Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Concentration of Citta Is the Chief Thing for Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
8.
ధ్యానమునకు
చిత్తైకాగ్రత
ప్రధానము
వ్యవహారమును
పరిశుద్ధ
పరచుటే
పారమార్థికము
ప్రతి
పనియందును
చిత్తైకాగ్రత
(శ్రద్ధ)
అత్యవసరము.
వ్యావహారిక
విషయములకును,
పారమార్థికమునకును
కావలసిన
సద్గుణములు
వేరువేరనుకొనుట
సరి
కాదు.
వ్యవహారమును
పరిశుద్ధ
పరచుటే
పారమార్థికము.
అందులోని
సఫలత,
విఫలతలు
ఏకాగ్రత
మీదనే
ఆధారపడియుండును.
ఈ
ఏకాగ్రత
కూడ
సాధనే.
2
▾
Meaning
Keep
అనగా
జపధ్యానములు.
ఆ
సాధనలో
రెండు
మార్గములున్నవి.
1)
శూన్యావస్థ
2)
అనేకాగ్రత.
3
▾
Meaning
Keep
శూన్యావస్థ
అనగా
నిద్ర
లేదా
తమోగుణమంటారు.
అనేకాగ్రత
అనగా
రజోగుణము.
కన్నులు
విప్పి
సృష్టియందున్న
దృశ్యముపై
మరల్చుట.
అట్లుగాక
ఈ
రెండు
దృశ్యములను
వదలి
అనగా
పూర్తిగా
కన్నులు
మూసుకొనుట.
రెండును
లేక
అర్ధ
నిమీలిత
నేత్రుడై
ముక్కు
కొనను
దృష్టి
నిలిపిన
సత్త్వ
గుణ
స్వభావుడు
కాగలడు.
అట్లున్న
చిత్తైకాగ్రత
సులభముగా
నేర్పడును.
అయితే
అర్ధ
నిమీలిత
నేత్రుడై
ముక్కు
కొనను
దృష్టి
నిల్పిన,
సత్త్వ
గుణుడు
కాడు.
ప్రారంభమున
అట్లు
నిల్పి,
ఆ
దృష్టిని
నీవు
స్మరించు
నామరూపములపై
మరల్చుటయే
ధ్యానము.
4
▾
Meaning
Keep
దినమునకొక
నామము,
రూపము
మార్చుచుండకూడదు
మొట్టమొదట
జపధ్యానములు
చేయునప్పుడు
ఇతర
ఆలోచనలు
నీలో
ప్రవేశించెనని
విచారించకూడదు.
దానివల్ల
ప్రమాదమేమియు
లేదు.
నామస్మరణ
ప్రారంభించేటప్పుడు
ఉత్సాహముతో
కూర్చొనుము.
దృఢసంకల్పముతో
ఏ
కార్యమునందైన
ప్రవేశించినపుడు
ఎటువంటి
అపవిత్రత
నిన్నంట
లేదు.
5
▾
Meaning
Keep
మొదలు
పెట్టినప్పుడు
మాత్రము
నీవు
పూర్తిగా
నిర్మలముగా
నుండునట్లు
చూచుకొనుము.
దానికి
పద్ధతులేవి
యెక్కువగా
యోచించకుము.
నీకిష్టమైన
నామమునే,
దాని
రూపమునే
ఉంచుకొనవచ్చు.
నామమే
మంత్రము.
అది
ఎప్పుడును
శుద్ధమే.
ఎప్పుడు
అందుబాటులోనే
ఉండును.
అది
సమస్తమైనది.
6
▾
Meaning
Keep
అయితే
దినమునకొక
నామము
దినమునకొక
రూపము
మార్చుచుండ
కూడదు.
మొదట
నీకు
ఏ
రూప
నామములు
తృప్తిగలిగించునో,
దానిపై
సర్వము
తానే
ప్రసాదింపగలడు.
మన్ను
త్రవ్వమని
కూలికి
యాజ్ఞ
యిచ్చిన,
త్రవ్వుటే
వాని
పని.
అట్లే
నామస్మరణ,
రూప
ధ్యానములు
చేయమని
ఆజ్ఞ.
ఆ
పని
మీరు
చేస్తుండిన
దానిని
ఏయే
చోటున
వేయించవలెనో
తానే
నడిపించగలడు.
7
▾
Meaning
Keep
హరినామము
మరిపించే
దేనిని
నీచెంత
చేర్చకు
మనస్సును
తర్ఫీదు
చేయడములోనే
నామరూపముల
యొక్క
విలువ
యున్నది.
తర్ఫీదయిన
గుఱ్ఱాన్ని
మరీ
తర్ఫీదు
చేయడమెందులకు?
తర్ఫీదు
కాని
గుఱ్ఱమునకే
అనేక
విధములుగా
తర్ఫీదునిస్తారు.
అదే
విధముగా
స్థిరము
కాని
మనస్సును
స్వాధీనములో
ఉంచుకొనడానికే
ప్రార్థన.
భజన,
జప
స్మరణలు
ఏర్పాటు
చేయబడినవి.
8
▾
Meaning
Keep
మొట్టమొదట
గుఱ్ఱము
అనేక
దిక్కులకు
పరిగెడుతుంది.
తర్ఫీదు
చేసేవాడు
దానిని
లక్ష్యపెట్టకూడదు.
గట్టిగా
కళ్ళెములను
మాత్రము
పట్టుకొని
యుండవలెను.
అట్లే
నామస్మరణ,
ధ్యానములు
చేసేటప్పుడు
మనస్సను
గుఱ్ఱము
అనేక
దిక్కులకు
పారిపోవటం
సహజం.
అందుకై
నీవు
విచారమో,
నిరుత్సాహమో,
విరక్తియో
పడకూడదు.
నామమను
కళ్ళెమును
గట్టిగా
పట్టుకో.
కొంతకాలములో
నీ
మాటలు,
ఊహలు
నీకే
స్వాధీనము
కాగలవు.
హరినామము
మరిపించేదాన్ని
దేనిని
నీవు
చెంత
చేరనివ్వకుము.
దాని
స్వభావము
నీకే
గోచరము
కాగలదు.
9
▾
Meaning
Keep
సర్వ
వేళలందు
విరామములేక
నామస్మరణ
చేయవలెను
చెట్టు
నాటిన
తోడనే
పండ్లను
ఆశింపకూడదు.
పండ్లు
ఎట్లుండునో
అని
దాని
రుచి
తెలుసుకొనుటకై
చెట్టు
యొక్క
ఆకులు,
బెరడు
నమలకూడదు.
అట్లు
చేసిన
పండు
యొక్క
మాధుర్యము
తెలియదు.
అంతియే
గాక
మొక్కే
నశించి
పోవును.
10
▾
Meaning
Keep
అదే
రీతిగా
నామమను
మొక్కను
అభివృద్ధి
పఱచుకొనుటయే
నీ
వంతు.
దానిని
సరిగా
చేస్తున్నానా?
లేదా?
నామములో
మహత్తుందా?
లేదా?
అని
ఈ
రుచులు
చూచుటకు
ప్రయత్నించకు.
సందేహింపకు.
తప్పక
ఆ
నామమను
మొక్కయే
వృక్షమై
నీవు
ఆశించిన
ఫలమును
నీకు
తినిపించగలదు.
నీవును
సాధించగలవు.
11
▾
Meaning
Keep
అట్టి
ఫలమును
పట్టుకొనునట్టి
వలయే
నామము.
కాన
ఆ
నామమును
ఏ
రీతిగా
మార్చక,
దాని
రూప
నామములను
దృష్టిలో
పెట్టుకొన్న,
అదే
ఏకాగ్రత
స్థానము.
నామస్మరణ
అనే
వలకు
మధ్య
మధ్య
వెల్తి
యుండకూడదు.
అనగా
సర్వ
వేళలందు
విరామమే
లేక
చేయవలెను.
అట్లు
వెల్తి
యుండిన
ఆ
వలలో
పరమాత్మ
ఫలముకూడ
తప్పించుకొని
పోవును.
నీ
మతి,
నీ
స్వాధీనమున
లేకుండ
పోవునంతవరకు
ధ్యానించు.
అదే
మొదటి
పని.
12
▾
Meaning
Keep
మనసు
ఎట్లు
పారిపోతే
అట్లు
పారిపోనీ,
నీవు
మాత్రము
దాని
వెంట
ఎక్కడ
పోతుందా
అని
చూసుకుంటు
పోవద్దు.
నీవున్న
చోటే
ఉండుము.
మనసు
ఏమియు
తెలియని
పసిబిడ్డ
వంటిది.
తల్లి
పిల్చేకొలది
తాను
కూడను
దూరముగా
పోవుచునే
యుండును.
అట్లుగాక
ఆ
బిడ్డ
వైపుచూడక,
తల్లి
పాటికి
తల్లి
వెనుకకు
తిరిగిన,
బిడ్డ
తనపాటికి
తానే
పరిగెత్తుకొని
వచ్చి
తల్లి
చెంతకు
చేరును.
13
▾
Meaning
Keep
నీ
నియమము
ప్రకారము
నీ
ఇష్ట
నామ
ధ్యానములను
ఆచరించుము.
మనస్సును
లక్ష్య
పెట్టకు.
తప్పక
నీ
ధ్యానమున
ఏకాగ్రత
లభించును.
నీవును
సఫల
మనో
రథుడవౌతావు.
నీవు
చేసే
ధ్యాన
సాధన
యందు
శుచి,
అశుచి
అనే
మాటను
నీ
మనసు
లోనికి
చేరనివ్వవద్దు.
ప్రపంచమున
అశుచి
పదార్థమంటు
లేనే
లేదు.
సర్వాంతర్యామిగా
పరమాత్ముడున్నప్పుడు
అశుచి
యెక్కడిది?
బాహ్య
దృశ్యమునకు,
అనుభవమునకు
అశుచి
అనుకున్నను
దానికి
పరమాత్మ
నామము
సోకగానే
శుచిగా
మారును.
14
▾
Meaning
Keep
నామముతో
సర్వము
శుచి
కాగలదని
స్థిరము
చేసుకో
ఒక్క
విషయము
చూడు!
మలమూత్రములు
విసర్జన
చేయు
కాలమునందు
ఎవరికైనా
ధనరాసులే
కంటబడి
దొరికినచో
అశుచిగా
ఉన్నాయని
దానిని
తీసుకోవడానికి
సందేహించునా?
శుచి,
అశుచి
అనే
రెండింటికి
ఆయా
సమయములందు
మనశ్చలనములే
కారణము.
మనమే
ఎవరికైనను
ధనమివ్వవలెనన్న
ఇప్పుడు
శుచి
కాలమా,
మంచి
దినము
కావలెను.
ఈ
రెండింటికి
కారణమేమి?
మనసే.
ఆనాడు
ధనమన్న
ఆశ
వల్ల
శుచి,
అశుచి
చూడడు.
నేడు
తన
ధనమిచ్చుటకు
ఇష్టము
లేక
శుచి,
మంచి
కావలెను.
అదే
రీతిగా
పరమాత్మ
నామముపై
సంపూర్ణ
నమ్మకము,
ప్రేమ
యుండిన,
శుచి,
అశుచి
రెండు
కనిపించవు.
నీకు
కొంత
బద్దకంగా
ఉండి,
చేయుటకు
అంత
తృప్తికరముగా
లేనప్పుడు,
దానిని
లేని
కారణములు
నెపముగా
చెప్పవచ్చును.
కాన
అట్టి
భావములు
వదలి
నామము,
నామమునకు
తగిన
రూపము
ఎప్పుడు
పవిత్రమైనవే
అను
దృఢత్వమును
స్థిరపఱచుకొనుము.
నామముతో
సర్వము
శుచి
కాగలదని
స్థిరము
చేసికో.
15
▾
Meaning
Keep
భగవంతునిపై
ప్రేమ
గలిగి,
దానిని
ఆయన
రూప
నామములందు
లగ్న
పఱచుటే
ధ్యానము
భగవంతుడన్న
ప్రేమ
యుండవలెను.
అది
చాల
బలవత్తరమైనది.
ఇనుప
గొలుసులనైనను
సులభముగా
త్రుంచవచ్చును.
దీనినెవ్వరును
త్రుంచ
సాధ్యము
గాదు.
క్రూర
మృగములు
సైతము
ఈ
ప్రవాహములో
మునిగిపోవుచున్నవి.
దీనినే
దైవమాయ
యంటారు.
ఇట్టి
ప్రేమ
ప్రవాహమును
మధ్యలో
ఏ
చెడుపులకు
త్రిప్పక,
పరమాత్మ
అనుగ్రహమను
సాగరమునకే
త్రిప్పిన
ఈ
లోకము
ఎంత
పుణ్యవంతమగును.
అట్లు
తిప్పిన
జీవి
ఎంత
ధన్యత
నొందును.
ఇదియే
ఉత్తమమగు
మోక్షము.
16
▾
Meaning
Keep
నిరంతరము
ఈ
ప్రేమను
తన
రూప
నామములందు
లగ్న
పఱచుటే
ధ్యానము.
అనిత్యమైన
ఈ
వాస
స్థానము
నిత్య
వాసమని
మోసపోవద్దు.
మూడునాళ్ళ
ముచ్చట్లు,
కష్టములు
చూచి
మురిసి
పోకూడదు.
శాశ్వతమైన
పరమాత్మను
పొందే
యోచనలలో
మునిగిపోవలెను.
నష్టమని
విచారణ
చేయ
వద్దు.
ఈ
లోకమున
నష్టము
కాని
పదార్థము
లేదు.
నేడు
కాకున్నా
రేపైనా
అది
శిథిలమగునదే
కదా!
17
▾
Meaning
Keep
ఈ
లోకముతో
రెండునాళ్ల
సంబంధమున్నదని,
నిత్య
సంబంధమున్న
పరమాత్మను
మరచుట
న్యాయము
కాదు.
ముందు
వ్రాసినట్లు
“బంధువులందరు
వాకిటి
దాకేను,
వల్లకాటికే
వత్తురు.
బంధ
మణచి
నిన్
బాయని
ఆపద్బంధువు
భగవన్నామమేరా”
అన్నట్లు
ఎన్నటికి
యెడబాయని
బంధువు
అతడొక్కడే.
18
▾
Meaning
Keep
ఈ
జన్మములందు
ఎంతమంది
భార్యలు,
భర్తలు,
పుత్రులు,
మిత్రులు,
శత్రువులు
జన్మ
జన్మకు
లెక్కలేనన్ని
మార్లుండినారు.
అట్టి
సంబంధము
నేటికి
చిరస్థాయిగా
నున్నదా?
పూర్వ
బంధువులందరికి
జ్ఞాపకమున్నారా?
నీకు
వారు
లేరు.
వారికి
నీవు
లేవు.
ఇద్దరికి
పరమాత్మ
ఒక్కడే.
అతడు
మాత్రము
ఎన్ని
జన్మములైనా
మారడు.
నిత్యము.
జన్మ
జన్మలయందు
మిమ్ముల
చూచుచునే
యున్నాడు.
అట్టి
పరమాత్మను
మరచుట
కన్న
వేరు
విషాదమున్నదా?
19
▾
Meaning
Keep
ఇంద్రియములు
పట్టుదప్పి,
తమ
తమ
వ్యాపారములు
తాము
చేయ
నిరాకరించినప్పుడు
తన
బంధువులు,
మిత్రులు,
తల్లిదండ్రులు,
భార్యాబిడ్డలు
మొత్తుకొంటు
ఒక
వైపున,
త్వరగా
ప్రయాణమునకు
సిద్ధము
కమ్మని
కఠినముగా
తొందరపెట్టు
మృత్యు
దూతలొక
వైపున,
ఈ
పరిస్థితి
యెప్పుడు
ఏ
రోజు
వస్తుందో
ఎవరికెఱుక?
అది
రాక
మునుపే
పరమాత్మ
చింతన
జాగ్రత్త
చేసికొనియుండవలెను.
Previous
←
The Name and Dhyāna Are the Sādhanas That Free One from Every Bond
Next
The Wealth of Dhyāna and Japa Is the Sattva Guṇa
→