Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · The Wealth of Dhyāna and Japa Is the Sattva Guṇa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9.
ధ్యాన
జపముల
సంపదే
సత్త్వగుణము
సద్గుణములను
జూచి
సర్వేశ్వరుడు
ప్రేమించును
మానవునకు
మూడు
విధములైన
దశలున్నవి.
మొదటిది
అస్పష్టముగాను,
మధ్య
దశ
కార్యములతో
కూడుకున్నది
గాను,
మూడవది
ఉత్తమముగాను
నుండును.
ఇవియే
తమోదశ,
రజోదశ,
సత్త్వదశ.
మొదటిదైన
అస్పష్ట
దశనుండి
మధ్య
దశకు
పోవునపుడు
క్రమక్రమముగా
మానవుడు
అభివృద్ధికి
రానట్లయితే
వాడు
తప్పకుండ
అసహజ
స్థితియందున్నట్లు
తెలిసికొందురు.
2
▾
Meaning
Keep
శైశవము
మొదలు
యౌవనారంభము
వరకు
నుండు
జీవిత
భాగము
ఎక్కువ
గణింపవలసినది
కాదు.
దానిని
గురించి
యెక్కువ
ఆలోచింపవలసిన
అవసరముండదు.
యౌవనారంభము
కాగానే
మానవుడు
ప్రథమ
దశ
అయిన
అస్పష్ట
దశలో
ప్రవేశించి,
అనేకమైన
ఫలితము
లేని
కార్యములే
చేయుచుండును.
పిమ్మట
అతడు
శక్తి
వంతమయిన
పరిపక్వ
దశ
పొందును.
ఈ
స్థితి,
అస్పష్ట
దశకున్ను,
ఉత్తమ
దశకున్ను
మధ్యలో
నుండును.
అప్పుడే
వారు
ఉత్తమ
దశ
కోరదగినది.
3
▾
Meaning
Keep
మొదటి
పూజలు
శక్తితో
చేరియుండును.
మధ్య
పూజ
శివునితో
చేరియుండును.
తల్లి
సంరక్షణలో
నుండే
వయస్సు
మానవునకు
గడచినది.
లోకోద్ధారకుడైన
శివుని
శరణు
వేడే
సమయము
తటస్థించును.
శరీరమును,
మనసును,
మలినము
చేసుకొనుటకు
ఇపుడు
తరుణము
కాదు.
4
▾
Meaning
Keep
వ్యతిరేక
ప్రవాహగతి
ద్వార
ఆదిస్థానమును
పొందవచ్చును
ఈ
వయసున
మానవుడు,
కొన్ని
సహజ
దుర్గుణములు
కలిగియుండును.
అవే
గర్వము,
పెంకితనము,
శోధన,
కామము,
వాంఛ,
సిగ్గు,
భయము,
ద్వేషము,
అసహ్యభావము
మొదలగునవి.
ఇట్టివి
తనలో
నున్నంతవరకు
శివునికి
శరణాగతుడు
కాడు.
ఈ
దుర్గుణములను
పూర్తిగా
తుడిచి
వేయవలెను.
కనీసము
క్రమక్రమేణ
పోగొట్టుకొనుటయినా
ప్రయత్నించవలెను.
అట్టివాడు
ప్రవాహమున
కెదురీత
నీదిన
వాడగును.
దీనినే
“యమునా
నది
వ్యతిరేక
ప్రవాహగతి”
అని
కూడ
అంటారు.
ప్రవాహమున
కెదురుగా
వెళ్ళిన,
క్రమముగా
నుత్పత్తి
స్థానమును
చేరునే
గాని,
సాధారణముగా
ప్రవాహము
వెంబడి
తేలుతు
పోయిన
క్షేమ
స్థానమునకు
అంతకంతకు
దూరమయి,
అంతియే
గాక,
మునుగుతు
తేలుతు
క్షణమైనను
విశ్రాంతి
లేక
గమ్యమును
సహితము
పొందలేక
పోవుచున్నాడు.
5
▾
Meaning
Keep
ఎదురుగా
ఈదుట
కొంచెము
కష్టమైనా,
గమ్యమునకు
కొంతయయినా
దగ్గరగా
పోవచ్చునే
గాని
దూరము
కాదు.
అందు
నిమిత్తమే
ధ్యానము
తెప్పవలె
తోడుగా
నుండును.
ధ్యానముచే
దేహ
సంబంధమైన
బలహీనతలను
దూరము
చేసికొని,
మనో
వేగము
నరికట్టి,
శాంతముగా
అనుగ్రహ
ప్రవాహమున
కెదురు
పోవుచున్న,
అనుగ్రహ
స్థానమైన
ఆదిమూర్తిని
పొందవచ్చును.
అట్లుగాక
సులభముగా
నున్నదని
ప్రవాహముతో
పాటు
దిగువకు
పోవువారు
అనుగ్రహమునకు
అడ్డము
తిరిగిపోయిన
వారగుదురు.
తాను
ముందు,
అనుగ్రహము
వెనుక
అగును.
అంతియే
గాక
ఆదిమూర్తి
క్రమక్రమముగా
అస్పష్టమై
అసలే
కనిపించక
పోవును.
అట్టివారు
ముక్తి
మార్గమును
దూరము
చేసికొని
కష్ట
భాజనులై
ఆనాటి
కానాడు
ఎక్కువ
దుఃఖమును,
కష్టములను
అనుభవింతురు.
లాభమేమి?
ఈ
పరిస్థితికి
కారణమే
పైన
చెప్పిన
దుర్గుణములు.
ఆ
దుర్గుణములను
దూరము
చేసికొనిననే
మూల
స్థానము
ముమ్మాటికి
చిక్కును.
అట్లు
కాకున్న,
ఎంత
కష్టపడియు
ఫలితము
ఆవంతయు
చిక్కదు.
లోకమున
సద్గుణములున్నవారినే
అందరు
ప్రేమింతురు.
కాని
దుర్గుణములవారికి
దూరమగుదురు.
6
▾
Meaning
Keep
బాహ్య
సౌందర్యమును
జూచి
పశువులు
ప్రేమించును.
వ్యామోహించును.
సద్గుణములను
చూచి
సర్వేశ్వరుడు
ప్రేమించును.
సంతోషించును.
లోకుల
తుచ్ఛ
ప్రేమలకు
లొంగకండి.
పవిత్రమైన
పరమాత్మ
ప్రేమకు,
దయకు
ప్రాకులాడవలెను.
లోకుల
ప్రేమ
క్షణక్షణమునకు
మారుచుండును.
అది
వారి
యిష్టాయిష్టములపై
ఆధారపడి
యుండును.
భగవంతుని
ప్రేమ
కేవలము
సద్గుణముల
పైననే
ఆధారపడును.
అంతియే
గాక,
అది
స్థిరమైన
ఆనందమును
ప్రసాదించును.
బాహ్యమైన
మంచికి
దాసులయ్యే
వారు
మాటి
మాటికి
ప్రమాదమును
కొని
తెచ్చుకుంటారు.
మానవుని
మంచి
సౌందర్యము
సద్గుణమే
గాని,
వేరు
గాదు.
అట్టి
సౌందర్యమునకు
మించిన
సౌందర్యము
వేరు
లేదు.
7
▾
Meaning
Keep
జప,
ధ్యానముల
ఫలమే
సద్గుణ
సంపద
లోకమున
ఎవరైన
పాప
కార్యముచేస్తే,
దానిని
గురించి
కూడ
సద్గుణవంతులు
ప్రసంగించకూడదు.
ఎందుకన
ఆ
చింతలో
వీరును
దిగవలసి
వచ్చును.
కాన
వాడు
అందులో
భాగము
వహించిన
వాడగును.
ధ్రువుని,
ప్రహ్లాదుని
కథలు
వింటే
పుణ్యము
వచ్చును.
మార్గము
చిక్కును.
సావిత్రి,
అనసూయల
చరిత్రలు
వింటే
పాపము
నశించును.
గుణములు
కుదురును.
వీటికి
ఏమి
కారణము?
ఎవరు
చెప్పగలరు?
వారందరు
పవిత్రులు,
నిష్కళంక
చరిత్రులు
కాబట్టి.
వారిని
వారి
విషయములను
గురించి
ప్రసంగించుకోవడము,
సత్కార్యము
ఆచరించడమే.
ఇదే
కారణము
లేకపోతే,
వారిని
సద్గుణము
లెందుకాశ్రయించును?
మంచి
గుణవంతులను
నిందించే
వారు,
వారిని
పావనము
చేస్తున్నారని
చెప్పుతుంటారు.
ఎప్పుడు
నిందించడంవల్ల
వారి
పాపములను
పైకి
లాగి,
తాము
తమ
లోనికి
ఆ
పాపములను
గ్రహిస్తున్నారు.
8
▾
Meaning
Keep
ఆ
విధముగా
సద్గుణవంతులను
నిందించువారు
పాపులవుతున్నారు.
సద్గుణవంతులు
పాపరహితులగుచున్నారు.
కనుక
ఎదుటివాని
దుర్మార్గమునుగాని,
చెడ్డను
గురించిగాని
ఎప్పుడు
తలంచరాదు.
చేతనైతే
వానిని
మంచి
మార్గమునకు
తిప్పుటకు
వాని
యెదుట
మంచి
కార్యములు
చేస్తు,
మంచి
విషయములను
బోధించుచుండవలెను.
ఇట్టి
శాంతము,
దయ,
సర్వ
శ్రేయోభిలాష
మానవునియందు
ఉద్భవించవలెను.
అట్టి
సద్గుణ
సంపదను
పొందవలెనన్న
జపధ్యానములను
ఆచరించవలెను.
జపధ్యానముల
ఫలమే
సద్గుణ
సంపద.
జపధ్యానములు
బాహ్య
సంబంధమైన
బహిర్భాగమును
మాత్రమే
శుభ్రపరచక,
అంతర్ముఖమును
కూడ
శుభ్రపరచును.
9
▾
Meaning
Keep
సత్త్వ
గుణము
యొక్క
జన్మ
భూమియే
ధ్యానము
సముద్రము
పైభాగమున
తరంగములు
పుట్టును.
అయితే,
ఈ
తరంగములను
పుట్టించునది
వీచే
వాయువు
కనుక,
తరంగములను
పుట్టించు
శక్తి
వాయువులో
నున్నది.
అలాగే
బుద్ధిమంతుని
మనసున
ఎన్నో
ఆలోచనలు,
అభిప్రాయములున్నవి.
వాటిని
వెల్లడి
చేయ
శక్తి
వానికి
లేదు.
సరియైన
వస్తువు
వానికి
తటస్థించినపుడు,
అన్ని
వైపులనుండియు
ఈ
ఊహలు
పొంగి
పొరలి
పోవును.
అట్లే
తాము
పూజించు
ఫోటోలందు,
విగ్రహములందు
ప్రభువు
వ్యక్తమవడము
ఫోటో,
విగ్రహముల
యొక్క
విశిష్ఠ
గుణమా?
కాదు.
ఫోటో
ఫోటోగానే
యుండును.
విగ్రహము
విగ్రహముగానే
యుండును.
భక్తుని
యొక్క
విశ్వాస
శక్తి
తీవ్రత
వల్ల
పరమాత్ముడు
తన
భక్తులకు
కనిపించకుండ
ఉండలేడు.
అందు
నిమిత్తమై
దేనిపై
దృష్టిని
నిల్పి
భక్తుడు
ధ్యానించి,
పూజించునో
అది
రాయి
కాని,
చెక్క
గాని,
కాగితము
గాని
అందులో
తాను
అనుగ్రహరూపమున
దాల్చును.
ప్రహ్లాదునికి
స్తంభమందే
ఉద్భవించెను.
వేమనకు
శిలయందు
గోచరమాయెను.
మార్కండేయునకు
లింగమునుండియే
బయటికి
వచ్చెను.
భక్తుని
మనోవాంఛ
సఫలము
చేయుటకు
విశ్వమునకు
ఆధారభూతుడైన
హరి
యేరీతిగానైన,
యెక్కడైన
వచ్చును.
అయితే
తనను
ఏకాగ్ర
చిత్తులై
ప్రార్థించవలెను.
అట్టి
ఏకాగ్రత
పుట్టుక
స్థానము
సత్త్వగుణము.
అట్టి
సత్త్వ
గుణము
యొక్క
జన్మభూమియే
ధ్యానము.
కాన
మానవులు
మొదట
సద్గుణములను
అలవరచుకొనవలెను.
దాని
సత్సంగము
నాశింపవలెను.
ఏ
సత్సంగమున
పరమాత్ముని
గురించి,
సత్యమును
గురించి,
పరోపకార,
సర్వ
జన
సమాన
ప్రేమను
గురించి
ప్రసంగము
పురికొల్పబడుతుందో
అట్టివారే
నిజమైన
స్నేహితులు.
అట్టి
వారినే
సాధు
సంఘము
అనుటకు
సందేహము
లేదు.
10
▾
Meaning
Keep
పాపభీతి,
దైవప్రీతి
గలవారే
సత్సంగము
భగవంతుని
గురించిన
ప్రసంగము
లేక,
కడకు
ఆ
తలంపైన
లేక,
సంసార
బంధములను
వృద్ధి
పరచుటకు,
బిగించుటకు,
అసత్య,
అన్యాయ,
అహితముల
బోధించుటకు
ప్రయత్నించునో
వాడు
స్నేహితుడు
కాడు.
అట్టి
వానిని
చేరడానికి
కూడ
ఇచ్చగించకూడదు.
అట్టి
పై
గుణముల
సహవాసమే
దుస్సంగమనబడును.
అట్టి
వారి
సాంగత్యము
చేయుటవల్ల
తమకు
ఇష్టము
లేకున్నను
మానవులు
తప్పులు
చేయవలసి
వచ్చును.
అప్పుడు
చేయరాని
కార్యములు
చేయుచు
అథోగతికి
దారితీయును.
పాపభీతి
లేనివారు
ఎంతటికైన
సాహసించగలరు.
అందులో
ఆశ్చర్యము
లేదు.
పాపభీతి,
దైవప్రీతి
కలవారే
సత్సంగము.
11
▾
Meaning
Keep
ఈ
రెండు
మందుకైనా
ఎవరి
దగ్గర
వెతికిన
చిక్కదో,
అట్టి
వారే
దుస్సంగము.
కాన
సాధకులు
ఎల్లప్పుడు
సత్సంగము
కోరవలెను.
అట్లు
చేరుటవల్ల
ఇచ్ఛాశక్తి
పెంపొందును.
అప్పుడు
వారు
పొందలేనిది
లేదు.
లభ్యమయిన,
కాకున్న
సత్సంగమునే
కోరవలెను.
చేరవలెను.
శాశ్వత
సంతుష్టిని
ఆశించు
దానిని
పొందుము.
కాని
అశాశ్వతమైన
సంతుష్టుల
కొఱకు
ఆరాటపడ
వలదు.
12
▾
Meaning
Keep
నిజమైన
సాధకుడు
ఐహిక
విషయములలో
కాలము
గడుపువారి
సాంగత్యమును
కోరి
లాభము
లేదు.
నీకు
నే
చెప్పిన
గుణములు
కల
స్నేహితుడు
దొరకకుండిన,
నీకు
నీవు
ఒంటరిగానే
నుండుము.
నష్టమేమి
లేదు.
దుస్సంగత్వము
గురించి
తలంపనైన
తలంపరాదు.
వారికి
వీలుపడినప్పుడు,
నీ
చేతికి
చిక్కినప్పుడు
సరియైన
బోధలు
చేయవచ్చును.
కాని
వారి
బోధనలలో
నీవు
చిక్కుకొనకు.
వారి
మాటలకే
చోటివ్వకు.
అసలక్కడ
నుండుటకు
కూడ
యిష్టపడవద్దు.
ఇట్టి
గుణములతో
నుండిన,
ధ్యానజపములు
సులభముగా
కుదురగలవు.
Previous
←
Concentration of Citta Is the Chief Thing for Dhyāna
Next
Aids to Dhyāna: Sincerity, Purity, Humility
→