Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Aids to Dhyāna: Sincerity, Purity, Humility
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10.
ధ్యానమునకు
సహాయము
:
నిష్కాపట్యము;
నిర్మలత్వము;
వినయము
సర్వజన
సమాన
ప్రేమతో
ధ్యానము
శాంతముగా
సాగును
కటిక
చీకటిలో
నావికులకు
సముద్ర
మధ్యమున
త్రోవ
చూపు
దీపస్తంభమువలె,
జీవన్ముక్తులు
మార్గదర్శకులు.
అంధకారమునందు
మునిగి
దారి
తెలియనివారికి,
ఆధ్యాత్మిక
ప్రకాశములు
దారి
చూపుచున్నవి.
2
▾
Meaning
Keep
అందరూ
ఒక్క
భగవంతుని
ఉదరమందున్నవారే.
ఒక
పెద్ద
కొలనులో
అనేక
రకములైన
చేపలు,
పురుగులూ
ఇటు
అటు
తిరుగుచుండును.
అట్లే,
ఈ
చిన్న
మనుష్య
స్వరూపములన్నియూ
పరమాత్మ
అను
సముద్రమందు
అటు
ఇటు
కదలుచుండును.
ఈ
దృశ్యము
చాలా
భయంకరముగా
నుండును.
కొన్ని
అపక్వజీవులు
స్వార్థముతో
స్వలాభముతో
అటు
ఇటు
కదలుచుండును.
అనేకమంది
అజ్ఞాన
మనుజులలోకూడా,
కొద్దిమంది
పూర్తిగా
వృద్ధిపొందిన
జీవన్ముక్తులు,
జ్ఞానులు,
యోగులూ
కలరు.
అజ్ఞానులలో
కూడ
ఇట్టి
జనులు
కలిసియుండుటవల్ల
ఎవరు
జ్ఞానులు
ఎవరు
అజ్ఞానులు
అనునది
తెలుసుకొనుట
కష్టము.
నెత్తురునందు
తిరుగు
ఎఱ్ఱటి
పురుగులను
చూడవలెనన్న,
భూతద్దము
సహాయము
లేనిదే
తెలియరావు.
కాన,
అట్టి
జ్ఞానులను
స్థూలరూపమున
చూడవలెనన్న,
వారిని
చూచు
భూతద్దము
కావలెను.
ఆ
అద్దమే
ఈ
ధ్యానము.
3
▾
Meaning
Keep
ఈ
సృష్టియందుండు
విచిత్రములను
వింతలనూ
చూచుటకే
ఆశ్చర్యముగా
నుండును.
అయితే,
ఇప్పటి
ప్రకృతి
వాతావరణమును
పట్టి
చూడ
ప్రకాశము
చూపువారు
చాలా
తక్కువగా
ఉన్నారు.
కాన,
వారిని
వీరిని
ఆశ్రయించి
దారి
తప్పిన
మార్గములలో
పడుటకన్నా
పరమాత్మపై
సంపూర్ణ
ప్రేమ
విశ్వాసములు
పెట్టి
గురువు
దైవము
తల్లి
తండ్రి
సర్వము
నీవే
యని
భగవంతుని
ఆశ్రయించిన
ఏత్రోవనూ
తప్పరు.
తానునూ
తప్పుదారి
చూపించడు.
అట్టి
పవిత్ర
భావనలో
దృఢత్వము,
అనుభవమూ
కలుగవలెనన్న
ధ్యానమొక్కటియే
ఏకైకమార్గము.
ప్రేమతో,
విశ్వాసముతో
ఇష్టరూపమును,
ఇష్టనామమును
స్మరించి
ధ్యానించిన
చాలును.
అట్టిదానికి
సంతోష
స్వభావమును
వృద్ధి
పరచుకొనవలెను.
ఎల్లప్పుడూ
సంతోషముతో
గూడిన
నవ్వు
ముఖము
కలిగియుండవలెను.
ఇదే
మానవునికి
మంచి
వ్యక్తిత్వము
నిచ్చును.
జనులు
కూడా
నిన్ను
ప్రేమింతురు.
అప్పుడు
పరమాత్ముడు
కూడ
నిన్ను
చూచి
సంతోషించును.
నిష్కపట
ప్రయత్నముతో
నిర్మల
స్వభావముతో,
వినయవిధేయతలతో
ధ్యానమును
ఆచరించు.
అప్పుడు
నీ
మనోభీష్టములను
తప్పక
పొందగలవు.
ఎట్టి
మాటలందునూ
ఉద్రేకము
తెచ్చుకొనవద్దు,
ధైర్యము
కోలుపోవద్దు.
ఎట్టి
వారినైనా
గౌరవించు.
అట్లుండిన
సర్వజన
సమాన
ప్రేమ
అభివృద్ధి
యగును.
అప్పుడు
ధ్యానము
శాంతముగా
కొనసాగును.
4
▾
Meaning
Keep
మృదు
మధురమైన
సంభాషణ
ధ్యానమునకెంతయో
తోడ్పడును
ఔషధము
వాడక,
జబ్బు
కుదురు
మార్గము
ధ్యానము
ఒక్కటియే.
దీనిమూలమున
సూచనాశక్తి
కూడ
కుదురును.
మంచి
శక్తిగల
సూచనచే
ఏ
జబ్బునైననూ
కుదర్చవచ్చును.
మానవుని
ప్రతిమాటయందునూ
రెండు
విధములైన
వృత్తులు
గలవు.
మాటలలో
శక్తివృత్తి,
లక్షణవృత్తి
అని
రెండు.
ఉపనిషత్తులో
లక్షణవృత్తి
తీసుకొనబడును.
వేదస్వరూపమనగా
వేదముల
ఆకారమని
కాదు
అర్థము.
లక్షణవృత్తి
బ్రహ్మమును
తెలియపరుచును.
ఇందులో
ముఖ్యముగా
గమనించవలసిన
విషయమేమన
మృదుమధురమైన
మాటలతో
మాటలలోని
శక్తిని
వినియోగించవలెను.
సర్వభూతములయందూ
పరమాత్మను
దర్శించవలెనన్న
మాటలలోని
మాధుర్యము
ఎంతయో
తోడ్పడును.
ఏమండీ,
అయ్యా,
ప్రభూ
అను
మాటలు
ఎంత
విశ్వాసము
కుదుర్చును!
ఒక
వ్యక్తి
ఇంకొక
వ్యక్తికి
ఎంత
ఉల్లాసమిచ్చును!
వాని
మనస్సెంత
హాయిగా
ఉండును!
అట్లే
హాయి
ఆనందములతో
ధ్యానము
చేసిన
ఎంత
త్వరలో
ఏకాగ్రత
కుదురును!
అట్లు
కాక,
మన
మాటలలో
ఇతరులను
నిందించు
వాక్యములు
ఆడిన
వాటివల్లా
ఇతరుల
నిందలకు
మనము
గురి
అయి,
ఈ
రెండూ
చేరిన
అశాంతిలో
మనసు
అల్లాడుచూ
అట్టి
అశాంతి
సమయమున
ధ్యానమునకు
పూనుకొన్న
ఏదియూ
జరుగక
ధ్యానమునుకూడ
అపవిత్రము
చేయవలసి
వచ్చును.
కాన,
ధ్యానమునందు
మనము
ఆనందమును
అనుభవించవలెనన్న
దానికి
మునుపు
మనమెంతో
ఆనందమైన
సంభాషణలలో
లేక
సంతోషమైన
మననములో,
చింతనలో,
భాగము
వహించియుండవలెను.
మృదుమధురమైన
సంభాషణ
కూడా
ధ్యానమునకెంతయో
తోడు.
మానవుడు
అట్టి
స్వభావములు
అలవరచుకొనవలెను.
5
▾
Meaning
Keep
తృప్తియే
ఆనందమును
అభివృద్ధి
పరచును
మానవుడు
శరీరమును
వదలిననూ,
స్వభావములు
లోకమున
నిలచియే
యుండును.
నడవడికలు
మానవునికి
నిజమైన
కీర్తి,
బలము;
గుణమే
శక్తి.
ఈ
గుణము
ఒక్క
సాక్షాత్కారము
కొరకు
వినియోగించు,
దానినే
పట్టు
పట్టు.
ఇట్టి
సమయములలో
ఏమి
జరిగిననూ,
తృప్తిగానే
యుండవలెను.
ఇది
చాలా
ముఖ్యమైన
విషయము,
తృప్తియే
ఆనందమును
అభివృద్ధి
పరచును.
తృప్తిగల
మనసు
ఒక
అంతులేని
పండుగవంటిది.
ఆశవల్లా
మనసుకు
నిలకడ
ఉండదు.
ఏకాగ్రతను
కుదర్చలేము.
ఆశ
శరీరములోని
ఒక
మంట.
మనిషిని
క్రమేణ
దహింపజేయును.
ఆశకు,
తృప్తి
ఒక
విరుగుడు
మందు.
ఎండలో
చెమటలు
కార్చుకొంటూ
అలసి
ప్రయాణము
చేయు
వానికి
చల్లటి
నదీస్నానమెంత
హాయినిచ్చునో
ఆ
ప్రకారము,
లోభమను
అగ్నివల్ల
కప్పబడుచున్న
దురాశగల
వ్యక్తి
తృప్తి
అను
జలాశయములో
స్నానము
చేసిన
పూర్తిగా
సౌఖ్యమనుభవించును.
మోక్ష
మార్గమునకూ
దాని
ఆశకూ
ప్రాకులాడవలెను.
కానీ,
క్షుద్రమైన
ఈ
లోకసుఖములకై
జీవితమును
అర్పితము
చేయరాదు.
సర్వమును
సర్వేశ్వరునకు
అర్పితము
చేయవలెను.
అదే
నిజమైన
తృప్తి.
దానికే
శాంతి,
సంతోష,
విచారణ.
వీనిలో
ఏ
ఒకటైననూ
లోబరచుకొనవలెను.
అప్పుడు
సాక్షాత్కార
ప్రాప్తి
కలుగును.
అట్లు
లోబరుచుకొను
శక్తి
ఒక
స్మరణ
ధ్యానమందు
మాత్రమే
ఉద్భవించును.
అది
వేరు
చోట
చిక్కదు.
చిక్కబోదు.
అన్నింటికంటే
సంతోషమును
మీరు
స్వాధీనము
చేసుకొన్న,
మిగిలిన
రెండునూ
వాటంతటవే
చేరిపోవును.
తృప్తికన్న
మనుజునకు
లాభము
చేకూర్చు
పదార్థము
వేరొకటి
లేదు.
ఈ
సంతృప్తిని
మూడు
లోకములకంటే
మిక్కిలి
ధనమని
చెప్పవచ్చును;
అట్టివాడు
అనుభవించు
భగవత్
విభూతులు,
ఇంతింత
అని
చెప్పరానివిగా
ఉండును.
కామధేనువు,
కల్పతరువులకంటే
సంతోషముగా
నుండును.
వానిలో
వాడు
మునిగి
ఓలలాడును,
ఆడవచ్చును.
అట్టి
స్థిరమైన
ఆనందమును
మాని
కేవలము
దేహసంబంధమునకే
ప్రాకులాడవద్దు.
6
▾
Meaning
Keep
శరీరమును
ఆధ్యాత్మిక
సాధనలో
ఒక
పనిముట్టుగా
ఉపయోగించుకో
ఈ
అస్థిరమగు
శరీరమునందు
మోహముంచవద్దు.
ఈ
దేహమును
పనిముట్టుగా
ఉపయోగించుకొమ్ము,
పంచభూతములచే
తయారు
కాబడిన,
జీర్ణమై
నశించు
ఈ
శరీరమునకు
నీవు
వ్యతిరేకమైనవాడుగా
తెలిసికొనుము.
నీవు
అనువాడవు
ఎక్కడ
చూచిననూ
అవినాశనమగు
ఆత్మ
స్వరూపుడవని
భావించుకో.
నీవు
నివసించు
గృహము
నీకంటే
ఎట్లు
విలక్షణమై
వేరుగా
నున్నదో,
అటులనే
అజ్ఞానమువల్ల
నిన్ను
కొంతకాలము
ఆవరించిన
ఈ
శరీరముకూడా
అట్టిదే.
నీ
వింత
కష్టపడుటకునూ,
దుఃఖపడుటకునూ
నీబానిసత్వమునకునూ
ఈ
శరీరమే
మూలకారణము.
బాగుగా
తెలిసికో.
నీ
ఇష్ట
ప్రకారము
దేహము
నడవవలెనే
కానీ,
నీవు
లొంగిపోవలదు.
దీనిని
వదలివేయుటకుకానీ,
ఏదైనా
కట్టుబాట్లయందు
శరీరమును
కదలక
మెదలక
బంధించుటకుగానీ
దీక్ష
పూను,
సిద్ధముగా
ఉండు.
అయితే
శరీరమును
కొన్ని
విషయములందు
మాత్రము
జాగ్రత్తగా
తరిబీదు
చేయవలెను.
ఇప్పుడు
పైన
చెప్పినవన్నియూ
యథార్థముగా
ఆత్మ
సంబంధమునకు
చేరిననూ
బాహ్యరీతిగా
దీనికి
కొంత
పరిచర్యలు
క్రియారూపమున
చేయవలసిన
ఉన్నవి.
7
▾
Meaning
Keep
పైన
చెప్పినట్లు,
పనిముట్టుగా
ఉపయోగించుకొనుటలో
ఈ
జీవనదిని
దాటుటకునీశరీరమును
ఒక
పడవగా
వినియోగించు.
అందు
నిమిత్తము
ఆవలి
యొడ్డు
చేరువరకూ
అనగా,
పరమార్థమును
చేరువరకూ
దీనికి
బలహీనము
కాక
దీనికి
గాయములు
కాక
చిల్లులు
పడక
అవయవములనే
బోటు
సర్వ
భాగములూ
శిథిలము
కాక
ఉండునట్లు
జాగ్రత్త
వహించవలెను.
అనగా
వేళవేళకు
మితాహారము,
బలమైన
సాత్విక
ఆహారము
దానికితగిన
క్రమమైన
శరీరకృషి
ఇవి
మానరాదు.
ఆ
కృషియే
ఆధ్యాత్మికమున
చేర్చిన
అదే
దాని
క్రమమైన
కర్మగా
నిలుచును.
అదియే
ధ్యానము,
స్మరణ,
పూజ,
భజన.
ఇట్టి
అభ్యాసము
చేయునపుడుగానీ,
తదుపరిగానీ
సంతోషముగానే
ఉండవలెను.
దీనిని
మరవరాదు.
అలసటగాని,
నిరుత్సాహముగానీ
పడరాదు.
అట్లు
కొంత
అలసట
కలుగునట్లయిన
ఈ
సాధనలు
చేసిన
తరువాత
కొన్ని
శనగగింజలుకాని,
కస్కస్
గింజలుగానీ,
బాదముగానీ
రాత్రి
నీళ్ళలో
నానవేసి
సాధన
పూర్తికాగానే
అవి
భుజింపుము.
ఇవి
శరీరమునకు
చల్లదనమును
బలమునూ
ఇచ్చును.
ఇట్లు
ప్రతిమానవుడుకూడ
ధ్యానసాధనలతో
తృప్తి
యను
సద్గుణమును
వృద్ధి
చేసుకొనవలెను.
8
▾
Meaning
Keep
తృప్తియే
సాధకులకు
ఉత్సాహమును,
శక్తిని
ప్రసాదించును
తృప్తిఅనునది
సాత్విక
గుణము.
అది
సోమరితనమును
రానీయదు.
భగవంతుని
వైపు
మనసును
పోనిచ్చును.
శాంతినిచ్చును.
అనవసరమైన
స్వలాభపు
పనులకు
ఆటంకము
చేయును.
అట్టివాడు
పూర్తిగా
సత్వగుణము
కలవాడై
యుండును.
లోనుండు
ఆత్మతో
సమ్మేళనము
కలుగును.
అతను
ఎంత
పనియైనను
విసుగు
విరామములేక
చేయగలడు.
అనేకమైన
మార్గములలో
పోవు
మనోవికారములను
కేంద్రీకరింప
బడును.
పూర్వపు
ఋషులూ,
భిక్షుకులు,
యోగులు
ఇట్టి
సంతృప్తివల్లనే
నిశ్చింతగా
సాధనచేసుకొని
సార్థక్యము
కాంచుచుండిరి.
తృప్తియే,
సాధకులకు
సాక్షాత్కార
మార్గమున
నడుచుటకు
తగిన
ఉత్సాహమును,
శక్తిని
ప్రసాదించును.
ఆ
త్రోవలో
ఉండుకష్టము
లేవియూ
తెలియకుండా
చేయును.
ఈ
గుణమును
కల్గియుండుటవల్లనే
సాధకుడు
ప్రపంచమందలి
అశాశ్వతమైన
వస్తువులన్నియు
విషమువలెను.
గడ్డిపోచవలెనూ
చూడగల్గుచున్నాడు.
తృప్తివల్ల
వివేక
వైరాగ్యములు
విచారణశక్తి
బలపరచుకొనవచ్చును.
ఇట్టి
అనుభవములు
పొందిన
మీరాచరిత్ర
చూడు.
రాధా,
జయదేవ
గౌరాంగాదులను
తలంచుడు;
నిజము
తేలును.
Previous
←
The Wealth of Dhyāna and Japa Is the Sattva Guṇa
Next
The Destruction of Vāsanās Is the Aim of Dhyāna
→