Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · The Excellence of the Dharmas of Women
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
4
స్త్రీ
ధర్మముల
ప్రాశస్త్యము
లోకమున
మానవులు
ఆచార
ధర్మములను
అనేకముగా
పేర్కొందురు.
కానీ,
అవన్నియూ
జీవిత
నిమిత్తమై
ఈ
ప్రపంచమున
ఉపయోగించు
సూత్రములే
కానీ
సత్యధర్మములు
కావు;
ముఖ్య
ధర్మములు
కావు.
ఇన్ని
ధర్మకర్మలకూ
కారణ
భూతములైన
జన్మలు
రెండు.
అవే
స్త్రీ,
పురుషుడు.
ఇవే
ప్రకృతి,
పరమాత్ముడు;
ఇవే
జడము,
చైతన్యము.
ఇంత
సృష్టి
దేని
ఆధారమున
ఏర్పడినదన్న,
జడచైతన్యముల
సంబంధము
వల్లనే
కదా?
అట్లే
ఇన్ని
ధర్మములూ
దేని
నిమిత్తమై
యేర్పడినవి?
ఇన్ని
ధర్మములకూ
కారణమేది?
అని
లోతుగా
విచారించిన,
స్త్రీ
పురుషులను
ఈ
రెండు
జన్మలే.
కాన,
వీరి
ధర్మములు,
వీరి
ఆచారములే
లోకమునకు
ప్రధాన
ధర్మములు.
ఏ
మహానీయులు
ఏ
రీతిగా
చెప్పిననూ,
ఎన్నిగా
నిరూపించిననూ,
ఈ
రెండు
తెగలకు
తప్ప
మరే
ఆధారమూ
లేదు
కదా?
కాన,
స్త్రీ
ధర్మము,
పురుష
ధర్మము
ప్రధాన
ధర్మములు.
మిగిలిన
ధర్మములు
వీటి
అంగములు.
ఒక
గోదావరి
నదికి
అనేక
పాయలు
చేరినట్లు,
వారివారి
ధర్మమునకు
అనేక
అవసర
ధర్మములు,
ఆధార
ధర్మములు
అందులో
లీనమగును.
ఆధార
నదిని
ప్రధానముగా
తీసుకొందుమే
కానీ,
అందులో
లీనమైన
చీలిక
నదులను
మనము
తలంచము.
అట్లే,
ప్రధానమైన
ప్రకృతి
ధర్మములు
మనము
ఆధారముగా
తీసుకొనవలెను
కానీ,
అందులో
మిళితమైన
2
▾
Meaning
Keep
అంగ
ధర్మములను
ఆధారముగా
తీసుకోనకూడదు.
దీనిని
పట్టి
చూడ,
లోక
ధర్మములు
రెండే.
ఒకటి
స్త్రీ
ధర్మము,
రెండవది
పురుష
ధర్మము.
స్త్రీ
ధర్మము:
దీనినే
'భగవానుని
భ్రాంతి,'
అనగా
'శక్తి'
అందురు.
అదే
'మాయ';
దాని
స్వరూపమే
స్త్రీ.
అందుకనే
స్త్రీ
'పరాశక్తి
స్వరూపము'
అని
కూడనూ
కొందరు
తెలుపుదురు.
ఆమే
మానవుని
విశ్వాసపాత్రమగు
సహచరి,
జీవిత
భాగధేయ.
స్త్రీ,
భగవానుని
ఘనమగు
చేత,
ప్రకృతి
యొక్క
విచిత్రము,
అద్భుతములో
అద్భుతము,
పిండాండము,
గృహమునకు
రాణి,
వాస్తవిక
పరిపాలనా
మాయ
యొక్క
ప్రతినిధి,
గృహాలంకారమగు
లక్ష్మి,
మానవుని
మధుర
మిత్రము.
అట్టి
శక్తిస్వరూపులైన
స్త్రీలు
మానవునికే
విధమునను,
ఏ
విషయములోను
అల్పులు
కారు.
వారు
తమ
వాస్తవిక
స్వభావరీత్యా
యెంతటి
ఓరిమి,
యెంతటి
క్షమ,
భక్తి,
ప్రేమ
యుతులు!
వారి
యందు
అనేక
సుగుణములున్నవి.
వారి
ఆత్మనిగ్రహము
పురుషనకుండదు.
వారు
ఆధ్యాత్మిక
పంథమును
త్రొక్కుటకు
మార్గదర్శకులు.
స్వార్థరహితమైన
పరిశుద్ధ
ప్రేమ
స్త్రీలకు
లోపుట్టిన
గుణముగనున్నది.
తెలివిగల,
నాగరికత,
అనురాగబద్ధ,
ధార్మికచింతనగల
స్త్రీలు
గృహమునకు
లక్ష్మి
వంటి
వారు.
ఎచ్చట
సతిపతులు
పవిత్ర
ప్రేమయనెడి
త్రాటితో
లంకింపబడుదురో,
యెచ్చట
సతిపతులు
ప్రతిదినము
ఆధ్యాత్మిక
గ్రంథముల
పారాయణమొనర్చుచూ,
హరినామమును
సంకీర్తించుచుందురో
ఆ
గృహమే
వైకుంఠము.
తన
భర్త
యెడ
అనురాగబద్ధయగు
స్త్రీ
పృథివిపై
నొక
అరుదగు
సువాసన
పుష్పము.
కుటుంబమునకు
ఒక
విరాజమానమగు
మణివంటిది.
సుగుణవంతురాలగు
సతి,
పతికొక
చూడామణి.
స్త్రీలకు
పతివ్రత
ధర్మము
ప్రధాన
లక్ష్యము.
ఆ
సచ్చీల
శక్తిచే
వారు
దేనినైనను
చేయగలరు.
అట్టి
మహాశక్తి
చేతనే
సావిత్రి
తన
గతించిన
భర్తయగు
సత్యవంతునకు
తిరిగి
ప్రాణము
రప్పించెను.
ఆమె
వాస్తవికముగ
3
▾
Meaning
Keep
మృత్యుదేవునితో
పోరాడెను.
అత్రి
ఋషి
భార్యయు,
దత్తాత్రేయుని
తల్లియునగు
అనసూయ
పాతివ్రత్యము
అందరికీ
తెలిసిన
విషయమే.
ఆమె
తన
పాతివ్రత్యశక్తిచే
త్రిమూర్తులను
గూడను
పసిబిడ్డలుగ
మార్చగలిగెను.
నలయని
తన
కుష్ఠ
భర్త
ప్రాణమును
కాపాడుటకు
సూర్యుని
సంచారమునే
ఆపివేసెను.
పాతివ్రత్యమే
స్త్రీలకొక
శిరోమణి.
లోకముచే
ఎక్కువ
కొనియాడబడునది
స్త్రీ
యొక్క
ఈ
లక్షణమే.
ఈ
శక్తిని
వర్ణింప
నెట్టివారికిని
సాధ్యము
కాదు;
కానేరదు.
గొప్ప
విపత్తులలో
పడిపోయినప్పటికినీ
స్త్రీ
తన
పాతివ్రత్య
శక్తిచే
సులభముగా
రక్షింపబడును.
స్త్రీకి
పాతివ్రత్యమే
జీవితము.
స్త్రీ
తన
స్వకీయ
యత్నముల
ద్వారా
తన్ను
తాను
కాపాడుకొని
నిస్సంశయముగ
స్వర్గమును
పొందును.
దమయంతి
కేవలమొక
మాటచే
ఒక
బోయవానిని,
తన్ను
బాధింప
యత్నించినపుడు
బూడిదెగ
దగ్ధపరచెను.
రాజగు
నలుడు
తన
సర్వస్వమును
కోల్పోయి,
తన
శరీరమున
ఒంటిబట్టతో
అరణ్యమున
ప్రవేశించినపుడు,
ఆమె
సంతోషముతో
పతి
యిక్కట్టులు
పంచుకొనెను.
స్త్రీకి
లజ్జ
అతిముఖ్యము.
అది
స్త్రీకి
ఒక
ఆభరణము.
లజ్జ
యొక్క
సరిహద్దు
దాటి
చనుట
స్త్రీకి
ధర్మవిరుద్ధము.
అంతియేగాక
దీని
వలన
అనేక
అపాయములకు
గురియగును.
స్త్రీ
శోభనే
విధ్వంసమొనర్చును.
లజ్జ
లేకున్న,
సౌందర్యమూ,
నాజూకూ
విహీనమైన
స్త్రీగా
కనిపించును.
అణకువ,
వినయ
విధేయత,
కోమలత్వము,
సాధుత్వము,
మధురత్వము
—
వీటి
విచిత్ర
మిశ్రమమే
లజ్జ.
లజ్జ
అనునది
స్త్రీకి
అతి
మిక్కిలి
అమూల్యమైన
ఆభరణము.
లజ్జగల
స్త్రీ
యౌచిత్యభావనచే
హద్దులో
నుందును.
స్త్రీ
అట్టి
ఉత్తమ
ప్రవర్తనలు
కలిగియుండవలెను.
లజ్జ
నిజమైన
ఘనతకు
ఒక
గుర్తు.
లజ్జనే
లేకున్న
స్త్రీజాతికి
అపకారము
చేసినవారే
కాక
తమ
ధర్మమును
నిర్మూలము
చేసినవారగుదురు.
అట్టి
వారిది
వాసనలేని
పుష్పమువలె
లోక
రాణింపులేని
జీవితమగును.
ఇతరమైన
సుగుణములు
ఎన్ని
పొందియున్నప్పటికిన్నీ
లజ్జలేకున్న,
కేవలము
4
▾
Meaning
Keep
తన
జీవితము
శూన్యము.
లజ్జ
అనునది
స్త్రీని
దివ్య,
పవిత్ర
హోదాలకు
లేవనెత్తును.
లజ్జగల
స్త్రీ
యింటా,
బయటా,
జగత్తునందే
గౌరవముల
నధికారముగ
గొనును.
"నేటి
కాలమున
లజ్జను
బజ్జీలుగా
చేసి
మ్రింగుచున్నారే;
వారికి
మాత్రము
గౌరవమునకేమితక్కువ;
వారే
నేటి
సమాజములో
తలలెత్తి
తిరుగుచున్నారే;
వారికి
లేని
గౌరవమే
లేదు"
అని
కొందరనవచ్చును.
నేటి
ప్రవర్తనలకూ
నాకూ
పరిచయమక్కరలేదు.
అందులో
నేను
ప్రవేశింపను.
అవి
కేవలము
గౌరవమర్యాదలు
కావచ్చును.
కానీ
అధికార
గౌరవములు
కావు.
అనగా
గౌరవమునకు
అర్హులుగాని
వారికిచ్చు
మర్యాదలు
అమర్యాదలనే
భావించవలెనేకానీ,
అట్టివి
మర్యాదలని
భావించుట
కూడా
ఒక
ద్రోహమే.
అవి
ముఖస్తుతి
గౌరవములు.
అవి
ఉమ్మివేసిన
మలినము
వంటివి.
లజ్జగల
స్త్రీ
యిట్టి
గౌరవమర్యాదలు
కానీ,
పేరు
ప్రతిష్ఠలు
కానీ
ఆశించదు.
కేవలము
తన
హద్దులను
మాత్రము
దృష్టి
యందుంచుకొని
ప్రవర్తించుచుండును.
తనకు
తెలియకనే
గౌరవమర్యాదలు
పొందుచుండును.
పుష్పములందూ,
కమలములందూ
ఉన్న
మాధుర్యము
తుమ్మెదలను
కోరుచున్నదా?
తేనెటీగలను
పిలుచుచున్నదా?
ఆ
మాధుర్యమును
చవిచూచినవగుటచే
అవియే
వెదుకుచూ
వచ్చును.
మాధుర్యమునకు
తుమ్మెదలకూ
ఉన్న
సంబంధమే
దానికి
కారణము.
అట్టిదే
హద్దులను
గుర్తెరిగిన
స్త్రీకి,
అధికారగౌరవములకు
గల
సంబంధము.
అట్టి
పవిత్ర
స్త్రీ
గౌరవమర్యాదలను
ఆశించదు.
అదే
ఆత్మధర్మము.
కమలముపై
కప్ప
కూర్చొని
నేను
కమలముపై
నున్నాననని
గర్వించును
కానీ,
కమలమందలి
మకరందమును
తాను
త్రాగినదా?
చవిచూచినదా?
అసలు
ఉన్న
సంగతైనను
తెలియునా?
తెలియదు.
అట్లే
నేటి
మర్యాదలు
కూడను.
పేరు
ప్రతిష్ఠలను
కుప్పలపై
కప్పలవలె
కూర్చొని,
అందులోని
అంతరార్థము,
అందులోని
నిజధర్మము,
దాని
యందలి
విశ్వాసము,
గౌరవము,
వాని
విలువ
5
▾
Meaning
Keep
తెలియనివారైయుండిన,
అది
గౌరవమా?
అదొక
మర్యాదనా?
కాదు,
కాదు.
దానిని
'మర్యాదగాని
వ్యాధి'
అని
అనవచ్చును.
నిజముగా
లజ్జలేని
స్త్రీ,
స్త్రీ
అని
చెప్పుటకు
కూడనూ
ఆత్మధర్మము
అంగీకరించదు.
ఆత్మధర్మ
సంబంధము
లేని
గౌరవమర్యాదలు,
శవముయొక్క
అలంకారములగును.
శవమునకెన్ని
అలంకారములు
చేసినప్పటికినీ
అందుండి
వెలువడిన
జీవి
ఆనందించునా?
అట్లే
యథార్థమును
గుర్తెరుగని
వారికీ,
ఆత్మార్థమును
అనుభవించని
వారికీ
కీర్తిగౌరవములను
కిరీటములు
పెట్టిన
ఆనందించువారెవ్వరు?
ఇట్టి
అర్థములేని
మర్యాదలకు
లొంగక
ఆత్మగౌరవమునకు
ఆహుతి
కావటమే
లజ్జగల
స్త్రీ
యొక్క
లక్షణము.
ఇట్టి
లక్షణమే
గృహమునకొక
లక్ష్మి.
అందువల్లనే
ఇల్లాలును
'గృహలక్ష్మి'
అని
కూడా
అనుచుందురు.
పై
లక్షణమే
లేకున్న,
గృహమే
అవలక్షణ
మనబడును.
మతము,
గృహము
నిలువవలెనన్న
స్త్రీనే
కారణము.
మతము
నిలుచుటకు
గానీ,
నాశనమగుటకు
కానీ
స్త్రీనే
కారణము.
వారిలో
విచిత్రమైన
మతవిషయకాంతర్య
సహజ
ప్రేరణ
కలదు.
భక్తి,
విశ్వాస,
వినయములు
గల
స్త్రీలు,
పురుషుల
జీవితములలో
దైవిక
వర్తన,
అనుష్ఠానములను
ప్రవేశపరతురు.
వారు
పెందలకడనే
లేతురు.
గృహములను
శుభ్రపరతురు.
స్నానాది
కృత్యములు
తీర్చుకొని
జపధ్యానముల
నొనర్తురు.
తమతమ
యింటియందు
నిత్యపూజకై
ఒక
చిన్నగదిని
దేవళముగా
నియమింతురు.
అందులో
భగవానుని
పటములను,
విగ్రహములను,
పరమభక్తులు,
మహనీయులు,
జ్ఞానులు,
మార్గదర్శకుల
చిత్రములను
అలంకరింతురు.
వారాస్థళమును
పవిత్రముగానుంచి
ఉదయము,
సాయంత్రము,
విశేష
దినములందు
మరీ
యెక్కువగా
ప్రార్థనలు,
పూజలు,
భజనలు,
హారతి
జరుపుకొందురు.
అంతియేకాక
అట్టి
స్త్రీ
తన
ఒత్తిడిచేత,
యింటియందలి
నాస్తిక
పురుషుని
కూడనూ,
ఏదియో
ప్రార్థననో,
లేక
సత్కార్యమునో,
లేక
మరే
యితర
భగవత్సంబంధమైన
పరోపకార
చింతననో
6
▾
Meaning
Keep
ఒనర్ప
బలవంతము
చేయుచుండును.
నిజముగా
గృహమును
పాలించువారే
స్త్రీలు.
అదియే
వారి
ధర్మము.
వారు
నిజముగా
శక్తి
యొక్క
వ్యక్త
స్వరూపిణులు.
అట్లుకాక,
భర్త
ఆధ్యాత్మికత్వములో
నెగువకు
ప్రయత్నించుచుండగా,
భార్య
అట్టి
మార్గమును
సమ్మతించక
ఇంద్రియ
విషయక
మార్గమున
లాగుచూ,
లేక
భార్య
ఆధ్యాత్మికత్వములో
ఉత్తమ
స్థానమునకు
జనుచుండ,
భర్త
ఇంద్రియ
విషయక
మార్గములో
ఆమెను
దిగువకు
లాగుచుండిన,
ఇట్టి
గృహము
గృహము
కాదు.
గ్రహములు
అనగా
పిశాచులు
తిరుగాడు
పాడుస్థళమనవచ్చును.
అట్టిదీ
పృధ్విపై
ప్రత్యక్ష
నరకమే!
అట్లుగాక,
నిజముగా
స్త్రీ
తన
ధర్మమునకు
తాను
బలికావలెనన్న
ఆత్మజ్ఞానమనెడి
సూత్రముతో
మేళవింపుగా
కలుపబడి,
భగవచ్చైతన్యమొందుటకు
ఆతురతగా
కాంక్షించవలెను.
ఏ
గృహమున
భార్యాభర్తలు
ఆదర్శజీవితము
గడుపుదురో,
భగవన్నామమును
సంకీర్తింతురో,
సత్కార్యముల
ఆచరింతురో,
సత్య,
ప్రేమ,
శాంతులతో
ధార్మిక
గ్రంథముల
పారాయణ
మొనర్తురో,
ఇంద్రియముల
వశపరచుకొని
సర్వజీవులయందును
సమాన
దృష్టితో
సాధింతురో,
ప్రేమను
వెలిబుచ్చుదురో,
అట్టి
స్త్రీ
నివసించు
గృహము
నిజముగా
స్వర్గమే
అగును.
అట్టి
ఉత్తమ
గృహిణియే
నిజమగు
భార్య.
ఏ
స్త్రీ
తన
భర్తపట్ల
హృదయమున
అనురాగబద్ధమై
యుండునో
ఆమెయే
నిజమగు
గృహలక్ష్మి.
ఏ
స్త్రీ
తన
భర్తపట్ల
విశ్వసనీయమై
యుండునో
ఆమెయే
నిజమగు
ఇల్లాలు.
ఆమెయే
ధర్మపత్ని.
భార్య
ధర్మార్థ
కామములకు
మూలము.
భర్త
మనస్సెరిగి
మధురముగా
సంభాషించు
స్త్రీ,
భర్తకు
భార్య
మాత్రమే
కాదు,
ఒక్కొక్క
సమయమున
ధార్మిక
కృత్యావసరముల
తండ్రివంటిది;
వ్యాధి
బాధల
సమయములందు
ఆమె
తల్లి
వంటిది.
మొదలు
తన
పతి
సేవ,
పతి
అభీష్టము,
అతని
ఆజ్ఞ
తన
నిత్య
ఆరాధనగా
తలంచి
తదుపరి
పరమాత్మ
ఆరాధన,
ప్రార్థన
చూచుకొనవలెను.
పతిని
తృప్తి
7
▾
Meaning
Keep
పరుపక
ఆరాధనయందు
ఆత్మానందమును
అనుభవించలేరు.
పతియందే
పరమాత్మను
నిరూపించుకొని,
పరమాత్మ
సేవగా
చేయు
సతి
నిజధర్మమును
గుర్తెరిగినదై
యుండును.
ఆత్మార్థమును
ఆచారములుగా
కల్పించుకొని
కర్మలాచరించిన
సర్వమును
పరమాత్మ
సేవగానే
ఫలించును,
తరించును.
పతి
యెట్టి
వాడైనప్పటికినీ,
సతి
అతనిని
ఆనందింపజేసి,
అతనిని
సన్మార్గవర్తనునిగా
తీర్చవలెను.
భగవంతుని
అనుగ్రహమునకు
పాత్రుడగునట్లు
ప్రయత్నించవలెను.
తానెట్లు
పోయిననేమి,
నేను
మాత్రము
అనుగ్రహమునకు
అర్హురాలైన
సరి,
అను
ధర్మవిరుద్ధ
భావములు
స్త్రీలకు
అవలక్షణములు.
పతి
క్షేమము,
పతి
ఆనందము,
పతి
అభీష్టము,
పతి
సద్గతే
తనకు
సర్వ
రక్షగా
భావించవలెను.
అట్టి
స్త్రీకి
పరమాత్మ
అనుగ్రహము
అప్రయత్నముగా
లభించును,
వర్షించును.
అట్టి
స్త్రీకి
పరమాత్ముడు
సర్వవిధములా
అండయై,
నిండు
దయను
జూపును.
అట్టి
స్త్రీ
సద్గుణముల
చేత
పతికూడను
సద్గతి
పొందును.
Previous
←
Any Action Offered to God Is Itself an Act of Dharma!
Next
Women of Culture Are Goddesses of Dharma
→