Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Rooting Out Impure Vāsanā: the Good Sign for Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
12.
మలినవాసన
నిర్మూలమే
మంచి
సూచన,
ధ్యానమునకు
విషయ
సౌఖ్యములను
అనుభవించుకొలది
వాసనలు
బలపడును
వాసనాప్రేరణయందుండువాడు
త్రాగుబోతువలె
ప్రపంచమందు
తిరుగుచుండును.
అట్టివారికి
సత్యాసత్య
విచక్షణ
శూన్యము.
వాసనయొక్క
సంపూర్ణ
శక్తివలన
వాటియొక్క
పరిణామములు
వారికి
జ్ఞప్తియందుండవు.
అట్టివారు
సిగ్గుయెగ్గనునవి
లేక
విషయసౌఖ్యముల
నాశించుచుందురు,
అనుభవించుచుందురు.
వాసనలలో
ఇమిడినవారికి
బుద్ధి
పనిచేయదు.
విషయ
సౌఖ్యముల
అనుభవించుకొలదీ
వాసనలు
మొద్దుబారి
దృఢమయి
పోవును.
అందుకనియే
గీతయందు
ఫలత్యాగము
చేయుమని
తెలుపుట.
ఫలములు
ఆశించుకొలది
వాసనలు
అభివృద్ధి
చేసుకొన్నవారగుదురు.
అట్టివారికి
గర్వము.
దానివల్ల
పొగరుబోతుతనము
ఈ
రెండు
కూడనూ
బలపడును.
ఇట్టివారు
ధనముకొరకు
ఎంతటి
అన్యాయమైన
కార్యములయినా
చేయుదురు.
ధనమే
వారు
దైవముగా
భావింతురు.
ధనము
అవసరమే,
కాని,
మించిన,
ధనము,
సుఖమివ్వని
ధనమూ,
అవసరములేని
ధనమూ
కోరరాదు.
ఇంతియేకాక
వ్యక్తి
ప్రపంచమున
పొగడ్తలు
కోరుచు,
నిందలు
రాకుండ
ప్రయత్నించును.
ఇది
కూడ
మలినవాసనయే
అనబడును.
2
▾
Meaning
Keep
లోకులు
కాకులన్నట్లు,
ప్రపంచమందలి
కొందరు
స్తోత్రము
చేయుదురు,
కొందరు
నేరారోపణలు
చేయుదురు.
అయితే,
మానవుడు
నేరములకు
నిందలకు
స్తోత్రములకు
అతీతుడై
యుండవలెను.
స్తోత్రము
ఊసివేసిన
ఉమ్మివలె
తలచవలెను.
అప్పుడే
మానవుడు
నిజమైన
సుఖములు
పొందగలడు.
చూడు!
లోకమున,
రామ,
కృష్ణ,
విష్ణు,
శివ,
బాబా
ఇత్యాది
భగవత్
రూపములనే
నిందించుట
విడువలేదు.
దేవతల
విషయమై
కూడనూ
చెడుగా
మాట్లాడుచుందురు.
అట్టి
దేవతలకు
కళంకము
ఆరోపింతురు.
అట్టి
సమయమున
సామాన్యమైన
మానవులెంత?
అట్టి
దుర్మార్గులకు
సహజ
జీవులు
ఒక
లెక్కా?
తెల్లవాడు
నల్లనివానియందును,
నల్లవాడు
తెల్లవానియందునూ
అయిష్టత
కలిగియుండును.
శైవులు
వైష్ణవులను,
వైష్ణవులు
శైవులను
నిందించుకొందురు.
ప్రతి
మనుజునకు
వారివారి
స్వమతము,
స్వగ్రామము,
స్వరూపము
ఎట్లో,
అట్లే
పూజావిధాన
క్రమపద్ధతులయందుకూడా
ఒకరినొకరు
నిరసించుకొనుట
సహజమయినది.
అవికూడనూ,
భగవత్
కార్యములయిననూ,
మలినవాసనకు
సంబంధించినవే.
3
▾
Meaning
Keep
ధ్యానజపముల
వలన
ఆత్మ
జ్ఞానము
గలిగి
పవిత్ర
వాసనలు
అలవడును
ఇట్టి
అజ్ఞానప్రభావముతో
కలిగిన
నీచభావములను,
మలిన
వాసనలను
నశింపజేసి
ఆధ్యాత్మిక
సాధనయైన
ధ్యాన,
జపములవల్ల
మనుజుని
హృదయమున
విశాలమైన
ఆత్మజ్ఞానము
కలిగించి,
పవిత్ర
వాసనలను
అలవరచును.
అయితే,
ఈ
మలిన
వాసనలతో
ఎన్నియో
పడరాని
బాధలు,
కష్టములు,
దుఃఖములు
అనుభవించుచుండియూ
మానవుడు
వానిని
దాటుటకు
అట్టి
వాసనలు
నశింపజేయుటకు
ఎందుకు
ప్రయత్నింపడో
అదే
పెద్ద
విచిత్రముగా
నున్నది.
వాసనలవల్ల
తాను
సరియైన
మార్గమందే
ప్రవర్తించుచున్నానని
తలంచును,
ఊహించును.
అందువల్లనే
మలిన
వాసనలు
వీడక
జలగవలె
కరచుకొనియున్నాడు.
సరియైన
ఆధ్యాత్మిక
గ్రంథములైనా
చదివినచో,
వారి
బుఱ్ఱలు
కొంత
శుభ్రమగుననే
నా
తలంపు.
శాస్త్రములసంఖ్య
అపారము.
జీవితము
క్షణభంగురము,
అడ్డులు
చూస్తామా,
అనేకము.
కాబట్టి,
శాస్త్రములందు
సారము
గ్రహించి,
దానిని
జీర్ణము
జేసుకొనిన
మలినవాసనలకు
దూరమగుదురు.
ఊరికే
పనికిరాని
పుస్తకములు
కానీ,
అర్థముకాని
శాస్త్రములుకానీ,
అనుష్టించని
భక్తి
మార్గములు
కానీ
చదివి
ప్రయోజనము
లేదు.
కొంతవరకైనా
సరియైన
మార్గమును
అనుష్ఠించవలెను.
అట్లు
కాక,
ఊరికే
చదువుతూ
కాలమును
గడుపుచూ
పోవుట
అదియునూ,
మలినవాసనే
అని
పిలువబడును.
చూడు
భరద్వాజుడు
వేదములను
మూడు
జన్మాంతరములు
చదివెను.
నాల్గవ
జన్మమునకూడా
తిరిగి
చదువుట
ప్రారంభించెను.
అప్పుడు
ఇంద్రుడు
వారివద్దకు
వచ్చి
భరద్వాజునకు
బ్రహ్మవిద్య
నేర్పి,
కైవల్యముయొక్క
రహస్యములను
ఉపదేశించెను.
అపుడు
భరద్వాజుడు
పుస్తకములు
చదువుట
మానివేసెను.
తీక్ష్ణమైన
ధ్యానము
ప్రారంభించెను.
ఆత్మానుభవమును
స్వయముగా
తానే
అనుభవించెను.
కాన,
ఊరకే,
వాటి
సారములు
గ్రోలక,
చదివినచో
ఫలితము
లేదు.
అట్టి
మలిన
వాసననుకూడా
సాధ్యమైనంతవరకు
మార్చవలెను.
అనేకమైన
విషయములనుగూర్చి
వూరకే
చదువుటకూడా
ఒక
దుర్వాసనే.
4
▾
Meaning
Keep
ఒకానొక
సమయమున
దూర్వాసుడు
శివునివద్దకు
ఒక
బండెడు
మత
గ్రంథములను
వేసుకొని
వచ్చెను.
అప్పుడు
నారదుడు
గాడిదకు
సంబంధించిన
సామెత
చెప్పెను.
అట్లే
అనేకమైన
గ్రంథముల
మోత
మోయుచున్ననూ,
అన్ని
శాస్త్రములు
మోయుచున్ననూ,
చదివియున్ననూ
వాటి
నిజమైన
సారము
వారికి
అనుభవము
లేక
తెలియదు.
ఇదియూ
ఒక
శాస్త్ర
వాసనే.
ఇట్టి
వాక్కు
వినిన
తత్క్షణము
దూర్వాసునకు
జ్ఞానము
కలిగి,
తన
పుస్తకములన్నియూ
సముద్రమున
పారవేసి
గాఢమైన
ధ్యానము
నభ్యసించెను.
చూడు,
ఎట్టివారైననూ
ధ్యానమును
ప్రధానముగా
పెట్టుకొని,
కడకు
సంపూర్ణజ్ఞానముకూడా
ధ్యానమువల్లనే
సాధించుచున్నారు.
5
▾
Meaning
Keep
మానవుడు
మొట్టమొదట
మనస్సు
యొక్క
స్వభావమును
గ్రహింపవలెను
ఆత్మజ్ఞానము
అనేక
శాస్త్రములు
చదువుటవల్లగానీ,
పాండిత్యమువల్లగానీ,
సూక్ష్మబుద్ధివల్లగానీ,
చర్చలవల్లగానీ
తెలిసికొనలేరు.
అట్టివారికి
అది
తెలియదు
కూడా.
చూడు,
ఉద్దాలక
మహర్షియొక్క
కుమారుడు
శ్వేతకేతుడు
గొప్ప
పండితుడు.
కుమారుని
ఒక
దినము
చెంత
చేర్చుకొని
ఇట్లు
ప్రశ్నించెను:
“శ్వేతకేతూ!
ఏ
శాస్త్రమును
తెలుసుకొనుటవల్ల
నీకు
ప్రతి
విషయమును
తెలిసికొన
శక్తి
కలుగునో
అట్టి
శాస్త్రమును
నీవు
తెలిసికొంటివా?”
అప్పుడు
కుమారుడు
అట్టి
శాస్త్రము
నాకు
తెలియదని
బదులు
చెప్పెను.
అప్పుడు
ఉద్దాలకుడు
ఆత్మజ్ఞానముతో
చేరిన
నిరుపమానమైన
బ్రహ్మవిద్య
నేర్పెను.
6
▾
Meaning
Keep
కాన,
మొదట
మానవుడు
తన
మనసుయొక్క
అలవాట్లు,
చర్యలు
తాను
బాగుగా
తెలిసికొనవలెను.
ఆ
ప్రకారం
తెలిసికొనినప్పుడే
తాను
మనసును
స్వాధీనము
చేసికొనగలడు.
అప్పుడు
తన
జ్ఞాపకశక్తిని,
ఇచ్ఛాశక్తిని,
భావనాశక్తినీ
వృద్ధిపరచుకొనుటకు
ప్రయత్నించును.
మనసుకు
చంచలగుణము
స్వభావము.
అది
గాలివలె
నుండును.
ఇందునిమిత్తమై
అర్జునుడు
కృష్ణభగవానునితో
ఈ
ప్రకారము
తెల్పెను.
7
▾
Meaning
Keep
చంచలం
హి
మనః
కృష్ణ
ప్రమాథ
బలవద్దృఢమ్
8
▾
Meaning
Keep
తస్యాహం
నిగ్రహం
మన్యే
వాయోరివ
సుదుష్కరమ్.
9
▾
Meaning
Keep
అనగా,
మనసు
చాలా
చంచలమైనది,
ఓ
కృష్ణా!
అది
వేగము
గలది,
బలవత్తరమైనది,
స్వాధీనపరచుకొనుటకు
ఎంత
కష్టము
కలదో
అంత
కష్టముతో
కూడుకొనినది,
అని
తెలిపెను.
అపుడు
కృష్ణుడు
చెప్పిన
జవాబు:
అర్జునా,
నీవు
చెప్పిన
విషయమందేమియూ
సందేహము
లేదు.
కానీ,
నిరంతర
కృషివల్లా,
వైరాగ్యమువల్లా
దానిని
స్వాధీనము
చేసికొనవచ్చును.
కావున,
మొదట
ధ్యానమభ్యసించుమని
తెలిపెను.
10
▾
Meaning
Keep
వాసనలు,
కోరికలు
నిర్మూలించిన
ఇంద్రియములు
స్వాధీనమగును
మనసును
స్వాధీనము
చేసికొనవలెనన్న,
మొదట
వాసనలు,
కోరికలు
నిర్మూలించిన,
ఇంద్రియములు
స్వాధీనమందుండును.
ఈ
రెండునూ
ముఖ్యమైన
మార్గములు.
కోరికయే
మనస్సును
కలవరపరచును.
ఇంద్రియములవైపు
పరుగిడునపుడు,
కుక్క
యజమాని
వెంట
వెళ్ళునట్లు
మనసు
ఇంద్రియముల
వెంట
వెళ్ళును.
పాపము,
ఈకారణములవల్ల
జీవుడు
మనస్సు
యొక్కయూ,
భ్రమింపజేయు
ఇంద్రియముల
యొక్కయూ
మాయాజాలములో
పడి
తపించుచున్నాడు.
ఈ
బాధలేవియూ
లేక
ఇంద్రియముల
బారినుండి,
కోరికల
భ్రమనుండి
తప్పించుకొని
మనస్సును
స్వాధీనములో
ఉంచుకొనవలెనన్న
ధ్యానమును,
జపమును
ఆచరించు.
అప్పుడే
ఇచ్ఛాశక్తి,
జ్ఞానశక్తి,
భావన
మొదలగు
కృషులయందు
ఉత్తీర్ణుడగుదువు.
అట్లుకాక,
ధ్యానమును
ఆచరించక
మనసును
కట్టవలెనన్న,
సాధ్యము
కాదు.
మిక్కిలి
కోపముగల
ఏనుగును
సన్నని
దారముతో
కట్టివేసిన
ఎంత
ప్రయోజనమో
అంతే
అగును.
అది
సాధ్యము
కాదు.
కావున,
మొదట
కోరికలు
వదలు.
ఇంద్రియములను
స్వాధీనపరచుకొనుటకును,
మనస్సును
ఆత్మయందు
ఇముడ్చుటకునూ
ధ్యానము,
జపము
ప్రధానము.
ధ్యానమున
ఇవి
అన్నియూ
వశమగును.
11
▾
Meaning
Keep
కోరికలు
పూర్తిగా
వదలవలెను.
దీనిని
పూర్తిగా
గమనించవలెను.
కొంతమంది
సాధకులు
కానీ,
విద్యార్థులు
కానీ
కొన్ని
కోరికలు
వారివారితృప్తికొరకు
నిర్వహించుకొందురు.
ధారణాభ్యాసము
చేయు
గృహస్థుడు
కొన్ని
కోరికలు
విడువలేడు.
వాటిని
వారి
రహస్యతృప్తికొరకు
దాచుకొందురు.
కాబట్టి
వారి
శక్తి
కొంత
ఖర్చుపడి
సాధనలో
వృద్ధి
కనపడదు.
అట్టివారు
ఆధ్యాత్మికమను
నిచ్చెనపై
కొన్ని
మెట్లు
ఎక్కియున్ననూ
తిరిగి
క్రింద
పడుదురు.
ఇట్టి
మనశ్చాంచల్యమును
అణచుటకు
కూడా
ధ్యానమెంతయో
తోడు,
అవసరము.
ఒక్క
ఇంద్రియములను
స్వాధీనమందుంచుకొన్న
ప్రయోజనము
లేదు.
అన్ని
ఇంద్రియములను
అన్ని
వైపులనుండి
అరికట్టవలెను;
అది
కూడా
ముఖ్య
విషయము.
ఇది
ప్రథమమున
చాలా
కష్టము;
విసుగుపుట్టును
అయినా
నిరాశ
పొందకూడదు.
పర్యవసానమునకు
ఓపికతో
వేచి
యుండవలెను.
కొంతమంది
సాధనాక్రమమును
తప్పి
వారి
ఇష్టానుసారమాచరింతురు.
దానిమూలమున
వారి
మనోభీష్టములు
నెరవేరకున్న
అభ్యాసములు
మానుచుందురు.
అది
మంచిపద్ధతి
కాదు.
Previous
←
The Destruction of Vāsanās Is the Aim of Dhyāna
Next
Fixing the Mind on One Thing Is the Essence of Dhyāna
→