స్థితియే
కారణముగా
నున్నది.
2
▾
Meaning
Keep
అట్టి
మనస్సును
ఎల్లప్పుడు
ప్రీతి
హితముగనే
ఉండునట్లు
చేసికొనుట
ప్రతి
యొక్కరికి
అవసరము.
నదీ
ప్రవాహము
కొండలలో
పారుట,
లోయలలో
దుముకుట,
దాని
మూలమున
వడిగా
ప్రవహించుట,
అంతియే
గాక
మధ్య
మధ్య
కొన్ని
ఉపనదులు,
చిన్న
కాలువలు
చేరి
కలుషితంబగుట
మున్నగునవి
ఏ
విధముగా
నుండునో,
అట్లే
మానవుని
జీవిత
ప్రవాహమున
సహితము
తీవ్రతలు,
అధిక
ప్రవాహములు,
హెచ్చు
పల్లపు
ఒడిదుడుకులు
వచ్చుచుండును.
ఈ
ఒడిదుడుకులు
మానవుని
జీవితమున
ఏ
సమయమునందైనను
సంభవించవచ్చును.
3
▾
Meaning
Keep
కొందరికి
ఆదిలో,
మరికొందరికి
అంత్యములో,
ఇంకా
కొందరికి
మధ్య
కాలములో,
ఈ
రీతిగా
ఎప్పుడో
ఒకప్పుడు
కలుగుట
తప్పునది
కాదు.
కాన,
మొదట
మానవుడు
దృఢము
చేసికొనవలసిన
దేమనగా,
జీవితమిట్టి
యొడిదుడుకులతో
కూడియుండినను
తనకు
కొత్త
అనుభవము
చేకూర్చుటకు
వచ్చినవని
భావింపవలెను.
భావించుటే
గాక
ఎట్టిది
వచ్చినను
ఆనందముగా
దేనికైనను
స్వాగతమీయవలెను.
అప్పుడు
ఎంతటి
బాధలయిన,
దుఃఖములైన
తేలికగా,
త్వరగా
గడచిపోవును.
దీనికి
సహితము
మనస్సు
యొక్క
స్థితియే
కారణము.
నిమిష
నిమిషానికి
లోనుండి,
బయటనుండి
అనేక
ప్రేరణలు
పుట్టుచు
మానవుని
చేరుచున్నవి.
ఇట్టి
వాని
కన్నింటికి
ఒక్క
సమయమున
మనసిచ్చుట
సాధ్యము
కాదు.
అప్పుడు
మానవుడు
తనను
కలియ
వచ్చిన
అనేక
సంకల్పములలో
తనకు
అతి
ముఖ్యమైనదేదో
దానిని
మాత్రమే
వేరు
చేసుకొని
దానిని
తన
మనో
లక్ష్యమున
నిల్పవలెను.
దీనినే
అవధానమని
యందురు.
4
▾
Meaning
Keep
లోకమున
విషయములను
చక్కగా
గ్రహించవలెనన్న
అవధానము
అతి
ముఖ్యము.
అట్టి
అవధానము
(మనోలక్ష్యము)
తనకు
యిష్టమైన
విషయముపై
ఉద్ధేశ
పూర్వకముగా
నిల్పుటనే
చిత్తైకాగ్రత
యందురు.
ఇట్టి
దానికి
సహితము
మనసే
కారణము.
అట్టి
అవధానము,
చిత్తైకాగ్రత
రెండును
వరణకార్యములై
యుండి
మానసిక
లక్ష్యమున
విషయములను
నిలుపునట్లు
జేయును.
5
▾
Meaning
Keep
చిత్తైకాగ్రతయొక్క
జన్మస్థానమే
ధ్యానము
చిత్తైకాగ్రత
ప్రతి
యొక్కరికి
అవసరము.
అదియే
మానవుని
సర్వ
కార్యములకు
పునాదివంటిది.
అది
కేవలము
ధ్యాన
యోగమునందువలె
లౌకిక,
సాంసారిక
విషయములందును
అవసరము.
తానే
పని
చేయుచుండినను,
వ్యక్తి
చిత్తైకాగ్రత
కలిగియుండిన,
తనను
తాను
విశ్వసించుకొనువాడే
కాక,
గౌరవించుకొనువాడగును.
ఇవి
కేవలము
మనస్సంకల్పములపైన
ఆధారపడినవి.
6
▾
Meaning
Keep
ఆ
సంకల్పము
చెడు
తలంపులపైన
పోవచ్చును.
మంచి
తలంపులపైన
పోవచ్చును.
సంకల్పములు
శుద్ధ,
అశుద్ధములుగ
నుండును.
అయితే
శుద్ధ
సంకల్పముపై
మనస్సు
వ్రాలునటుల
చేయుట
ప్రధానము.
అట్టి
మనో
లక్ష్యము
యొక్క
సఫలతా
విఫలతలు
ఏకాగ్రతననుసరించి
యుండును.
ఏకాగ్రతా
శక్తి
సామర్థ్యములను
వృద్ధి
చేయును.
మనస్సునకు
వికలత్వము
కలుగజేయు
సంసార
విషయములను
నిరోధించనిదే
ఏకాగ్రత
దుస్సాధ్యము.
అట్టి
ఏకాగ్రత
మనో
నాశము,
ఒక్క
ధ్యానము
వల్లనే
చేజిక్కును.
7
▾
Meaning
Keep
లోకమున
కొందరు
తమకు
తాము
పాపులమని
నిందించుకొనుచున్నారు.
కొందరు
తమ్ము
తాము
గొప్పగ
తలంచి
పొగడుకొనుచున్నారు.
రెండు
తెగల
వారు
తమతమ
మనో
వికారముల
చేత
పీడింపబడుచున్నారు.
అట్టి
వారికి
మనస్తుష్టి
యత్యవసరము.
దానికి
ధ్యానము
ప్రధానము.
దాని
మూలమున
తెలివియు,
వికాసమును
పొందును.
దీనికి
నిజమైన
అభిరుచి
కావలెను.
అభిరుచి
యొక
సంవేదనయై
యుండి
చిత్తైకాగ్రతను
ప్రేరేపించునదై
యుండును.
ఈ
సంవేదన
సహితము
మానవునకిష్టమైనదిగనో,
అయిష్టమైనదిగనో
యుండవచ్చును.
కొందరికి
సంగీతమిష్టము.
ఎందుకు?
దానిపై
వారికి
యభిరుచి.
ఆ
సంవేదన
ఇష్టమయినదిగా
నుండును.
వారివారి
బంధుమిత్రుల
శవములను
చూచునపుడు
కలిగెడి
సంవేదనలు
చూచు
వారికి
శోకముగా
నుండును.
అప్పుడు
చూపులు
కూడను
అభిరుచి
జనకముగనే
యుండును.
8
▾
Meaning
Keep
ఈ
అభిరుచులు
ఎట్టివైనను
సరే!
వారివారి
అవధానము
నడుపజాలినవై
యుండును.
అభిరుచియందు
అవధానమును
ప్రోత్సహించు
శక్తి
యుండును.
అభిరుచి
యనునది
గుప్త
రూపముననున్న
అవధానము.
అవధానము
క్రియా
రూపమున
నున్న
యభిరుచి.
అభిరుచి
లేకున్నచో
అవధానము
చక్కగా
నడువజాలదు.
ఈ
రెండింటికిని
వాగర్థములవలె
విడరాని
సంబంధము.
అవధానము
యొక్క
వృద్ధి
క్షయములు
అభిరుచి
యొక్క
వృద్ధి
క్షయములమీద
ఆధారపడియుండును.
వీటన్నిటికి
ఏకాగ్రత
ముఖ్యము.
ఏకాగ్రతా
జన్మస్థానమే
ధ్యానము.
9
▾
Meaning
Keep
లోకమున
గొప్ప
గొప్ప
మహనీయులు,
ఋషులు
వారివారి
మనో
వృత్తులను
అణగద్రొక్కి,
సాత్త్విక
మార్గమున
మనసును
వంచి
సర్వవేళలయందు
సర్వేశ్వర
చింతన
నేకరీతిగా
చేయుచు
దానిని
హృదయమున
ప్రతిష్ఠచేసి,
అందులో
ఐక్యత
పొందినది
కూడ
ఈ
ధ్యాన
సాధన
వల్లనే.
మొదట
అభిరుచి.
రెండవది
మనో
లక్ష్యము.
దాని
మూలముననే
చిత్తైకాగ్రత.
అదే
మనో
నాశమొనర్చును.
మనో
నాశనమే
ధ్యానము
యొక్క
లక్ష్యము.
10
▾
Meaning
Keep
నిర్మలమైన
మనసున
క్రొత్త
ఎఱుక
శక్తి
గలుగును
మానవుని
మనస్సు
సుఖము
నపేక్షించి,
విషయములందు
చేరుట
మానవలెను.
మనసునకు
కల్గిన
అసత్య
భయములను,
విపరీతమైన
కోరికలను,
దుఃఖములను,
బాధలను,
కల్పిత
సుఖములను
తొలగించవలెను.
అనగా
మనసుకు
విచక్షణ
నేర్పవలెను.
కనిపించు
అసత్యములనే
కూపమునందుండు
భూతము
అసత్యమని
తెలిసికొనునట్లు
అభ్యాసము
చేయవలెను.
జీవితమున
ప్రతి
మానవునకు
గల
అగచాట్లకు
ఇదియే
పరిహారము.
ఇవి
జీవిత
ధ్యానము
వల్లనే
లభించును.
11
▾
Meaning
Keep
ఈ
మనసును
తనకు
గల
భ్రమ,
స్వప్నములను
మరచి
తన
సామ్రాజ్య
స్వర్గమును
జ్ఞప్తియందుంచుకొనునట్లు
జేయుట
ధ్యానమువల్ల
సాధ్యము.
క్రమముగా,
శాంతముగా
అభ్యాసము
చేయుటవల్ల
ధ్యానము
శాంతముగను,
తీవ్రముగను
సాగును.
ఉన్నత
అనుభవమును
పొందు
దారి
యేర్పడును.
ఉన్నత
దశను
పొందు
కొలదీ
ధ్యాన
సమయమున
గల
ప్రశాంత
నిర్మల
మనసున
ఒక
క్రొత్త
ఎఱుక
శక్తి
ఉత్పన్నమగును.
ధ్యాన
శిఖరమును
చేర
గలిగినపుడు
తన
ఎఱుక
శక్తి
దట్టమయి,
తన
నైజస్వరూపమునే
ధ్వంసము
చేసి,
భస్మము
చేయును.
అప్పటిలో
నేనే
ఉండునది.
జగత్తంతయు
నా
మనో
భ్రమ.
ఉండునది
ఒక్కటే
సత్యము.
భగవంతుడు,
సచ్చిదానంద
పరమాత్మ
శివోహం
ఒక్కటిగా
మారును.
12
▾
Meaning
Keep
ధ్యాత,
ధ్యానము
ఏకమగుటే
శాశ్వత
తేజోమయ
అనుభవము
ప్రత్యక్షముగా
సత్యమెంత
సూక్ష్మముగా,
ఎంత
సౌమ్యముగా
నున్నది?
సత్యమున
ఏ
ధ్యానము
లేదు.
ధ్యాత
లేదు.
అన్నియు
ఏకమగుచున్నవి.
అదియే
శాశ్వత
తేజోమయ
అనుభవము.
శుద్ధమైన
ఎఱుకయే
నేను.
అని
గానము
చేయుచు
జ్ఞాని
నిశ్శబ్ద
నిశ్చల
భావముతో
తనలో
తన
ఆత్మ
వైభవమును
అనుభవించుచుండును.
అదియే
ఆనందదాయక
గమ్య
స్థానము.
దివ్యామృత
ఫలము.
13
▾
Meaning
Keep
యోగసమాధియందిట్టి
బాహ్యాతీత
యనుభవమును
పొంది,
ధ్యానము
చాలించి
మానవుల
యందు
దివ్యత్వముగా
వ్యవహరించును.
అతని
యందు
వేదములు
ప్రతిఫలించును.
అతను
నిర్మల
జీవిగా
మారిపోవును.
మార్పు
గల
దేశకాల
పరిస్థితులను
నతిక్రమించి,
సదా
సర్వ
కాలములలో
నేకరీతిగా
కర్తను
ప్రతి
ఘర్షణ
పొందగలుగునట్లు
అభివృద్ధి
నొందించునది
ధ్యానము
తప్ప
మరొకటి
వేరు
లేదు.
14
▾
Meaning
Keep
జీవుడొక
పర్యాయము
పరిపక్వ
దశవైపు
తీర్చబడిన
యెడల
అతను
తనయందే
పూర్ణ
తృప్తి,
ఆనందము
ననుభవించును.
అదివరకు
జీవితమున
బాధించుచుండిన
ఆశలు,
కోరికలు,
మోహములు,
మృగ
చేష్టలు
మాయమగును.
ఆత్మ
అందరియందును
శాంతముగా,
సమముగా
వ్యాపించియున్నది.
కనుక
అదివరకుండిన
వ్యక్త
భావాహంకారము
తొలగి
పోయి,
తన
నిజమైన
దైవ
పదవిని
యనుభవించును.
అతనే
మహాత్ముడు.
జీవన్ముక్తుడు.
పరిపూర్ణమే
ఆనందము.
15
▾
Meaning
Keep
ఆనందమే
శాంతము.
భగవంతుడు,
నిజ
స్వరూపమున
పరిపూర్ణము,
ఆనందము,
శాంతము.
చక్కని
విచార
మార్గమును
వదలని
వారు
దైవానుగ్రహమును,
దైవాత్మను
పొందుచున్నారు.
వారు
సదా
ప్రపంచమందలి
స్వప్న
తుల్య
భ్రమలకు
కారణమగు
శాశ్వత
సత్యమును
వెతుకుచుందురు.
16
▾
Meaning
Keep
అంతర్
దృష్టితో
జీవించడమే
దివ్య
జీవితము
విచ్చల
విడిగ
పరిగెత్తునటువంటి
జ్ఞానేంద్రియములను
అరికట్టుము.
వ్యాధి
కారణము
తొలగుచున్నది.
మనసు,
దాని
చేష్టలను
గమనింపుము.
ఆలోచనల
పిచ్చి
ప్రవాహమును
అడ్డగించుము.
ఆలోచన
యొక్క
అలజడి
తగ్గుటకు
నామమును
ఉచ్ఛరింపుము.
దాని
వలన
మనసునందు
దుఃఖ
బాధలకు
చోటుండదు.
17
▾
Meaning
Keep
మనసు
నాశనము
కాగా,
జ్ఞానోత్పత్తి
గలుగును.
అతడే
పరిపూర్ణ
మానవుడు.
సాధకుడు
తొలుత
అంతర్ముఖ
దృష్టిని
పొందగల
సూక్ష్మమును
తెలిసికోవలెను.
ఇదివరకు
జీవితమున
దృష్టిని
వెలుపలికి
ప్రసరించుచుంటిరి.
అంతః
మానసిక
ప్రపంచమును
గుఱించి
స్వల్పముగా
వినియుంటిరి.
దివ్య
జీవితమంతయు
అంతర్జీవిత
విధానము.
పసిబిడ్డ
చూచుటకు,
తెలిసికొనుటకు
నేర్చుకొనిన
పిమ్మట
ఇంటిలో
అటు
ఇటు
నడచుటకు
సహాయము
ఎట్లు
పొందుచున్నదో,
అదే
రీతిగా
నూతన
సాధకుడు
అంతః
ప్రపంచమును
చూచుటకు,
తెలిసికొనుటకు
తొలుత
నేర్చుకొనవలెను.
18
▾
Meaning
Keep
ఒక
మంచి
పుష్టికరమైన
పసిబిడ్డ
తొట్టిలో
పరుండి
గోడమీద
దీపమును
చూచుచు
ఆనందముతో
కాలుచేతులు
కొట్టుచు,
కేకలు
వేయుచుండును.
అదే
విధముగ
సాధకుడు
కూడ
శరీర,
మానసిక,
ఆధ్యాత్మిక
పుష్టి
కలవాడై
ప్రపంచ
జీవితమును
గడుపుచు
తన
ధర్మములలో
తాను
పరుండియున్నను,
నిలకడ
లేక
అంతః
ప్రపంచము
వైపు
గమనించుచుండవలెను.
ప్రతి
ఆలోచన,
ప్రతి
మాట,
ప్రతి
కార్యము
నీ
పూర్తి
ప్రజ్ఞతో
వెలువడుచుండవలెను.
నీ
బుద్ధిని
అంతర్
ప్రపంచమును
గమనించు
పారాదారుడుగా
నియమించుము.
ఇదియే
అంతర్
విమర్శ.
ఆ
విమర్శకు
ధ్యానము
తల
వంటిది.
19
▾
Meaning
Keep
ఆత్మ
విమర్శయను
వాకిలి
ద్వార
ప్రతి
సాధకుడు
లోపల
ప్రవేశింపవచ్చును.
జీవిత
పవిత్ర
పదవి
యెదుట
భయ
భక్తులతో
ఆవేదనమొందు
సాధకులకు
ఈ
ద్వారము
స్వాగతమిచ్చుచున్నది.
Previous
←
Success in Dhyāna, and Its Fruit
Next
Good Qualities Are What Fit One for Dhyāna
→