Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Any Action Offered to God Is Itself an Act of Dharma!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
లౌకిక
సుఖాపేక్షచే
కానీ,
రాగద్వేషోద్రేకముల
ప్రేరణలచే
కానీ,
స్థళాలను
మార్పు
చేసినా
కానీ,
లోన
వెన్నంటి
యుండు
అజ్ఞానము
చేత,
లోకమున
ఎవరును
ఎట్టి
వారును
శాంతిని
పొందలేరు.
దీపము
లేని
ఇంటిలో
ఊరక
వస్తువులను
అటూ
ఇటూ
మార్పుచేయుట
చేత
సర్దినట్లగునా?
తప్పించుకొని
తిరిగినట్లగునా?
దీపము
వెలిగిస్తే
యొక్కడి
వస్తువులు
అక్కడనే
యున్నను,
వాటిని
తప్పించుకొని
సులభముగా
తిరగవచ్చును;
అవసరమైన
మార్పులు
చేసికొనవచ్చును.
ఇంతకూ,
ముందు
దీపము
అవసరము
కదా?
అట్లే
ఈ
అంధకారమైన
ప్రపంచ
గృహములో
సంఘర్షణ
తప్పించుకొని
శాంతంగా,
ధర్మంగా,
సత్యంగా
జీవించడానికి
సాధ్యమా?
కాదు.
మరెట్లన,
జ్ఞాన
దీపారాధనం
ప్రధానమైనది.
నేటి
మానవ
జీవితము
ధర్మసమ్మతమే
కానీ,
దోషమెక్కడున్నదన్న,
మానవులు
చేయదగిన
కర్మ
ఈశ్వరార్పితము
కాకుండుటయందే.
అట్టి
ఈశ్వరార్పితమైన
యేకర్మ
అయినను
ధర్మకర్మయే
యగును.
ఇక్కడ
కొంతమంది
కుశలబుద్ధి
కలవారు
ప్రశ్నించవచ్చును:
ఒకరిని
చంపుచు,
హింసించుచు,
ఈశ్వరార్పితమన్న
అది
ధర్మకర్మ
అగునా?
అని
అనవచ్చును.
ఈశ్వరార్పిత
దృష్టి
ప్రాప్తించవలెనన్న,
మొదలు
శాంతి,
సత్య,
ప్రేమ,
అహింసలు
వాని
యందు
నిండియుండ
వలెను
కదా!
ఇక
ఇట్టి
క్రూర
గుణములకు,
క్రూర
కర్మలకు
చోటెక్కడ?
ఈశ్వరార్పితమనువాడు
పై
నాలుగు
2
▾
Meaning
Keep
మహాభావములను
పొందిన
వాడైయుండవలెను.
లేకున్న,
క్రూరకర్మలు
చేయుచు
ఈశ్వరార్పణమన్న,
అట్టివి
ధర్మకర్మలు
కానేరవు.
ధర్మకర్మలు
అమృత
స్వరూపమైనవి.
వాటికి
మరణమే
లేదు.
అట్టి
కర్మలు
ఆచరించువాడు
కూడను
అమృతస్వరూపుడే.
అట్టి
పవిత్ర
కర్మలాచరించకనే
అమృతపుత్రులైన
మానవులు
అనృతపుత్రులనబడుచున్నారు.
ఇది
ఎంత
విచారకరమైన
విషయము?
అమృతముండియూ,
విషయములు
అను
విషమును
త్రాగటము
విధియనక
ఏమందురు?
నిరంతరము
ఆత్మచింతన
చేసి,
ఆత్మానందముననుభవింపక,
అనిత్య,
అసత్యములైన
లోక
వాసనలకు
లోబడి,
దేహోద్రేకపూరితులై,
ఆత్మధర్మమైన
అమృతత్వమును
దూరము
చేసికొనుట
మానవ
ధర్మమెట్లగును?
గీతయందు
కూడనూ,
14వ
అధ్యాయమున
చెప్పిన
ధర్మమందు,
"నేను
మోక్ష
స్థానమును
(అమృత
స్థానమును),
సనాతనమగు
ధర్మ
స్వరూపమును,
ముఖ్యమైన
నిత్యానందస్వరూపమునగు
బ్రహ్మమున
కాశ్రయభూతుడను..."
అని
తెలిపెను.
ఈ
అర్థమును
ప్రసాదించిన
శ్లోకమే
ఈ
క్రింద
కనబరచినది:
శ్లో
॥
బ్రహ్మణో
హి
ప్రతిష్ఠాఽహమమృతస్యావ్యయస్య
చ,
శాశ్వతస్య
చ
ధర్మస్య
సుఖస్యైకాన్తికస్య
చ
॥
ఈ
అమృతత్వమునే
ఉపనిషత్తులలో
అనేక
స్థళములలో
ప్రతిపాదించడమైనది.
ఉపనిషత్సారమే
గీతయగుటవల్లా,
ఈ
అమృతత్వమును
గీతలోను
పలుసార్లు
నిరూపించడమైనది.
కాన,
'ధర్మకర్మ'
అనునది
సామాన్యము
కాదు.
అది
కేవలము
'ఆత్మసారమే.'
దీనిని
ఆచరించిన
వారి
యెడ
భగవంతునికి
కూడను
అతి
ప్రీతి
గలుగును.
భగవత్
ప్రీతికి
పాత్రులు
కావలెనన్న
సత్య
ధర్మకర్మలనాచరించవలెను.
అందుకనే
గీతయందు
12వ
అధ్యాయమున,
13వ
3
▾
Meaning
Keep
శ్లోకము
మొదలు
20వ
శ్లోకము
వరకునూ,
ఈ
భావమునే
చేర్చి
అర్జునునకు
ఆత్మధర్మము
బోధింపబడినది.
గీతను
త్రాగిన
త్యాగులకు
ఇది
సులభముగ
తెలియును.
అందులో
ముఖ్యమగు
శ్లోకమును
మచ్చునకు,
మీకు
నచ్చుటకై
వ్రాయుచున్నాను:
శ్లో
॥
యే
తు
ధర్మ్యామృతమిదం
యథోక్తం
పర్యుపాసతే
।
శ్రద్దధానా
మత్పరమా
భక్తాస్తేఽతీవ
మే
ప్రియాః
॥
దీనియందు
ఎంత
భావము
చేరినదో!
ధర్మము
నుండి
తొలగనిదియు,
అమృతమైన
అద్వేషము
మొదలుగాగల
ధర్మ
సముదాయమునందు
శ్రద్ధ
గలిగియు,
పరమాత్మయే
పరమగతిగా
తలంచుచు
ఎవరుందురో,
అట్టి
వారే
నాకత్యంత
ప్రీతిగలవారని
పలికెను.
ఇందులో
"ధర్మ్యామృతం"
అని
ప్రయోగించుటలో
ఎంత
అంతరార్థమున్నదో
యోచించిన
మీకే
గోచరము
కాగలదు.
భగవద్ధర్మమును
అనుష్ఠించువాడే
భగవదమృతమును
పానము
చేయుటకు
అర్హుడగును.
సాధారణ
జనులు,
తమకు
భగవంతుని
యందు
భక్తియున్నదని
తలంతురు.
అది
చాలదు;
అంతటితో
తృప్తిపడకూడదు.
భగవంతుడు
తమపై
ప్రీతిగలిగియున్నాడా?
అని
యోచించవలెను,
తలంచవలెను.
ఇట్లు
తలంచువారు
చాలా
అరుదు.
అదే
దీనిలో
గల
కీలకము.
మానవునకు
అనేక
ధర్మములు
శరీరసంబంధ
నిమిత్తమై
కలిగియున్నవి.
ఒక
వ్యక్తి,
ప్రజలకు
రాజుగాను,
తండ్రికి
పుత్రుడుగాను,
శత్రువుకు
శత్రువుగాను,
సతికి
పతిగాను,
కుమారునకు
తండ్రిగాను,
ఇట్లే
అనేక
రీతుల
ఉన్నాడు.
అయిననూ,
నీవెవ్వడవని
అడిగిన,
ఇందులో
నేను
రాజుననియో,
తండ్రిననియో,
కొడుకుననియో
వచింపగలడా?
అవి
శరీరబంధ
నిమిత్తములు
కాన
వచింపలేడు.
అవి
కర్మలచేత
కలిగిన
నామరూపములు
కదా?
4
▾
Meaning
Keep
అట్లే,
నేను
శిరస్సును,
నేను
పాదమును,
నేను
హస్తమును,
ఉదరమును
అని
సమాధానము
చెప్పలేరు.
అవి
వాని
అవయవములు
కాన,
అవియే
నేనని
చెప్పలేదు;
అది
సాధ్యము
కాదు.
కాన
సమస్తావయవములకంటెను
వేరైనదిగను,
నామరూపములు
లేనిదిగను
ఉండి,
"అహమ"ని
వ్యవహరింపబడుచున్న
"నేను"
ఎవ్వడనో,
ఎట్లున్నానో
అని
విచారించి
చూడుము.
పై
విధముగా
నీ
స్వరూపము
నీకే
దుర్బోధమై
యుండగా,
ఇతర
స్వరూపములను
గూర్చి
ఇదమిత్థమని
తెలుపగోరుట
ఎట్లు
పొసగును?
నీవనియు,
నేననియు,
వ్యవహరింపబడుట
మన
శరీరములకు
సంబంధించుచున్నది.
కాన,
ఇవియన్నియూ
సత్తులు
కావు;
ఆత్మ
ఒకటే,
దాని
ధర్మమే
నిజధర్మము.
ఆత్మ,
ఆత్మ
అన్న
'ఆత్మకేరూపము?'
అని
కొందరు
అర్థము
కాని
ప్రశ్నలు
ప్రశ్నింతురు.
ఆత్మకు
రూపమెక్కడిది?
అది
అమృత
స్వరూపము.
దానిది
ధర్మ
స్వభావము,
నిశ్చల
నిర్మల
గుణము.
దానికి
రూపనామములు
అంటగట్టరాదు.
ఆత్మ
స్వభావమును,
ఆత్మ
ధర్మమును,
అనుష్ఠానమునందు
కర్మదేహమున
ఆచరించవలెను.
దేహమునకే
రూపనామములు.
కనుక,
దేహమాచరించు
ప్రతి
కర్మయందును
పై
ఆత్మ
ధర్మమును
నిరూపింపవలెను.
అందుకనే
ఈ
రీతిగా
పల్కినది.
శ్లో
॥
పుమాం
స్త్రీ
గౌరజోవాజీ
కుంజరో
విహగస్తరుః
।
దేహేషు
లోకసంజ్ఞేయం
విజ్ఞేయా
కర్మహేతుషు
॥
పుమాన్న
దేవో
న
నరో
న
పశుర్నచ
పాదపః
।
శరీరాకృతి
భేదాస్తు
భూపై
తే
కర్మయోనయః
॥
ఇందులో
చూడు!
ఆత్మ
పురుషుడుగాను,
స్త్రీగాను,
పశువుగాను,
మేకగాను,
గుఱ్ఱముగాను,
పక్షిగాను,
వృక్షముగాను
ఉండుటలేదు.
ఈ
నామరూపముల
భేదములు
దానికి
లేవు.
ఇవి
అంతయు
కర్మకృతములు.
దేహములకే
వర్తించును.
ఆత్మస్వరూపము
సదా
వికార
రహితము,
ఏకరూపము.
కాన
5
▾
Meaning
Keep
దానిని
'సత్'
అని
వ్యవహరింతురు.
అనగా
'పరమార్థ'మనే
భావము.
అది
తప్ప
యితరములగునవన్నియు
అసత్యములు,
మిథ్యాభూతములు.
ఇవి
మాత్రము
నిర్దేశార్థములై
యుండును.
నీవు
ఒక
కుర్చీయందున్నావనుకో;
నిన్ను
పలువురు
సేవించుచున్నారు.
అవి
యన్నియూ
మిథ్యాభూతములు.
ఉదాహరణమునకు
ఒక
పల్లకీ
తీసికొందము.
దీనికి
ముందు
అది
ఒక
వృక్షమైయుండెను;
అనంతరము
కట్టెగా
మారెను;
పిదప
పల్లకిగా
మారెను.
ఇట్లే
రూపము
మారుచూ
పేర్లు
కూడా
మారినవి.
పల్లకియందున్న
నిన్నెవరయిననూ,
వృక్షమునందున్నావనియో,
లేక
కఱ్ఱయందున్నావనియో
చెప్పగలరా?
చెప్పలేరు.
ఇట్లు
ఈ
పదార్థములు
మారుచుండును;
వీటికి
స్థిరత
లేదు.
కాన,
యివి
'సత్'
కానేరవుగదా?
నామరూపములతో
వీటిని
వ్యవచ్చేదింప
వచ్చును.
'ఇది
యిట్టిది'
అని
లక్షణము
కూడా
చెప్పవచ్చును.
మరియునివి
నశ్వరములు,
కల్పితములగుటయే
దీనికి
కారణము.
పరిశీలించి
చూతము.
కుర్చీ
అనిననేమి?
కట్టెల
రచనావిశేషము
కదా?
ఈ
కట్టెలను
వేరుపరచి
గమనించుము.
కుర్చీని
నీ
వెట్లు
చూడగలవు?
కట్టెలే
కదా
నీకు
గోచరమగును?
ముందున్న
కుర్చీ
ఏమాయెను?
నశించిపోయెను.
ఇట్లే
ధర్మమునకు
కూడనూ
యిదే
న్యాయము.
ఆ
ధర్మమనియు,
ఈ
ధర్మమనియు,
వర్ణ
ధర్మమనియు,
గృహస్థ
ధర్మమనియు,
వానప్రస్థ
ధర్మమనియు,
సన్యాస
ధర్మమనియు,
బ్రహ్మచర్య
ధర్మమనియు
అనేక
ధర్మ
రూపములు
కట్టెలతో
చేసిన
కుర్చీ,
బెంచీ,
పల్లకీలవంటివి.
అవి
లోతునకు
విచారించి
పరికించిన
విడిపోవునట్టి
దేహధర్మములే.
కడకు
మిగులునది
ఆత్మధర్మమే.
కుర్చీలు
మరుగై,
కఱ్ఱలు
కనుపించినట్లు,
ప్రకృతి
ధర్మములు
మరుగై
ఆత్మధర్మము
సాక్షాత్కరించును.
6
▾
Meaning
Keep
అయితే,
లోకానుభవమునకు
దేహధర్మములు
కూడను
అత్యవసరము.
వాటిని
కాదనను.
కట్టెలను
ఏ
రీతిగా,
మన
లోకానుభవ
నిమిత్తమై
కొన్ని
పనిముట్లుగా
చేసికొనుచున్నామో,
అట్లనే
ఆత్మధర్మమును,
సత్యధర్మమును,
సనాతన
ధర్మమును,
లోకానుభవ
నిమిత్తమై
ఆచరించు
గృహస్థధర్మము,
వానప్రస్థ
ధర్మము,
సన్యాసధర్మము,
వర్ణధర్మము,
స్త్రీధర్మము,
పురుషధర్మము
అను
పనిముట్లుగా
తయారుచేసికొన్న,
ధర్మమెందుకు
మారును,
నశించును?
అయితే,
చెట్టును
కొన్ని
రీతులుగా
చక్కపఱచి,
ముక్కలు
చేసి,
వస్తురూపమునకు
తగినట్లుగా
మార్చవచ్చును
కదా?
అట్లే,
ఆత్మధర్మమను
వృక్షమును
ముక్కలు
చేసి
వినియోగార్థమునకు
తగినట్లుగా
మార్చవచ్చును
కదా?
అని
కొందరు
శంకించవచ్చును.
నిజమే.
యే
రూపయిన
నీవు
తీర్చిదిద్దిననూ,
ఆత్మధర్మమను
వృక్షము
నుండియే
ఆ
సారమును
తీసికొన్న,
ధర్మము
నశింప
వీలుండదు
కదా?
నీ
లోకధర్మకర్మలను
స్వరూపములు
ఆత్మధర్మమను
వృక్షము
నుండి
యే
రీతిగా
తీసికొన్నను,
తీర్చిదిద్దిననూ
దోషములేదు.
ఆత్మధర్మములను
లోకధర్మముల
రూపములకు
లోబరచకుండిన
చాలును.
అనగా,
చెట్టును
ఎన్ని
రకములైన
సామానులుగానైనా
చేయవచ్చును.
కానీ
సామానులను
చెట్టుగా
చేయుట
అసాధ్యం.
అట్లే
ఆత్మధర్మమును
లోకధర్మములందు
ఇమిడ్చి
ఆచరించవచ్చును
కానీ,
లోకధర్మములను
ఆత్మధర్మమందు
నిరూపించిన,
అది
అధర్మమగును.
సత్యధర్మమును
మరుగుపరచుట
అగును.
అంతియేకాక,
ధర్మ
ద్రోహమునకు
కూడా
పాల్పడిన
వారగుదురు.
ధర్మమే
నైతికవర్తనము,
నైతికవర్తనమే
జ్యోతి,
జ్యోతియే
ఆనందస్వరూపము.
పవిత్రత,
శాంతి,
సత్యము,
క్షమ,
అన్నియూ
ధర్మము
యొక్క
స్వరూపములు.
ధర్మమే
యోగము,
ధర్మమే
సత్యము.
ప్రతిదీ
ధర్మముపై
ఆధారపడియున్నది.
న్యాయము,
ఇంద్రియ
నిగ్రహము,
మర్యాద,
సహనము,
మంచితనము,
ధ్యానము,
గాంభీర్యము,
7
▾
Meaning
Keep
అనురాగము,
అహింస,
అన్ని
గుణములూ
ధర్మము
యొక్క
స్వభావములైనవి.
ధర్మం
శాశ్వతమైనది.
ధర్మమునే
ఆరాధించిన,
విశ్వప్రేమను
పొందవచ్చును.
ధర్మమునకు
మించిన
సాధన
లేదు.
ధర్మమే
సృష్టికి
కారణం.
సత్యధర్మం
మీదనే
జగత్తు
నిలువగలిగినది.
సత్యమనునది
ధర్మములో
లీనమైయున్నదే.
సూర్యచంద్రాదులు
సహితము
ధర్మమును
తప్పక
తిరుగుచున్నారు.
దానధర్మములు,
వేదములు,
మంత్రములు,
జ్ఞానము,
అంతయూ
సత్యధర్మమే.
ధర్మమే
శాసనము.
ఎక్కడైతే
నైతిక
ప్రవర్తనమున్నదో,
అక్కడల్లా
సత్యధర్మమున్నది.
అందుకనే
భాగవతమందు
కూడను
"ధర్మమెక్కడో
అక్కడ
కృష్ణుడుందును;
ధర్మమూ,
కృష్ణుడూ
ఎక్కడ
ఏకస్వరూపులగుదురో
అక్కడ
జయముందును"
అని
చెప్పబడెను.
కాన,
ధర్మము
భగవంతుని
దేహము.
లోకమే
భగవంతుని
దేహమైన,
యిక
లోకము
ధర్మస్వరూపమే
కదా?
కాదని
ఎవరు
చెప్పగలరు?
చెప్పలేరు,
చెప్పరాదు.
Previous
←
Ātma-Dharma Is the Basis of All Dharmas
Next
The Excellence of the Dharmas of Women
→