Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Good Qualities Are What Fit One for Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
4.
సుగుణములే
ధ్యానియొక్క
యోగ్యత
ధ్యానికి
కేవలము
ఆత్మానంద
మార్గమే
కాక,
లోక
హితము
కూడ
ప్రధానము.
అట్లు
లోక
హితమును
కోరుటకు
శారీర,
మానసిక
వాక్కులందు
కొన్ని
కట్టుదిట్టములు
చేసుకొని,
దశ
విధ
పాపములను
పరిహరింపవలెను.
2
▾
Meaning
Keep
ధ్యాన
సాధకుడు
దశవిధ
పాపములను
పూర్తిగా
పరిత్యజింపవలెను
కాయికముగా
త్రివిధములైన
పాపములు,
వాచా
చతుర్విధములైన
పాపములు,
మానసికముగా
త్రివిధములైన
పాపములున్నవి.
3
▾
Meaning
Keep
కాయిక
పాపములు:
1.ప్రాణాతి
పాపము
2.
పరదారాసక్తి
3.
దొంగతనము.
4
▾
Meaning
Keep
వాక్కు
ద్వార
ఆచరించు
పాపములు:
1.
అసత్
ప్రలాపములు
2.
పారుష్యము
3.
పైశున్యము
4.
అసత్యము.
5
▾
Meaning
Keep
మానసిక
పాపములు:
1.
పర
ధనాసక్తి
2.
పరులయెడ
అసూయ
3.
నాస్తికత్వము.
6
▾
Meaning
Keep
ఈ
విధములైన
దశవిధ
పాపములను
ధ్యాన
సాధకుడు
చెంత
చేరకుండ
చూచుకొనవలెను.
వాటిని
పూర్తిగా
పరిత్యజింపవలెను.
మానవుడు
శరీర
మనో
వాక్కులతో
శుభ
కార్యములే
ఆచరింపవలెను.
అశుభములు
మానవునికి
ధర్మ
విరుద్ధమైనవి.
శుభమే
మంగళమనియు,
మంగళమే
శివమనియు
కదా
శాస్త్రము.
అట్టి
శివంలో
లయం
కావలెనన్న
శుభం
మానవుని
కళ.
దీని
మూలమున
ఇహ
పరములందు
హితమును
పొందగలడు.
హితము
విద్యా
సంబంధము.
అహితము
అవిద్యా
సంబంధము.
హితము
మూలముననే
శాంతి,
సంతోష,
శుభములు
చేకూరును.
అసలు
మానవుని
కర్తవ్యమే
సర్వభూత
హితము.
ఆ
హితమును
అభివృద్ధి
పరచుకొనుటయే
వాని
ధర్మము.
ఇట్టి
కర్తవ్య
ధర్మములతో
కాలము
గడపుటే
విధ్యుక్త
జీవితము.
7
▾
Meaning
Keep
మాయా
విచ్ఛిన్న
చైతన్యమే
ఈశ్వరుడు
సర్వమునకు
బుద్ధి
సాక్షి.
అది
ఉపాధిగా
గలిగి,
బుద్ధియందు
వ్యాపించి,
చైతన్యముగా
నుండును.
సర్వబుద్ధి
సమిష్టియే
మాయ
కనుక
మాయా
విచ్ఛిన్న
చైతన్యమే
ఈశ్వరుడు.
కావున
అట్టి
ఈశ్వర
తత్త్వమును
పొందవలెనన్న
మాయా
విచ్ఛిన్నత
ప్రధానము.
మాయా
విచ్ఛిన్నతకు
విచారణా
శక్తి,
అదియే
వివేకము.
అట్టి
వివేకమునకు,
ప్రకృతి
సంబంధమైన
ప్రతి
విషయమును
సాధించుకొను
హితమే
మూలాధారము.
జగమంతయు
మాయ
సంబంధముతో
నున్నది.
అందుకనియే
జగత్తు
సత్యమని
దెల్పిరి.
అయితే
జగత్తు
అసత్యమని
తెలిసికొన్నంత
మాత్రమునగాని,
మనలో
కొన్ని
లోపములున్నవని
తెలిసికొన్నంత
మాత్రమున
గాని,
మానవుడు
ఉన్నత
సత్య
పదవిని
చేరజాలడు.
గుణముల
అభావమువల్ల
వృద్ధి
పొందజాలడు.
బహుశః
వృద్ధి
పొందుటకు
క్షేత్రయోగ్యత
కలుగవచ్చును.
ఇట్టి
యోగ్యత
పొందిన
క్షేత్రమున
మంచి
సుగుణములను
బీజములను
నాటి,
విచక్షణ
యను
నీటిని
పారించవలెను.
కాల
పరిపక్వత
వలన
ఫలము
లభించును.
సుగుణ
బీజమును
నాటక
పోయిన
యెడల
క్షేత్రమునందు
యోగ్యతలేని
కలుపు
పెరిగి,
చక్కని
ఉద్యానవనమునకు
బదులు,
చీకి
ముండ్లతో
చేరిన
అరణ్యముగా
తయారగును.
8
▾
Meaning
Keep
జీవిత
సాగరమున
విశ్రాంతి
నివ్వగల
సత్య
ద్వీపము
ధ్యానమొక్కటియే
అవివేకమువల్ల
లేదా
అహంకారమను
గుడ్డితనమువల్ల
గుణాభావము
పొంది,
శ్రద్ధ,
పరిశ్రమలతో
కూడిన
సుగుణ
సంపత్తి
పొందక
పోయిన
యెడల
సాధకుని
జీవితము
శూన్యము.
ఆ
జీవితము
రుచిలేని
శుచి
వలె
విసుగు
కలిగించును.
ఇదంతయు
కేవలము
శూన్యమని
తీర్మానము
చేసికొనును.
ఇట్టి
అవస్థయందు
మనసు
బలాత్కారమున
ఒత్తిడి
పొంది,
తికమకలతో
తగు
సుగుణ
వృద్ధి
పొందలేకపోవును.
ఇట్లు
అణగ
ద్రొక్కబడిన
మనసు
బహు
ప్రమాదకర
విపత్తుగా
పరిణమించును.
ఏదో
ఒక
హెచ్చరిక
లేని
నిమిషమున
అగ్ని
కణము
టపాసు
మందులో
పడి
పేలునట్లు,
సాధకుడు
పొందిన
సర్వాభివృద్ధి
అంతయు
నాశనము
చెందును.
కేవలము
గుణముల
అభావమును
పొంద
ప్రయత్నించునతడు
శక్తి
హీనుడై,
నిశ్చేష్టితుడై
సజీవ
మరణమును
ననుభవించును.
తెల్లబారిన
అతని
ముఖము
శవ
తుల్యమై
నిరుత్సాహముగా
కనబడును.
9
▾
Meaning
Keep
వివేకము
లేని
ఆతురత
గలవాడు,
శ్రద్ధయుండియు
తనకు
తెలియకయే
ఇట్టి
దురవస్థ
అనబడు
ఇరుకు
సందులలో
ఆత్మహత్య
అను
సంకటమునకు
పాలగుచున్నాడు.
మనసున
సుగుణ
సంపద
పొంది
యత్నించు
పరిశ్రమ
లేనందువలన
ధీరులు
కూడ
సంవత్సరముల
కొలది
తపస్సు
చేసియు
దిక్కుతోచని
పరిస్థితిలో
బురదలో
జారి
పడుట
తటస్థించును.
అందువలన
గుణాభావము
పొందుట
యత్యావశ్యకమైనను
అతి
ప్రమాదముతో
కూడుకొన్నది.
సుగుణములతో
కూడిన
మనసు
సదా
చైతన్య
శీలమై
వ్యవహరించుచుండును.
నిర్వ్యాపారముగా
నుండ
జాలదు.
ఆశల
నణగద్రొక్కినను,
నిరాశ
వల్ల
స్తబ్దత
యేర్పడకుండ,
సమస్థితిని
స్థాపించును.
సుగుణము
ఓర్వలేనితనమును
తొలగజేసి
ఇతరుల
శ్రేయస్సును
చూచి
ఆనందించును.
అది
హాని
చేయుట
మాని,
మేలు
చేయుటకు
ప్రయత్నించును.
సహనము
పొందుటే
కాక,
క్షమను
కూడ
చూపును.
అసత్యమాడక,
సత్యమునే
పలుక
నువ్విళ్ళూరుచుండును.
సుగుణ
హృదయము
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
అహంకారముల
నుంచి
తొలగింపబడి
శాంతమునకు
నెలవై,
అశాంతికి,
భ్రమలకు
దూరమై
నిత్య
క్షేమమును
కోరుచుండును.
అట్టి
మనసు
నుండి
నిర్మల
ప్రేమామృత
ధార
నిరంతరము
ప్రవహించుచుండును.
సుగుణముల
వలన
హృదయము
శక్తివంతమై
వ్యవహరించుచు,
వృద్ధిబొందగలదు.
ఆపైన
చక్కని
గుణాభావము
(ద్వంద్వములయందు
సమస్థితి)
నందును.
అందువలన
నిది
కేవలము
నిర్గుణ,
నిర్మల,
నిరాలంబయుత
మనస్సని
చెప్పవచ్చును.
శిక్షణ
పొందిన
మనస్సు
అద్వితీయ
ఏకాత్మయందు
లయము
పొందును.
కాని
అంతర్గత
విశ్రాంతిని
అనుభవింపగల
భాగ్యము
మానవులలో
నుండియు,
పరిచయము
లేనందున,
నిజమైన
శాంత,
అచల,
సత్య
స్వభావములకు
దూరమై
పరదేశీయులై
యున్నారు.
ఇప్పటి
ఆశాపాశములు,
ఆరాటములు,
అల్లకల్లోలములతో
కూడిన
జీవిత
సముద్రమున
విశ్రాంతినివ్వగల
సత్య
ద్వీపము
ధ్యానమొక్కటియే!
10
▾
Meaning
Keep
సర్వ
సాధనలకు
మూలాధారమైనది
ధ్యానము
విషయ
ప్రపంచమును
గమనించినపుడు
కూడ
వేదాంత
సత్యమే
గోచరము
కావలెను.
లక్షల
సంవత్సరములకు
మునుపు
ఈ
ప్రపంచముయొక్క
స్థితి
గమనించండి.
సృష్టి
సమయమున
ఈ
ప్రపంచ
గోళమంతయు
రెండు
అంశములతో
నిండియుండెను.
ఒక
వైపున
అగ్ని
పర్వతములయందలి
లావావంటి
ప్రవాహము
యొక్క
ప్రమాదపు
ఆందోళన.
ప్రళయ
సూచక
భయంకర
లావా
ప్రవాహములు
భూగర్భమునుండి
పైకి
పొంగుచుండెను.
మరియొకవైపు
సూక్ష్మాతిసూక్ష్మ
క్రిమి
సంతానము
కండ్లకు
గోచరము
గాక
నీటి
గట్టులలో,
రాళ్ళ
సందులలో
ఎట్టి
శక్తియు
ప్రకటింపక
స్తబ్దత
గాంచియుండెను.
అయినను
వాటి
తేజము
మాత్రము
సురక్షితముగా
నుండెను.
ఈ
రెండు
సముదాయములలో
దేనియందు
మీరు
నమ్మకముంచగలరు?
చూడుడు!
వీటిని
విమర్శించు
సమయమునందు
నిజముగా
క్రిమి
సంతానమును
ఎవ్వరు
లక్షించి
యుండరు.
విసరి
వీచు
భూకంపములను,
ప్రళయ
సూచక
లావా
ప్రవాహములను
ఎదుర్కొని,
ఈ
క్రిమి
సంతానము
జీవించి
యుండగలుగుట
సాధ్యమని
యెవ్వరైనను
తలంతురా?
కాలగతి
ఎట్లు
తీరినదో
ఎవ్వరు
నెఱుగరు.
ప్రాణశక్తి,
దైవ
సంపద,
కళ,
గానము,
నృత్యము,
శాస్త్రములు,
అవతార
పురుషులు,
మతములకై
ప్రాణములు
కోల్పోయినవారు,
పావనులు
వీరితో
గూడను
భూగోళ
చరిత్ర
నిండిపోయినది.
11
▾
Meaning
Keep
చైతన్యము
చూచుటకు
నిరాడంబరముగా
నున్నను,
ప్రళయావేశములకన్న
బలయుతమైనది.
ప్రళయావేశములు
ఒక్కొక్క
సమయములో
తమ
శక్తి
వల్ల
మోహబద్ధులను
కావించి,
దానియందు
నమ్మకము
కలిగించు
చమత్కారములు
కలిగియున్నవి.
అది
తాత్కాలికము.
శాశ్వతము
గాదు.
కాని
పైన
తెలిపిన
ప్రశాంత
స్థితియందు
పూర్తిగా
నిమగ్నులు
కాగలిగిన
యెడల
మానవులు
చైతన్య
సత్యావరణములందు
నిజముగా
ప్రవేశింపవచ్చును.
అంతకన్నను
పొందదగిన
పదవి
వేరు
లేదు.
ఇట్టి
సూక్ష్మాతి
సూక్ష్మ,
క్షణిక,
ప్రశాంత
ఆవరణమును
మానవులు
జ్ఞానపూరిత
ప్రయత్నము
వల్ల,
ధ్యాన
సాధన
వల్ల
ప్రవేశింపగలిగిన
యెడల,
ఆ
చైతన్య
పదవిని
పొంది,
దాని
పూర్ణ
ఫల
వైభవమును
అనుభవించినయెడల,
మానవులు
దైవపదవి
అను
జీవిత
గమ్య
స్థానమును
పొందుదురు.
పరిచయ
భాగ్యము
లేని
దోషము
వల్ల
అట్టి
స్థానమును
పొందలేకున్నారు.
అట్టి
పరిచయ
మార్గదర్శియే
యీ
ధ్యానము.
కనుక,
ప్రశాంత
క్షణము
యొక్క
చక్కని
పోలికను,
స్వభావమును
మనస్సునకు
నచ్చునట్లు
తెలియజేసి,
మనస్సును
శక్తి
పూరితము
గావించుట
ఇప్పటి
అందరి
ధర్మముగా
నున్నది.
అట్లు
చేయకుండిన
ఇట్టి
ప్రశాంత
క్షణమును
శూన్యమనియు,
ఖాళీ
అనుభవమనియు
పొరబడగల
అవకాశము
గలుగగలదు.
ఒక్కతూరి
ఇట్టి
చైతన్య
క్షణమును
శక్తి
పూర్ణమైన
క్షణమని
తెలిసికొనినయెడల
మానవులు
క్రమముగా
అభివృద్ధి
బొంది,
సత్య
స్వరూప
ఆత్మానుభవమును
పొందగలరు.
ఇట్టి
అభావమును
ఆదర్శముగా
నుంచుకొని
నికమీదట
ధ్యానమును,
మనో
జపమును
సాధింపవలెను.
ధ్యానమునకు
రెండవ
స్థానమే
సమాధి.
ధ్యానమష్టాంగయోగములలో
ఏడవదిగా
నున్నది.
ఇట్టి
పవిత్రమైన
సమాధికి
సమీపముననున్న
ఈ
రాచబాటను
వీడకుడు.
సర్వ
సాధనలకు
మూలాధారమైనది
ఈ
ధ్యానము.
Previous
←
The Destruction of the Manas Is the Goal of Dhyāna
Next
Striving for the Ātma Is the First Path to Dhyāna
→