Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Women of Culture Are Goddesses of Dharma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
5
సంస్కృతిగల
స్త్రీలు
ధర్మదేవతలు
స్త్రీలకుకానీ
పురుషులకుకానీ
విద్య
అవసరము.
ఐతే,
స్త్రీలకు
సరియగు
మార్గముల
విద్య
గరుపవలెను.
సంస్కృతిగల
స్త్రీలు
సమాజమునకు,
లోకమునకు
ధర్మదేవతలు.
ఆ
రీతిగా
సద్విద్యాసంపన్నురాలుగా
చేయుటకు
తల్లిదండ్రులు
కూడా
తోడ్పడవలెను.
స్త్రీలకు
కొన్నింటియందు
స్వేచ్ఛ
నివ్వరాదు.
అట్టి
వినాశమొనర్చు
విద్యలందు
స్త్రీలకు
స్వేచ్ఛ
పట్ల
నేననుకూలుడను
కాను;
వాటిని
నేనంగీకరింపను.
వారిని
ఆదర్శ
స్త్రీలుగా
తయారు
చేయు
విద్యా
సంస్కృతులను
చేకూర్పవలెను.
పరిపూర్ణ
స్వేచ్ఛ
ధర్మనాశకమగును.
అట్టి
దాని
వలన
తమ్ము
తాము
పాడుచేసుకొందురు.
విచక్షణాహీనమైన
కలసిమెలగుట
విధ్వంసకారక
ఫలితమునకు
గొంపోవును.
అట్టి
విద్యావంతులగు
స్త్రీలు
ఆనాడు
కూడను
అనేకులుండియూ
వారి
ధర్మమును
వీడక,
ఆత్మానందమును
లక్ష్యమందుంచుకొని
తిరిగిరి
కదా!
విద్య,
వివేక
ఆధారమున
పెరగవలెను.
సులభ,
సావిత్రి,
అనసూయ,
గార్గి,
నలయని
వంటి
పతివ్రతలు,
మీరావంటి
భక్తులు,
చూడాల
వంటి
యోగినులు
మన
భారతదేశమందే
జనించి,
ధర్మమును
ధర్మవిద్యను
నిలిపిరి
కదా!
ఒకానొక
సమయమున
సులభ
తన
విద్యాశక్తిచే
ఆత్మ
విచారమును
గూర్చి
ప్రసంగించగా
జనకుడు
సహితము
స్తంభించిపోయెను.
అట్టి
మహా
ఘనాత్మలు,
వారి
పవిత్రతలు,
వారల
భక్తిజ్ఞానములతో
కూడిన
నడవడికల
మూలముననే
నేటికిని
మన
భారతదేశ
స్త్రీల
హృదయములలో
ఇంత
మాత్రమైనను
సరళత,
2
▾
Meaning
Keep
దైవికత్వము,
వినమ్రత
గలదు;
కలవారు
కూడా
కలరు.
అధునాతన
కాలపు
స్త్రీలు
వారి
నుండి
యావేశము
కొనవలెను;
అట్టి
స్త్రీ
రత్నములు
గడిపిన
జీవితములను
ఇప్పటి
వారు
గడుపవలెను.
హిందూ
స్త్రీ
యొక్క
స్వేచ్ఛాధర్మమెప్పుడును
ధార్మిక,
ఆధ్యాత్మిక
ప్రాముఖ్యత
కలిగియుండవలెను.
ఎంతటి
నవీన
విద్యలయందుత్తీర్ణులై
యుండినను,
ఆత్మార్థమును
మరువక
అంతర్దృష్టిని
బలపరచు
వేదాంత
తత్త్వము
యొక్క
జైత్రవిద్య
నవలంబింపవలెను.
అట్టి
విద్యలేని
స్త్రీ
అందలేని
బండవంటిది.
చూడు!
అట్టి
విద్య
నవలంబించిన
సులభ
వంటి
బ్రహ్మవాదినులను
భారతదేశము
ఉత్పత్తిచేసెను.
చదివిన
పండితులు,
విద్వాంసులు
సహితము
వారి
వద్దకు
ఉత్తేజమునకై
వచ్చెడివారు.
దేనిపై
సమస్తము
ఆధారపడునో
అట్టి
ప్రధాన
అంశమేమనగా
-
దేశము
యొక్క
పురోభివృద్ధి
గానీ,
సమాజము
యొక్క
పురోభివృద్ధిగానీ,
జాతి
యొక్క
పురోభివృద్ధి
గానీ,
గృహము
యొక్క
పురోభివృద్ధి
గానీ
స్త్రీల
యొక్క
సద్విద్యపై
సంపూర్ణముగా
ఆధారపడినది.
స్త్రీల
ఆత్మతత్త్వ
విద్యనే
దేశమును
తన
స్వాభావిక
స్థితికి
లేవనెత్తగలదు.
స్త్రీలకు
సత్శీలపోషణ,
సద్గుణపోషణ
గల
విద్యలు
గరిపిన,
యావత్తు
దేశమునకు
క్షేమమును,
శాంతిని
గలిగించిన
వారగుదురు.
ఆనాటి
భారతదేశము
యొక్క
పవిత్రతకు,
నేటి
అపవిత్రతకు,
ఆనాటి
శాంతి
సుఖములకు,
నేటి
అశాంతి
అక్రమములకూ
స్త్రీల
ధర్మమే
కారణము.
ఆనాటి
ధర్మవిద్య,
ఈనాటి
అధర్మవిద్య
-
ఈ
రెండింటి
వలన
కలిగినవే
యుగ
మార్పులు.
కానీ,
యుగ
మార్పులన్న
భూమి,
ఆకాశములు
మారవు,
మారలేదు,
మారబోవు.
నేటి
విద్యలు
పేరుకు
విద్యలే
కానీ,
ప్రవర్తనలకు,
ప్రతిష్ఠలకు
అవిద్యలు.
ఇవి
ధర్మవిద్యలు
కావు.
ఆత్మానందమును
అనుభవించి,
ఆత్మార్థమును
గ్రహించి,
ఆచరించి
అనుగ్రహమును
పొందిన,
అదియే
ఆనాటి
విద్యకు
తగిన
పట్టము.
నైతిక
కృషి,
ఆత్మజ్ఞానము,
అధోస్వభావపు
పునరుద్ధరణ,
ఉత్తమ
నడవడి,
పరిశుభ్ర
రీతులు,
ఇంద్రియ
శిక్షణ,
మనసు
ఇంద్రియ
వశీకరణ,
3
▾
Meaning
Keep
ఘనమగు
దివ్య
సుగుణముల
పెంపొందించుటలో
ప్రాధాన్యత
సాధించినవారు
అనుగ్రహమను
పట్టమును
అలంకరించుచుండిరి;
నేడట్లుకాక,
కొన్ని
పుస్తకముల
కంఠస్థమొనరించిన
పట్టమును
(డిగ్రీని)
పొందవచ్చును!
నేటి
కాలపు
విద్యలలో
పైచెప్పిన
ఘనమగు
విద్యాశిక్షణ
నొందజాలరు.
స్త్రీకి
సక్రమమార్గమున
విద్య
గరుపవలెను.
దేశీయ
సమస్యలనవగాహనము
చేసికొనగలిగి
యుండవలెను.
అట్టి
స్త్రీ
దేశమునకు
గానీ,
గృహమునకు
గానీ,
సమాజమునకు
గానీ
తన
సహాయమును,
సేవను,
తన
జీవితమునకామోదిత
నియమములకు
అనుగుణమగు
విధమున
నొసగవలెను.
ఏ
దేశమైనను
నిర్మింపబడవలెనన్న
స్త్రీలు
ఉచితమగు
తగు
సంస్కృతి
గలిగియుండవలెను.
భావి
వంశము
నేటి
మాతపై
ఆధారపడియుండును.
నేటి
వంశము
పురాతన
మాతపై
ఆధారపడి
ఉండకుండుటే
నేటి
అధర్మ
అక్రమములకు
కారణము.
గడచినది
గడచిపోయినది.
వచ్చుదానినయిననూ
వర్ధిల్లజేయుటకు
వనితలు
పురాతన
మాతల
ప్రవర్తనలను
పాటించవలెను.
ఏ
కాలమునకైననూ
మాతలు
దేశములకు
వెన్నెముక
వంటివారు,
హృదయము
వంటివారు,
శ్వాసము
వంటివారు.
ఈ
ప్రపంచ
నాటకమునకు
మాతలే
ప్రధాన
పవిత్రపాత్ర
వహించవలెను.
ఆమెనే
జాతినీ,
నీతినీ
నిర్మించుటకు
దృఢపడవలెను.
స్త్రీనే
ప్రపంచపు
భావిపౌరులగు
బిడ్డలను
తర్పీదొనర్పవలెను.
బిడ్డలకు
నైతిక,
ధార్మిక
శిక్షణలు
నొసంగవలెను.
తల్లి
ధార్మిక
అగుట
వలన
బిడ్డలు
ధార్మికులగుదురు.
తల్లి
నైతిక
విద్యను
పొందియుండుట
వలన,
బిడ్డలు
నైతిక
స్వభావులు
కాగలరు.
కాన
దేశ
నాశనమునకు,
దేశ
పోషణకు
స్త్రీల
యొక్క
విద్యనే
కారణము;
ప్రవర్తనే
పాశము.
దీనికి
పెద్దలైన
తల్లిదండ్రులు
కూడనూ
మూలమని
చెప్పవచ్చును.
నేటి
విద్యార్థులను
చూతమా,
సంస్కార
గంధమే
వారి
యందు
కనుపించదు.
ఆత్మార్థమే
వారికి
హాస్యముగా
కనుపించును.
భాషలు
నేర్చుట,
4
▾
Meaning
Keep
వేషములు
మార్చుట
నేటి
భారత
సాంప్రదాయమైనది.
ఇది
వాస్తవిక
సంస్కృతి
కాదు.
నేటి
విద్యావంతులు
ఇంటియందలి
గృహకృత్యములు
చేయజాలనివారై
యున్నారు.
గృహమనగా
ఒక
హోటలువలె
భావించుచున్నారు.
సదా
వంటవారిపై,
దాసీలపై
ఆధారపడియున్నారు.
నేటి
విద్యావంతురాలగు
స్త్రీ
కేవలము
గృహపు
చిత్రపు
బొమ్మయైనది.
అట్టి
స్త్రీలు
భర్తకు
బరువైన
గుండువంటివారే.
అంతేకాక
వారు
అమిత
జబ్బులకు
గురియగుచున్నారు.
ఇంటియందలి
కఠిన
కార్యములలో
భాగము
వహించకుండినందున,
తినటము
నిద్రించుట
వలన
సోమరితనము
బలిసి,
జీర్ణశక్తి
చచ్చి,
కడకు
శరీరమును
జీర్ణము
చేయుటకు,
చంపుటకు
సిద్ధమగుచున్నారు.
నేటి
స్త్రీలు
స్వేచ్ఛను
అవిరళముగా
వినియోగించుకొనుటచే
ధర్మగ్లాని
ఆవరించినది.
చదివిన
విద్యను
వివేకముతో
సద్గుణ
ప్రవర్తనలకు
సత్శీల
అభివృద్ధికి
వినియోగించక,
కేవలము
లోక
భోగానందములే
ప్రధానములని
తలంచి,
కపట
స్వేచ్ఛ
ననువుగొనుట
చేత
తమను
తాము
హింసించుకొనుచున్నారు.
ఉద్యోగములు
చేయుట,
డిగ్రీలు
పొందుట,
వివేక
విచక్షణ
లేక
సర్వులతో
సంచరించుట,
పెద్దలన్న
వినయము,
పాపమన్నను,
చెడు
కార్యమన్నను
భయము
లేకుండుట,
మంచి,
దైవము
అన్న
విశ్వాసము
లేకుండుట,
పతిని
కీలుబొమ్మవలె
చేతియందుంచుకొని
ఆడించటము,
తన
యిచ్ఛారతులను
అనుభవించడము,
గడిచిన
తప్పునకు
పశ్చాత్తాపము
పడకుండటము,
ఇది
విద్యల
యొక్క
స్వరూపములా?
కాదు
కాదు,
ఏనాటికినీ
కాదు!
అవిద్య
యొక్క
విపరీత
స్వరూపములు,
ఆకారమును
నిర్మూలమొనర్చు
అహంకారములు.
ఇవి
విద్యలకే
చెడ్డపేరు
సంపాదించును.
ఇక
స్త్రీ
ధర్మమునకు
హాని
చేయవా?
పతి
గృహమును,
సతి
పవిత్రమైన
మందిరముగా
తలంచిన,
సర్వవిద్యలు
ఆ
భవనమందే
సంప్రాప్తమగును.
దానికి
మించిన
ప్రదేశము
ఏ
దేశమందునూ
లేదు.
అందుకనే
ఒక
మహా
భక్తుడు
ఈ
క్రింది
విధమున
తెలిపెను:
5
▾
Meaning
Keep
"తల్లికైవడి
అన్ని
తప్పుల
సైచి
పుణ్య
మొసగు
సతుల
దేవాలయంబు
వలదన్న
సద్గ్రంథపఠన
కష్టము
లేక
పలుశాస్త్రములు
నేర్పు
పాఠశాల
శ్రమలేక
తమయంత
సర్వంబు
సమకూర్చు
ఆనంద
మొసగు
విహారభూమి
అజహారాదులనైన
ఆడింపగల
భవ్య
మహిమ
చేకూర్చు
సన్మంత్రశాల
సతుల
యనురాగ
సర్వార్థ
సాధనంబు
కాంత
సౌభాగ్య
కళ్యాణ
కల్పకంబు
ప్రణయ
త్యాగోపదేశ
వైరాగ్యశాల
పతిగృహంబె
సతులకు
పాఠశాల!"
విద్యావంతులగు
స్త్రీలు
మానవ
సంఘమునకు
తమ
సామర్థ్యము,
అభిరుచి,
మానసిక
తత్త్వము,
అభిలాష,
స్వభావము,
విద్య
యొక్క
అంతస్థులను
బట్టి,
వారి
జీవిత
విధాన
ధర్మము,
లేదా
సుప్రతిష్ఠిత
నియమముల
కనుగుణమగు
లేదా
సంపూర్తి
పొందిక
యగురీతిగ
ఎట్టి
ప్రయోజనకారక
సేవనైననూ
చేయనగును.
అట్టి
వారు
తమపైననూ,
తమ
కుటుంబముపైననూ,
తల్లిదండ్రులపైననూ,
అమర్యాదను
లేదా
అపకీర్తిని,
తమ
శీలమునకు
మచ్చనుగాని
తెచ్చుదాని
నేదైనను
వారొనర్పరాదు.
శీలము
లేనిదే
స్త్రీలు
బ్రతికి
యుండియు
చచ్చినవారుగ
పరిగణింపబడుదురు.
వారు
లోకమున
సంచరించునపుడు
చాలా
జాగ్రత్తగా,
మెలకువగా
నుండవలెను.
పురుషులతో
అధికప్రసంగము,
అధికముగ
కలసి
మెలగుట
త్యజించవలెను.
భర్త
యొక్క
కీర్తిమర్యాదలకు,
భర్త
యొక్క
ఉత్తమ
గౌరవములకు
కళంకమురాని
ప్రవర్తనలో
మెలగుటే
విద్యయొక్క
వివేకసారము.
6
▾
Meaning
Keep
అందుకనే,
"చదువుకొన్నందుకు
సార్థకమేమన
సద్గుణ
నడకలే
సారము",
అని
మహనీయులు
అనుచుందురు.
నేటి
విద్యలు
నేర్వకూడదనియు,
నేటి
సమాజములలో
తిరుగాడకూడదనియు
నే
శాసించుటలేదు.
ఏ
చదువు
చదివినను,
ఏ
సమాజములలో
తిరిగినను,
సద్గుణములతో
పాటు
సత్ప్రవర్తన,
సత్ప్రవర్తనతో
పాటు
సమాజములు,
సమాజములతో
పాటు
సచ్చీలము,
సచ్చీలముతో
పాటు
సనాతన
ధర్మ
విచారణలు
ఉండిన
చదువేమి
చేయును,
సమాజమేమి
చేయును?
చదువులు,
సమాజములు
చెడుపు
కాదు.
అవి
చెడుపుటకు
రాలేదు.
వాటిని
పొందువారి
గుణతత్వములను
బట్టి
అవి
వారికి
తోడ్పడునే
కానీ,
స్వయముగా
వాటికి
చెడుపు
స్వభావములు
లేవు.
పిల్లి
తన
పిల్లలనూ,
ఎలుకలనూ
రెండింటినీ
ఒకే
నోటితోనే
పట్టుకొనును.
కాని,
ఎలుకలను
చంపివేయును,
తన
పిల్లలను
రక్షించును.
ఇది
నోటి
యొక్క
స్వభావమా?
కాదు.
తన
గుణము
స్వభావముచే
నోటితో
ఆ
కార్యము
చేసినది.
అట్లే
విద్య,
వివేక
మార్గమున
అభివృద్ధిపరచిన,
పరోపకారమూ
చేయును,
పరమార్థమునూ
విచారించును,
పరతత్వమునూ
వెతకించును,
పరమహంసలనూ
చూపించును.
అట్లుకాక
విద్యను
అవివేక
మార్గమున
అజ్ఞానదృష్టితో
చూచిన
అనాచార,
అక్రమ,
అన్యాయ,
అసత్యములను
బలపరచి
అనేక
చెడు
మార్గముల
నడిపించి
మానవ
జీవితమునే
మసిచేయును.
ప్రేమనే
విషముగా
చేయును.
కాన,
స్త్రీలు
ఏ
విద్యలయందు
ఉత్తీర్ణులయిననూ,
ఏ
డిగ్రీలు
తీసికొన్ననూ,
ఎంతటి
హోదాలలోనున్న
పతి
తనకు
ప్రాప్తించిననూ,
లేక
తానే
పెద్ద
హోదాలలో
నున్ననూ,
సుగుణమే
తన
సౌందర్యమువలె,
శీలమే
తన
శ్వాసవలె,
లజ్జనే
తన
ప్రాణమువలె,
తన
సత్యప్రవర్తనే
నిత్య
కర్తవ్య
కృత్యమువలె
తలంచి,
పాపభీతిని,
దైవభీతిని
తన
హృదయమున
మొలకలుగా
నాటుకొని
పెంచి,
స్త్రీ
నిజాయితిని
నిలబెట్టి,
స్త్రీ
ధర్మమును
ధార్మిక,
నైతిక,
భౌతిక
మార్గములందు
కూడనూ,
7
▾
Meaning
Keep
మానసిక,
శారీరక,
వాక్కులందు
సహితము
తన
సత్యధర్మమును
నడిపించి,
సర్వవిద్యలలోని
సారము
అదియేనని
గ్రహించి,
మానమర్యాదలలో
ప్రాణము
నొడ్డి,
పతివ్రత
ధర్మమును
పాటించుటే
స్త్రీల
యొక్క
అతి
ముఖ్య
ధర్మము.
వారి
జన్మమునకు
కారణమే
ఈ
ధర్మము.
Previous
←
The Excellence of the Dharmas of Women
Next
Dharma Knows No Change
→