Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Dharma Knows No Change
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
6
ధర్మమునకు
చలనము
లేదు
మానవుని
అనుకూలములను
బట్టి
ధర్మములు
మారవు.
ధర్మమునకు
చలనము
లేదు.
ఆనాడు,
నేడూ,
ఏనాడూ,
ధర్మము
ధర్మముగానే
యుండును.
సామాన్య
ధర్మములకు,
ధర్మవిధులకూ
కారణములు,
మార్పులు
ఉంటే
ఉండవచ్చును
కానీ,
ఆ
విధులను
శాస్త్రీయ
దృష్టితోనే
చూడవలెను.
అందులోని
లాభనష్టములను
ఎన్నడూ
చూడకూడదు;
యోచించకూడదు.
దృగ్గోచర
లాభసాధ్యమైన
ధర్మమును
వేదశాస్త్రములుపదేశించెనేని
ఆ
ధర్మాచరణకు
శాస్త్రము
ప్రమాణము
కాజాలదు.
ధర్మము
ప్రత్యక్షానుమానాది
ప్రమాణముల
చేత
గ్రహింప
వీలులేదు.
వేదమాత్రము
చేతనే
తెలిసికొనదగినదనియు,
ప్రత్యక్షాది
ప్రమాణముల
చేత
తెలిసికొన
అశక్యమైన
విషయమును
బోధించుటకు
మాత్రమే
వేదము
ప్రవర్తించుచున్నదనియు
మీమాంసికుల
సిద్ధాంతము.
హేతువుల
నాశ్రయించి
ధర్మములు
చేస్తూ
వుంటే,
అప్పుడే
ధర్మమును
విడువడం
కూడా
తటస్థించుతూ
వుంటుంది.
అందరికీ
ఒక
హేతువే
తోచదు.
స్నాన,
సంధ్య,
జప,
ధ్యానాదుల
వలన
లాభం
అందరికీ
తలో
విధంగాను
కనుపించుచుందును.
కొందరు
సంధ్యా
సమయములో
సంధ్యా
గాయత్రీ
జపము
మానేసి,
ఏ
విష్ణు
సహస్రనామ
పారాయణమో,
ఏ
శివ
సహస్రనామ
పారాయణమో
చేస్తూ
వుంటారు.
కాలే
సంధ్యా
సమాచరేత్:
అనగా
సకాలమునకు
సంధ్యావందనం
చేయవలెను.
ఈ
మొదలైనవి
ఎన్నో...
2
▾
Meaning
Keep
చెప్పబడియుంటే,
కొంతమంది
సకాలానికి
సంధ్య
మానడము
అధర్మమే
కదా?
ఇదే
రీతిగనే
ఆయా
వర్ణముల
వారికి
వారి
వారి
ఆచార
ధర్మములు
సృష్టించబడేయున్నవి;
అనుభవములో
కనుపించుచున్నవి.
"చాతుర్వర్ణ్యం
మయా
సృష్టం
గుణ
కర్మ
విభాగశః"
(దీని
అర్థం
సుబోధకం)
అని
గీతాచార్యుని
బోధ
కదా?
లేనిపోని
హేతువాదములను
ఆశ్రయించి,
శుష్కతర్కములను
ఊహిస్తూ
తమకు
తోచిన
యుక్తులతో
అధర్మమును
ఆచరించుచూ,
దైవ
భయము,
పాప
భయము
లేకుండా,
యేమియూ
తెలియని
అమాయకులను
కూడా
తప్పు
మార్గముల
త్రొక్కించువారు
కూడా
అనేకులు
కలరు.
అందుకనే
పతితులను
పునీతులు
చేయడానికి,
ధర్మస్థాపన
చేయడానికి
భగవంతుడు
అప్పుడప్పుడు
అవతరించుచుందును.
అసలు
భగవంతుడు
లోకమున
అవతరించుటకు
కూడనూ
ధర్మమే
కారణమని
గీతయందు
ఘంటాపథముగా
మ్రోయించినాడు
కదా?
"ధర్మ
సంస్థాపనార్థాయ
సంభవామి
యుగే
యుగే".
ఇక్కడ
ఒక్కటి
చక్కగ
గమనించవలెను.
ధర్మము
నశించిపోయి,
అధర్మబలమెక్కువైనప్పుడు
పరమాత్మ
అవతరించుననని
సాధారణముగా
గీతాపారాయణము
చేయువారు
అనేకమంది
తలంతురు.
అందులో
ధర్మము
నశించినట్లు
తలంచుటకు
ఆధారము
లేదు.
భగవంతుడు
కూడనూ
అట్లు
తెలుపలేదు.
అందుకనే
'గ్లాని'
అని
యుపయోగించినాడు.
అనగా
ధర్మమునకు
హాని
వచ్చే
సూచనలు
కనుపించినపుడు
నేను
ధర్మరక్షణకు
వత్తుననని
పలికెను
కానీ,
ధర్మము
నశించిన
తరువాత
రక్షణకు
వత్తుననని
తాను
తెలుపలేదు.
రోగి
ప్రాణమును
వదలిన
తరువాత
డాక్టర్
వచ్చిన
ప్రయోజనమేమి?
అట్లే,
మానవుని
ప్రాణసమానమైన
ధర్మము
చచ్చిన
తరువాత
భవరోగ
వైద్యుడైన
భగవానుడు
దేని
రక్షణకని
వస్తాడు?
అందుకనే
'నశించినదని'
తెలుపక,
'హాని
సంభవించినపుడు,'
అను
అర్థమును
చూపుచూ
'గ్లాని'
అను
పదమును
3
▾
Meaning
Keep
వినియోగించెను.
కాన,
ధర్మ
రక్షణమే
దైవము
యొక్క
కర్తవ్యము.
ఆ
ధర్మమను
ప్రాణమే
జీవుల
ఆధారముగా
భావించవలెను.
ధర్మమన్న
సామాన్యము
కాదు.
ధర్మాచరణ
లేని
పురుషుడు
శవ
స్వరూపుడే,
లేక
శిలా
స్వరూపుడే.
ఇప్పుడు
అధర్మ
మార్గతత్పరులను
ఎందరినో
సామ,
దాన,
భేద,
దండోపాయముల
చేత
ధర్మాచరణ
తత్పరులుగా
చేయవలెను.
ప్రాచీన
కాలమున
సనాతన
ధర్మ
నిర్మూలనకు
కంకణము
కట్టుకొన్న
వారి
చేతుల్లో
వున్న
కత్తులు
కంఠములపైకి
వచ్చి,
తమ
ప్రాణము
పోయే
పరిస్థితులు
వచ్చిననూ,
ధర్మాచరణులు
వారి
ధర్మమును
తప్పుకొనేవారు
కారు.
ఇప్పుడా?
ఇతరుల
నిర్బంధము
లేకనే,
తమంతట
తామే
ధర్మాచరణ
నుంచి
దిగజారుతున్నారు.
అంతియే
కాక,
ధర్మమునకు
పలు
అర్థములు
సృష్టించి,
ధర్మ
మార్గమున
నడచు
వారలకు
కూడా
అనేక
విధముల
ఆటంకములు
కలిగించుచూ,
వారిని
ఎందు
గడ్డికంటే
హీనముగా
చూచుచున్నారు.
ధర్మాచరణ
తత్పరులను
వంచకులనీ,
వారివి
కపటాచారములనీ
తలచుచున్నారు.
అట్టి
మూర్ఖులకు
ధర్మమంటే
ఏమిటో,
ధర్మతత్త్వమంటే
ఏమిటో
తెలియదు.
అసలు
యధార్థమైన
విషయమును
తెలిసికొన
శక్తిలేకున్న,
కేవలము
పదార్థమైనా
తెలియని
పామరులు,
పాపము.
పదానికి
అర్థము
తెలియనివారు,
యధార్థమైన
ధర్మార్థమును
ఏమని
తలంతురో
యెవరికి
వారే
యోచించవచ్చును.
పుట్టు
అంధునికి
సూర్యుడంటే
యేమి
తెలుసు,
సూర్యరశ్మి
అంటే
యేమి
తెలుసు?
దేహముపై
పడినపుడు
వేడి
మాత్రమే
తెలుసును
కానీ,
దాని
స్వరూపమెట్లు
అర్థమగును?
అట్లే
ధర్మాచరణ
లేనివానికి,
ధర్మతత్త్వముపై
విశ్వాసము
లేనివానికి,
వాటి
ఫలానందము
ఏరీతిగా
అర్థము
చేసికొనగలడు?
అట్టి
వాని
ముందు
ధర్మతత్త్వమును
విశదపరచుట,
చెవిటి
వాని
ముందు
శంఖమూదినట్లుందును.
నోటిలోని
శంఖము
కనుపించును
కానీ,
దానిలోని
నాదము
వినిపించునా?
కాన,
ఒకరికి
బోధించుటలో
వినువారి
శ్రద్ధను
4
▾
Meaning
Keep
గమనించి,
ధర్మమును
ఆచరించుటకు
అనుగుణంగానున్నవారిని
తగిన
రీతుల
తీర్చి
దిద్దుటకు
ప్రయత్నించిన,
అట్టి
వారి
ఆచరణానుభవముల
చేత
క్రమక్రమేణా
మూర్ఖులు
కూడా
అభిమాన
మొలకలు
నాటుటకు
ప్రయత్నింతురు.
నేడు,
అనేకమంది
గొప్ప
విద్యావంతులు,
శాస్త్రవాసన,
వేదవాసన,
పాండిత్యములు
కలవారును,
వాటి
యందలి
విశ్వాసములను
కోల్పోయి,
ధర్మములను
ఆచరించక,
విశ్వాసహీనులై,
అధర్మమునూ
ఆచరించక,
లోకభీతి
చేతను,
నవీన
విద్యల
సాంప్రదాయము
చేతను,
మధ్యమధ్య
తమకు
తోచిన
కుయుక్తుల
చేతను,
సనాతన
ధర్మ
సాంప్రదాయమైన
ఏకాదశీ
వ్రతమును
కూడనూ
(అనగా
ఉపవాసమును
కూడనూ)
స్నాన,
సంధ్య,
ఉపవాసములు
ఆరోగ్యము
కోసమేనని,
కర్పూర
హారతులు,
వాటి
జ్వాల,
ధూమము
ఊపిరితిత్తులకు
జబ్బు
అనియు,
ప్రాణాయామములు
జీర్ణరోగహారములనియు,
తీర్థయాత్రలూ,
పుణ్యనదీ
స్నానములూ
ఇత్యాది
వన్నియూ
లోకానుభవం
కలుగడం
కోసమనియూ,
దానధర్మములు
పేరు
ప్రతిష్ఠలకనియు,
ఇంకను
అనేకమంది
అనేక
విధముల
ఇత్యాది
పవిత్ర
కార్యములను
అపవిత్ర
భావముల
లోనికి
దింపుచున్నారు.
ఇట్టివారు
లోక
వంచకులు.
ధర్మతత్త్వము
తెలియని
దానవులు.
ఇట్టివారు
మనుధర్మమును
విచారించిన
కొంత
బోధపడగలదు.
ఆర్షం
ధర్మోపదేశం
చ
వేదశాస్త్రావిరోధినా
యస్తర్కేణానుసంధత్తే
స
ధర్మం
వేద
నేతరః
అన్నాడు
మనువు.
అనగా
"వేదమూ,
ధర్మశాస్త్రమూ
ఈ
రెండింటినీ
వేదశాస్త్రములకు
విరోధముకాని
తర్కములతో
ఎవడు
విమర్శిస్తున్నాడో
వాడే
ధర్మమెరుగగలదు
కానీ,
యితరులెరుగ
జాలరు."
దీని
అంతరార్థ
మేమన
ఏ
యూహ
వేదశాస్త్రములకు
విరోధముగా
నుండదో,
ఆ
దానినే
మనువు
గ్రహించినాడు
కానీ,
వేదశాస్త్రములు
తర్క
మూలమని
తెలుపలేదు.
లేనిపోని
శుష్కతర్కముల
వలన
ప్రయోజనమేమియూ
లేదు,
రాదు.
చాలా
మంది
5
▾
Meaning
Keep
ఇప్పటి
కాలమున
హేతువాదములు
ఆశ్రయించి,
తాము
అధర్మాచరణ
గావిస్తూ,
ధర్మాచరణతత్పరులను
కూడా
హేతువాదములు
చేసి
ధర్మదూరులను
గావించుచున్నారు.
అందుకనే
వేదవ్యాసుడు
నేటి
కాలపు
మార్పును
గూర్చి
మునుపే
తెలిపినాడు.
అట్టివారికి
ఆరాధనా,
దైవచింతనలు
విరోధములుగా
నుండును.
న
యక్ష్యంతి,
న
హోష్యంతి,
హేతువాద
విమోహితాః
నిమ్నేష్వీహాం
కరిష్యంతి,
హేతువాద
విమోహితాః
అనగా
'హేతువాదము
లాశ్రయించిన
వారు
దేవతా
రూపములను
పూజించరు,
అగ్నులందు
హోమము
చేయరు,
నీచ
కార్యాచరణలందు
ప్రవేశింతురు,'
అని
మహాభారతమున
అరణ్యపర్వమునందు,
కలి
వర్ణనలో
చెప్పబడెను
కదా?
వేయేటికి;
ధర్మాచరము
వల్లనే
సూర్యచంద్రాదులు
తమ
గతులు
తప్పకుండా
సంచరించుచున్నవి,
సమస్త
దేవతలు
తమ
విధులు
నిర్వహించుచున్నారు.
పంచభూతములు
ధర్మాధారంగానే
వెలయుచున్నవి.
ధర్మము
నుండి
తాను
ప్రమాదమును
పొందక,
ఇతరులను
ప్రమాదములకు
గురిచేయక
ఉండవలెను.
ధర్మధ్వజకాంతులు
యావత్
ప్రపంచమంత
కళలు
చిమ్మవలెను.
తర్కములకు
చోటివ్వక,
బుఱ్ఱలను
పాడుచేసుకొనక,
యథార్థ
ఆత్మతత్త్వమును
విశ్వసించి,
దాని
మూలమున,
ఆధారమున,
ఆచార
ధర్మములను
అనుష్ఠానమునందు
నిత్యకృత్యములతో
లీనమొనర్చి,
ఆనందమును
అనుభవించుట
అత్యవసరము.
లోకానుభవములో
'ఉద్యోగం
పురుషలక్షణం'
అని
గానీ,
'కర్మ
పురుష
లక్షణం'
అని
గానీ
అందురు.
అది
యే
మాత్రము
సమ్మతించవలసినది
కాదు.
ఎందుకన,
ఈ
కాలమున
అందరికీ
ఉద్యోగములు
ప్రాప్తించునా?
లేదు.
అట్లు
ఉద్యోగము
చేయని
వారు
పురుష
లక్షణము
లేనివారగుదురన్నమాట!
ఇవి
6
▾
Meaning
Keep
కేవలము
వారి
వారి
అనుకూలములను
పట్టి
తలంతురే
కానీ,
సర్వులకూ
సమానమైనది
'ధర్మం
పురుషలక్షణం'.
ప్రతి
పురుషుడు
కూడా
ధర్మార్థ
కామమోక్షములందు
ధర్మకర్మల
ననుసరించవలెను.
అవే
పురుషార్థ
ధర్మములు.
స్త్రీలకు
పతివ్రత
ధర్మమెట్లో,
పురుషులకు
బ్రహ్మచర్యమట్లు.
స్త్రీకి
ఏకపతి
యెట్లో,
పురుషునకు
యేకసతి
అట్లు.
స్త్రీ
పతిని
ఏరీతిగా
దైవముగా
తలంచి
అతని
మనసుననుసరించి
ప్రవర్తించుట
ఎట్లు
పతివ్రతధర్మమో,
పతి
కూడనూ
తన
సతిని
గృహలక్ష్మిగా
భావించి,
ఆమె
మనసు
ననుసరించి
ప్రవర్తించవలెను.
అప్పుడే
పురుషలక్షణములకు
తగినవాడగును.
మాన
మర్యాదలుకానీ,
పేరు
ప్రతిష్ఠలుకానీ,
అగౌరవ
అపకీర్తులుకానీ,
దుశ్శీల
దుర్గుణములు
కానీ,
స్త్రీలకూ
పురుషులకూ
సమానములే.
స్త్రీలు
మాత్రమే
పై
నిబంధనకు
బద్ధులనియు,
పురుషులు
స్వతంత్రులనియు
లేదు.
స్త్రీలైనను,
పురుషులైనను
పై
ధర్మములు
పాటించవలెను.
స్త్రీలు
పురుషులచేతి
కీలుబొమ్మలు
కాదు.
ధర్మకర్మల
యందు
ఇద్దరూ
సమాన
హక్కు
కలవారే.
ధర్మాచరణల
యందు,
ఇద్దరూ
శాంతి,
సత్య,
ప్రేమ
అహింసలను
పాటించవలెను.
ఈ
నాలుగు
పవిత్ర
పద
భావములను
పాటించక
ప్రవర్తించిన,
ధర్మరహితులగుదురు.
ఇట్టి
వారు
మానవత్వమునకే
అపకీర్తి
తెచ్చినవారగుదురు.
స్త్రీలెట్లు
కొన్నిటియందు
అస్వతంత్రులో,
పురుషులు
కూడనూ
కొన్నింటియందు
అస్వతంత్రులు.
స్త్రీలకెట్లు
కొన్ని
ప్రవర్తనలయందు
అధికారముండదో
పురుషులకు
కూడనూ
అట్లే
కొన్నింటియందు
అధికారము
లేదు.
ఇవి,
సతి
పతుల
ప్రమాణ
నిబంధనలలో
కొన్ని.
Previous
←
Women of Culture Are Goddesses of Dharma
Next
The Power of Gāyatrī-Mantra Japa
→