Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · The Power of Gāyatrī-Mantra Japa
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7
గాయత్రీ
మంత్ర
జప
ప్రభావం
మనకు
కాన్పించెడి
సకల
భూతములును
గాయత్రియై
ప్రకాశించుచున్నవి.
వాక్కు
గాయత్రి
కనుక,
సకల
భూతజాతము
వాక్కుగానున్నది.
వాక్కే
దీనినంతయు
చెప్పుచున్నది,
శబ్దించుచున్నది,
రక్షించుచున్నది.
అట్టి
సుప్రసిద్ధమగు
గాయత్రి
ఈ
పృథివియైయున్నది.
సకల
భూతములు
ఈ
పృథివియందేయున్నవి.
ఒక్కడునూ
పృథివి
నతిక్రమించి
ఆవలకు
పోజాలడు.
పృథివియే
పురుషుని
శరీరము.
ఎట్లన,
ఈ
శరీరమునందు
ప్రాణములున్నవి.
శరీరమును
దాటి
ఇవి
ఆవల
పోవుట
లేదు.
అట్లుండెడి
పురుషునకు
లోపలనుండునది
హృదయము;
ప్రాణములుండునది
హృదయమునందే.
ఇవి
హృదయమును
అతిక్రమించి
చనుట
లేదు.
గాయత్రికి
నాలుగు
పాదములు,
ఆరు
విధములును
కలవు.
ఆ
విధములెవ్వి
అన,
వాక్కు,
భూతము,
పృథివి,
శరీరము,
హృదయము,
ప్రాణము.
ఇట్టి
పవిత్ర
గాయత్రిచే
చెప్పబడిన
పురుషుడు
మిక్కిలి
శ్రేష్ఠుడు;
మిగుల
పవిత్రత
గలవాడు;
మిగుల
మహిమ
గలవాడు.
సకల
భూతములు
ఆయన
శరీరమున
అల్పభాగముగా
పరిగణింపబడుచున్నవి.
భూత
సంఖ్యా,
పరిమాణ,
స్వరూప,
స్వభావాదులు
తెలియుటకే
సాధ్యము
గాదు.
ఇవి
అన్నియు
అతని
ఒక
పాదము
మాత్రమే.
తక్కిన
మూడు
పాదములును
అతని
జ్యోతిర్మయమైన
అమృతస్వరూపము.
దీని
యథార్థము
తెలియుటకు
అసలే
సాధ్యము
కాదు.
2
▾
Meaning
Keep
గాయత్రిచే
పేర్కొనబడిన
పురుషుడే
"బ్రహ్మము"ని
చెప్పబడువాడు.
అతడే
పురుషుని
కవతలనుండు
ఆకాశమైయుండును.
అపుడు
"బహిర్ధా
పురుషాకాశః"
అని
చెప్పబడుచున్నది.
ఇదియే
జాగ్రదవస్థ.
అతడు
పురుషుని
లోపలనుండు
ఆకాశమైయున్నాడు.
అపుడు
"అన్తః
పురుషాకాశః"
అని
చెప్పబడును.
దీనిని
స్వప్నావస్థ
అందురు.
అతడు
హృదయము
లోపలనుండు
ఆకాశమైయున్నాడు.
అది
పూర్ణము,
సర్వత్ర
నిండియున్నది.
అదియే
సుషుప్తి
అనబడును.
ఇట్టి
యథార్థమును
ఎవడు
తెలిసికొనునో
వాడు
పూర్ణమును,
బ్రహ్మమును
పొందును;
అనగా,
అవస్థాత్రయము
తెలిసికొనువాడు
బ్రహ్మము.
ఇట్టి
దివ్యత్వమైన
ఆత్మతత్త్వ
స్వరూపుని
నామమును
ధరించిన
పురుషుడు
అపవిత్ర,
అనాచార,
ఆడంబర,
అహంకారములకు
గురికావటము
ఎంత
హాస్యాస్పదము?
ఎంత
ఘోరము?
ఇట్టి
పవిత్ర
పురుషుని
పేరు
పెట్టుకొన్నందుకైనను,
అందులోని
అణుమాత్రమైన
అనుభవమును
ఈనాటి
మానవ
మాత్రుడైన
పురుషుడు
ఆచరించకూడదా?
ఇంక
పురుషధర్మమెక్కడ?
మందుకైనను
చిక్కని
పురుషుని
లక్షణమును
ఎందు
వెదకిన
చిక్కును?
పూర్వపు
ఋషులు
చెప్పినట్లు,
సంధ్యాహీనోఽశుచిర్నిత్య
మనర్హ
స్సర్వకర్మను
।
యదన్యత్కురుతే
కర్మ
న
తస్య
ఫలభాగ్భవేత్
॥
అనగా,
ద్విజుడు
సంధ్యావందనము
పరిత్యజించినచో
భృష్టుడగుననని
సర్వస్మృతులు
తెలుపుచున్నవి.
సంధ్యావందనము
చేయని
వారు
ఎట్టి
అన్యకర్మలు
చేయుటకు
అర్హులు
కారు.
దీనిని
పట్టి
చూడ,
ఆనాటి
ఋషులు
దీర్ఘకాలము
సంధ్యను
ఉపాసించేవారగుటచే
దీర్ఘాయువును,
యశస్సును,
కీర్తిని,
ప్రజ్ఞను,
బ్రహ్మవర్చస్సును
పొందియుండిరని
మనువు
కూడనూ
చెప్పెను
కదా?
3
▾
Meaning
Keep
కాన
దీనిని
పట్టి
చూచిననూ
గాయత్రీ
ధ్యానము
చేయని
వాడు
బ్రాహ్మణుడు
కాజాలడు.
ఇక్కడ
బ్రాహ్మణుడన
బ్రహ్మతత్త్వమును
పొందిన,
బ్రహ్మోపాసనచే
పవిత్రుడైన,
ఆత్మార్థ
పురుషుని
అంశమైన
నేటి
మానవ
పురుషుడు.
ఇక్కడ
జాతి
మత
భేదములకు
సమకట్టకూడదు.
ప్రత్యేకించి,
బ్రాహ్మణుడను
నామము
సాంప్రదాయానుగుణ్యముగా
వచ్చిన
వారు,
ప్రధానముగా
పాటించవలెను.
ఇక,
సంధ్యావందనము;
సంధ్యావందనము
అనుదాని
వ్యుత్పత్తిని
బట్టి,
సమ్
–
సమ్యక్
(లెస్సగా
భగవంతుని
యందు),
ధ్యై
–
చిన్తన
(మనస్సును
నిలుపుట),
లెస్సగా
భగవంతుని
యందు
మనస్సును
నిలుపుటయే
సంధ్య
యనబడును.
భగవంతుని
యందు
మనసు
నిలుపుటకు
చిత్త
నిరోధము
జరుగవలయును
కదా?
అట్టి
నిరోధమునకు
త్రిగుణములైన
సత్వరజస్తమోగుణ
వైషమ్యము
లేకుండవలెను.
అవి
ప్రకోపించు
కాలమును
తెలిసికొని,
వాటి
వైషమ్యమేర్పడకుండా
చేయుటకు.
భగవత్
ప్రార్థన
ఆయాకాలములందు
చేయవలెను.
ఇది
పురుషులకు
మొదటి
కర్తవ్య
ధర్మము.
ప్రాతఃకాలము
సత్వగుణకాలమనియు,
మధ్యాహ్నము
భోజనకాలమును
రజోగుణకాలమనియు,
సాయంత్రము
ప్రవేశమగు
కాలము
తమోగుణ
ప్రకోప
కాలమనియు
సృష్టియందలి
ధర్మము,
నీమము.
మొదటి
సత్వగుణకాలమైన
ప్రాతఃకాలమున,
నిద్రానందమునుజెంది
మనోవ్యాకులత
నుండి
విడువబడి,
మొట్టమొదట
మెలకువబడు
సమయము
గావున,
మనస్సు
పరిశుభ్రముగా,
ప్రశాంతముగా
నుండును.
ఈ
కాలములో
భగవద్ధ్యానము
చేయవలయుననుట
అందరకూ
విశదమే.
ఇదియే
'ప్రాతః
సంధ్యావందన'మనబడును.
సంధ్యావందనమును,
అర్థము
తెలియక
కూడనూ
యేదో
ఒక
సాంప్రదాయముగ
పెద్దలు
చెప్పినవి
విని,
గుడ్డి
గుర్తులతో
ఆచరించుచున్నారు.
ఈ
మూలార్థము
తెలిసికొని
చేయుట
పురుషుని
రెండవ
కర్తవ్య
ధర్మము.
4
▾
Meaning
Keep
పిమ్మట
రెండవదైన
రజోగుణమును
జెంది,
వ్యవహారములలో
ప్రవేశించి
అలసట
జెంది,
ఆకలి
కలిగి
భోజన
ప్రయత్నము
చేయునపుడు,
భోజనమునకు
ముందుగా
భగవత్
చింతన,
లేక
ధ్యానము
చేసి,
వండిన
పదార్థములను
భగవదర్పితము
చేసి,
పిమ్మట
భుజింపవలయు
ననునదియు
ఆవశ్యకము.
దీనినే
'మాధ్యాహ్నిక
సంధ్యావందన'మందురు.
దీనిని
ఆచరించుట
వలన
రజఃప్రకోప
మేర్పడక,
సత్వమే
వృద్ధియగును.
ఇది
పురుషునకు
మూడవ
కర్తవ్య
ధర్మము.
ఇక
మూడవ
గుణమైన
తమోగుణమును
జెంది,
సాయంకాలము
ప్రవేశమగునప్పటికి
ప్రతి
పురుషుడును
తన
యిల్లు
చేరి,
చక్కగ
వండిన
పదార్థములను
భుజించి
నిద్రించ
ప్రయత్నించును.
ఇది
కాదు
వాని
కర్తవ్య
ధర్మము.
ఇది
సోమరిపోతుల
లక్షణము.
గుణములలో
నిజమైన
తమోగుణము
ప్రవేశించినపుడు
తాను
చెడిపోకుండానుండుటకై
భగవత్
ప్రార్థన,
సత్కాలక్షేపణ,
లేక
సద్గుణపోషణ,
సదాచరణ
ఆవశ్యకము.
ఇదియే
'సాయం
సంధ్యావందన'మనబడును.
కనుక,
నిద్రానందము
నుండి
వెలువడు
మనస్సునకు
బుద్ధి
చెప్పి
అవివేక
నిద్రానందమునకే
యింత
సంతోషమును,
బడలిక
తీరుటయు
కలిగిన,
ఇక
వివేక
నిద్రయగు
భగవద్ధ్యానానందమున
కెంతసుఖము
కలుగునో
చక్కగ
యెవరికి
వారు
యోచించిన
తెలియును.
ఈ
యథార్థమును
తెలిసికొని
సత్వగుణముల
వృద్ధి
పొందించవలెను.
ఇది
పురుషుని
నాల్గవ
కర్తవ్య
ధర్మము.
జీవించియుండునంత
వరకూ
త్రికాలములందు
సంధ్యావందన
మాచరించు
ద్విజుడు
ఉత్తమ
పురుషుడు,
మహా
తేజోమయుడై
సకలాభీష్టసిద్ధి
నొందును.
అంతియే
కాదు,
జీవన్ముక్తుడగును.
ఊరికే
సంధ్యావందనమని
నిత్యకృత్య
కర్మలలో
దీనినొక
కర్మగా
భావించరాదు.
దీని
యథార్థమును
తెలిసికొని
చేయుటలో,
చెప్పుటలో
విశేష
ఫలమున్నది.
దీనికి
గాయత్రి
మంత్రార్థమును
చక్కగా
భావన
చేయుట
అతి
ముఖ్యము.
అట్లొనర్చుటలో
5
▾
Meaning
Keep
గూడా,
ఆ
తేజోరూపుడైన
ఆత్మస్వరూపుడు,
మూలపురుషుడు
నేనగుచున్నానని
యభేదముగా
నెంచుట
మరొక
ధర్మము.
గాయత్రీ
జపమును
త్యజించు
వారు
అర్థమును
తెలియని
వారగుదురు.
వీనినే
మనువు
కూడా
నొక్కిచెప్పెను.
ముఖ్యముగా
బ్రాహ్మణునికి
గాయత్రియే
జీవనమని
కూడనూ
తెలిపెను
కదా?
తెలుపుటేమి?
సత్యమే.
మానవ
పురుషుని
బుద్ధులను
ప్రేరేపింపజేయు
దివ్య
తేజస్సును
ధ్యానము
చేయుటకంటెను
పవిత్రమైనదేదియున్నది?
మనసు
పాపకృత్యముల
జోలికి
పోకుండా
కాపాడునట్టి
ప్రార్థనకంటే
గొప్ప
రక్షణ,
గొప్ప
సుగుణము
వేరేమున్నది?
పురుషునకు
సద్గుణ
పోషణకంటే
గొప్ప
రక్షణ
వేరు
లేదు.
బ్రాహ్మణుడు
గాయత్రీ
మంత్రసారుడైన,
బ్రాహ్మణత్వము
కోల్పోడని,
వేదాధ్యయనమునకు
శక్తి
చాలని
వాడైనను
చివరకు
గాయత్రీనైననూ
విడువరాదని,
మనువు
పదేపదే
నొక్కి
చెప్పెను
కదా?
అందుకనే
గాయత్రీకంటే
గొప్ప
శోధనము
లేదని
"గాయత్ర్యాస్తు
పరం
నాస్తి
శోధనం"
అని
స్మృతి
కూడనూ
చెప్పెను.
ప్రపంచమందలి
సకల
వ్యాపారములను
నెరవేర్చుకొనజాలినది
ఆత్మశక్తియే.
కాన,
మానవస్వరూపుడైన
ప్రతి
పురుషుడు
అట్టి
ఆత్మశక్తి
అభివృద్ధి
అగుటకు
కారణమైన
తేజోనిధిని
(గాయత్రిని)
సకాలములో
ఆశ్రయింపవలెను.
అట్టి
శక్తిని
ఆకర్షించుకొనుటకు
భావన
ముఖ్యమైనది.
శరీరము
వృద్ధినొందుటకాధారమగు
శుద్ధ
సాత్వికాహారము
ఎట్లు
భుజించవలెనో,
బుద్ధి
వృద్ధినొందుటకు
ఆధారమగు
సూర్యతేజమున్నట్లు
భావనారూపముగ,
మన
శరీరమునందుండు
తేజము
యొక్క
స్థానమునకు
ఆకర్షించుకొనవలెను.
అట్టి
పని
సంధ్యాకాలమునందే
చేయవలెను.
ఆత్మశక్తి
వికసించినపుడు
ఇంద్రియవ్యాపారము
జరుగును.
ముకుళించినపుడు
ఇంద్రియవ్యాపారము
ఆగును.
ఆ
సమయములందే
సూర్యతేజము
నాకర్షించిన,
సకాలమునకు
విత్తిన
సస్యములవలె
ఫలించును.
6
▾
Meaning
Keep
సూర్యుడుదయించి
తన
ప్రకాశమును
వ్యాపింపజేసినపుడు
ఎవరైననూ
అంధకారములో
నుందురా?
అప్పుడు
దీపము
వలయునా?
అట్టి
ప్రకాశమునే
మన
మాకర్షించుకొన
గలిగినపుడు
బ్రహ్మతేజోబలము
గలుగకుండుటెట్లు?
ఆ
విధానములన్నింటినీ
లోకమునకు,
పూర్వపు
ఋషులెల్లరును
బోధించియేయున్నారు
కదా?
అభ్యసించి
చూచినపుడు
దాని
విశేష
మెట్టిదో
అనుభవము
లోనికి
వచ్చును.
ఉపనయన
మెందుకు
చేతురో?
అందు
ముందుగా
ఏ
మంత్రము
నుపదేశింతురో?
ఆ
మంత్రమునే
ముందుగా
ఏల
ఉపదేశింపవలయును?
ఇతర
మంత్రమునేల
ఉపదేశింపకుండిరి?
వీనినెల్లా
యోచించి
నిజార్థమును
తెలిసికొన్న,
ఆ
మంత్రరాజము,
ఆనాటి
ధర్మకర్మలు,
ఆనాటి
నిబంధనలు,
ఆనాటి
ప్రవర్తనలు
సత్యస్వరూపమును
దాల్చునుగానీ,
యథార్థమును
యోచించక
వారివారి
ఊహలకు
తగినట్లు
అర్థములూ,
ఆచరణలూ
కల్పించుకొన్న,
అనర్థ
అనాచారములకు
అధర్మ
అన్యాయములకు
ఆహుతి
కాగలరు.
అసలు
గాయత్రి
అన్న
అర్థమేమి?
ఈనాటి
వారికేమైననూ
తెలిసినదా?
ఏదో
ఒక
ఆడ-దేవత
పేరనియు,
అది
ఒక
మంత్రమనియు
అనేక
రీతుల
ఆడింతురు.
గయలను
రక్షించునదే
గాయత్రి.
గయలనగా
ప్రాణములు.
అవియే
వాక్కు
మొదలగు
ఇంద్రియములు.
అంతియే
కాదు,
"గాయంతం
త్రాయతే
యస్మాద్గాయత్రీ
తేన
కథ్యతే";
తనను
గానము
చేయువానిని
(అనగా
స్మరించటము,
జపించటము,
భజించటము,
ప్రార్థించటము,
ధ్యానించటము)
రక్షించునది
కావున
గాయత్రి
యనబడును.
ఈ
పవిత్రమంత్రమే
విశ్వామిత్రాది
రాజ
ఋషులను
బ్రహ్మ
ఋషులుగా
చేసినది.
సకల
విద్యలకు
తానే
దాత;
సర్వ
స్వతంత్రములకూ
తానే
నేత;
అట్టి
వేదమాత
తన్ను
ప్రార్థించు
వారలను
రక్షించి
సర్వాభీష్టమునొసగును.
బ్రాహ్మణములందును,
ధర్మసూత్రములయందును
ఆ
దేవత
యెట్లు
7
▾
Meaning
Keep
వర్ణింపబడినదో,
వాటిని
మీరు
అర్థము
చేసికొన్న,
ఎవరి
ఆధారమూ
లేకనే
ప్రత్యక్ష
సాక్షిగా
మీకు
బోధపడగలదు.
అట్టి
ధర్మములను
నేడు,
ఒక్కొక్క
దానికి
నవీన
అర్థం
కల్పించి,
అనేక
భౌతిక
వ్యవహారముల
క్రింద
లెక్కచేయుచున్నారు.
అందులకే
ధర్మగ్లాని
అవతరించినది.
అట్టి
అవస్థ
నుండి
యథార్థస్థితికి
రావలెనన్న,
సనాతన
ధర్మకర్మలను
తిరిగి
పునరుద్ధరణ
చేయనవసరము,
లేక
అర్థములు
మార్చుకొని,
ఆచరణల
యందు
ఆత్మార్థమును
నిర్మించిన
అన్నియూ
ధర్మకర్మలే
అగును.
Previous
←
Dharma Knows No Change
Next
The Householder Is the Best of Men
→