Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · The Destruction of Vāsanās Is the Aim of Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11.
వాసనానాశనమే
ధ్యానము
యొక్క
ఆశయము
మలిన
వాసనలు
సంసార
బంధకములు
లోకమున
మానవ
జీవితముయొక్క
ఆశయము
ఆత్మను
తెలిసికొనుటయే,
అనగా
ఆత్మ
సాక్షాత్కారము
పొందుట.
అట్లు
పొందవలెనన్న
జీవి
పూర్తిగా
వాసనారహితుడై
యుండవలెను.
ఆ
విధముగా
వాసనలను
పూర్తిగా
తొలగించుకొనుటయే
మోక్షము.
వాసనలు
రెండు
విధములుగా
నున్నవి.
(1)
శుభ
వాసన
(2)
అశుభ
వాసన.
శుభవాసనలు
-
తిరిగి
జన్మ
లేకుండెడి
పవిత్ర
భావములతో
నిండియుండును.
అశుభ
వాసనలు
-
మనసును
వృద్ధి
పరచును.
అట్లుగాక
శుభవాసనలు
వేయించిన
విత్తనములెట్లు
మొలకెత్తవో,
ఆవిధముగా
మంచి
వాసనలు
గలవారికి
జన్మలుండవు.
మంచి
వాసనలు
నిన్ను
అంటి
పెట్టుకొనిన,
బ్రహ్మ
జ్ఞానము
సులభముగా
పొందవచ్చును.
అట్టి
మంచి
వాసనలకు
గుర్తులే
మహాత్ములతో
సత్సంగము,
వారి
దర్శన,
స్పర్శన,
సంభాషణములు,
వాటిపై
అభిరుచి,
దయ,
ఓర్పు,
ప్రేమ,
సహనము,
సత్యము,
ధైర్యము,
క్షమ,
బ్రహ్మచర్యము
మొదలగునవి.
ఇవి
శుద్ధ
వాసనలనబడును.
2
▾
Meaning
Keep
అశుద్ధ
వాసనలనగా
-
మనసును
చలింపజేయు
విచిత్రములను
చూడవలెనను
ఆశ
(అనగా
సినిమాలు),
రజోగుణ
సంబంధమైన
ఆహారములు
తినవలెనను
ఆశ,
మాంసము,
చేపలు,
కల్లు,
సారాయి,
మత్తు
పదార్థములు
ఇత్యాది
తిండ్లపై
ఆశ,
చెడు
తలంపులు,
కోపము,
మోహము,
దురాశ,
అహము,
మోసము,
గర్వము,
ఈర్ష్య,
అసూయ
యిత్యాది
గుణములు.
3
▾
Meaning
Keep
ఇట్టి
మలిన
వాసనలు
మూడు
రకములు.
1)
లోకవాసన
2)
దేహవాసన
3)
శాస్త్ర
వాసన.
4
▾
Meaning
Keep
అందమైన
రూపము,
బలిష్ఠమైన
శరీరము,
ఆరోగ్యము,
ముడుతలు
పడని
చర్మము,
పుష్టిగా
నుండు
కండరములు
కావలెనను
కోరికలన్నియు
దేహ
వాసనలు.
5
▾
Meaning
Keep
శాస్త్రమునందు
గొప్ప
విద్యావంతుడనై
ఇతరులను
పరాజయము
ఒనర్చవలెనను
కోరిక,
గొప్ప
పండితుడనై
అందరికంటెను
మిన్నయైన
వాడుగ
నుండవలెనను
ఆశ
మొదలగునవి
శాస్త్ర
వాసన.
6
▾
Meaning
Keep
ఇంక
లోక
వాసన
కీర్తి
కోరుట,
అధికారమును
గొప్ప
హోదాలను
కోరుట,
పేరు
ప్రఖ్యాతులను,
గౌరవమును,
ఆధిక్యమును
కోరుట
ఇత్యాది
గుణములన్నియు
లోక
వాసనలనబడును.
ఇవన్నియు
మలిన
వాసనలే.
7
▾
Meaning
Keep
ఇవి
సంసారమున
బంధించి
తరుచు
ఇహలోకమునకు
తెచ్చుచుండును.
మనసు
పెద్ద
వృక్షము.
దానికి
బీజములు
రెండు
గలవు.
అవియే
వాసన,
ప్రాణము.
విత్తనము
పెద్ద
చెట్టుగా
మారును.
చెట్టునుండి
విత్తనములు
వచ్చును.
ప్రాణముయొక్క
కంపనములు
వాసననుండి
కలుగును.
వాసనలు
ప్రాణము
యొక్క
కంపనమువల్ల
పనిచేయును.
8
▾
Meaning
Keep
అజ్ఞాన,
అహంకార,
రాగ
వాసనల
నాశనమే
జీవికి
మోక్షప్రాప్తి
ఇందులో
ఏయొక్కటి
నశించినను
మిగిలిన
రెండు
నశించును.
కావున
మనసున
ఈ
రెండును
నశింపవలెనన్న
అందులో
నున్న
అజ్ఞానమును
నిర్మూలించవలెను.
తానొక్కడే
గాక,
అతనికొక
అసుర
కుమారుడు
కూడ
గలడు.
వాడే
అహంకారి.
అట్టి
అసుర
అహంకారికి
ఇద్దరు
బిడ్డలు.
అవియే
రాగము,
వాసన.
కనుక
రాగమునకు,
వాసనకు
దగ్గర
సంబంధము
గలదు.
రాగమెచ్చటనుండునో
వాసన
యచ్చటనే
యుండును.
అవి
యన్యోన్యమైన
సోదరీమణులు.
రాగ
మనగా
ఇచ్ఛ
లేక
స్నేహము.
రాగము
వల్లనే
మానవునకు
మమత
గలుగుచున్నది.
ఆ
మమత
వల్ల
ఆశలు,
ఆశల
ఫలమునకై
చింతించవలసియుండును,
కావున
మొదట
రాగమును,
వాసనను
పోగొట్టుకొనవలెనన్న
అహంకారము
చంపవలెను.
అహంకారమును
రూపుమాపవలెనన్న
అజ్ఞానమును
హతమార్చవలెను.
అట్టి
అజ్ఞానమును
నాశన
మొనర్చి,
సుజ్ఞానాభివృద్ధి
చేయుటే
ధ్యానము
యొక్క
ఆశయము.
అజ్ఞాన,
అహంకార,
రాగ
వాసనల
నాశనమే
జీవికి
మోక్షప్రాప్తి.
9
▾
Meaning
Keep
వాసనలే
మానవుని
విషయ
సుఖములకు
కారణము
ఎవడు
వాసనలకు
దాసుడై
మెలంగునో
వాడే
జ్ఞానహీనుడనబడును.
అతడు
నిజముగా
దుర్బలుడు.
అట్టి
వాడైనను
చింతపడనక్కర
లేదు.
వాసనను
నిర్మూలము
చేసిన
తక్షణము
కోల్పోయిన
దైవతత్త్వమును
మరల
సంపాదించుకొనవచ్చును.
వాసనలు
హృదయాంతర్గతమై
యుండును.
కలవర
పరచును.
సంస్కారముల
కలవరములు
లేక
కదలికల
వలన
సౌఖ్యము
యొక్క
జ్ఞప్తి
గల్గును.
సౌఖ్య
జ్ఞప్తి
వలన
కోరిక
జనించును.
కోరికల
వల్ల
యింద్రియములు,
వాటి
నాయకుడైన
మనసు
కలసి
పనిచేయక
తప్పవు.
అప్పుడు
మానవుడు
తానాశించిన
వస్తువులను
సంపాదించి,
వాటిని
యనుభవించవలెనని
ప్రయత్నించును.
ఇవి
అతి
సూక్ష్మమున,
స్వల్ప
కాలమునందే
అనగా
కనురెప్ప
పాటులో
జరుగును.
వాసనలు
అంత
సూక్ష్మమైనవి.
10
▾
Meaning
Keep
విత్తనమునందు
పెద్ద
చెట్టు,
దాని
పువ్వులు,
కాయలు,
రెమ్మలెట్లిమిడియున్నవో
అట్లు
వాసనయందే
ఇన్నియు
ఇమిడియున్నవి.
కనుక
వాసనలే
మానవుని
విషయ
సుఖములకు
కారణము.
వాసనయే
లేనియెడల
మనస్సు
నిర్మలమగును.
ఆ
కారణమున
దాని
సంబంధమైనవన్నియు
నశించును.
వాసనే
సత్యమార్గమునకు,
ఆత్మ
మార్గమునకు,
అమరత్వమునకు
పరమ
శత్రువు.
మలిన
వాసనలతో
నిండిన
మనసు
బంధములకు
లోబడును.
వాసన
నిర్మూలమైన
మనసు
మనసే
కానేరదు.
ప్రకృతియే
వాసనామయ
ప్రపంచము.
వాసనవల్ల
మనస్సు
వస్తువులపై
యాకర్షింపబడి
వాటి
విషయమై
మననము
చేయుచుండును.
వాసనలే
నశించిన
మనసు
వస్తువుల
విషయమై
తలంపదు.
మనస్సునకు
ఏ
రంగు
వేసిన
ఆ
రంగు
కలిగియుండును.
మనసు
ఒక
బట్ట
వంటిది.
సాత్త్విక
వాసనలవల్ల
మనసునకు
తెల్లరంగు
కలుగును.
రాజస
వాసనలవల్ల
మనసు
ఎఱ్ఱ
రంగుగా
మారును.
తామసిక
వాసనల
వల్ల
నల్ల
రంగుగా
మారును.
కావున
వాసనలు
ఏ
విధముగా
నుండునో,
మనసు
ఆ
విధముగానే
యుండును.
ఇట్టి
వాసనలను
నాశనము
చేయడమే
మనుజుని
ధ్యాన
ధారణ.
అట్టి
ధ్యాన
ధారణలు
చేసుకొనుటకు
కూడ
తగిన
శక్తి
గలుగును.
మనస్సు
అంటే
వాసనల
సమూహమని
కొందరు
లోకమున
అనుకొందురు.
ఎన్నియో
సంవత్సరములనుండి
ధ్యానతత్పరులై
యున్నను
తగినంత
ధ్యాన
ధారణలు
కుదురకున్నవి
అనుచున్నారు.
ఇందుకు
కారణము
స్పష్టము.
దీనిని
వేరుగా
చెప్పనక్కర
లేదు.
వారు
వాసనలను
నశింపజేసుకొనలేదనే
తేలును.
కావున
ధ్యాన,
ధారణలకు
విరోధమైన
వాసనలను
నిర్మూలము
చేయవలెను.
అట్టివారు
గట్టిపట్టు
పట్టవలెను.
నమ్మకము
దృఢముగా
నుండవలెను.
11
▾
Meaning
Keep
మలిన
వాసనలను
మంచి
వాసనలతో
తొలగించి,
తరువాత
మంచి
వాసనలు
కూడ
వదలవలెను
సాధకులు
అప్పుడప్పుడు
మలిన
వాసనలు
కలిగినచో
వాటిని
తన
ఆధ్యాత్మిక
సాధనల
వలనను,
ఇచ్ఛా
శక్తి
వలనను
స్వాధీన
పరచుకొనవలెను.
జీవన్ముక్తి
యందు
వాసనలు
దగ్ధమైన
స్థితియందుండును.
గృహస్థుని
యందు
అవి
సమృద్ధిగా
నుండును.
వాసనల
నణచినంత
మాత్రమున
మనకు
లాభమేమి
లేదు.
విష
సర్పము
యొక్క
కోరలు
పూర్తిగా
పెరికివేయునట్లు
వాసనలను
పూర్తిగా
నిర్మూలించవలెను.
అట్టి
స్థితియందు
మానవుడు
బ్రహ్మాకారమును
పొందగలడు.
పవిత్ర
వాసనలెన్ని
యున్నను
ప్రమాదము
లేదు.
పవిత్ర
వాసనలు
కూడ
ఒక
బంధనే.
మనమొక
ముల్లునింకొక
ముల్లుతో
తీసి,
రెండు
పారవేసినట్లు,
మలిన
వాసనలు
మంచి
వాసనలతో
తొలగించిన
తరువాత
మంచి
వాసనలు
కూడ
వదలవలెను.
అనగా
మోక్ష
వాసన
కూడ
క్రమేణ
నశింపవలెను.
అప్పుడే
నీవు
ఆ
వస్తువు
పొందగలవు.
బంగారు
బంధనమయినా,
ఇనుప
బంధనమయినా,
బంధన
బంధనే
గాని,
వేరు
కాదు
కదా!
ఈ
రెండు
బంధములనుండి
విముక్తుడు
కావలెను.
అనగా
వాసనారహితుడు
కావలెను.
శుభ
వాసనయినా,
అశుభ
వాసనయినా
రెండు
ఉండ
దగినవి
కావు.
12
▾
Meaning
Keep
సాక్షాత్కారము
పొందవలెననిన,
వాసనా
క్షయము,
మనో
నాశము,
తత్త్వ
జ్ఞానమునభ్యసింపవలెను.
మోక్షమన్న
పై
వాటిలో
నొకటియున్న
సరిపోదు.
జీవన్ముక్తులందు
వాసనలు,
కాలిన
విత్తనములవలె
నిలిచియుండును.
అవి
తిరిగి
జన్మలకు
కారణము
కావు.
13
▾
Meaning
Keep
చూడు.
కారణ
శరీరమే
అజ్ఞాని.
అది
వాసనలతో,
సంస్కారములతో
నిండియుండును.
ఆత్మయందు
వాసనలుండవు.
ఆత్మ
రూపుడు
సదా
నిర్మలుడు.
లింగ
భేదము
లేనివాడు.
మనస్సు,
ఇంద్రియములు,
రూపము
లేనివాడు.
అంతియే
కాదు
అతను
ప్రాణము
కూడ
లేనివాడు.
అట్టి
ఆత్మ
రూపుని
ధ్యానము
నిర్మలము
గాక
మలినమెట్లగును?
అంధకారము,
ప్రకాశము
రెండును
ఒకే
సమయమున
చేరవన్నట్లు
పవిత్రత,
నిర్మలత్వము
చెంత
అపవిత్రత
యుండునా?
వాసనల
నశింపు
ద్వార
మనసును
లయపరచి
సచ్చిదానంద
బ్రహ్మమందు
కదలక
నిలుపవలెను.
14
▾
Meaning
Keep
బలవత్తరమైన
వాసనలను
వదలుటే
ధ్యానము
యొక్క
గమ్యము
లోకములోనుండు
అన్ని
కర్మాగారములకన్న
శరీరమనే
కర్మాగారము
చాల
యద్భుతమైనది.
అది
భగవంతుని
సంబంధమైనది
కనుక
అది
అంత
అద్భుతమైనది.
ఇంతటి
విచిత్ర
కర్మాగారమునందు
వాసనలు
కోరికలుగా
మారి,
మలిన
వాసనలు
నశింపజేయబడి,
మంచి
వాసనలు
తయారై,
ఊహలు
బయలుదేరును.
క్రమక్రమేణ
అమితమైన
వెల
గల
బ్రహ్మజ్ఞానమను
వెన్నవంటి
వస్తువు
తయారగును.
కాన
వాసనలు
మొదట
నిర్మూలనము
చేయవలెను.
వాసనలు
నిర్మూలము
చేసికొనుట
చాల
కష్టము.
సులభముగా
పర్వతములనైనను
పెరికి
వేయవచ్చును.
కాని
వాసనలను
పెరికివేయుట
అంత
సులభము
కాదు.
అయిన
బలహీనులుగాక,
ఇచ్ఛా
శక్తి,
తీవ్రతను,
నిశ్చయత్వము,
స్థిరత
కలిగియుండిన
కొద్ది
కాలములోనే
వాటిని
నశింప
జేయవచ్చును.
అందుకు
ఎన్ని
బాధలు,
కష్టములు,
ఆటంకములు
వచ్చినను
నీ
తీవ్రమైన,
నిశ్చయమైన
ఇచ్చాశక్తిని
మాత్రము
వీడకూడదు.
అవియే
దీని
మూలమును
నాశనము
చేయును.
వాసనలు
మానవుని
మనసును
లోబరచుకొని,
బానిసలుగా
చేసుకొని
ఆటలాడు
చుండును.
సారాయి,
బ్రాంది,
నల్లమందు
ఇత్యాది
మత్తు
పదార్థములు
కొన్ని
గంటలే
మత్తునందుంచును.
వాసనా
శక్తి
అట్లుగాక
జన్మముల
తరబడి
పడియుండును.
ఇట్టి
బలవత్తరమైన
వాసనను
వదలుటే
ధ్యానము
యొక్క
గమ్యము.
Previous
←
Aids to Dhyāna: Sincerity, Purity, Humility
Next
Rooting Out Impure Vāsanā: the Good Sign for Dhyāna
→