Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · The Name and Dhyāna Are the Sādhanas That Free One from Every Bond
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7.
నామ,
ధ్యానములే
సర్వబంధనలనూ
తప్పించుసాధనలు
జప,
ధ్యాన,
స్మరణలకు
మించిన
శాశ్వత,
సర్వజనీన,
పవిత్ర
సాధనలు
లేవు
ఎంతటి
బంధనలలో
చిక్కుకొన్న
మానవులైననూ
భగవన్నామ
స్మరణమువల్ల
స్వేచ్ఛను
పొందుటేకాక,
ఎవరి
నామమును
నిరంతరమూ
స్మరించుచున్నారో
అట్టి
నామరూపమును
తప్పక
పొందుచున్నారు.
అందులో
సందేహమే
లేదు.
2
▾
Meaning
Keep
యోగ
సాధన,
ప్రాణాయామసాధన,
తపోసాధనయందు
అడుగడుగునకూ
కాలు
జారి
ప్రమాదములు
సంభవించుచుండవచ్చును.
కాని
జప,
ధ్యాన,
స్మరణలయందు
అట్టి
జారటముకాని,
ప్రమాదములు
కాని
ఏ
మాత్రము
లేవనుటకు
సందేహమే
లేదు.
వేరు
వేరు
సాధనలయందు
అనగా
యోగ,
తపస్సు
ప్రాణాయామములందు
జాతిమతభేదములను
బట్టి
మార్గములు
మారును.
నామస్మరణయందు
అట్టి
భేదములు
ఏమాత్రమూ
చేర
వీలులేదు.
3
▾
Meaning
Keep
హిందువులకు,
మహమ్మదీయులకు,
క్రైస్తవులకు
ఎంతో
భేదములున్ననూ,
ఆ
కరుణామయుని
నామమునందు
మాత్రము
అంతటా
ఐక్యభావమే.
ఒక్క
పరమాత్ముని
నామమునే
వారివారి
భాషలందు
వారు
స్మరించుచూ,
ధ్యానించుచూ,
జపించుచున్నారు.
వారివారి
జాతికి
అనుగుణములైన
తావళములను
త్రిప్పుకొంటూ
ఉన్నారు.
కావున,
ప్రతి
మానవునకూ
ఈ
మూడు
మార్గములకన్నా
శాశ్వతమైనదిన్నీ,
సర్వజనసమానమైనదిన్నీ
పవిత్రమైనదిన్నీ
వేరులేదు.
4
▾
Meaning
Keep
నామములో
పరిశుద్ధమైన
మాధుర్యమున్నది
పరమాత్ముడునూ,
అతని
నామమునూ
రెండు
ఒక్కటే
అయినప్పటికీ
నామములోనున్న
మాధుర్యము
రూపమున
కానరాదు.
ఒక
గులాబి
పువ్వు
పేరు
తలంచిన
అందులోని
సువాసనా,
దాని
మెత్తని
రేకులూ,
దాని
లేత
రంగులూ
జ్ఞాపకమునకు
వచ్చును
కాని,
దాని
ముండ్ల
కాడ,
దానిని
పొందటానికి
పడే
శ్రమ
పూర్తిగా
మరుపుకు
వచ్చును.
అట్లు
కాక,
పూవు
దాని
పుట్టుపూర్వోత్తరములు
తలంచుచూ,
ఆ
చెట్టునూ,
దాని
ఆకులనూ
కొమ్మలనూ
తలంచుచున్న,
ముఖ్యమయిన
అందమైన
పువ్వును
మరచి
చెట్టునుగూర్చి
తర్కింతుము.
అదే
ఇంకొక
విధమున
చూడు.
5
▾
Meaning
Keep
మామిడి
పండు
అని
నామము
అనగానే
సాటిలేని
మాధుర్యము
మనకు
జ్ఞాపకము
వచ్చును.
అట్లుకాక,
మామిడిపండునే
హస్తమందుంచుకొనినపుడు
తియ్యగా
ఉన్నదో,
పుల్లగా
ఉన్నదో
అన్న
సందేహము
మొదలే
కలుగును
తరువాత
దాని
తోలు,
వగరు,
జీడి,
పీచు,
గట్టి
విత్తనమూ
జ్ఞాపకము
వస్తున్నవి.
ఇట్టి
అనిష్టమగు
ఆలోచనలు
ఉండవు.
పేరు
చెప్పిన
దాని
జీడి,
వగరు
జ్ఞాపకము
రావు.
మనకు
గోచరమయ్యేది
రుచి
ఒక్కటే
కదా!
6
▾
Meaning
Keep
పరమాత్మకూ,
పరమాత్మ
నామమునకూ
ఇట్టి
భేదమున్నది.
నామములో
పరిశుద్ధమైన
మాధుర్యమున్నది.
పరమాత్మలో
గౌరవముతో
కూడుకొన్న
భయము,
ఒక్కొక్కప్పుడు
భీతిని
కలిగించే
లక్షణములు
ఉన్నవి.
రూపముకంటే
నామమును
ఎందుకు
కోరవలెనో,
మరొకటి
చూడు!
7
▾
Meaning
Keep
నామధనమువల్లనే
పరమాత్మ
అను
వస్తురూపమును
పొందుచున్నారు.
లోకమున
ఏవస్తువునైనా
కొనవలెనన్న
ధనము
ప్రధానము.
ఆ
ధనముతో
ఏవస్తువును
కొన్నను,
కొన్న
వస్తువు
కన్నను
కొనిన
ధనమే
ఎక్కువగా
తెలియును
కదా?
అన్ని
వస్తువులు
ఆ
ధనమునకు
లోబడినవే
కదా?
ధనమున
ఏ
వస్తువైననూ,
ఎప్పుడు
కావలెనన్ననూ
అప్పుడు
పొందవచ్చును.
అదే
విధముగా
నామమనే
ధనమును
క్రమక్రమముగా
కూడబెట్టినట్లయిన
అతనిని
ధ్యాన
మార్గమున
సులభముగా,
త్వరలో
పొందవచ్చును.
8
▾
Meaning
Keep
నామస్మరణలో
ఉన్న
ఇంకొక
విశేషమేమంటే:-
యోగ
తపస్సులవల్లా
అనేకములైన,
సిద్ధులు
రావచ్చును.
వాటిని
చూచి
భగవంతుని
మరువ
అవకాశమున్నది.
అంతేకాక
కొందరు
గర్వాంధులై
సర్వసాధనాసారమును
పాడు
చేసుకొందురు.
నామ,
జప,
ధ్యానములయందు
అట్లు
కాదు.
వారికిట్టి
ప్రమాదములు
కూడ
రావు.
9
▾
Meaning
Keep
ఈ
మూడింటివల్లా
ప్రేమ
అధికమగుచు
వచ్చును.
ఆ
ప్రేమ
మూలమున
శాంతము
చేకూరును.
ఎపుడు
శాంతమో
అప్పుడు
సర్వసౌఖ్యములూ
తమంతట
తాము
వచ్చును.
యోగ
తపస్సులకు
అసామాన్య
శక్తులు
కలుగుట,
స్మరణ,
జప,
ధ్యానములవల్ల
ప్రేమ
కలుగుట,
ఈ
రెండింటికి
గల
తేడా.
10
▾
Meaning
Keep
నామస్మరణతో
రూపమును
ధ్యానించిన,
శాంతి
కలుగును
అయితే
ఈ
రెండింటి
విషయమై
ఇతరులతో
చర్చించకూడదు.
ఎందుకన
ఎవరెవరి
మార్గము
వారి
వారికి
సరిగా
తోచుచుండును.
అట్టివారు
స్మరణ,
జప
ధ్యానములు
ఇష్టము
లేకుండిన,
వారు
వాటిని
నిర్లక్ష్యముగా
భావించి
తూలనాడుదురు.
వానిని
చాలా
చిన్నక్లాసువలె
చూతురు.
అందుమూలమున
నీకు
సందేహములు
ప్రారంభమగును.
11
▾
Meaning
Keep
సంతోషమునకు
బదులు
విచారము,
ప్రేమకు
బదులు
ద్వేషము
కలుగుచూ
వచ్చును.
అందుకని
నీలో
నీవు
ఈ
రెండింటియందు
ఏది
మధురమో
యోచించవలెను.
లేక
ఆ
నామమాధుర్యమును
పొందినవారి
చెంతకు
మాత్రమే
పోయి
దాని
వివరములు
విచారించుకొనవచ్చును.
అంతేకానీ,
చిక్కిన
వారందరితోను
వాదించరాదు.
అట్టి
సమయములందు
ఆనందమును
పొందవలెనన్న
నామము
స్మరించుచూ
రూపమును
ధ్యానించు
మనస్సు
శాంతించగలదు.
12
▾
Meaning
Keep
అట్లుకాక
ఊరికే
తర్కించుచూ
ఏది
గొప్ప,
ఏది
గొప్ప
అని
వెతుకుతూ
పోవుచుండిన,
శ్రమపడి
ఆర్జించిన
సాధనాఫలము
క్షణములో
పాడగును.
నీకు
సామర్థ్యము
చేకూరే
వరకూ
శాంతముగా,
ఏకాంతముగానో
భక్త
సమూహములోనో
చేరి
నామమును
గట్టిగా
స్మరించు;
ఏభయము,
సందేహమూ
రాదు.
13
▾
Meaning
Keep
చేప
చూడు!
మొట్టమొదట
తాను
గ్రుడ్లను
నిశ్చలమైన
లోతులేని
నీళ్ళలో
పోషించును.
తరువాత
క్రూర
జలచరములున్న
కల్లోల
సముద్రములో
ఉంచును.
అవి
భయము
లేక
అక్కడ
స్వేచ్ఛగా
సంచరించి
వృద్ధికి
వచ్చును.
అట్లుగాక
మొదలే
సముద్ర
మధ్య
భాగమున
ఉంచినచో
చిన్న
చిన్న
జలచరములే
మ్రింగివేయును.
కావున,
మొట్టమొదట
నామజప
ధ్యానము
చాలా
జాగ్రత్తగా,
క్రమమును
విడువక,
బహిరంగము
చేయక
ఉంచుకొనవలెను.
14
▾
Meaning
Keep
కలియుగ
జనులకు
పవిత్రులను
చేయు
సాధనలు
నామ,
జప,
ధ్యానములే
ఇప్పటి
కాలమున
చాలామంది
నామమును
వదలి
కేవలము
యోగ
ప్రాణాయామములను
పట్టుకొనుచున్నారు.
అవి
చాలా
ప్రమాదకరమైనవి.
సరిగా
చేయకున్ననూ
కష్టము.
సరిగా
చేసినను
కాపాడుకొనుట
మరింత
కష్టము.
వల,
గట్లమీద
వేసి,
నీటిలో
మునిగి
చూచిన
చేపలు
వలలో
చిక్కునా?
ఇట్లు
చేసిన
చేపలు
ఏరీతిగా
చిక్కవో
అట్లే
నామమును
వదలి,
దానిపై
నమ్మకము
లేక
యోగమూ,
తపస్సులూ
చేసుకుంటూ
కూర్చున్న
నీఫలమూ
అంతే
చిక్కును.
15
▾
Meaning
Keep
నామమును
ఆశ్రయముగా
పెట్టుకొన్న
నేడు
లేకపోయిన
రేపయిననూ
అతనిని
తప్పక
పొందగలడు.
పేరు
తెలిసి
యున్నట్లయిన,
ఆ
వస్తువును
సులభముగా
పొందవచ్చును.
పేరు
తెలియకున్న,
ఆ
వస్తువు
ముందున్ననూ
కనుగొనలేరు.
కావున,
నామమును
పట్టు
విడక
చేయి;
నామమువల్ల
ప్రేమ
వస్తుంది.
ప్రేమవల్ల
అతనిని
ధ్యానమున
పొందగలవు.
ప్రేమ
నీయందు
ప్రబలమైయున్న
ప్రేమమయుడగు
పరమాత్ముడు
నీవాడు
కాగలడు.
ఇతర
మార్గము
లెన్ని
ఉన్ననూ,
దీనికంటే
సరళమార్గము
వేరు
లేదు.
16
▾
Meaning
Keep
చూడు!
ఒక
విధమైన
రోగము
ఒక
దేశములో
ఉన్నట్లయిన
దాని
మందు
కూడనూ
ఆ
దేశమందు
మాత్రము
అధికముగా
ఉండును.
ఇతర
దేశములందు
కూడనూ
వెతికిన
చిక్కవచ్చును.
కానీ
అన్ని
విధములుగా
అంత
తగియుండదు.
అదేవిధముగా
ఈ
అమోఘమైన
మందు
ఈ
కలియుగములో
లభించుచున్నది.
17
▾
Meaning
Keep
ఎందువల్లనంటే,
ఈ
యుగమందు
భూత
ప్రేత
పిశాచ
భయములగు
అన్యాయ,
అక్రమ,
అనాచార,
అసత్యములను
రోగములు
ఎక్కువగా
ఉన్నవి.
అందువల్లనే
శాస్త్రములు
ముమ్మాటికి
నొక్కినొక్కి
చెప్పుచున్నవి.
ఏమని?
కలియుగమున
నామముకంటే
వేరుమార్గము,
వేరు
గతి
లేదు,
లేదు
అని.
నాలుగు
యుగములలోను
కలియుగము
ఉత్తమమగుచున్నది.
కలియుగ
జనులను
వడియగట్టి
శుచి
చేయుచున్నవి.
నామ,
జప,
ధ్యానములే.
వీటి
ప్రభావములే
ప్రకృతికి
రక్షలు.
కావున,
యోగ,
యజ్ఞ,
ప్రాణాయామముల
వల్లా
ప్రయాసలుపడి
పొందే
లాభముకన్నా
నామస్మరణ,
ధ్యానములే
ఎక్కువ
లాభమును
చేకూర్చుచున్నవి.
Previous
←
Dhyāna Shows the Eternal and Makes Known the Transient
Next
Concentration of Citta Is the Chief Thing for Dhyāna
→