Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Striving for the Ātma Is the First Path to Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
5.
ఆత్మకృషి
ధ్యానమునకు
ప్రథమ
మార్గము
ఆత్మ
విద్యను
అభ్యసించుట
ప్రతి
మానవుని
లక్ష్యము
జనులు
లోకమున
ఎన్ని
విధములైన
మార్గములందో
కృషి
చేయుచున్నారు.
అయితే
అన్నింటికన్నను
ఆత్మానుభవ
కృషి
ప్రతి
మానవునకు
అత్యవసరము.
అన్ని
కృషిలూ
ఆత్మ
కృషిపైననే
ఆధారపడి
యున్నవి.
అన్నింటికి
అది
రాజువంటిది.
ఎన్ని
విధములైన
శాసనములు
విధించినను
ప్రజలకేగాని
రాజుకు
కాదు.
రాజు
శాసనకర్త.
కాన,
ఈ
ప్రకృతి
సంబంధమైన
సర్వ
నీతి
నియమములు,
మంచిచెడ్డలు,
పాప
పుణ్యములు,
సుఖ
దుఃఖములు
అనుభవరహితమైన
మనోబుద్ధులను
ఆధారముగా
వహించిన
జీవికే
కాని,
ఆత్మకు
చెందవు.
అట్టి
నిర్మలమైన,
నిశ్చలమైన,
నిస్స్వార్థమైన
ఆత్మానురాగ
కృషి
అందరికి
తల్లి
వంటిది.
సర్వులకు
తల్లియైన
ఆత్మను
పొందవలెనను
వాంఛ
ప్రతిపుత్రునకూ
అర్హమే
కదా?
అర్హమే
కాక
పాత్రుడు
కూడను,
అందు
నిమిత్తమై
నేను
ఆధ్యాత్మికసాధన
అంత
ప్రధానాంశముగా
తీసుకొందును.
ఆధ్యాత్మికమనగా
అంతరాత్మ
లేక
బ్రహ్మ
సంబంధమైనది.
సాధన
అనగా
విద్య.
ఆత్మసంబంధమైన
లేక
బ్రహ్మసంబంధమైన
విద్య
నేర్చుకొనుట
మానవుడయిన
ప్రతి
విద్యార్థి
లక్ష్యముగా
భావించవలెను.
2
▾
Meaning
Keep
వివేక,
వైరాగ్య,
షడ్
సంపత్తులు
గలవాడు
నిశ్చయముగా
ఆత్మను
పొందగలడు
అట్టి
విద్యార్థి
కాబోవువాడు
కొన్ని
యోగ్యతలు
కలిగి
యుండవలెను.
అప్పుడే
వాడాస్థానమునకు
అర్హుడు
కాగలడు.
అవి
యేవన,
వివేకము,
వైరాగ్యము,
షడ్
సంపత్తులు.
(అనగా
ఆరు
విధములైన
సద్గుణములు)
ఈ
మూడు
కలిగియుండినవాడు
నిస్సందేహముగా,
నిరాటంకముగా,
నిశ్చయముగా
ఆత్మను
పొందగలడు.
అట్టి
ఆత్మస్వరూపుడైన
పరమాత్మకు
సహితము
ఆరు
గుణములు
కలవు.
అవియే
పరిపూర్ణ
జ్ఞానము,
వైరాగ్యము
సౌందర్యము,
ఐశ్వర్యము,
కీర్తి,
శ్రీ.
ఈగుణస్వరూపుడు
సత్,
చిత్
ఆనంద
స్వభావములు
కలిగియున్నాడు.
సత్,
(సంపూర్ణ
స్థితి)
చిత్
(పరిపూర్ణ
జ్ఞానము),
ఆనందము
(పరిపూర్ణానందము)
ఇవి
కేవలము
భూతప్రేతపిశాచులకు
సంబంధించినవి
కావు.
పవిత్రులైన
మానవులకు
సంబంధించినవి.
కాన
ఇట్టి
సత్,
చిత్,
ఆనంద
స్వరూపుని
చూడగోరుట
సర్వ
మానవకోటికి
సమాన
హక్కు,
అదియే
వాని
విధ్యుక్త
ధర్మము.
3
▾
Meaning
Keep
ఆత్మ
సాక్షాత్కారానికి
సద్గుణములు
ప్రధానము
అట్టి
విధ్యుక్త
ధర్మమును
కోల్పోవడమే
ఇప్పటి
లోకము
యొక్క
అశాంతికి
పెద్ద
కారణము.
సహజమానవులు
వారివారి
గృహస్థ
ధర్మములయందు
ఏ
రీతిగా
ప్రవర్తించవలెనో
దానికి
భిన్నముగా
నడచుకొనుట
దీనికి
కారణము.
గృహస్థులు
శాస్త్రము,
మనుస్మృతి
పద్ధతుల
సక్రమముగా
నిర్వహించుట
లేదు.
4
▾
Meaning
Keep
పరమ
పవిత్రమైన
సత్యమును
మందుకైననూ
వారిచెంత
ఉంచుకొనకుండుట.
ఈరీతి
అపచారములు
చేయుచు
కేవలము
ప్రాకృతిక
జీవితము
గడుపుటవల్లా,
స్వల్పబాధలకు
కూడనూ
సహించలేక
విరక్తులై
తిరుగుచున్నారు.
దీనికి
కారణము
వారి
వారి
విధ్యుక్తధర్మములు
సక్రమ
మార్గమున
ఆచరించకుండుటే.
5
▾
Meaning
Keep
అవి
సక్రమముగా
నడచుకొన్న
విరక్తులు
అయి,
సన్న్యాసత్వము
తీసుకొన
అవసరమేలేదు.
హిమాలయముల
గుహలు
వెతుక
పనియేలేదు.
వారివారి
ధర్మజీవితమునందే
దైవరూపమును
దర్శించగలరు.
దైవచింతన
ధర్మమార్గమునందు
లయము
కావలెను.
6
▾
Meaning
Keep
ధర్మజీవితమునకు
ధాత్రియొక్క
ఘనతలూ
పాండిత్యములూ,
పటాటోపములూ
అవసరము
లేదు.
అవి
ఉండిన
ధర్మ
జీవితమునకే
దారి
తప్పును.
అట్టి
ధర్మజీవనమునందే
మనో
బుద్ధులను
అణగద్రొక్కి
ఆత్మకృషిని
ఆనందముతో
సల్పి,
తదుపరి
ఇచ్ఛాకృషిని
అభివృద్ధి
పరచుకొనవలెను.
ఇట్టి
ఆత్మ
స్వరూపమును
సాక్షాత్కరించుకొనవలెనన్న
సద్గుణములు
ప్రధానము.
7
▾
Meaning
Keep
సద్గుణములను
కాపాడుకొనవలెనన్న
దుర్గుణములను
నాశనము
చేయువలెను.
సర్వదుర్గుణములనే
సిపాయిలకు
అహంకారము
సేనానిగా
నుండును.
సేనానిని
మొదట
హతమార్చిన
తన
యజమాని
అపజయమును
మరణమును
వినిన
తత్క్షణము
సిపాయిలు
పారిపోవుటకు
ప్రయత్నింతురు.
లేదా
వశమయి
వారి
ఆయుధములు
ఆవల
పారవేతురు.
8
▾
Meaning
Keep
దుర్గుణముల
పుట్టినిల్లు
క్రోధము.
ఆ
పుట్టినిల్లయిన
క్రోధమును
పునాదుల
వరకూ
త్రవ్వివేసిన
అది
నివసించుటెక్కడ?
కావున
దాని
పుట్టుక
స్థానమునే
లేకుండా
చేయుట
ఉత్తమోత్తమ
మార్గము.
అది
ఒక్కటి
లేకుండిన
దుర్గుణములే
లేవు.
9
▾
Meaning
Keep
దుర్గుణములను
సిపాయిలున్న
కదా
వారికి
అధికారియైన
సేనాని?
సిపాయిలే
లేకున్న
సేనానియే
ఉండడు.
కావున
సేనానికన్ననూ
సిపాయిల
పుట్టుక
అయిన
క్రోధమునే
లేకుండా
చేసుకొన్న
యుద్ధమే
లేదు,
రాదు.
అసలు
సిపాయిల
బలమును
పట్టి
సేనాని
యుద్ధమును
ప్రారంభించును.
కావున
సాధకులైన
జీవులు
మీమీ
మనోరాజ్యమును
కాపాడుకొనవలెనన్న
సిపాయిలను
పెంచి,
యుద్ధములో
కాలిడక
సద్గుణ
సంబంధముతో
పొత్తుకుదుర్చుకొని,
మీమీ
మనోరాజ్యమును
మీరు
క్షేమముగా
కాపాడుకొందురుగాక!
మీ
ఆత్మస్వరూపుడైన
రాజును
ఎల్లప్పుడూ
దర్శించుచుందురుగాక!
అట్టి
రాజును
దర్శించవలెనన్న
మనోవృత్తులు
నాశము
కావలెను.
అవి
నాశము
కావలెనన్న
ఎనిమిది
ద్వారములు
తెరువవలెను.
అవియే
యమ,
నియమ,
ఆసన,
ప్రాణాయామ,
ప్రత్యాహార,
ధారణ,
ధ్యాన,
సమాధులు.
10
▾
Meaning
Keep
ఈఅష్టవిధమార్గముల
సుగమమొనరించుకొనిన
తదుపరి,
ఇచ్ఛాశక్తిని
సులభముగా
అభివృద్ధి
చేసుకొనవచ్చును.
ఇచ్ఛ
భగవత్
స్వభావము.
దానినే
భగవత్
చట్టమని
కూడా
అంటారు.
భగవంతుడు
ఇచ్ఛామాత్రమున
ఎట్టి
కార్యములైననూ
సులభముగా
తత్క్షణము
సాధించగలడు.
మానవులు
అట్లుగాక
తలంచిన
తత్క్షణము
వారి
కార్యములు
వారు
సాధించలేక
పోతున్నారు.
ఈరెండింటికి
కూడ
కారణము
ఇచ్ఛయొక్క
శక్తి
సామర్థ్యములే.
మానవులయందు
ఇచ్ఛాశక్తి
అంతదృఢముగా
లేకుండుటే
కారణము.
అట్టి
శక్తిని
సాధించిన
భగవత్
ఇచ్ఛతో
సమానమగును.
దానినే
లయమని
అందురు.
అట్టి
లయమును
పొందగోరు
సాధనే
ధ్యానమార్గము.
పైనచెప్పబడిన
అష్టాంగసాధనలో
ధ్యానసమాధులు
రెండునూ
ఏడవది
ఎనిమిదవదిగా
ఉన్నవి.
అనగా
సమాధికి
ముందు
మెట్టు
ధ్యానము.
దాని
తరువాత
సమాధే.
కావున
సమాధిని
పొంది
సాక్షాత్తును
దర్శించు
ధ్యానమే
రాచబాట.
11
▾
Meaning
Keep
మొదటిది
ఆత్మ
కృషి,
తరువాతనే
ఇచ్ఛా
కృషి,
నైతిక
కృషి
లోకమున
మరికొంతమంది
కోరిక,
ఇచ్ఛ,
రెండునూ
సమాన
అర్థకములని
భావింతురు.
అది
చాలాతప్పు.
దానికి
దీనికి
ఎంతో
వ్యత్యాసమున్నది.
కోరిక
అనగా
ఒక
వస్తువును
పొందవలెనను
పట్టుదల.
ఇచ్ఛ
అనగా
కారణ
రహితముగా
అదే
వస్తువును
పొందవలెయుననే
పట్టుదల.
ఈ
రెండును
నైతిక
కృషిపైఆధారపడియుండును.
అయితే
మొదట
ఆత్మకృషిని
సాధించిన,
కేవల
ఆత్మకృషిని
దృష్టిలో
పెట్టుకొని,
దాని
సలహా
ప్రకారమే
కోరిక
ఇచ్ఛాదులు
పోవుచుండును.
ఆత్మకృషి
లేక,
ఇచ్ఛాకృషి
నైతిక
కృషినే
తీసుకొన్న
మనోవాసనలలో
చేర
అవకాశమున్నది.
12
▾
Meaning
Keep
పైమెట్లనుంచి
క్రిందమెట్లు
చూడవచ్చును
కానీ,
క్రింది
మెట్లనుంచి
పైమెట్లను
చూడ
వీలుకాదు.
అయితే,
క్రింది
మెట్లనుండి
ఎక్కుటకు
ప్రయత్నించవలెను.
కాన,
ఆత్మకృషి,
మొదటిది;
రెండవదే
ఇచ్ఛాకృషి;
మూడవది
నైతిక
కృషిగా
తీసుకొన్న,
ఆత్మానంద
స్వరూపునికి
అందుబాటులోనే
యుందురు.
13
▾
Meaning
Keep
మొదట
నడక
నేర్చుకొనునట్టి
బిడ్డను
తల్లి
ఇంటిలో
అటు
ఇటు
నడిపించి
అభ్యాసము
చేసి
తదుపరికదా
రోడ్డులో
వదలును?
మొదటి
రోడ్డులో
నడక
నేర్పించవలెనన్న
వీలగునా?
ఎన్ని
అపాయములకో
గురియగును!
కావున,
మొదట
అంతర్గతమైన
మార్గమున
చక్కబడిన,
బహిర్గత
మార్గమున
అంత
అపాయముండదు.
కేవలము
బహిర్గతమైన
నైతిక
మార్గమున
మొదట
ప్రయత్నించిన
అది
అంతర్ముఖమునకు
చేరుట
చాల
కష్టము;
అందుకనే
నా
ఉపదేశమునందు
అంతర్ముఖము
ప్రథమ
స్థానముగా
చూపుచున్నాను.
14
▾
Meaning
Keep
కోరికలు
వాసనలు
లేకుండా
చేసుకొనిన,
వృత్తులు
వాటంతటవే
అణగిపోవును.
వాసనారహితులు
కావలెనన్న
సాధనయందు
ఓర్పు
పట్టుదల
కలిగియుండవలెను.
కష్టముగనో,
నిరుత్సాహముగనో,
విచారముగనో
ఉండిన,
ధ్యాన
యోగసాధనలలో
ఏదో
తప్పు
ఉండియుండవలెను;
లేక
ఓర్పు
తప్పుగా
ఉండును.
ఈ
రెండు
కారణములే
కాక
వేరు
కారణములు
దీనికి
చెందవు.
15
▾
Meaning
Keep
కావున
సాధకులైనవారు
మొదట
సంతోషము,
శ్రద్ధ,
చురుకుతనము,
ఉల్లాసము
వీటిని
అభివృద్ధిపరచుకొనవలెను.
ఎన్నివిధములైన
అవాంతరములు
వచ్చిననూ
భావి
ఫలితమును
దృష్టియందుంచుకొని,
అవాంతరములు
లెక్కించక
ధైర్యముగా
సాధించవలెను.
అవాంతరముల
బలము
క్షణభంగురము.
కావున
కొంతసేపు
ఓపికపట్టుకొన్న,
సులభముగా
దాటుకొనగలరు.
అట్లుకాక,
ఓపిక
లేక,
అవాంతరములకే
చోటిచ్చిన,
ఎన్ని
దినములనుండియో
సాధించిన
సాధనఫలమంతయూ
ఒకేతూరి
నిష్ఫలమైపోవును.
16
▾
Meaning
Keep
సాధకులు
సన్యాసులు
ధ్యానయోగులు
ఒక
నిచ్చెన
మూలముననే
ఆయాస్థానములు
పొందగల్గుదురు.
ఆ
నిచ్చెనమెట్లు
సవితర్క
నిర్వితర్క,
సవిచార
నిర్విచార
సమ్మత
మొదలగునవి.
ప్రపంచ
జ్ఞానమనునది
నిజమైన
జ్ఞానముకాదు.
ప్రపంచమే
మిథ్యయైన,
ఇంక
జ్ఞానము
మాత్రము
సత్యజ్ఞానమెట్లగును?
నిత్యమైన
అంతర్ముఖ
ఆత్మజ్ఞానము,
సత్యజ్ఞానము,
దానిని
పొందు,
పొందించు
మార్గమే
ధ్యానమార్గము.
17
▾
Meaning
Keep
ఎండిన
గడ్డి
ఆకులను
అగ్ని
భస్మము
చేసేరీతిగా
ధ్యానాగ్ని
యోగాగ్ని
మనోకర్మలనే
ఎండు
పదార్థములను
తత్క్షణము
కాల్చివేయును.
అవి
కాల్చిన
తత్క్షణమే,
నిజమైన
జ్ఞానము
ప్రకాశించును.
నిజమైనజ్ఞానము
ఏనాటికికాని,
దేనితోకాని,
కాలునదికాని
మునుగునదిగాని
కాదు!
దానికి
అంత్యమే
లేదు
అట్టి
నిజమైన
జ్ఞానమును
పొందినవారికి
భూతభవిష్యత్
ఏమియూ
బోధపడదు.
అన్ని
కాలములూ
వర్తమానముగానే
తెలియును.
18
▾
Meaning
Keep
అట్టి
అనుభవమూ,
బలమూ
కావలెనన్న
కొన్ని
పనులు
చేయవలసియున్నవి.
బాహ్యశరీరమును
శుభ్రపరచుకొనవలెనన్న
సోపు,
కుంకుడుకాయ,
పిండి
అవసరము.
మనసును
శుభ్రపరచుకొనవలెనన్న
జపము
ధ్యానము,
స్మరణ
ఇత్యాది
సామానులు
అవసరము.
స్థూలదేహమునకు
బలము
కావలెనన్న
తిండి
తీర్థములను
పడవేయుదురు;
అట్లే
మనోబలమునకు
భగవత్
చింతన
ఆహారము.
19
▾
Meaning
Keep
నిండుబావిలో
అలలు
ఉండునంతవరకూ
అడుగుభాగము
కనిపించదు;
అట్లే
మనోసరోవరమునందు
కోరికలను
అలలు
ఉన్నంతవరకూ
అడుగుభాగమైన
ఆత్మ
కనిపించదు.
ఆత్మను
చూడగోరువారు
పైభాగమునందు
పరిపరి
విధముల
పారిపోవు
మనస్సు,
కోరికలనే
అలలను
తగ్గించు
కొనవలెను.
అలలు
తగ్గి
స్థిరత
ఏర్పడవలెనన్న
మనసుకు
తగిన
ఆహారము
ఆధ్యాత్మిక
చింత
కావలెను.
దానిని
శుభ్రపరచు
సామాగ్రి
ధ్యాన,
సాధనలు.
ఈ
రెండు
లేకున్న
శుభ్రము
కాదు;
బలము
రాదు!
ఎప్పుడు
ఈ
రెండూ
రావో,
వారికి
ఆత్మదర్శనము
దూరమగును;
అశాంతి
స్థిరమగును.
Previous
←
Good Qualities Are What Fit One for Dhyāna
Next
Dhyāna Shows the Eternal and Makes Known the Transient
→