Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Dhyāna Shows the Eternal and Makes Known the Transient
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
6.
ధ్యానము
నిత్యమును
జూపును,
అనిత్యమును
తెలుపును
పరమాత్మ
అనుగ్రహమునకు
జప
ధ్యానములు
ముఖ్యావసరములు
లోకమున
దారి
తెలియని
ప్రదేశమున
తికమకలాడుతు
నుండిన
సమయమున,
దారి
చూపుటకై
వచ్చిన
వారలను
బట్టి
పరిహసించుచు,
వారిని
అగౌరవ
పరచుట
మానవులైన
వారికి
న్యాయము
కాదు.
అది
నాశమునకు
కారణమే
కదా!
ప్రేమ
స్వరూపముతో
సహాయమునకు
వచ్చిన
వారిని
అజ్ఞానము
చేత
వారి
హృదయము
హాలాహలముగా
మార్చటము
నేటి
మానవులకు
పరిపాటియయినది.
2
▾
Meaning
Keep
ప్రేమకు,
హాలాహలమునకు
జన్మ
స్థానమొకటే!
చూడు
ఏ
సముద్రమున
రత్నములు,
చంద్రుడు,
అమృతము,
లక్ష్మి
పుట్టినవో
అదే
సముద్రమున
భువనమును
హరించు
హాలాహలము
కూడ
పుట్టినది.
అట్టి
తరుణమున
మానవులు
శ్రీమన్నారాయణునివలె
రస
గ్రహణ
పారీణులు
కాకపోయిన,
అమృతము,
లక్ష్మి
వారికి
లభించవు.
3
▾
Meaning
Keep
శివునివంటి
సాహసికులకు
గరళమే!
కావున
సుఖదుఃఖములతో
తల్లడిల్లుచున్న
సంసార
సముద్రాన్ని
రసగ్రహణ
పారీణులే
దాటుటకు
వీలగును.
అట్టి
సాహసము
లేని
వారు
మునిగి
పోగలరు.
ప్రకృతి
గుణములను
హరించు
శక్తి
ఎవ్వరికిని
స్వతస్సిద్ధముగా
రాదు.
దానికి
భగవదనుగ్రహము
తోడు
కావలెను.
అట్టి
అనుగ్రహమును
ప్రసాదించునట్టి
ఇచ్ఛ
పరమాత్మకు
కలుగవలెనన్న,
జపధ్యానాదులు
ముఖ్యావసరము.
4
▾
Meaning
Keep
ప్రకృతి
ఎవరి
స్వాధీనములో
నున్నదో,
ఎవరి
యాజ్ఞకు
బద్దురాలై
యుండునో
వారికే
అట్టి
ప్రకృతి
గుణాలనరికట్టు
శక్తి
గలదు.
కాని
అది
అందరికి
అసాధ్యము
అనునది
మొదట
తెలిసికొనవలెను.
లోకమున
కనిపించే
అన్నింటికి
ప్రకృతియే
ఆధారము.
సృష్టి,
స్థితులకు
సహితము
ప్రకృతియే
ఆధారము.
5
▾
Meaning
Keep
లోకమున
స్థితి
అనునది
ఉన్నదెల్లా
ప్రకృతియే.
పురుషడనువాడు
కాని,
స్త్రీలనువారుగాని,
ఇంక
జంతు
జాలము,
వృక్షములు
కాని,
పక్షులు
గాని,
ఇంకా
కనిపించువన్నియు
ప్రకృతికంటే
భిన్నమైనవి
కావు.
ఇంత
అనంత
ప్రకృతిలో
చైతన్యంగా
పురుషాకారంతో
నున్నవాడొక
పరమాత్మ
తప్ప
వేరు
లేడు.
6
▾
Meaning
Keep
ఈ
దృష్టిని
అనుభవ
మూలమున
సహితము
దృఢపఱచునట్టి
సాధన
కూడ
జపధ్యానములే!
ఈ
ప్రకృతి,
సముద్రము
ఏ
కొంత
మాత్రము
చలించినను,
కోట్లకొలది
జీవరాసులు
ధ్వంసమయిపోతవి.
చూడు!
మహాసముద్రము
కాస్తా
కదలితేనే
నౌకాశ్రేణులు
గడ్డిపరకలలాగ
అయిపోతవి.
కాన,
ఎన్నడు
నీ
యంతట
నీవు
ఈ
మహాసముద్రమును
కలచటానికి
ప్రయత్నించబోకు.
ఈ
సముద్రములో
శాంతంగా
ఉండుట
దుస్సాధ్యం.
ఈ
ప్రకృతిని
లోబరచుకున్న
పరమాత్మ
అనుగ్రహపు
తెప్పను
ఆశించి
ప్రార్థించు.
అట్లు
ప్రార్థించగా
నొకప్పటికి
ఒడ్డు
చేరవచ్చును.
7
▾
Meaning
Keep
లోకములో
మనము
చూచు
పదార్థములన్నియు
అశాశ్వతము:
లోకమున
ప్రతి
యొక్కరు
చూచు
ప్రతి
పదార్థము
అశాశ్వతము.
నేడుండి
రేపుండక
పోవచ్చును.
కనుక
ఈ
లోకమున
యే
వస్తువునైనా
మనసార
ఆశించి
ప్రేమించవలెనన్న
ఒక్క
పరమాత్మనే
కోరవలెను.
అట్లుగాక
పిల్లలను,
ధనమును,
సర్వ
సౌఖ్యములను
కోరి,
వారికే
వారు
చెప్పక
వదలి
వెళ్ళునపుడు
తీవ్ర
వ్యథ
కల్పించుకొనుచున్నారు.
8
▾
Meaning
Keep
అప్పుడు
అయ్యో!
ఈ
దుఃఖము
కొఱకే
ప్రేమించితిమా
అని
మోసపోవుచున్నారు.
లోకమున
నెవరుండినను
కొంతకాలమే
కాన,
అందులోని
సుఖదుఃఖములు
కూడ
కొంత
కాలము
పాటే
ఉంటవి.
ఇట్టి
క్షణ
భంగురమగునట్టి
వాటిలో
తగులుకొని
ఉత్కృష్టమైన,
శాశ్వతమైన
పరమాత్మను
మరచిపోవుట
మానవునికి
తీరని
లోటుగా
నున్నది.
మాయామర్మము
లేని
మాధవుని
మరచి
మాయామర్మములతో
చేరిన
లోకుల
కొఱకు
కాలమును
ఖర్చు
పెట్టిన
కలుగునదేమియు
లేదు.
దుఃఖమే
మిగులును.
9
▾
Meaning
Keep
ఈ
లోకములో
శాశ్వతమని
చెప్పి
పూజించినదేదియు
లేదు.
ఎవరిని
ప్రేమించినా
కొంత
కాలము
మాత్రమే.
సర్వ
వస్తువులు
ఇచ్చేవాడు,
వెనిక్కి
తీసుకునేవాడు
ఒక్కడే.
అతని
యిష్టము
వచ్చినప్పుడు
తీసుకుంటాడు.
10
▾
Meaning
Keep
ఇతరుల
సొత్తును
మనదనుకొనుట,
దానిని
వదలవలసి
వచ్చినప్పుడెంతో
విలపించుట
యెంతటి
వెఱ్ఱితనము?
సర్వము
పరమాత్మదనే
విషయమును
అనుభవమును
తెలిసికొనవలెను.
కాన
ఎవరి
కోసము
ఎక్కువ
ఆలోచించకండి.
ఏ
వస్తువు
కొఱకు
ఏక్కువ
బెంగ
పెట్టుకొనకూడదు.
ఆ
బెంగను
ఒక్క
పరమాత్మపై
మాత్రము
మరల్చండి.
11
▾
Meaning
Keep
మనిషిని
మనిషిగానే
ప్రేమించు.
వస్తువును
వస్తువుగానే
ప్రేమించు.
అంత
కంటే
ఎక్కువ
ప్రేమ
చూపి
మోసపోవద్దు.
ఈ
లోకము
అనంతమగుట
వాస్తవమే
గాని,
మానవులూహించే
లోకము
మాత్రము
శాశ్వతము
కాదు.
అద్దె
కొంపను
సొంతమని
కొంతకాలము
వరకు
ఊహింపవచ్చును.
అద్దె
కాలం
కావటంతోటే
అది
యింకొకరి
వశం
కదా?
ఇట్లే
నిజముగా
ఆలోచిస్తే
అనుకున్నంత
వరకు
భార్యాపిల్లలు,
ధనము,
బంధువులు
ఎప్పటికి
మనవారు
కాదు.
కొంత
కాలము
వరకే.
కాన
అశాశ్వతమైన
ఈ
వస్తువుల
గురించి
ఎందుకింత
బెంగ
పెట్టుకొనుటో
అర్థమగుట
లేదు.
12
▾
Meaning
Keep
ఒకరు
లక్షాధికారి
కావచ్చు,
మరొకరు
భిక్షాధికారి
కావచ్చు.
ఎంతటి
కోటీశ్వరుడైన
తన
పొట్టలో
నెంత
పట్టగలదో
అంతే
తనకు
చేర్చుకొనగల్గును
గాని,
మిగిలినది
తనకెట్లు
చేరును?
ప్రయాణము
సల్పు
బాటసారి
చీకటి
పడగానే
విశ్రాంతి
కొఱకు
నొక
సత్రము
చేరినట్లుగా
ఈ
లోకం.
తెల్లవారుదాకనే
అక్కడ
ఉంటారు.
తెల్లవారగనే
ఎక్కడకు
తాను
పోవలెనో,
అక్కడికి
ప్రయాణమవుతు
ఒక
చోటునుండి
మరొక
చోటుకు
పోతుంటాడు.
13
▾
Meaning
Keep
ప్రస్తుతము
ఈ
జన్మలో
పూర్తిగా
మునిగిపోక,
దీనినొక
సత్రముగా
భావించుట
యుక్తము.
కాళ్ళు
ఎక్కువయిన
కొలది
జంతువులు
నడవడానికి
ఎక్కువగా
భూమి
మీద
ఆధార
పడవలసియుంటుంది.
రెండు
కాళ్ళున్న
మనిషి
నిటారుగా
నిలువగలడు.
అయితే
జెఱ్ఱులు,
అట్టి
ప్రాకుడు
జంతువులు
ఎక్కువ
కాళ్ళుండటం
వల్ల
భూమి
మీద
ప్రాకుతున్నవి.
మనిషికి
రెండు
కాళ్ళుండటం
వల్ల
స్వేచ్ఛగా
తిరుగుతున్నాడు.
అందువల్లనే
అధికమైన
కాళ్ళు
కలిగియుండటం
వల్ల
అమిత
బంధన
అని
తెలుపుట.
14
▾
Meaning
Keep
చూడు!
వివాహమయినదనుకో,
ఇంకా
రెండు
కాళ్ళు
అధికమైనవి.
అప్పుడు
వాడు
చతుష్పాదుడు
అవుతున్నాడు.
ఇంక
కొడుకులు,
కూతుళ్ళు,
అల్లుండ్లు,
మనుమలు
ఈ
రీతిగా
చుట్టు
చేరినప్పుడు
అతని
కాళ్ళ
సంఖ్య
యధికమౌతుంది.
అందువల్ల
క్రుంగి
తాను
కూడ
స్వతంత్రుడు
కాక
భూమిపై
ఆధారపడి,
నిలువున
నిల్చుకొనశక్తి
లేకపోతున్నాడు.
ఇట్టి
అస్వతంత్రుడు
కావడం
వల్ల
ఐహిక
విషయాల్లో
మునిగి
పోతున్నాడు.
ఈశ్వరుని
అనుగ్రహమును
పొందలేక
పోవుచున్నాడు.
15
▾
Meaning
Keep
ఇహలోక
బంధములు
కొద్ది
కాలము
వరకు
మాత్రమే
యుండును
ఇహలోక
బంధములు
కొద్ది
కాలము
వరకు
మాత్రమే
యుండును.
ఈ
జన్మకు
ముందు
ఈ
లోకములో
ఎన్నో
మార్పులు
పుట్టియుండవచ్చును.
అప్పుడంతయు
ఇట్టి
సంబంధములతోనే
మునిగియుందువు.
వారిపై
ప్రేమ,
మమతలు
పెట్టుకొని
యుందువు.
అవన్నియు
ఇపుడెటు
పోయినవో
ఏమైన
తెలియునా?
వారిప్పుడెక్కడున్నారో
తెలియునా?
వారిని
ఒక్క
క్షణమైనా
ఇపుడు
తలచుట
లేదే.
16
▾
Meaning
Keep
ఈ
జన్మములో
యేర్పడిన
అనురాగము
పూర్వ
జన్మములో
కూడ
అనుభవించియున్నారు.
అయితే
కాలము
జరుగుచుండ
వారిని
మరచిపోయినట్లే,
లోకమును
వదలిన
తరువాత
ప్రస్తుత
సంబంధమును,
వారివల్ల
కలిగిన
సుఖసంతోష
దుఃఖములను
మరచిపోవుదురు.
17
▾
Meaning
Keep
పిల్లల
ఆటల
స్థలములవలె,
మానవుల
కర్మలాచరించు
స్థలములు
కూడ
ఇక్కడనుండి
అక్కడకు,
అక్కడనుండి
మరెక్కడికో
మారుచుండును.
ఇట్టి
చంచలము,
అస్థిరమైన
ఈ
ప్రేమలపై
మనసు
పెట్టుకొని
శాశ్వత
సంతోషమును
చేకూర్చు
సర్వేశ్వరుని
ప్రేమకు
తగిన
సాధనలు,
కృషులు
మరచిపోవుచున్నారు.
ఎంత
కష్టము!
18
▾
Meaning
Keep
దుఃఖ
నివృత్తి
కొఱకే
జపధ్యానములు
మనిషి
తీరిక
లేక
24
గంటలు
ఆలోచిస్తు
విషయాల్లో
మునిగిపోతున్నాడు.
ఈ
బరువు
చాలక
మరియొక
బరువు
చేర్చటం
సరియా?
మరణ
వేదన
పడుచున్న
వానిని
చూచి
యెవరైనా
వాని
దుఃఖమును
అంతమొందించుటకు
బదులు,
పీక
పిసుకుతారా?
మానవులు
విచార
సాగరములో
నివసించుచున్నారు.
అట్టి
వారిపై
పెద్ద
తుఫాను
వంటి
ఆ
సముద్రమును
ఇంకా
భయంకరము
చేయటం
మంచిదా?
కాన
అశాంతితో
మునిగియున్న
ప్రజలపై
నీవు
మందహాసము
వహించుట
నేర్చుకో
(నవ్వునట్లు
చేయుము).
ఇతరులను
కూడ
మందహాస
పూరితులను
(పెదవులపై
చిరునవ్వు
చిందునట్లు)
చేయుము.
అసలే
ప్రపంచము
సంతోష
రహితముగా
నున్నది.
బాధపడి,
యేడ్చి,
నిరుత్సాహ
పడి
ఇంకా
దుఃఖాన్ని
ఎక్కువ
చేసుకోవడం
యెందుకు?
అట్టి
దుఃఖ
నివృత్తి
ననుసరించుటకే
జపధ్యానములు
మొదలిడు.
సర్వ
దుఃఖములను
చల్లార్చుకో.
సర్వేశ్వరుడనియెడి
సంతోష
సాగరమున
మునుగు.
19
▾
Meaning
Keep
సర్వ
జీవులు
పరమాత్మ
నాటక
రంగమున
పాత్ర
ధారులే
సత్రములో
రాత్రికై
నిల్చిన
బాటసారులు
విశ్రాంతిగా
కాలము
గడిపి
తిరిగి
చేయవలసిన
యాత్రకు
సంసిద్ధులుగా
నుండక
పనికిమాలిన,
తనది
కాని
వాటిపై
రాత్రంతయు
కలహించుటెందులకు?
అందు
మూలమున
తనకు
విశ్రాంతి
యుండదు.
నిద్రా
సుఖము
లేకుండును.
మరల
ప్రయాణము
చేయుటకు
శక్తి
యుండదు.
కాన
లోకానికి
సంబంధించిన
వాటిపై
మక్కువ
పెట్టుకొని
విచారగ్రస్తులు
కావద్దు.
అనవసరముగా
తొందరపడి,
అమూల్య
కాలాన్ని
వ్యర్థము
చేసికొనకు.
ఆ
కాలాన్ని
పరమాత్మ
చింతనకు
ధారపోయుము.
20
▾
Meaning
Keep
సర్వ
జీవులు
పరమాత్మ
నాటక
రంగమున
ధరించిన
పాత్రలే.
ఆయా
ఆట,
కథ
పూర్తియయిన
వెంటనే
వెళ్లి
పోతుంటాయి.
అయితే
ఆ
నాటకమునందే
ఒకరు
దొంగ
వేషము,
మరొకరు
రాజు
వేషము,
ఇంకొకరు
హాస్య
వేషము,
ఒకడు
బిచ్చగాని
వేషము
వేస్తుంటారు.
ఇవన్నీ
ఒక్క
నాటక
రంగమందే
కదా!
21
▾
Meaning
Keep
అట్లే
అన్ని
వేషములకు
కథ
ఎత్తించు
(సంభాషణములను
మెల్లగా
వినబడునట్లు
చెప్పు
వాడు)
వాడొక్కడే.
అయితే
ఇక్కడ
కొంత
జాగ్రత్తగా
గమనించవలెను.
ఆ
కథ
ఎత్తించువాడు
నాటక
రంగముపై
అందరికి
తెలియునట్లుగా
వేషములు
మరచిన
సంభాషణను
ఎత్తి
చెప్పడు.
అట్లు
ఎత్తించి
చెప్పిన
నాటకము
యొక్క
కళే
పోవును
(రసభంగమగును).
22
▾
Meaning
Keep
అందువల్ల
ఆ
రంగమందే
ఒక
స్క్రీను
వెనుక
భాగమున
నిల్చుని
సర్వ
వేషములకు,
సకాలమునందు
కథలు,
మాటలు,
పాటలు,
పద్యములు
ఎత్తి
చెప్పుచుండును.
అదే
విధముగా
భగవంతుడు
కూడ
ఈ
ప్రకృతి
రంగమునందున్న
సర్వ
జీవులకు
వారి
వారి
జీవిత
కథలందు
చేయవలసిన
పనులు
మాయ
తెరకు
మరుగున
నుండి
తెలుపుచుండును.
కాన
మానవ
జీవితము
మాయ
తెరకు
మరుగున
మన
జీవితాధారమైన
మార్గమును
తెలియజేయు
పరమాత్మయున్నాడని
తెలిసికొని
ఏ
నిమిషమున
ఏమి
మరతుమో,
తానేమి
చెప్పునో
యని
అతనిపైనే
దృష్టిపెట్టి
కర్ణములు
అతని
యాజ్ఞకై
నిక్కపొడుచుకొని
యుండవలెను.
23
▾
Meaning
Keep
అట్లుగాక
కథ
(అనగా
తాను
ఈ
లోకమునకు
వచ్చిన
పని,
తాను
చేయవలసిన
కర్తవ్యము)
మరచి
తెరకు
మరుగున
నున్నవానిపై
కూడ
దృష్టి
మరల్పక,
గమనింపక
యున్నారు.
వేషము
ఊరకే
రంగమందు
నిల్చుకొనియున్న
ప్రేక్షకుల
ఆక్షేపణ
చేయుటేగాక,
హాస్యమునకు
గురియగును.
నాటకమే
చెడిపోవును.
కాన
ఈ
లోక
రంగమందు
మానవ
రూపమున
వేషములు
ధరించిన
ప్రతి
వేషగాడు
కూడ
వారివారి
కథ
చక్కగా
నేర్చుకొనటము,
తెరమరుగున
నున్న
పరమాత్ముని
మరువక
అతని
యాజ్ఞకు
కాచుకొని
యుండటము,
ఈ
రెండు
మరువక
జాగ్రత్తగా
గమనించవలెను.
ఇట్టి
జాగ్రత్తను
అభివృద్ధిపరచునదే
ధ్యానము.
Previous
←
Striving for the Ātma Is the First Path to Dhyāna
Next
The Name and Dhyāna Are the Sādhanas That Free One from Every Bond
→